విషయ సూచిక

పరిచయము - ప్రాధమిక సత్యములు
బహుమానమును జ్ఞాపకముంచుకొనుము
పాపము చెడ్డదని నమ్ముము
ధనమును ప్రేమించకుము.
పారిపోవుటకు సిద్ధముగా ఉండుము
గుంపును అనుసరించకుము
ఏదొక పనిలో నిమగ్నమై యుండుటకు ప్రణాళిక వేసికొనుము
ప్రణాళిక కలిగియుండుము.
నిన్ను నీవు ఎరిగియుందుము.
నీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించుము
నీ తప్పించుకొను మార్గమును గుర్తించుము
పతనమును తట్టుకొని జీవించుట
సారాంశము -- క్లుప్తముగా 12 మెట్లు

ఒక అద్భుతమైన వాస్తవము: వర్జీనియాలోని ఒక యువతి

తన ఇంటి వెనుక రెండు తలల తాబేలును చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ఆ పేద జీవిని పట్టుకుంది. అ రెండు విచిత్రమైన తలల మధ్య ఆమె పెట్టిన ఆహారం కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతున్నట్లు గమనించింది. శాస్త్రవేత్తల ప్రకారం, అన్ని జంతువులలో రెండు తలలు సంభవించవచ్చు. కానీ జీవితకాలం సాధారణంగా తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే, శరీర భాగంలో దాని సొంత వైపును నియంత్రిస్తూ ఒక తల మరొకదాని నుండి స్వతంత్రంగా పని చేస్తూ, తద్వారా అనైక్యత, గందరగోళం మరియు నికాకును సృష్టిస్తుంది. ఒక తల ప్రాథమిక నియంత్రణ తీసుకోకపోతే, ఆ జీవి ఆకలి మరియు అనాలోచితంతో త్వరగా చనిపోతుంది.

పరిచయము - ప్రాథమిక సత్యములు

లోకంలోకి పాపం ప్రవేశించినప్పటి నుండి, ఆత్మకు శరీరానికి మధ్య ప్రతి మానవ హృదయంలో యుద్ధం జరుగుతోంది. దేవునికి సేవించాలనుకునే ప్రతి వ్యక్తి ఈ ఇద్దరు వ్యతిరేక యజమానుల మధ్య యుద్ధాన్ని అనుభవిస్తాడు.

సాతానుడు ఎల్లప్పుడూ దేవునితో మన సంబంధాన్ని తెంచుకోవడానికి మన శారీరక భావోద్వేగ కోరికలను దోపిడీ దుర్వినియోగం చేస్తున్నాడు. "మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను" (యెషయా 59:1), బైబిలు సర్భము ఆదాము హవ్వలను శోధించడంతో ప్రారంభమవుతుంది, లోకం క్షీణించడంతో కొనసాగుతుంది. క్రొత్త నిబంధన సాతానుడు యేసును శోధించడంతో ప్రారంభమవుతుంది, లోక రక్షణతో కొనసాగుతుంది. ఏదెను తోటలో మొదటి సున్నితమైన శోధన తర్వాత మానవాళి పాపంలో పడిపోయి పతనమైనప్పుడు, అది మొదట సృష్టించబడిన స్వచ్ఛమైన ప్రేమ ఉద్దేశాలను కోల్పోయింది. వాటి స్థానంలో స్వార్థం చోటు చేసుకుంది, ఫలితం వినాశకరమైనది మరణం, వ్యాధి, యుద్ధం, నేరం, బాధ, నొప్పి మొదలైనవి.

దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచెను. "నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా... మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి" (1 పేతురు 1:14-16) కానీ దైవశక్తి సహాయం లేకుండా, పురుషులు మరియు స్త్రీలు శరీర సంబంధమైన మనస్సు యొక్క దురాశలను మరియు ఉద్దేశ్యాలను ఎదిరించి నిరోధించలేరు..

అయినప్పటికీ, ఆయన సహాయం లేకుండా మనం చేయలేని పనిని చేయమని దేవుడు ఎన్నటికీ అడగడు. ఆయన తనకు విరోధముగా తిరుగుబాటు చేసిన సృష్టిని విడిచిపెట్టలేదు గాని దాని పునరుద్ధరణ కొరకు ఆయన సంపూర్ణమైన తుది సన్నాహాలను చేశాడు. ఆయన రక్షణ ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం నీలో నాలో క్రీస్తు స్వరూపాన్ని పునరుద్ధరించడం.. తద్వారా మనం దేవుని కుమారులు కుమార్తెలు అని పిలవబడతాము. "దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను" (2 పేతురు 1:3, 4).
శోధనకు గురికావడం పాపం అని చాలామంది నమ్ముతారు. ఇది నిజం కాదు. బైబిల్ ఇలా ప్రకటిస్తుంది. "మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను" (హెబ్రీయులకు 4:15) యేసు అరణ్యంలో శోధింపబడ్డాడు, కాబట్టి శోధించబడటం పాపం కాదు. బదులుగా, శోధనకు లొంగిపోవడం పాపం. షేక్ స్పియర్ ఇలా వ్రాశాడు, "శోధనకు గురికావడం ఒక ఎత్తయితే, దానికి పడిపోవడం లేదా లొంగిపోవడం మరొక ఎత్తు." క్రైస్తవులు వారు చేసే పనులను నిర్దేశించడానికి శరీర సంబంధమైన స్వభావాన్ని అనుమతించకూడదు. వారు తమ మార్గాన్ని నిర్దేశించడానికి దేవుని ఆత్మనే అనుమతించాలి తప్ప శరీరాన్ని కాదు.

మనం నిజంగా యేసును అనుసరించాలనుకుంటే, ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఉన్నాయని మనకు తెలిసిన చర్యలను ఆలోచనలను ప్రతిఘటించడానికి మనం ఎంచుకోవచ్చు. కృతజ్ఞతగా, యేసు ద్వారా, చెడుతనమును విజయవంతంగా ఎదిరించి జయించినవారమై యుండునట్లు మనకు అవసరమైన ప్రతిదాన్ని దేవుడు సమకూర్చాడు. కాబట్టి మనం సహజంగానే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు. "నేను క్రీస్తు అనుచరుడిని గనుక, శోధనను ఎదిరించడానికి యేసు ఏమి చేసెను?" ఒక విషయమైతే, ఆయన లేఖనములను ఉటంకించెను లేదా ఎత్తిచూపెను. ఆయన వాక్య పరిజ్ఞానం శోధనకు వ్యతిరేకంగా మనకు ప్రథమ మరియు ఉత్తమ భద్రతను అందిస్తుంది.

"నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను" (కీర్తనలు 119:11), రెండవది, మనం ప్రార్ధన చేయాలి! యేసు కూడా శోధనను ఎదిరించడానికి ప్రార్ధన వైపు మొగ్గు చూపాడు. "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్ధన చేయుడి" (మార్కు 14:38), శోధనతో పోరాడుటను గురించి మొత్తంగా ఒక పుస్తకాన్నే అభివృద్ధి చేయడానికి నేను ప్రార్ధన మరియు వాక్యము అనే ఈ రెండు ప్రాధమిక అంశాలను మాత్రమే తీసుకొని సులభంగా వివరించగలను, కానీ దానికి బదులుగా, శోధనను ఎదిరించి జయించడానికి 12 ప్రయోగాత్మక సూత్రాలను ఎత్తి చూపించడానికి నేను ఈ ప్రాథమిక సత్యాలను పునాదిగా ఉపయోగించాలనుకుంటున్నాను. మీరు శోధనకు గురైనప్పుడు, యేసు చేసినట్లుగా, మీరు కంఠస్థం చేయగలిగే కొన్ని బైబిల్ వచనాలను కూడా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రాధమిక బైబిల్ సంబంధమైన ఆయుధ సామగ్రి, క్రమబద్ధమైన నిజాయితీ గల భక్తితో పాటు, మీ మార్గాన్ని మరింత స్థిరమైన విజయంతో ముద్రిస్తుందని నేను నమ్ముతున్నాను.

బహుమానమును జ్ఞాపకముంచుకొనుము "సమీపిస్తున్న పగటిని మీరు నమ్మినప్పుడు చీకటిని భరించి సహించడం. సులభమే."

ప్రజలు శోధన చేత సులభంగా జయించబడటానికి ఒక కారణం ఏమిటంటే, వారు తమ నిత్యజీవాన్ని గూర్చిన దృక్పథాన్ని కోల్పోతున్నారు. ఒక దేవదూత తన ప్రకాశవంతమైన మహిమతో ఇప్పుడే మీకు కనిపించి, "పశ్చాత్తాపపడుడి! యేసు త్వరగా వచ్చుచున్నాడు." అని చెప్పినట్లయితే శోధనను ఎదిరించడం మీకు సులభమేనా కనీసం ఆ రోజు గడిచే వరకైనా? ఖచ్చితంగా, ఎందుకంటే మీ బహుమానం లేదా ప్రతిఫలం నిజమైనదని సమీపంలోనే ఉందని మీ విశ్వాసం బలపడుతుంది.

హెబ్రీయులకు 11:24-26 ఇలా చెబుతోంది. "మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను." మోషే ఐగుప్తు నందు శక్తి సంపదలు అత్యున్నతంగా సుసంపన్నంగా ఉన్న సమయంలో పరిపాలించడానికి వారసత్వ వరుసలో ఉన్నాడు. ప్రభావం పలుకుబడి ఉన్న ఆ స్థానం ఎవరికైనా భయంకరమైన శోధన అవుతుంది. కానీ మోషే దేవుని శాశ్వతమైన బహుమానమందు దృష్టి యుంచి అపవాది యొక్క తాత్కాలిక భూసంపదను ఎదిరించగలిగాడు.

దేవుడు మీ కొరకు ఉంచిన ఘనతను మరిచిపోకుడి. "ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు" (1 కొరింధీయులకు 2:9) మీరు నిజంగా రక్షించబడ్డారని నమ్మినట్లయితే శోధనను ఎదిరించడం చాలా సులభం. మీరు పొరపాటున రక్షించబడటానికి మీ మార్గాన్ని మీరే సుగమం చేసుకోగలరని అనుకుంటే, మీరు నిజానికి శోధనను ఎదిరించే మీ సామర్థ్యాన్ని మీరే నాశనం చేసుకుంటారు. కానీ రక్షించబడ్డారని మీరు విశ్వసించినప్పుడు, దేవుని బిడ్డవలె నడుచుకోవడం చాలా సులభం.

"మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను" (రోమా 8:18). మీరు విందుకు వెళ్తున్నారని మీకు తెలిసినప్పుడు మిఠాయి గుండ్లు లేదా చాక్లెట్లను తినకుండా నిరోధించడం సులభమే! పాపము చెడ్డదని నమ్ముము M

బహుమానము విషయంలో లేదా బహుమానము లేకుండా పాపము ఎంత చెడ్డదో కూడా మీరు గుర్తుంచుకోవాలి. పౌలు, "అనగా పాపము" అజ్ఞమూలముగా అత్యధిక పాపనుగు నిమిత్తము" అని చెప్పెను (రోమా 7:13). పాపము ఎంతో ఘోరమైనదని మీరు నిజంగా తెలుసుకోవాలి, కావాలంటే, 2,000 సంవత్సరాల క్రితం కల్వరికి వెళ్లి, పాపము యేసుకు ఏమి చేసిందో చూడండి. క్రైస్తవులుగా, పాపము మురికిగా, వికారంగా మరియు ఘోరంగా ఉన్నందున మనము దానిని స్వీకరించలేము. పాపము మనకు ప్రియమైన యేసు మరణానికి కారణమైంది.

బైబిల్ ఇలా చెబుతోంది. "ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యధార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు" (యోబు 1:1) దేవుణ్ణి ప్రేమించాలనే ప్రాథమిక భావోద్వేగానికి మించి మనం లి. యోబు వలె, దేవుణ్ణి ప్రేమించడంలో ఒక భాగం చెడును ద్వేషించడం. దేవుడు పాపమును ద్వేషించును గనుక మనము కూడా.... పాపమును ద్వేషించవలెనని ఆయన కోరుకొనును. "నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా ఉనహ్యములాయెను" 119:104)

అపవాది పాపాన్ని ఏదో కోరదగినదిగా ఆకర్షణీయమైనదిగా విత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు మోసపోకండి. అతడు ఏదైనా మురికిగా వంకరగా ఉన్నదానిని శుభ్రంగా ప్రమాదకరం కానిదిగా చిత్రీకరిచడంలో మేధావి. కానీ తప్పుదోవ పట్టవద్దు, ఎందుకంటే ఆ అందమైన చిత్రం మిమ్మల్ని చంపేస్తుంది. మీరు బుద్ధిపూర్వకంగా పాపం చేసి ఆయనను బాధపెట్టడం కంటే చనిపోవడం మేలనేంత గొప్పగా దేవునిని ప్రేమించే స్థాయికి మీరు రావాలి.

"పాపము మీరు వెళ్లాలనుకుంటున్న దానికంటే ఎక్కువ దూరం తీసుకెళ్తుంది, మీరు ఉండాలనుకుంటున్న దానికంటే ఎక్కువ సేపు ఉంచుతుంది. మరియు మీరు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లించేలా చేస్తుంది."

ధనమును ప్రేమించకుము

నేను నేరువేరు వ్యక్తిగత శోధనల యొక్క పెద్ద జాబితాను వ్రాయగలను, కానీ నేను ప్రత్యేకించి ధనమును తదుపరిగా జాబితాలో చేర్చడానికి ఎంచుకున్నాను ఎందుకంటే గర్వము తరువాత, అదే అంత పెద్దది. కానీ నేను వ్రాస్తున్న ధనము అది లోక సంపాదన తత్వము మరియు బలము యొక్క ఉచ్చును గూర్చినది గనుక వంద ఐదు వందల నోట్ల గురించి మాత్రమే కాదు. క్రైస్తవులు కష్టపడి, సంపాదిస్తూ, పొదుపు చేసి, తమకు వీలైనంత ఎక్కువ ఇవ్వాలి అని నేను నమ్ముతున్నాను. అయినను ధనము మనకు దేవతగా లేదా విగ్రహంగా మారే స్థిరమైన ప్రమాదం ఉంది.

"ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి. మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును" (1 తిమోతిs 6:9) ప్రజలు త్వరగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నందున, వారి పొదుపు డబ్బును జూదం వంటి వాటిలో వెచ్చించే మూర్ఖమైన ఎంపికలు చేసుకోవడం నేను చూశాను. వారు తమ అవకాశాలను జూదమాటల వంటి వ్యర్థమైన క్రీడలకే ఉపయోగిస్తూ ఉన్నారు, ఎందుకంటే అపవాది వారితో మీరు కేవలం మరో మూడు నెలలు మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటే,
మీరు ధనవంతులవుతారని చెప్తాడు. ప్రస్తావించాలని కాదు గాని ఆత్మలను (ప్రజలను) రక్షించడానికి ఉపయోగించగలిగే డబ్బును వారు విసిరివేస్తున్నారు.

"ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును. లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరదు" (మత్తయి 6:24). దేవునికిని ధనాపేక్షకును దాసులుగా ఉండటం అసాధ్యం. ధనమనేది ఒక శక్తి, ఆ శక్తి పూర్తిగా చెడ్డది కాదు. డబ్బు మంచి లేదా చెడు చేసే శక్తిగా - రెండంచులు గల ఖడ్గముగా ఉంటుంది. ప్రభువు మన అవసరాలను ఆర్థికంగా దీవించాలని మనం మన సంఘాలలో ప్రార్ధిస్తాము, కాని ధనమును ప్రేమించే బానిసలుగా మనం మారకూడదని మాత్రం ప్రార్ధించము. మీ హృదయం మీ ధనముతో ఉంటే, అది దేవునితో ఉండదు. దేవుడు మన నికర చెల్లింపులను, పన్ను చెల్లింపులను మరియు అస్తిపాస్తులతో నిండిన ఇళ్లను వెనక్కి తిరిగి చూడకుండా వదిలివేయడానికి సిద్ధంగా ఉండాలని కోరాడు. "లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి" (17:32)

పారిపోవుటకు సిద్ధముగా ఉండుము

ప్రజలు శోధన నుండి పారిపోయినప్పుడు కొన్ని వేగ ప్రమాణ రికార్డులు బద్దలు చేయబడతాయి. సాధారణంగా, అది తమను పట్టుకుంటుందని భావిస్తూ శోధన నుండి దూరంగా పాకులాడుతూ ఉంటారు. కొన్నిసార్లు శోధన మనం బుద్ధిపూర్వకంగా తెరిచి ఉంచిన తలుపు ద్వారా వస్తుంది, అనగా మనం అనుమతించడం ద్వారా వస్తుంది. మీరు అనుకోకుండా మీ బట్టలన్నింటిపై కిరోసిన్ అయిల్ (బొగ్గు నూనె) చల్లారని దగ్గర్లో ఉన్న వ్యక్తి ఎవరో అగ్గిపుల్ల అంటించారని అనుకుందాం. మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు వీలైనంత దూరం వీలైనంత వేగంగా పారిపోతారు! శోధన పట్ల క్రైస్తవుడి వైఖరి కూడా అలాగే ఉండాలి. పౌలు. "జారత్వమునకు దూరముగా పారిపోవుడి" మరియు "విగ్రహారాధనకు దూరముగా పారిపొండి" అని చెప్పెను (1 కొరింధీయులకు 6:18, 10:14), కాబట్టి పాపము నుండి పారిపోవుడి, మీ గమ్యస్థాన చిరునామాను వదిలివెళ్లకండి.

దీనిని కోల్పోకండి: మీరు శోధన నుండి పారిపోయినప్పుడు, మీరు దేవుని వైపుగా వెళతారు, "దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును" (యాకోబు 4:8), ఏదో పాపకరంగా ఉందని మీకు తెలిసినప్పుడు, అపవాదితో నిమగ్నమవ్వకండి లేదా సంభాషిస్తూ ఉండకండి. ఎందుకంటే అతడు హేతువాదంలో వివాదంలో దిట్ట హవ్వ కూడా అలాగే పడిపోయింది!

క్రైస్తవులు తమ పాపాలను సమర్ధించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది నా హృదయాన్ని కలచి వేస్తుంది. అపవాది మీకు అందజేయగల వాదనలకు పరిమితి లేదు. ఏదో తప్పు జరిగిందని మీకు తెలిసిన వెంటనే, పారిపోండి! "ధైర్యవంతుడు శోధన నుండి పారిపోవును, మూర్ఖుడు దానితో సరసాలాడును."

మీరు కూడా చాలా వయస్సు వచ్చే వరకు వేచి ఉండి, ఆ యవ్వన కోరికలన్నీ మసకబారిపోయాయని మీరు విజయం సాధించారనుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. "బుడ్డబుడుసర కాయ పగులును (అనగా, శరీర దురాశలు కోరికలు నశించును) ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు (శాశ్వత గృహమునకు) పోవుచున్నాడు" (ప్రసంగి 12:5). మీ హృదయం ఇంకా పాడై ఉండవచ్చు. ఇప్పుడు పారిపోండి, చురుగ్గా, మీ జీవితంలో ఆయన పునరుద్ధరించిన కృపను మీరు ఇంకా అనుభవించుచుండగానే మీరు దేవునికి కట్టుబడి ఉండాలి. యేసు ప్రభువు శక్తి మన ఉడుకు రక్తపు యవ్వనానికి కూడా సరిపోతుంది.

-మీకు గుర్తుందా, యోసేపు శోధించబడినప్పుడు, అతను పోతీఫరు భార్య నుండి "తప్పించుకొని బయటికి పారిపోయెను" (ఆదికాండము 39:12). ఆంగ్ల కవి జాన్ డ్రైడెన్, "వలకు చిక్కుకోవడం కంటే ఎరను తప్పించుకోవడం మేలు" అని చెప్పెను.

గుంపును అనుసరించకుము

క్రైస్తవులు సులభంగా శోధనకు లోనవ్వడానికి ఒక సాధారణ కారణం, "అందరూ చేస్తున్నారు, కనుక ఇది తప్పకుండా సరైనదై ఉండాలి" అని అనుకోవడం. అది అపవాదికి బాగా ఇష్టమైన "విధ్వంసక సూత్రము." అందుకే పేతురు యేసును తిరస్కరించాడు. యేసును అప్పగించడానికి కొన్ని గంటల ముందు, పేతురు, "నేను నీతో కూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని' ప్రమాణము చేసెను (మత్తయి 26:35) పేతురు తన స్నేహితులు చుట్టూ ఉండగా ఆ ప్రకటన చేసినప్పుడు, అతను చాలా నిజాయితీగా ఉన్నాడు. "కానీ యేసును తీర్పు సభామందిరంలోకి తీసుకువెళ్ళినప్పుడు, ఇకపై క్రీస్తుతో కలిసి ఉండటం ప్రజారంజకం కాదు. పేతురు క్రీస్తును అపహాసించిన వారితో కలిసి చలిమంట చుట్టూ కూర్చున్నాడు. అతను -8 అక్కడ ఎంత ఎక్కువ సేపు ఉంటాడో, క్రీస్తు శత్రువుల వలె వ్యవహరించడం. మాట్లాడటం అంత సులభం.

గుంపు మన విలువలను కొలవడానికి అనుమతించడం ద్వారా, మనం గుంపు లాగే తయారవుతాము. గుంపు సాధారణంగా తప్పు అని బైబిల్ చెప్పుచున్నది. "ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు" (మత్తయి 7:13). క్రైస్తవులు స్వయంగా ఆలోచించాలి. వారు తమపై తోటివారి ఒత్తిడిని నిరోధించాలి- వారు ప్రత్యేకంగా ఉండాలి. కోటి మంది ప్రజలు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మినా సరే, అది ఇంకా అబద్ధమే కాని నిజమవ్వదు.

అంత్య కాలంలో, రెండు మతపరమైన సమూహాలు ఉండబోతున్నాయి. ఒకటి మృగము యొక్క ముద్రతో, మరొకటి దేవుని ముద్రతో. మొదటి సమూహం పెద్దదిగా ఉంటుంది. పెద్ద జనసమూహం మతపరమైనదిగా ఉన్నంత మాత్రాన, అది దేవుని సమూహమని అర్ధం కాదు. సాధారణంగా, బైబిలులోని గొప్ప గొప్ప పురుషులు స్త్రీలు ఎవరనగా మిగతా వారందరూ అసత్యానికి తలొగ్గి నమస్కరిస్తున్నప్పుడు సత్యం కొరకు నిలబడినవారు.

గుంపును అనుసరించకపోవడానికి మరొక కారణం కూడా గుర్తుంచుకోండి ఎందుకనగా అదే జనం మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు గుంపును అనుసరించకూడదనుకున్నప్పటికీ, మీరు జనులు చూడగలిగే జీవితాన్ని గడపాలి. క్రైస్తవులు ఒత్తిడిలో కూడా తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడాన్ని చూసినప్పుడు ప్రజలు మరింతగా ఆకట్టుకోబడతారు అనేకమంది మార్చబడతారు. ఒక బలహీన రాజీ చర్య మొత్తం సాక్ష్యజీవితాన్ని పాడుచేయవచ్చు.

ఏదొక పనిలో నిమగ్నమై యుండుటకు ప్రణాళిక వేసికొనుము

సిన్సినాటి నగరంలోని ఒక కొవ్వొత్తుల దుకాణంలో డబ్బులు చెల్లించే స్థలం వెనుకభాగంలో ఒక పెద్ద ప్రకటనతో ఉన్న గుర్తు వేలాడుతూ ఉంది: "ఈ ప్రకటన గుర్తు ఇక్కడ ఉండటానికి మీరు దాని ముందు నిలబడి చదవడానికి చాలా మంచి కారణం ఉంది. మిమ్మల్ని బిజీగా ఉంచడానికి ఇది ఇక్కడ ఉంది. మీకు సహాయం చేయడానికి ఒకరిని కనుగొనడానికి ప్రయత్నిస్తూ, ఏమీ చేయకుండా నిలబడి ఉండటం ఎంత చికాకు కలిగిస్తుందో మేము గ్రహించాము. కాబట్టి, మీరు చదవడానికి మా వద్ద ఈ ప్రకటన ఉంది. మీరు దాన్ని చదివే సమయానికి మా అమ్మకందారులలో ఒకరు మిమ్మల్ని కనుగొంటారని ఆశిస్తున్నాము."

కొద్దిసేపటి తర్వాత అది, "దయచేసి ఈ ప్రకటనను మళ్లీ చదవండి" అని చెప్తుంది.

దేవుడు మనల్ని కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటం కోసం సృష్టించాడు. కాబట్టి చాలా మంది పనిలేకుండా ఉండడాన్ని లేదా సోమరితనాన్ని ద్వేషిస్తారు. "పనికిమాలినతనము (సోమరితనము) అపవాది కర్మాగారము" అనే మాటను మీరు వినే యుంటారు. ఈ మాట ప్రత్యక్షంగా బైబిల్ నుండి తీసుకోబడిన వచనం కాకపోయినా యెహెజ్కేలు 16-49, 50 వచనాలకు దగ్గరగా ఉంటుంది. "నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు (పనికిమాలినతనము) నమునదియే.... గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని."

సొదొమ గొమొఱ్ఱా యొక్క పాపము కేవలం వక్రబుద్ధి మరియు లైంగిక అనైతికత కాదు. సొదొమ లోయ వృక్షసంపదతో మరియు ఆహారంతో సమృద్ధిగా ఉంది. దాని నివాసులకు బతుకుబండి నల్లేరుపై నడక లాగా సాఫీగా సాగిపోతుంది. లోతు అక్కడికి వెళ్లాడు ఎందుకంటే అది అతనికి విశ్రాంతి జీవితాన్ని అందించింది. కానీ ఒక వ్యక్తికి చేయడానికి ఏమీ లేనప్పుడు, అపవాది శరీర సంబంధమైన మనస్సును చెడుగా చెడుగా మార్చడానికి సహాయపడే అవకాశాలు ఉన్నాయి. "నిర్విచారమైన సుఖస్థితి సమస్త దుర్గుణములకు మూలము."

పాపము ఒకే సమయంలో ప్రధానంగా ఒక విషయంపై దృష్టి పెట్టడానికి రూపొందించబడిన మానవ మనస్సులో ప్రారంభమవుతుంది. మనం బిజీగా ఉంటే, ముఖ్యంగా సాక్ష్యమివ్వడం లేదా పేదలకు సహాయం చేయడం వంటి మంచి పనులపై దృష్టి పెడితే, చెడు గురించి అలోచించడానికి మనకు సమయం ఉండదు. ప్రవక్తి ఎలెన్ జి. వైట్ గారు, "చెడుతనమును ఎదిరించు బలము పట్టుదలతో చేయు సేవ ద్వారా ఉత్తమముగా పొందబడును" అని చెప్పెను. సమస్యల నుండి బయటపడటానికి ఒక మార్గం ఏమిటంటే, యేసు ప్రభువు సేవలో పట్టుదలగా పాల్గొనడం. పాపములో పడిపోయిన తరువాత, దేవుడు ఆదాముతో, “నీ ముఖవు చెమట కార్చి ఆహారము తిందువు" అని చెప్పినప్పుడు, నరుడు ఏదొక పనిలో నిమగ్నమై ఉంటూ ఇబ్బందుల నుండి బయటపడటానికి ఇదొక ఆశీర్వాదంగా ఉద్దేశించబడింది. (ఆదికాండము 3:19). కానీ పనికిమాలిన వ్యక్తి తనను శోధించమని అపవాదిని శోధిస్తాడు.

"దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” (ఎఫెసీయులకు 5:15, 16) ఒక ఇటలీ దేశపు సామెత ఇలా చెప్తుంది. "శ్రమజీవి ఒక దయ్యము చేత శోధించబడును, పనికిమాలిన జీవి, వెయ్యి దయ్యముల చేత శోధించబడును."

ప్రణాళిక కలిగియుండుము

మనం తరచుగా పాపంలో తడబడుతుంటాం ఎందుకంటే శోధన వస్తుందని గ్రహించినప్పుడు, అది వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూడటానికి హెడ్లైట్ల కాంతి కంట్లో పడిన జింక లాగా మనం అలాగే విపరీతమైన అయోమయ స్థితిలో వేచి ఉంటాము. కానీ ముందుగానే సిద్ధపడి ఉండటం మంచిది. సామెతలు 22:3, "బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు" అని —చెప్పుచున్నది. జ్ఞానవంతుడు అపాయాలు ఉన్నాయా అని తన మార్గాన్ని పరిశీలించుకుంటాడు. అతను దొంగల ముఠాను గుర్తించినట్లయితే, "నేను దొంగిలించబడటం నాకు ఇష్టం లేనందున నేను దాక్కోవడం లేదా వేరే మార్గం గుండా పోవడం మంచిది" అనుకుంటాడు. కానీ మూర్ఖుడు, "ఆహా! నా మార్గంలో బందిపోట్లు ఉన్నట్టుగా ఉంది. వారు ఇక్కడికి వచ్చేదాకా ఎదురు చూసి ఏమి జరుగుతుందో చూద్దాం" అనుకుంటాడు.

క్రైస్తవులు తరచూ శోధనతో అలా వ్యవహరిస్తారు. మనము, "నేను ఈ కార్యక్రమాన్ని చూస్తే, ఈ పత్రికను చదివితే, లేదా దీన్ని తాగితే శోధించబడతానా లేదో చూస్తాను" అనుకుంటాము. బెన్ ఫ్రాంక్లిన్, "పావలా అంత నివారణ రూపాయంత స్వస్థతకు విలువైనది" అని చెప్పెను (అర్ధం: ఒక సమస్య తలెత్తిన తర్వాత దాన్ని ఆపడం లేదా సరిచేయడం కంటే సమస్య అసలు తలెత్తకుండా ఆపడం ఉత్తమం మరియు సులభం.) యేసు ప్రభువు, "నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా" అని చెప్పెను (మత్తయి. 5. 291. మీరు ఒక విషయంలో శోధించబడతారని, అది మిమ్మల్ని క్రిందికి లాగుతుందని మీకు తెలిస్తే, దానికి లోనవ్వకుండా ఉండటానికి ముందస్తుగా ఎంత నిరాశపరిచేదైనా ఎలాంటి నివారణ చర్యలైనా సరే తీసుకోండి.

మీరు ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తుంటే, ధూమపానం చేసే స్నేహితులను లేదా మీరు ఎక్కువగా శోధనకు గురయ్యే ప్రదేశాలను నివారించండి. కనీసం, తప్పించుకునే మార్గాన్నైనా చూసుకోండి. మీ శోధన అతిగా తినడం వలనైతే, మీ పళ్లెంలో తగిన మొత్తంలో ఆహారాన్ని పెట్టుకోవడానికి ముందుగానే నిర్ణయించుకోండి ఆ శోధన తొలగిపోయిన తరువాత ప్రణాళికలో సానుకూల మార్పులు చేసుకోండి. లక్షలాది మంది పాపంలోకి మెల్లగా జారిపోతున్నారు ఎందుకంటే వారు ముందస్తుగా ఆలోచించరు. ఇది నన్ను తదుపరి అంశానికి చక్కగా నడిపిస్తుంది.

నిన్ను నీవు ఎరిగియుండుము

అలెక్స్ ఒక కొత్త బేస్ బాల్ బ్యాట్ కొనడానికి సాధ్యమైన ప్రతి రూపాయిని కూడబెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి నిజమైన పోరాటం ముందుంది. ఒక రాత్రి అతను తన ప్రార్ధనలో దేవునితో, “ఓ ప్రభువా, దయచేసి నా డబ్బును బేస్ బాల్ బ్యాట్ కొరకు ఆదా చేయడంలో నాకు సహాయము చేయుము" అని వేడుకున్నాడు.” దీనికి దేవుడు, బస్ క్రీం అమ్మే వ్యక్తి ఈ వీధిలోకి రాకుండా చూసుకో అని చెప్పాడు!"

స్పానిష్ భాషలో ఒక సామెత ఉంది. "మీ తల వెన్న అయితే, మీరు పొయ్యి దగ్గర రొట్టెలు కాల్చేవాడు (బేకర్) కాకండి." (అర్ధం: వెన్న కరిగిపోకుండా ఉండాలంటే మంటకు దూరంగా ఉండాలి, భావం ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాలి.)

ఎవరైనా తాగుబోతుల మధ్య అనామకుడిగా చేరినప్పుడు, అతను లేదా ఆమె మొదట తాగుబోతని ఒప్పుకోవాలి. ఈ ప్రవేశం అద్భుతమైన పురోగతిని సూచిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వారి బలహీనతను గుర్తిస్తాడు. అదేవిధంగా, క్రైస్తవుడిగా మారడానికి మొదటి దశలలో ఒకటిగా, మనం "పాపులము" అని ఒప్పుకోవాలి.

"మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు" (1 యోహాను 1:10). "తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" (1 కొరింధీయులకు 10:12) మన సొంత శక్తిని బలాన్ని మనం నమ్మకూడదని బైబిల్ చెప్పుచున్నది. మనము ఒక నిర్దిష్ట శోధనతో వ్యహరించగలమని చెప్పుకుంటూ, "ఇది ఇకపై నన్ను ఇబ్బంది పెట్టదు. నాకు తగినంత శక్తి బలముంది. నేను విజయం సాధించినట్లే" అనుకోవడం మొదలు పెట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఎక్కువగా పడిపోయే స్థితిలో ఉన్నాము. కొంతమంది క్రైస్తవులు తాము జయించిన విషయాల గురించి కూడా గర్వపడుతుంటారు, కానీ అపవాది వారిని పడగొట్టడానికి మాత్రమే తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన అప్పగింపబడిన రాత్రి, యేసు పేతురును, "నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని" హెచ్చరించెను (మార్కు 14:30), జానీ పేతురు, "నేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను" (మార్కు 14:31). అతను నిజంగా ఎంత బలహీనుడో తనకు తెలియదని యేసు పేతురును హెచ్చరించెను.

మీకు వేరొకరికి బలహీనతను జయించడానికి సహాయం చేస్తున్నప్పుడు. కూడా, మీరు అతనితో లేదా ఆమెతో కలిసి ప్రార్ధించాలి, కానీ మీరు అదే తప్పు చేసే ప్రమాదం ఉందని కూడా గుర్తించండి. రక్షించేవాడు ఒక వ్యక్తిని కొట్టుకుపోతున్న నీటి నుండి లాగుతున్నప్పుడు, అతను కూడా నీళ్లలోకి జారిపోకుండా జాగ్రత్త వహించాలి. కాబట్టి మన బలహీనతను గుర్తించడానికి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. "సహోదరులారా. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను" (గలతీయులకు 6:1).శోధన విషయమై జాగ్రత్తగా ఉండుడి దానిని మీరు ఎంత ఆసక్తిగా చూస్తారో అంత మంచిదిగా అది కనబడుతుంది!

మేలు చేత కీడును జయించుము

విడిచిపెట్టిన చెడు అలవాట్ల వల్ల కలిగే శూన్యాన్ని పూరించడంలో విఫలమైనప్పుడు కొన్నిసార్లు మనం రాజీపడటానికి మనల్ని మనం విశాలంగా ఉంచుకుంటాము. ఇంకొక వ్యసనంతో ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒక వ్యసనంపై విజయం సాధించే ప్రజలు నాకు తెలుసు, ఎందుకంటే అ ఖాళీని భర్తీ చేయడానికి వారికి సానుకూల ప్రత్యామ్నాయం దొరకలేదు.

"అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటే చెద్దదగునని చెప్పెను” (లూకా 11. 24-26).

మీరు తిండి విషయంలో రుగ్మత లేదా ఆహార వ్యసనంతో
బాధపడుతున్నట్లయితే, మీరు అమాంతం తినడం మానేయలేరు. "మంచి పదార్ధము" భుజించడం నేర్చుకోవడమే రహస్యం (యెషయా 55:2) "కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము" (రోమా 12:21)

మీకు రోజంతా చాక్లెట్లు తినే సమస్య ఉంటే, కొన్ని ద్రాక్షపండ్లు లేదా బాదంపప్పులను కొని పెట్టుకోండి. మీరు ఆ సిగరెట్లను కూడా పారేశారా? పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తొలగించే పుల్లలు లేదా కొన్ని పొద్దుతిరుగుడు విత్తనాలను తెచ్చిపెట్టుకోండి (కానీ చాక్లెట్లు కాదు). -ఎవరైనా మిమ్మల్ని అవమానించినట్లయితే లేదా క్రూరంగా = వాడుకున్నట్లయితే, కీడు చేత కాక మేలు చేత దయతో ప్రతికారము చేయుడి, "కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము" (రోమా 12:20). మేలు చేత కీడును జయించుడి, డేగపై పక్షిరాజు దాడి చేసినప్పుడు, అది ఎదురుదాడిని చేయదు, కానీ బాధించేవారు దానిని ఒంటరిగా వదిలేసే వరకు విస్తృతమైన వలయాకారంలో పైకి ఎగబాకుతుంది.

నీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించుము

శోధన తరచుగా మన బలమైన క్షణాల్లో కాదు, మన బలహీన సమయంలో వస్తుంది. మన బలం, సహనం, ప్రేమ మరియు ఆరోగ్యం క్షీణదశలో ఉన్నప్పుడు, మనం క్రైస్తవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి శోధించబడతాము, జాగ్రత్తగా ఉండుడి, 40 దినముల ఉపవాసము తరువాత యేసు శోధన ప్రారంభమైనది. ఆయన అలసిపోయి, ఆకలితో ఉన్నాడు. పేతురు యేసును తిరస్కరించినప్పుడు, అతను కూడా బాగా అలసిపోయి ఉన్నాడు.

ప్రధానంగా శోధనలను ఎదిరించే మన సామర్థ్యం అనుదిన వ్యాయామం. లేదా వ్యాయామం లేకపోవడం నుండి, శరీర హార్మోన్ల (రసాయన... పదార్థాలు) వరకు ప్రతిదాని ద్వారా బాగా ప్రభావితమవుతుంది.. తరచుగా మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా మన ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినప్పుడు, మనము ప్రతికూల పద్ధతుల్లో ప్రతిస్పందిస్తాము.

భార్యాభర్తల మధ్య అనేక వైవాహిక వాదనలు సాయంకాలానికి ఒకరు లేదా ఇద్దరూ అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు జరుగుతాయి. తగినంత నిద్రపోండి మరియు క్రమంగా మంచి ఆహారం తినండి. నాకు ఇష్టమైన రచయితలలో ఒకరు కూడా ఇలా సలహా ఇస్తున్నారు, "వికృతమైన ఆకలి వల్ల కూడా మనిషి శోధనలను ఎదిరించే శక్తిని కోల్పోతాడు." మితిమీరి తినే మిఠాయిలు (స్వీట్లు) మీకు తాత్కాలిక హడావిడిని కలిగించి కేవలం ఒత్తిడి చికాకుతో కూడిన భావాలకు లోనయ్యేలా చేస్తాయి.

మీరు ఎల్లప్పుడూ అలసట లేదా ఆకలిని నివారించలేకపోవచ్చు, కానీ ఒక సైనికుడు పేలుడు గనులతో నాటిన ప్రాంతం గుండా వెళుతున్నట్లయితే, అతను ఎక్కడ అడుగు పెడతాడో అన్నదాని గురించి అతను మరింత జాగ్రత్తగా ఉంటాడు. ఈ అస్థిర సమయాల్లో సున్నితమైన చర్చలు లేదా దబాయింపు చర్యలను మానుకోండి. యేసు ప్రభువు, "అత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము" అని చెప్పెను (మత్తయి 26:41) కానీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దాని ఫలితంగా మన నైతిక సంకల్పాన్ని మెరుగుపరచడానికి మన శక్తితో ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నించకూడదని దీని అర్ధం కాదు. రాత్రిపూట విశ్రాంతినిచ్చే మంచి నిద్ర, కొద్దిగా వ్యాయామం మరియు పోషకాహారం మీరు గొల్యాతుతో తలపడడానికి సిద్ధంగా ఉన్నట్లు మీకు అనిపించేలా చేస్తాయి.

నీ తప్పించుకొను మార్గమును గుర్తించుము

విమానం ఎక్కినప్పుడు, నేను అత్యవసర ద్వారాల స్థలాలపై మానసిక దృష్టితో ఒక కన్నేసి ఉంచుతాను. నేను మతి స్థిమితం లేని వ్యక్తిని కాదు, వివేకం గల వ్యక్తిని. నాకు, శోధనను జయించడానికి ఉత్తమమైన మార్గం దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ తప్పించుకునే మార్గాన్ని అందించాడని గుర్తించడం, ఈ వచనాన్ని గుర్తుంచుకోండి: "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన 21

మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును" (1 కొరింథీయులకు 10:13), ఇప్పుడది చాలా మంచి వార్త, మన అస్థిరమైన విశ్వాసంపై మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మదగినవాడు గనుక మనం దేవునిపై ఆధారపడవచ్చు!

ఇప్పుడు మీరు శోధించబడినప్పుడు, "అపవాది నాకు వ్యతిరేకంగా తీసుకురావడానికి దేవుడు అనుమతించిన దానిని దేవుడు కొలుస్తున్నాడు. నేను ఆయన కృపతో దానిని సంబాళించగలను" అని మీరు చెప్పవచ్చు. "ఇంక అపవాదిని ఎదిరించడం నా వల్ల కాదు" అని మీరు ఎప్పుడూ చెప్పనవసరం లేదు. అలా చెప్పడం ద్వారా, మీరు దేవునిని అబద్ధికుడని పిలుస్తున్నారు!

ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెనుక నుండి వెంబడించారు, వారు పారిపోతుండగా పర్వతాలు రెండు వైపులా ఉన్నాయని వారి ముందు సముద్రం ఉందని వారు కనుగొన్నారు. ఇది చాలా నిరాశాజనకమైన పరిస్థితిలో అనిపించింది. కాని దేవుడు తాను నమ్మదగినవాడుగా ఉండెదనని వాగ్దానము చేసెను, అందుకుగాను ఆయన తప్పించుకొను మార్గమును అందించెను. బైబిలు నిస్సహాయముగా అనిపించిన ఇటువంటి. కథనములతో నిండి ఉన్నది, కాని దేవుడు నమ్మదగినవారుగా ఉండెను. ఆయన మీకు సహాయం చేయడానికి నాటకీయమైన రక్షణ సహాయక చర్యలను కూడా ఉపయోగిస్తాడు. యేసును వెంబడిస్తున్న జనసమూహానికి ఆహారం పెట్టడానికి ఆహారం లేనట్లుగా కనిపించినప్పుడు, దేవుడు తన అనుచరుల కొరకు పరలోకంలో నుండి కూడా ఆహారాన్ని రప్పించేంత నమ్మదగినవాడుగా ఉన్నాడు. కాబట్టి, "బయటపడటానికి నాకు ఏ మార్గమూ కనిపించట్లేదు" అని మీరు ఆలోచించిన ప్రతిసారీ, ఈ కథనాలను గుర్తుకు తెచ్చుకోండి, దేవుని యందు నమ్మకముంచేలా ఆయన అందించే తప్పించుకునే మార్గం కొరకు ఎదురు చూసేందుకు మీ మనస్సును రూపుదిద్దుకోండి. మీ ఇంటి గుమ్మం వద్దనే అత్యంత భయంకరమైన శోధన ఉన్నా కూడా, "నేను దేవుని యందే నా నమ్మకాన్ని ఉంచబోతున్నాను. నేను ఏది సరైనదో అదే చేయబోతున్నాను" అని చెప్పండి. దేవుడు మీ కొరకు తప్పించుకొను మార్గమును కలుగ జేయును.

పతనమును తట్టుకొని జీవించుట

1944లో జర్మనీ మీదుగా, ఫ్లైట్ సార్జెంట్ అల్కెమ్రేడ్ తన మండుతున్న యుద్ధ విమానం నుండి దూకి 18,000 అడుగుల దూరంలో పడిపోయాడు. ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశంపై మంచుతో కప్పబడిన దేవదారు వృక్షాల మీద అతను పడిపోవడం వల్ల చెక్కు చెదరకుండ సురక్షితంగా బయటపడ్డాడు.

శోధనను జయించడానికి అత్యంత ముఖ్యమైనదిగా నేను నమ్మే సూత్రాన్ని నేను ఆఖరిలో మీకు తెలియజేస్తాను. యేసు "తొట్రిల్లకుండ మిమ్మును" కాపాడగలడని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు (యూదా 1:24). కానీ మీరు పడిపోతే, కిందనే ఉండిపోకండి.

మీరు క్రీస్తు నందుండిన యెడల, కీడును పాపమును ఎదిరించు గొప్ప శక్తి మీకు ఉన్నట్లే. ఆయనయందు నిలిచి యుండుటనగా ఆయన ఆత్మయందు నిలిచి యుండుట, గలతీయులకు 5:16, "ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు" అని చెప్పుచున్నది. నోవహు, హనోకు మరియు అబ్రాహాము దేవునితో నడిచిరి. మీరు మోకరించి బలం శక్తి కొరకు వేడుకోవడం ద్వారా మీరు కూడా నేడు ఆయనతో
నడవవచ్చు. తన సహాయము కొరకు వేడుకున్నప్పుడు, ఆయనయందు. నమ్మిక యుంచిన బిడ్డ పడిపోకుండ, పాపము నుండి నిన్ను రక్షించుటకు పరలోకములోని ప్రతి దేవదూతను దేవుడు పంపును. కానీ మనం అపవాది అబద్ధాల కంటే, యేసును అనుసరించడానికి ఎంచుకోవాలి. దేవుడు మనలను స్వతంత్రముగా జీవించు నైతిక ప్రతినిధులనుగా చేసెను, కాగా, అపవాది మనలను పాపము చేయనియ్యలేదు.

దేవుని కృప ద్వారా, నీవు నేను ఆయన ఆత్మ ద్వారా ప్రతి శోధనను ఎదిరించవచ్చు. కానీ మీరు పడిపోతే, పట్టు వదలకూడదని గుర్తుంచుకోండి. కింద పడిన చాలా మంది, కిందనే ఉండిపోతారు. వారు, "అయ్యో! నేనిప్పుడు ఓడిపోయి నశించిపోయాను గనుక నేనింక ప్రతి ఇతర శోధనకు లొంగిపోవచ్చు" అనుకుంటారు. పోగొట్టుకున్న భూమిని తిరిగి స్వాధీనపరుచుకోవడంలో దేవుడు నీకు సహాయం చేయగలడు మరియు భవిష్యత్తులో సంభవించే శోధనల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. యేసును పోగొటు కున్నప్పుడు సరిగ్గా యోసేపు మరియలాగే నీవు కూడా మూడు రోజులు పింతించడం వెతకడం అవసరం కావచ్చు, కానీ ఆయన తన తండ్రి గృహములో నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు.

అపవాది తన చెడ్డ గుసగుసలతో ఇలా నిన్ను నిరుత్సాహపరుస్తాడు. "నీ గురించి నాకు తెలుసు! నేను నిన్ను శోధించాను, నీవు నాకు లొంగిపోయావు! నీవు మంచివాడివి కాదు. నిన్ను నీవు క్రైస్తవుడని పిలుచుకుంటావు. కానీ నీవు కేవలం వేషధారివి, నిజానికి, నీవు కనీసం రక్షించబడలేదు!" కానీ క్రైస్తవ జీవితం ప్రగతిశీలమైనదని నేను నమ్ముతాను. బైబిలు, "నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు" అని వాగ్దానము చేయుచున్నది. (1 యోహాను 2:1) నీవు పాపము చేసినట్లయితే, మనమందరం చేసినట్లయితే, పట్టు వదులుకోకూడదు. అపవాది మిమ్మల్ని మోసగించి, మీరు కిందపడితే, కిందనే ఉండిపోకండి. మీ గత వైఫల్యాలు భవిష్యత్తులో రాజీకి సాకుగా ఉండనివ్వకండి. సమస్తాన్ని జయించడానికి దేవుడు మీకు సహాయం చేయగలడు. మీరు ఒక మంచి రోజున ఈ మీ విజయోత్సవ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఒకే సమయంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగండి.

సారాంశము - క్లుప్తముగా 12 మెట్లు

ఈ సూత్రాలన్నింటినీ సంగ్రహించడం నిజానికి చాలా సులభం. ఏ శోధననైనా జయించడానికి అత్యంత ప్రశస్తమైన మార్గం మీకు దేవుని యెడల ఉన్న ప్రేమే అయి ఉండాలి. పాపము దేవునిని బాధిస్తుందని మీకు తెలుసు, గనుక శోధించబడినప్పుడు మీరు, "నేను దేవునిని ప్రేమించుచున్నాను. గనుక నేను అట్లు చేయలేను" అని బిగ్గరగా చెప్పాలి.

ఎర్విన్ డబ్ల్యూ, లుట్జర్, "శోధనకు మన ప్రతిస్పందన దేవుని పట్ల మన ప్రేమకు ఖచ్చితమైన కొలమానము" అని అన్నాడు. మీరు యేసును ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో, అంత తక్కువ అపవాది యొక్క ఆకర్షణలు మీపై ప్రభావం చూపుతాయి. మీరు శోధింపబడినప్పుడు సిలువను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా యేసు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుకు తెచ్చుకోండి, ఆపై మీ ముందున్న చెడుతనమును ఎదిరించి ఆ ప్రేమను తిరిగివ్వండి.

మనమందరము శోధింపబడెదము. కాని లేఖనములలో ఉన్న "అమూల్యములును అత్యధికములునైన వాగ్దానముల" ద్వారా మనము జయించినవారమై ఉండగలమని ప్రభువు వాగ్దానము చేసెను (2 పేతురు 1:4). ఎలా జయించాలో యేసు మనకు బోధిస్తాడు. అవవాది యేసును పాపము. చేయనియ్యలేదు, అలాగే మనల్ని కూడా చేయనియ్యలేడు. "మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక" (1 కొరింధీయులకు 16:67), జయించే శక్తి కొరకు ఆయనను అడగండి, సంతోషంగా ఆయన వాక్యపు పుటలలోతుకు మునిగిపోండి.