విషయ సూచిక

1. ఋణము ఒక వ్యక్తిని ఏమి చేయును
2. ఋణము దాస్యత్వమును తెచ్చును
3. ఋణము ఆందోళన కలిగించును
4. మనకు ఋణము ఎందుకున్నది
5. పొదుపులేని ఋణము : దీనిని నివారించడం ఎలా
6. ఋణము పాపమా?
7. మీ మాట నిలబెట్టుకొనుడి
8. నిర్వహణలేని ఋణము : దీని నుండి బయటపడడం ఎలా
9. అవసరమైన ఋణము
10. అతి ముఖ్యమైన ఋణము
11. ఋణ క్షమాపణ

ఋణము నుండి విమోచన

రుణం లేదా అప్పు. ఇది ఒక రోత పదం లాగా ఉంది, కదూ?
ఇది మనకున్న ప్రతిదానిలోనూ మనం చేసే ప్రతిదానిలోనూ - మన ఇళ్లు, మన పాఠశాలలు, మన తీరిక సమయం మరియు మన రవాణా మార్గాల్లో తొలగించలేని భాగమైపోయింది. ఇది మన ప్రభుత్వ పని విధానంగా కూడా కనిపిస్తుంది. భారతదేశం ఇప్పుడు- స్వదేశీ అప్పుల్లోనే కాదు విదేశీ అప్పుల్లో కూడా వందల బిలియన్లకు చేరుకుంది. 2021 మార్చి చివరి నాటికి భారతదేశ విదేశీ రుణం లేదా అప్పు 570 బిలియన్ డాలర్లు. ఇది 2020 మార్చి చివరి నాటి స్థాయి కంటే బిలియన్ డాలర్ల పెరుగుదలను నమోదు చేసింది. దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

అంతేకాకుండా, వాహన రుణాలలో, దేశ పౌరులు చెల్లించాల్సిన అప్పు, విద్యార్థుల రుణ అప్పు (విద్య లోన్లు), మరియు తనఖా రుణం, వందల కోట్లకు చేరుకుంది.

ఇవి మనం సాధించాలనుకుంటున్న రికార్డులు కాదు. -కదా? కాబట్టి మన - వ్యక్తిగత జీవితంలో ఎందుకు అంత అప్పు లేదా రుణముంది? రుణం ఎందుకు ప్రమాదకరమైన, ప్రాణాంతక కణితిలా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది? నిజానికి, రుణం - అనేది - సాధారణ జీవితంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇంటర్నెట్ లాగా ఒక భాగం మాత్రమే అని అనుకునేలా కూడా మీరు శోధించబడవచ్చు.

అలా అనుకోకండి! - అప్పుల భారం కింద బతకడానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. ఆర్థిక వ్యవహారాలకు సువార్తతో సంబంధం లేదని మీరు అనుకుంటూ ఉండవచ్చు, కానీ బైబిల్లో 500 కంటే ఎక్కువ వచనాలు ఆర్థిక స్థితి మరియు ఆస్తిపాస్తులను సూచిస్తాయని మీకు తెలుసా? యేసు బోధించిన 38 ఉపమానాలలో 16 ఆర్థిక మరియు ఆస్తి నిర్వహణ గురించి చర్చిస్తాయని మీకు తెలుసా?

కాబట్టి క్రైస్తవులుగా మనం రుణాన్ని ఎలా చూడాలి మరియు దానిని మన జీవితంలో ఎలా ఎదుర్కోవాలి? లేఖనాలు సమాధానాన్ని ఎలా అందిస్తున్నాయో చూద్దాం.

1. ఋణము ఒక వ్యక్తిని ఏమి చేయును

ప్రజలు విస్మరించే అన్ని సమస్యల్లాగే, అప్పు కూడా పెద్దదిగా ఇంకా పెద్దదిగా పెరుగుతూనే ఉంది. ఒక వ్యక్తిని అణిచివేసే వరకు దానితో వేగలేనంత భయంకరంగా అది మారుతుంది.

నివేదికలు, కథనాలు మరియు వెబ్పేజీలు కొన్నేళ్లుగా ఇదే విషయాన్ని గొంతెత్తి చెబుతున్నాయి: అప్పుల బాంబు పేలుతుందా లేదా లోపలే భగ్గుమంటుందా అనేది ప్రశ్న కాదు - కానీ అది ఎప్పుడు అనేది ప్రశ్న, భారతదేశం - సమీప భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు పర్యవసానాన్ని ఎదుర్కోకుండా మరింత ఎక్కువ డబ్బును అప్పుగా తీసుకోలేదు. కానీ అది సమిష్టిగా దేశానికి మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఎదురవుతుంది. కారు నేరుగా గోడ వైపు వేగంగా దూసుకెళ్తున్నట్లు, మనం ఒక తప్పని ప్రమాదం వైపు వెళ్తున్నాము.

భయంకరంగా ఉంది, కదా? అయితే మనమిప్పుడు ఏమి చేయాలి? సరే, అప్పుల సమస్యతో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సమాధానమివ్వాలంటే, మనం మొదట ఈ స్థితికి ఎలా చేరుకున్నామో ముందుగా తెలుసుకోవాలి.
ప్రాధమిక విషయాలతో ప్రారంభిద్దాం రుణం లేదా అప్పు అంటే AG ఏమిటి. అది మీకు మరియు మీ కొరకు ఏమి చేస్తుంది?

2. ఋణము దాస్యత్వమును తెచ్చును

అప్పు చేయడం వల్ల మనకు రెండు విషయాలు లభిస్తాయి.

2. ఆ వస్తువు లేదా సేవను పొందడంలో మనకు సహాయపడిన వ్యక్తి, మధ్యవర్తి లేదా సంస్థకు కట్టుబడి ఉండుట.

ఆ కట్టుబాటు ఒప్పందంతో సమానంగా ఉంటుంది, దీనిలో రుణగ్రస్తులుగా మీరు, ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరు రుణస్తుడి యొక్క నియంత్రణలో ఉంచుకుంటారు.

అంటే, ఒక కోణంలో, ఆ అప్పు ఒక రకమైన దాస్యత్వం లేదా బానిసత్వం. (రుణాన్ని లేదా అప్పును పెద్ద బంతిగా, అప్పు చేసినవాడిని గొలుసుకు కట్టి చిత్రీకరించిన అనేక చిత్రాలలో ఒకదాన్ని మీరు బహుశా చూసి ఉండవచ్చు.) సామెతలు 22:7, "ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు" అని చెప్పుచున్నది. అప్పుచేయువాడు సమర్ధవంతంగా అప్పిచ్చినవానికి కట్టుబడి ఉంటాడు లేదా దాసుడై యుంటాడు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన దృష్టాంతం ఉంది. 2 రాజులు 4వ అధ్యాయంలో, అప్పు చేసిన ఒక విధవరాలు సహాయం కొరకు ఎలీషా ప్రవక్తను వెతుకుతుంది. ఆ రోజుల్లో, అప్పు చెల్లించలేకపోతే, అప్పిచ్చినవాడు ఆస్తిని మాత్రమే కాకుండా ప్రజలను స్వాధీనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ విధవరాలు కూడా అటువంటి రుణగ్రస్తురాలే. ఆమె భర్త అప్పు చేశాడు, కానీ అతను దానిని తిరిగి చెల్లించకముందే మరణించాడు. ఆనవాయితీ ప్రకారం. అప్పు చెల్లించడానికి డబ్బులేని ఆ విధవరాలిపై అప్పుభారం పడింది. నిరాశతో, ఆమె రోదించింది, "అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడు”

(2 రాజులు 4:1). ఆమె కుటుంబ సభ్యులు మాట ప్రకారం "అప్పులవానికి దాసులు”గా ఉంటారు.

మీ జీవితంలో అప్పు నియంత్రించే అంశం అయినప్పుడు, ఏ ఇతర రంగానికి మినహాయింపు ఉండదు. జూదమాడి 5 లక్షల డాలర్లు అప్పు చేసిన ఒకామె నాకు తెలుసు. ఆమె భయాందోళనకు గురై, భయపడి నిరాశకు గురైంది. జూదం కొనసాగించడానికి ఆమె తన భర్త నుండి కూడా డబ్బు దొంగిలించింది. ఆమెకు ఈ భారీ అప్పు ఉండటం మాత్రమే కాదు, ఈ అప్పు ఆమె బంధాలను, ఆమె వివాహ జీవితాన్ని మరియు ఆమె ప్రాధాన్యతలను కూడా ప్రభావితం చేసింది. ఇది జీవితమంతా ఆమెను వెంటాడే శక్తిగా మారింది!

ఒక ఉన్నత విద్యార్థిని (గ్రాడ్యుయేట్) ఇటీవల పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసుకొని పట్టభద్రురాలైంది. ఆ క్రమంలో, ఆమె విద్యార్థి రుణాలలో 1 లక్ష డాలర్లు సేకరించింది. తరువాత లా స్కూల్ (చట్టానికి సంబంధించిన చదువు)కు నమోదు చేసుకోవడం ఆమె ప్రణాళిక, కానీ ఆమె అప్పుల కారణంగా, నమోదు చేయలేకపోయింది. బదులుగా, ఆమె తన తల్లితో కలిసి వెళ్లి గ్రాఫిక్ డిజైనర్గా ఉద్యోగం సంపాదించింది. నిస్సందేహంగా, తన విద్యను పూర్తి చేసి, ఆపై ఆ అప్పును తిరిగి చెల్లించడానికి ఆ విద్యను ఉపయోగించాలనుకోవడం ఆమె ప్రణాళిక.
కానీ అప్పు ఆమె నిర్మిస్తున్న భవిష్యత్తు గమనాన్ని మార్చేసింది! ఇప్పుడు. దీని అర్ధం మీరు చదువుకోకూడదని కాదు, కానీ, అప్పు మీ జీవితాన్ని నియంత్రించడానికి మీరు అనుమతించకూడదని దీని అర్థం.

వాస్తవం ఏమిటంటే మనం దేనికైనా లేదా ఎవరికైనా దాసులుగా ఉన్నప్పుడు, మనం దేవునిని సేవించడం అసాధ్యం. మత్తయి 6:24, "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు" అని చెప్పుచున్నది. సిరి లోక సంపదకు లేదా ప్రాపంచిక సంపాదనకు సంబంధించిన పదం. మీకు డబ్బు మరియు వస్తువుల అవసరం దేవుని చిత్తానికి లోబడాలనే మీ తపనను అధిగమిస్తే, అది పెద్ద సమస్య అని బైబిల్ సూచిస్తుంది. ఆ అవసరం మిమ్మల్ని మరింతగా అప్పుల్లోకి నెట్టడానికి ప్రేరేపిస్తే, జూదం అలవాటున్న మహిళ లాగా, అది మీ జీవితానికి దేవుని చిత్తం కాదని మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

3. ఋణము ఆందోళన కలిగించును

ఆందోళన అనేది అప్పుడు అత్యంత దగ్గర మిత్రుడు. 65 శాతం మంది భారతీయులు తమ ఒత్తిడికి అతిపెద్ద మూలకారణంగా డబ్బును చూపిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అప్పు కూడా ఉంది. మీరు కోరుకున్న వస్తువు లేదా సేవను పొందడం వలన మీరు తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు, కానీ దానితో పాటు బంకలా అంటుకుపోయే ఆందోళన ఆ ఆనందం తీరిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉంటుంది.

కవి హెలెన్ స్టైనర్ రైస్ గారు దీనిని ఇలా వివరిస్తున్నారు.
ఆందోళన? ఎందుకు ఆందోళన? ఆందోళన ఏమి చేయగలదు? అది మిమ్మల్ని అధిగమించకుండా ఇబ్బందిని ఎన్నడూ ఆపలేదు.

అది మీరు తిన్న ఆహారాన్ని అరగకుండా చేసి రాత్రుళ్లు నిద్రలేని గడియల్ని ఇస్తుంది,

మరియు ప్రశాంతంగా ప్రకాశవంతంగా గడిచే రోజులను చీకటితో నింపుతుంది.

అది మీ ముఖంలో కోపాన్ని మీ మాటల్లో చిరాకును రేకెత్తిస్తుంది.

మీరు ఇతరులతో జీవించడానికి అనర్హులు మరియు ఒంటరిగా జీవించడానికి కూడా అనర్హులు అనే భావనకు మిమ్మల్ని తీసుకొస్తుంది.

అప్పు ఉండటాన్ని గూర్చి. అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని గూర్చి మరియు మీరు అప్పు చెల్లించలేకపోతే ఏమి జరుగుతుందో అనేదాన్ని గూర్చి ఆందోళన మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆందోళన దానితో పాటు ఒత్తిడి, భయం మరియు నిరాశను కూడా తెస్తుంది. అప్పు మీ స్వభావాన్ని కూడా. ప్రభావితం చేయవచ్చు. అది మిమ్మల్ని ఇతరుల పట్ల అసహనానికి గురి చేస్తుంది. ఆందోళనను కదిలించే ప్రయత్నంలో ధూమపానం లేదా మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడానికి ఇది మిమ్మల్ని దారి తీస్తుంది. మీరు ప్రారంభంలో వస్తువు కొరకు అప్పు చేసినప్పుడు లేదా రుణపత్రంపై సంతకం చేసినప్పుడు మీరు బేరమాడిన దానికంటే ఇది చాలా ఎక్కువగానే ఉండవచ్చు. అన్నింటికన్నా దారుణం, ఆందోళన మీ అప్పు తీర్చే సమస్యను పరిష్కరించదు. అది చేసేదల్లా మీ జీవితమంతటిని అప్పుల బలానికి లొంగిపోయేలా చేయడమే.

ఈ విధంగా, అప్పు మీకు కావలసినదాన్ని తెచ్చిపెట్టినా, దానితో పాటు ఆందోళన మరియు బానిసత్వం లేదా దాస్యత్వాన్ని కూడా తెస్తుంది. వాస్తవానికి, అది మీ జీవిత పూర్తి గమనాన్ని అధ్వాన్నంగా మార్చే అవకాశం ఉంది. ఇది కొంచెం కూడా ఆకర్షణీయంగా అనిపించదు, మరియు ఖచ్చితంగా ప్రజలు ఇష్టపూర్వకంగా తమకు తాముగా తెచ్చిపెట్టుకునే విషయం కాదు.

మరి అలాంటప్పుడు మనకెందుకు అంత అప్పు ఉంది?!

4. మనకు ఋణము ఎందుకున్నది

మనం వినియోగదారుల యుగంలో జీవిస్తున్నాము, ఇక్కడ తక్షణ సంతృప్తి ఉండటం మాత్రమే కాదు. అది సాగు చేయబడుతూ ఆశించినదిగా ఉంది. మనం ఆన్లైన్లో ఒక బటన్ని క్లిక్ చేస్తే చాలు మరుసటి రోజు లేదా కొన్నిసార్లు అదే రోజున ఆ వస్తువు మన ఇంటి గుమ్మం వద్దకే డెలివరీ లేదా బట్వాడా చేయబడుతుంది. ఆన్లైన్ సెర్చ్ ఫారమ్ (ఇంటర్నెట్ అన్వేషణ వేదిక)లో వర్డ్ స్ట్రింగ్ (పదాల సమాహారం) పెట్టడం ద్వారా వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రకటనలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా కొనడానికి మనం ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వస్తువులను ఇంకా చాలా వాటిని పొందడం సులభమైపోయింది.
అయినను లౌకిక వస్తువులు మనకు సంతోషాన్ని కలిగించవని పరిశోధనలో తేలింది. నిజానికి, పెరుగుతున్న ప్రజల సంఖ్య లౌకిక వస్తువుల 'కంటే అనుభూతుల కొరకు డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే వస్తువులపై డబ్బు ఖర్చు చేయడం సంతోషాన్ని తెస్తుందనే ఊహ అపోహ మాత్రమే. భౌతిక వస్తువుల నుండి వచ్చే ఆనందం త్వరగా మసకబారుతుంది. కానీ గడిపే క్షణాలు మరింత గుర్తుండిపోయేవి, అనుభవాలు మన ప్రపంచంలోకి ద్వారాలు తెరుస్తాయి.

1. https://www.entrepreneur.com/article/294163

భారతదేశంలో, ప్రభుత్వం నుండి సాయం పొందుతున్న కొంతమంది ప్రజలు సొంత స్మార్ట్ఫోన్లు మరియు డిజైనర్ హ్యాండ్బ్యాగులు వాడుతున్నారు. వారికి ఉద్యోగాలు లేవు, కానీ వారికి విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. మనం ఎక్కడో కాస్త వెనుకబడినట్లు అనిపిస్తుంది, కాదంటారా? ఎక్కడో ఒకచోట, జీవితంలో అవసరమైనవి - ఏమిటో అనవసరమైనవి ఏమిటో, నిర్వచించడం అస్పష్టమైపోయింది. మనం కోరుకున్నప్పుడు మనకు కావలసినది పొందడం అనేది సహజమే అయిన సమాజంలో మనం జీవిస్తున్నాం. కానీ లేఖనాలకు సమస్తం చాలా బాగా తెలుసు : "శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును” (సామెతలు 21:5). మనకు లేనిదే స్వీయ నియంత్రణ లేదా ఆశానిగ్రహం. అది లోపలి నుండి బయటికి మనల్ని నాశనం చేస్తుంది.

వాస్తవానికి, అప్పు సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. యోబు తన నియంత్రణకు మించిన పరిస్థితుల వల్ల అప్పుల పాలైయ్యాడు.
సహాయం కొరకు ఎలీషా వద్దకు వెళ్లిన విధవరాలు ఆమె రుణాన్ని లేదా అప్పును వంశపారంపర్యంగా పొందింది. కానీ మనం ఉద్దేశపూర్వకంగా తెలివిగా మన అప్పులను చాలా వరకు ఎంచుకుంటాము. ఇది క్రెడిట్ కార్డ్ కంపెనీలు వస్తువులను కొనమని మనల్ని హింసించినట్లు కాదు. “నాకు ఇది నిజంగా అవసరమా?” అని మనల్ని మనం అరుదుగా ప్రశ్నించుకుంటాం. భవిష్యత్తులో ఏదో ఒక అస్పష్ట స్థితిలో, ఎప్పటికో అప్పు చెల్లించడం వల్ల కలిగే అసౌకర్యాన్ని మనం ఎదుర్కోగలమని ఆలోచిస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటాము. ఎప్పటికో అనుకుంటూనే సమస్య అనివార్యంగా ఇప్పటిదిగా మారుతుంది. మనం కొనుగోలును హేతుబద్ధీకరించడంలో లేదా సమర్ధించడంలో సమర్థులం ఇది అమ్మకానికి ఉంది. రేటు తక్కువే అనుకుంటాం టాం - కానీ మనం అదే డబ్బుతో వేరే ఏదైనా మేలుకరమైనది చేయగలమా అని అరుదుగా మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.

సాంస్కృతిక లేదా సామాజిక వివాదంలో పడటం కూడా చాలా సులభమే. అప్పు ఇప్పుడు జీవితంలో సాధారణమైన భాగంగా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతిఒక్కరికీ ఏదో ఒక రకమైన అప్పు ఉన్నట్లు అనిపించవచ్చు, అప్పు ఒక అవసరమైన భూతం అనే భావనకు మీరే రాజీనామా చేసి ఉండవచ్చు. అది కాదు. జీవితంలో ఎక్కువకాలం లేదా మీ జీవితమంతా అప్పులపాలై ఉండటం అనేది మీరు చేసుకునే ఎంపికే.

దేవుడు వాగ్దానం చేసిన మెరుగైన జీవితం కొరకు ఓపికగా ఎదురు చూడాలని బైబిల్ మనకు సూచిస్తుంది. "ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, 5.8) మీ హృదయములను స్థిరపరచుకొనుడి" (యాకోబు 5:8)
క్రీస్తు. "ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను" అని మనకు చెప్పుచున్నాడు. (మత్తయి 16.24). దేవుని వెంబడించువారి గురించి ఇలా చెప్పబడింది. "వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని అయితే వారు ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచి యున్నాడు” (హెబ్రీయులకు 11:13, 16).

విలువైన వస్తువులను సేకరించడం కోసం మనం ఈ జీవితాన్ని గడపకూడదు, దేవునితో మన భవిష్యత్తు జీవితం కోసం మన హృదయాలను, మనస్సులను, మన స్వభావాలను సిద్ధం చేసుకోవడంలో మనం దానిని వెచ్చించాలి. భవిష్యత్తులో క్షేమాభివృద్ధి పొందడానికి, మనం నేడు ఆత్మ-పరిత్యాగాన్ని అనుభవించాలి.

ఎదురుచూస్తూ ఉండటానికి బైబిల్ యొక్క నిర్వచనం ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. అదే సమయంలో మనం సహనంతో ఉండాలి, సువార్తపని చేయడం, మనస్సులను స్థిరపరచడం, సిద్ధం చేయడం మరియు సాక్ష్యమివ్వడం గురించి కూడా దేవుడు మనకు నిర్దేశిస్తున్నాడు. మన వినియోగదారుల సమాజం పనికిమాలినదై ఇచ్చుటకు బదులు పుచ్చుకొనుటపై ఆధారపడి ముందుకు సాగుతుంది. కానీ సోమరితనం అజ్ఞానమని లేఖనం మనకు చెప్పుచున్నది “సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము" (సామెతలు 6:6), మనందరికీ బాగా తెలిసిన సామెత, "సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు, శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును" అని చెప్పుచున్నది ( 13:4).

మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన పనికిమాలిన మాటకు మనమందరం దేవునికి లెక్క చెప్పవలసి యున్నాము. (మత్తయి 12:36 చూడండి.) "మనం దుబారాగా ఖర్చు చేసే డబ్బు విషయమై కూడా మనం లెక్క చెప్పవలసి యుంటామా? ప్రసంగి 12:14, "గూఢమైన ప్రతి యంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును" అని చెప్పుచున్నది.

5. పొదుపులేని ఋణము : దీనిని నివారించడం ఎలా

మొదటిగా అప్పుల పాలవ్వకుండా ఉండటానికి మీకు సహాయపడే కొన్ని ప్రాథమిక, ఆచరణాత్మక సూత్రాలను చూద్దాం. ఇది ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగే సూత్రాల చిన్న జాబితా. వీటిని ఆచరణలో పెట్టడానికి ముందు అప్పులు పేరుకుపోయే వరకు వేచి ఉండకండి. ఇప్పుడే ప్రారంభించండి. ఇప్పుటి నుండే జాగ్రత్తగా ఖర్చుచేసే అలవాట్లను సృష్టించడం ద్వారా దేవునితో మీ భవిష్యత్తు కొరకు సిద్ధపడండి. (క్రింది సూత్రాలు వివిధ ఆర్థిక నిపుణుల నుండి సంకలనం చేయబడ్డాయి. )
పొదుపు బ్యాంకు ఖాతాను తెరవండి. మీరు పొదుపు చేయడానికి డబ్బు లేదని మీరు భావించినప్పటికీ, పునఃపరిశీలించండి. ఈ రోజుల్లో, కేవలం వెయ్యి లేదా 2 వేలతో పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)ను తెరవవచ్చు. మీరు మీ సాధారణ చెల్లింపులు మరియు రోజువారీ ఖర్చులను నిర్వహించే వేరే బ్యాంక్లో దీన్ని తెరవండి. ఆ విధంగా, మీరు దీన్ని చెకింగ్ ఖాతా లాగా పరిగణించడానికి శోధించబడరు. ఒకేసారి కొన్ని వందల రూపాయలే అయినా, క్రమంగా డబ్బు మీ ఖాతాలోకి జమ చేయడం గురించి మనస్ఫూర్తిగా ఉండండి మీ మనస్తత్వం మారడాన్ని మీరే గమనిస్తారు. ఇప్పుడు మీరు ఖర్చు చేయడం ద్వారా నగదును తగ్గించే బదులు పొదుపు చేయడం ద్వారా పెంచుతున్నారు.

మీరు ప్రత్యేకంగా వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే, భవిష్యత్తు కొరకు పొదుపు చేయడంలో దీర్ఘకాలిక ఆనందం ఉంటుందని మీరు గ్రహించవచ్చు. “నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” (1 కొరింధీయులకు 16:2).

ఆదాయవ్యయ పట్టికను ఏర్పాటు చేయండి. మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి మనలో చాలా మంది నష్టాల్లో బకాయిలతో ఉంటున్నారు. ఖచ్చితంగా, మనం ఒక అనిర్దిష్ట అంచనాతో రావచ్చు. అయినప్పటికీ, మనకు ఖర్చులను తక్కువగా అంచనా వేసే ధోరణి కూడా ఉంది. మనం ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం కొనడానికి వినియోగించే 150 లేదా 200 గురించి లేదా మార్కెట్టులో మనం తరచుగా కొనుక్కునే చిన్న చిన్న వస్తువుల గురించి మరచిపోతాము. ఆ వస్తువులు మీరు అనుకునే దానికంటే వేగంగా జోడించబడతాయి. మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి మీ రసీదులను భద్రపరచండి మరియు మీ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించండి.

అప్పుడు. ముఖ్యంగా, మీతో మీరు నిజాయితీగా ఉండండి. నిజాయితీగల ఆదాయవ్యయ పట్టికను రూపొందించండి. అది సాధ్యపడేది" ఆచరణాత్మకమైనదిగా ఉండాలి మరియు ఆ ఆదాయ పరిధిలో జీవించడానికి వ్యూహాన్ని రూపొందించండి. కొన్నిసార్లు, మనం చేసిన పనులను ఒప్పుకోవడం చాలా కష్టం, ముఖ్యంగా ఆ పనులు మన ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఇంకా కష్టం. కానీ ఇప్పుడు ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో ఆర్థిక భద్రతను సాధించడంలో మీకు సహాయం చేయడానికి చాలా దోహదపడుతుంది. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది. తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?” (లూకా 14:28)

మీ కిరాణా సామాన్ల బుట్ట గురించి పునరాలోచించండి. ఆహారం అనేది బ్రతకడానికి అవసరమైనది, కాబట్టి దాన్ని కొనుక్కోవడం అనేది మనమందరం రోజూ తప్పక చేసే పనుల ఒకటి. ఆహార ఖర్చును తెలుసుకోవడం చాలా సులభం, కానీ అది త్వరగా చేతిలో నుండి ఖాళీ అవుతుంది. మనలో కొందరు మన రుచి గ్రంథులకు చక్కిలిగింతలు పెట్టే ఖరీదైన వస్తువులను ఇష్టపడి కొనుక్కుంటూ,. మార్కెట్లో ఏ గురి లేకుండా పైకి క్రిందికి మెలికలు తిరుగుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను అల్మారాల్లో నుండి ఏదైనా సరే తీసుకోవడానికి అనుమతిస్తారు. ఆ వస్తువు ఖరీదైనది లేదా కేవలం అనారోగ్యకరమైనది అయినప్పటికీ మీరు కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు మీకు నిజంగా ఏమి అవసరమో ముందుగానే జాబితాను రూపొందించడం మరియు ఆ జాబితాకు కట్టుబడి ఉండటం చాలా మంచిది. ఖర్చులను ఆదా చేయడానికి మీరు కొన్ని ఆహారాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా మీరు సాధారణంగా తినే పొడి వస్తువులు. "... తిండిపోతులును దరిద్రులగుదురు” ( 23:21).

దశమభాగములు కానుకల విషయములో నమ్మకముగా ఉండుడి. కొందరు దశమభాగాన్ని మరొక ఖర్చుగా భావించవచ్చు. మీ నిత్యవసర సరుకులన్నీ కొనితెచ్చుకున్న తర్వాత మీరు లెక్క చూచుకునే వాటిలో ఒకటిగా భావించవచ్చు. "నాకు జీతం వచ్చే వరకు నేను దశమభాగం చెల్లించకపోతే బహుశా దేవుడు అర్ధం చేసుకుంటాడు" అని "వారనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇతర ఖర్చులన్నీ వారు కావాలనుకుంటున్న నాణ్యమైన జీవితానికి అవసరం. వాస్తవానికి, మనకు కలిగినవి. మనకున్నవి అన్నీ దేవునివే. "ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు" (1 దినవృత్తాంతములు 29:12). కానీ ప్రభువు, మన దయగల తండ్రి. విధేయతకు గుర్తుగా దానిలో పదవ వంతు మాత్రమే తిరిగి చెల్లించుమని అడుగుచున్నాడు మొట్టమొదటగా, కనీసం ఆ 10వ వంతులోనైనా విశ్వాసంగా ఉండండి, దేవుడు అనేక ఇతర మార్గాల్లో క్రియ చేయడం మీరు చూస్తారు కాని మీరు మీ ప్రతిఫలాన్ని పొందే కోణంలో కాదు. దేవుడు తన మహిమ కొరకు మీ సొంత మేలు కొరకు మీ విధేయతను దీవెనలు మెండుగా "నమ్మకమైనవానికి కోరుకుంటున్నాడు. కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు" ( 28:20).

ఇంటిని శుభ్రపరచండి. వినియోగదారులు సమాజంలో జీవించడం అంటే చాలా వస్తువులను సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది - చాలా తరచుగా, నిజానికి మనకు అవసరం లేని వస్తువులు కూడా. కొన్ని వస్తువులు మన అటకపై లేదా గ్యారేజీలలో సంవత్సరాలుగా పడి ఉండవచ్చు. కొన్ని ఇంకా తెరవనివి కూడా.

మీ ఇంటిని పూర్తిగా ఊడ్చి, మీకు అవసరం లేని వస్తువులను తొలగించండి. కొనడం సులభతరమైన యుగంలో జీవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, అమ్మడం కూడా సులభం. వస్తువును ఫోటో తీయండి దానిని eBay (ఈబే), OLX (ఓఎల్ఎక్స్) లేదా Face-book (ఫేస్బుక్) లేదా కొన్ని ఇతర కొనుగోళ్ళకు సంబంధించిన వాణిజ్య వేదికల్లో ఉంచండి. మీరు ఉపయోగించని సభ్యత్వాలైన లేదా మీరు చదవని మ్యాగజైన్లైనా లేదా చాలాకాలం పాటు వాడని వస్తువులైనా. అవి మీ కొత్త పొదుపు ఖాతాకు చక్కని జోడింపును తెస్తాయి. "పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి" (కొలొస్సయులకు 3:2).
సంపాదించుటకు క్రొత్త మార్గములను తెలుసుకోండి. నాల్గవ ఆజ్ఞ విశ్రాంతిదినమున విశ్రాంతి తీసుకోవాలని చెప్పుచున్నది. అంటే వారంలో ఒక్క రోజు మాత్రమే. మిగిలిన ఆరు రోజులు ఏమి చేయాలని అది మనకు నిర్దేశిస్తుంది? "ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను” (నిర్గమకాండము 20:9). వారాంతంలో రెండు-దినముల సెలవు అనేది బొత్తిగా ఆధునిక భావన, ఇది 1900ల ప్రారంభంలో అమలులోకి వచ్చింది. మనం ఆదివారాన పని “చేయవచ్చు”.

మీ సమయాన్ని తెలివిగా మరియు శ్రద్దగా ఉపయోగించుకొని మీరు ప్రయత్నిస్తే ఏమి సాధించవచ్చో చూడండి. ఏది ఏమైనా, పెద్ద మొత్తంలో డబ్బును వాగ్దానం చేసే పెద్ద పెద్ద వ్యాపార కుంభకోణాలు, "అతి తక్కువ సమయంలో ధనవంతుల్ని చేస్తామనే హామీ పధకాల" వంటి వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి. అవి మిమ్మల్ని మరింత లోతుగా అప్పుల్లోకి నెట్టేస్తాయి. “మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసికొనును" (సామెతలు 13:11). ఈ సమాచార యుగంలో, శారీరకంగా శ్రమించలేని వారు అనేకమంది సహితం కంప్యూటర్ ముందు లేదా ఇంట్లో నుండే పని చేస్తూ డబ్బును సంపాదించగలరు. "ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు" (సామెతలు 14:23).

6. ఋణము పాపమా?

క్రైస్తవులలో ఒక ప్రముఖ ప్రశ్న ఏమిటంటే అప్పుల పాలవ్వడం పాపపు చర్యా అని. డబ్బు అప్పుపడి లేదా అచ్చి యుండడం పాపమని బైబిల్ ఎన్నడూ చెప్పనప్పటికీ. అది సరైన ప్రశ్న అని నాకు ఖచ్చితంగా తెలియదు. బదులుగా, నేను ఇలా అడగాలనుకుంటున్నాను, “అప్పు చేయాలనే నిర్ణయానికి దారితీసిన ఉద్దేశాలు చర్యలు పాపాత్మకమైనవేనా?”

మీరు వేరొకరి దగ్గర ఒక వస్తువును చూసి కేవలం అదే వస్తువు మీ దగ్గర కూడా ఉండాలన్న తలంపుతో దానిని కొనేందుకు మీరు ఎన్నిసార్లు అప్పు చేసారు? బైబిల్ దానిని దురాశ అని పిలుస్తుంది మరియు పధవ ఆజ్ఞ దానికి వ్యతిరేకంగా మనకు నిర్దేశిస్తుంది. "మరియు ఆయన (యేసు ప్రభువు) వారితో మీరు ఏవిధమైన లోభమునకు (దురాశకు) ఎడమియ్యక జాగ్రత్తపడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను" (లూకా 12:15).

నేడు చాలా రుణాలు అప్పుల వెనుక ఉన్న ప్రేరణలను మనం ఇప్పటికే చర్చించాము. ఈ కారణాల' యొక్క కేంద్రస్థానాన శరీర సంబంధమైన సేవ ఉంది. దేవునికి ఇష్టమైన వాటి కొరకు పని చేయడం కంటే మీ శరీర కోరికలను తీర్చుకోవడం గురించి మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారా? మీరు లౌకిక సంపదను (సిరిని) సేవించినప్పుడు మీరు ఖర్చుతో సంబంధం లేకుండా వస్తువులను సంపాదించడానికి కంకణం కట్టున్నప్పుడు, దానిని కూడా ఆరాధనగా వర్గీకరించవచ్చు. మీరు సిరిని సేవిస్తున్నారా? అది భూమ్యాకాశాలకు అధిపతియైన దేవుని కంటే ఎక్కువగా మీకు దేవుడైందా? దేవుడు, "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" అని చెప్పెను (నిర్గమకాండము 20:3)
స్పష్టంగా వాస్తవాలు మాట్లాడుకుందాం: ఆర్థిక వ్యవహారాలలో బాధ్యతారాహిత్యం నిర్లక్ష్య ధోరణి పాపం. క్రైస్తవులుగా, దేవుని సమయం, డబ్బు మరియు ఆయన మనకు ఇచ్చిన ఆశీర్వాదాలకు నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. వీటిలో ప్రతి ఒక్కటి ఎలా ఉపయోగిస్తున్నాము అన్నదానిని బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కొన్నిసార్లు దేవుడు మీకు ఆశీర్వాదమిచ్చేది, తద్వారా మీరు మరొకరికి దయగాను ఆశీర్వాదంగాను ఉంటారని. యేసు.

"మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది. మీకు ఎవడిచ్చును?" అని చెప్పెను (లూకా 16:10-12)

మీరు ఐహిక సంపద పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, మీరు ఆధ్యాత్మిక సంపదను ఎలా నిర్వహించగలరు? ఈ జీవితంలో మన డబ్బును మనం ఎలా నిర్వహిస్తున్నాము అనేది మన బరువైన వ్యవహారాల నిర్వహణకు సూచన.

అది పరలోకంలో మనకు కలుగబోయే నిత్యజీవాన్ని మాత్రమే ప్రమాదంలో ఉంచదు, మన ఖర్చుపెట్టే అలవాట్లు ఈ భూమిపై ఉన్న మన తోటివారిని కూడా ప్రభావితం చేస్తాయి. మన కొరకు డబ్బు ఖర్చు చేయకుండా మనం వదులుకునే అన్ని విషయాల గురించి ఆలోచించే బదులు, మనం ఇతరులకు ఇవ్వగల అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పు ఉండాలని నిర్ణయించుకోవడం అంటే దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి మీరు చింతిస్తున్నారని మాకు ఇప్పటికే తెలుసు. ఇది క్రీస్తుకు ఒక బలహీనమైన సాక్ష్యాన్ని సృష్టిస్తుంది ఎందుకంటే మీరు ఇకపై ఇతరులకు చేరువగా ఉండటానికి ప్రయత్నించరు గాని మీపై మరియు మీ అవసరాలపై దృష్టి పెడతారు.

మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి పిలువబడ్డాము. ఫిలిప్పీయులకు 2:4, "మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను" అని చెప్పుచున్నది. రోమీయులకు 13:8. "ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు" అని చెప్పుచున్నది. మరియు ఎఫెసీయులకు 4:28, "దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచి పెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను" అని చెప్పుచున్నది.

క్రైస్తవులుగా మనం పని చేసి, మనకు చేతనైనంత పొదుపు చేస్తే.. మనం కూడా ఇవ్వగలిగినంత ఇవ్వగలుతాము. __మనం ఇచ్చినప్పుడు, ఒక చక్కని విషయం జరుగుతుంది: పరోపకార దానం, నిస్వార్థత, మనకు ఆశీర్వాదం అవుతుంది. "... ఇయ్యుడి. అప్పుడు మీకియ్యబడును, అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును" (లూకా 6:38).
మీకు ఏదో తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఇవ్వాలి అని దీని అర్ధం కాదు. ప్రతిఫలం ఏమీ ఆశించకుండా ఇవ్వండి. యేసు ప్రభువు అంతకు ముందే అనేక వచనములు చెప్పెను. "మీరైతే ఎట్టి వారిని గూర్చి యైనను నిరాశ చేసికొనక (వారి నుండి ఆశించక) మీ శత్రువులను ప్రేమించుడి. మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారి యెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు” (లూకా 6:35). ఇదేదో నగదు లేదా భూసంబంధమైన బహుమానం కాదు. ఇది దేవుని కుటుంబంలో ఒకరిగా పరిగణించబడటమనే విశేషం మీరు ఒకే రక్తం పంచుకొని పుట్టినందుకు కాదు గాని మీ స్వభావం ఆయన పోలికగా మార్చబడింది కాబట్టి! అదే మీకు తిరిగి ఇవ్వబడే బహుమానం నూతన హృదయము. “ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును" (సామెతలు 1125) – మీలో క్రీస్తు స్వభావమును నాటిన పరిశుద్ధాత్మ ద్వారా నీళ్ళు పోయబడును.

మీ కన్నా తక్కువ అదృష్టవంతులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదను ఇవ్వండి. క్రీస్తును ఎరుగని వారికి ఇవ్వండి, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు వారిలాగే నశించిన స్థితిలో ఉన్నవారే. మనకు క్రీస్తు హృదయం ఉంటే, సువార్త ద్వారా ఇంకా ఎంతమంది నశించిన ఆత్మలను చేరుకోవచ్చు? ఇంకా ఎంతమంది మిషనరీలు (దేశాంతర సువార్తికులు), బైబిల్ పనివారు మరియు సువార్తికులు ఈ భూప్రపంచం యొక్క చీకటి ప్రాంతాలకు పంపబడవచ్చు? ఎవరికైనా యేసుక్రీస్తుతో సమృద్ధిగా జీవించే ఆధిక్యతకు బదులు జీవం లేని సమృద్ధి కొరకు మనం ఎంత డబ్బు ఖర్చు చేశాము? అప్పు ఖరీదు మన సొంత జీవితాల కంటే చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని మనం గ్రహిస్తున్నామా? ఇది సువార్తను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని మనం భావిస్తున్నామా?

7. మీ మాట నిలబెట్టుకొనుడి

మీకు ఇప్పటికే అధికంగా అప్పు ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి? ఇది మీకు తీరని భారంగా ఉందా? మిమ్మల్ని మీరు శాశ్వతంగా కోల్పోయారా? లేదు. మీకు ఇప్పటికే ఉన్న అప్పుతో మీరు ఏమి చేస్తారనేది ఇప్పుడు ముఖ్యం.

క్రైస్తవుని ప్రవర్తన ముఖ్యమైనది. క్రైస్తవుడు మాటిస్తే, అతడు లేదా ఆమె ఆ మాటను నిలబెట్టుకోవాలి. మీరు ఏదైనా కొనుగోలు చేస్తే. మీరు దానికి చెల్లించాలి. బైబిల్, 'భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు” (కీర్తనలు 37:21). మరియు "... నీవు మ్రొక్కుకొని, చెల్లింపకుండుట కంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు” అని చెప్పుచున్నది (ప్రసంగి 5:5).

ఒక క్రైస్తవుడు మూర్ఖంగా వ్యాపారం చేసి అధిక మొత్తంలో అప్పులు చేసినా, ఆ వ్యక్తి ఆ అప్పును తిరిగి చెల్లించడానికి తమ శాయశక్తులా కృషి చేయాలి కానీ, 'నేను మీకు అమ్బున్నాను" అనే మాటను వెనక్కి తీసుకోకూడదు. అది అతనికి నిరంతరం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అతను ఇచ్చిన మాటను తప్పకూడదు. మీరు మీ అప్పును చెల్లించకపోతే, మరొకరు చెల్లించవలసి ఉంటుంది. మరొకరు మీకు బదులుగా దెబ్బ తినాలి నింద మోయాలి. ఇది ఒక రకమైన దొంగతనం కాదా?

లక్షల డాలర్లు అప్పు చెల్లించే స్తోమత లేని జూదమాడిన స్త్రీ వంటి వ్యక్తి తిరిగి చెల్లించలేని అప్పు సంగతేమిటి? జీవితాంతం రోజూ పనిచేసినా చెల్లించలేకపోయింది. కొందరైతే చేతులు దులుపుకుని, "అందులో ఎంతైనా చెల్లించి ప్రయోజనమేమిటి?” అని అనుకోవచ్చు. విపరీతమైన అప్పుల భారంతో ప్రజలు నలిగిపోతున్నారు, వారు వదులుకోవాలనుకుంటున్నారు. కానీ పడిపోయినప్పుడు మనం తన వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాపం మన వ్యసనం, మన దురాశ విషయమై మనం పశ్చాత్తాపపడాలి. జూదం నుండి దూరంగా ఉండండి, ఎక్కువ అప్పులు భారం మీపైన వేసుకోకండి. అప్పుడు మన జీవితాలను మార్చడానికి, బానిసత్వం నుండి మనల్ని రక్షించడానికి అద్భుతాలు సహితం చేయడానికి దేవునికి అనుమతి ఇవ్వండి. "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9). మనకు పొదుపు అవసరమనే సహాయం మనకు అవసరమని గ్రహించాలి. దేవుడు మనలను రక్షించడమే కాదు, మన జీవితాలను కూడా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

ఈ సమీకరణంలో “ప్రధాన సాధకుడు" దేవుడు. "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు" అని లేఖనం చెప్పుచున్నది (2 తిమోతి 1:7). అప్పు భయాన్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ చక్కని అంశముంది : ప్రేమ భయంపై విజేత, ఎందుకనగా "పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును" (1 యోహాను 4:18). "దేవుడు ప్రేమాస్వరూపి" అని కూడా బైబిలు చెప్పుచున్నది (1 యోహాను 4:8). అంటే దేవుడే విజేత అని అర్ధం. మీ భయాన్ని అప్పుల విషయమై మీ చింతను మరి దేనినైనా సరే ఓడించడానికి ఆయన జవాబుగా ఉంటాడు. మీకు ఖర్చు చేసే అలవాటు లేదా జూదం అలవాటు ఉంటే, దాన్ని అధిగమించడానికి మీకు సహాయం చేయువాడు దేవుడే. దేవుడు మనకు "స్వస్థబుద్ధి గల ఆత్మ" - అనగా క్రమశిక్షణతో కూడిన మనస్సును, ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండే మనస్సును ఇచ్చువాడని వచనం చెప్పుచున్నది. ఆత్మనిగ్రహం లేకపోవడమే మనల్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తే, అప్పుడు అప్పుల నుండి మనల్ని దూరంగా ఉంచడమే కాకుండా అప్పుల బాధ నుంచి మనం బయటపడేందుకు దేవుడే సమాధానం. పశ్చాత్తాపపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి.

"దేవునికి సమస్తమును సాధ్యము" అని గుర్తుంచుకోండి (మత్తయి 19:26). విధవరాలు తన భర్త చేసిన అప్పు తీర్చలేకపోయింది, కానీ ఆమె ఓటమితో చేతులు దులుపుకోలేదు. బదులుగా, ఆమె దేవుని మార్గనిర్దేశం కొరకు ఒక ప్రవక్త వద్దకు వెళ్లింది. విధవరాలి వద్ద ఒకే పాత్రలో నూనె ఉందని ఎలీషా గుర్తించినప్పుడు, అతను ఆమె పొరుగువారినందరినీ అడిగి వారి ఖాళీ పాత్రలు కుండలను ఎన్ని ఉంటే అన్ని తెమ్మని, ఆపై ప్రతి ఖాళీ పాత్రలో ఆమె ఒక్క పాత్రలోని నూనె పోయమని సెలవిచ్చెను. ప్రతి బుడ్డి పాత్ర నిండిపోయింది. ఆ విధవరాలు ఆమెకు చెప్పినట్లు చేసింది. ఆ ఇతర పాత్రలన్నింటిని నింపడానికి దేవుడు ఆమెకు ఒక పాత్రలో నూనెను అద్భుతంగా రెట్టింపు ఋణము నుండి విమోచన చేశాడు. ఆ తర్వాత తన భర్త చేసిన అప్పు తీర్చేందుకు ఆ నూనెను అంగడికి తీసుకెళ్లింది.

విధవరాలు ప్రయాసపడి తనకు కలిగిన దానితో ఏమి చేయగలిగిందో అది చేసింది. ఆ ఒక్క పాత్రలో నూనె ఎక్కువ కానప్పటికీ, అది తన భర్త అప్పును స్వయంగా తీర్చలేకపోయినా. ఆమె ప్రవక్త సూచనలకు అడ్డు చెప్పలేదు. ఆమె విశ్వాసంలో నిలకడగా ఉన్నది. ఆమె విధేయతలో నిలకడగా ఉన్నది. ఆమె విశ్వాస్యతను బట్టి ఆమె ఆశీర్వదించబడింది. “కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే” (ద్వితీయోపదేశకాండము 8:18). విధవరాలు ఊరక అక్కడ కుర్చుని ఏమీ చేయకుండా ఉండగా దేవుడు అద్భుతం చేయలేదు. మన ప్రయత్నాలు ప్రయాసలు లెక్కకొస్తాయి, మన ప్రవర్తన ముఖ్యమైనది కాని అది మనం మన రక్షణను పొందే విధంగా కాదు. బదులుగా, విధవరాలి చర్యలు దేవునిపై ఆమెకున్న నమ్మకానికి అనుసరణగా ఉన్నవి. మనం ఆయనతో కలిసి పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. విధవరాలి విశ్వాసం బలపడిన అదే సమయంలోనే ఆయన మహిమపరచబడ్డాడు. ఫలితంగా, ఆమె స్వభావం ఆయనతో జీవితం కొరకు మరింత చక్కగా సమ్మేళనం చేయబడింది.

8. నిర్వహణలేని ఋణము : దీని నుండి బయటపడడం ఎలా

మీకు ఇప్పటికే అప్పు ఉంటే, నిరాశ చెందకండి! మీ జీవితంలో విశ్వాసం, ఓర్పు మరియు ప్రార్ధన కలిగి ఉండండి.

ఇప్పుడు మీరు దేవునితో గృహనిర్వాహక జీవితాన్ని ప్రారంభించడంలో సహాయపడే మరొక ఉపయోగకరమైన సూత్రాల జాబితాను చూద్దాం. ఇవి "ఋణము 101: దీనిని నివారించడం ఎలా” అనే అంశంలోని పాయింట్లకు అనుసంధానమై ఉంటాయి.

1. ఎక్కువ మొత్తంలో అప్పు చేయడం ఆపండి. పశ్చాత్తాపపడటం

మొదటి మెట్టు. మిమ్మల్ని అసలు అప్పుల్లోకి తెచ్చిన విషయాలకు దూరంగా ఉండండి. సిరిసంపదలపై కోరిక దేవునితో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గ్రహించండి. జూదమాడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ స్త్రీకి తన పరిస్థితి ఎంత తీవ్రమైందో తెలుసు. ఆమె అప్పుల పాలవ్వాలని తీవ్రంగా కోరుకోలేదు, కానీ తన సమస్యకు సగం సమాధానం ఎక్కువ మొత్తంలో అప్పు చేయకుండ ఉండటంలోనే ఉందన్న విషయాన్ని ఆమె గ్రహించలేదు. నిజానికి లాటరీ తగిలితే ఒక్కసారిగా అప్పు తీర్చగలనన్న ఆశతో ఆమె లాటరీ టిక్కెట్లు కూడా కొనాలనుకుంది. మనం సృష్టించుకున్న సమస్యలను రెప్పపాటులో పరిష్కరించవచ్చని భావించడం ఊరటను కలిగి గింది, కానీ చాలా తరచుగా, అది వాస్తవం కాకపోగా మరింత నిరాశ నిస్పృహలకు దారి తీస్తుంది. అసాధ్యమని అనిపించే పరిస్థితుల నుండి మనకు సహాయం చేసే అద్భుతాలను దేవుడు చేస్తాడా? అవును. కానీ ఆయన తన స్వభావం నైతిక చట్టాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్లడు, ఆయన అలా చేయాలని మనం ఆశించకూడదు లేదా దబాయించకూడదు. మన వంతుగా, మనం ఎక్కువ బకాయిలు ఉండేలా అప్పులు చేయడం మానేయాలి. "చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.

చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపో నేల?" (సామెతలు 22:26, 27).

2. మీ రుణాన్ని క్రమ పద్ధతిలో వాయిదాల పద్ధతిలో చెల్లించండి.

ప్రతి నెలా కొన్ని వందలే అయినప్పటికీ, ఎల్లప్పుడూ మీ రుణానికి ఎంతోకంత కేటాయించండి. జూదమాడిన స్త్రీ మొత్తం 5 లక్షల డాలర్లు ఒకేసారి చెల్లించలేక పోయినప్పటికీ, ఆమె కనీసం నెలకు 10 డాలర్లు చొప్పున ఒక్కోసారి కొంత చెల్లించడానికి కొద్దో గొప్పో ప్రయత్నం చేయవచ్చు. మీరు అ అప్పు నుండి ఎలా బయటపడగలరో లేదా దానిలో తక్కువ చెల్లించడం గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృథా చేయకండి. నమ్మకమైన గృహనిర్వాహకుడిగా ఉండటం గురించి లేఖనాలు చెప్పేదాన్ని అనుసరించండి, ఫలితంగా మీ మనస్తత్వం మారడాన్ని చూడండి. మనం అనుకున్న దానికంటే త్వరగా చిన్ని చిన్ని ఖర్చులు ఎలా వచ్చి పడతాయో, అలాగే చిన్ని చిన్ని పొదుపులు కూడా. మీ అప్పు చెల్లించడానికి మీరు క్రమం తప్పకుండా ఎంత ఇవ్వగలరో ప్రణాళిక వేసుకోవడానికి ద్రవ్యపట్టికను రూపొందించడానికి ముందుగా సూత్రాన్ని ఉపయోగించండి. దానికి ప్రాధాన్యత ఇవ్వండి. కానీ దాన్నే మీ ఏకైక ప్రాధాన్యతగా చేసుకోవద్దు. వాస్తవికంగా కూడా ఉండండి. ఉదాహరణకు, మిమ్మల్ని లేదా మీ పిల్లలను పోషించే ఖర్చుతో మీ రుణాన్ని చెల్లించవద్దు. "... అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి" (రోమీయులకు 13:7).

3. అనవసరమైన ఖర్చులేవైనా వాటిని తగ్గించుకోండి. ఒక వస్తువును కొనుగోలు చేయడం నిజంగా అవసరమా లేదా కేవలం అనుకూలమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించడం వల్ల కాలక్రమేణా కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇది మీ కిరాణా సామాన్ల గురించి పునరాలోచించే సూత్రంతో అనుసంధానమై సాగుతుంది. మీరు మీ రుణాన్ని మరింతగా చెల్లించగలిగేలా ఖర్చులు తగ్గించుకునే పనులు మీరు ఇంకా ఏమి చేయవచ్చు?

ఎ. బయట తినే బదులు మీ భోజనం మీరే వండుకోవడం సంగతేమిటి? ఇది వందల రూపాయలు ఆదా చేయడమే కాదు, ఇది మీకు ఆరోగ్యకరమైనది కూడా. సులభమైన, ఇంట్లో వండుకునే భోజనం అంటే వంటగదిలో తక్కువ పనే, తాజా కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాలు పెద్ద మొత్తంలో కొన్నా సరే ఖరీదైన నిల్వ భోజనాల కంటే చౌకగానే లభిస్తాయి.

బి. బట్టలు మరొక అవసరం, కానీ అవసరానికి మించి ఖర్చు చేయడం సబబు కాదు. చాలా కార్యాలయాల్లో డ్రెస్ కోడ్ (వస్త్ర నియమం) ఉంటుంది, అయితే పనికి తగిన దుస్తులను పెద్ద పెద్ద బట్టల షాపుల్లో కన్నా డిస్కౌంట్ (తగ్గింపు) ధరలకిచ్చే షాపుల్లోనే సులభంగా కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్ పేర్లున్న బట్టలు వేసుకోవడం ఈ రోజుల్లో పెద్ద విశేషమైపోయింది.

సి. మీరు జిమ్ (వ్యాయామ) సభ్యత్వానికి డబ్బు కడుతున్నారా? వ్యాయామం చేయడం ముఖ్యం, అయితే ఆరుబయట ప్రకృతిలో ఉచితంగా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ పరిసరాల్లో నడవడం లేదా పరిగెత్తడం చేయవచ్చు. మీ స్థానిక సామాజిక కేంద్రం ఏవైనా తరగతులను ఉచితంగా ఇస్తుందేమో చూడండి. ఇలా చేస్తే మీరు డబ్బు ఆదా చేయడమే కాకుండా, స్వచ్ఛమైన గాలిలో కొంత సమయం గడుపుతారు.

డి. మనలో చాలా మందికి పనులు ఉద్యోగాలు చేసుకోవడానికి కారు అవసరం. నడచి లేదా బైక్ మీద వెళ్లడానికి మీ ఆఫీసు చాలా దూరంలో ఉన్నట్లయితే ఒక కారు అవసరంగా పరిగణించబడుతుంది. అయితే డీలర్షిప్ (మోటారు వాహన సంస్థ) నుండి కొత్త కారును కొనుగోలు చేసి, వచ్చే ఐదేళ్లపాటు ఆటో లోన్ (వాహన రుణం) చెల్లించే బదులు, మీరు చాలా సంవత్సరాల వాడకంలో ఉన్న పాత మోడల్ వాహనన్ని ముఖ్యంగా మీ స్తోమతను బట్టి ఎంచుకోవడం మంచిది ఎందుకంటే మీరనుకున్నట్టు లేదని దానిని మీరు వద్దనుకున్న మరుక్షణం దాని విలువ 20 శాతం తగ్గుతుంది. ఏదో ఒక అవసరం ఉన్నందున దాని కోసం అప్పులు చేయడం కూడా అవసరమే అనడం సరికాదు.

ఇది ... గుర్తుంచుకోండి "మనమీలోకములోనికి ఏమియు తేలేదు. దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. 5° అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము" (1 9 6:7,8).

9. అవసరమైన ఋణము

మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడో, వ్యాపారాన్ని " ప్రారంభించేటప్పుడో లేదా కళాశాల పూర్తి చేసేటప్పుడో తాత్కాలిక అప్పులు చేయాలనుకునే సందర్భాలు ఉండవచ్చు. కానీ అలాంటి 11 నిర్ణయాలు జాగ్రత్తగా ప్రణాళికతో (వీలైనంత తక్కువగా తీసుకోవడం) మరియు వీలైనంత త్వరగా అటువంటి అప్పు తీర్చే లక్ష్యంతో తీసుకోవాలి. అప్పులో ఉన్న గొప్ప సమస్య ఏమిటంటే మీకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం (సమయం సందర్భం లేకుండా విహారయాత్రకు వెళ్లడం, ఖరీదైన బట్టలు కొనడం, కొత్త ఫర్నిచర్ (గృహోపకరణాలు తెచ్చుకోవడం, ఇతరులకు బహుమతులు కొనడం), ఆ అప్పు తీర్చే ప్రణాళిక లేకుండానే ఇలాంటివి చేస్తుంటారు.

10. అతి ముఖ్యమైన ఋణము

అయితే అప్పుల గురించి ఇదంతా విన్న తరువాత తేలిన ముఖ్యాంశమిదే. మనలో ప్రతి ఒక్కరికి అప్పు లేదా రుణముంది. కానీ అది డబ్బు లేదా వస్తు సామగ్రికి సంబంధించినది కాదు. అది ఏదైనా ఆర్థిక రుణం కంటే చాలా పెద్దది, చాలా అరిష్టమైనది మరియు చాలా ముఖ్యమైనది. అదే పాప ఋణము. ప్రభువు ప్రార్థనలో, “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము" (మత్తయి 6:12). ఆ ఋణమునకు చెల్లింపు మరణము : "పాపము వలన వచ్చు జీతము మరణము” (రోమీయులకు 6:23).

కానీ కృతజ్ఞతాస్తుతులు. వాక్యం అక్కడితో ముగియనందుకు దేవునికి

మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు పాప రుణాన్ని చెల్లించాడు. ఆయన మన పాపాల కొరకు మరణించాడు. ఇంత చేసిన ఆయనకు తిరిగి మనం శారీరకంగాను,. మానసికంగాను లేదా.. ఆధ్యాత్మికంగాను ఎన్నడూ ఏమియు చెల్లించలేము. కీర్తన 11612. "యెహెూవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?" అని చెప్పుచున్నది. అయితే శుభవార్త ఏమిటో తెలుసా? యేసు మరణం ద్వారా, మన రుణం-మన పాపం-క్షమించబడింది. కొలొస్సయులకు 2:13-15, “మరియు అపరాధముల వలనను. ... మీరు మృతులై యుండగా, మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను" మరియు రోమీయులకు 6:23 చివరి సగభాగము, "అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము" అని చెప్పుచున్నది. జీవము - దేవునితో నిత్యజీవము మనకు దయ చేయబడింది.

మనకు దయ చేయబడింది. మనము చేయవలసిందల్లా దానిని అంగీకరించి, "రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్ధన” చేయుటకు ఎంచుకొనవలెను (కీర్తన 116:13).

మీరు నిజంగానే BMW (బిఎమ్ డబ్ల్యూ) కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారని అనుకుందాం. మీరు అలోచించేదల్లా ఒక్కటే, మీకు కావల్సిందల్లా ఒక్కటే. కాబట్టి మీరు దాని కొనడానికి వెళ్ళండి. మీరు లోను (రుణం) తీసుకుని, సరికొత్త మోడల్ కారును నెలసరి కిస్తీల పద్ధతిలో కొన్నారు. పత్రాలు సంతకం చేయబడ్డాయి. ప్పందం కుదిరింది. మీరు తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు. చివరికి బిఎమ్ డబ్ల్యూ కారు మీ సొంతమైంది. ఆ తర్వాత, మీరు పార్కింగ్ స్థలం నుండి కారును బయటకు తీసేటప్పుడు, ఒక మినీ వ్యాన్ అనుకోకుండా దూసుకొచ్చి మీ కారు ఎడమ వైపున్న లైట్లను వెనుక భాగాన్ని ఢీకొన్నది. మీరు ఇతర డ్రైవర్ ఇద్దరికీ ఏమి కాలేదు. కానీ మీ సరికొత్త వాహనం, మీరు అపురూపంగా చూసుకున్న కారు ధ్వంసమైంది. మీ బిఎమ్ డబ్ల్యూ విలువ ఇప్పుడేమైంది? దాని విలువ క్షణాల్లోనే కిందకు పడిపోయింది. మరి చేసిన అప్పు గురించి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

దేవుడు మీపై, మీ జీవితంపై ఉంచిన విలువను పరిగణించండి. మీ కొరకు చనిపోయేంత విలువ మీది మరియు మీ విలువ ఎప్పటికీ తగ్గిపోదు. మీ కొరకు తన సొంత జీవితాని అర్పించడం విలువైన విషయంగా యేసు ఎప్పుడూ భావించాడు మరియు ఎల్లప్పుడూ భావిస్తాడు.
కూడా. నిన్ను అంతగా ప్రేమించే దేవునితో లభించే నిత్యజీవంతో పోలిస్తే బిఎమ్ డబ్ల్యూ లేదా ఇంకేదైనా ఎంత? యేసుక్రీస్తు "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి" (1 పేతురు 2:24)

11. ఋణ క్షమాపణ

ప్రతి ఏడు సంవత్సరాలకు, ఇశ్రాయేలీయులు తమకు ఇంకా చెల్లించబడని అప్పులన్నింటినీ మాఫీ చేయాలి లేదా క్షమించి వదిలేయాలి : "తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింప కూడదు" (ద్వితీయోపదేశకాండము 15:2). మీరు దానిని గమనించారా? దేవుడు తన ప్రజలను అప్పు చేయువారిగా కాకుండా అప్పిచ్చువారిగా నియమించాడు "యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు" (ద్వితీయోపదేశకాండము 28-12). ఇది దేవుని అనుసరించేవారిగా నేడు మనకు ఎలాంటి అర్ధాన్నిస్తుంది? మనం కూడా అదే విధంగా అప్పిచ్చే స్థితిలో ఉండాలి, అప్పుండకూడదు. తద్వారా ఆయన ఆశీర్వాదాలను మనం వినియోగించుకొని ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవచ్చు. ప్రభువు తన ప్రజలలో క్షమాపణ అనే భావనను యుగయుగాలుగా నింపుతున్నాడు. యేసు ప్రభువు త్యాగంలో, ఛాయ (గుర్తు చివరకు దాని దృష్టాంతాన్ని (నిజస్వరూపాన్ని) కలుసుకుంది. ఆచరణ చివరకు వాస్తవంగా మారింది. మన పాప రుణాన్ని దేవుడు క్షమించాడని వివరించడంలో ఎంత మంచి పాఠముంది! ప్రపంచానికి దేవుని న్యాయ స్వభావాన్ని చూపించడం ఎంత చక్కని సాక్ష్యం.

మత్తయి 18లో, దేవునికి గుర్తుగా ఉన్న రాజు పాపులకు గుర్తుగా ఉన్న అతని దాసులలో ఒకరి గురించి యేసు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఈ దాసుడు రాజుకు అచ్చియున్నాడు. పెద్ద మొత్తం, 10 వేల టాలెంట్లు (ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయిలు కావచ్చును) ఇప్పటివరకు బైబిల్ లో కనుగొనబడిన అతి పెద్ద మొత్తం (మత్తయి 18:24). మన పాపాల భారం దయనీయంగా కనిపిస్తుంది. దాసుడు అప్పు చెల్లించలేడు. కాబట్టి రాజు, “కనికరపడి” (మత్తయి 18:27), అప్పు మొత్తాన్ని క్షమిస్తాడు.

ఈ కధ రక్షణ ప్రణాళికకు సారూప్యతను సూచిస్తుంది. రాజు దాసుని 10 వేల తలాంతుల అప్పు క్షమించినట్లు దేవుడు మన పాపాలను క్షమించాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజు తన దాసుని అప్పు క్షమించిన కారణాన్ని యేసు జోగించాడు : ఎందుకనగా 'ఆ దాసుని యజమానుడు “కనికరపడెను”. ఎందుకనగా ఆయన అతన్ని ప్రేమించాడు. “కనికరపడెను”, అనే ఈ మాట యేసు ప్రభువు భూమిపై తన జీవితంలో రోగులను స్వస్థపరచడానికి, ప్రసంగించడానికి మరియు బోధించడానికి కారణంగా పదే పదే కనబడుతుంది. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో లేఖనాల ద్వారా పదే పదే చెప్పుచున్నాడు.కానీ ఉపమానం అక్కడితే ముగియలేదు. యజమానుడు క్షమించిన తర్వాత దాసుని ప్రవర్తనను ఇది వివరిస్తుంది. అప్పు క్షమించబడిన ఆ దాసుడు, తనకు 10 వేల దేనారములు (ఒక దేనారము ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చును), 10 వేల టాలెంట్లతో పోల్చితే చాలా తక్కువ అచ్చియున్న తన తోడిదాసులలో ఒకని వద్దకు వెళ్లి, అప్పు చెల్లించమని వేధించాడు. తోటి దాసుడు చెల్లించలేనప్పుడు, మొదటి దాసుడు ఆ వ్యక్తిని చెరసాలలో వేయించాడు. అతను తన తోటి దాసునితో రాజు తనను కనికరపడినట్లుగా కనికరపడలేదు గాని స్వార్ధపరుడై నిర్దయుడుగా వ్యవహరించాడు. యజమానుడు మొదటి దాసుని చర్యల గురించి తెలుసుకున్నప్పుడు, అతను రుణ క్షమాభిక్షను వెనక్కి తీసుకొని "... తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించెను" (మత్తయి 18:34).

ఈ ఉపమానం యొక్క గుణపాఠాన్ని యేసు స్పష్టంగా తెలియజేస్తున్నాడు "మీలో ప్రతివాడును తన సహెూదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను" (మత్తయి 18:35). ఇతరులతో మన పరస్పర చర్యలో మనం ఆయన దయ కనికరములను చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది కనికరము యొక్క బాహ్య ప్రదర్శన మాత్రమే కాదు, దేవుడు హృదయపూర్వకమైన సేవనే కోరుకుంటాడు. మనం చెప్పేది చేసేది నిజాయితీగా ఉండాలి. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు" (కీర్తన 51:17). మొదటి దాసుడు నిజంగా పశ్చాత్తాపం లేదా కనికరాన్ని అనుభవించలేదు మరియు తన తోటి దాసునికి విరోధంగా అతని చర్యలు మరింత క్రూరమైనవి.
ఎందుకనగా అతను తనకు రక్షకుడు అవసరమనే విషయాన్ని అనుభవించి తెలుసుకున్నాడు. దేవుడు మన నుండి కోరుకునేది, మనం ఉన్నపాటుగానే ఆయన వద్దకు వెళ్లడం, మనం చేసిన దానిని గూర్చి మనమెవరము అన్నదానిని గూర్చి పశ్చాత్తాపపడడమే. తద్వారా ఆయన మనకు తనవంటి నూతన హృదయాన్ని దయచేస్తాడు.

మరియ యేసు ప్రభువును అత్తరు తైలంతో అభిషేకించిన వృత్తాంతం తీసుకోండి. యేసు గతంలో కుష్ఠువ్యాధి నుండి స్వస్థపరచిన పరిసయ్యుడైన సీమోను భోజనానికి ఆహ్వానించగా యేసు వెళ్లి భోజనపంక్తిని కూర్చుండగా, విలువైన మరియు ఖరీదైన అత్తరు నూనెను మరియ తెచ్చి దానిని యేసు తలకు పాదాలకు పూయడం ప్రారంభించింది. అక్కడ ఉన్నవారు స్వకీయ - నీతితో, అసహ్యంగా ధిక్కరించి చూస్తున్నారు. యూదా విషయానికొస్తే, ప్రేమతో కూడిన చర్య అతని దురాశకు కోపం తెప్పించింది. దాని కారణంగా, అతను మరియను బహిరంగంగా మందలించాడు. "యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడీలాగు చెప్పినది. బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు (యూదా) దొంగయై యుండి. తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను” (యోహాను 12:5. 6), మరియ చేసిన సేవ సీమోనుకు తన సందేహాన్ని అతను యేసు పక్షపాతాన్ని వెలిబుచ్చడానికి కూడా కారణమైంది ప్రభువును "ఈయన" అంటూ గర్వంగా, "... ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను" (లూకా 7:39), మరియ చేసిన పని వెనుక ఉన్న కారణాన్ని అక్కడున్న వారెవ్వరూ గ్రహించలేదు. కానీ యేసు గ్రహించాడు.

మరియ చేసిన పనిని అంగీకరించడానికి మరియు అక్కడున్నవారి కఠినమైన హృదయాలను చేరుకోవడానికి రూపొందించిన ఉపమానాన్ని యేసు చెప్పడం ప్రారంభించాడు "... అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను.

కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను" (లూకా 7:41, 42).

"అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని" సరిగా సమాధానమిచ్చెను (లూకా 7:43).

మరియ ప్రవర్తనకు భిన్నంగా సీమోను ప్రవర్తనను యేసు వివరించాడు. సీమోను యేసుకు పాదాలు కడుక్కోవడానికి నీళ్లివ్వలేదు లేదా శుభములు తెలుపుతూ ముద్దు పెట్టలేదు. మరియ తన కన్నీళ్లతో యేసు పాదాలను కడిగి ఆయన ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఆయన పాదాలను ముద్దుపెట్టుకోవడం మానలేదు. ఆమె ఆయనను మర్యాదగా మాత్రమే కాకుండా ప్రేమగా చూసింది. యేసు ఉద్దేశ్యం ఏమిటంటే, మరియ "విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను ... ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించును" (లూకా 7:47).

సీమోను యేసు ద్వారా స్వస్థత పొందాడు, కానీ అతని శారీరక స్వస్థత దేవుడు తన పాపాలను క్షమించడాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. సీమోను మరియ వలె పాపాత్ముడే.
ఆమె కంటే గొప్పవాడేమీ కాదు. కానీ ఆమె కంటే తానే చాలా యోగ్యుడని అనుకున్నాడు. అతను కుష్టువ్యాధి నుండి స్వస్థత పొందకముందు, ప్రజలు అతనిని అసహ్యంగా చూసేవారు, అయినప్పటికీ అతను ఇప్పుడు వారిలాగే ప్రవర్తిస్తున్నాడు. వారు ఎంత విరిగిపోయారో, వారికి రక్షకుని అవసరం ఎంత ఉందో అతను లేదా యూదా గ్రహించలేదు. వారు పశ్చాత్తాపంతో యేసు నొద్దకు వెళ్ళలేదు, వారి దృష్టిలో వారి రుణం చాలా తక్కువ, బహుశా ఏ రుణం లేదు. కాబట్టి, వారు యేసును చాలా తక్కువగా ప్రేమించారు. యేసు పట్ల తోటివారి పట్ల వారి ప్రేమలేని చర్యలే అందుకు నిదర్శనం. మీరు ప్రభువును మీ తోటివారిని ఎంత ప్రేమిస్తున్నారన్నది. ఆయన మీ పాపాలకు ఎంత చెల్లించాడని మీరు గ్రహించిన దానికి పరస్పర నిష్పత్తిలో ఉంటుంది.

మీ పాపపు రుణం కొరకు యేసు సరిగ్గా ఎంత చెల్లించాడన్న విషయాన్ని ఒక్కసారి మీరు అభినందిస్తే, మీరు అలాగే పాపం చేస్తూ పోవాలనుకుంటున్నారా? మీరు అలాగే అప్పులు చేస్తూ పోవాలనుకుంటున్నారా? లేదు. పాపులమైన మనం మరియ వలె స్పందించాలనుకుంటాం.. బహుశా మొదట చూస్తే, సీమోను ఇంట్లో యేసుకు ఆమె చేసిన సపర్యలు అతిగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి మనం సందర్భాన్ని గ్రహించిన తర్వాత, యేసు ఆమె కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు నిజంగా ఏమి చేసాడో అర్ధం చేసుకున్న తర్వాత, మరియ ప్రేమించినట్లుగా మనం ఆయనను ప్రేమించడం తప్ప మరేమీ చేయలేమని మనం గ్రహిస్తాం పరిమాణానికి మించి మనం ఋణపడి ఉన్నప్పటికీ మొగమాటం లేదా ఋణపడి ఉన్నందుకు కాదు. గాని, ఆయన ఎవరు అన్నదానికి అపారమైన కృతజ్ఞతతో ఆయనను ప్రేమిస్తాము.
మనం రుణపడి ఉండవలసినది యేసుకు మాత్రమే. మన ఋణం క్షమించబడిందనే నిజం మన హృదయాల్లో యేసును ప్రేమించాలనే బలమైన కోరికను రేకెత్తించాలి. మన స్వభావం ఆయన వలె మారాలి ప్రేమించే, క్షమించే గుణం. మనం మన తోటివారిని మనలాగే పాపులుగా చూస్తాము మరియు ఆయన వారిని ప్రేమించునట్లుగా వారిని ప్రేమించాలని కోరుకుంటాము. మనలో క్రీస్తు లేకుండా దీనిని మనం చేయడం అసాధ్యం. ఆయన మన రాతిగుండెను తీసివేసి మాంసపు గుండెను మనకివ్వగలడు. (యెహెజ్కేలు 36:26 చూడండి.)

అన్నింటికంటే మించి, యేసును గూర్చి ఆయన మీ కొరకు చెల్లించిన రుణాన్ని గూర్చి ఆలోచించండి. ఇది మీకు దేవుని బహుమానమును, ఆయనతో నిత్యజీవమనే వరమునై యున్నది. ఆయన దానిని మీకందిస్తున్నాడు. మీరు ప్రపంచ చరిత్రలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, ఆయనకు తిరిగి చెల్లించేంత డబ్బు గాని సరిపోయేంత పెద్ద క్రెడిట్ కార్డు గాని లేదు. దేవునికి మీ డబ్బు అక్కర్లేదు. ఆయన మీ నుండి ఎటువంటి చెల్లింపును కోరుకోనే కోరుకోడు. ఆయన నిర్ణయం తీసుకోమని మాత్రమే మిమ్మల్ని అడుగుతాడు. మీరు ఆయన బహుమానాన్ని ఆయన క్షమాపణ బహుమానాన్ని, నిత్యజీవాన్ని, నూతన హృదయాన్ని అంగీకరిస్తారా లేదా?

నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.