విషయసూచిక
| 1. మృతులు మాట్లాడి వింటారా? |
| 2. జీవాత్మలు మరణించును |
| 3. ఆత్మ దేవుని యొద్దకు మరల పోవును |
| 4. నీతిమంతులు ఎప్పుదు ప్రతిఫలము పొందెదరు? |
| 5. మరణము ఒక నిద్ర |
| 6. మరణించిన వారు ఎప్పుడైన తిరిగి వచ్చెదరా? |
| 7. పునరుత్థానమందు శిక్ష మరియుప్రతిఫలములు |
| 8. సిలువ పైన దొంగ |

1. మృతులు మాట్లాడి వింటారా?
మానవుడు కనీసము 150 సం॥లు జీవించవలసియున్నదని రష్యా శాస్త్రవేత్త అలెగ్జాండర్ బోగోమోల్ట్స్ ఒకసారి చెప్పెను.
నిజానికి ముసలితనము రాకుండా శరీరము యొక్క బంధన కణజాలములను ఆటంకపరచెడి సీరం (రక్తము గడ్డకట్టిన తర్వాత స్రవించు పసుపు పచ్చని ద్రవమును) రక్తములో అతడు రూపకల్పన చేసెను. మానవునికిని తనకును 150 సం॥లు జీవించవలెనను లక్ష్యము చేరకుండానే 64వ యేట అనగా 86 సం॥లు ముందుగానే దురదృష్టవశాత్తు ఆ వైద్య శాస్త్రవేత్త చనిపోయెను. జీవము మరియు మరణము యొక్క రహస్య ప్రక్రియలను ఇంతవరకు మనము అర్ధం చేసుకోలేకపోయాము.
ఇప్పటి వరకు యువత యొక్క ఉత్పత్తి స్థానమును ఎవడును కనుగొనలేకపోయెను, మరియు మరణము యొక్క మునుగును దాటి తిరిగివచ్చి అవతలి ప్రక్కన ఎలా ఉండునో మనకు ఎవడును చెప్పలేదు. ఈ అంశముపైన అధికారిక సమాచారము దేవుని యొక్క గొప్ప పరిశుద్ధ గ్రంధములో మాత్రమే కనుగొనగలము. తరతరాలుగా స్త్రీ మరియు పురుషుల హృదయాలను కలచి వేసిన ప్రశ్నలకు జవాబు విశదపరచబడెను. నిలకడలేని, భావోద్వేగములను మరియు మూఢనమ్మకాలకును ఆ జవాబు భవిష్యత్తు గురించి భయపడువారికిని, మానవుడు మరణించిన 5 ని॥ల తరువాత అతని యొక్క ఆత్మ ఏమై ఉంటుందని ఆందోళన చెందు వారికిని తృప్తినిచ్చెడి ఆశ్చర్యకరమైన ఆధారము కల్పించును.
ఈ అంశమును పరిచయము చేయుటకు, గొప్ప మూలాధారమైన ప్రశ్నకు జవాబు కనుగొనవలెను. దానికి సరియైన జవాబు కనుగొనిన మరణము మరియు ఆత్మ గురించిన సందేహములకు జవాబు సూర్యరశ్మికి పువ్వు వికసించునంత తేలికగా ఉందును. అసలు ముఖ్యమైన సమస్య ఇదే, మానవుడు సహజమైన స్వాభావము కలిగియున్నాడు. అతనిని దేవుడు ఏ రీతిగ సృష్టించెను? మానవుడు మరణించు వాడా లేక అమరుడా? నిఘంటువు ప్రకారము మర్యుడు అనగా "మరణమునకు పాత్రుడు" అమర్యుడు అనగా "మరణము లేనివాడు" అను అర్ధము కలదు. నిష్కపటముగా దేవుని ప్రశ్నించునదేమనగా మానవుడు మరణించవలెనను స్వభావముతోనా.. లేక అంతములేని ఆయువు కలవానిగ సృష్టించబడెనా?
ఈ ప్రాముఖ్యమైన సందేహమునకు యోబు 4:16, 17 లో జవాబు ఉన్నది. "దేవుని సన్నిధిని మర్యులు నీతిమంతులగుదురా?" తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?" మనము వెదకుచున్న పదము ఇక్కడనే ఉన్నది! మానవుడు మర్త్యుడు. అతడు మరణమునకు పాత్రుడు, మానవుడు క్షీణించుటకు మరియు మరణించుకు దేవుడు సృజించలేదు. నిజానికి, దేవుడు నిత్యము ఉనికిలో ఉండు స్వాభావికమైన శక్తి కలవాడు. ఆయన అమర్త్యుడు. ఈ అమర్యుడనే పదము బైబిలులో ఒక్కసారి మాత్రమే వాడబడి దేవునికి సూచించుచున్నది. "సకల యుగములలో రాజైయుండి. అక్షయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు, మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్"(1 తిమోతి 1:17).
మానవుడు సహజ మరణము లేనివాడుగా ప్రతిష్టాపనము చేయబడలేదు. దేవుడొక్కడే సహజ మరణము లేనివాడుగా వాక్యము రూఢిగా చెప్పుచున్నది. జీవితమునకు కారకుడు ఆయనే, సమస్తమును ఉనికిలో నుండుటకు మూలము ఆయనే. ఆయన వలననే విశ్వములోని 4 మరణించిన వారి ఆత్మలు
సమస్త ప్రాణులు సృష్టించబడెను. "అ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గల వాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్" (1) 3 15, 16)
అమరత్వము యొక్క అంశమును గూర్చిన సందేహమును వేరే ఎవరైనను లేవనెత్తవచ్చును, మానవుడు క్షయమైన శరీరము కలిగి అక్షయమైన ఆత్మ కలిగియుండుట సాధ్యమేనా? బహుశా "నిజమైన" వ్యక్తి అసలు శరీరము కాదేమో. కానీ క్షయమైన శరీరములో అక్షయమైన ఆత్మతత్వము నివసించడమనేది శరీరము కావచ్చును. ఈ అంశముపై కలవరపడ నవసరములేదు. ఎందువలనంటే బైబిలు వాక్యము ద్వారా విషయము పరిష్కారము చేయబడెను.
2. జీవాత్మలు మరణించును
ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పినదేమనగా, "మనుష్యులందరు నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపము చేయువాడెవడో వాడే మరణము వొందును" (యెహెజ్కేలు 18:4) సహజముగా ఆత్మ అమరత్వము! లేనిని లేదా మరణమును చవి చూడదని కచ్చితముగా పై -హక్యము ఋజువు పరుస్తున్నది. అమరత్వము అనే ఈ పదమునకు మరణమునకు సంబంధించినది కాదు అంతర్లీనమైన అక్షయత కలిగిన అత్మకు మరణమున్నదనే ప్రశ్నే లేదు. ఇంకనూ పది వాక్యాలైనా ఆత్మ సహజముగా అక్షయము కాదని ఖచ్చితముగా చెప్పుచున్నవి.
మహా గొప్ప బోధకుడు, యేసుప్రభువు మత్తయి 10:28 లో చెప్పినదేమనగా, "అత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి" ఈ వాక్యము ద్వారా మానవుని ఆలోచనకు అతీతముగా, క్రీస్తు స్పష్టముగా వివరించెను. ఆత్మ మరణించును, నరకాగ్నియందు నాశనమవ్వగును. అందుచేత స్వాభావికముగా ఆత్మ అమర్త్యము కాదు.
అనేకమందికి ఇది దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. సంప్రదాయకమైన ఆలోచన విధానము దీనికి విరుద్దముగా నున్నది. "Soul" సోల్ (ప్రాణము) మరియు "Spirit" స్పిరిట్ (అత్మ) అను ఈ రెండు పదములు బైబిలులో 1700 సార్లు ఉన్నప్పటికిని ఏ ఒక్కసారి కూడ "Immortal" ఇమ్మోర్టల్ (అమర్త్యమని) గాని "Undying" అన్ డైయింగ్ (మరణములేనిదని) గాని సూచించబడలేదని తెలుసుకుంటే కలవరపెడుతుంది!
ఈ సిద్ధాంతము ఎక్కడ నుండి వచ్చినది? మనలో అనేకమంది బాల్యము నుండే ఆత్మకు మరణములేదని వినియున్నాము. ఒకటి మాత్రము వాస్తవము! ఈ సిద్ధాంతము లేఖనముల నుండి ఆరంభము కాలేదు. నిజానికి, విగ్రహారాధన, సాంప్రదాయము నుండియు పురాణము నుండియు ఉనికిలోనికి వచ్చెను. చైనీయుల పూర్వికులు పూజలలో ఆత్మ మరణించదనే నమ్మకములో పాతుకుపోయిరి. బగుప్తీయులు చిత్రలేఖనములలో ప్రాధమికముగ ఆత్మకు, మరణము లేదనే సిద్ధాంతమును, సూర్యభగవానుడి పూజలో బహిర్గతము చేసిరి. ఆత్మయొక్క పునర్జన్మను పరకాయ ప్రవేశమును హిందువులు చాలా ధృడముగా నమ్ముతారని భారతదేశములో అనేక సంవత్సరములు నివసించినపుడు గమనించాను, అంధకారమయిన ఆఫ్రికా దేశ మంత్రతంత్రములలో కూడా ఆత్మకు మరణము లేదని వారి ఆధారములలో కనబడుచున్నది.
ఈ విషయమై క్రైస్తవుల బైబిలు భోదనలో ఏ ఒక్క వాక్యములో కూడా ఆధారం లేదు. అయినప్పటికిని ఈ సిద్ధాంతము ఎలా ప్రారంభించబడెనో, ఎవరు ఈ అంశమును భోదించిరో లేఖనము మనకు తెలియచేస్తున్నది. ఆదికాండము 3:1-4 చదువుము. "దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను. అది ఆ స్త్రీతో- ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేనిఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు- మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము " - మీరు చావనే చావరు" అనెను.
'ఒక వ్యక్తి దేవునితో విభేదించినట్లు దయచేసి గమనించగలరు. పాపము వలన మరణము వచ్చునని సృష్టికర్త తెలియజేసెను. దానికి విరుద్దముగా "మీరు చాచనే దావరని" సాతాను చెప్పెను. అదిలో, చెప్పబడిన మొట్టమొదటి అబద్దమును ఎవరైతే చెప్పాడో... దానిని అప్పటినుండి సమర్ధించు కొనుచునే ఉన్నాడు. సహజ మరణము గూర్చి అనేక సంవత్సరములు తరచుగా బోధించినప్పటికి భోదకులు మరియు వేదాంతులు ఇంకను ఎక్కువగా తెలుసుకోవలసియున్నారు. కొన్ని సంవత్సరముల క్రితము అమెరికాలో పేరుగాంచిన ప్రొటెస్టంటు పరిచారకుడు "మరణము లేదు" అను అంశముపై "Readers Digest" (రీడర్స్ డైజెస్ట్) అను మాసపత్రికలో ఒక వ్యాసం ప్రచురించెను. ఆ గొప్ప మోసగాడు హవ్వకు ఏమని చెప్పెనో ఆ విషయమునే ఆ గొప్ప ప్రసంగీకుడు ఖచ్చితముగ అదే చెప్పెను. "అసలు మీరు మరణించనే మరణించరు అది మరణమువలె నుండును గాని, ఇంతకు ముందు తెలిసిన దానికన్నా ఎక్కువ తర్వాత తెలిసికొందురు."
ఈ సిద్ధాంతము అపాయకరమైనదా? నిజముగా ఒక అసత్య మరణము తెలియజేయుచున్న కథనము కన్నా లోతైన భావము కలిగియున్నది. ఈ సాతాను భోదల యొక్క ఊహలు చాలా లోతైనవియును శాశ్వత దుష్పలితాలను కలిగియున్నవి. మానవుని స్వభావమును గురించిన సత్యము వారికి అర్థము కాదు కాబట్టి లక్షలకొలది నాశనమగుదురు. మోసము ఈ ప్రస్తుత అంశమున ఒక ప్రవాహమువలె జీవితమును చీకటిలోను అపవిత్రాత్మ నియంత్రణలోను ఉంచుటకు మార్గము తెరచును. ఈ కృత్రిమ ప్రమాదమునకు ప్రతికూలముగనున్న ఒకే ఒక ఆధారము మాత్రం మరణము మరియు ఆత్మను గురించిన సత్యమును తెలుసుకొనుటయే.
3. ఆత్మ దేవుని యొద్దకు మరల పోవును
మరణము గురించి సొలొమోను వివరణ సృష్టముగాను, సంక్లిప్తముగాను, దైవజ్ఞానము ప్రేరేపించునట్టుగా ఇలా వ్రాసెను “మన్నయినదీ వెనుకటి వలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును" (ప్రసంగి 12:7).
"(తిరిగి) మరల" అనుపదము వెంటనే మనస్సుకు తట్టును. మరణము తరువాత సమస్తమును ఎక్కడ నుండి వచ్చెనో అక్కడికి పోవుచున్నట్లుగా అనిపించును. ధూళి, ఎక్కడ నుండి తీయబడెనో మరల తిరిగి ఆ భూమికి చేరును, మరియు ఆత్మ ఆత్మనిచ్చిన దేవుని యొద్దకు తిరిగి పోవును. మరణము అనగా సృష్టికి విరుద్ధము అనే అర్ధము వచ్చును.
శరీరము క్రుళ్ళి. క్షీణించి క్రమముగా చివికిపోవడము మనము చాల సుళువుగా ఊహించుకోగలము. శరీర భౌతిక భాగములు, అంగములు మట్టియేనని బాగా అర్థము చేసుకోగలము. మృతదేహము సమాధి చేయబడినప్పుడు దాని యొక్క శరీర రసాయన మూలపదార్థములు ఆదిలో సృష్టికర్త నేలనుండి తీసినట్లు మరల నేలకు పోవును.
అయితే దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిన ఆత్మ సంగతి ఏమిటి? ఆ విషయము చాలా సుళువుగా అర్ధం చేసుకోవచ్చును. ఈ విషయము మానవునికున్న జ్ఞానముతో వివరించగల మనిషి ఏ ఒక్కడునూ లేడు. అయినప్పటికిని అతి ప్రధానమైన విషయముపై బైబిలులో అనేక వచనాలు మనకు జ్ఞానము కలిగించుచున్నవి. యాకోబు ఈ విధముగా వ్రాసెను, "ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము" (యాకోబు 2:26). ఆత్మ అను పదమునకు లేక ఊపిరి అను పదమునకు దాదాపు ఒకే అర్థమని వ్రాయబడెను. గ్రీకు భాషలో అసలైన మూలపదము "Pneuma" (న్యుమా) ఈ పదము యొక్క అర్ధము "ఊపిరి" లేదా "గాలి". ఆంగ్లపదము "Pneumonia" (న్యుమోనియా) "Pneuma" (న్యుమా) అనే పదమునుండి తీయబడెను. ఎందుకనగా అది ఊపిరితిత్తుల వ్యాధి. మనకు "Pneumatic" (న్యుమాటిక్ ) టైర్లు అనే పదము కూడ "Pneuma" (న్యుమా) అను పదము నుండి వచ్చెను. ఎందుకనగా టైర్లలో గాలి ఉంది గనుక. అయితే అదే గ్రీకు "Pneuma" (న్యుమా) అను పదమునకు వేరే అర్ధము కూడా ఉన్నది. ఉదాహరణకు "Spirit" (స్పిరిట్) అనగా గ్రీకు పదమైనా "Holy Spirit () 5 "Hagios Pneumatos” ລ້ລ້ హగియోస్ యొక్క భావము "Holy Breath" హెూలీ బ్రెత్ (పరిశుద్ధ ఊపిరి) లేదా "Holy Spirit" హెూలీ స్పిరిట్ (పరిశుద్ధాత్మ) అను అర్ధము.
ఈ అంశము మనలను ఆశక్తికరమైన ముగింపునకు తీసుకువెళ్ళుతున్నది. ఊపిరి మరియు ఆత్మ అనే రెండు పదములు బైబిలులో పరస్పరముగానూ తరచుగానూ వాడబడినవి. యోబు చెప్పినట్లు "నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు" (యోబు 27:2), పై వాక్యములో ఊపిరి మరియు ఆత్మ అనే రెండు పదములు ఒకే అర్థమునిచ్చుననే వివరణ అర్థము చేసుకొనుటకు గొప్ప మేధస్సు అవసరము లేదు మానవునికి నాసికా రంధ్రములలో ఊపిరి మాత్రమే ఉన్నది. నిజానికి మానవుని సృష్టించినపుడు వాని నాసికారంధ్రములలో దేవుడు ఊపిరి ఊదెను. "దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను" (ఆదికాండము 2:7).
ఇప్పుడు ఈ వివరణ మనకు తేటతెల్లమగుచున్నది. ఊపిరి తిరిగి దేవుని యొద్దకు పోవును అని సొలొమోను చెప్పుటలో దేవుడు అదిలో మానవునికి యిచ్చిన ఊపిరి గురించి సూచించుచున్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఊపిరి యిచ్చెను కాబట్టి అది ఆయన యొద్దకే తిరిగిపోవును. ఆదికాండము 7:22 లో "జీవవాయువు" అనగా "జీవవాయువు యొక్క ఊపిరి" అని వివరించబడినది.
కీర్తనీయుడు కూడా మరణమును గూర్చి వివరించుటలో, "నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడచి మట్టిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు" (కీర్తన 104:29, 30, ఇక్కడ క్రమము మరణించిన వారి ఊపిరి మరల దేవుని యొద్దకు చేరును. కాని అత్మ తిరిగి వెళ్ళునని సొలొమోను చెప్పెను. ఇక్కడ మానవుని సృష్టించడానికి ఆత్మనిచ్చెను, కాని సృష్టించుటకు ఊపిరి నిచ్చెనని అదికాండము చెప్పుచున్నది. ఈ రెండు పదములను పరస్పరము ఒకే అర్ధము నిచ్చుననే భావము కలుగుచున్నది.
దయచేసి గమనించండి "జీవాత్మ" అనగా "పరిశుద్ధాత్మ" ""అని కాదు. "జీవవాయువు" అనగా మనము పీల్చుకొను గాలి అని అరమూ కాదు. ఈ ఊపిరి లేక ఆత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన శక్తి. అది పని చేయించగలిగే శరీరమును జీవాత్మను సృష్టించగలదు. సృష్టిలో దేవుని శక్తిని గూర్చి ఆలోచించుము. "దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను" (ఆదికాండము 2:7). మృతదేహములో, ప్రాణమునకు అవసరమైన నేలనున్న మూలపదార్థమలు కలిగియున్నట్లు అగపడుచున్నది. కాని దానిలో ప్రాణములేదు. గుండె కొట్టుకొనుట లేదు. రక్తమున్నది కాని ప్రసరణ కావడము లేదు. మెదడు ఉన్నది కాని అలోచించడము లేదు.
దేవుడు నిర్మించిన శరీరమునకు మరియొకటి జోడించెను. "వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను" (ఆదికాండము 2:7). ఈ పదాల యొక్క భావమును గుర్తించండి. వాటిని తరచుగ అపార్ధము చేసుకొనుచున్నారు. దేవుడు దేహములో ఆత్మను పెట్టలేదు. ఒకే ఒక దానిని జోడించెను అది ఊపిరి లేదా ఆత్మ కావచ్చు. తరువాత దేహమును ఊపిరిని జతపర్చగా మానవుడు ఆత్మ ఆయెను.
మానవుని సృజించుటకు దేహములో ఆత్మనుంచెనను వాడుకలో నున్న అసత్యమైన అభిప్రాయమును లక్షలాది మంది. అంగీకరించిరి. సాహిత్యములోను లేదా రూపకాలంకారము. యొక్క వాడుకలోనూ తప్ప, బైబిలులో ఆత్మ దేహము లోనికిగాని బయటకు గాని పోదు, అదీ కాకుండ దేహము బయట సేచ్ఛగాను ఉనికిలో లేదు. గ్రీకు భాషలో "Psyche" (సైకీ) అను పదమునకు అర్ధము "జీవము" అనియు, King James Version (కింగ్' జేమ్స్ వర్షన్) లో అత్మ అనియు అనువధించబడుటవేత తప్పుడు. అభిప్రాయమును కలిగియుండిరి. ఎందుచేతననగా ఆత్మ అను పదమునకు అప్రమాణికమైన నిర్వచనమును వారు అపాదించిరి.
ఆత్మ సహజముగానే అమరత్వము కలిగి ఉంటుందని లక్షలాదిమంది భోదించబడ్డారు. వారు ఈ పదమును చదివినప్పుడును వినినప్పుడును ఆ భావము బైబిలుకి పూర్తిగా విరుద్ధమని ఊహించుకొనుచున్నారు. బైబిలులో ఏ ఒక్కసారి కూడా ఆత్మ శాశ్వతమైనదనియు అమరత్వము కలదనియు సూచించబడలేదు.
ఎప్పుడైతే దేవుడు దేహమునకు ఊపిరి లేక ఆత్మను జోడించెనో దాని ఫలితముగ ఆత్మకు వివేకము కలిగెను. ఒక సాధారణ వివరణ ఈ నిజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడును. దేహమును ఒక విద్యుత్ దీపముగ పోల్చుకుందాము. ఈ విద్యుత్ దీపము లోనికి ప్రవహించు విద్యుత్ శక్తి దేవుడు మానవ శరీరములోనికి పంపిన జీవము కలిగిన ఊపిరిని సూచించుచున్నది. దీపములో నున్న వెలుగు ఆత్మను అగపరచుచున్నది దానికి ఊపిరి జోడించబడినపుడు దేహము జీవము గల మానవుడాయెను. ఆ ప్రకాశించుచున్న వెలుగును చూచినపుడు సృష్టి సంపూర్ణమైనదని గ్రహించగలము. దీపము ఆర్పి వేయడానికి స్విచ్ నొక్కుతాము. ఏమి జరిగింది? దీపము నుండి విద్యుత్ ప్రవాహము వెడలిపోయెను. మానవుడు మరణించినప్పుడు కూడా ఊపిరి అలాగునే వెడలి పోవును. ఇప్పుడు వెలుగు ఏమైనది? విద్యుత్ సాకెట్లోనికి పోయెనా? దీపము నుండి విద్యుత్ ప్రవాహమును వేరు చేయగానే వెలుతురు ఆగిపోవును. ఇప్పుడు మనము పరిశీలించుదాము. దేహము నుండి ఊపిరి వేరు చేయబడినప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది? శరీరమునకు జీవము యొక్క ఊపిరిని పునరుద్ధరించు వరకు ఆత్మ ఉండదు.
మరణించిన తరువాత సమస్తము ఏ రీతిగా మంటికి చేరునో మనము కనుగొంటిమి కనుక అది వాస్తవమేనని గ్రహించవలెను. సృష్టికి ముందు మానవుడు మూర్తీభవించిన ఉనికిలో లేదు. దేవుడు దేహమునకు ఊపిరి జోడించక మునుపు వ్యక్తిత్వమును, వివేకమును భావోద్వేగాలును లేవు. ఊపిరి ఊదినప్పుడే మానవుడు జీవాత్మ అయెను. ఆ కలయిక వలన ఆత్మ ఉనికిలోనికి వచ్చినా, అది ఎప్పుడు అంతరించిపోవును? ఆ కలయిక వేరు చేయబడినప్పుడే ఆత్మ నిలిచిపోవును.
ఉదాహరణకు మన ముందు రెండు వస్తువులు వున్నవి. చెక్కబల్ల మరియు మేకులు, సుత్తితో మేకులను చెక్కబల్లలోకి దించి ఒక చెక్క పెట్టెను తయారు చేస్తాము. ఇప్పుడు మనకు రెండు బదులు మూడు వస్తువులు ఉన్నవి; చెక్కబల్లలు, మేకులు మరియు చెక్కపెట్టె ఉన్నవి. తరువాత, జాగ్రత్తగా మేకులను లాగివేసి చెక్కబల్లల ప్రక్కన మేకులను ఉంచుదాము. ఇప్పుడు మరల మనకు రెండు వస్తువులు మాత్రమే మన ముందు ఉన్నవి. చెక్క బల్లలు మరియు మేకులు, చెక్కపెట్టె ఏమయినది? చెక్కపెట్టెలేదు. ఎందుచేతనంటే రెండు విషయాలు కలయిక వలననే అది తయారు చేయబడినది.
అ రీతిగానే దేవుడు రెండు వస్తువులతో ప్రారంభించెను. దేహము మరియు ఆత్మ రెండిటిని జోడించిన తరువాత జీవాత్మ ఉనికిలోనికి వచ్చెను. జ్ఞానులు చెప్పినదేమనగా మరణించినప్పుడు ఆత్మ దేవుని యొద్దకును దేహము మంటికిని తిరిగిపోవును. దేహమును విడిచిన తరువాత ఆత్మ జీవించునని లేక దేహము లేకుండ ఉనికిలోనుండునని బైబిలులో ఎక్కడ వ్రాయబడలేదు. ఆత్మ లేదా జీవము దేవుని యొక్క శక్తి లేకుండా దేహములో మండలేదు. మరణించినపుడు ఆ శక్తి తీసివేయబడుతున్నది. ఊపిరి దేవామును చేరక ముందున్నట్టుగానే మానవుని యొక్క స్థితి ఉండును. అనగా ప్రాణము లేదు, వివేకము లేదు మరియు వ్యక్తిత్వము లేదు.
జంతువులు కూడా ఆత్మలేనని బైబిల్లో సూచించబడినది. ఎందుకనగా అవి జీవించడానికి దేవుని యొద్ద నుండి అటువంటి శక్తియే ఉన్నది. (ప్రకటన 16:3), ఒక జ్ఞాని ఈ విధముగా వ్రాసెను. "నరులకు సంభవించునది యేదో అదే మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమియు ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థమే. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే పోవును" (ప్రసంగి 3:19, 20). మానవులకు మరియు జంతువులకు చివరికి ఒకే ముగింపు ఉండుననేది నిజము కాదు. అది మానవుడైనను, జంతువైనను దేవుని యొక్క ధర్మము ననుసరించి వానికి పునరుత్థానమును, తీర్పును, జీవమును దేవుని యొద్ద నుండియే వచ్చును. బైబిలులో ఆ జీవమును ఆత్మయేనని సూచించుచున్నది.
4. నీతిమంతులు ఎప్పుడు ప్రతిఫలము పొందెదరు?
ఈ ఆధారముతో మానవుడు మరణించిన, వాస్తవముగ ఏమి జరుగునో మనమిప్పుడు గ్రహించగలము. వేయి సంవత్సరములకు ముందుగానే మరణించిన దావీదు గురించి పెంతుకోస్తు దినమున పేతురు ఈలాగు చెప్పెను "దావీదు. పరలోకమునకు ఎక్కిపోలేదు" (అపోస్తలుల కార్యములు 2:34). ఈ విషయమై ఒక క్షణము ఆలోచించుదము. దావీదు బాలకాలం క్రితము మరణించినను తరచుగా అవిధేయుడై జీవించినను, క్షమాపణయును రక్షణ అందుకొనుటకు హామీ ఇవ్వబడెను. ఆయన వెయ్యిసంవత్సరములుగా పరలోకము యొక్క ఆనందమును ఎందుకు అనుభవించ లేకపోయెను? ఈ ప్రశ్నకు జవాబు 29వ వచనము లో పేతురు వివరించెను. 'సహోదరులారా మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగ మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది."
పేతురు ప్రేరేపణతో ఈలాగు చెప్పెను. మరణించిన దావీదు ఇంకను సమాధిలోనే యున్నాడు. పరలోకమునకు ఆరోహణము కాలేదు. ఇది చాల ఆసక్తికరమైనది! దేవునికి అతిప్రియుడైన దావీదు మరణించి వేయి సంవత్సరములు గతించినను ప్రతిఫలము పొందలేదు. మరి అప్పటి వరకు పవిత్ర జీవితము గడిపి మరణించిన వారి సంగతి ఏమిటి? వారు కూడ సమాధిలో విశ్రాంతి తీసుకొనుచు పునరుత్థానమున దేవుని యొక్క పిలుపు కొరకై వేచియున్నారు.
యేసు తనతోటి ప్రజలకు హామీ ఇచ్చెను "నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను" (లూకా 14:14), మరల ఈ విధముగ చెప్పెను. "మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును"
(మత్తయి 16:27), ఇక్కడ సందేహాస్పద ప్రకటన ఏదియు లేదు. వాస్తవముగా, యేసు తన రెండవ రాకడ పునరుత్థానము వరకు ఎవరికిని ప్రతిఫలము ఇవ్వబడదని అందరికి అర్ధం అయ్యేల ప్రకటించెను. దీని భావమేమనగా ఇప్పటి వరకు మరణించిన నీతిమంతుడు ఎవడును పరలోకము చేరలేదు. ఈ లోకము అంతమునకును తీర్పు కొరకును, సమాధులలోనే వేచియున్నారు. బైబిలులో ఆఖరి వాక్యాలను ఈ వాస్తవాలు స్థిరపరచుచున్నవి. "ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద వున్నది" (ప్రకటన 22:12). ఈ కడవరిదిన ప్రతిఫలమును పౌలు ఈ రీతిగ వర్ణించెను" క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది" (1 కొరింధీయులకు 15:53), ఇది ఎప్పుడు సంభవించును? "ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరమును మార్పుపొందుదుము" (1 కొరింధీయులకు 15:52).
నీతిమంతుల యొక్క ప్రతి ఫలము విషయమైన వివాదాంశము పరిష్కరించబడును. అయితే పాపి విషయము ఏమిటి? వారు. చేసిన పాపములకు ఎప్పుడు శిక్షింపబడుదురు? దీనికి ఆశ్చర్యమైన జవాబు 2 పేతురు 2:9 లో ఉన్నది. "భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్ణీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో నుంచుటకును, ప్రభువు, సమర్థుడు." జవాబు ఉన్నది! దుర్ణీతివరులు తీర్పు యొక్క దినము వచ్చు వరకు ఎక్కడనో దాచిపెట్టబడుదురు. ఎక్కడ దాచిపెట్టబడుదురు? యేసు దీనికి జవాబు యిస్తున్నాడు. "దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని, మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు" (యోహాను 5:28, 29).
ప్రతి ఒక్కరును పునరుత్థానమున జీవమునకు లేదా దండనకు గాని పిలువబడినప్పటి వరకు సమాధులలో దాచిపెట్టబడుదురని మన ప్రభువు మిక్కిలి స్పష్టముగ చెప్పెను. ఇది మంచి వేదాంతమే కాకుండ మంచి జ్ఞానము. తీర్పు వెలువడు వరకు ఎవరును శిక్షింపబడరు. అనేది నిజం. న్యాయము దీనిని అజ్ఞాపిస్తున్నది. ఈ లోకములో అన్యాయము చేస్తున్న న్యాయమూర్తి కూడ దోషారోపణము చేయబడును. దొంగతనము చేసినట్టు నేరారోపణకు గురైన వ్యక్తి విషయమై న్యాయమూర్తి ఇలా తీర్పునిచ్చెను. "పది సంవత్సరములు చెరసాలలో వేసి తరువాత వీని వ్యాజ్యము విందాము" లేదు! లేదు! అలా జరుగదు! సకల లోకమునకు న్యాయమూర్తి పాపి యొక్క విషయములో అలా చేయునా? ఏ సందర్భములోను కాదు! అటువంటి వ్యాజ్యమునకు అర్థం లేదు అది హాస్యాస్పదముగా నుండును.
బైబిలులోని అద్భుతమైన వార్త ఏమిటనగా పునరుత్థాన దినము వరకు మంచి వారును దుర్మార్గులును వారి సమాధులలో నిద్రిస్తూనే ఉందురు. ఆ సమయమున తీర్పునందు నిలుచుటకు లేపబడుదురు. తరువాత .ప్రతిఫలమునకు లేక శిక్షకు అప్పగించబడుదురు. యోబు చెప్పినదేమనగా, "అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించి పోవు వరకు వారు మేలుకొనరు ఎవరు వారిని నిద్రలేవజాలరు. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటుననుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణము తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును. అలాగుండిన యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును" ( 14:12-15).
5. మరణము ఒక నిద్ర
యోబు తన యొక్క ప్రతిఫలము పొందక మునుపు అపస్మారక స్థితి అనగా సమాధియను నిద్రనుండి మేలుకొనిన వివరణ బైబిలు వాక్యములతో సమంజసముగా యున్నది. క్రీస్తు రాకడ గురించి మాట్లాడిన దానియేలు ఈలాగు చెప్పెను. "ఆ కాలమందున జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును ... నీ జనులలో గ్రంధమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు... సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు" దానియేలు 12:1, 2) అనేకమంది రచయితలు మరణము ఒక నిద్రేయని ప్రేరేపింపబడి వ్రాయుటకు ఒక కారణమున్నది. ఒక అలసిన వ్యక్తి రాత్రి పడుకొనిన వెంటనే నిద్రలోనికి జారుకొనును. అది మరణించిన వాని స్థితి యొక్క పరిపూర్ణ వివరణ. అతనికి సంబంధించిన విషయమేమనగా అతడు నిద్ర నుండి లేచినట్లయితే సూర్యోదయమైనట్లే. అతను నిద్రపోవుచున్నప్పుడు ఏమి జరిగెనో తనకు పూర్తిగా తెలియదు. మరణము యొక్కస్థితి ఇదియే.
లాజరు మరణించెను. యేసు తన శిష్యులతో ఈ మాటలు. చెప్పెను, "మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా "శిష్యులు - ప్రభువా అతడు నిద్రించిన యెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గానీ వారు మాత్రము ఆయన నిద్ర మరియు విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి; కావున యేసు - లాజరు చనిపోయెను అని స్పష్టముగా చెప్పెను” (యోహాను 11:11-14).
మరణము గురించిన బైబిలు యొక్క బోధనలో గొప్ప సత్యము ఉదాహరణగా ఇక్కడ ఉన్నది. మరణము ఒక నిద్రయని క్రీస్తు పలికెను. రాతిలో చెక్కబడిన ఆయన స్నేహితుని యొక్క సమాధి వద్ద నిలబడి కేకవేసెను. "లాజరూ, బయటకు రమ్ము". లాజరు తన సమాధి యొక్క గోడల మధ్యనే ఉన్నాడు గాని పరలోకములోనైన భూలోకములోనైనను ఎక్కడనూ లేడు. యేసు యొక్క పిలుపు వినగానే లాజరు మరణము యొక్క నిద్రనుండి మేలుకొని నడచుకొనుచు సమాధినుండి వెలుపలికి వచ్చెను.
మరణము నుంచి తిరిగి లేచిన వారి గురించి అతిశయంగా చెప్పుకొను అనేక వృత్తాంతములు ప్రచారము చేయబడినవి, కానీ లాజరు యొక్క వృత్తాంతము మాత్రమే అన్నిటికన్నా యదార్థమైనది. లాజరు మరణించి నాలుగు దినములు గడిచెననుటలో ఖచ్చితముగా ఎటువంటి అనుమానము లేదు. సమాధి రాయిని తొలగించమని ఆజ్ఞాపించగా అతని సహోదరీలు నిరసన తెలిపిరి. "యేసు రాయి తీసి వేయుడని చెప్పగా ... మార్త- ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను" ( 11:39).
గుండె వైఫల్యం నుండి పునరుజ్జీవము పొంది కోలుకున్న రోగుల యొక్క అనేక ఆధునిక ఖాతాలలో పరలోకం యొక్క అద్భుతమైన దృశ్యాల యొక్క నాటకీయ వరనాలు ఉన్నాయి. ఈ నీతిగల మానవుడు నాలుగు దినముల మరణము గురించి ఏమి చెప్పగలడు? పరలోక ప్రతిఫలము యొక్క దివ్యదర్శన సమాచారము గురించి చెప్పెనా? ఒక్క మాట చెప్పలేదు. యేసు చెప్పిన విధముగానే అతడు నిద్రించుచుండెను. అది ఒక మరిచిన క్షణం వలె యున్నది.
అన్నట్టు, దేవుని ప్రత్యక్షత నుండి మరలా ఈ చీకటి ప్రపంచములోనికి తీసుకొని రాబడినట్లయితే చెప్పనలవి కాని శిక్షయే కదా? నీతిమంతుల యొక్క ప్రతిఫలము నిజముగా లాజరు ఆనందించుచున్నట్లయితే మరలా తిరిగి భూలోకమునకు పంపవద్దని తప్పక బ్రతిమిలాడియుండెడివాడు. 96 గంటలు పరదైసులో వుండి తిరిగి ఈ లోకము యొక్క జీవితము ప్రారంభించవలెననిన నరకము యొక్క భీతికన్న అధ్వాన్నంగ ఉండును. నిజానికి ప్రభువు తన స్నేహితుడైన లాజరుపై మోసముతో పరిహాసము చేస్తూ ఎప్పుడూ అపరాధి కానేరడు.
మరణమును వివరించడానికి యేసు ఉపయోగించిన సులభమైన పదజాలమును అర్ధము చేసుకొనుటకు ఎందుకు కష్టపడుచున్నాము? ఖచ్చితముగ నిద్రయొక్క స్వభావమును మనము అర్ధము చేసుకొనుటకు ఎటువంటి సమస్య లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యాన వనములో బల్లపై గాఢనిద్రలో ఉన్నాడు అనుకుందాము. ఆ గాఢనిద్రలో అతనికి తెలియకుండా ఎవరైనా అకస్మాత్తుగ సమీపించి దాడి చేసినట్లయితే, మరుక్షణమే అతను రక్తపు మడుగులో పడి ఉంటాడు. మరణము యొక్క ప్రసిద్ధిగాంచిన ఆలోచన ప్రకారము, ఇప్పుడు నిద్రలో నున్న అతనికి ఏమి తెలియదు. కానీ వెంటనే తన ఆత్మ శరీరము విడచిపోతుందని తెలుసుకోగలడు. అది ఎంత వరకు వాస్తవము? మణము ఒక నిద్రయని యేసు చెప్పెను. నిద్రపోతున్నప్పుడు మానవునికి ఏమి తెలియనప్పుడు మరణించిన తరువాత ఎలా తెలుసుకొనగలడు? కుయుక్తితో మనము నమ్మినట్లుగ ఆ మాటలకు అర్ధము మనము మార్చుకొనిన యెడల క్రీస్తు చెవి మాటలకు అర్ధము లేదు.
ఆ మరణము నిద్ర యొక్క స్వాభావమును గురించి అపోహపడుటకు విడిచిపెట్టబడలేదు. బైబిలు వ్రాసిన అనేకమంది. మరణము ఎలా ఉండునో సవిస్తారముగా ఈలాగు వివరించెను. "రాజుల చేతనైనను. నరుల చేతనైనను, రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు. మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును"(15 146:3, 4).
మరణమును గూర్చి కలవర పెట్టు కారణములన్నిటిని మనము చర్చించినప్పుడు, రచయితలు ప్రేరేపింపబడి అపస్మారక స్థితి గురించి తరచూ మాట్లాడిరి. మరణము తరువాత జీవము యొక్క వివరణను యిప్పటి బాషాంతర సిద్ధాంతమును ఒక్కసారైనను మనము కనుగొనలేదు. అనందకరమైన విగ్రాహారాధన పద్ధతులను నేరుగా వేదాంతశాస్త్రం లోనికి స్వీకరించబడినది. దావీదు చెప్పిన రీతిగా అతడు మన్నై పోవును. అదే రోజున ఆయన ఆలోచనలు నశించిపోవును.
సొలొమోను వ్రాసినది. "బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారి పేరు మరువబడియున్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు. అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతులేదు. . . .... చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము; నీవు పోవు పాతాళము నందు పనియైనను, ఉపాయమైనను, తెలివియైనను, జ్ఞానమైనను లేదు" ແລ້ວ 9:5, 6, 101
ఎవడైనను బలమైన పదజాలములతో మరియు తమ వైఖరిని ఉద్దేశపూర్వకముగా మరణము పూర్తిగా కలలు లేని నిద్రయని బలపరచు ప్రయత్నించిన, జ్ఞానము కలవాడని, అతడు చెప్పిన మాటలతో సరిపోల్చుట చాలా కష్టమే, మరణము తరువాత సృహ ఉంటుందని స్థిరముగాను ప్రభావితమైన కారణము ఇచ్చాడని ఒక క్షణము న్యాయపరముగా ఆలోచించుకొందాము. ఇంకో విధముగ సొలొమోను ఈలాగు చెప్పెను. "వారి ప్రేమయును వారి ద్వేషమును వారి అసూయను కొనసాగును... అక్కడ పనియును, తెలివియును, జ్ఞానమును నీవు పోవు సమాధిలో వుండదు". అటువంటి కపటములేని వివరణ ఈ అంశముపై నున్న చర్చలకు సరైన ముగింపు. పై వాక్యమును గూర్చి ఎవరు వాదించగలరు?
అయితే యిక్కడ నమ్మశక్యము కాని సత్యమున్నది! బైబిలులో అటువంటి వివరణ లేదు కాని దానికి విరుద్దముగ పదే పదే ప్రకటిస్తున్నది. అయినప్పటికిని ప్రజలు వారికి కావలసిన నమ్మకములోనే కొనసాగుచున్నారు అనేక రచయితలు ప్రేరేపింపబడి మరణమును గూర్చి సత్యమును గూర్చి స్పష్టముగా తెలుపుచున్న వాక్యాలను వదలి తల్లిదండ్రులు లేదా పాస్టరుల వద్ద నుండి అర్థములేని ఆచారములను నేర్చుకొని గ్రుడ్డిగా వాటిని నమ్ముచు. అనుసరిస్తూ వున్నారు.
మరలా ఇంకొక వాక్యము చదువుకొందము. "పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపాను సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు" (యెషయా 38:18, 19) మరణించగానే నీతిమంతుడు పరలోకమునకు కొనిపోబడినట్లయితే వారు దేవుని స్తుతింతురు.కదా! దావీదు ఆ సత్యమును పదే పదే చెప్పుచున్నాడు, "మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు" (కీర్తనలు 115:17). "మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?" (§ 6:5).
6. మరణించిన వారు ఎప్పటికైన తిరిగి వచ్చెదరా?
ఔబిలు సంబంధమైన వివరణలు స్పష్టముగా అర్థమైనప్పటికిని అనేకులు ఎందుకు వ్యతిరేకిస్తారు? బలమైన సాంప్రదాయ బద్దమైన పక్షపాత అభిప్రాయాలు దీనికి జవాబై యుండవచ్చు. అయితే దీనికన్నా ఎక్కువ వ్యతిరేకత ఉండవచ్చును. మరణించిన వారు తిరిగి వస్తారని భౌతికముగాను ప్రత్యక్షంగాను సాక్ష్యాలు ఉన్నట్లు అనేకమంది వాస్తవంగా నమ్ముతారు. విడచిపోయి వెళ్ళిన ప్రియమైన వారితో సాక్ష్యాత్తు మాట్లాడినట్లు వారి యొక్క అనుభవములే సాక్ష్యము నిస్తున్నవి. ఈ ప్రత్యక్షతలను గురించి ఏమని చెప్పవచ్చును. మరణించిన బంధువులు లేదా స్నేహితులు బ్రతికి ఉన్నప్పటి ఎదురుపడ్డ స్థలము, తేదీ మరియు గడియలు వారు ఖచిచ్చితముగా చెప్పగలరు.
నిలకడలేని ఆవేశపూరిత వ్యక్తుల యొక్క మతిభ్రమలు వలె అతీంద్రియ ప్రత్యక్షతలు నమ్మదగినవి కావని మనము నిరాకరిద్దామా? లేదు, వాస్తవముగా ఆ రూపములు కనబడతవి, అనేక సార్లు అవి ఋజువు చేయబడ్డవి. అయితే ఆ రూపములు మరణించిన వారి యొక్క ఆత్మలు కావని అమోఘమైన దేవుని యొక్క లేఖనము ఆధారముగ నిస్సంశయముగా నిరాకరించవచ్చును. మరణించిన వారు తిరిగిలేవరు; లేదా ఏ ధర్మము ప్రకారమైనను పంచనామా (పోస్ట్ మోర్టెమ్) తరువాత జీవించియున్న రూపము ఉనికిలో లేదనే చెప్పవచ్చు.
మరి వీరి శరీర రూపములలో ఎవరు కనబడుచున్నారు. మరియు మరణించిన అమాయకుల యొక్క పేరు తమదేనని అబద్ధమాడుచున్నారు. ఇంకెవరు, అబద్ధములకు తండ్రి మరణము యొక్క అంశము చుట్టూ పట్టు బిగించి మోసము చేసినవాడెవడు? దేవుణ్ణి ధైర్యముగా వ్యతిరేకిస్తూ హవ్వతో యిట్లనెను "మీరు చావనే చావరు." మానవుడు మరణమునకు పాత్రుడైనప్పుడు అది ఒట్టి భ్రమ మాత్రమేనని బ్రతికి యున్న వానికి నమ్మబలికెను. మరణించిన వారి రూపముతో ప్రత్యక్షమై, దేవునిదే తప్పు; నాదే సత్యమని లక్షలాదిమందిని లోబరచుకొనెను. బైబిలు యొక్క ప్రమాణికమును మించి వారు చూచినదియును, విన్నదియును సాక్ష్యముగ వారు అంగీకరించుచున్నారు. పితరుల ఆత్మలను పిలచుటలో అనేకులు వివేష జ్ఞానమును సంపాదించుకున్నారు.
ఎవరైతే తమ బంధువులును పోగొట్టుకొని విచారములో నుంటారో సాతాను తన స్వలాభం కోసం వారిని తరచుగా వినియోగించుకొనుటకు తన యొక్క ఆధ్యాత్మికంగా కనబడు వలలోనికి ఆకర్షించడానికి వారి వారి ప్రియమైన వారిలా నాటకీయంగా వ్యవహరించును. ఎంతటి ఘోరమైన మోసము బైబిలు సత్యాలతో తమ మనస్సులను ధృడపరచబడినవారు మాత్రమే ఇటువంటి దాడులను ఎదుర్కొనగలరు.
సాతాను నమ్మశక్యము కాని పనిచేయు విధానము యొక్క ఉదాహరణను మీతో పంచుకోనివ్వండి. నా ప్రియమైన స్నేహితుడు ఆఫ్రికాదేశములో సువార్త సేవచేసెను. భార్యభర్తలిరువురు ఒక మారు మూలప్రాంతములో పరిచర్య చేస్తుండగా, వారి మూడు సంవత్సరముల బిడ్డ ప్రాణాంతకమైన జ్వరము వలన మరణించినది. వారి నివాసము వద్దనె కొండ ప్రక్కనే ఆ చిన్నబిడ్డను సమాధి చేసిరి. సమాధి చేసిన కొన్నిరోజుల తరువాత తల్లి వంటగదిలో కూర్చునియుండగా అకస్మాత్తుగా తలుపులు తెరచుకొని ఆమె చిన్నబిడ్డ -తనంతట తానే గది అడ్డముగా రువ్వున వచ్చి తల్లి కౌగిలిలోనికి దూసుకు వచ్చెను. ఘోరమైన బాధలో ఉన్నప్పుడు అటువంటి దృశ్యమును మీకు మీరే ఊహించుకోగలరా? దానికి తోడు అమ్మా నేను చనిపోలేదు! నేను చనిపోలేదు అని బిగ్గరగా కేకవేసెను.
మరణము విషయమైన బైబిలు సత్యము ఆ తల్లికి తెలుసును కనుక సాతాను మారువేషము నుండి తక్షణమే ప్రార్ధన చేయటానికి దేవుడు ఆమెకు శక్తినిచ్చెను. యేసు యొక్క నామమును పిలచిన వెంటనే ఆ రూపము అదృశ్యమాయెను.
ఇది ఒక అసాధారణమైన దృష్టాంతమా? దురదృష్టవశాత్తు కాదు. ఇటువంటి అనుభవాలు పదే పదే పునరావృతము కాలేదు. గారడి చేయువారు తమ సొంత భ్రమలను సృష్టించగలవారు కొంతమంది ఉన్నారనుటలో అనుమానము లేదు. అయితే దుర్మార్గమునకు యువరాజు తరచుగా తన ప్రజల యొక్క మనస్సును మానవాతీతమైన నైపుణ్యముతో యేమార్చి మోసగించునని మనము గురుతుపట్టవలెను.
దీని యొక్క చిక్కులను గూర్చి ఒక్క క్షణం ఆలోచించండి. లక్షలాదిమంది వారి జీవితములను అక్షరాల పిశాచాల నియంత్రణకు సమర్పించుకొని వారు తమ ప్రియమైన బంధువులే సలహాలు యిస్తున్నారని నమ్ముచున్నారు. ఆ వికృతమైన పరిహాసమును చూడలేకపోతున్నారా? మరణమును గురించిన వాస్తవ బైబిలు బోధలను అర్ధము చేసుకొని క్రైస్తవులను సాతాను సుళువుగా నియంత్రించుచున్నదని చూడలేకపోతున్నారా? ఎవరికైనను ఒక్కగానొక్క భద్రత దేవుని యొక్క వాక్యమే. అయినప్పటికిని కథోలిక్కులు మరియు ప్రొటెస్టాంటులు మరణించిన వారి స్థితిని గూర్చిన సాతాను అబద్దపు ప్రచారముల యొక్క ప్రభావమునకు లోనై తుడిచిపెట్టుకు పోతున్నారు.
7. పునరుత్థానమందు శిక్ష మరియు ప్రతిఫలములు
ఇప్పుడు శిక్షలును ప్రతిఫలములను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎంత గందరగోళముగా ఉంటుంది? పునరుత్థానము వలన ఏమి ప్రయోజనము? అసలు పునరుత్థానము ఎందుకు? ప్రతి ఆత్మ యొక్క గతి ఇప్పటికే నిర్ణయించబడి వుంటుంది అయితే కడవరి తీర్పు అర్థరహితముగాను, హస్యాస్పదముగాను భావించుచున్నాము. పరలోకము నున్న ప్రియుల అంత్యక్రియల వద్ద వినిన భక్తిగల హామీలు అన్నియు కేవలము సాతాను మొట్టమొదట చెప్పిన అబద్ధములు. మానవ కుటుంబమునకు పునరావృతములవుతున్నవి. దుఃఖములో నున్న బంధువులను ఓదార్చుటకు ఎగురుతూవున్న కల్పితమైన నిరాకార చిత్రములను మూలాధారముగ చూపిస్తారు. మరణించిన నీతిమంతులు ప్రభువుతో ఎప్పుడు వుంటారో ఆ కాలమును గురించి పౌలు వివరిస్తూ ఏ మాటలైతే ఓదార్పు కలిగించునో మనము అర్ధము చేసుకొనుట అవసరమని పౌలు అసలైన ఓదార్పు విషయమై స్పష్టమైన వివరణను ఇస్తూ 1 థెస్సలొనీకయులకు 4:16-18 లో ఈ విధముగ ముగిస్తున్నాడు. "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి."
నిజమైన ఓదార్పు యొక్క ఖచ్చితమైన, ప్రేరేపిత చిత్రం ఇక్కడ ఉంది, మరియు పౌలు ఏ పదాన్ని సూచిస్తున్నాడో అలాంటి ఓదార్పునిచ్చే విషయాన్ని మనం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. మునుపటి రెండు వచనాలు మనకు ఈ మాటలను ఇస్తాయి, "ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీదకొనిపోబడుదుము. కాగా, మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము."
ఇక్కడ పౌలు ఎటువంటి పరిమితి లేకుండా ఏ స్థితిలో మరియు ఏ మార్గములో ప్రభువుతో ఉండడానికి వెళ్ళతామో అది వివరించుచున్నాడు. ఆయన చెప్పిన మాటలలో "కాగా" అను పదమును దాటివేయకండి. దాని భావము "ఈ మార్గములో" అనే ఈ చిన్న పదమును బట్టి పౌలు ప్రభువుతో ఉండుము. అనే ఇతర మార్గములన్నిటిని త్రోసిపుచ్చెను. క్రీస్తు యొక్క రాకడను పరిశుద్ధుల యొక్క పునరుత్థానమును గురించి పౌలు వివరించినప్పుడు ఏ మార్గములో అనుకొన్నట్లుగా ప్రభువుతో ఉందుమనుచూ తనకు తానే మిగతా మార్గములన్నిటిని మినహాయించెను. తరువాత ఒకరి కొకరు "ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడని" హెచ్చరించెను.
మరణించినప్పుడు కొన్ని అర్థముకాని కనిపించని భావనలు శరీరమును విడచి శిక్షకు లేదా ప్రతిఫలమునకు గురిచేయుననే భావన నామకార్ధ క్రైస్తవులకు ఎటువంటి ఓదార్పు ఉండదని పౌలు పలుమార్లు చెప్పుచున్నాడు. రక్షణ పొందని బంధువులు చల్లారని అగ్ని యొక్క బాధలను స్థిరముగా నమ్ముటకు సరిపోవునా? రక్షణ పొందక వెనుకబడి గుండెలు పగులునంత పరిస్థితులలో వున్న, వెనుకబడిన వారిని తమ ప్రియమైన బంధువులు పరలోకము, నుండి క్రిందకి చూచుచుండుటలో ఓదార్పు ఉన్నదా? క్రీస్తు యొక్క రెండవ రాకడను పునరుత్థానమును, మాత్రమే ఎవరైనను మరణించి తరువాతనే ప్రభువుతో వుండగలరు అని విశేషమైన, ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నాడు. యాదృచ్చికముగా మరణించినా నిజమే ఓదార్పు నిచ్చును.
మరణమును మరియు సమాధియును మానవ జీవితమునకు ముగింపు కాదని మహిమగల వాస్తవాన్ని పౌలు యొక్క దివ్యమైన ప్రకటన సూచిస్తున్నది. మరణమనే నిద్ర నుండి మేల్కొలుపు వుండును. నీతిమంతులు అక్షయత బహుమానము పొందుదురు.
"ఒక నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే, మనమందరము మార్పు పొందుదుము."
"క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసియున్నది" (1 కొరింథీయులకు 15:52,53) యేసు ఈలాగు చెప్పెను. "దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు" (యోహాను 5:28, 29).
పూర్వకాలములో కృంగిపోయిన, క్రమక్రమముగా కుళ్ళిన మరణించిన వారందరి శరీరములను క్రీస్తు మరల పూర్వస్థితికి తెచ్చునను విషయమై కొంతమంది ప్రశ్నించిరి. కొంతమంది శరీరములు విస్పోటము ద్వారా ముక్కలుగ పేల్చివేయబడినవి. కొంతమంది సజీవముగా కాల్చవేయబడిరి, మరి అనేకమంది సముద్ర అగాధ జలములలో మునిగిపోయిరి. అయితే ప్రతి ఆత్మను మరియు ప్రతి వ్యక్తిత్వాన్ని పునర్జీవమునకు తీసుకురావటానికి జీవమునిచ్చు శక్తిగల సృష్టికర్తకు ఏదైనా సమస్య ఉండునా? ఎటువంటి సమస్య ఉండదు. ఆకాశ పక్షులను లెక్కింపగలిగినవాడు. మన తలయొక్క వెంట్రుకలను యెంచగలిగిన వానికి ప్రతి వ్యక్తి యొక్క గుర్తింపును పునరుద్దరించడానికి ఎటువంటి కష్టమును ఉండదు.
ఆ ప్రక్రియ మనము అర్ధం చేసుకోలేకపోవచ్చును. ఏమైనప్పటికిని దానిని నమ్మవచ్చును. అనేక వస్తువులు అనగా టెలివిజన్ను, కంపూటర్ను సాధారణ వ్యక్తికి వాటి లాభములు అర్ధము కాకపోవచ్చును. అయినప్పటికి వాటిని నమ్మకుండ ఉండలేకపోవుచున్నాము. సామాన్యమైన విద్యుత్కణ శాస్త్రమును గూర్చి మనలో అనేకమంది గాబరాపడినట్లయితే, పునరుత్థానము యొక్క శక్తి రహస్యమును గ్రహించలేము. ఏది ఏమైనప్పటికిని, మరణించిన వారందరిని ప్రాణముతో పునరుద్ధరించ గల శక్తి దేవునికే ఉన్నదని మనకు సంపూర్ణ విశ్వాసము కలగాలి.
8. సిలువ పైన దొంగ
మరణము మరియు ఆత్మయొక్క బైబిలు సిద్ధాంతము గూర్చి లేవనెత్తిన ముఖ్యమైన ఒక అభ్యంతరమును మనము పరిశీలించుదాము. ఈ అంశముపై వ్రాయబడియున్న సందిగ్ధమైన వాక్యములను మిగత జ్ఞానమునిచ్చు వాక్యములను అర్ధము చేసుకొనుటకు పరిశీలించుదాము. ఒక ఉదాహరణ:- సిలువపై నున్న దొంగ యొక్క అనుభవములో కనుగొనగలము. మొట్టమొదటి చూపులో మరణించుచున్న ఆ నేరస్థునికి మరణించిన దినమందే పరలోకమునకు వెళ్ళెదవు అని చెప్పుచున్నాడని అనిపిస్తుంది.
ఆ సందర్భములో, తన జీవితపు అఖరి ఘడియలలో, దొంగ యేసుని అడిగెను, "యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునపుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. ""అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను"(23:42, 43)
ఈ అంశముపై మనము పరిశీలించిన మిగతా అన్ని వాక్యములను ఇది వ్యతిరేకించుచున్నవా? వాస్తవముగ క్రీస్తు మరియు ఆ నేరస్తుడు అదే దినమున దేవుని సముఖమునకు వెళ్ళుదురనునట్టుగానే యున్నది. ఈ మర్మమును ఇతర వాక్యములు ఋజువు పరచునేమో అనుమతించుదాము. మారుమనస్సు పొందిన దొంగతో మాట్లాడిన మూడు రోజుల తరువాత తెరవబడియున్న సమాధివద్ద యేసు మరియను కలసెను. యేసు పాదముల మీదపడి మరియ మ్రొక్కగా యేసు ఇట్లనెను, "నేను యింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి - నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను" (యోహాను 20:17)
యేసు ప్రభువు యొక్క ఈ వివరణ సమస్యాత్మక చిక్కునకు మనలను తీసుకువస్తుంది. ఆయన యింకను పరలోకమునకు వెళ్ళకపోయినను, మూడు రోజులకు ముందు రోజునే ఇద్దరము పరలోకమున ఉందుమని హామీ ఎలా ఇవ్వగలడు? పరదైను మరియు తండ్రి యొక్క సింహానము ఒకే చోటున ఉన్నదని దయచేసి గమనించండి. "జీవవృక్షము పరదైసులో ఉన్నదని యోహాను చెప్పెను (ప్రకటన 2:7). తరువాత ప్రకటన 22:2 ఆ నది యొక్క సింహానము నుండి నది ప్రవహించుట చూచితిని అని యోహాను. వివరించెను. దీనినిబట్టి దేవుని యొక్క సన్నిధి పరదైసులో ఉన్నదని స్పష్టమవుచున్నది. యేసు పునరుత్థాన సమయమునకు తన తండ్రి యొద్దకు వెళ్ళియుండక పోయినట్లయితే, అంతకు మూడు రోజుల క్రితమే ఆరోహణమై యుండలేడని స్పష్టమగుచున్నది.
లూకా 23:43 లోని సందర్భము ఎప్పుడు మనము ఆలోచించిన అప్పుడే ఆ మర్మము త్వరగా స్పష్టమగును. ఆదిలో చేతితో వ్రాయబడిన బైబిలు పంక్తిలో అవిచ్ఛేదముగ వ్రాయబడెను అని మనము తెలుసుకొనవలెను. పదములు, వాక్యములు, వచనములు లేక అధ్యాయములు వేరు చేయబడలేదు. 1611 సం॥ము "King James Version" (కింగ్ జేమ్స్ వర్షన్) అనువదించిన పండితులు పదములను వేరుపరచి, విరామ సమయ గర్తులను చేర్చి. చేవ్రాతలను వాక్యములుగాను అధ్యాయములుగాను విభజించిరి. ఈ పండితులు ప్రేరేపింపబడక పోయినను వారికివ్వబడిన కష్టమైన పనికి సాధారణముగ గొప్ప పనిచేసిరి. అనువాదము చేయబడిన పదములకు అర్ధము వచ్చునట్లుగ అవసరమైన చోట కామాను ఉపయోగించిరి. లూకా 23:43 వచనములో "Today" (టుడే) అను పదమునకు ముందు కామా చేర్చిరి, అందువలన యేసు, "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను."
ఈ సందర్భములో కామాను ఇంగ్లీషు బైబిల్లో "today" (టుడే) అను పదమునకు ముందు కాకుండ తరువాత పెట్టవలసియుండె అప్పుడు ఆ వాక్యమును తెలుగు బైబిల్లో ఈ రీతిగ చదువుకుంటాము, "నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా (నేడు) నీతో చెప్పుచున్నాను." ఈ వృత్తాంతము మిగతా బైబిలు లేఖనాలన్నిటికి సంపూర్ణ సమ్మతి తెలియచేస్తున్నది.
ఇంకో విధముగా ఆలోచించిన, యేసు దొంగతో చెప్పినది. "నేను నీకు నేడు హామీ ఇస్తున్నాను. నేను ఎవరిని రక్షింపలేననే స్థితిలో కనబడచుండగా, ఒక నేరస్థునిగా నిందించబడి సిలువపై మరణిస్తున్న సమయములో నా సొంత శిష్యులే నన్ను విడచినప్పుడు. "నీవు నాతో కూడ పరదైసులో నిశ్చయముగా నుందువని హామీ ఇస్తున్నాను."
ఇది పవిత్రమైన వృత్తాంతమును అక్రమముగా మార్పు చేస్తున్నదా? లేదు. మనకన్నా ఎక్కువగా అనువాదకులు: దైవికముగ ప్రేరేపింపబడలేదు, ఆదిమ తొలి రచయితలు మాత్రమే ప్రేరేపింపబడిరి. "Today" (టుడే) అను పదము కామా తరువాత పెట్టినను పూర్వమువలె ముందు ఉన్నను అది సత్యమే. ఒకే ఒక తేడా ఏమిటనగా ఒక మార్గము లేఖనాలతో సమ్మతిస్తున్నది మరియొకటి నిరీక్షణ లేని విరుద్ధత బయలుపరుస్తున్నది. ఆ కామాను సరియైన స్థానములో పెట్టుటకు మానవాతీతమైన అంతర దృష్టి అవసరము
యేసుని తన రాజ్యములోనికి వచ్చినప్పుడు తనను జ్ఞాపకము చేసుకొనుమని అడిగెను. సమీపిస్తున్న అతని మరణము దినమున అతడు ప్రతిఫలము కోరలేదు. అదే భావనలో గొప్ప అపొస్తలుడు, మరణమును అపేక్షిస్తూ అన్యులతో, “నేనిప్పుడే ప్రాణార్పణముగ పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా వరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును" (4:6-8)
స్వీకరించబడిన దొంగ మరియు అభిషిక్తుడైన పౌలు ఇద్దరూ క్రీస్తు రాజ్యం రావడంపై శాశ్వతమైన ప్రతిఫలం పొందాలనే తమ నిరీక్షణను కేంద్రీకరించినట్లే మనం చేసినట్లయితే, ఆ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోబడతాము.

