ఇద్దరు గొప్ప విజేతలు
12 మెట్లు

1. ధైర్యముగల భయములేని బోధ - అధికారుల ఎదుట సహితము
2. సాధారణ ఆహారము, జీవనవిధానము
3. డంబరమైన వస్త్రధారణ, సాధారణ దుస్తులు
4. ఇతరులను శిష్యులనుగా చేయుట
5. సశ్చాత్తాపమును గూర్చిన బాప్తిస్మము, స్వార్ధమునకు చనిపోవుటను గూర్చి బోధించుట.
6. వెల్లడైన వినయము
7. మతపరమైన హింసను సహించుట.
8. రాజు కంటే ముందుగా పరుగెత్తుట
9. దేవుని మహిమపరచుటలో అత్యున్నతాసక్తి
10. దేవుని బలిపీఠమును బాగుచేయుట
11. సందేశములు సంస్కరణను రగిలించును
12. ప్రజల దృష్టిని క్రీస్తు వైపుకు మళ్లించుట
దేవుని సైన్యము

ఒక అద్భుతమైన వాస్తవము: మన స్వరాలతో కూడిన ధ్వని తరంగాలు అంతరిక్షం గుండా అంతులేని ప్రయాణాన్ని సాగిస్తాయని శాస్త్రవేత్తలు మనకు చెప్పుచున్నారు మరియు చాలా సంవత్సరాల తర్వాత ఏదైనా గ్రహం మీద తగినంత సున్నితమైన పరికరాలతో నిలబడగలిగే శక్తి మనకు ఉంటే, మనం ఆ ధ్వని తరంగాలను మళ్లీ కనుగొని భూమిపై మనం మాట్లాడిన మాటలను తిరిగి సృష్టించవచ్చును.

ఇద్దరు గొప్ప విజేతలు

నులివెచ్చని సంఘం మరియు దేవునికి అవిధేయులైన పిల్లల-యుగంలో, ప్రజలకు యోధులు, గొప్ప గొప్ప పురుషులు-మరియు స్త్రీలు ప్రభువుతో మన సంబంధానికి నిజమైన అభిరుచిని తిరిగి తీసుకురావడానికి ఆదర్శప్రాయులుగా మార్గదర్శకులుగా ఉండేవారు. అవసరమై యున్నారు. ప్రత్యేక సందేశాలను లేదా వర్తమానాలను ప్రకటించిన బైబిల్ ప్రవక్తలు మరియు విశ్వాసాన్ని వెలిబుచ్చిన వారు మనం అనుకరించగల అద్భుతమైన వీరులు, పరిశుద్ధ గ్రంధంలోని గొప్ప. గొప్ప విజేతలలో ఇద్దరు ముఖ్యంగా గుర్తుకు వచ్చేవారు ఏలీయా మరియు బాప్తిసమిచ్చు యోహాను

వారి కాలంలో శక్తివంతమైన ఉజ్జీవాలను ప్రభావితం చేయడానికి దేవుడు ఈ ఇద్దరినీ వాడుకున్నాడు. నేడు మీ జీవితంలో నేటి సంఘంలో అదే చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మలాకీ 4:5, 6, "యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రసక్తయగు ఏలియాను మీయొద్దకు పంపుడును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును" అని చెప్పుచున్నది.

బహుశా ఈ వచనం అర్థం ఏమి కాదో అర్ధం చేసుకోవడానికి మనం మొదట కొంత సమయం వెచ్పించాలి. యేసు ప్రభువు కాలంలో, ఏలీయా మళ్లీ భూమిపై జీవించడానికి పరలోకం నుండి తిరగ వస్తాడని. లేదా బహుశా కొత్త వ్యక్తిగా తిరిగి జన్మిస్తాడని చాలామంది కాశ్వసించారు. యేసు ప్రభువు ఒకసారి శిష్యులను ఇట్లు అడిగిను, "నేనెవడనవి జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా వారు. బహిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి" (9:18, 19)

మెస్సీయా ఆగమనాన్ని ప్రకటించడానికి ఏలీయా త్వరలో వస్తాడనే నిరీక్షణతో యూదులు జీవించారు. కానీ మలాకీలోని ఈ ప్రవచనం పాత నిబంధన ప్రవక్త భూమికి తిరిగి వస్తాడని సూచించడానికి ఉద్దేశించబడలేదు.

బదులుగా, ఏలీయా యొక్క అదే ఉజ్జీవ సంస్కరణలతో కూడిన ఆత్మ తిరిగి వస్తుందని ప్రవచించబడింది. బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టుకను గూర్చి మాట్లాడుతూ, గబ్రియేలను దేవదూత జెకర్యాతో, "అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై పిలీయా యొక్కు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును" అని చెప్పెను (1:17)

బాప్తిస్మమిచ్చు యోహాను మలాకీలోని ప్రవచనాన్ని నెరవేర్చాడని గబ్రియేలు మొదటిగా సూచించాడు. ఉజ్జీవ సంస్కరణలతో కూడిన ప్రత్యేక పని చేయడానికి యోహాను ప్రభువు కంటే ముందుగా వెళ్లవలసి ఉంది. యేసు ఆ తరువాత, "యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే" అని చెప్పుచు ఈ వాస్తవమును ధృవీకరించెను (మత్తయి 11:13, 14)

అయితే, మలాకీ ప్రవచనం పూర్తి కావడం బాప్తిస్మమిచ్చు యోహానుతో ముగియదు. దీనికి ఆధునిక-దిన నెరవేర్పు కూడా ఉంది. "యెహెూవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును" అని ప్రవచనం చెప్పడాన్ని గమనించండి. ప్రకటన 6:17లో "ఆయన ఉగ్రత మహాదినము" అని కూడా పిలువబడే "యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము" రెండవ రాకడకు పర్యాయపదంగా ఉంది. కాబట్టి ఈ మరో నెరవేర్పు యేసు రెండవ రాకడకు సరిగ్గా ముందు, కాలానికి మనల్ని సూచిస్తుంది!

అక్షరార్థమైన కోణంలో నిజమైన ఉజ్జీవం కుటుంబానికి ప్రేమ "యొక్క కొత్త వ్యక్తీకరణను తెస్తుంది, అక్కడ నుండి అది సమాజంలోకి వ్యాపిస్తుంది. ఏదైనా సమాజం, ప్రభుత్వం లేదా సంఘం యొక్క అత్యంత ప్రాథమిక అంశం కుటుంబం. దేవుని ఆత్మ కుమ్మరింపు ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞల విధేయతకు దారితీసే ప్రేమకు ఫలితంగా వస్తుంది. యేసు. "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని చెప్పెను (యోహాను 14:15) కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో, ఏలీయా మరియు యోహానుల సందేశం లేదా వర్తమానం యొక్క ఆత్మ నేడు వారి పరలోక తండ్రికి అవిధేయులైన భూసంబంధమైన పిల్లలను ఏకం చేయడానికి కూడా పని చేస్తుంది.

12 మెట్లు

కాబట్టి ఈ ఇద్దరు గొప్ప ప్రవక్తలు ప్రభువు తరపున వియత మరియు కార్యాచరణ యొక్క నిరీక్షణతో కూడిన సందేశాన్ని, ఇంకో మాటలో చెప్పాలంటే, నిజమైన ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఎలా సహాయపడ్డాలో చూడడానికి ఒక క్లుప్త సమయాన్ని తీసుకుందాం. ఏలీయా ఆత్మ మరియు శక్తిలో చాలా భాగమైన 12 లక్షణాలు క్రీస్తు తిరిగి రావడానికి ముందు అంత్య దినాల్లో కూడా ఉంటాయి.

1. ధైర్యముగల భయములేని బోధ అధికారుల ఎదుట సహితము

*ఏలీయా ఏలీయా ఆహాబుతో, "నేను కాను, యెహోవా, ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననువరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు" అని చెప్పెను (1 రాజులు 18:18).

యోహాను - "యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పను" (మార్కు 617). బాప్తిస్మమిచ్చు యోహాను ఏలీయాలిద్దరూ అధిపతులు మరియు

ప్రభుత్వాల ఎదుట నేరుగా వర్తమానాన్ని బోధించడంలో నిర్భయంగా ఉన్నారు. ఇది అంత్య దినాల్లో మరొకసారి జరుగుతుందని యేసు చెప్పెను. "మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు" (మార్కు 13:9).

మనం మన ఆమోదాన్ని మనుష్యుల మధ్య కాక దేవునితో పొందాలని ప్రయత్నించాలి. గొప్ప ఉజ్జీవాన్ని నెలకొల్పడానికి, ఏలీయా వర్తమానం స్పష్టమైనదిగా, రాజీపడనిదిగా కొన్నిసార్లు ప్రజాదరణ లేని సత్యంగా ధైర్యంగా ప్రకటించబడాలి.

"ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు" గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథల వైపునకు తిరుగుకాలము వచ్చును" (2 తిమోతి 4:3, 4)

2. సాధారణ ఆహారము, జీవనవిధానము

ఏలీయా "నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని 35" (1 ຫຜ 17:11)

యోహాను - "యోహాను.. అడవి తేనెను మిడుతలను తినువాడు" (1:6)

ఏలీయా యోహానులిద్దరూ వారి సాధారణ ఆహారం, అరణ్య జీవనానికి ప్రసిద్ధి చెందారు. ఈ ప్రాధమిక కఠిన అనుభవాలు దేవుడు వారిని చేయమని పిలిచిన ప్రత్యేక పని కొరకు సిద్ధంగా ఉండునట్లు వారి మానసిక సామర్థ్యాలను స్పష్టంగాను వారి శరీరాలను బలంగాను ఉంచాయి. "కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి"(1 కొరింధీయులకు 10:31)

అదే విధంగా, అంత్య దినాల్లో సంఘం దేహానికి అత్మకు మధ్య బలమైన సంబంధం ఉందనే సత్యాన్ని పునరుద్ధరించాలి. మనం తినేవి త్రాగేవి. అలాగే మన వ్యక్తిగత జీవన అలవాట్లు మన మానసిక స్పష్టత మరియు సత్యాన్ని గుర్తించే సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. శోధనను ఎదిరించే శక్తిని సాధారణ ఆహారం, మితమైన జీవనవిధానంలో కొంతవరకు కనుగొనవచ్చు. గుర్తుంచుకోండి, తినకూడనిది తినడం వల్లనే మానవ జాతిపై పాపం వచ్చింది.

"దేశమా, నీ రాజు గొప్పయింది వాడైయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటకు నీకు శుధము" O (ప్రసంగి 10:17).

3. నిరాడంబరమైన వస్త్రధారణ, సాధారణ దుస్తులు

ఏలీయా "అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుపట్టి. కట్టుకొనినవాడు" (2 రాజులు 1:8)

యోహాను "యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు. (నడుముకు) తోలుదట్టియు ధరించు కొనువాడు" (మార్కు 1:6).
రాజులు యాజకులు ఆభరణాలు, పొడవాటి నిలువుటంగీలు ధరించడానికి ఇష్టపడే కాలంలో, ఏలీయా యోహానుల వినయం సరళత వార్షికొక గుచ్చుకునే గద్దింపుగా ఉన్నాయి.

ఆడంబరం మరియు లౌకిక ధోరణిపై ఇంత అహంకారపూరిత శ్రద్ధ ఎన్నడూ లేని యుగంలో మనం జీవిస్తున్నాం. ఆధునిక దుస్తుల డిజైనర్లు (తయారీదారుల) ప్రధాన లక్ష్యం ఒక వ్యక్తి యొక్క లైంగికతను ప్రత్యేక ఆకర్షణగా చూపించడం.

బాధాకరంగా, శరీర భాగాలను కుట్టించుకోవడం నుండి పచ్చబొట్లు పొడిపించుకునే వరకు ప్రతిదీ క్రైస్తవులమని చెప్పుకునేవారిలో కూడా " జరుగుతుంది. మరోసారి, తగుమాత్రపు దుస్తులు, రూపం ప్రవర్తన ద్వారా వినయం తగ్గింపు స్వభావంతో కూడిన మాదిరి చేత క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడానికి సంఘానికి అంత్యదిన ఏలీయాలు చాలా అవసరం.

"నీతియు యధార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను" (ఎఫెసీయులకు 4:24). "మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు నస్త్రముల చేతనేగాని జడలతోనైనను.

బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియలచేత తమ్మును తాము అలంకరించు( 2:9, 10)

4. ఇతరులను శిష్యులనుగా చేయుట

ఏలీయా - "ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి ... ఎలీషా కనబడెను. ... ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా" (1 రాజులు 19:19).

యోహాను 'యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి" (లూకా 7:18).

ఏ లీయా ఎలీషాను శిష్యుడిగా చేయడమే కాకుండా, ఇశ్రాయేలు

దేశమంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రవక్తల పాఠశాలలను ("ప్రవక్తల శిష్యులు" అని కూడా అనువదించబడింది) సందర్శించాడని లేఖనాలు నమోదు చేశాయి (2 రాజులు 21 ఈ శిక్షణా కేంద్రాలు ఆధ్యాత్మిక బోవను ఆచరణాత్మక క్రియా నైపుణ్యాలతో మిళితం చేశాయి. అక్కడ శిక్షణ పొందిన యువతీ యువకులు దేవుని మార్గాలను ఇతరులకు బోధించడానికి ఇశ్రాయేలు దేశమంతటా వెళ్లారు.

యోహాను, అలాగే, తనను అనుసరించిన శిష్యులకు బోధించడం. ద్వారా తన విశ్వాసాన్ని వ్యాపింపజేశాడు. యోహాను ఏలీయాలిద్దరూ. ఎక్కువ సమయం యాజకులు లేవీయులకు కాకుండా సాధారణ ప్రజలకు శిక్షణనివ్వడంలో వెచ్చించారు. అదేవిధంగా, దేవుని అంత్యకాల మహా ఉద్యమం కేవలం మతాధికారులచే మాత్రమే కాక, ఆత్మతో నిండిన సామాన్యులచే కూడా నిర్వహించబడుతుంది. అందుకే ఏలీయా సందేశం లేదా వర్తమానం దేవుని సంఘంలోని ప్రతి సభ్యునికి శిక్షణ, క్రమశిక్షణ, శిష్యరికం మరియు సమీకరణపై శ్రద్ధ వహించాలి.

5. పశ్చాత్తాపమును గూర్చిన బాప్తిస్మము, స్వార్ధమునకు చనిపోవుటను గూర్చి బోధించుట

విలీయా "అంతట ఏలీయా యెహెూవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా" (2 రాజులు 26).

యోహాను "ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతని యొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి" (మత్తయి 3:5, 6),

శ్చాత్తాపం బాప్తిస్మానికి గుర్తు అయిన యోర్ధాను నదికి ప్రజలను లవడమనేది ఏలీయా సందేశానికి సంబంధించిన ఒక గుర్తింపు చిహ్నం, సరిగ్గా మనం మనం బాప్తిస్మం ద్వారా నీటిలోకి ప్రవేశించి, కొత్త జీవితంలోకి అడుగుపెట్టునట్లే ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోకి ప్రవేశించాలంటే యోర్దాను నది దాటి వెళ్లాలి. సంఘానికి యేసు ప్రభువు, నియమించిన గొప్ప కర్తవ్యం భవిష్యత్తులో దాని అత్యుత్తమ గడియ నచ్చినప్పుడు పుంజుకుంటుంది, ఇది నేటితరం ఏలీయాలు మరోసారి పెంతెకొస్తు దినాన మారుమనస్సు పొందినటువంటి భారీ సంఖ్యలో ఉన్న ప్రజానీకానికి క్రీస్తులోనికి బాప్తిస్మమిచ్చినప్పుడు జరుగుతుంది.

అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను" (2 రాజులు 5.14).

"కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చును నేను మీకు ఏ యే సంగతులను అజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి" 28:19, 201

6. వెల్లడైన వినయము

ఏలీయా "ఏలీయా కర్మలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి నేల మీద ప ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను" (1 రాజులు 18:42)

యోహాను "నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, యన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను" (మత్తయి 3:11)

"ను ప్రభువు తిరిగి రాకముందే, దేవుని ప్రజలు అహంకారం యగర్వం బుసలుకొడుతున్న యుగంలో యేసు వంటి సాఫ్ట్వేకమైన వినయపూర్వకమైన స్వభావాన్ని ప్రతిబింబించడం నేర్చుకుంటారు. "మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు" (మీకా 6:8)

7. మతపరమైన హింసను సహించుట

ఏలీయా - "యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో (చంపించబడిన వారిలో) ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక" (1 రాజులు 19:2)

యోహాను - "గనుక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను" (మార్కు 6:24).

త నిబంధనలో, యెజెబెలు అనే అన్యమత రాణి ఇశ్రాయేలు రాజైన అహాబును వివాహం చేసుకుంది. యెజెబెలు ఆమె కుమార్తె అతల్యా దేవుని ప్రజలను హింసించి, ఏలీయాను ఇతర ప్రవక్తలను చంపడానికి అహాబును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు.

కొత్త నిబంధనలో, రాజైన హేరోదు యొక్క అన్యమత భార్య హేరోదియ ఆమె కుమార్తె సలోమే బాప్తిస్మమిచ్చు యోహానును చంపడానికి హేరోదును ప్రలోభపెట్టడంలో విజయం సాధించారు.

ఏలీయా యోహానులు అనుభవించిన హింస త్వరలో పునరావలతమవుతుంది. అంత్య దినాల్లో, ప్రకటన మనకు "వేశ్యల తల్లి" ఆమె కుమార్తెలు దేవుని శేషించిన ప్రజలైన అంత్యదిన ఏలీయాలను హింసిస్తారని చెప్పుచున్నది. "అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు.

ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలెను" (ప్రకటన 12:17)

"దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, నేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని" (ప్రకటన 17:5, 6).

8. రాజు కంటే ముందుగా పరుగెత్తుట

ఏలీయా "యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటే ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రయేలు గుమ్మము నొద్దకు వచ్చెను" (1 రాజులు 18:46)

మాహాను - "ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి. అని అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంధమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను" (లూకా 3:4, 6)

బిలు కాలాల్లో ఒక రాజు ప్రయాణం చేసినప్పుడు, సమీపించే రాజు కొరకు మార్గాన్ని సిద్ధం చేయడానికి సేవకులు తరచూ రాజు కంటే ముందుగా పరిగెత్తేవారు. వారు మార్గంలో రాళ్ళు అడ్డంకులను తొలగించి, గుంతలను పూడ్చి, ఎత్తయిన ప్రదేశాలకు మరమ్మతులు చేసి వంకర మలుపులను సరిచేసేవారు. అదే విధంగా, అంత్య దినాల్లో ఏలీయా.. వర్తమానాన్ని బోధించే వారు మన రాజైన యేసు ప్రభువు రాకడ కొరకు ప్రజలను సిద్ధం చేయడంలో సహాయపడతారు. వారు రక్షణ మార్గాన్ని స్పష్టంగా, సరళంగా మరియు సులభంగా అర్ధం చేసుకునే సందేశాన్ని ప్రకటిస్తారు. 120

"అప్పుడు మరియొక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని / ఆకాశమధ్యమున ఎగురుచుండెను" (ప్రకటన 14:6)

9. దేవుని మహిమపరచుటలో అత్యున్నతాసక్తి

ఏలీయా "యెహోవా, నా ప్రార్ధన ఆలకించుము, యెహోవాన నీవే దేవుడవై యున్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్ధన అంగీకరించుము" (1 రాజులు 18:37).

యోహాను - 'ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది" (యోహాను 3:30)

“యా వర్తమానాన్ని బోధించే వారు దేవుణ్ణి మహిమపరచడాన్ని తను ప్రధానాంశంగా పెట్టుకుంటారు యోహాను ఏలీయాల వలె వారు తమను తాము పూర్తిగా దేవుని పనికి సమర్పించుకుంటారు. ఇతరుల రక్షణార్ధం వారు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, ఇంకో మాటలో చెప్పాలంటే, వెచ్చించడం దేవుని పనికే, వాడబడటం దేవుని పనిలోనే.

"కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది" (రోమీయులకు 12:1)

10. దేవుని బలిపీఠమును బాగుచేయుట

ఏలీయా - "అప్పుడు ఏలీయా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడియున్న యెహెూవా బలిపీఠమును బాగుచేసేను" (1 18:30) 62

యోహాను - "ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి రలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను" (మత్తయి 3:1, 2),

ఏ బోధకు లీయా సందేశం "పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధకు తిరిగి రావడానికి బూర ధ్వనితో పిలిచే పిలుపు అవుతుంది. (యూదా 1:3). నేడు, బైబిల్ బోధలు పాత కాలానికి చెందినవని కాలానికి తగినట్లుగా వాటిని మార్చుకోవాలని చాలా మంది మనకు చెబుతున్నప్పుడు, "యెహోవానైన నేను మార్పులేనివాడను" అని దేవుడు చెప్పెనని మనం తీవ్రంగా గుర్తుచేసుకోవాలి (మలాకీ 3:6). ఏలీయా సందేశం "పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధకు తిరిగి రావడానికి బూర ధ్వనితో పిలిచే పిలుపు అవుతుంది. (యూదా 1:3), నేడు, బైబిల్ బోధలు పాత కాలానికి చెందినవని కాలానికి తగినట్లుగా వాటిని మార్చుకోవాలని చాలా మంది మనకు చెబుతున్నప్పుడు, “యెహోవానైన నేను మార్పులేనివాడను" అని దేవుడు చెప్పెనని మనం తీవ్రంగా గుర్తుచేసుకోవాలి (మలాకీ 3:6).

"పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును" ( 58.12)

11. సందేశములు సంస్కరణను రగిలించును

విలీయా - అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి" (1 రాజులు 18:19, 21)

యోహాను - "బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి" (మార్కు 1:4, 5) ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహాను కాలంలో, దేవుని ప్రజలు తమ చుట్టూ ఉన్న అన్యమత ప్రభావాలచే భ్రష్టుబట్టిపోయి దేవుని సత్యంతో రాజీ పడ్డారు (1 రాజులు 19:14, మత్తయి 3:1, 2). ధైర్యమే ఆయుధమైన ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుని ప్రజలలో ఉజ్జీవాన్ని సంస్కరణను పురికొల్పే వర్తమానాన్ని అందించారు.

నేడు, మరోసారి, క్రైస్తవత్వంలో ఎక్కువ భాగం మంది ప్రజలు నులివెచ్చని స్థితిలో ఉండి లోక విషయాలలో మునిగి తేలుతున్నట్లు అనిపిస్తుంది. తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమవుతున్నట్లయితే (యెహెజ్కేలు 9:6, 1 పేతురు 4:17), అప్పుడు ఖచ్చితంగా ఉజ్జీవం కు అక్కడ నుండే ప్రారంభమవ్వాలి! తన ప్రజలు లోకమంతటికీ చేరుకోవాలనేది దేవుని ప్రణాళిక కాబట్టి, సంఘానికి చేరునట్లు ఆయన మొదట ఏలీయా వర్తమానాన్ని పంపాలి.

పాత నిబంధనలో, ఏలీయా కర్మలు పర్వతంపై ప్రజలు పశ్చాత్తాపపడి, దేవుని వైపు తిరిగేలా చేశాడు. అప్పుడు అతను ప్రార్ధించగా, కరువును అంతం చేయడానికి దేవుడు సమృద్ధిగా వర్షం కురిపించాడు. అదే విధంగా, బాప్తిస్మమిచ్చు యోహాను తాను జీవించిన కాలపు ప్రజలకు పశ్చాత్తాపపడి యేసును అంగీకరించమని పిలుపునిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి, వారు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ యొక్క తొలకరి వర్షాన్ని పొందుకున్నారు. నేటితరం ఏలీయాలు పశ్చాత్తాపాన్ని గూర్చిన వర్తమానాన్ని కూడా బోధిస్తారు. అప్పుడు, సంఘం తనను తాను తగ్గించుకున్నప్పుడు. దేవుని ఆత్మ యొక్క కడవరి వర్షం కురుస్తుంది.

12. ప్రజల దృష్టిని క్రీస్తు వైపుకు మళ్లించుట

ఏలీయా - "ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా.... నీవు దేవుడవై యున్నావనియు.... ఈ దినమున కనుపరచుము (18:36)

యోహాను - "మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గౌళ్లైపిల్ల" అని చెప్పెను( 1:29)

టితరం ఏలీయాలకుండే తీవ్రమైన కోరిక, తపన ప్రజల దృష్టిని యేసు వైపుకు మరల్చడం, తద్వారా వారు ఆయనను ఎరిగి నిత్యజీవాన్ని పొందుకుంటారు.

దేవుని సైన్యము

ను మొదటి రాకడ కొరకు ఇశ్రాయేలును సిద్ధం చేయడానికి 50 ఒక ప్రత్యేక దూతను పంపడం ముఖ్యమని ప్రభువు భావిస్తే, యేసు రెండవ రాకడ (విమోచన ప్రణాళికకు సమాప్తి) కొరకు సంఘాన్ని మేల్కొల్పడానికి ప్రత్యేక వర్తమానాన్ని మరియు దూతలను పంపడం అయనకు ఇంకెంత ముఖ్యం?

ఉజ్జీవం మరియు సిద్ధపాటు పనిని జరిగించడానికి ప్రభువు. ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానులకు అధికారం ఇచ్చిన విధంగానే, దేవుడు నేడు గొప్ప ఉజ్జీవ పనిని జరిగించడానికి అంత్యదిన ఏలీయాల సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు! అమేజింగ్ ఫ్యాక్ట్స్ సంస్థ ఈ గొప్ప, అంత్య కాల ఏలీయా వర్తమానం - "ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై' (లూకా 1:17) భాగస్వాములు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.

"నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు మనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును" (కీర్తన 37:5).

వధూవరులు పాస్టర్ గారి ముందు నిలబడినప్పుడు, వారు చాలా విశాలమైన శాశ్వతమైన ప్రమాణాలు చేస్తారు... ఎల్లకాలం నిలిచి ఉపోయే వాగ్దానాలు చేస్తారు. ఈ ప్రమాణాలను వారు నెరవేర్చగలరనే విశ్వాసాన్ని వారికి ఏది ఇస్తుంది? అవి బలమైన ప్రేమ లోతైన నిబద్ధత కలిగి ఉంటాయి. అదే విధంగా, మనం మన బాప్తిస్మ ప్రమాణాడారు చేసినప్పుడు, దీని అర్ధం "అనారోగ్యము మరియు ఆరోగ్యమందును, క్షేమము మరియు ప్రతికూలత యందును, ఎండ మరియు వానయందును" వాటికి కట్టుబడి ఉండాలని మనం అర్థం చేసుకోవాలి.

దేవుని సంఘమనే కుటుంబంలో ఏ భూసంబంధమైన కుటుంబానికైనా ఉండే ఒకే విధమైన లోటుపాట్లు ఉంటాయి. కానీ మనం యేసును ప్రేమించి ఆయన ప్రజలను ప్రేమించటానికి కట్టుబడి ఉన్నట్లయితే, అది ఎలాంటి శోధననైనా పరీక్షనైనా తట్టుకునే విలువైన అనుభనం అవుతుంది.

పూర్తిగా మార్చబడిన, సమర్పణ కలిగిన క్రైస్తవుని ద్వారా చేన్నడు, ఎంత చేయగలడో అన్నదాని గురించి మనం కొన్నిసార్లు తక్కువగా అంచనా వేస్తామని నేను భావిస్తున్నాను! ఒక సాధారణ మనుష్యుడు, ఏలీయా యొక్క ప్రార్థనలు మరియు విశ్వాసం ద్వారా, ఇశ్రాయేలు దేశం తిరిగి దేవుని వైపు మళ్లింది. బైబిల్ వాగ్దానం ఏమిటనగా "నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్ధన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. భూమి తన ఫలము ఇచ్చెను" (໕໙ 5.16-18)

రాజైన దావీదు కూడా మనకు, "నీ మార్గమును యెహెూవాకు-అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును" అని గుర్తుచేస్తున్నాడు (కీర్తన 37:5),,

అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ, "నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను" అనేను (2 తిమోతికి 1.12).

వాస్తవానికి, సంపూర్ణ సమర్పణకు నిలువెత్తు నిదర్శనం యేసు ప్రభువు, "ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను" (1 పేతురు 2:23)

సమర్పణపై నాకు ఇష్టమైన ప్రకటనలలో ఒకటి క్రింద ఇవ్వబడింది. ఇది మనకున్న గొప్ప క్రైస్తవ రచయితలలో ఒకరైన ఎలెన్ జి. వైట్ గారి రచనల నుండి సేకరించబడినది.

"లోకములో అతి గొప్ప అవసరము మనుష్యుల అవసరము - కొనబడని లేదా అమ్ముడుబోని మనుష్యులు, వారి అంతరంగములో అంతఃకరణ శుద్ధి మరియు నిజాయితీ గల మనుష్యులు, పాపమును ఉన్నది ఉన్నట్లుగా వేలెత్తి చూపుటకు భయపడని మనుష్యులు, దిక్సూచికి సరైన రీతిలో దిశానిర్దేశము చేయు సూది వలె కర్తవ్యం పట్ల మనస్సాక్షికి నిజాయితీగా ఉండు మనుష్యులు, ఆకాశము విరిగిపడినను సత్యము కొరకు నిలువబడు మనుష్యులు అవసరము.

-ఎడ్యుకేషన్ (విద్య), ఇంగ్లీష్ పేజీ, 57

నా ప్రియ మిత్రమా, చేయాలనే తపన నిజంగా ఉంటే దేవుని సహాయంతో, ఒక వ్యక్తి తాను చేయాలనుకున్నది ఏదైనా చేయగలడని నేను తెలుసుకున్నాను. విశ్వాసం నిరీక్షణ ఉన్నచోట, నమ్మువానికి సమస్తము సాధ్యమని కూడా నేను నేర్చుకున్నాను. మీరు నిజంగా కోరుకుని నతే. ఒక శక్తివంతమైన, అత్మ-నిండిన క్రైస్తవునిగా సంఘంలో మీరు జీవించి విజయం సాధించగలరు.

అయితే, యేసు లేకుండా మనం రాబోయే తుఫాను కాలాల్లో ఖచ్చితంగా మునిగిపోతాము.

ఏకైక మార్గం : మీ పడవలో యేసును ఉంచుకోండి. లంగరు వేసిన

మిత్రమా, రాబోయే తుఫాను నుండి బయటపడటానికి ఇదే తాళ్లు చుక్కానిని ఆయనకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని మీ జీవిత తుఫానుల గుండా నడిపిస్తాడు. మిమ్మల్ని సురక్షితంగా పరలోకపు నౌకాశ్రయానికి తీసుకువస్తాడు.

కాబట్టి, నేడే ఒక దృఢ సమర్పణ చేసుకోవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను... ఆయనను మీ నావికుడుగా, ప్రభువుగా మరియు రక్షకునిగా ఉండమని, మిమ్మల్ని ఆత్మతో నింపమని వేడుకోండి.... ఆపై ఆయన ఎక్కడికి నడిపించిన ఆయనను నమ్మకంగా అనుసరించండి.

దేవుడు తన అద్భుతమైన కృష్ణను పంచుకోవడానికి ఏలీయాను ఎలా వాడుకున్నాడో, తద్వారా వచ్చిన అద్భుతమైన ఫలితాల గురించి మీరు చదివి యున్నారు. ఇప్పుడు లోకమంతటా ప్రజలను యేసు వద్దకు పిలిచే అంత్యదిన లక్షలాది మంది ఏలీయాలు ఏమి చేస్తారో ఊహించండి. మీరు వీరిలో ఒకరవుతారని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను.

నాగలిపై మీ చేతిని ఉంచి, గట్టిగా పట్టుకొని, వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలా యేసుకు ఈ సమర్పణ ప్రమాణం చేయడంలో మీరు ఇప్పుడు నాతో కూడా ఎందుకు చేతులు కలపకూడదు?

"అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే: నా జనము నీ దేవుడే వా దేవుడు, నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను. అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనేను" (రూతు 1:16-17)