విషయసూచిక

1. సరళము అనగానేమిటి మరియు ఎక్కడున్నది?
2. తీర్పు తర్వాత శిక్ష
3. పునరుత్థానమునకు ముందు రెండవ మరణము లేదు
4. నరకము ఉందే స్థలము
5. నరకాగ్ని అంతములేనిది కాదు.
6. ఆరని అగ్ని
7. నాశనము చేయబడిన దేహము మరియు ఆత్మ
8. నిరూపించబడిన దేవుని న్యాయస్వభావము
9. మరణము యొక్క బాధ ఇక ఉండదు
10. నరకము మన కొరకు ఉద్దేశించబడినది కాదు.

అధ్యాయము - 1

నరకము అనగానేమిటి మరియు ఎక్కడున్నది?

నరకము - బైబిల్లో చాలా వేదాంతపరంగా గందరగోళంగా ఉన్న విషయాలలో ఒకటి. ఈ పదం ఒక సాధారణ అసభ్యకరంగా మరియు నిరర్ధకమైనదిగా ప్రసిద్ధి చెందే వరకు ఇది మతాధికారులచే తడబాటు చెంది లౌకికులచే వక్రీకరించబడింది. ప్రతిచోటా ప్రజలు - ఒకే ప్రశ్నలు అడుగుతున్నారు : నరకం అనగా ఏమిటి మరియు ఎక్కడ ఉన్నది? దుర్మార్గుల గతి ఏమిటి? ప్రేమగల దేవుడు నిత్యమూ ప్రజలను హింసిస్తాడా? నరకాగ్ని ఎప్పుటికీ పాపులలోని దుష్టత్వాన్ని కాల్చేస్తుందా?!|

ఈ ప్రశ్నలకు బైబిలు- సమాధానాలు చాలా అవసరం. క్రీస్తు నందు సత్యము వున్నది వున్నట్లుగా వివరించుటలో ఈ పోరాటం అంశం చుట్టూ వున్న మనలను అధైర్యపర్చకూడదా? మొదట, గెలవడానికి పరలోకం మరియు దూరంగా ఉండటానికి నరకం ఉందని మనం అర్ధం చేసుకోవాలి. ప్రతి ఆత్మ రక్షించబడును లేదా నశించును అని క్రీస్తు వారు బోధించారు. మధ్యంతర స్థలం లేదా రెండవ రకం ప్రతిఫలము అంటూ లేవు. "మనుష్యకుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు" (మత్తయి 13 :14-43).

జన్మించిన ప్రతి ఒక్కొక్కరికి ఈ రెండు గమ్యాలు వున్నాయని తెలిసికొని ఎంతో జాగ్రత్తగా విజమైన మార్గమును వెదకవలసియున్నారు. క్రీస్తు ఇలా చెప్పెను "నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు." (యోహాను 14:6) యేసు వరకమును గూర్చి ఖచ్చితముగా ఏమి చెప్పాడో అదే ప్రతివానికి సురక్షితము, ఆయన సిద్ధాంతమే సత్యమును, ఆధారపడదగినది. ఆయన ఇలా చెప్పారు. కొందరు అగ్నిలో వేయబడెదరు, కొందరు దేవుని రాజ్యములో ప్రకాశించెదరు.

ఆశ్చర్యమేమనగా కొందరు మత నాయకులు ఈ అంశాల పై తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ, క్రీస్తు పై నిందలు మోపారు. మరణమందు దేహము నుండి నిత్యాత్మ పరలోకానికి లేదా నరకానికి వెళ్ళిపోతుంది అని ఆయనను నిందించారు. యేసు ఎన్నడూ ఆ విధంగా బోధించలేదు. మరణంలో శరీరం నుండి వేరైపోయివ ఆత్మ నిర్దేశమైయుంటుంది అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. దుర్మార్గులు మరణించగానే నిత్య నరకాగ్నిలో బాధపడతారు అనే భావన ఆయన ఎన్నడూ చెప్పలేదు.

యేసు నరకమును గూర్చి నిజంగా ఏమి బోధించాడో ఒక ఉదాహరణ చూద్దాము. "నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని నరికి వేయుము, నీవు రెండు చేతులు కలిగి నరకము లోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటె, అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు" (మార్కు 9:43). అనగా ప్రభువు మాటలు ఏలాంటి అనుమానమును ఛేదించి ఋజువు పర్చును - శరీరము అగ్నికి అప్పగింపబడును కాని ఆత్మ కాదు. మత్తయి 5:30లో ఆయన ఇలా చెప్పెను. - "శరీర మంతయు" నరకములో పడవేయబడును. అనగా చేతులు, కాళ్ళు, కండ్లు మరియు ఇతర శరీర భాగాలు అని అర్ధం.

క్రీస్తు సిద్ధాంతమునకు వ్యతిరేకముగా మరణంలో శరీరం కాని ఆకారం లేని ఆత్మలు శరీరమును విడిచిపోతున్నాయి అనే నవీన బోధలు వేదికలపై మారుమ్రోగుతున్నాయి. ఈ బోధలు సాధారణమైనప్పటికిని, యేసు బోధలకు వ్యతిరేకముగా వున్నాయని గుర్తుంచుకొనండి. గొప్ప బోధకుడు సువార్తలలో పదే పదే సార్లు బోధించాడు. నరకాగ్నిలో పడవేయబడుట అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు మరియు శరీర అవయవాలతో అని అర్ధం. వారు ఆకారంలేని ఆత్మలతో వెళ్ళరు. ఇప్పుడు మనము బైబిలు నుండి నాలుగు గొప్ప సత్యాలను పరీక్ష చేసినపుడు అవి దుర్మార్గుల గతిని గూర్చిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాయి.

అధ్యాయము - 2
తీర్పు తర్వాత శిక్ష

రకమును గూర్చిన మొదటి సత్యం ఇది. రక్షింపబడని వారు మరణించగానే శిక్షా స్థలానికి వెళ్ళరు; కాని తీర్పు దినం వరకు సమాధిలోనే వుంటారు. క్రీస్తు వారు ఈ సత్యాన్ని గోధుమలు, గురుగులు ఉపమానంలో బోధించారు. యజమానుడు పొలములో గోధుమలు నాటిన తర్వాత తన సేవకుడు వచ్చి గోధుమలలో గురుగులు కూడా పెరుగుచుండెను అని చెప్పెను. అతని ప్రశ్న ఏమనగా ఆ గురుగులు చిన్నగా వున్నప్పుడే. తీసివేయుదమా? అందుకు యజమానుని సమాధానము "వద్దు, గురుగులను' పెరుకుచుండగా వాటితో కూడ ఒక వేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి యెదుగ నియ్యుడు, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను" (ລ້ 13:29, 30).

ఇప్పుడు క్రీస్తు వారి మాటలును అనుసరించండి ఆయన ఈ ఉపమానమును వివరించెను పొలము ఈ ప్రపంచము, మంచి విత్తనములు దేవుని రాజ్యవారసులు, కాని గురుగులు దుష్టసంబంధులు ఆ విత్తనములు విత్తినవాడు శత్రువు, అపవాది కోత - యుగసమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులను కూర్చి అగ్నిలో కాల్చుట అనగా "యుగ సమాప్తి యందు మనుష్యకుమారుడు దేవదూతలను పంపినపుడు వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు" (మత్తయి 13:37-43) అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయును ఉండును.”

యేసుక్రీస్తు వివరించిన ఈ ఉపమానమును ఎవ్వరూ తక్కువగా చూడలేరు. అది చిన్న బిడ్డలు కూడా అర్ధం చేసుకోగలిగినంత స్పష్టంగా వున్నది. గురుగులు దుష్టులను చూపుచున్నది. వారు యుగ సమాప్తిలోనే అగ్నిలో వేయబడుదురు. కోతలోనే వేరు చేయబడుదురు అనే ప్రక్రియ జరుగుతుందని ప్రభువు స్పష్టంగా చెప్పారు. "కోత - యుగ సమాప్తి" క్రీస్తు మాటలను ఎవరైనా అపార్థం చేసికోగలరా? దుష్టులు మరణంలోనే నరకాగ్నిలోనికి వెళ్తారు అనే తలంపు ప్రభువు బోధలకు వ్యతిరేకం - వారు యుగ సమాప్తిలోనే అగ్నిలో పడవేయబడతారు.

క్రీస్తు వచ్చిన తర్వాత తీర్పు జరుగును కాని ఆ సమయానికి ముందుగానే శిక్ష విధింపబడును అనేది అసాధ్యము. ఒక వ్యక్తి తీర్పులోనికి తేబడిన తర్వాతే శిక్ష విధింపబడును అని న్యాయం చెప్పుచున్నది. పేతురు ఇలా అంటున్నాడు. "భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ... తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్ధుడు" (2 పేతురు 29 10) అది మనకు స్పష్టంగా చెప్పుచున్నది కదా? ఉదాహరణగా దొంగతనం చేసిన వానిని కోర్టులోనికి తేబడగా న్యాయమూర్తి ఇలా చెప్పాడనుకోండి "10 సం॥ల పాటు దూరంగా వుంచండి అప్పుడు అతని కేసు చూస్తాను." వినండి- మానవ న్యాయమూర్తి అలాంటి పనిచేయడు! అలాంటి క్రియకు అంటనను అపార్థం చేసికొంటారు. తప్పనిసరిగా దేవుడు అలాంటి దానికి దోషికానేరడు. బైబిలు ఏమి చెప్పుచున్నదో చెప్పనివ్వండి, నమ్మండి. ఈ విషయంలో ఏ అనుమానాస్పదం రానివ్వద్దు దుష్టులు కావలిలో ఉంచబడ్డారు. ఎప్పటివరకు? తీర్పు దినము వరకు. దేనికి? "శిక్షింపబడుటకు"! అనగా తీర్పు దినమునకు ముందుగా శిక్షింపబడరు. వారు ఎక్కడ కావలిలో ఉంచబడ్డారు అనేది బైబిలు చెప్పుచున్నదా? క్రీస్తే ఇలా చెప్పారు. "దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆకాలమున సమాధులలోనున్న వారందరు ఆయన శబ్ధము విని మేలు చేసిన వారు జీవపునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” (యోహాను 5:28, 29).

ఎంత విశదము! మంచివారు, చెడ్డవారు వారి సమాధులలో నుండి జీవము లేక శిక్ష పొందుటకు బయటికి వచ్చెదరు. మరణ సమయము నుండి పునరుత్థాన దినము వరకు వారు ఎలాంటి ప్రతిఫలము లేక శిక్ష పొందరు. వారు వచ్చిన తర్వాతే ఏదైనా జరుగును. పేతురు చెప్పిన రీతిగ ఆ దినము వరకు వారు కావలిలో ఉంచబడుదురు, అయితే క్రీస్తు విశదీకరించారు, వారు సమాధులలో "కావలిలో ఉంచబడతారు".

ఇంకనూ స్పష్టమైన మాటలు కావాలంటే యేసు ప్రభువు మాటలు: వినండి. "నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు"' (లూకా 14:14), మరలా వినండి: "మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును" (మత్తయి 16:27), అది ఎప్పుడు? ఆయన తన దూతలతో వచ్చునపుడు. నీతిమంతులు పునరుత్థానము వరకు ప్రతిఫలము లేక శిక్ష పొందరు. "ఆయన సమస్త దూతలతో వచ్చునపుడు" ఈ వచనాలు వివాదానికి మించినవి. ఆ భావసందర్భములో సందేహమే లేదు.

బైబిలులో ఆఖరి అధ్యాయంలో క్రీస్తు Ble చెప్పాడు. "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది" (ప్రకటన 22:12), ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు వారు ఈ భూమి మీదకు తిరిగి వచ్చినపుడు ప్రతి వ్యక్తి వారి ప్రతిఫలం పొందుదురు. యోబు ఇలా అంటున్నాడు. "ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ప్రకారం, "దుర్మార్గులు ఆపత్కాలదినము వరకు కావలిలో ఉంచబడుదురు, ఉగ్రతదినము వరకు వారు తోడుకొని వచ్చెదరు.” మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును ... మేలుకొందురు" (దానియేలు 12:2).

పునరుత్థానమునకు ముందుగా తీర్పు, శిక్ష కొరకై దుష్టులు కావలిలో ఉంచబడుదురు అనే దానికి ఏమైనా అనుమానమున్నదా? మనకు పేతురు, దానియేలు, యోబు ముఖ్యంగా ప్రభువు సాక్ష్యములు వున్నవి. అనుమానానికి తావులేదు. వారు సమాధిలలో కావలిలో ఉంచబడుదురు.

మనం ఇప్పుడు నరకాన్ని గూర్చి రెండవ సత్యానికి వస్తున్నాము. ఈ లోక అంతానికి యేసుక్రీస్తు రాకడ వరకు ఎవ్వరూ నరకాగ్నిలోనికి వేయబడరు. ఈ అంశము పై ఇప్పటి వరకు సరిపడ నిదర్శనాలను చూచినప్పటికి, మరికొన్నిటిని చూద్దాము. దుష్టుల శిక్షను గూర్చి వివరించబడగా యోహాను ఇలా అంటున్నాడు. "పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము" (ప్రకటన 21:8).

అధ్యాయము - 3

పునరుత్థానమునకు ముందు రెండవ మరణము లేదు

ఇచ్చట నశించిన వారు నరకాగ్నిలో వున్నట్లుగా, వారి పాపాలకు శిక్షతో బాధపడుచున్నట్లుగా చూపుచున్నారు. శిక్ష అంటే ఏమిటి? యోహాను -రెండవ మరణం అని చెప్పుచున్నాడు. దుష్టుల విషయమై ఏమి రుజువు చేయబడుచున్నదో గ్రహించావా? ఇది ఏమని నిర్ధారణ చేయుచున్నదనగా పునరుత్థానము వరకు వారు అగ్నిలో వేయబడరు. వీరు అగ్నిలో రెండవ మరణం పొందుతారు, అయితే వారు రెండవ జీవము పొందే వరకు రెండవ మరణం బాధ పొందరు. వారు మొదటి జీవితం ఈ భూమి పై జీవించారు. మొదటి మరణం పొందారు, సమాధుల్లోకి వెళ్ళారు. వారు రెండవ మరణం పొందక ముందు పునరుత్థానులవ్వాలి. రెండవ జీవితం ఇవ్వబడాలి. ఇది యుగాంతమందు జరుగును. "సమాధులలోనున్న వారందరు లేపబడుదురు" అని యేసు చెప్పెను.

పునరుత్థానములో రెండవ జీవితం పొందిన తర్వాత దుష్టులు వారి' పాపాలకు నరకాగ్ని చేత శిక్షింపబడుదురు. "అదే రెండవ మరణం". రెండవ మరణం ఆఖరిది మరియు నిత్యమరణం, తర్వాత పునరుత్థానము లేదు. మనం గుర్తించాల్సిన విషయమేమనగా ఈ నరకాగ్ని శిక్ష యుగసమాప్తిలో పునరుత్థానము తర్వాత జరుగును, ఎందరో నమ్ముతున్న విధంగా మొదటి మరణ సమయంలో ఇది జరుగదు.

దుష్టులు అగ్నిగుండములో వేయబడుటను గూర్చి బైబిలు చెప్పుచున్నదా? అవును. తరువాత వెయ్యి సంవత్సరముల యందు జరుగు సంఘటనలను వివరించుచున్నాడు! "వెయ్యి సంవత్సరములు గడచిన తర్వాత, సాతానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను" (ప్రకటన 20:7-9). వెయ్యి సంవత్సరములు ముగింపు నందు జీవించిన దుర్మార్గులందరు రెండవ పునరుత్థానములో బయటికి వచ్చెదరు. నీతిమంతులు జీవమునకు లేచిన తర్వాత క్రీస్తుతో వెయ్యి సంవత్సరములు ఎలా రాజ్యం చేస్తారో వివరించినతర్వాత గడుపుతారో యోహాను ఈ విధంగా వ్రాశాడు : "ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుకలేదు" (ప్రకటన 20:5).

మిగిలిన మృతులు అనగా దుష్టులు, వారి పునరుత్థానం సాతానుకి ఆధిక్యత ఇచ్చినపుడు దేవునిపై మరియు పరిశుద్ధులపై యుద్ధము చేయుదురు. మృతులలో నుండి లేపబడిన వారిని, అనగా నశించిన వారినందరిని ప్రోగుచేయును. మరొక సారి మోసపుచ్చుటకు పరలోకము నుండి దిగి వచ్చుచున్న యెరూషలేమును వశపర్చుకొందరము రండి అని ప్రజలను పురిగొల్పును (ప్రకటన 21:2), వారు బారులు తీరి పట్టణమును ముట్టడివేయుచుండగా ఆకస్మికముగా ఆకాశము నుండి అగ్ని గంధకములు కురియును. ఇదే నరకాగ్ని - పాపులకు అంతిమ శిక్ష.

అధ్యాయము - 4

నరకము ఉండే స్థలము

దుష్టులను ఈ భూమి పై అగ్ని దహించి వేయునని బైబిలు విశదముగా తెలుపుచున్నది. దుష్టుల రెండవ మరణం గూర్చి ప్రతి బైబిలు రచయితలు ఈ అంశం పై వ్రాయునపుడు ఏదో ఒక క్రొత్త విషయం కలుపుచునేయున్నారు. పేతురు ఇలా అంటున్నాడు "అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నది" (2 పేతురు 3:7). ఆ ప్రభువు దినమున కృత్యములు మిక్కుటమైన వేడిమి చేత కరిగిపోవును అని ఆయన వర్ణించుచున్నాడు.

భక్తిహీనులకు శిక్షించే స్థలం గురించి పేతురు భాష చాలా స్పష్టంగా ఉంది. దుర్మార్గులకు తీర్పు మరియు నాశనాన్ని తెచ్చే అగ్ని కొరకు ఈ భూమి ప్రత్యేకించబడిందని అతడు చెప్పాడు. వారి శిక్ష ఈ భూమ్మీదనే ఉంటుంది. యెషయా ఇలా ప్రకటించాడు, "అది యెహోూవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము. ఎదోము కాలువలు, కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును" (యెషయా 34:8, 9).

నాశనం చేసే అగ్నిలో కప్పబడిన భూగ్రహం మొత్తాన్ని ప్రవక్త చిత్రీకరించాడు. ప్రవాహాలు మరియు ధూళి కూడా వేడి కీలు లేదా తారు. మరియు దహనం చేసే గంధకపు పేలుడుగా మార్పు చెందుతాయి. ఇది దేవుని ప్రతీకారం మరియు మహా సంఘర్షణ చివరిలో "ప్రతిఫలం" అని యెషయా చెప్పాడు.

దావీదు ఈ మాటలతో సాక్ష్యమిచ్చాడు, "దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును" (కీర్తన 11:6). అతను దుర్మార్గుల గతిని వివరించడంలో దాదాపుగా యోహాను మరియు పేతురు చెప్పిన అదే మాటలను ఉపయోగిస్తున్నాడని గమనించండి. శిక్ష ఉండే స్థలం (భూమి) మరియు శిక్ష యొక్క ప్రాతినిధ్య వస్తువు (అగ్ని) గురించి అందరూ అంగీకరిస్తారు.

ఇది నరకం అనే విషయం గురించి మూడవ గొప్ప విషయానికి మనలను తీసుకువస్తుంది: శిక్షా స్థలంగా నరకం ఈ భూమి తీర్పు దినమున అగ్ని గుండముగా మారుతుంది. అయినప్పటికీ, ఇది నశించినవారి గతి గురించి మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. శిక్ష ఎంత కాలము ఉంటుందన్న దానిపై చాలా చమత్కారమైన మరియు అబ్బురపరిచే విషయం. దుర్మార్గులు ఆ అగ్నిలో ఎంతకాలం జీవించి బాధపడతారు?

ఆ ప్రశ్నకు ఎవరూ ఖచ్చితంగా సమాధానం ఇవ్వలేరు ఎందుకంటే వారి క్రియల చొప్పున వారు శిక్షించబడతారని బైబిల్ చెబుతోంది. దీని అర్ధం శిక్షకు స్థాయిలు ఉంటాయి. కొందరు ఇతరులకన్నా ఎక్కువ కాలం బాధపడతారు. కానీ మనం ఒక విషయం నిశ్చయంగా చెప్పగలము- దుర్మార్గులు ఆ అగ్నిలో శాశ్వతకాలమంతా జీవించరు.

అధ్యాయము - 5
నరకాగ్ని అంతములేనిది కాదు

ఈ అంశంపై చాలా ఖచ్చితంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదట, ఈ భూమి కూడా నీతిమంతులకు అంతిమ నివాసంగా ప్రకటించబడింది. యేసు ఇలా అన్నాడు, "సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు" (మత్తయి 5:5) పేతురు, ఈ భూమి పేలిపోయి, గొప్ప శబ్దంతో కాలిపోతున్నట్లు వివరించిన తరువాత, నీతి నివసించు కొత్త భూమిని చూశాడు. "అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము, వాటియందు నీతి నివసించును" (2 పేతురు 3:13),

దుర్మార్గులు ఈ గ్రహంలో జీవించడం కొనసాగించలేరు ఎందుకంటే అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక సంతతికి ఇది పూర్తిగా వాగ్దానం చేయబడింది. (రోమీయులకు 4:13), పాపం యొక్క అన్ని శాపాలను తొలగించిన తరువాత, అది మొదటి ఆధిపత్యానికి మరియు దాని కొరకైన దేవుని అసలు ప్రణాళికకు తిరిగి వస్తుంది. చివరకు దేవుడు ఉద్దేశించిన రీతిగా పరిపూర్ణ ప్రజలకు పరిపూర్ణమైన గృహముగా ఉంటుంది.

రెండవ స్థానంలో, దుర్మార్గులు ఈ భూమిలో జీవించడం కొనసాగించలేరు ఎందుకంటే వారు ఎప్పటికీ క్రీస్తును నిత్యజీవము విషయమై విశ్వసించలేదు. నీతిమంతులు మాత్రమే నిత్యజీవ బహుమానమును పొందుకుంటారు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక .... " (యోహాను 3:16). కానీ ఆయన యందు విశ్వాసముంచని.. వారి సంగతేంటి? వారు తప్పకుండా నశిస్తారు. "పాపము వలన వచ్చు జీతము మరణము" అని బైబిలు చెప్పుచున్నది (రోమీయులకు 6:23)

దయచేసి ఈ వచనాల యొక్క సరళతను కోల్పోకండి. దుర్మార్గులకు ఎన్నడూ జీవము వాగ్దానం చేయబడదు. వారికి మరణం- శాశ్వతమైన మరణం వాగ్దానం చేయబడింది. నీతిమంతులకు మాత్రమే జీవము వాగ్దానం చేయబడింది అదే నిత్యజీవము.

అంతములేని జీవాన్ని పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, మరియు అది యేసుపై విశ్వాసం ద్వారా సాధ్యమవుతుంది. యోహాను దీనిని ఇలా వివరించాడు. "దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు,
దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను" (1 యోహాను 5:11, 12). నేను మీతో ఒక ప్రశ్న అడుగుతాను అగ్నిగుండంలో ఉన్న దుర్మార్గులకు దేవుని కుమారుడు ఉన్నాడా? లేదని మనకు తెలుసు. అప్పుడు వారికి జీవం ఎలా ఉంటుంది? యోహాను ఇలా అంటాడు. "ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు” (1 యోహాను 3:15), నరకాగ్నిలో ఉన్న ఆ హంతకులు ఎల్లకాలం జీవితాన్ని కొనసాగిస్తారా? లేనే లేదు.

యేసు కాకుండా వేరే మూలం నుండి నిత్యజీవము లభిస్తుందని నమ్మడం అత్యున్నత మతవిరుద్ధం. దుర్మార్గులకు అది ఎక్కడ లభిస్తుంది? యేసుక్రీస్తు "ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను" అని పౌలు ప్రకటించాడు. (2 తిమోతి 1:10). ప్రేరణ క్రీస్తు సువార్త ద్వారా తప్ప అమరత్వానికి మరే ఇతర మూలాన్ని వెల్లడించలేదు. దుర్మార్గులకు అమరత్వాన్ని ఇవ్వడాన్ని వివరించే వచనం ఎక్కడ ఉంది? నీతిమంతులు దానిని పొందడం గురించి మీరు తరచుగా చదువుకోవచ్చు, కాని అవిశ్వాని ఎప్పుడూ పొందినట్టు లేదు.

పౌలు, "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. బూర మ్రోగును, అప్పుడు, మృతులు-అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. - క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది. మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది" అని చెప్పను (1 తొరింధీయులకు 15:51-53)
ఈ వచనం నీతిమంతులు తక్షణమే అమర జీవులుగా మార్చబడే ఒక నిర్దిష్ట సమయం గురించి మాట్లాడుతుంది. ఆ సమయం ఇంకా భవిష్యత్తులో ఉంది. యేసు తిరిగి వచ్చినప్పుడు, కడవరి బూర శబ్దమందు, పునరుత్థానం జరిగినప్పుడు ఇది జరుగుతుంది. దుర్మార్గులు ఈ పద్ధతిలో మార్చబడటం గురించి బైబిల్లో ఎక్కడా లేదు. నిత్యజీవపు బహుమానాన్ని వారు ఎన్నడూ స్వీకరించనందున వారు అగ్ని గుండములో జీవించలేకపోతారు.

అటువంటి సంఘటనను కల్పించడాన్ని ఊహించలేము మరియు అది అసమంజసమైనది. ఇది బైబిలుకు విరుద్ధం మరియు ఆలోచనలకు అసహ్యంగా ఉంటుంది. యెహెజ్కేలు ఇలా ప్రకటించాడు, "పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును" (యెహెజ్కేలు 18:4). ఆత్మ అంటే ఏమిటోనని మనం ఏమి అర్ధం చేసుకున్నామన్న దానిని బట్టి కాక, అదీ మరణించునని మరియు పాపమే ఆ మరణానికి కారణమనే సాధారణ బైబిల్ వాస్తవాన్ని అంగీకరిద్దాం.

దుర్మార్గులు నిత్యము అగ్నిలో నివసిస్తుంటే, వారు వేరే ప్రదేశంలో ఉన్నారనే తప్ప నీతిమంతుల మాదిరిగానే ఉంటారు కదా. క్రీస్తు తప్ప వారికి నిత్యజీవము ఎవరు ఇవ్వగలరు? యోహాను 3:16 ఈ సమస్యను-చాలా స్పష్టంగా మరియు సరళంగా పరిష్కరిస్తుంది. అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచని వారు నశించిపోతారు. వారు చనిపోతారు. వారు తిరిగి లేవలేని రెండవ మరణం- శాశ్వతమైన మరణాన్ని పొందుతారు. ఆ మరణం అంతం కాదు. ఇది అంతులేని, శాశ్వతమైన శిక్ష, ఎందుకంటే ఇది అంతులేని, శాశ్వతమైన మరణం.

అధ్యాయము - 6

ఆరని అగ్ని

దుర్మార్గులను కాల్చివేసే అగ్ని సంగతి ఏమిటి? అని ఎవరో ఈ ప్రశ్నను లేవనెత్తవచ్చు, ఇది ఎప్పటికీ ఆరిపోదని దీని అర్థం కాదా? వాస్తవానికి, కాదు. ఆర్పడం అంటే చల్లార్చడం లేదా ఆపివేయడం. నరకాగ్నిని ఎవరూ ఆర్పలేరు. అది దేవుని వింతైన అగ్ని. దాన్ని చల్లారడం ద్వారా ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు.

ఆ అగ్ని గురించి యెషయా ఇలా అంటాడు. "వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొనలేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు" (యెషయా 47:14). దాని విధ్వంస క్రియను పూర్తి చేసిన తరువాత, ఆ అగ్ని ఆరిపోతుంది. దాన్ని ఆర్పడం ద్వారా ఎవరూ తమ మంట నుండి తమను తాము విడిపించుకోలేరు, కాని చివరికి బొగ్గు కూడా మిగిలి ఉండదు. ఈ విషయాన్నే లేఖనాలు కూడా చెప్తున్నాయి.

యెరూషలేము ఆర్పజాలని అగ్నితో కాలిపోతుందని యిర్మీయా ప్రవచించాడు (యిర్మీయా 17:27), కానీ అది బూడిద అయిపోయింది. (2 దినవృత్తాంతములు 36:19-21) ఆ వాక్యాలను చదివి, “ఆర్పుట” అనే పదాన్ని బైబిల్ ఎలా ఉపయోగిస్తుందో చూడండి. ఇది ఎప్పటికీ ఆరని అగ్ని అని కాదు. ఇది "అరనిది" అని చెప్పే అర్థాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. దీనిని చల్లార్చలేము.

* నరకం యొక్క మంటలను వివరించడానికి ఉపయోగించే "శాశ్వతమైన" మరియు "నిత్య" అనే మాటల వ్యక్తీకరణల గురించి మనం ఏమి చెప్పగలం? భాషా నిబంధనలకు దాని సొంత నిర్వచనాన్ని అందించడానికి బైబిలును అనుమతించినప్పుడు ఖచ్చితంగా గందరగోళం లేదా వైరుధ్యం ఉండదు. పురాతన సందర్భోచిత వాడకాన్ని ప్రస్తావించకుండా ఆ బైబిల్ పదాలకు ఆధునిక నిర్వచనాలను వర్తింపజేయడంలో చాలా మంది పొరపాటు చేస్తున్నారు. ఇది భాషాంతర వివరణ యొక్క ప్రాథమిక నియమాలలో ఒకదాన్ని ఉల్లంఘిస్తుంది.

వాస్తవం ఏమిటంటే నిత్యాగ్ని అంటే ఎప్పటికీ అరని అగ్ని అని కాదు. అదే వ్యక్తీకరణ సొదొమ గొమొఱ్ఱా నాశనానికి సంబంధించి యూదా 7 లో ఉపయోగించబడింది. "ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను."

సొదొమ నేటికీ కాలట్లేదన్నది స్పష్టమైన విషయం. ఒకప్పుడు ఆ పురాతన నగరాలు ఉన్న ప్రదేశం మీద మృత సముద్రం ప్రవహిస్తుంది. అయినప్పటికీ, వారు "నిత్యాగ్ని" దండన చేత కాలిపోయారు, మరియు అది ఏదో ఒక ఉదాహరణ అని మనకు చెప్పబడింది. దీనికి ఉదాహరణ ఏమిటి?.. “మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి," (2 పేతురు 2:6).

విషయం అక్కడ ఉంది! సాదొమను బూడిదగా మార్చిన ఆ నిత్యాగ్ని, చివరకు దుర్మార్గులకు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఈ వచనం నిజమైతే, సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన అదే రకమైన అగ్ని కూడా దుర్మార్గులను అగ్ని గుండంలో కాల్చేస్తుంది. ఇది నిత్యాగ్నిగా ఉండాలి. అది దుర్మార్గులను బూడిద అయ్యేవరకు కాల్చేస్తుందా? అవును. అని బైబిలు చెప్పుచున్నది. "ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.... నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు" (మలాకీ 4:1, 3),

ఏ భాషలోని ఏ పదాలు అయినా మరింత శక్తివంతంగా లేదా స్పష్టంగా చెప్పలేవు. ఈ నిత్యాగ్ని ఇక లేకుండా శాశ్వతంగా కాల్చేస్తుంది. వేరు అయిన సాతాను కూడా చివరకు దహించబడతాడు. బైబిల్ దాని సొంత నిబంధనలను వివరించడానికి మనము అనుమతించేటప్పుడు మొత్తం చిత్రం ఎంత స్థిరంగా కనిపిస్తుంది. ఈ పదాల యొక్క స్పష్టమైన అర్ధాన్ని కోల్పోవడానికి ఏ పదాల " యొక్క మోసపూరిత తారుమారు అవసరము? అయినప్పటికీ, జీవితకాల సాంప్రదాయం ద్వారా పక్షపాతానికి గురైన వారు "వారిని దహించివేయును వారు ధూళి (బూడిద) వలె ఉందురు" అనే మాటలను చక్కగా చదువుతూ కూడాదుర్మార్గులు సజీవంగా ఎల్లకాలం బాధపడతారని ఇప్పటికీ నొక్కి చెప్పుచున్నారు.

ఒప్పుకుంటే, ఈ అంశంపై కొన్ని అస్పష్టమైన వచనాలు ఉన్నాయి. కాని సందర్భం పరిగణించబడినప్పుడు ఆవన్నీ సమన్వయంతో ఉన్నాయని మనము కనుగొన్నాము మరియు బైబిల్ దాని సొంత వ్యాఖ్య వివరణగా అనుమతించబడుతుంది.

మత్తయి 25:46 లోని క్రీస్తు మాటలు కూడా మనం స్పష్టమైన అర్థాన్ని తీసుకున్నప్పుడు గందరగోళంగా లేవు. "వీరు (దుర్మార్గులు) నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు." "నిత్య శిక్త" అనే వ్యక్తీకరణపై చాలా మంది కలవరపడుతున్నారు. కాని అది "నిత్యమూ శిక్షించబడటం" అని చెప్పలేదని గమనించండి. శిక్ష ఏమైనప్పటికీ, అది శాశ్వతంగా ఉంటుంది. శిక్ష ఏమిటో బైబిల్ చెబుతుందా? వాస్తవంగా. "పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమీయులకు 6:23). అందువల్ల, మరణం నిత్యమని యేసు కేవలం చెప్పుచున్నాడు. ఇది అంతం కాదు. ఇది పునరుత్థానం ద్వారా ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు.

పౌలు ఈ మాటలతో దీన్ని మరింత సరళతరం చేస్తాడు : "దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు," ఎవరు శిక్షించబడతారు? ఇప్పుడు, వినండి, శిక్ష ఏమిటో పౌలు మనకు చెప్పబోతున్నాడు. "ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి" (2 థెస్సలొనీకయులకు 1:7, 10). అందువల్ల, శిక్ష అనేది నిత్య నాశనం-శాశ్వతమైన విధ్వంసం. దాని నుండి, పునరుత్థానం లేదా జీవితం యొక్క ఆశ ఉండదు.

కానీ చావని ఆ పురుగు సంగతేమిది? చాలామంది నరకం గురించి యేసు చెప్పిన మాటలు చదివారు, "నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు" (మార్కు 9:45, 46). కొందరు పురుగును ఆత్మ అని వ్యాఖ్యానించారు. యేసు ఉద్దేశించినది అదేనా? ఆత్మను పురుగులాగా బైబిల్లో ఎక్కడా సూచించలేదు.

ఈ సందర్భంలో, యేసు "గెహెన్నా" అనే పదాన్ని "నరకం" అనే పదానికి ఉపయోగించాడు. గెహెన్నా యెరూషలేము గోడల వెలుపల వ్యర్థాలను దహనం చేసే నిజమైన ప్రదేశం. క్రీస్తు శ్రోతలు గెహెన్నా లోయ నుండి పొగ వంకరగా రావడం చూడగలిగారు, అక్కడ మృతదేహాలు మరియు చెత్త నిరంతరం కాలిపోతున్నాయి. ఏదైనా విధ్వంసక జ్వాలల వెలుపల పడితే, మాగోట్స్ (ఈగ లేదా దోమ లార్వాలు) లేదా పురుగులు త్వరగా తినేస్తాయి. వారి కళ్ళముందు పూర్తిగా నాశనమయ్యే స్పష్టమైన దృశ్యాలతో, యేసు గెహెన్నా అగ్నిని నరకాగ్ని యొక్క పూర్తి నాశనానికి ఉదాహరణగా ఉపయోగించాడు. మంటలు ఎన్నడూ ఆర్పబడలేదు, మరియు పురుగులు, శరీరాలపై నిరంతరం పనిచేస్తాయి పూర్తి విధ్వంసం యొక్క దృశ్యమిది.

నరకం గురించి చాలా తేలికగా తప్పుగా ప్రస్తావించబడిన వచనం, పొగ పైకి లేవడాన్ని "యుగయుగములు" అని యోహాను సూచించడం. బైబిల్లోని ఈ పదబంధం యొక్క ఇతర ఉపయోగాల గురించి తెలియని వారికి, ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ వచనాల పోలిక పాత మరియు క్రొత్త నిబంధనలలో "ఎప్పటికి (ఎల్లపుడు)" అనే పదాలు బైబిల్లో సార్లు ఇప్పటికే అంతమైపోయిన వాటికి సూచనగా ఉపయోగించబడ్డాయని' వెల్లడించాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, "ఎప్పటికి లేదా (ఎల్లపుడు)" అనే మాట ప్రతిసారీ "అంతం లేనిది" అని అర్థాన్నివ్వదు.

చాలా ముఖ్యమైన ఉదాహరణలు ఉదహరించవచ్చు, కానీ రెండు లేదా మూడు గమనార్హం. నిర్గమకాండము 21 లో, దాస్యం యొక్క చట్టానికి సంబంధించి షరతులు నిర్దేశించబడ్డాయి. ఒక దాసుడు తన స్వేచ్ఛకు బదులుగా తాను ప్రేమించిన యజమానికి సేవ చేయడాన్ని ఎంచుకుంటే, అతని చెవిని కదురుతో గుచ్చి, "వాడు నిరంతరము వానికి దాసుడైయుండును" (6వ వచనం) అని బైబిలు గ్రంథం ప్రకటిస్తుంది. అయితే ఆ దాసుడు తన మానవ యజమానికి ఎంతకాలం దాసుడై ఉంటాడు? అతను జీవించినంత కాలం మాత్రమే. కాబట్టి, "ఎల్లప్పుడు" అనే మాటలకు అంతం లేనిది అని అర్ధం కాదు.

హన్నా తన కుమారుడు సమూయేలును దేవుని ఆలయానికి తీసుకువెళ్లింది, అక్కడ అతను "(ఎప్పటికీ) తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా"
(1 సమూయేలు 1:22). ఇంకా 28 వ వచనంలో, "తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని" స్పష్టంగా చెప్పబడింది. "ఎల్లప్పుడు" అనే పదం యొక్క అసలు అర్ధం నిరవధిక కాలాన్ని సూచిస్తుంది. సాధారణంగా, ఇది ప్రస్తుత పరిస్థితులలో ఏదో ఉనికిలో ఉండగల కాలాన్ని నిర్వచిస్తుంది. యోనా తిమింగలం కడుపులో ఉండడాన్ని కూడా అతను "ఎల్లప్పుడు" అని వర్ణించాడు (యోనా 2:6).

ఇది పరలోకంలోని నీతిమంతుల జీవితాన్ని కూడా పరిమితం చేస్తుందని ఎవరైనా అభ్యంతరం చెప్పవచ్చు, ఎందుకంటే వారు ఎప్పటికీ దేవుణ్ణి మహిమపరుస్తారు. రక్షింపబడిన మరియు నశించిన వారిద్దరికీ నిబంధనలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఉన్న పరిస్థితులలో ఒక అద్భుతమైన వ్యత్యాసం ఉంది. పరిశుద్ధులకు అమరత్వం అనే బహుమతి లభించింది. వారి జీవితం ఇప్పుడు దేవుని జీవితంతో కొలువబడుతుంది. అమరత్వం అంటే "మరణానికి లోబడి ఉండకపోవడం." వారిని సూచించడానికి వాడబడిన "ఎల్లప్పుడు" - అనే పదాలు "అంతం లేకుండా" అని మాత్రమే అర్ధానిస్తాయి, ఎందుకంటే వారు అప్పటికే అమరత్వం పొందుకున్నారు. దుర్మార్గులను వివరించడానికి "వెల్లప్పుడు" అనే మాట వాడబడినప్పుడు, మనం మరణించే మరియు మరణించాల్సిన జీవుల గురించి మాట్లాడుతున్నాము. వారికి "ఎల్లప్పుడు" అనే ప్రక్రియ వారి మధ్య స్వభావం అగ్నిలో మనుగడ సాగించినంత కాలం వారి క్రియల చొప్పున వారిని శిక్షిస్తుంది.

అధ్యాయము - 7

నాశనము చేయబడిన దేహము మరియు ఆత్మ

దుష్టుల విషయమై అంతిమ విషయానికి మనలను తీసుకువస్తుంది. "రక్షింపబడని వారి పాపాలకు అనుగుణంగా శిక్షించబడిన తరువాత, వారు దేహం మరియు ఆత్మ రెండూ ఉనికిలో లేకుండా తుడిచివేయబడతాయి. యేసు చాలా సరళంగా ఇలా చెప్పాడు, "మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి" (మత్తయి 10:28).

ఈ వాస్తవ ప్రకటన వెలుగులో, ఎవరైనా దుర్మార్గులకు అమరత్వముంటుందని ఎలా చెప్పుకుంటూ కొనసాగగలరు? నిత్యజీవ బహుమతిని ఇవ్వగల ఏకైక వ్యక్తి యేసు, నరకంలో ఉన్నవారు ఏ రూపంలోనైనా జీవించే అవకాశాన్ని తిరస్కరించాడు. దుర్మార్గుల జీవనం . ఇక ఎన్నటికీ లేకుండా నిర్మూలించబడుతుంది, మరియు దేహం మంటల్లో నాశనమవుతుంది.

కీర్తనకారుడు ఇలా వ్రాశాడు. "భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు" అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకకోపోవుదురు (కీర్తన 37.20) "ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు" (కీర్తన 3710).

'మానవ భాషలో అత్యంత శక్తివంతమైన, నిశ్చయాత్మకమైన పదాలు నరకంలో విధ్వంసం గురించి వివరించడానికి ఉపయోగిస్తారు, కాని రచయితలు తమ మాటలు వ్యక్తపరిచే వాటిని నిజంగా అర్ధం చేసుకోకూడదని ప్రజలు ఇప్పటికీ పట్టుబడుతున్నారు. "నాశనం," "తినివేయు", "దహనం" "మ్రింగివేయు," "మరణం" - ఈ పదాలకు ఇతర పుస్తకాలలో ఉన్నదానికంటే బైబిల్లో కొన్ని మర్మమైన, వ్యతిరేక అర్థాలు ఉన్నాయా? అలా ఆలోచించడానికి మనకు కారణం లేదు. వాస్తవం ఏమిటంటే, వేదాంతశాస్త్రం మన గొప్ప ప్రేమామయుడైన దేవున్ని క్రూరమైన వ్యక్తిగా చిత్రీకరించింది. ఆయనను హిట్లర్ కంటే క్రూరుడుగా చిత్రీకరించారు. హిట్లర్ ప్రజలను హింసించి, వారితో ప్రయోగాలు చేసినప్పటికీ, చివరకు అతను వారిని చనిపోవడానికి అనుమతించాడు. కానీ దేవుడు ఈ మరణం లేని ఆత్మలను శాశ్వతంగా చిత్రవధ అనుభవిస్తూ కేకలు వేయడాన్ని చూడటం కొరకు వారిని సజీవంగా ఉంచుతాడా, దురదృష్టవశాత్తు ఇదే వేదాంత పండితులు పేర్కొంటున్నారు.

అధ్యాయము - 8
నిరూపించబడిన దేవుని న్యాయస్వభావము

దేవు వుని ప్రేమను అలాంటి దృశ్యం తప్పుగా సూచించడమే కాదు, అది ఆయన న్యాయస్వభావాన్ని కూడా వక్రీకరిస్తుంది. నశించిన ప్రతి ఆత్మను మరణ సమయంలో తక్షణమే, ఎప్పటికీ అంతం కాని నరకానికి పంపే సిద్ధాంతం యొక్క చిక్కుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి.. ఒక వ్యక్తి 5,000 సంవత్సరాల క్రితం తన జీవితంలో ఒక పాపంతో మరణించాడని అనుకుందాం. అతని ఆత్మ ఎప్పటికీ హింసించబడటానికి తక్షణమే అగ్నిలోకి వెళుతుంది. ఇప్పుడు మరొక మరణాన్ని చిత్రీకరించి చూద్దాం, అడాల్ఫ్ హిట్లర్, లక్షలాది మంది ప్రజల మరణాలను దగ్గరుండి చేయించాడు. జనాదరణ పొందిన సిద్ధాంతం ప్రకారం, అతని ఆత్మ కూడా శాశ్వతంగా హింసించబడటానికి వెంటనే నరకంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఒక్క పాపం వల్లనే నశించిన మనిషి హిట్లర్ కంటే 5,000 సంవత్సరాలు ఎక్కువ కాలిపోతాడు. అది ఎలా ఉంటుంది? దేవుడు అలాంటి రీతిలో వ్యవహరిస్తాడా? ప్రతి ఒక్కరూ తన క్రియల చొప్పున శిక్షించబడాలి అనే బైబిల్ ప్రకటనకు ఇది విరుద్ధంగా ఉంటుంది.

దుర్మార్గుల శిక్షకు సంబంధించి ప్రస్తుత ప్రసరణలో రెండు తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి యూనివర్సలిజం (విశ్వవ్యాప్తవాదం) మరొక ముఖ్యమైన సిద్ధాంతం, ఇది దేవుడు చాలా మంచివాడని, ఎవరినైనా నశించడానికి అనుమతించడని వాదిస్తుంది. మరొకటి అంతములేని హింస యొక్క భయంకరమైన సిద్ధాంతం, అది శాశ్వతకాలం కొనసాగుతూ నిత్యమూ చిత్రవధకు గురిచేసే చీకటి అగాధం అని చెప్పే వాదం, రెండూ తప్పే. ఈ మధ్యలో అసలైన సత్యం ఉంది. దేవుడు దుర్మార్గులను వారి క్రియల చొప్పున శిక్షిస్తాడు, కాని ఈ ప్రక్రియలో చెడును నిరంతరం కొనసాగేలా చేయడు.

ఆయన స్వభావం యొక్క ఈ తప్పుడు వర్ణనపై వారు తిరస్కరించడం వల్ల చాలా మంది నిజాయితీగల ఆత్మలు (వ్యక్తులు) దేవుని నుండి దూరమయ్యారని నేను నిజంగా నమ్ముతున్నాను. చెడు ప్రజలను నిరంకుశంగా అనంతమైన హింసలో ఉంచే వ్యక్తిని వారు ప్రేమించలేరు. పునరావాసం సాధ్యం కాదు. పగ తీర్చుకోవాలనే ప్రతీకార గుణం గల వ్యక్తి మాత్రమే అటువంటి చెప్పలేని అమరిక ద్వారా క్రూరమైన పనులు చేస్తాడు. దేవుడు అలాంటివాడా? కాదు మిత్రమా!

నరకం గురించి బైబిల్ సత్యం విన్న తరువాత, ఒక బ్యాంకు అధ్యక్షుడు నా భుజాల మీద చేతులు వేసి, "పాస్టర్ లో క్రూస్ గారు, నేను మళ్ళీ విశ్వాసిని అయ్యాను. దేవుడు దుర్మార్గులను శాశ్వతంగా హింసిస్తాడని నాకు బోధించినందుకు కొన్నేళ్లుగా నేను దేవుడు లేడనే నాస్తికభావంలో ఉన్నా ఉన్నాను అని చెప్పాడు.

అధ్యాయము - 9

మరణము యొక్క పౌధ ఇక ఉండదు

ఏదో ఒక రోజు, రేవుడు శుభ్రమైన విశ్వం ఉండేలా చేస్తాడు. పాపం యొక్క చెడు ప్రభావాలన్నీ శాశ్వతంగా బహిష్కరించబడతాయి. పాపం ఉండదు, పాపులు ఉండరు, శోదించడానికి అపవాది ఉండదు. దేవుడు ప్రారంభంలో ప్రణాళిక వేసినట్లే ఉంటుంది.

ఈ మాటలలో భవిష్యత్ గృహాన్ని యోహాను వివరించాడు. "ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను" (ప్రకటన 21:4)

పూర్తిగా పునర్నిర్మించిన విశ్వంలో ఎవరికైనా ఏదైనా బాధను గూర్చి చెప్పబడడం ఆ విలువైన మాటలలో ఉన్నట్లు మీరు కనుగొనగలరా? ఏడుపు మరియు నొప్పి ఇక ఉండదని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఆయన వాక్యాన్ని నమ్ముతారా లేదా మనిషి ఊహను నమ్ముతారా? ఈ వాగ్దానం. రాయడానికి సరిగ్గా నాలుగు వచనాలకు ముందు, దుర్మార్గులను అగ్ని గుండంలో ఎలా పడవేయబడతారో యోహాను వివరించాడు. "ఎవని పేరైనను" జీవభ్రంధమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను" (ផ្លូវ 20:15, 21:1).

ప్రకటన 20:9 ప్రకారం భూమిపై ఆ అగ్ని గుండం ఉంటుంది. దుష్టులను దహించివేసే ఈ ప్రదేశం గతించిపోతుందని, దేవుడు కొత్త భూమిని దాని స్థానంలో తిరిగి సృష్టిస్తాడని దయచేసి గమనించండి. ఆ అగ్ని దుర్మార్గులను మ్రింగివేయుటకు ముందే క్రొత్త యెరూషలేము దిగి వస్తుంది. తరువాత, 4వ వచనం ప్రకారం, ఇక దుఃఖం, నొప్పి, ఏడుపు లేదా మరణం ఉండదు.

నొప్పి ఇక ఉనికిలో లేకుండా ఉండాలంటే, శాశ్వతమైన నరకం కూడా ఉండదు. రెండు విషయాలు ఒకదానికొకటి ప్రత్యేకమైనవి, ఒకటి ఉంటే మరొకటి ఉండదు. దేవుని ప్రణాళిక చివరకు బాధలను అంతం చేస్తుందని మనము ప్రతిరోజూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నొప్పి కలిగించడానికి సాతానుడు ఇక్కడ ఉండదు, మరియు దేవుడు తన క్రొత్త రాజ్యంలో బాధ యొక్క ఛాయను కూడా ఉంచనని వాగ్దానం చేశాడు.

అధ్యాయము - 10 నరకము మన కొరకు ఉద్దేశించబడినది కాదు

ఆఖరిగా, నరకం నీ కొరకు మరియు నా కొరకు ఎన్నడూ ఉద్దేశించబడలేదని తెలుసుకున్నందుకు మనము సంతోషించాలి. యేసు అది "అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినది" అని ప్పాడు. (మత్తయి. 25:41). మనము ఆ అగ్నిలోనికి జారేలా తొట్రిళ్ళితే, అది మనం చేయగలిగిన, అతి పెద్ద తప్పు. తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞప్తి మరియు లక్షలాది మంది దేవదూతల పరలోకపు ప్రభావం ఉన్నప్పటికీ యేసు క్రీస్తు విరిగిన శరీరం మీదుగా మీరు అక్కడకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రపంచమంతటిలో చాలావరకు జవాబు చెప్పలేని ప్రశ్న ఇది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకుంటాము?" క్రీస్తు మరియు ఆయన సిలువ ద్వారా తప్ప తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి సమాధానం లేదు.

ఒకడు పాపం చేసినందున ఎవ్వరూ నశించరు, ఎందుకంటే అందరూ పాపం చేసారు. ఒకడు అబద్దం చెప్పడం, దొంగిలించడం లేదా వ్యభిచారం చేయడం వల్ల ఎవరూ పరలోకం నుండి బహిష్కరించబడరు. ఎవరైనా నశించడానికి ఏకైక కారణం ఏమిటంటే, అతడు తన పాపము నుండి సమస్త దుర్నీతి నుండి క్షమించటానికి మరియు పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్న ప్రేమగల రక్షకుడి చేతుల్లోకి తిరగడానికి నిరాకరించాడు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).