విషయసూచిక
| పరిచయము |
| నా చీకటి దినములు |
| నిరాశపడిన క్రైస్తవులకు |
| నిరీక్షణను కనుగొనుట |
| దుఃఖించుచున్న ప్రియులకు |
| నీ నా ప్రియమైన వ్యక్తిని పరలోకములో చూచెదనా? |
| సహాయకులకు |

మీకు ఇప్పుడు సహాయం కావాలా?
మీరు మీ జీవితాన్ని అంతం చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటే లేదా అలాంటివారు ఎవరైనా తెలిస్తే, తక్షణ సహాయం లభిస్తుంది.
సహాయం కొరకు ఇండియన్ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ (భారతీయ జాతీయ ఆత్మహత్యల నివారణ) లైఫ్ లైన్ నంబర్ 9152987821 కి సోమ-శని వరకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ఎప్పుడైనా కాల్ చేయండి.
మేము హైదరాబాద్ లోని హెూప్ ట్రస్ట్ సెంటర్‌ను ఆందోళన మరియు నిరాశ (ఒత్తిడి) నుండి కోలుకోవడానికి కూడా సిఫార్సు చేస్తున్నాము. మరింత సమాచారం కొరకు 91 90008 50001 0 9140 4005 5010 సంబర్లకు కాల్ చేయండి.
I మేము వడోధర, గుజరాత్ లోని అల్బా హీలింగ్ సెంటర్ ను ఆందోళన మరియు నిరాశ (ఒత్తిడి) నుండి కోలుకోవడానికి కూడా సిఫార్సు చేస్తున్నాము. మరింత సమాచారం కొరకు 91-9004191108 0 91 9136783804 సంబర్కు కాల్ చేయండి.
పరిచయము
ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 1,00,000 (లక్షమందికి) పైగా ప్రజలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు, ఇంకా చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీరు ఈ విషాదం ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమై ఉండవచ్చు లేదా ఒక విధంగానో లేదా మరొక విధంగానో ప్రభావితమైన వారు మీకు తెలిసియుండవచ్చు.
ఆత్మహత్య గురించి మాట్లాడటం కూడా కష్టమైన అంశమే. కొన్ని విషయాలు మరింత తీవ్రమైనవి లేదా హుందాగా ఉన్నాయి. చాలామంది అందుకే దీని గురించి చర్చించకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ క్రైస్తవుల కొరకు బహిరంగంగా చర్చించాల్సిన అవసరం మరియు బైబిల్ పద్ధతిలో పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎందుకనగా జీవితమే సర్వస్వం. జీవితం లేకుండా, మనకు అనుభూతి లేదు, మనకు తెలియదు, మనం ప్రేమించలేము-ఈ పేజీలో ముద్రించిన పదాలను కూడా మనం గ్రహించలేము. చాలా మందికి ఇది .సహజంగానే తెలుసు. ప్రతి సంవత్సరం, మన జీవితాలను పొడిగించడానికి మందులు, శస్త్రచికిత్సలు, వ్యాయామాలు మరియు మాత్రలు కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము. హార్ట్ మానిటర్ (కృత్రిమ గుండె యంత్రం) విఫలమైనప్పుడు, వైద్య బృందాలు క్రమం తప్పకుండా రిససిటేట్ (గుండె పునరుజ్జీవం పోసుకునేందుకు ఛాతిపై అరచేయితో నొక్కే) సహజ చర్య తీసుకుంటాయి.
జీవితం గొప్ప బహుమతి కూడా, మొదటి నుండి, దేవుడు మన జీవితాలను ఆనందంగా, సమృద్ధిగా, ఉల్లాసంగా ఉండాలని అనుకున్నాడు. అందుకే ఆయన ప్రతిదీ మంచిదిగా, మంచిదిగా మరియు "చాలా, మంచిదిగా" చేసాడు (అదికాండము 1:31), కానీ మానవాళి పతనంతో, గులాబీలపై ముళ్ళు మొలిచాయి మరియు పుట్టెడు ఆనందానికి ముందు కన్నీళ్లు (ప్రసవవేదన) ఉన్నాయి. పాపంతో, బాధ దేవుని సృష్టిపై దాడి చేసింది.
ఇంకా దుఃఖం యొక్క మచ్చలతో తడిసినప్పటికీ, జీవితం ఇప్పటికీ అద్భుతమైన విషయమే, యేసు, "లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను" (యోహాను 16:33) "జీవాహారము నేనే... నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే" (యోహాను 6:48, 611 మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుకనే దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు!
మీ సొంత జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు మిమ్మల్ని శక్తివంతమైన ప్రవృత్తితో కూడిన సాంకేతికతతో చేశాడు. అయినప్పటికీ, కొందరు వారి శారీరక, మానసిక లేదా భావోద్వేగ వేదనలో మునిగిపోతారు. వారి మనోవేదన ధరించలేనిదిగా అనిపిస్తుంది. వారు చీకటి మేఘాలకు "మించి చూడలేరు. వారి జీవితాలను అంతమొందించుకోవడమే తమకున్న ఉత్తమమైన లేదా ఏకైక ఎంపిక అని వారు నమ్ముతారు..
కానీ ఇది తీవ్రమైన "పరిష్కారం". ఒక్కసారి "వెండి త్రాడు వదులైతే, -లేదా బంగారు గిన్నె విరిగిపోతే," వెనక్కి వెళ్ళడం ఉండదు, ఆత్మహత్య నిరీక్షణను మొత్తాన్ని మరియు ఇతర అన్ని ఎంపికలను అంతమొందిస్తుంది. (ప్రసంగి 12:6) మనకు తెలిసిన వారందరి విషయమైతే, ఒక వ్యక్తి, ఉజ్వలమైన భవిష్యత్తు లేదా మంచి పరిస్థితుల నుండి ఒక రోజు దూరంగా ఉండవచ్చు-మరియు ఆత్మహత్య వల్ల దేవుడు తమ కొరకు ప్రణాళిక వేసినదంతా వారు కోల్పోతారు.
మీకు ఒక స్నేహితుడు లేదా తన ప్రాణాలను తీసుకున్న ప్రియమైన వ్యక్తి ఉంటే, చదవటాన్ని కొనసాగించండి. మీకు కొంత నిరీక్షణ మరియు ప్రోత్సాహం లభిస్తాయని నేను నమ్ముతున్నాను.
మీరు అత్మహత్య గురించి ఆలోచిస్తుంటే, నేను కూడా అదే ఆలోచన వరకు వెళ్లియున్నాను. ఇది సరళంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కాని దయచేసి దీన్ని చేయకండి! మీ కొరకు, ఇతరుల కొరకు, మరియు దేవుని కొరకు, జీవించండి. "నీవును నీ సంతానమును బ్రదుకుచు, ... నీ దేవుడైన యెహోవాను ... హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి" (ద్వితీయోపదేశకాండము 30:20), మరియు ఈ పుస్తకం చదవటాన్ని కొనసాగించండి.
అధ్యాయము - 1 నా చీకటి దినములు
13 సంవత్సరాల వయస్సులో, నేను చనిపోవాలనుకున్నాను. నేను పాఠశాలలో నిరంతరం ఇబ్బందుల్లో ఉన్నాను మరియు నేను ఎప్పుడైనా దేనినైనా లెక్క చేశానా లేదా అని ఆలోచిస్తున్నాను. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మరియు నా తల్లి పూర్తి సమయం పనిచేసింది. ఈ సాయంత్రం, చాలా మందిలాగే, ఆమె స్నేహితులతో కలిసి ఉంది. విషయాలను క్లిష్టతరం చేయడానికి, నా సోదరుడు ఇటీవల నాన్నతో కలిసి ఫ్లోరిడాలో నివసించడానికి వెళ్ళాడు. 'కాబట్టి, మా అమ్మగారి న్యూయార్క్ అపార్ట్మెంట్ గదిలో నా ప్రశ్నలతో నేను ఒంటరిగా ఉన్నాను.
జీవించడానికి ఏదైనా కారణం ఉందా? మా అమ్మగారి స్నేహితులు కొందరు ప్రదర్శన వ్యాపారంలో చాలా ప్రసిద్ధి చెందారు-కాని వారి కీర్తి మరియు ప్రజాదరణ వారికి సంతోషాన్ని ఇవ్వలేదని నాకు తెలుసు. కోట్లాదికారియైన నా తండ్రి విజయానికి చిహ్నం లాంటివాడు, కానీ ఆయన ఎప్పుడూ సంతోషంగా కనిపించలేదు. బదులుగా, ఆయన రోజుకు 16 గంటలు, వారానికి ఆరు రోజులు పనిచేశాడు మరియు చాలా రాత్రులు నిద్రపట్టక కేవలం నిద్రపోవడానికి మద్యం తాగాడు. ఆయనకు నాతో గడపడానికి చాలా తక్కువ సమయం ఉండేది. ఇంక ప్రయోజనం ఏమిటి? ఇదంతా కష్టంగా అనిపించింది.
పాఠశాలలో పెద్ద పోరాటం గురువు గారి అసమ్మతి మరియు ప్రిన్సిపాల్ గారి కఠినమైన మాటల తరువాత, ఆత్మహత్య చేసుకుని నా బాధలను అంతం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నా తల్లి నిద్ర మాత్రలు కనుగొని, మొత్తం వాటిల్లో ఉన్న మాత్రలు తీసుకొని ఇక శాశ్వతంగా నిద్రపోవచ్చని అనుకున్నాను. సమయంలో, విషయం అర్థమైంది నేను ఎరువులుగా మారే అనిర్వచనీయమైన ప్రక్రియ వెంట వెళుతున్నాను.
నేను మా అమ్మగారి మందుల పెట్టె తెరిచినప్పుడు, నేను ఒక గందరగోళాన్ని ఎదుర్కొన్నాను. ఇన్ని బాటిళ్లలో ఏది సరైనది? వాటిలో దేని మీద కూడా "నిద్ర మాత్రలు" అని రాసిలేదు మరియు నేను వాటి పేర్లను గుర్తించలేకపోయాను. చివరకు నేను కనిపించిన ఒకదాన్ని ఎంచుకున్నాను. మరియు మొత్తం బాటిల్‌ను నా చేతిలో పోశాను, కానీ నేను ఒక గ్లాసు నీటి కొరకు వెళ్లినప్పుడు, ఒక ఆలోచన నా మనస్సును తట్టింది. ఇవి నిద్ర మాత్రలు కాకపోతే? ఇంకా దారుణమైన విషయం, అవి నిజంగా స్త్రీలు మాత్రమే వాడే మందులు అయితే? "నేను వీటిని తీసుకుంటే, ఏమి జరుగుతుందో చెప్పలేము!" నేను మాత్రలను తిరిగి బాటిల్లో పోసి వా ఆత్మహత్యను వాయిదా వేసుకున్నాను.
కొన్ని వారాల తరువాత, నా స్కూల్ రిపోర్ట్ కార్డు బయటకు వచ్చింది. నా మార్కులు దారుణంగా ఉన్నాయి. మరియు మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో అని నేను భయపడ్డాను. అరవడం మరియు చాలా ఘోరమైన పరిణామాలు ఉంటాయి. ఆమె తెలుసుకోవడానికి “ముందే దీనంతటికి ముగింపు పలకడం మంచిదనుకున్నాను.
నేను మా అపార్ట్మెంట్ భవనం పై అంతస్తుకు లిఫ్ట్ ద్వారా వెళ్లాను. అక్కడ పైకప్పు తలుపుకు సాధారణంగా కాపలాదారుడు తాళం వేసి ఉంచడు. నేను గోడ అంచు పైకి ఎక్కి క్రింద వీధి వైపు చూసాను, గాలి నన్ను నెడుతుందనే ఆశతో నేను దూకడానికి ధైర్యం చేయలేదు. అప్పుడు నాకు ఎనిమిది అంతస్తులపై నుండి పడి పార్క్ చేసిన కారుపై పడిన వ్యక్తి కథ గుర్తుకు వచ్చింది. చనిపోవడానికి బదులు, అతను బెణికిన చేయి మరియు విరిగిన వెన్నెముకతో బయటపడ్డాడు. పక్షవాతానికి గురై జీవితకాలం బతకడం మరణం కంటే ఘోరంగా ఉంటుంది.
నేను గోడ అంచు ఎక్కి తిరిగి పైకప్పుపైకి వచ్చాను. ఒక బీర్ కమర్షియల్ ప్రకటన యొక్క సాహిత్యం నా మనస్సులో మెదిలింది: "మీరు జీవితాన్ని ఒక్కసారి మాత్రమే అనుభవిస్తారు. మీరు పొందాలనుకున్న అన్ని ఉత్సాహాలను ఆనందాల్ని పొందండి." నిర్లక్ష్యంగా, సంరక్షణ లేకుండా జీవించడం-అలాగే, నేను ఏమైనప్పటికీ భూమిలోనే ముగిసిపోయి ఉంటే, నేను అక్కడకు వెళ్ళే మార్గంలో కూడా సరదాగా ఉంటుంది.
యుక్తవయసులో ఆ చీకటి, భయంభక్తిలేని రోజుల నుండి నా కథ చాలా మలుపులు తీసుకుంది. నేను భోగానందాలను కనుగొన్నాను : దూరంగా పారిపోవటం, మత్తుపదార్థాలు, దొంగతనం మొదలైనవి. ఏ సాహసం కూడా చాలా ప్రమాదకరమైనది కాదు ఎందుకంటే నేను. కోరుకున్నది చేయడం తప్ప నాకు మరో ఉద్దేశ్యం లేదు. జరిగే దారుణం ఏమిటంటే, నేను ఇవాళో రేపో త్వరలోనే చనిపోతాను అన్నట్టుగా పరిస్థితి ఉంది.
16 సంవత్సరాల వయస్సులో, నేను శాన్ జేసింటో పర్వతాలలోని ఒక గుహలోకి వెళ్ళాను. కొండలలో నివసించే నిశ్శబ్ద పని నా రోజులకు ఒక బలమైన కదలిక నిచ్చింది. కానీ ఒక రోజు, నేను ఒక హైకర్ (వినోదం కోసం సుదూర ప్రదేశాలు కాలిబాటన నడిచే వ్యక్తి) ఇంతకుముందు వదిలి పెట్టిన బైబిలును తీసుకున్నాను-చివరకు, ప్రతిదీ అవగాహనకు వచ్చింది. నేను జీవిస్తున్న విధానం చనిపోయేలా జీవించడం సరైనది కాదని మనం సృష్టించబడింది అందుకోసం నేను గ్రహించాను. నిజమైన పరివర్తన ప్రారంభమైనప్పుడు. ఈ రోజు, దేవుని సేవ చేయడం నా జీవితానికి ఆనందం, ఉద్దేశ్యం మరియు అర్థాన్ని ఇస్తుంది. ఈ రోజు, నేను నిజమైన జీవితాన్ని జీవిస్తున్నాను.1
మచ్చను చెరిపివేయుట
నా కథ మీ కథకు చాలా భిన్నంగా ఉండవచ్చు. కానీ కష్టపడుతున్న వారిని ప్రోత్సహించడానికి, ఆశ ఉందని వారికి చెప్పడానికి మరియు ఆత్మహత్య యొక్క మచ్చను తొలగించడానికి నేను దీన్ని పంచుకుంటాను.
కొన్ని సమాజాలలో ఆత్మహత్య భావాలు కలిగి ఉండటం వ్యభిచారం చేసిన వ్యక్తి వెలివేయబడినట్టుగా ధరించే గుర్తు ధరించడం లాంటిది. బాధించబడుతున్న వ్యక్తులు తమ భావాలను పంచుకున్నప్పుడు కోపం. చికాకు, లేదా శ్రద్ద కోరే ఆరోపణలను ఎదుర్కొంటారు. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు మరణానికి నిజమైన కారణాన్ని వెల్లడించడానికి ఇష్టపడకపోవచ్చు. చాలా మంది క్రైస్తవులు తన ప్రాణాలను తీసుకున్న వృద్ధి రక్షించబడలేడని నమ్ముతారు. ఫలితంగా, ఈ చాలా బాధాకరమైన పరిస్థితులు తరచుగా దాచబడతాయి.
కానీ ఆత్మహత్య గురించి మాట్లాడకపోవడం అనేది జీర్ణించుకోవడం కష్టమవుతుంది. ఆత్మహత్యాయత్నం నుండి బయటపడటం గురించి టెడ్ టాక్ (సాంకేతికత, వినోదం, రూపకల్పన) సమావేశంలో తను ఇచ్చిన ఉపన్యాసంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ ప్రొఫెసర్ జెడి ప్రామ్ ఇలా అన్నారు "ఆత్మహత్య చుట్టూ మన నిషేధాలు ఉన్నందున, ఏమి చెప్పాలో మనకు తెలియదు. చాలా తరచుగా మనం ఏమీ అనలేము. అలా (నా లాంటి వ్యక్తుల) ఒంటరితనం మరింత పెరుగుతుంది.
ఒంటరితనం, నిశ్శబ్దం లేదా పుకార్లు-ఇవన్నీ చాలా కీలకమైన సమయంలో జోడించగల కారకాలు, మరోవైపు, ఆత్మహత్య ఆలోచనలకు లేదా ఆత్మహత్యాయత్నానికి దారితీసే కష్టమైన భావోద్వేగాలను జీర్ణించుకోవడానికి సహాయక సంఘం సహాయపడుతుంది. బహిరంగంగా మాట్లాడటానికి మరియు జాగ్రత్తగా వినడానికి ఇష్టపడే సమాజం ప్రియమైన వ్యక్తిని ఆత్మహత్యకు కోల్పోయే సంక్లిష్ట దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. అవసరంలో ఉన్న వ్యక్తిని మనం విస్మరించలేము లేదా సహాయం కొరకు కేకలు వేయకుండా ఉండలేము, కాబట్టి ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్న వారికి కూడా మనము మన అభయహస్తాన్ని అందించాలి.
ఒక సాధారణ శోధన
ఆత్మహత్య ఆలోచనలు ఒక సాధారణ శోధన, 2019 అధ్యయనంలో "అమెరికాలో 18 మరియు అంతకంటే పైబడిన వయస్సు ఉన్న పెద్దలలో 4.8% మంది ఆత్మహత్య గురించి తీవ్రమైన ఆలోచనలు కలిగి ఉన్నా దూ అంటే 1 కోటి 20 లక్షల మంది అన్నమాట! అదే సంవత్సరంలో, సుమారు 14 లక్షల మంది పెద్దలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది కూడా సమాచారాన్ని నిషేదించిన మొత్తాన్ని చేర్చకుండా అంతమంది ఉన్నారు. మీరు కష్టపడుతున్నట్లయితే లేదా ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్నట్లయితే, నీవు ఒంటరివి కావు మిత్రమా!. ఈ మార్గంలో నడిచిన ఇతరులు సహాయం మరియు వైద్యసలహా కనుగొన్నారు. మరియు ఇది మీ కొరకు కూడా అందుబాటులో ఉంది.
ప్రతి వ్యక్తికి అతడు లేదా ఆమె అన్నంత ప్రత్యేకమైన కధ ఉంటుంది. ప్రజలు తమ మరణాన్ని గూర్చి ఆలోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి : లైంగిక వేధింపు, బాల్య విషాదం, గృహ హింస, బెదిరింపు, దీర్ఘకాలిక నొప్పి, వ్యసనం, సామాజిక ఒంటరితనం, మందుల దుష్ప్రభావాలు, ప్రాణాంతక అనారోగ్యం, ప్రసవానంతర నిరాశ, గర్భస్రావం మరియు ఒక ముఖ్యమైన సంబంధాన్ని కోల్పోవడం, ఉద్యోగం లేదా పరిస్థితి దిగజారిపోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తరచుగా, అనేక కారకాలు అతివ్యాప్తి చెందుతాయి. అదనంగా, ఆత్మహత్యతో మరణించే వారిలో 90 శాతం మందికి మానసిక రుగ్మత, భయంకరమైన నిరుత్సాహం, బైపోలార్ డిజార్డర్ (తీవ్రమైన మానసిక అనారోగ్యం), లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (విషాదానంతర మానసిక నిరాశ) వంటి నయం చేయగలిగే రుగ్మతలే ఉన్నాయి. 1
ఆత్మహత్య అన్ని వయస్సుల మరియు అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. నేను ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్నప్పుడు నేను అవిశ్వాసిని, మతం కొంతవరకు ఆత్మహత్య నుండి రక్షిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడినప్పటికీ, నిజమైన క్రైస్తవులు ఇప్పటికీ నిరాశకు గురవుతారు మరియు వారి సొంత జీవితాన్ని అంతం చేసుకోవటానికి ఆలోచించగలిగేంత నిరుత్సాహపడుతున్నారు- మరికొందరు వాస్తవానికి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 5.6
నేను నా సొంత సేవాపరిచర్య జీవితంలో చూశాను : తీవ్రమైన మరియు దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధ సంఘ సభ్యుడు, తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లవాడు, ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక తల్లి, ఒక యవ్వనప్రాయంలో ఉన్న అమ్మాయి, 911 అని పిలువబడే బాటిల్ మాత్రలు తీసుకున్న తరువాత, భయంతో మరియు విచారంతో నిండిపోయి, "నన్ను చనిపోనివ్వవద్దు" అని వేడుకున్నది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. గుండె బరువెక్కే ఆమె అంత్యక్రియలకు నేను నిర్వహించాను. ఏలీయా, యిర్మీయా, యోనా, మోషే వంటి గొప్ప ప్రవక్తలు కూడా కొన్ని సమయాల్లో చనిపోవాలని కోరుకున్నారు.
బైబిల్ ఆత్మహత్య నుండి భయంతో తప్పుకోవడానికి ప్రయత్నించదు. ఇది మనకు ఎటువంటి సలహా లేని ఏదో నిషిద్ధ విషయం కాదు. లేఖనాల్లో, ఆత్మహత్యకు ఏడు వాస్తవ ఉదాహరణలు ఉన్నాయి ( 9:52-54, 16:28-30, 1 ລ້ໜີ້: 31:1-6, 2 సమూయేలు 17:23, 1 రాజులు 16:18, 1 దినవృత్తాంతములు 10:1-6, మత్తయి 27:3-5). తమ ప్రాణాలను తీసుకున్న వారితో తీసుకోని వారిని పోల్చడంలో, బైబిల్ స్పష్టంగా తమ ప్రాణాలను తీసుకోనివారిని చూపిస్తూ, తమకు వేరే మార్గం లేదని భావించేవారికి ప్రత్యేక ప్రోత్సాహాన్ని, ఇకపై ముందుకు సాగలేమని భావించేవారికి ఆశను నిరీక్షణను అందిస్తుంది.
ఆత్మహత్య నిజమైన సమస్యలు మరియు నిజమైన ప్రశ్నలతో వస్తుంది. కొన్నిసార్లు నిరుత్సాహపడిన క్రైస్తవులు వారు ప్రార్ధన చెయ్యగలరా, వారి సొంత ప్రాణాన్ని తీసుకోవచ్చా మరియు పరలోకంలో మేల్కొంటారా అని ఆశ్చర్యపోతారు. వారు కోల్పోయిన ప్రియమైన వ్యక్తికి ఏమైనా ఆశ ఉందా అని దుఃఖిస్తున్న స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలోచనలతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి వారు ఏమి చేయగలరని శ్రద్ధగల ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ ప్రతి ఒక్కరికీ బైబిల్ నిజమైన సమాధానాలు మరియు నిజమైన పరిష్కారాలను అందిస్తుంది. క్రింది పేజీలలో, నేను ప్రతి సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాను. మురియు అందరికీ క్షేమాభివృద్ధి కలగాలన్నదే నా ప్రార్ధన.
అధ్యాయము - 2
నిరాశపడిన క్రైస్తవులకు
గనుక జమైన క్రైస్తవులు "బహుగా ఆశీర్వదించబడ్డారు. నినిరాశపడటానికి కారణమేమీ లేదు" అనే మాట మీరు వినే ఉంటారు, కాని వాస్తవమేమిటంటే నిజమైన క్రైస్తవులు కూడా నిరాశకు గురవుతారు. దేవునికి యిష్టానుసారుడైన మనుష్యుడైన దావీదు మాటలను పరిశీలించండి
"నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు" (5 22:1, 2)
"దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను" (5 69:1-3)
బాధ అంటే ఏమిటో దావీదుకు తెలుసు. మీరు ఇలాంటి పుస్తకాన్ని ఎంచుకుంటే, మీరు కూడా బాధలు అనుభవిస్తున్న వారే. బహుశా మీరు ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతుండవచ్చు. "నేను నా ప్రాణాన్ని తీసుకోవాలా?" అని మిమ్మల్ని మీరు అడిగే దశలో మీరు ఉండవచ్చు.
నేను ప్రారంభించడానికి ముందు, మీరు అలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నందుకు నా బాధను వ్యక్తం చేయనివ్వండి. గణనీయమైన నొప్పి భారం భుజాలపై పడకుండా ఆత్మహత్యను ఎవరూ పరిగణించరు. ఆ రకమైన భారాన్ని భాదను జీర్ణించుకోవడం కష్టం! ఇంకా నేను ఆత్మహత్య అనేక కారణాలను బట్టి నిజమైన పరిష్కారం కాదని గట్టిగా మరియు దయగా చెప్పాలనుకుంటున్నాను.
ఎవరి జీవితమిది?
ఈ విషయం యొక్క కేంద్రస్థానం వద్ద, ఆత్మహత్య ఆరవ ఆజ్ఞను ఉల్లంఘిస్తుంది : "నరహత్య చేయకూడదు" (నిర్గమకాండము 20:13) ఒక క్రైస్తవుడిగా, మీ జీవితం నిజంగా మీకు చెందినది కాదు (మీరు మీ సొత్తు కారు): "విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింధీయులకు 6:20). మీ జీవితం తన కుమారుడైన యేసుక్రీస్తు జీవితంతో మిమ్మల్ని కొన్న దేవునికి చెందినది. మరియు మీరు అనందాన్ని అనుభవించనప్పుడు కూడా, మీ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది.
కొన్నిసార్లు మన జీవితం సంతోషంగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉండాలని అనుకుంటాము. బదులుగా, క్రైస్తవులుగా, మన ఉద్దేశ్యం, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎంత బాధపడుతున్నా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి.
తీవ్రమైన శోధనలు ఉన్నప్పటికీ యోబు దేవుణ్ణి మహిమపరచటానికి ఎంచుకున్నాడు. ఒకే రోజులో, యోబు తన ఆస్తులన్నీ, తన పిల్లలందరినీ కోల్పోయాడు. తరువాత, అతను ఆరోగ్యాన్ని కోల్పోయాడు మరియు తరువాత తన భార్య మరియు స్నేహితుల హేళనను ఎగతాళిని భరించి సహించాడు. ఈ శోధనల సమయంలో, యోబు తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఆరాటపడ్డాడు.
"ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక” (యోబు 6:8, 9)
అయినప్పటికీ, యోబు దేవునిని గట్టిగా పట్టుకున్నాడు. తన భార్య సూచించినట్లు "దేవుని దూషించి మరణము" కమ్మనిన మాటను అతను నిరాకరించాడు (యోబు 2:9) బదులుగా, అతను బాధల గుండా కూడా దేవుణ్ణి స్తుతించాడు. "ఇదియు నాకు రక్షణార్ధమైనదగును (ఆయన నాకు రక్షణయగును)" అని యోబు దేవునిని గూర్చి చెప్పెను (యోబు 13:16) ఆ ఎంపిక కారణంగా, యోబు కథనం చాలా మందికి వారి సొంత ప్రయత్నాల ద్వారా పట్టుదలతో ఉండటానికి ప్రేరణ నిచ్చింది.
మీరు నిరాశ అంచున ఉన్నట్లు అనిపించవచ్చు. మీ ఉనికికి కారణం లేదని మీరు భావించవచ్చు, కానీ ఇప్పుడు కూడా, మీ జీవితం దేవుని నుండి వచ్చిన బహుమతి. క్రైస్తవులుగా, మనం బ్రతికి ఉంటే, దేవునికి మన జీవితం పట్ల ఇంకా ఒక ఉద్దేశ్యం ఉందని విశ్వసించాలి. అది ఏమిటో మీకు తెలియకపోవచ్చు. కాని ఆయనకైతే ఒక ఉద్దేశ్యం ఉన్నది మరియు "అయనే మిమ్మల్ని దాని వైపు నడిపిస్తాడు. వాస్తవానికి, మీరు పడుతున్న "ప్రస్తుత బాధ మీ కొరకు ఆయన ఉద్దేశ్యాన్ని బట్టి జీవించడానికి ఏదో ఒక రోజు మీకు సహాయపడవచ్చు.
నేడు, మీ కొరకు ఆయన ఉద్దేశ్యం మీ శోధనల ద్వారా ఆయనను స్తుతించటానికి సరళమైన, ఇంకా కష్టమైన, ఎంపిక కావచ్చు. అలా చేయటానికి ఆయన మీకు కృపను మరియు బలాన్ని ఇవ్వగలడు "ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును" (1 ລ້ 1:6, 7).
దేవుని యెడల, ఇతరుల యెడల మరియు మీ యెడల ప్రేమ
"నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. (మరియు) ... నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను" అనునవి రెండు ప్రధానమైన గొప్ప ఆజ్ఞలు అని యేసు చెప్పెను (మత్తయి 22:37-39).
కొన్నిసార్లు, మన సొంత బాధల్లో మనం మునిగిపోవచ్చు, మన మరణం కుటుంబానికి మరియు సమాజానికి కలిగించే బాధ యొక్క తీవ్రమైన భయానక తరంగాలను మనము పట్టించుకోము.
మేము ఒకప్పుడు నివసించిన మారుమూల పట్టణంలో. మా కుమారుని స్నేహితుడొకడు, నిరాశకు గురై మాదకద్రవ్యాలతో పోరాడుతూ, తనను తాను కాల్చుకున్నాడు. అతి త్వరలోనే, అతను ఇంకా బ్రతికే ఉన్నట్టుగా కనుగొనబడ్డాడు. అతన్ని సమీప ఆసుపత్రికి తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ కొరకు పిలుపునిచ్చారు.
తుఫాను మరియు భారీ వర్షం మధ్య, హెలికాఫ్టర్ రాత్రి చీకటిలో మసక దృశ్యమానతతో బయలుదేరింది. కానీ రక్షించే క్రమంలో, హెలికాప్టర్ ఒక పర్వతంలోకి వెళ్లి, లోపల ఉన్న ముగ్గురు వ్యక్తులు, అనుభవజ్ఞుడైన పైలట్ మరియు ఇద్దరు వైద్య సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోయారు. అతని తుపాకీ గాయంతో యువకుడు కూడా మరణించాడు. వెంటనే, యువకుడి తండ్రి కూడా గుండెపోటుతో మరణించాడు. మా సమాజాన్ని ముంచెత్తిన దుఃఖ సముద్రాన్ని మాటల్లో వివరించడం కష్టం. తన నిర్ణయం ఇతరులకు ఎంత బాధ కలిగిస్తుందో అని ఆ యువకుడు ఒక్కసారి గనుక ఆలోచించి ఉంటే, అతను తుపాకీ ట్రిగరుని లాగి కాల్చుకొని ఉండేవాడు కాదేమో.
యేసు హృదయం గురించి ఆలోచించండి. మనలో ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకు బదులుగా ఆయన తన జీవితాన్ని ఇస్తాడు. మీ మరణం "శాశ్వతమైన ప్రేమతో... నిన్ను ప్రేమించుచున్న" ఆయనను ఎంత భయంకరంగా బాధపెడుతుందో ఆలోచించండి ( 31:3)
ఆత్మహత్య మీకు ఏది కోల్పోజేస్తుందో ఆలోచించండి. మనము మన సొంత బాధపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, ప్రతిదీ నిరాశాజనకంగా కనిపిస్తుంది. మీరు చీకటి బిళం వైపు చూస్తున్నట్లయితే, మీరు చూడబోయేది మరియు ఆలోచించబోయేది ఆ చీకటి బిళం గురించి మాత్రమే. చాలా మటుకు, మీరు చేయబోయేది ఆ చీకటి బిళంలోకి పడిపోవడం మాత్రమే అని మీరు నమ్ముతారు.
కానీ మీరు మరొక దిశలో పైకి చూస్తే, మీరు ప్రకాశవంతమైన సూర్యకాంతిని చూస్తారు. నలుపు ఉనికిలో ఉన్న ఏకైక రంగు కాదని: మరియు క్రిందికి దిగజారిపోవడమే మీకు ఉన్న ఏకైక ఎంపిక కాదని మీరు గ్రహిస్తారు. "దేవుని లోతైన ప్రేమను మించిన లోతైన గొయ్యి లేదు" అనేది హెూలోకాస్ట్ (వినాశనము) నుండి ప్రాణాలతో బయటపడిన కొర్రీ టెన్ బూమ్ గారికి చాలా ప్రియమైన వాక్యము. వేరొకరిని చూడటానికి మీరు మీ కళ్ళకు శిక్షణ ఇస్తే, మీరు "ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురు" (యోహాను 1:51). నెరవేరిన వాగ్దానాలు మరియు జవాబొచ్చిన ఆశలు యొక్క నూతన ఆరంభానికి యేసుక్రీస్తు నిచ్చెన. "విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన" మన రక్షకుని వైపు చూద్దాం (హెబ్రీయులకు 12:2).
మీ కథ ముగియలేదు
నా తల్లి ప్రదర్శన బిజినెస్ లో పనిచేసిన ఒక అందమైన మహిళ, ఇక్కడ శారీరక స్వరూపం మరియు యవ్వనం ఎంతో విలువైనవి. ఆమె 40 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, తన ఉత్తమ సంవత్సరాలు తన వెనుకనే గడిచిపోయాయని ఆమె భయపడింది. ఆమె ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్లు ఆమె నాకు చెప్పినప్పుడు, నేను చిన్నతనంలోనే నాకు సహాయపడిన ఒక ఆలోచనను పంచుకున్నాను "అమ్మ, ఆత్మహత్య గురించి మంచి విషయం ఏమిటంటే మీరు దానిని ఎప్పుడైనా వాయిదా వేయవచ్చు. ఎల్లప్పుడూ మరొక రోజు ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి చనిపోతే, ఇక అంతే. మీరు బ్రతికి యుండి ఉంటే ఏమి జరిగి యుండేదో మీరు ఎప్పటికీ కనుగొనలేరు.” సహజంగానే ఆసక్తిగల వ్యక్తిగా, ఆమె బతకాలని నిర్ణయించుకుంది– మరియు ఆమెకు 50 సంవత్సరాలు నిండినప్పుడు ఆమె తన అత్యంత విజయవంతమైన రోజులు గడిపినట్టుగా తేలింది.
మిత్రమా, మీ కొరకైన దేవుని కథ ఇంకా ముగియలేదు! ప్రభువు సహాయాన్ని కోరుకునే మరియు అంగీకరించేవారికి, మీ ముగింపు ఎప్పటికీ వైఫల్యం మరియు నిరాశతో కూడుకున్నది కాదు, కానీ ఎల్లప్పుడూ పరిహారము (పరిష్కారము), పునరుద్ధరణ మరియు విమోచన (విముక్తి) తో కూడుకున్నదై ఉండాలి: "నేను లేవనెత్తి... బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ... పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును" అని దేవుడు తన ప్రజల గురించి చెప్పెను (ఆమోసు 9:11).
ఈ లోకం యొక్క బాధల నుండి తప్పించుకోవడానికి ఎవరైనా తన ప్రాణాలను తీసుకోవడం దేవుని చిత్తం కాదు. మీరు జీవించాలని దేవుడు కోరుకుంటాడు! వాస్తవానికి, యేసు ఇలా అన్నాడు, "గొట్టెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని" (యోహాను 10:10). ఇది ఖచ్చితంగా యోబు యొక్క జీవిత అనుభవం. యోబు చాలా బాధ ననుభవించాడు, కానీ దాని గుండా వెళ్ళిన తరువాత, “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను" (యోబు 42:12) అది మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం : "మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను" (యెహెజ్కేలు 36:11). దేవుడు నీ కొరకు సమృద్ధిగా జీవమును కలిగి ఉన్నాడు-నీ కొరకైన ఆయన కథలో తరువాత ఏమి జరుగుతుందో చూడటానికి నీవు ఎందుకు కట్టుబడి ఉండకూడదు?
అధ్యాయము - 3
నిరీక్షణను కనుగొనుట
చయిత మరియు బహిరంగ ప్రసంగీకుడు టెర్రీ వైజ్ చాలా. రసంవత్సరాలు నిరాశతో కష్టపడి పోరాడారు. 10 సంవత్సరాల వయస్సులో కూడా, ఆమె తన ప్రాణాలు తీసుకోవాలని కోరుకున్నట్లు గుర్తుచేసుకుంది. కాసేపు, ఆమె తన కఠిన అనుభవాలను కొంతమేరకు మర్చిపోగలిగింది. కానీ ఆమె లౌ గెహ్రిగ్ (నాడీ మరియు కండరాల) వ్యాధితో బాధపడుతున్న తన భర్తను కోల్పోయినప్పుడు, అప్పటివరకు అణిగిమణిగి ఉన్న భాధలన్నీ అమాంతం ఉడికిపోయినట్టుగా కష్టాలన్నీ ఒకేసారి తారాస్థాయికి చేరుకొని తీవ్రంగా ఆమె పైకి వచ్చిపడ్డాయి. అంతట ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. "జీవితం ఒక ఓర్పును శోధించే అగ్నిపరీక్షగా మారింది." అని ఆమె పంచుకుంది.
ఈ రోజు, టెర్రీ తన జీవితం "ఆశాజనకంగా" మరియు "మెరుగ్గా”7 ఉందని వివరిస్తుంది. నిరీక్షణ వైపుగా ఆమె ప్రయాణం తనకు చికిత్స నందించిన కారుణ్య వైద్యుడు మరియు చాలా పత్రిక సంపాదకీయంతో కూడుకొన్న పక్రియ.
"ఆత్మహత్య ఒంటరిగా ఉండదు. ఇది కేవలం ఎక్కడా లేని ఫలితంగా ఏ కారణం లేకుండా జరగదు. ఏదో ఒక సంఘటన ఫలితమే ఇది.”8 అని టెర్రీ అన్నారు. వాస్తవానికి ఇది ఆశతో నిండిన ప్రకటన. ఒకవేళ ఆత్మహత్య ధోరణులు ఏదో ఒక నిజమైన పరిణామమే అయితే, అప్పుడు ఆ ధోరణులను తలంపులను నివారించడానికి నిజమైన సలహాలు సహాయం కూడా సాధ్యమే.
డెబ్భై మంది సహాయకులు
శీతాకాలపు రాత్రి, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ "ట్రెజర్ ఐలాండ్ (నిధి దీవి)” అనే తన సాహస కథకు ప్రసిద్ధి చెందిన దానికంటే కాలం ముందుగానే, అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, అతని దాది లేక ఆయా అతన్ని తనిఖీ చేయడానికి వచ్చింది.
రాబర్ట్ మంచం మీద నుండి ప్రక్కకు పడ్డాడు. అతని చేతులు ముక్కు కిటికీకి నొక్కుకున్నాయి. అతని అయా అతనికి చలి తగలక ముందే అతనిని మంచం మీద పడుకోమని గట్టిగా చెప్పింది.
కానీ రాబర్ట్ ఆమెతో, "కిటికీ దగ్గరకు రండి, నేను ఏమి చూస్తున్నానో చూడండి" అన్నాడు.
ఆయా చూడటానికి వచ్చింది. క్రింద, వీధిలో ఒక దీపాలను వెలిగించేవాడు నడుస్తూ, ఒక్కొక్కటిగా వీధిదీపాలను వెలిగిస్తున్నాడు. "చూడండి." "ఒక వ్యక్తి చీకటిలో వెలుగులు పూయిస్తూ వస్తున్నాడు! 9, అన్నాడు రాబర్ట్.
మనందరికీ అంధకార రాజైన అపవాది చీకటిలో కూడా వెలుగులు పుట్టించే వ్యక్తులు మన చుట్టూ కావాలి.
మోషే తన 40 సంవత్సరాల అపారమైన బాధ్యతల ప్రయాణంలో ఆశ్చర్యకరమైన క్షణాన్ని అనుభవించాడు. అతను బానిసలైన ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుని పనిముట్టు మాత్రమే కాదు. అరణ్యం గుండా వారి సర్వ సమాజాన్ని నడిపించే బాధ్యత కూడా అతనికి అప్పగించబడింది. నిర్వహణ సమస్యలూ ఉన్నాయి: అంతటి పెద్ద సంఖలో ఉన్న జనసమూహానికి తగినంత ఆహారం మరియు నీరు ఎక్కడ లభిస్తుంది? వారు తమను తాము ఎలా సంరక్షించుకుంటారు? కానీ భావోద్వేగ సమస్యలు మోషే మీద ఎక్కువ భారంగా ఉన్నాయి.
ఇశ్రాయేలీయులు నిరంతరం ఫిర్యాదు చేయడమే తమ పనిగా పెట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో, ప్రజలు "ఎవరి గుడారపు ద్వారము నొద్ద వారు" ఏడ్చినట్లు బైబిలు చెప్పుచున్నది (సంఖ్యాకాండము 11:10). వారి విడుదలను స్వతంత్రమును బట్టి కృతజ్ఞులై యుండుటకు బదులు, వారు బానిసలుగా బందిఖానాలో ఉన్న భూమిని ఎందుకు కోల్పోయామా అని చింతిస్తున్నారు! "బగుప్తలో మేము ఉచితముగా తినిన చేపలును ... జ్ఞాపకమునకు వచ్చుచున్నవి." అని వారు అర్తనాదాలు చేశారు. (సంఖ్యాకాండము 11:5). "ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల యెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి" (సంఖ్యాకాండము 1161
మోషే శక్తి కూడా నశించిపోయింది. ప్రజలు మన్నా తినలేక నీరసించి పోయారు. కానీ అతను ప్రజలతో వేగలేక నీరసించి పోయాడు! కాబట్టి, మోషే దేవునికి ప్రార్ధించాడు. "నీవేల నీ సేవకుని బాధించితివి?" (సంఖ్యాకాండము 11:11 ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు, అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలచిన యెదల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము" (సంఖ్యాకాండము 11:14, 15). మోషేపై మోపిన ప్రజల భారం ఎంత గొప్పదంటే వారి సంరక్షణను కొనసాగించడం కంటే చనిపోవడానికి ఇష్టపడ్డాడు.
మోషే చనిపోవాలని చాలా నిరుత్సాహపడినప్పుడు దేవుడు ఎలా దగ్గరయ్యాడు? ప్రజల నుండి 70 మంది పెద్దలను కనుగొనమని దేవుడు మోషేకు సూచించాడు. "ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతో కూడ భరింపవలెను" అని ఆయన చెప్పెను (సంఖ్యాకాండము 11:17). కొంతమందికి చెప్పబడినట్లుగా, మోషే కేవలం "అధిక విశ్వాసం కలిగి ఉండడం" మాత్రమే కాదు, చెప్పినట్లుగా, లేదా శాంతింపజేయడానికి కాదు నిస్సార వేదికల ద్వారా. మోషేకు మోయలేని పరిస్థితి నుండి ప్రయోగాత్మక ఉపశమనం అవసరం, దేవుడు కరుణతో దానిని మోషేకు అందించెను.
దేవదూత అల్పాహారం వండినప్పుడు
తీవ్ర నిరాశ ననుభవించిన మరొక దేవుని మనిషి ఏలీయా. వినాశకరమైన కరువు మధ్యలో, కర్మెలు పర్వతంపై దేవుని ప్రవక్తకు మరియు పెద్ద సంఖ్యలో ఉన్న విగ్రహారాధన ప్రవక్తలకు మధ్య ఒక వివాద -ఘర్షణ చెలరేగింది. ముగింపులో, బలియర్పణపై పరలోకం నుండి అగ్నిని రప్పించి, తన సేవకుని ప్రార్ధనకు సమాధానమిచ్చినది ఏలీయా దేవుడు.
తత్ఫలితంగా, పూర్తిగా విస్మయంతో ఉన్న ప్రజలు, యెహోవాను ఆరాధించారు, మరియు ఏలీయా బయలు దేవత యొక్క ప్రతి అబద్ధ ప్రవక్తలను చంపడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు, మూడు సంవత్సరాలలో మొదటిసారి వర్షం పడటం ప్రారంభమైంది. (1 18:20-46 .)
ఆ రాత్రి ఏలీయా స్థితిని ఊహించండి. అనాటి విజయం ఎంతటి ఘన విజయం! ఏ ఉత్ప్రేరక గ్రంథులు అతని రక్త సిరల్లో ప్రవహిస్తున్నాయో తెలీదు గాని, అతని ఉత్సాహంతో అతను రాజు రధం కంటే ముందే పట్టణం వరకు పరిగెత్తాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు ఆ దేశంలోని విగ్రహారాధనను చివరకు సమూలంగా నిర్మూలిస్తాయని బహుశా అతను భావించి యుండవచ్చును. దేవుడు శక్తి ప్రదర్శించడం ద్వారా రాజు మరియు రాణి ఒప్పించబడతారని అతను బహుశా అనుకొని యుండవచ్చును. ఖచ్చితంగా, అతను అనాటి భ్రాంతులను బట్టి మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోయాడు. అయినప్పటికీ, గొప్ప విజయం తర్వాతే మనం ఎక్కువగా శోధనకు గురి అవ్వటం తరచుగా జరుగుతుంది.
కాబట్టి అది ఏలీయా కర్మలు పర్వతంపై విజయం సాధించిన తర్వాత నేరుగా వచ్చిపడింది. యెజెబెలు దూత ప్రాణాపాయంతో కూడిన బెదిరింపు వర్తమానంతో వచ్చాడు. ఇప్పుడు, ఏలీయా కేవలం మూడు సంవత్సరాలు రాజు సముఖం నుండి దాక్కున్నాడు. దేవుడు అతడిని సంరక్షించాడు. కానీ యెజెబెలు వర్తమానం ఆగ్రహంతో రౌద్రరూపం దాల్చింది, ఏలీయా ప్రాణ రక్షణకై పారిపోయాడు. (1 రాజులు 19: 1-3 చూడండి.)
అలిసిపోయి, నిరాశపడి మరియు అరణ్యంలో పూర్తిగా ఒంటరిగా ఉన్న ఏలియా, "ఇది చాలు! ఇప్పుడు, ప్రభూ, నా ప్రాణాలు తీయండి, ఎందుకంటే నేను నా తండ్రుల కంటే గొప్పవాడిని కాదు!" అని ప్రార్ధించాడు. (1 రాజులు 19:4). అతను తన్ను తాను అసహ్యించుకున్నాడు. మొత్తానికి. అతను తన జీవితం విషయమై పూర్తిగా విసుగెత్తిపోయాడు.
ఏలీయా చనిపోవాలనుకునేంతగా నిరాశపడినప్పుడు దేవుడు ఎలా దగ్గరయ్యాడు? మొదట, దేవుడు అలసట -ఆకలి మరియు దాహం అతని భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించాడు. అతని కొరకు అల్పాహారం వండడానికి ఒక దేవదూతను పంపాడు! వాస్తవానికి, దేవదూత ప్రవక్తను నిద్రలేపాడు, అతనికి ఆహారం మరియు నీరు ఇచ్చాడు. అతన్ని మళ్లీ నిద్రించడానికి అనుమతించాడు. తర్వాత అతనికి రెండవసారి తినిపించాడు.
బహుశా దీనివల్లనే ఎక్కువ మంది ప్రజలు ఉదయం కంటే సాయంత్రం తమ ప్రాణాలను తీసుకుంటారు. 10 వారు అలసిపోయారు లేదా ఆకలితో ఉన్నారు లేదా ఆ రోజు జరిగిన సంఘటనల వల్ల నిరాశపడ్డారు. భోజనం మరియు రాత్రి నిద్రిస్తే లభించే మంచి విశ్రాంతి ఎంత మార్పును తెస్తుందో వారు గ్రహించలేరు. ఒకవేళ ఆ సాధారణ సేవా సదుపాయాలు వారి పూర్తి దృక్పథాన్ని మార్చినట్లయితే ఎలా ఉంటుంది? అవి వారికి నిరీక్షణ మరియు ఎదుర్కొనే శక్తిని ఇస్తే ఎలా ఉంటుంది?
ప్రయోగాత్మక కరుణ
ఇది చాలా సులభమైన పరిష్కారంగా అనిపించవచ్చు, కానీ మన శారీరక జీవితం ఎల్లప్పుడూ మన మానసిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు మన మనస్సులను మరియు మన శరీరాలను ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన విధంగా రూపొందించాడు "అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు" (కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషు బైబిలు ప్రకారము, "ఒకడు తన హృదయములో ఎట్లు ఆలోచించునో, అలాగే అతని ప్రవర్తన కూడ ఉండును" (సామెతలు 23:7), శరీనికి ఏది సహాయపడుతుందో అదే మనస్సుకు సహాయపడుతుంది. మనం మంచి -మనస్సు మరియు శరీరంతో ఉండాలని దేవుడు కోరుకుంటాడు, మరియు ఆ దిశగా ఆయన తక్షణమే అందుబాటులో ఉండే, వ్యక్తిగతంగా స్థిరమైన పద్ధతులను అందించాడు.
ఏలీయాకు ఆయన తీవ్రమైన ప్రయోగాత్మక స్పందన ఈ సత్యానికి ప్రాధాన్యతను జోడిస్తుంది. అయితే దేవుడు చేసింది అంతా ఇంతమాత్రమే కాదు! దేవదూత ఏలీయా పట్ల దేవుని మృధుత్వం, సానుభూతి మరియు కరుణను కూడా వ్యక్తం చేశాడు. "నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది. నీవు లేచి భోజనము చేయుమని" దేవదూత అతనికి చెప్పెను (1 రాజులు 19:7)
24
జీవమును కోరుకొనుట
మిత్రమా, కొన్నిసార్లు జీవిత ప్రయాణం మన శక్తికి మించినది. ఇది చాలా కష్టంగా, ఒంటరిగా మరియు చాలా బాధాకరంగా ఉంటుంది.
అది మన బాధలు మరియు నిరాశలు మనల్ని చీకటిలో విడిచినట్లుగా ఉంటుంది. అయితే ఆ క్షణాల్లో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనం తీసుకోవాలి: "తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు" (అపొస్తలుల కార్యములు 17:27) ఒక చీకటి గదిలో తన మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒకడు ఏమి 'చేస్తాడు? సాధారణంగా ఆ వ్యక్తి తన చేతులను తనకు ముందుగా చాచి లైటు స్విచ్ కోసం వెతుకుతూ నెమ్మదిగా ముందుకు నడవడం ప్రారంభిస్తాడు. నిజానికి, దేవుడే ఆ వెలుగు, ఆయన దీపమును వెలిగించువాడు, మనం చేయవలసిందల్లా ఆయనను వెతకడానికి ప్రయత్నంచడమే.
డిప్రెషన్ (ఒత్తిడి) అనే తన పుస్తకంలో: ది వే అవుట్ (బయటపడే మార్గం), వైద్యుడైన నీల్ నెడ్లీ గారు నిరాశను తగ్గించడానికి మరియు తిప్పికొట్టడానికి కూడా నిరూపించబడిన సరిగ్గా అటువంటి పరిశోధన-ఆధారిత జీవనశైలి సాధనాలనే పంచుకున్నారు. అతని డిప్రెషన్" రికనర్ ప్రోగ్రామ్ (ఒత్తిడి ఉపశమన కార్యక్రమం) అనేది అంతర్గత చికిత్స. అదే జీవనశైలి మార్పులను అమలు చేసి "హాజరైనవారిలో అపూర్వమైన 98 శాతం స్పందన రేటు సాధించింది. "11
ఐసియు నర్సు క్రిస్టీ డిప్రెషన్ రికవరీ ప్రోగ్రామ్‌లో చేరడానికి ముందు ఆమె ఐదుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడ ఆమె గడిపిన సగానికి పైగా కాలంలో, అమెకు ఆ కార్యక్రమం అస్సలు నచ్చలేదు. పొగ, తాగాలని మరియు "దేవునిని పట్టించుకోకూడదని 12 ఆమె కోరుకుంది. అయితే ఆమె అక్కడ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆమెను కార్యనిర్వహణాధికారి సందర్శించారు, క్రిస్టీ ఆమెతో మాట్లాడుతుండగా ఆమె
ఏడవడం ప్రారంభించింది. క్రిస్టీ అయోమయంలో పడింది. "ఎవరో (ఆమె) గురించి ఎందుకు ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారో” ఆమెకు అర్థం కాలేదు.13
క్రిస్టీ అక్కడి నియమాలకు కట్టుబడి ఉండిపోయింది. నేడు, ఆమె "ఒత్తిడి నుండి, ఆందోళన నుండి, మరియు మందులు వాడటం నుండి బయటపడి స్వతంత్రురాలైంది. 14 ప్రయోగాత్మక మార్పుతో పాటు షరతులు లేని ప్రేమ ఆమెకు చూపించిన కార్యనిర్వహణాధికారి, ఆమెకు బైబిల్ అధ్యయనం ఇచ్చిన నర్సు, "(ఆమె) విజయవంతంగా కోలుకోవాలని సర్వదా కొనసాగిన" సిబ్బంది కృషి ప్రయాసలు" మొత్తం మార్పుకు దోహదపడ్డాయి. 15
క్రిస్టీ అనుభవించిన దానికంటే దేవుడు నీపై అనంతంగా ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నాడు! కీర్తనకారుడి మాటల్లో : "విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును" (కీర్తన 34:18), మీరు ఏ అడ్డంకులు ఎదుర్కొన్నా. సహాయము మరియు నిరీక్షణను కనుగొనడానికి దేవుడే ఏకైక మార్గం.
దేవునితో సంభాషణ
అయితే ఇప్పుడు ఏలీయా కధనానికి తిరిగి వద్దాం. నిరీక్షణను వెతుక్కునే అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఒక దేవదూత అందించిన అల్పాహారం ఈ ప్రక్రియలో భాగంగా ఉండగా, ఏలీయా ప్రయాణం అరణ్యంలో 40 రోజుల పాటు, హెూరేబు పర్వతం వరకు కొనసాగింది. దేవుడు అతడిని అక్కడ కలుసుకున్నాడు. ఏలీయా తన నిరాశను బయటకు కురిపించాడు : "సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను” (1 రాజులు 19:14). ఏలీయాకు, అన్నీ కోల్పోయినట్లు అనిపించింది. ప్రతిదీ నిరాశాజనకంగా అనిపించింది. ప్రతిదీ అర్ధం లేనిదిగా అనిపించింది.
ఏలీయా నిరుత్సాహాన్ని నిరాశను దేవుడు ఎలా ఎదుర్కొన్నాడు? అతని పని ఇంకా పూర్తి కాలేదని దేవుడు ఏలీయాకు గుర్తు చేశాడు. ఆయన ఇంకా తన ప్రవక్త కొరకు ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు! కానీ దేవుడు ఏలీయా యొక్క మానసిక అవసరాలను కూడా సున్నితంగా తీర్చి ఇశ్రాయేలులో ఇంకా 7,000 మంది విశ్వాసులు ఉన్నారని అతనికి భరోసా ఇచ్చాడు. దేవుడు వారిలో ఒకరి పేరును కూడా పంచుకున్నాడు, ఎలీషా అనే వ్యక్తి ఏలీయా తరువాత అతని స్థానంలో ఉండటానికి శిక్షణ పొందాల్సి ఉంది. ఏలీయా మాత్రమే చివరి విశ్వాసి కాదు!
కొన్నిసార్లు, నిజం కాదని తేలిన పరిస్థితి గురించి మనం ఏదో నమ్మవచ్చు. అయితే మనము పొరపాటు పడియున్నాము. ఇదే ఏలీయా విషయంలో కూడా జరిగింది. ఇది అతను తన జీవితం గురించి మరియు తన గురించి ఏమనుకుంటున్నాడో అన్నదానిని పూర్తిగా తిరగరాసింది. దేవునితో అతని సంభాషణ అతను అనుకునే దాని కొరకు ఇంకా నిరీక్షణ ఉందని గ్రహించడానికి అనుమతించింది.
మిత్రమా, మీ విషయంలో కూడా ఇంకా నిరీక్షణ ఉంది. మీరు బాధ, నొప్పి మరియు నిరుత్సాహాన్ని నిరాశను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే దేవుడు ఇంకా మీ జీవితానికి సంబంధించిన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆయనకు మీ కొరకు ఒక ఉద్దేశ్యం ఉంది. మీరు మాత్రమే చేయగల పని ఉంది! మీ కొరకు దేవునికున్న ప్రణాళికలు మేలుకరమైనవి
"నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు" (κωδικών 29.11)
ప్రజల యొక్క ప్రాముఖ్యత
దేవుడు తన నిరాశపడిన ఇద్దరు ప్రవక్తలను ఇతర వ్యక్తుల వైపు నిర్దేశించడాన్ని మీరు గమనించారా? వారు ఒంటరివారు కారని గ్రహించేందుకు ఆయన వారిని ప్రేరేపించాడు, వారితో సహా భారం మోయగలవారు దానిని వారి నుండి ఎత్తివేయగలవారు కూడా ఉన్నారు.
మోషే కొరకు, అతని నిరాశను తీర్చే పరిష్కారంలో 70 జతల అభయ హస్తాలు ఉన్నాయి. ఏలీయా కొరకు, అతని తరువాత తన స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తికి శిక్షణ ఇచ్చే పని అతని అధిక సమస్యలకు వ్యతిరేకంగా పనిచేసే ఎదురుదాడిగా, అతడిని ఉద్దేశ్యంతో ముందుకు సాగేలా చేసింది. మానసిక లేదా ప్రయోగాత్మక సహకారంలోనైనా, ఇతర వ్యక్తులు నిరీక్షణ కొరకైన ప్రయాణంలో సమగ్ర భాగమైయున్నారు.
మీరు ఆత్మహత్య ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, దయచేసి ఎవరికైనా చెప్పండి. మీరు నమ్మగల స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు లేదా శిక్షణ పొందిన అనుభవజ్ఞుడు కూడా ఉండవచ్చు. అనుభవమున్న వైద్యులు మరియు సలహాదారులు మీ సమస్యను వినే చెవిగా ఉండాలి. వారు మీ సమస్య ఏదో నిర్ధారించి చికిత్స అందిస్తారు, ఉపయోగకరమైన వనరులు ఈ పుస్తకం కవర్ లోపల జాబితా చేయబడ్డాయి. దేవుడు తన ప్రవక్తలకు సహాయం చేయడానికి వారిని సరైన వ్యక్తుల దగ్గరికి నడిపించినట్లే, ఆయన మిమ్మల్ని కూడా నడిపించగలడు "నీ విమోచకుడు ..... నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును" (యెషయా 48:17).
పాపము నిరాశకు కారణమైనప్పుడు
దావీదు తీవ్ర నిరాశను అనుభవించిన మరొక దేవుని మనిషి కనీసం ఒక్క సందర్భంలోనైనా, దావీదు అతని నిరాశకు అతని పాపాలే కారణమని చెప్పాడు: "నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. ...
నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను" (కీర్తన 38:4, 6), కొన్నిసార్లు, మన సొంత నిర్ణయాలు మరియు చర్యలు మన నిరాశకు కారణమవుతాయి. మనం చేసిన దానిని మనం భరించలేము. మనం ఏమయ్యామో అన్న దానిని చూసి మనం తట్టుకోలేము, మీరు ఇకపై మీ జీవితంతో వేగలేకపోయినప్పుడు ఎక్కడికి వెళ్లాలి? నిజానికి, ఎక్కడికి వెళ్లాలో దావీదుకు బాగా తెలుసు.
అతను మరణవేదనలో ఉన్నప్పటికీ, అతన్ని దాని గుండా నడిపించే వ్యక్తి ఒకరున్నారని దావీదుకు తెలుసు, దేవునికి, అతను ఇలా వ్రాశాడు : "జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు" (కీర్తన 16:11). దేవుడు సంతోషము మరియు జీవమైయున్నాడు. పాపము దుఃఖము మరియు మరణమైయున్నది. పాపము వైపు తిరిగినప్పుడు, మీరు నిస్సందేహంగా దేవునికి దూరమైపోతారు, లేని యెడల దీనికి వ్యతిరేకమైనది జరుగుతుంది ప్రతిసారీ, తప్పకుండా.
కృతజ్ఞతగా, మనము పాపభారంతో కూరుకుపోలేదు! దావీదు ఖచ్చితంగా తన సొంత పాపంలో మునిగిపోతున్న వ్యక్తి కానీ అ భయంకరమైన సమయంలో కూడా, అతను దేవునిని పశ్చాత్తాపంతో ఆశ్రయించాడు, అతని పాపాలను ఒప్పుకున్నాడు. తనను శుద్ధి చేయమని దేవునిని వేడుకున్నాడు. దేవుడు అలాగే చేశాడు. "నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము" అన్నది అతని ప్రార్థనయైయున్నది (కీర్తన 5112) మీరు ఒక్కరాత్రిలో క్రొత్తవ్యక్తిగా మారిపోలేరు, కానీ దేవుని వాగ్దానం మనల్ని మార్చేంత మంచిది. (సంఖ్యాకాండము 28 19, యెషయా 55:11). ఆయన వాగ్దానం మనకు సొంతమని మనం ప్రకటించుకోవచ్చు "నిత్యానందము వారికి కలుగును" (యెషయా 61:7)
బలము మరియు విశ్వాసమును కనుగొనుట
అపొస్తలుడైన పౌలు తనను వేధించే శారీరక బలహీనతతో పోరాడినప్పుడు అతడు దేవుని శక్తిని కనుగొన్నాడు. అది ఏమిటో మనకు తెలియదు, కానీ అది తొలగించబడాలని అతను అనేకసార్లు ప్రార్థించాడని మనకు తెలుసు. బదులుగా, దేవుడు అతనితో, "బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని" చెప్పెను (2 కొరింథీయులకు 12:9).
తప్పు చేయవద్దు, దేవుడు కొన్నిసార్లు మనల్ని చాలా క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఒకడు తన సొంత ప్రాణాలను తీసుకునే శోధనే ఈ అనుభవం యొక్క అంతిమ రూపం. కానీ ప్రతిసారి మనం విజయం సాధిస్తామని యేసుక్రీస్తు శక్తి ద్వారా మనకు వాగ్దానం చేయబడింది :
"సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింప గలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు అయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును" (1 కొరింధీయులకు 10:13),
"మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము" (హెబ్రీయులకు 4:15, 16), 30
జీరమును కోరుకొనుట
దేవుడు "వద్దు" అని చెప్పినప్పుడు అది సులభం కాదు, కానీ ఆయన సమాధానానికి, దాని గురించి మనకు అవగాహన ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. ఆ క్షణాల్లోనే దేవుడు తన బలమును శక్తిని మన బలహీనత ద్వారా ప్రకాశింపజేయాలని కోరుకుంటారు. పౌలు తన బలహీనతను బట్టి సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. ఎందుకనగా అతను బలహీనతతో ఉన్నప్పుడు, అతను నిజానికి బలంగా శక్తివంతంగా ఉన్నాడు! (2 కొరింధీయులకు 12:10). మీరు అన్ని విధాలుగా కూరుకుపోయి అతి దిగువకు దిగజారిపోయినప్పుడు, మీరు సమస్తం కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా, దేవుని శక్తి ద్వారా, నిరీక్షణ కలిగి యుండవచ్చు.
దానికి వ్యతిరేకమే ఆత్మహత్య ఇది తరముగా విశ్వాసం మరియు నిరీక్షణను కోల్పోయిన దానికి ఫలితం. రోమీయులకు 1:17 "నీతిమంతుడు. విశ్వాసమూలముగా జీవించునని" స్పష్టం చేస్తుంది, మరియు సొలొమోను "బ్రదికి యుందువారితో కలిసి మెలిసియున్న వారికి ఆశ కలదు" (ప్రసంగి 9:41 నిజానికి ఆత్మహత్య అనేది మీ చెడు పరిస్థితులను శాశ్వతం చేస్తుంది -వాటిని తిరిగి మార్చలేనివిగా చేస్తుంది.
మోసపోవద్దు. ఆత్మహత్య బయటపడే మార్గం కాదు, ఆత్మహత్య పరిష్కారం కాదు. అవమానకరమైన ఆలోచనలు మరియు భావాలు మిమ్మల్ని ముంచెత్తినప్పుడు, వాటిని "సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది" అయిన సాతానుడి దాడిగా గుర్తించండి. (ప్రకటన 12:10) బైబిల్ మనకు వాగ్దానం చేస్తుంది "కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి. పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును" (యాకోబు 4:7, 8) అపవాదిని ఎదిరించే మీ సామర్థ్యం మిమ్మల్ని మీరు-దేవునికి సమర్పించడంపై ఆధారపడి ఉంటుందని గమనించండి. అపవాది. శోధనలను గద్దించే బలం శక్తి కొరకు దేవుని వద్దకు వెళ్లండి.
మీరు ఈ భారాన్ని ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. యేసు మీకు ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాడు: "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతును" (మత్తయి 11:28), మీ చుట్టూ శ్రమలనే తుఫానులు వీచినప్పటికీ, దేవుని కాడిని (సువార్త భారమును) మోయడం వలన మీ ఇబ్బందులను చాలా సులభమైన మార్గాల్లో "తేలికగా" మరియు "సుళువుగా" ఎదుర్కొనవచ్చు (మత్తయి 11:30)
కీర్తన 139 లోని మాటల్లో చాలామందికి ఓదార్పు లభించింది.
"యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీటి పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు. నీ చేయి నామీద ఉంచియున్నావు" (1-5 వచనములు)
నిన్ను అతి సన్నిహితంగా మరియు ప్రేమపూర్వకంగా దేవుడు ఎరిగియున్నాడు. ఆయన నీ పరిస్థితిని, నీ హృదయమును, నీ బాధను చూస్తాడు. మిత్రమా, ఆయన నీ సృష్టికర్త. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం అందుబాటులో ఉంది. అది నీ నీ పరిస్థితికి తగినట్లుగా ఉంటుంది.
"దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి" మృతమైనది కాదు ఒక్కసారి 'అలా చేసినట్లయితే, మనము "మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము" పొందుదుము (రోమీయులకు 12:1, 2) మిత్రమా, ఆ వాగ్దానం నీ కొరకే!
అధ్యాయము - 4
దుఃఖించుచున్న ప్రియులకు
రీన్ కుమారుడు క్రిస్టోఫర్ తన సొంత ప్రాణాలను తీసుకున్నప్పుడు. ∞ఆమె పూర్తిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఇది సరిగ్గా కార్మికుల దినోత్సవానికి ముందు ఒక అద్భుతమైన మరియు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న రోజు. ఆమె ముగ్గురు కుమారులు సకుటుంబ సపరివార విందుకు వస్తున్నారు. ఆమె కుటుంబం మొత్తం కలిసి ఉన్నప్పుడు ఉండే సంతోషం ఐరీను ఇంకెప్పుడూ ఉండదు.
అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పెద్ద కొడుకు, క్రిస్టోఫర్, ఆత్మహత్యాయత్నం తర్వాత పరిస్థితి విషమంగా ఉండి ఆసుపత్రిలో కృత్రిమ అక్సిజన్ సహాయం కింద ఉంటూ, అతను త్వరలోనే మరణించాడు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ విందు ఎన్నడూ జరగలేదు. బదులుగా, ఐరీన్ ఆమె ఎన్నడూ ఊహించని ప్రయాణాన్ని ప్రారంభించింది-ప్రియమైన వ్యక్తిని ఆత్మహత్యకు కోల్పోయిన తరువాత సంభవించే దుఃఖ ప్రయాణం, "ఎవరూ స్వచ్ఛందంగా చేయని ప్రయాణం. 16
ఆత్మహత్యకు ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం ఒక సంక్లిష్టమైన దుఃఖం, మరియు ఆత్మహత్య నష్టం నుండి బయటపడినవారు విస్తృత స్థాయిలో భావోద్వేగాలకు లోనవుతారు. ఐరీన్ తీవ్ర ఆశ్చర్యానికి గురైంది: "ఎవరూ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు." ఆమె తన కొడుకు మరణం గురించి రాసింది. "ఇది పూర్తిగా ఎవరూ ఊహించని పరిణామం."17 ఐరీన్ ఎన్నో నిద్రలేని రాత్రులు విషాద ఛాయలను కళ్లముందే చూస్తూ గడిపింది.
అల్లిసన్‌కు మొట్టమొదటగా అపరాధ భావన ఉన్నది. "ఒక వ్యక్తిగా... జీవితంలో అధిక మొత్తం మానసిక వ్యాధితో పోరాడిన నేను, తక్షణ సంకేతాలను చూడనందుకు మరియు జోక్యం చేసుకోవడానికి నేను అక్కడ లేనందుకు సిగ్గుపడ్డాను."18 ఆమె తన స్నేహితురాలైన సిల్వియా ఆత్మహత్య గురించి రాసింది.
లిండ్సేకు తన తండ్రిని అత్మహత్యకు కోల్పోయినప్పుడు "విడిచివెళ్లిన భావన, ద్రోహం మరియు గందరగోళం" అనిపించింది. 19 "మా నాన్నగారు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో నేను కారణాలు సేకరించడానికి ప్రయత్నించడమే కాదు, కానీ ఆయన గురించి తెలిసినవారు మరియు ఆయనను ప్రేమించిన ప్రతి ఒక్కరూ సమాధానాల కోసం నా వైపు చూస్తున్నారు ... ఆ సమయంలో నాకు దొరకనివి. ఇప్పటికీ నా దగ్గర లేని సమాధానాలు. "20
కోపం, తిమ్మిరి, తిరస్కరణ భావాలు ఉండవచ్చు. ఇతరులు మిమ్మల్ని విడిచిపెడతారని బహుశా మీరు భయపడుతున్నారేమో. మీ ప్రియమైన వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కోలుకున్నందుకు బహుశా మీకు ఉపశమనం కలుగుతుందేమో.
మీరే ఆత్మహత్య ఆలోచనలతో పోరాడవచ్చు. అది అర్ధమవుతుంది. బహుశా ఆ వ్యక్తి స్థానంలో మీరు ఉండాలని కోరుకుంటారు, బహుశా ఆ వ్యక్తి మరణానికి మిమ్మల్ని మీరే నిందించుకోవచ్చు. లేదా మీకు మీరే తన ఆప్తమిత్రుడు ఆడమ్ తన ప్రాణాలు తీసుకున్న తరువాత కేథరీన్ లాగా, తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వవచ్చు. "ప్రియమైనవారి ఆత్మహత్యలో ఇది కూడా అతి దారుణమైన భాగాలలో ఒకటి" అని ఆమె వ్రాసింది. "ఇది అంటువ్యాధి కావచ్చు. "21
మీరు ఏమనుకుంటున్నా సరే, మీరు ఒంటరివారు కారు. చాలా మంది ఇతరులు ఈ కష్టమైన ప్రయాణంలో నడిచారు, అయితే వ్యక్తిగతమైన సహాయంతో పాటు సహాయక బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏద్చుటకు సమయము
మరణము దేవుని ప్రణాళికకు భంగము, మానవులందరికీ మరణం ఊహించిన ముగింపు కాగా, అది దేవుడు తన పిల్లల కొరకు ఉద్దేశించినది కాదు. నిజానికి, పౌలు మరణాన్ని "శత్రువు" అని పిలుస్తున్నాడు, అపవాది "మరణము యొక్క బలముగల" వాడని హెబ్రీ పత్రిక చెప్పుచున్నది (1 కొరింథీయులకు 15:26, హెబ్రీయులకు 2:14) భ్రాంతి, భయం. నొప్పి, బాధ మరియు ఇతర కఠినమైన భావోద్వేగాలతో మనం మరణాన్ని మరి ముఖ్యంగా అకాల మరణమైన ఆత్మహత్యను పలకరిస్తున్నట్లు అర్ధమవుతుంది.
అయితే మరణము శత్రువు పని కాగా, ప్రతిస్పందనగా మన విచారం మంచిది మరియు పరిశుద్ధమైన పని. మనం అనుభవించిన బాధ మనం కోల్పోయిన వ్యక్తి పట్ల మన ప్రేమకు ప్రత్యక్ష ఫలితం నికోలస్ వోల్టర్ స్టార్ఫ్ పర్వతారోహణ ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయిన తరువాత. అతను ఇలా వ్రాశాడు, "బాధ అనేది ప్రేమించడం వల్లనే. నేను అతన్ని (నా కుమారుణ్ణి) ప్రేమించకపోయి ఉంటే, ఈ వేదన ఉండేది కాదు. "22
కొన్నిసార్లు, క్రైస్తవులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే ఒత్తిడిని అనుభవిస్తారు. తమ విశ్వాసం తప్పు అన్నట్లుగా వారు ఆశను కనుగొనలేనప్పుడు వారు అపరాధ భావన కలిగి ఉండవచ్చు. కానీ నిజమేమిటంటే బైబిల్ సమస్త భావోద్వేగాలను గుర్తిస్తుంది. విలాపవాక్యములు గ్రంథము బబులోను సైన్యం చేత ధ్వంసం చేయబడిన యెరూషలేము పట్టణముపై నమోదైన ప్రవక్త యిర్మీయా యొక్క విచారము. అందులో, "వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది.
నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి, శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి" (విలాపవాక్యములు 1:16), శత్రువు మరణంలో విజయం సాధించినప్పుడు, దుఃఖం మరియు విచారము అనేవి వ్యక్తి పట్ల మనకున్న గొప్ప ప్రేమ నుండి పుట్టిన సహజమైన ప్రతిస్పందనగా వస్తాయి.
దేవుడు కూడా విలపిస్తాడు. సిలువపై తన మరణానికి కొన్ని రోజుల ముందు, యేసు ఒలీవ కొండ నుండి యెరూషలేములోకి గాడిదపై వెళ్లాడు. గొప్ప జనసమూహం ఆయనను స్తుతిస్తూ కీర్తనలు పాడుచుండిరి. కానీ సంతోషిస్తున్న జనానికి భిన్నంగా, యేసు "పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు, గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి" అని చెప్పెను (లూకా 19:41, 42), మళ్ళీ, మనము ప్రియమైన పట్టణము యెరూషలేమును చూచి ఏడ్వడం చూస్తాం అయితే ఈసారి దాని రెండవ విధ్వంసాన్ని బట్టి దేవుని కుమారుడు స్వయంగా ఏడ్చెను. రెండు సందర్భాలలో, ఇది ఏడ్వబడుచున్న వాస్తవ పట్టణం మాత్రమే కాదు, దాని బీద నివాసులు ప్రజల ప్రాణనష్టం మరింత దుఃఖానికి కారణమైంది.
ఆత్మహత్యను బట్టి దుఃఖించే చాలా మంది తమ ప్రియమైన వ్యక్తి కొరకు తీవ్రమైన ఆశను కలిగియుంటారు, వారికి దగ్గరగా ఉండి రక్షించలేకపోయామనే లోతైన బాధ, యేసు నీతో కలిసి దుఃఖిస్తున్నాడని తెలుసుకోండి. "యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి!" (మత్తయి 23:37),మరణమే మరణించినప్పుడు
ప్రియమైన వ్యక్తిని ఆత్మహత్యకు కోల్పోవడం వల్ల కలిగే బాధ -ముంచెత్తేదిగా ఉంటుంది, దుఃఖం గుండా సాగే జీవిత ప్రయాణం అంత సులభంగా ఉండదు. కఠినమైన దినాలు మరియు ఆకస్మిక కన్నీళ్లు ఉంటాయి. అయితే, నిరీక్షణకు కారణం ఉంది. యేసు మానవ కుటుంబంలో చేరారు. "ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును” (హెబ్రీయులకు 2:14) ఏదో ఒక రోజు మరణం పూర్తిగా అంతం అవుతుందనే వాగ్దానానికి పూచీకత్తుగా యేసు మరణించాడు. "ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను" అని అపొస్తలుడైన పౌలు మనకు చెప్పెను (1 కొరింధీయులకు 15:25), "కడపట నశింపజేయబడు శత్రువు మరణము" (1 కొరింథీయులకు 15:26) ఆత్మహత్యకు తన తండ్రిని కోల్పోయిన రచయిత అల్బర్ట్ సూ ఇలా చెప్పాడు - "చివరికి, మరణం కూడా మరణిస్తుంది."23
అద్భుతమైన రోజు వస్తోంది, "ఆయన (దేవుడు) వారి (మన) కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏదైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను" (ప్రకటన 21:4).
మనము ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురుచూస్తుండగా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమని నేను మీకు విన్నవించుకుంటున్నాను. మీరు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని అర్ధం చేసుకోగల సహకారుల కొరకు వెతకండి. మనస్సు విప్పి మాట్లాడటానికి ఒక స్థలాన్ని చూడండి, ఇతరులు మిమ్మల్ని జాగ్రత్తగా చూచుకోవడానికి అనుమతించండి.
చివరగా, ఎమ్మాయుకి వెళ్లే మార్గంలో శిష్యులను గుర్తుంచుకోండి. తమ ప్రియమైన బోధకుడు, యేసును కోల్పోయినందుకు తీవ్ర నిరాశకు గురయ్యారు, ఆయన మరణం తరువాత, "జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి" (లూకా 24:14), పునరుత్థానుడైన తరువాత, "యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచెను," అయితే వారాయనను గుర్తుపట్టలేదు (లూకా 24:15, 16). ఆయన నిరాశ నిస్పృహల్లో పడిపోయిన వారి ముఖతీరును గమనిస్తూ వారితో సంభాషణను ప్రారంభించాడు. వారు తమ బాధలను ఆయనకు చెప్పినప్పుడు, ఆయన వారి ఆలోచనలను దేవుని వాక్యంలోని ప్రవచనాలు మరియు వాగ్దానాల వైపు మళ్లించాడు, "లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" (లూకా 24:27) ఆయనతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు మాత్రమే శిష్యుల "కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి" (లూకా 24:31).
దుఃఖపు హృదయానికి బదులుగా, క్రీస్తు "(వారి) హృదయము (వారిలో) మండుచుండుటకు, మరొకసారి ప్రేరణ, నమ్మకము, మరియు నిరీక్షణ వారిలో పుంజుకోవడానికి కారణమయ్యాడు. (లూకా 24:32) ఇక్కడ ఆలోచనలో స్పష్టత ఆరోగ్యకరమైన భోజనం వల్ల కూడా రావడం ఎంత ఆసక్తికరం!
శిష్యులతో నడిచినట్లే, మీ దుఃఖ సమయంలో కూడా ప్రభువు మీ ప్రక్కనే నడుస్తున్నాడు. ఆయన తన సన్నిధిని మీకు కూడా బయలు పరచును. గాక!
అధ్యాయము - 5
నేను నా ప్రియమైన వ్యక్తిని పరలోకములో చూచెదనా?
పాచీన కాలం నుండి క్రైస్తవ ఆలోచనాపరులు ఆత్మహత్య యొక్క నిర్వచనం మరియు నైతికత గురించి చర్చిస్తూ వచ్చారు. క్రైస్తవ్యం యొక్క ప్రారంభ రోజుల్లో, హింసా మరియు హత్యాకాండ సాధారణమైనప్పుడు. హతసాక్షులు క్రీస్తు పట్ల వారి నిబద్ధతకు ప్రశంసలు అందుకున్నారు. ఏదేమైనా, క్రైస్తవ మతం యొక్క కనీసం ఒక్క ప్రారంధ శాఖ, (రోమన్ క్యాథలిక్ మతోన్మాద సంఘాలు) అయినా, తప్పుదారి పట్టించే అభిప్రాయంతో ముగిసిపోయాయి. కొందరు స్వచ్ఛందంగా పర్వతాలపై నుండి దూకేశారు. ప్రతిదాడిలో చంపడానికి అమాయకులైన బాటసారులపై కొందరు హింసాత్మకంగా దాడి చేశారు. న్యాయస్థానం ద్వారా మరణశిక్ష విధించబడడానికి కొందరు నేరాలకు పాల్పడ్డారు. 24
పలుకుబడి ఉన్న చర్చి ఫాదర్, అగస్టీన్ గారికి కూడా, తమను తాము పాపం చేయకుండా నిరోధించడానికి ఆత్మహత్యే ప్రభావవంతమైన మార్గంగా భావించిన క్రైస్తవుల గురించి రాసినప్పుడు ఇలాంటి సందర్భాలు మనస్సులో ఉండి యుండవచ్చు. బదులుగా, అగస్టీన్ వాదించాడు. వారు నరహత్య చేయకూడదనే ఆజ్ఞని ఉల్లంఘించడం ద్వారా వారు నిజంగా గొప్ప పాపం చేస్తున్నారు. 25
ప్రొటెస్టంట్ సంఘ సంస్కర్త జాన్ కాల్విన్ కాలంలో, ఆత్మహత్యకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘ వైఖరి తీవ్రతరమైంది. జెనీవా నగరంలో, మరణించినవారిని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఆత్మహత్య నిరుత్సాహపరచబడింది. మధ్య యుగాలలో, ఆత్మహత్యతో మరణించిన వారిని సంఘ స్మశానవాటికలలో ఖననం చేయడానికి అనుమతించలేదు, వారి వస్తువులను తరచుగా రాష్ట్రం జప్తు చేసింది. 26 ఆత్మహత్యాయత్నానికి సంఘం నుండి బహిష్కరణ ద్వారా శిక్ష విధించబడింది. 27
అటువంటి చరిత్రతో, చాలామంది కోల్పోయిన తమ ప్రియమైనవారి రక్షణ గురించి ప్రశ్నలు అడగడంలో ఆశ్చర్యం లేదు. ఆత్మహత్యకు క్షమాపణ ఉందా, లేదా పరలోకంలో తమ ప్రియమైన వారిని చూడటం సాధ్యమా అని వారు ఆశ్చర్యపడుతుంటారు.
ఒక పరిపూర్ణ దేవుడు
ముందుగా, దేవుడు ఎవరో మనం గుర్తుంచుకోవాలి. దేవుడు సంపూర్ణ నీతిమంతుడు, అంటే ఆయన పరిపూర్ణ ప్రేమగలవాడు. కీర్తన 89:14 ఈ లక్షణాలను ఒకదానితో ఒకటి ముడిపెడుతుంది "నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు."
దేవుని పరిపూర్ణ న్యాయం అంటే, బుద్ధిపూర్వకముగా మనమెరిగిన వాటి విషయమై మాత్రమే ఆయన మనల్ని జవాబుదారీగా ఉ దుతాడు. అపొస్తలుడైన పౌలు "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా "ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు" (అపొస్తలుల కార్యములు 17:30), యాకోబు, "మేలైనదిచేయ నెరిగియు అలాగు చేయనివానికి పాపము కలుగును" అని స్పష్టం చేశాడు (యాకోబు 4:17)
దేవుని పరిపూర్ణ ప్రేమ అంటే మనకంటే మనం కోల్పోయిన వారిని ఆయనే అనంతంగా ప్రేమిస్తాడు. వీరు వారి తల్లుల గర్భంలో ఆయన రూపింపజేసిన పిల్లలు (యిర్మీయా 1:5), ఆయన తన ఏకైక కుమారుని పంపినది వీరిని రక్షించడానికే (యోహాను 3:16, 17). దేవుడు ఎవరినైనా రక్షించగలిగితే, ఆయన తప్పక రక్షిస్తాడు.
పైగా, దేవుని తెలివి మరియు జ్ఞానం సంపూర్ణమైనది (కీర్తన 147:5, రోమీయులకు 16:27). ఆయన మనలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటాడు (కీర్తన 139), ఆత్మహత్య మనకు సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చవచ్చు. కానీ దేవుడు ఎన్నడూ కలవరపడడు.
ఆయన గొప్ప ప్రేమ కారణంగా, ఆయన పరిపూర్ణ న్యాయం కారణంగా, మరియు ఆయన సంపూర్ణ జ్ఞానం కారణంగా, మన ప్రియమైన వారి విషయమై మనం ఆయనను విశ్వసించవచ్చు. ఆయన ఉత్తమమైనది మరియు సరైనదే చేస్తాడు.
ఆత్మహత్య చేత తన ప్రాణాలు తీసుకున్న పురుషుడు లేదా స్త్రీ ఎవరైనా రక్షించబడతారా?
2001 లో, వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం)పై 9/11 దాడుల సమయంలో, భవనాలు పేలిపోయే ముందు పై అంతస్తులలో చిక్కుకున్న చాలా మంది వ్యక్తులు కిందకు దూకి మరణించారు. పగిలిన కిటికీల నుండి దూకుతున్నప్పుడు కొందరు చేతులు పట్టుకుని కూడా కనిపించారు. వారు ఎందుకు దూకారు? విమాన ప్రభావం మరియు భవనం మంటలతో కాలిపోవడంతో, తప్పించుకునే మార్గం లేదు, కొన్ని మీడియా నివేదికలు పేలుడు యొక్క తీవ్ర ఉష్ణోగ్రతను బట్టి ఈ చర్య సహజంగా జరిగినట్టు కూడా వర్ణిస్తున్నాయి.
ఇది సాంకేతికంగా ఆత్మహత్య అని మీరు వాదించవచ్చు, కానీ అదే సమయంలో, ఆ వ్యక్తులు కూడా అనివార్యమైన మరణానికి బాధితులయ్యారు. వారు తక్కువ నొప్పిని కలిగించే మార్గాన్ని ఎంచుకున్నారు. అటువంటి పరిస్థితిలో మనం ఎలా తీర్పు చెప్పగలం? ఆ సమయంలో వారి మనస్సులో ఏమి నడుస్తుందో దేవునికి మాత్రమే తెలుసు.
దేవుని స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత మనం తరచుగా ఎదుర్కొనే ప్రశ్నలకు తిరిగి వెళ్లాం. ఆత్మహత్యకు క్షమాపణ ఉందా? దేవుడు మన కొరకు కోరుకునేది ఆత్మహత్య కాదని, అది ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తుందనేది నిజం. కానీ ఆత్మహత్య అనేది క్షమించరాని పాపం అనే భావన వారి జీవితంలోని చివరి 60 నిమిషాల ఆధారంగా దేవుడు ప్రజలను తీర్పు తీర్చుతాడు అనే భావన నుండి వచ్చింది.
సేవ మరియు నిబద్ధతను కలిగి స్థిరమైన జీవితాలను గడిపిన అద్భుతమైన క్రైస్తవులు నాకు తెలుసు. కానీ వారు మానసిక వైకల్యాన్ని గూర్చిన సంకేతాలను చూపించడం ప్రారంభించారు, కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలు మారిపోతాయి. వారు కోపంగా మరియు కఠినంగా మారిపోయారు, కొన్నిసార్లు వారి కుటుంబాన్ని అసభ్యకరమైన మాటలతో కూడా ఆశ్చర్యపరిచారు. కాబట్టి, వారు ఎలా తీర్పు తీర్చబడతారు వారి చివరి అనారోగ్య స్థితి ద్వారానా లేదా వారి గత జీవితం ద్వారానా?
క్రైస్తవ రచయిత ఎలెన్ వైట్ గారు ఈ విధంగా చెప్పారు: "స్వభావము బహిర్గతమయ్యేది, అప్పుడప్పుడు చేసే మంచి పనులు మరియు అప్పుడప్పుడు చేసే చెడు పనుల ద్వారా కాదు, గాని అలవాటు పడిన మాటలు మరియు చర్యల యొక్క ధోరణి ద్వారానే. "28 ఒక వ్యక్తి యొక్క జీవిత మొత్తంలోని విశాల దృక్పథాన్ని దేవుడు ఒకరి మరణ సమయంలో ఒక ఘోరమైన ఒత్తిడి లేదా ఒక తప్పుడు చర్య ఆధారంగా తీర్పు తీర్చుతాడని నేను నమ్మను. మన జీవితకాలంలో మనం దేవుడితో ఎలా నడిచామన్నది మరింత ముఖ్యమైన విషయం.
మరోవైపు, ఒక వ్యక్తి తన జీవితపు చివరి గడియల్లో క్షమించబడే అవకాశాన్ని కూడా ఇది మినహాయించలేదు. యేసు ప్రక్కన సిలువ వేయబడిన ఒక జీవితకాల నేరస్థుడు, తన పాపం యొక్క గాంభీర్యతను ఒప్పుకొని, తనను జ్ఞాపకముంచుకోవాలని యేసును కోరినప్పుడు, యేసు తన హృదయపూర్వక పశ్చాత్తాపం చూసి, "నీవు నాతో కూడ పరదైసులో ఉందువని" వాగ్దానం చేసెను (లూకా 23:43) జీవితకాలపు తప్పుడు ఎంపికల తరువాత, దొంగ తన రక్షకుని వద్దకు నడిపించబడ్డాడు. అక్కడ అతను చనిపోతున్న పరిస్థితిలో కూడా, క్రీస్తు తన పాపాలను క్షమించాడు.ఆత్మహత్య అనేది సాధారణంగా తీవ్రమైన ఒత్తిడి, అసమతుల్య మానసిక రసాయనిక చర్యలు, రాజీపడే ఆలోచన మరియు విపరీతమైన -నొప్పి మరియు బాధ ఫలితంగా జరుగుతుంది. ఆత్మహత్యాయత్నం చేసేవారు సాధారణంగా అనేక సమస్యలను ఎదుర్కొని ఉంటారు. పైగా. ఈ చర్య కూడా "తరచుగా అధికంగా పెరిగిన దుర్బలత్వం లేదా భద్రతలేని కాలంలో సంభవిస్తుంది."29 ఒక అధ్యయనంలో, ఆత్మహత్యాయత్నాల నుండి బయటపడిన వారు ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయించుకున్న సమయానికి ఆత్మహత్యాయత్నం చేసినప్పటికి మధ్య ఎంత సమయం గడిచిందని ప్రశ్నించబడ్డారు. ఇరవై నాలుగు శాతం మంది "ఐదు నిమిషాల కంటే తక్కువ" అని సమాధానం ఇచ్చారు. 47 శాతం మంది "ఒక గంట లేదా అంతకంటే కొంచెం తక్కువ సమయంలో" ఆత్మహత్యాయత్నం చేశారు. 30 కొన్నిసార్లు, ఆత్మహత్య అనేది ఒక హఠాత్తు నిర్ణయం.
కొన్నిసార్లు, ఇది వ్యక్తి జీవిత స్వభావానికి అనుగుణంగా లేకుండా ఉండవచ్చు. ఒకానొక సందర్భంలో, ఒక సంఘ సభ్యుడు తీవ్రమైన ఆరోగ్య సమస్య నిమిత్తం అనేక మందులను తీసుకున్నాడు. మందులు అతని ఆలోచనాశక్తిని ప్రభావితం చేశాయి. ఒక రోజు, అతను మొత్తం బాటిల్ మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదృష్టం కొద్ది, చాలా అలస్యం కావడానికి ముందే అతను కనుగొనబడి రక్షించబడ్డాడు. తరువాత, అతను తన మనస్సుపై మందుల ప్రభావం లేకపోతే, అతను ఎన్నడూ ఆత్మహత్యాయత్నం చేసేవాడే కాదని అతను నమ్మాడు. "నేను సరిగ్గా ఆలోచించడం లేదు." అని అతను నాకు చెప్పాడు.
ప్రతి ఒక్క పరిస్థితి
చివరిగా, దేవుడు తన పరిపూర్ణ జ్ఞానం మరియు అపారమైన ప్రేమ ద్వారా ప్రతి ఒక్క పరిస్థితిని వ్యక్తిగతంగా నిర్ణయిస్తాడని నేను నమ్ముతున్నాను. యూదా మరియు సంసోను ఆత్మహత్యలను తీసుకోండి.
తన శిష్యుల గురించి ప్రార్ధించేటప్పుడు, యేసు ప్రత్యేకంగా యూదా గురించి ప్రస్తావించాడు: "లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు" (యోహాను 17:12).
మరోవైపు, హెబ్రీ పత్రికలో విశ్వాసవీరుల అధ్యాయంలో సంసోను కూడా ఉన్నాడు (హెబ్రీయులకు 11:32-34), సంసోను ఆత్మహత్య కూడా ఒక త్యాగమే - అతను ఇశ్రాయేలీయుల శత్రువులను జయించటానికి తన ప్రాణాలిచ్చాడు. ఫిలిష్తియుల దేవతాలయాన్ని కూల్చడానికి అతని బలాన్ని పునరుద్ధరించి, దేవుడే సంసోను ప్రార్ధనకు సమాధానమిచ్చాడు. (న్యాయాధిపతులు 16:28-30). సంసోను కేసును నిర్ధారించేటప్పుడు తీర్పులో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరి నిమిత్తం దేవుడు కోరుకునేది సమృద్ధి జీవమే, అన్ని పరిస్థితులలోనూ మనం ఆయనపై విశ్వాసాన్ని కోరుకోవాలని ఆయన కోరుకుంటాడు. కానీ చివరికి, తీర్పు దేవునిపై ఆధారపడి ఉంటుంది. ఆయన మాత్రమే మానవ హృదయాన్ని చదవగలడు, ఆ చివరి క్షణాల్లో ఉండేది దేవుడు మాత్రమే.
తరచుగా, ఆత్మహత్య ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోవడానికి ఆత్మహత్య నుండి బయటపడ్డవారు చాలా కాలం పాటు వారు కొల్పోయిన వారి గురించి ఆలోచిస్తారు. సమాధానాలు మరియు నిశ్చయత కొరకు ఎదురుచూస్తూ మీరు కూడా ఈ పరిస్థితిలోనే ఉండి యుండవచ్చు. ఆల్బర్ట్ సూ గారి మాటల్లో "మనకు పరిస్థితిపై పూర్తి అవగాహన లేదు. కానీ మన విరిగిన హృదయాలకు మరియు పగిలిన జీవితాలకు స్వస్థత మరియు పునరుద్ధరణను ఎలా తీసుకురావాలో తెలిసిన గొప్ప వైద్యుడు మనకున్నాడు."31 పరలోకం యొక్క ఈ వైపు, మనమెన్నటికీ నిశ్చయతకు చేరుకోలేకపోవచ్చు కానీ బైబిల్ మనకు నిరీక్షించడానికి కారణాన్ని అందిస్తుంది.మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు మీరు బాధపడుతుండగా, ఆయన మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచి నిలబెట్టగల దేవుడని నమ్మి. ఆయనపై అనుకొని, నిరీక్షణ వైపుకు రావాలన్నదే మీ కొరకైన నా ప్రార్ధన.
అధ్యాయము - 6 సహాయకులకు
ఇది ర్జెంట్ కెవిన్ బ్రిగ్స్ గారు గోల్డెన్ గేట్ (స్వర్ణ ద్వారం) వంతెన సమీపంలో కాలిఫోర్నియా హైవే పట్రోల్ (జాతీయ రహదారి గస్తీ కాసే) అధికారిగా 18 సంవత్సరాలు పనిచేశారు. అయితే, సుందరమైన శాన్ ఫ్రాన్సిస్కో చిహ్నానికి, ఒక చీకటి కోణం కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరిగే ప్రదేశాల్లో రెండవ స్థానాన్ని కలిగి ఉంది. అక్కడ తాను సర్వీసు చేసిన సంవత్సరాలలో, బ్రిగ్స్ 200 మందికి పైగా ప్రాణాలను కాపాడటంలో సహాయపడ్డాడు.
బాధించబడుతున్న వ్యక్తులతో మాటలు కలుపుకోవడానికి బ్రిగ్స్ సాధ్యమైన ప్రతి మార్గాన్ని ఉపయోగించాడు. వంతెన వేసవి మధ్యలో కూడా. చలిగా మరియు గాలులతో ఉండే ప్రదేశంగా ఉంటుంది. కానీ ఆత్మహత్య' చేసుకోవాలని వచ్చిన వ్యక్తి సగం చేతులు బట్టలు ధరించినట్లయితే, చలికి తట్టుకోవడానికి బ్రిగ్స్ తన జాకెట్‌ను కూడా తీసిచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో, చలికి కలిసి వణుకుతూ, "ఇదిగో, ఏవండీ, ఇక్కడ బాగా చలిగా ఉంది! మనమిక్కడి నుండి బయటకు వెళ్లి వేడివేడిగా ఏదైనా ఎందుకు తిని రాకూడదు?"32 అని చెప్తుండేవాడు.
ఒకానొక సంభాషణలో, బ్రిగ్స్ కెవిన్ బెర్తియాతో మాట్లాడాడు. అతను అప్పటికే రైలు పైకి దూకి, దిగువ ఇరుకైన ఒక దూలం మీద నిలబడి ఉన్నాడు. వారి సంభాషణ 90 నిమిషాలు కొనసాగింది, కానీ బ్రిగ్స్ నాలుగు లేదా ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాడు. మిగతా సమయమంతా, అతను వింటూ వచ్చాడు. "ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తితో వాదించడం, అతన్ని నిందించడం లేదా అతను ఎలా భావిస్తున్నాడో మీకు తెలుసని ఆ వ్యక్తికి చెప్పడం చేయవద్దు" అని బ్రిగ్స్ సూచిస్తున్నాడు. "మీరు కూడా బహుశా అలా చేయరని నమ్ముతున్నాను."33
కానీ బ్రిగ్స్ కూడా తన పూర్తి అనుభవంతో అందరినీ ఒప్పించి ఆపలేకపోయాడు. జేసన్ గార్బర్ న్యూజెర్సీకి చెందిన తెలివైన యువకుడు, అతను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేయడానికి గోల్డెన్ గేట్ వంతెనకు వెళ్లాడు. బ్రిగ్స్ తన మూడవ మరియు చివరి పర్యటనలో జేసన్‌ను కలిశాడు. వారి సంభాషణలో, జేసన్, రైలు కింద ఒక దూలం మీద కూర్చుని, ఒక వైపుకు వంగి పడిపోయాడు. ఆ ప్రదేశాన్ని అగ్ని సిగ్నళ్ల (సంకేతాలు) ద్వారా గుర్తించడానికి బ్రిగ్స్ ప్రక్రియను అనుసరించిన తర్వాత, నీటిలో రెండవ శవం గురించి అతనికి సిగ్నల్ ద్వారా హెచ్చరిక అందింది. అతను జేసన్ తో మాట్లాడుతుండగా, అప్పటికే మరొక వ్యక్తి వంతెనపై వేరే ప్రదేశం నుండి దూకాడు. నిపుణులు కూడా ప్రతి విషాదాన్ని నిరోధించలేరు. 34
హెచ్చరిక సంకేతాలు -
ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నప్పుడు గుర్తించడం. ఎల్లప్పుడూ సాధ్యం కాదు, కానీ కొన్ని సాధారణ హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తులు తమ పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేరని భావించి, నిరాశగా, నిస్సహాయంగా ఎందులోనో చిక్కుకున్నట్లుగా భావిస్తారు. వారు ఆత్మహత్య గురించి మాట్లాడటం లేదా "నేను చనిపోవాలని అనుకుంటున్నాను" వంటివి చెప్పడం మీరు వినవచ్చు. వారు ఇతరులకు భారం కావడం గురించి మాట్లాడవచ్చు. మానసిక స్థితిలో తక్షణ మార్పులు, ప్రమాదకర ప్రవర్తన మరియు దినచర్యలో మార్పులు కూడా సంకేతాలే. ఆత్మహత్య, చేసుకోవాలనుకునే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఇతరులకు వీడ్కోలు పలకవచ్చు. క్షమాపణ కోరుతూ వ్యక్తిగత లేఖలు వ్రాయవచ్చు, వారి వస్తువులను తిరిగి ఇవ్వవచ్చు లేదా సాధారణంగా వారి వ్యవహారాలను క్రమబద్ధీకరించవచ్చు. సామాజిక ఉపసంహరణ మరియు జీవితంలో ఆసక్తి కోల్పోవడం చాలా సాధారణం. అప్పుడు, వారి ఆత్మహత్య కొరకు ప్రణాళికలు ఏర్పడిన తర్వాత. వారి మానసిక స్థితి ప్రకాశవంతంగా మారడం సాధారణం, వారి నొప్పి, బాధ ముగుస్తుందని ఆలోచిస్తూ, వారు తరచుగా ఉపశమనం పొందుతారు.
నివారణ చర్య దశలు
నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్టైన్ (జాతీయ ఆత్మహత్య నివారణ సహాయక కేంద్రం), మరియు నేషనల్ యాక్షన్ అలయన్స్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (జాతీయ ఆత్మహత్య నివారణ చర్య మండలి) ఆత్మహత్య గురించి అలోచిస్తున్న వారితో మాట్లాడటానికి క్రింది ఐదు సాక్ష్యాధారిత దశలను అందిస్తుంది :35
1. అదగండి
కొన్నిసార్లు సంబంధిత మరియు శ్రద్ధగల వ్యక్తులు ఆత్మహత్య అంశాన్ని తీసుకురావడానికి భయపడతారు. మనం అక్కడ లేని ఆలోచనలను నాటుతున్నామా అని, అభ్యంతర పరుస్తున్నామా అని లేదా ఊరకనే ఆ విషయానికి భయపడుతున్నాము. కానీ ఎవరినైనా ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నారా అని అడగడానికి చొరవ తీసుకోవడం ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ద్వారాన్ని తెరుస్తుంది.
"మీరు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా?" అని అలా అడగటం తీర్చు లేకుండా మీరు దాని గురించి మాట్లాడవచ్చని చూపిస్తుంది. తరువాత,అర్థం చేసుకునే లక్ష్యంతో వినండి. ఆత్మహత్య ఆలోచనలను రహస్యంగా ఉంచుతామని ఎప్పుడూ హామీ ఇవ్వకపోవడం కూడా చాలా ముఖ్యం.
ఆత్మహత్యాయత్నం నుండి బయటపడిన కేథరీన్, "నేను కోరుకున్నది... నేను చెప్పేది చెప్పడం పూర్తయ్యే వరకు, అంతరాయం లేకుండా వినాలి. నేను కోరుకున్నది తీర్పు లేదా ఆందోళన లేదా ఆస్పత్రి పాలవ్వడాన్ని గురించి బెదిరింపులు కాదు. నేను ఎలా భావిస్తున్నానో ప్రజలకు తెలుసన్న విషయం నాకు చెప్పబడాలనుకోలేదు, ఎందుకంటే అది అబద్ధం మరియు అసంతృప్తి. నా తల లోపల చిక్కుకున్న ఆలోచనలన్నింటినీ గాలికి వదిలెయ్యాలని నేను కోరుకున్నాను, తద్వారా అవి నన్ను ఒంటరిగా వదిలేస్తాయి”36 అని చెప్పెను.
2. అందగా ఉందండి.
సామాజిక సంబంధాల నుండి వ్యక్తి ఉపసంహరణను తిప్పికొట్టడానికి మీరు చేయగలిగినది చేయండి: వ్యక్తితో, వ్యక్తిగతంగా, ఫోలి లేదా మరేదైనా విధంగా అందుబాటులో ఉండండి. అయితే, మీరు చేయలేని పనికి. 'పాల్పడకుండా చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా అక్కడ అందుబాటులో లేనట్లయితే, ఇంకా ఎవరు ఉండవచ్చనే దాని గురించి వారితో మాట్లాడండి. ఇక్కడ మళ్లీ, వారికి సహాయంగా ఉండటానికి ఎవరిని వారు విశ్వసిస్తారో వారి అభిప్రాయాలను వినండి.
ప్రాణాలతో బయటపడ్డ మరొక వ్యక్తి పెన్నీ ఇలా చెప్తున్నారు, "నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నాతో సమయం గడపడానికి నాకు మనుష్యులు అవసరం, తద్వారా వారు నా గురించి క్రమం తప్పకుండా శ్రద్ధ వహిస్తారు. నన్ను పిలవండి, నాకు ఫోన్ చేయండి, రండి, నన్ను బయటకు ఆహ్వానించండి. నేను పూర్తిగా వికర్షకంగా, ప్రేమించబడని వ్యక్తిగా, అసహ్యంగా భావించాను. వారు నా గురించి పట్టించుకున్నారని ప్రజలు చెప్పడం చాలా బాగుండేది, ప్రజలు తమ ప్రేమను వారి క్రియలలో చూపిస్తే ఇంకా బాగుండేది."37
పెరుగుతున్న సంబంధం అనేది ఆత్మహత్య ఆలోచనలు క్రియారూపం. దాల్చకుండా నిరోధించే నివారణ చర్య
3. వారిని సురక్షితంగా ఉంచండి
ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారని మీరు కనుగొన్న తర్వాత. మరింత సమాచారం అవసరం. వ్యక్తి ప్రణాళిక ఎంత వివరంగా ఉంది. - తేదీ, సమయం, పద్ధతి ఉందా? ఈ ప్రణాళికను అమలు చేయడానికి వ్యక్తికి మార్గం ఉందా? వ్యక్తి గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా అత్మహత్యాయత్నం చేశాడా?
తరువాత, ఆత్మహత్యాయత్నంలో ఉపయోగించే అంశాలను తీసివేయండి. "వ్యక్తికి మరియు వారు ఎంచుకున్న పద్ధతికి మధ్య సమయం మరియు దూరం, ప్రత్యేకించి అధిక ప్రాణాంతకతను చూపించిన పద్ధతులు (తుపాక్షీ మరియు మత్తుమందులు వంటివి) 38 దూరం చేయడానికి మీరు “వేయగలిగినదంతా చేయండి.
కౌన్సిలర్ జెన్నిఫర్ జిల్ ష్విర్టర్ గారి వెబ్సైట్ ఆత్మహత్యను నిరోధించడానికి అనేక వనరులను ఈ సంక్షిప్రనామం TIPM.AP. (టిష్యూప్) తో సహా అందిస్తుంది. ఏ సమాచారాన్ని సేకరించాలో "గుర్తుంచుకోవడంలో ఇది సహాయపడగలదు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తికి ఆత్మహత్యకు ప్రయత్నించిన థాట్స్ (ఆలోచనలు), ఇంటెన్షన్స్ (ఉద్దేశాలు) ఫాన్స్ (ప్రణాళికలు),
మెరెడ్ (పద్ధతి), యాక్సెస్ (లధ్యత) లేదా పాస్ట్ హిస్టరీ (గత చరిత్ర) ఉందా? 39 వృత్తి ప్రణాళికలో మరింత ముందుకు వెళితే, అతను లేదా ఆమె మరింత ప్రమాదంలో ఉంటారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని మీకనిపిస్తే, వీలైనంత త్వరగా శిక్షణ పొందిన నిపుణుడి నుండి సహాయం పొందండి. దీన్ని మీ సొంతగా నిర్వహించడానికి ప్రయత్నించవద్దు. 9152987821 లేదా 9820466726 కి కాల్ చేయండి. లేదా తెలంగాణ రోషిణి సూసైడ్ ప్రివెన్షన్ లైఫన్ నంబర్ 040-66202000 కి ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య కాల్ చేయండి.
4. వారికి అందుబాటులో ఉండేలా సహాయపడండి
కొనసాగుతున్న సహాయసహకారాలు అందుబాటులో ఉండేలా వ్యక్తికి సహాయపడండి. ముందుగా సహాయక కేంద్రం ఫోన్ నంబరుతో ప్రారంభించడం మంచిది. మానసిక ఆరోగ్య నిపుణుడిని చూడటం మరియు అతని లేదా ఆమె సమాజం అందించే ఇతర మానసిక ఆరోగ్య వనరులను కనుగొనే ఆలోచనను కూడా మీరు వ్యక్తితో కలిసి అన్వేషించవచ్చు. అదనంగా, అతని లేదా ఆమె ఆత్మహత్య ఆలోచనలు మళ్లీ ప్రారంభమైనప్పుడు వ్యక్తి అనుసరించాల్సిన "భద్రతా ప్రణాళిక 40 ను క్రియాశీలంగా ఏర్పాటు చేయండి.
5. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోంది
ఆత్మహత్యాయత్నాల నిమిత్తం చికిత్స పొందిన రోగులకు, వారి ఆరోగ్య సంరక్షణ నిపుణుడు నుండి సాధారణ సంప్రదింపు ఉత్తరాలు అనుసరించడం ద్వారా ఇక ముందు జరగబోయే ప్రయత్నాలను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు శ్రద్ధ వహిస్తారంటానికి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడమే సాక్ష్యం. వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి కాల్ చేయండి, మెసేజ్ చేయండి లేదా దర్శించండి. మీరు అతని లేదా ఆమె కొరకు ఇంకా ఏదైనా చేయగలరా అని అడగండి, అతడికి లేదా ఆమెకు సహాయం చేయడంలో మీరు సాధించిన పురోగతిని లేదా మెరుగుదలను వ్యక్తికి తెలియజేయండి. మేమందరము ఇక్కడనే యున్నాము.
భూగ్రహం యొక్క ఉత్తర లేదా దక్షిణాన నివసించే వారికి, అంధకార దీర్ఘకాల శీతాకాలాలు దీర్ఘకాలిక ఒత్తిడి కలిగించే కాలాలు కావచ్చు. నార్వేలోని జుకాన్ అనే సుందరమైన గ్రామం లోతైన లోయలో ఉంది, ఇక్కడ పర్వతాలు సంవత్సరానికి ఆరు నెలల వరకు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. ఇది 3,400 మంది గ్రామ నివాసులను చల్లని నీడలో ఉంచుతుంది, కొన్నిసార్లు శీతాకాలంలో చీకటిని అణచివేస్తుంది. కానీ 2013 అక్టోబర్ నెలలో, ఒక స్థానిక కళాకారుడు శతాబ్దం నాటి ఆలోచనను పునఃసమీక్షించినప్పుడు, పట్టణానికి దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై సుమారు 550 చదరపు అడుగుల అద్దాల శ్రేణిని జుకాన్ గ్రామం ధరించుకుంది. కంప్యూటర్ నియంత్రిత మరియు సౌరశక్తితో పనిచేసే అద్దాలు శీతాకాలంలో సూర్యుని జాడను పట్టుకొని పట్టణంలోని చౌరస్తాలో ఒక పెద్ద సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. మీరు నేడు శీతాకాలంలో జుకాన్ గ్రామాన్ని సందర్శిస్తే, ప్రతిబింబించే సూర్యరశ్మిలో స్నానం చేయడం, పట్టణ కూడలిలో ప్రజలు గుమిగూడడాన్ని మీరు తరచుగా చూడవచ్చు.
పర్వతంపై ఉన్న అద్దాల మాదిరిగానే, క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు వెలుగును, ఆత్మహత్య చీకట్లో చిక్కుకున్న వారికి నిరీక్షణ వెలుగును ప్రతిబింబించాలని బైబిల్ చెప్పుచున్నది.
అపొస్తలుల కార్యములు గ్రంథములో, మనము ఫిలిప్పీ చెరసాలలో పౌలు మరియు సీలయు యొక్క జైలు జీవితకథనాన్ని చదువుతాము. "బెత్తములతో" కొట్టిన తరువాత ఇద్దరు క్రైస్తవులను చెరసాల నాయకుడు "లోపలి చెరసాలలోనికి" త్రోసివేసెను (అపొ. కార్యములు 16:22, 24) కాని పౌలు సీలయు ఓడిపోకుండా, ఇతర ఖైదీలు వింటుండగా, రాత్రి వరకు దేవునికి కీర్తనలు పాడి స్తుతించారు. అప్పుడు, అకస్మాత్తుగా, వారి చుట్టూ ఉన్న ప్రతిచోటు కంపించడం ప్రారంభమైంది. ఇది "మహా భూకంపము", దాని తాకిడికి చెరసాల పునాదులు అదిరి తలుపులన్ని తెరుచుకున్నాయి. అందరి బేడీలు బంధకములు ఊడెను (అపొ. కార్యములు 16:26). భూకంపం ఆగిపోయిన తర్వాత, ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయారని సహజంగానే అనుకొని, తన పై అధికారులకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆ చెరసాల నాయకుడు, "కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను" (అపొ. కార్యములు 16:27, 28).
చెరసాల నాయకుడు లోపలికి పరిగెత్తి అతని ఆశ్చర్యానికి, ఖైదీలందరూ తమ చెరసాలలోనే ఉన్నట్టుగా కనుగొన్నాడు. పౌలు సీలయు చాలా శక్తివంతమైన మరియు స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నట్లు అతను చూశాడు, ఆ ప్రేమ అతను కూడా కావాలనుకున్నాడు. అతను వారిని అడిగిన ఒక ప్రశ్న: "అయ్యలారా, రక్షించబడటానికి నేనేమి చేయవలెను?" (అపొ. కార్యములు 16:30) పౌలు సీలయు "అందుకు ప్రభువైన యేసు వందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు ... రక్షణ పొందుదువని" చెప్పెను (ఆ). కార్యములు 16:31), చెరసాల నాయకుడు చూసిన ప్రేమ లోకానికి గొప్ప రక్షకుడైన క్రీస్తు ప్రేమ. చెరసాల నాయకుడు విశ్వాసముంచాడు. "వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి" (అపొ. కార్యములు 16:33).
దేవుడు మనల్ని పౌలు వంటి స్థితిలో - ఆత్మహత్య అంచున ఉన్నవారిని పిలిచేంత దగ్గరగా ఉంచి యుండవచ్చు. చాలా బాధలో ఉన్నవారికి, దయచేసి "నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా" చెప్పే సంఘం కావాలి. మరీ ముఖ్యంగా, వారికి నిజమైన కుమారుడు (క్రీస్తు) నుండి వెలుగును ప్రతిబింబించి, వారి దృష్టిని మన గొప్ప రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు మళ్లించే సమాజం కావాలి.
"మీరు లోకమునకు వెలుగైయున్నారు, కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:14-16).
వేరొకరి జీవితంలో ఆ సహాయక ఉనికిగా ఉండాలనే మీ కోరికను బట్టి నేను దేవునిని స్తుతిస్తున్నాను! ఆయన మీ ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేసి వాటిని విజయవంతం చేయును గాక, ఆమేన్!

