విషయ సూచిక

అన్వేషణ
స్త్రీ సంఘమునకు గుర్తు
సంఘము హింసింపబడుట
సత్య సంఘము యొక్క మూడు గుర్తులు
గుర్తించుటకు నాల్గవ గుర్తు
బైబిలు పరీక్షకు నిలువలేక విఫలమైన అత్యధిక సంఘములు
ప్రవచనసారము
సంఘములో నుండి ప్రవక్తలు ఎందుకు అదృశ్యమైరి?
ఏ సంఘమైనను ఈ నాలుగు గుర్తులకు అనుగుణముగా ఉన్నదా?

అధ్యాయము 1

అన్వేషణ 

నేడు ప్రపంచంలో నిజమైన సంఘము ఉన్నదా? ఒక వేళ ఉంటే దానిని ఎలా గుర్తించగలవు?

ఆధునిక సత్యాన్వేషణదారుడు ఎదుర్కొంటున్న అన్ని మతపరమైన ప్రశ్నలలో ఇది ఎంతో ఆలోచింపజేయునది మరియు అత్యంత నిరాశపరిచేది కూడ. దీనికి ప్రతి వర్గము వారు వైరుధ్య మాటలతో వారికి సమాధానం ఉన్నదని ప్రకటించుచున్నారు. మత సంస్థలు మరియు వాటికి అనుసంధానముగా ఉన్న వివిధ సంఘ విభాగాలు కొన్ని భిన్నాభిప్రాయాలతో కూడిన బైబిలు వచనాలను ఆధారం చేసుకొని భావోద్వేగ వ్యాఖ్యలు మరియు కఠినమైన వాదనలు చేస్తున్నారు. 

ఈ అతిశయోక్తి ప్రగల్భాల ద్వారా సగటు క్రైస్తవుడు నేడు పూర్తిగా గందరగోళములో చిక్కుకొనియున్నాడు, "సత్య సంఘము" అనేది నిజంగా ఉనికిలో ఉందాలేదా అనే అనుమానముతో ఎందరో వెనక్కి తగ్గిపోతున్న పరిస్థితి కూడా లేకపోలేదు. మరికొందరు ఏ సంఘమైనను ఒకదాని కంటే మరొకటి నిజమైనది కావచ్చునని పరీక్షించే ప్రమాణాలను ప్రశ్నించిరి.

ఏ సంఘము ఉన్నతమైనదిగా నిరూపించబడలేదని గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఏ సభ్యుడు కూడ పాపం చేయకుండా లేడు, మనుషులు మనుషులే కాబట్టి ఎవరైనను మానవ బలహీనతలకు లోబడవలసినదే, అయినప్పటికీ, ప్రతి క్రైస్తవుడు ఈ బలహీనతలను అధిగమించుటకు ఉన్నతమైన దేవుని శక్తి మీద ఆధారపడి జీవించాలన్నది. వాస్తవం. కాబట్టి ఏ సంఘమైనను వివిధ స్థాయిలలో వ్యక్తిగత పవిత్రత కలిగి ఉండటం ప్రతివారికి ఖచ్చితముగా అవసరమైనది. గోధుమలు మరియు గురుగులుకలిసే పెరుగుతాయి, గనుక ఏ సంఘము పూర్తిగా పరిపూర్ణమైన వ్యక్తులతో నిండియుండదు.

అయితే ఇంకను ప్రశ్న మిగిలే ఉన్నది బైబిల్లో సత్య ప్రమాణాలకు అతి దగ్గరగా ఉన్న సంఘమును గుర్తించే ప్రామాణిక మార్గం ఏదైనా ఉన్నదా? సంస్థ యొక్క విలక్షణమైన పేరు దానిని సరైనదిగా ప్రత్యేకించునని కొందరు భావిస్తున్నారు. ఇది ఖచ్చితముగా ఒక సరైన పరీక్ష కాదు, ఎందుకంటే ఎంపిక చేసుకున్న పేరును బట్టి సంఘము యొక్క ఆధ్యాత్మిక - స్వభావం బయలుపడదు. ఇటువంటి నిస్సారమైన వాదనలు సత్య అన్వేషకుల యొక్క జ్ఞానమును నిరుత్సాహపరుచుటకు మాత్రమే ఉపయోగపడతాయి. 

నేటి ప్రపంచంలో దేవునికి ప్రత్యేకించబడిన సంఘము ఉన్నది అంటే, అది అందరికి స్పష్టంగా బయలుపడుతుంది. ఆయన దానిని తన పరిశుద్ధ వాక్యంలో స్పష్టంగా మరియు బహిర్గతముగా వెల్లడిస్తాడు. మానవ తర్కానికి అనుగుణముగా విజ్ఞప్తి చేసే విధానములో ఆ సమాచారం ఉండాలి మరియు అది స్పష్టతలేని సాధారణమైన మరియు ఊహాత్మక ప్రవచనాల కన్నా విలువైన విషయాలను అందించేదిగా ఉండాలి. 

మీరు చదవబోయే దాని గురించి ఏవైనా వాదనలు చేయడానికి నేను ఇష్టపడను, అయినప్పటికీ ఇది మీ జీవితంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుందని నాకు బాగా తెలుసు. అయితే క్రింద ఇవ్వబడిన సమాచారమును తేలికగా చదువుకొని తాత్కాలికముగా గుర్తుంచుకొవచ్చునని మీరు అనుకొనవద్దు. మీ మనస్సు విప్పి ప్రార్ధనా పూర్వకముగా అధ్యయనం చేయాలన్నది నా మనవి. లేఖనాల ఆధారముతోను మరియు మీ ఆధ్యాత్మిక సమర్పణతోను మీకు మీరే విమర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నిజం అయితే, దానిని గుర్తించటానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంతోషముగా నడిపించును. నా వ్యక్తిగతమైన ఉద్దేశం ఏమిటంటే, దేవుని వాక్యంలో మునుపెన్నడు లేని అత్యంత ఉత్తేజకరమైన సాహస అనుభవాన్ని మీరు పొందుతారు.

సత్యం కోసం మనకున్న తృష్ణ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంపై దృష్టి పెడుతుంది. సమగ్రమైన అధ్యయనానికి పరిమితి, సమయం, మరియు స్థలం అంటూ ఏమి లేవు, కానీ రెండు సూత్రాలకు, అవి యథార్థత (ఖచ్చితత్వం) మరియు సరళతకు (సులభత్వానికి) ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. నిజమైన సంఘము యొక్క ఆశ్చర్యకరమైన పరాకాష్టకు మనం చేరువగుచుండగా పన్నెండు వందల సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా పరిశీలన చేయగలిగితే గొప్ప సత్యమును మనం కనుగొంటాము. "ద బీస్ట్, ద డ్రాగన్, అండ్ ద ఉమెన్ (క్రూరమృగము, ఘటసర్పము, మరియు స్త్రీ)" అనే నా (గ్రంధకర్త) పుస్తకంలో ప్రవచనము యొక్క నిర్ధారితమైన చారిత్రక సమాచారము సమకూర్చబడినది.

అధ్యాయము 2

స్త్రీ సంఘమునకు గుర్తు

ప్రాథమికంగా ప్రకటన 12వ అధ్యాయం ఒక సౌందర్యమైన సూర్యుని ధరించిన స్త్రీ మరియు ఆమె సంతానాన్ని గూర్చి వివరించబడినది. “అప్పుడు పరలోకములో ఒక గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను"(ລ້ 12:1).

బైబిల్లో బాగా తెలిసిన గుర్తుల్లో ఒకటి ఇక్కడ మనకు పరిచయం చేయబడింది. పాత మరియు క్రొత్త నిబంధనలలో, దేవుడు తన ప్రజలను ఒక స్త్రీకి పోల్చెను. పెండ్లికుమారుడుగా ఆయన సంఘమును వివాహం చేసుకున్నాడు (అనగా ఆధ్యాత్మికముగా ఆయన ప్రజలతో ఏకమగుట). పౌలు కొరింథీయులకు వ్రాస్తూ, "పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని" అని చెప్పెను (2 కొరింధీయులకు 11:2)

బైబిలు అంతటిలో కూడ ఈ పోలికనే మనము చూస్తాము. పాత నిబంధనలో దేవుడు ఇలా అన్నాడు. "సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్లగించుచున్నాను” (అనగా సీయోను కుమార్తెను దేవుడు సౌందర్యమైన స్త్రీతో పోల్చియున్నాడు) (యిర్మీయా 6:2), మరలా, "నా జనమును నీవేయని సీయోనుతో చెప్పునట్లును" అనెను (యెషయా 51:16) సంఘము సీయోను మరియు దేవుడు దానిని ఒక సౌందర్యమైన స్త్రీతో పోలుస్తున్నాడు. పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు కాబట్టి దేవుడు వారిని ఆత్మీయముగా వివాహం చేసుకున్నట్లు వర్ణించబడియున్నది.

క్రొత్త నిబంధనలో, దేవుని యొక్క నిజమైన ఇశ్రాయేలు ఇకపై ఒక దేశముగా కాక క్రీస్తును తమ స్వరక్షకునిగా స్వీకరించిన యూదులు మరియు అన్యజనులతో నిండిన ఒక సంఘముగా ఉన్నది. అందువల్ల క్రీస్తు కాలంలో ప్రకటన 12 అధ్యాయములో ఉన్న స్త్రీ. సంఘము యొక్క కథాంశమును మనకు తెలియజేస్తుంది. సూర్యుని ధరించుకొనుట మహిమగల నూతన కృపా నిబంధనకును, మరియు పన్నెండు నక్షత్రాలు పన్నెండు అపొస్తలులను సూచిస్తాయి. ఆమె పాదాల క్రింద ఉన్న

చంద్రుడు నిజమైన దేవుని గొర్రెపిల్ల సమక్షంలో తగ్గిపోతున్న పాత నిబంధన యొక్క మహిమను సూచిస్తుంది.

ఇప్పుడు ఉత్కంఠభరితమైన భాగం ప్రారంభమవుతుంది! మన ప్రభువైన యేసు యొక్క సంఘమును గూర్చిన భవిష్యత్తును మనము చూడబోతున్నాము. తదుపరి వచనములు యుగాల వెంబడి సత్యము యొక్క గమనాన్ని స్పష్టంగా వివరించును. నేడు ఆ స్త్రీ (సంఘము) యొక్క ఉనికి ఎక్కడ ఉన్నదో కనుగొనుటకు ప్రయత్నించుచున్నాము! ప్రస్తుత కాలమునకు నిజమైన సంఘము యొక్క వైవిధ్యాలను మనము కనుగొనుచుండగా ప్రవచనములలో ఉన్న విశేషమైన ఒక్క విషయాన్ని కూడా కొల్పోవద్దు!

మగశిశువును కనిన స్త్రీని గూర్చి మొదట మనం కనుగొంటున్న విషయం "ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో యెర్రని మహా ఘటసర్పము, దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను, దాని తలలుమీద ఏడు కిరీటములుండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమునీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న అ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయ వలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహసనము నొద్దకును కొనిపోబడెను" (ప్రకటన 12:2-5).

సమస్త దేశ ప్రజలను పరిపాలించటానికి నిర్ణయింపబడిన వాడును మరియు పరలోకమునకు ఎత్తబడినవాడైన ఈ మగశిశువు ఎవరు? ఇట్టి వర్ణన యేసుక్రీస్తుకు మాత్రమే సరిపోతుంది. క్రీస్తు

పుట్టినప్పుడు హతమార్చడానికి ప్రయత్నించిన ఘటసర్పము ఎవరిని సూచించుచున్నది? రెండు సంవత్సరాల మరియు అంత కంటే తక్కువ వయస్సు గల పిల్లలందరిని చంపమని ఆదేశాన్ని ఇచ్చిన రోమాప్రతినిధి అయిన హేరోదు రాజును సూచించుచున్నది. సాధారణంగా, ఘటసర్పము సాతానుకు గుర్తుగా వాడబడును. అయితే ఈ సందర్భంలో, యేసును చంపడానికి అపవాది అయిన సాతానుడు రోమా అధికారముతో సన్నిహితముగా పని చేస్తున్నాడు కాబట్టి ఆ ఘటసర్పము రోమాకు గుర్తుగా ఉన్నది.

యేసు హేరోదు యొక్క భయంకరమైన శాసనము నుండి ఎలా తప్పించుకున్నాడు? యోసేపు మరియు మరియకు జరగబోయే ప్రమాదం గురించి కలలో హెచ్చరించబడినప్పుడు, వారు శిశువుతో ఐగుప్తుకు పారిపోయిరి. మరణ శాసనం అమలు అయిన తరువాత, వారు తిరిగి వచ్చి నజరేతు పట్టణంలో స్థిరపడ్డారు.

యేసును హతమార్చడానికి తన ప్రారంభకుట్రలో అపవాది విఫలమైనప్పటికీ, అతడు తన ఉద్దేశ్యాన్ని వదల్లేదు. పదేపదే, యేసు క్రీస్తు ప్రాణాలను తీయటానికి ప్రయత్నిస్తునే ఉన్నాడు. చివరకు అపహాస్యం చేసే ఒక విచారణ గుంపుకు అప్పగించి తర్వాత ఆయనను హింసించి, సిలువ వేయించి, సమాధిలో పెట్టేంతవరకు తీసుకు వచ్చాడు. అయితే సమాధి దేవుని కుమారుని బంధిచలేకపోయినది. మూడవ దినమున ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చాడు. తరువాత, ఆయన పరలోకంలో ఉన్న తన తండ్రి యొద్దకు కొనిపోబడ్డాడు.

అధ్యాయము 3

సంఘము హింసింపబడుట

క్రీస్తుతో ప్రత్యక్ష పోరాటం చేయలేక, ఘటసర్పము (రోమా పోవుల వ్యవస్థ) ఇప్పుడు సంఘమునకు అంటే క్రీస్తు అనుచరులకు వ్యతిరేకముగా తిరగబడి తన కోపాన్ని వెళ్లగక్కుచున్నది. 'ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, మగశిశువును కనిన స్త్రీని హింసించెను" (ప్రకటన 12:13),

ఈ మాటలు అపొస్తలుల సంఘానికి వ్యతిరేకంగా సంభవించిన భయానక సంఘటనలను గూర్చిన అతి స్వల్ప సూచనను మాత్రమే ఇచ్చుచున్నవి. ప్రత్యేకంగా ఆదిమ శిష్యులు మరియు సంఘనాయకులు వారి విశ్వాసం విషయమై హతసాక్షులైరి. క్రూరమైన 'అన్యమత అధికారులు క్రీడా వేదికలను, నాట్యరంగ స్థలాలను సత్యసువార్తను అనుసరించినవారిని వేధించి చంపే వేడుకశాలలుగా మార్చివేసిరి.

అతి త్వరలో అన్యమత రోమా పోపుల రోమాగా మారిపోయి, దాని ఘోరమైన హింసను మరింత ప్రభావముగా కొనసాగించెను. పోవుల వ్యవస్థపై వ్యతిరేకతను నిర్మూలించడానికి ప్రయత్నించినందుకుగాను. లక్షలాది మంది భయంకరమైన వేదనలకు గురై మరణించారు. ఈ చీకటి యుగంలో యాభై కోట్లమందికి పైగా ప్రజలు తమ ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని వదులుకోకుండా ప్రాణాలను అర్పించారని చరిత్రకారులు అంచనా వేసిరి.

కానీ మన ప్రవచనాత్మక రూపురేఖలలోని విషాద కధనాన్ని మనము చూద్దాం. హింస యొక్క ఉద్భత పెరిగినప్పుడు సత్య సంఘము ఏమి చేసినదో ప్రకటన 12.14 వివరించుచున్నది: "అందువలన

ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్వముఖమును చూడకుండ ఆమె ఒక కాలము కాలములు అర్థ కాలము పోషింపబడెను."

క్రీస్తు భోదించిన సత్య సిద్ధాంతములను విడనాడక అనుసరిస్తున్న విశ్వాసపాత్రులైన శరణార్థులు అపదలు నుండి తప్పించుకోవడానికి పర్వత ప్రదేశాలకును మరియు లోయల్లోకి పారిపోయారు. ఆ శతాబ్దాల అణచివేత సమయంలో వాలెన్సెస్, హ్యూగెనోట్స్ మరియు అల్బిజెన్సెస్ ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని వదలకుండ ప్రదర్శించిన వీరత్వమును గూర్చి మరొక అపొస్తలుల గ్రంథం రాయవచ్చును. దేవుడు వారి పక్షమున బలముగా పోరాడెను, మరియు కొన్నిసార్లు శత్రువులు హిమపాతాలలో మరియు నునుపుగా నున్న కొండలు మీద రోమా సైన్యాలు నడవలేక వెనక్కి తగ్గటం వలన వారు మర్మపూరితమైన విధముగా తప్పించబడి యున్నారు. కొన్ని సమయాల్లో సత్యం కోసం జీవించిన భక్తిపరులైన ఈ విశ్వాసులు చిందిచబడియున్న వారి రక్తంతో పర్వత నదులు రక్త ప్రవాహమైనవి. వారి మనుగడ కోసం ఇప్పుడు దాగుకొనియున్న ఈ చిన్న సముహమైన క్రైస్తవులను తుడిచి పెట్టడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను ప్రకటనలో చెప్పబడిన ప్రవచనము సాదృశ్య రూపాన్ని ఇచ్చుచున్నది. "కావున ఆ స్త్రీ. ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్భము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను" (ప్రకటన 12:15)

సత్య సంఘము ఎంతకాలం అరణ్యంలో కనిపించకుండా దాగి ఉండాలి? అది "ఒక కాలము కాలములు అర్ధ కాలమని ప్రవచనము నిర్ధారించుచున్నది, ఇది ఎంత మర్మము! ఈ కాలము యొక్క వింతైన వర్ణన ఇందులో ఇమిడి ఉండటంలో అర్ధమేమై యుంటుంది? ఇది ఎప్పుడు ముగుస్తుంది? 6వ వచనంలో సమాధానం స్పష్టమై ఉంది. "ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు (1.260 దినములు) ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను."

ఇప్పుడు అ సన్నివేశము ఎంతో స్పష్టముగా అర్థమగుచున్నది. ఒక వచనము - స్త్రీ 1,260 దినములు అరణ్యంలో ఉందని, మరొక వచనము ఆమె ఒక కాలము కాలములు అర్ధ కాలము పోషింపబడునని ఉంది, ఈ రెండు కాలాలు ఒకటే. ప్రవచన దృష్టిలో చూస్తే "ఒక కాలము" ఒక సంవత్సరముతో సమానము. కాలములు అనగా రెండు సంవత్సరాలు, మరియు "అర్థ కాలము" అనగా అర్ధ సంవత్సరము, లేక ఆరు నెలలు, అయితే అది ఒక సంవత్సరము. రెండు సంవత్సరాలు, మరియు అర్ధ సంవత్సరము. ఇప్పుడు మనము వాటిని కలిపినప్పుడు, మనకు మూడున్నర సంవత్సరాలు వస్తాయి. బైబిలు లెక్కలో నెలకు 30 దినాలుగా తీసుకుంటే అది సరిగ్గా 1,260 దినములకు సమానమవుతుంది.

ప్రవచనాత్మక వ్యాఖ్యానములో మరో సూత్రం మన జాబితాలోనికి తీసుకోవలసి వుంది. బైబిలు ప్రవచనము ప్రకారము ఒక దినము ఎల్లప్పుడూ ఒక సంవత్సరముగా పరిగణించబడి వుంది. ఈ సూత్రానికి సంబంధించిన మూలవాక్యమును మునము కనుగొంటాము. యెహెజ్కేలు 46లో "సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను." ఇటువంటి మాటలే మరొక చోట ఉన్నాయి : "... నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు" (సంఖ్యాకాండము 14:34).

ఇది లోని ప్రవచనసారమైన గుర్తులకు మాత్రమే వర్తిస్తుందని ఇతర లేఖన భాగాలకు ఈ సూత్రాన్ని అవలంబించి చదువకూడదు. కనుక ఒక స్పష్టమైన ప్రవచనాత్మక సందర్భమునకు మాత్రమే ఒక సంవత్సరానికి ఒక దినమును సూచిస్తాము. ఈ సూత్రము స్త్రీని తన అరణ్యములో 1,260 అక్షరార్థమైన సంవత్సరాలు కనబడకుండా దాచుటకు వర్తిస్తుంది.

నిజమైన సంఘము ఈ ప్రపంచములో 1,260 సంవత్సరాలు పూర్తి అయ్యాకే ఉనికిలోనికి వస్తుందని అవ్వకుండా ఉనికిలోనికి రాదని మన తుది నిర్ణయమై యుండాలి. సత్యమును వెంబడించే దేవుని ప్రజలకు ఇటువంటిది జరిగిందా? మత- రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని సత్య సిద్ధాంతాలను అణచివేయుటలో పోపు వ్యవస్థ యొక్క అధికారము ఎంతకాలం కొనసాగింది?

ప్రపంచ చరిత్రలోని ఆకర్షణీమైన విషయము ఇక్కడ ఉంది. క్రీ.శ 538లో జస్టినియన్ చక్రవర్తి ఇచ్చిన ఉత్తర్వు అమల్లోకి వచ్చింది. ఇది రోమా సంఘానికి సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇచ్చింది. క్రమంగా, ఈ మత దౌర్జన్యం పౌర శక్తులతో కలిసిపోయి, చివరికి రాజులు పాలించటానికి ముందు పోపు నుండి. అనుమతి పొందవలసి వచ్చింది. ఈ అధికారం 1798 సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం ద్వారా ఐరోపా చలించిపోయేంత వరకు అధికారంలో ఉంది. తరువాత మతాధికారులకు వ్యతిరేకంగా అణచివేతకు గురైన రైతుల తిరుగుబాటులో, 1798లో పోపు బంధించబడ్డాడు. అధికారులు పోపుల ఆస్తిని జప్తు చేశారు, మరియు ఫ్రెంచ్ అధికార ప్రభుత్వం ఇక మీదట రోము బిషన్ల అధికారము ఉండదని ప్రకటించింది. పోపు వ్యవస్థ యొక్క అణచివేత పాలన క్రీ.శ. 538లో ప్రారంభమై సరిగ్గా 1,260 సంవత్సరాల తరువాత క్రీ.శ. 1798లో ముగిసింది.

అధ్యాయము 4 

సత్య సంఘము యొక్క మూడు గుర్తులు

ఇది చాలా ముఖ్యమైన పరిశీలనకు మనలను తీసుకువస్తుంది. 1798 సంవత్సరం తరువాతగాని సత్య సంఘము ఉనికిలోనికి రాలేదు. ఇది 1,260 సంవత్సరాల ముగింపు వరకు గుర్తించబడకుండ ఉండి, ఆ "అరణ్యకాలము" 1798లో ముగిసింది. ఇప్పుడు మన ముందు నిజమైన సంఘాన్ని గుర్తించే యొక్క అద్భుతమైన గుర్తు ఒకటి ఉంది. ఇది కొంత భావోద్వేగ భావనపైనో లేదా ఒకే బైబిలు వచనం యొక్క కొంత వివరణపై ఆధారపడినది కాదు. ఇది చారిత్రక గ్రంధాల యొక్క ఆధారములతో ధృవీకరించబడగల ఒక నిర్దిష్ట కాలమును బయలుపరుచుచున్న కాల ప్రవచనము. పోపులు అధికారమును నిరోధించి వారి అక్రమ మార్గంలో నుంచి తొలగించబడిన తర్వాతగాని స్త్రీ (సంఘము) తన ఉనికిని చూడలేదు. ఇది ప్రవచనాత్మక సంఘటన 1798లో చోటు చేసుకొన్నది. మరియు ఏ సత్యమైతే గోనె సంచిలో (అనగా కొంచెము కూడా అందకుండా) కట్టబడి యున్నదో అది ఆ అంధకారము నుండి ఇప్పుడు విప్పబడి, విడుదల పొంది అతి త్వరలో స్త్రీ యొక్క అద్భుతమైన శేషించిన సంఘముగా కనిపించనైయున్నది.

ఈ ప్రపంచము ముందు 1798వ సంవత్సరం తరువాత కొంతకాలానికి ఉనికిలోనికి రానైయున్న స్త్రీని గూర్చిన వాస్తవ వర్ణనకు ఇప్పుడు మనము వచ్చాము: "అందుచేత అ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.” (ప్రకటన 12:17).

ఈ పదనం బైబిలంతటిలో చాలా ముఖ్యమైనది. యుగయుగాలుగా భద్రపరచబడియున్న దాని కంటే మించి అసలు సిసలైన ఆదిమ అపొస్తలుల విశ్వాసము యొక్క అంత్యదిన శేషించిన సంఘమును గూర్చిన సంక్షిప్త వివరణ మరెక్కడా లేదు. ప్రస్తుత కాలమునకు నిజమైన సంఘమును గూర్చి వాస్తవ మౌలిక నిర్వచనం ఇక్కడ ఉన్నది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పూర్తి అర్థాన్ని విడదీయడానికి మనము ప్రతి పదాన్ని విశ్లేషించబోతున్నాము. ఒక వేళ నిజమైన సంఘము బైబిల్లో ఎక్కడైన కనుగొనబడి వుందంటే, ఈ వచనమే దానిని బయలుపరుస్తుంది.

"ఆ మహా ఘటసర్పము ..." ఈ మహా ఘటసర్భము ఎవరు? ఈ అంశంపై ఎటువంటి ప్రశ్న అవసరమే లేదు. ప్రకటన 12:9లో "సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము.".

"అగ్రహము ..." దీని అర్ధం ఏమిటి? "ఆగ్రహము అనేది కోపము అనే మాటకు పాత తెలుగు పదం. అనగా సాతాను కోపంగా ఉన్నాడని అర్థము. అతడు ఎవరి మీద కోపంగా ఉన్నాడు? "(స్త్రీ మీద) అగ్రహము తెచ్చుకొని..." స్త్రీ ఎవరు? ఆమె యేసు యొక్క గొప్ప, మూల బోధలను సూచించే సత్యమైన అపొస్తలుల సంఘమని మనము ఇదివరకే కనుగొనియున్నాము.

"ఆమె సంతానములో శేషించినవారితో యుద్ధం చేయుటకై బయలువెడలెను ..." ఇక్కడ ఈ సన్నివేశములో ఒక కొత్త పదం పరిచయమైంది. శేషించిన సత్య సంఘముతో సాతాను వ్యతిరేకంగా పోరాటము చేయుటకు ఎదురు చూస్తున్నాడు. శేషం అంటే ఏమిటి? అది వస్త్రపు చుట్టలో మిగిలిన చివరి ముక్క భాగమని అర్ధము. ఇది అచ్చం మొదటి ముక్క భాగము వలె ఉండి, వస్త్రపు చుట్ట చివరిలో ఒక చిన్న ముక్కగానే ఉంటుంది.

ఇది స్త్రీ (సంఘము) యొక్క సంతానములో శేషించినవారిని గూర్చి ఏమి చెబుతుంది? ఇది అంత్యకాలమందు సత్య సంఘములో నుండి వచ్చిన చివరి ప్రజలను సూచిస్తుంది. సరిగ్గా ఆదిమ అపొస్తలుల సంఘము మాదిరిగానే అదే సిద్ధాంతాలను అది కలిగి ఉంటుంది. ఇంకా చదువుతూ ముందుకు కొనసాగుదాము.

"దేవుని ఆజ్ఞలు గైకొనుచు..." ఇది ఏ ఆజ్ఞలను సూచిస్తుంది? రెండు రాతి పలకల మీద దేవుడు తన స్వహస్తములతో రాసిన నీతి ధర్మశాస్త్రమైన పది ఆజ్ఞలను సూచిస్తుంది. పది ఆజ్ఞలు దేవుని స్వభావాన్ని ప్రతిబింబింపజేస్తాయి. ఆయన ప్రాణులందరి కొరకైన తన చిత్తాన్ని బయలుపరుస్తుంది, మరియు సమస్త నీతికి మరియు సత్య ఆరాధనకు పునాదిని నిర్మిస్తుంది.

ఇక్కడ మనం సత్య సంఘమును గుర్తించే రెండవ రహస్య గుర్తును ఎదుర్కొన్నాము. అది 1798 సంవత్సరం తరువాత కొంత కాలానికి పైకి లేచుట మాత్రమే కాక, దేవుని వాక్యాదేశము చొప్పున అది దేవుని పది ఆజ్ఞలను గైకొనుచుండవలెను.

అయితే ఇప్పుడు ఈ విశేషమైన వచనమును మనము చదివి ముగిద్దాము. "యేసు గూర్చిన సాక్ష్యము" కలిగి ఉండుట. నిజమైన శేషంచిన సంఘము యొక్క మరొక లక్షణమును ఇక్కడ మనము కనుగొంటాము. ఈ అంత్యదిన సంఘము 1798 సంవత్సరము తరువాత కొంత కాలానికి అమెరికాలోకి వచ్చి, పది ఆజ్ఞలను గైకొనుచుండుట మాత్రమే కాక, యేసు గూర్చిన సాక్ష్యమును కూడా అది కలిగి ఉంటుంది. యేసు గూర్చిన సాక్ష్యమంటే ఏమిటి? ఇది అంతగా పరిచయము లేని వచనము, అయితే దానిని అర్ధము చేసుకొనుటకు మానవ జ్ఞానమునకు మించిన దైవ జ్ఞానము మనకు అవసరమైయున్నది.

బైబిలు మనకు ప్రత్యేకంగా ఈ వ్యక్తీకరణను ఎలా నిర్ధారిస్తుందో. గమనించండి. ఈ వచనములో సత్యము యొక్క సమగ్ర పునాది ఉన్న యెడల, ప్రతి వాక్యభాగాన్ని దేవుని వాక్యమే మనకు స్పష్టం చేయవలసి. ఉంటుంది. దాని నిర్వచనం పరలోకము నుండి పంపబడిన దేవదూత యోహానుకు వివరించెను. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను, దేవునికి నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని (ప్రవచన ఆత్మయని) నాతో చెప్పెను" (ప్రకటన 19:10)

అదే! మనకు ఎటువంటి సందేహం లేకుండా యేసు గూర్చిన సాక్ష్యం ప్రవచనసారమని మనకు అర్థమైనది. అంత్యదిన సత్య సంఘమును గుర్తించుటకు ఇది మూడవ విశేషమైన గుర్తు!

నేను మిమ్ములను ఒకటి అడిగెదను దేవుని వాక్యంలో ఉన్న రహస్యాలను నీవు కనుగొన్నప్పుడు, నీవు ఇంతవరకు విన్న బోధలు శూన్యమైనవని నీవు గ్రహించినప్పుడు, మనస్సును పరవశింపజేసే ఒక ఉత్సాహం మీలో పెరిగిందా? మన కాలములో దేవుని ప్రత్యేకమైన ప్రజలు మరియు వారి ప్రత్యేక వర్తమానాన్ని గుర్తించడానికి మనము అతి సమీపంలో ఉన్నాము. మనము దీనిని బైబిలే గుర్తించుటకు. అనుమతించుచున్నాము. ఈ మూడీ ఖచ్చితమైన లక్షణాలలో ఒక్కటి కూడా మనము కల్పించలేదు. యేసు క్రీస్తు యొక్క అంత్య కాల సత్య సంఘమునకు ఎవరును తమ సొంత ఊహలతో సవాలు చేయలేదు. ఆ శేషించిన సంఘము బైబిల్లో వ్రాయబడియున్న ఈ మూడు గుర్తులను

  1. క్రీ. శ. 1798 తర్వాత ఉనికిలోనికి వచ్చును.
  2. పది ఆజ్ఞలను పాటించును.
  3. ప్రవచనసారము (అనగా ప్రవక్తను) కలిగి ఉండును.

కొంతమంది ఇప్పటికే మూడవ గుర్తుపై ఆశ్చర్యపడుతున్నారని తెలుసు. "ప్రవచనసారము" "యేసును గూర్చిన సాక్ష్యము" వలె అర్ధం చేసుకొనుటకు కష్టతరమైనది. అయితే మీరు అలాగే ఉండండి, ఈ విషయము మీద అతి త్వరలో మనకు వివరణ అందుతుంది.

అధ్యాయము 5 

గుర్తించుటకు నాల్గవ గుర్తు

అతి కీలకమైన నాల్గవ గుర్తును మన జాబితాకు ఇప్పుడు నేను జోడించాలనుకుంటున్నాను. ఈ సంఘము చారిత్రక సత్యము యొక్క చివరి, అంత్య భాగమైయున్నదని మనము గుర్తించియున్నాము. ఇది యేసు రాకడకు సరిగ్గా ముందు దేవుని అంతిమ సందేశాన్ని ప్రకటించుచు నుండును. వాస్తవానికి దేవుడు ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన సందేశము లేదా హెచ్చరిక వర్తమానాన్ని ప్రపంచానికి అందించాలని అనుకుంటే, ఆయన ఖచ్చితంగా ఆ సందేశాన్ని తన అంత్యదిన శేషించిన సంఘము ద్వారా అందించును. మనము ఈ ముగింపులో న్యాయమును చూడగలమని నేననుకుంటున్నాను.

నిజంగా దేవునికి అలాంటి సందేశం ఉందా, అది బైబిల్లో స్పష్టంగా గుర్తించబడి వుందా? ఇటువంటి ఖచ్చితమైన సత్యాన్ని గూర్చిన ప్రకటన మానవ చరిత్ర యొక్క ముగింపుకు సరిగ్గా ముందు జరుగుతుందని యేసు సూచించాడు. ఆయన మాటలు వినండి. "మరియు ఈ రాజ్యసువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటుతరువాత అంతము వచ్చును" (మత్తయి 24:141)

"రాజ్య సువార్త" ప్రపంచమంతట విస్తృతంగా ప్రకటించడమే. క్రీస్తు రాకడకు చివరి సూచన" అటుతరువాత అంతము వచ్చును. ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథకర్త యోహాను క్రీస్తు పలికిన మాటల నెరవేర్పును ఒక దర్శనములో చూశాడు. "అప్పుడు మరియొక దూతను చూచితివి. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు... గొప్ప స్వరముతో చెప్పెను" అని వ్రాసెను (ప్రకటన 14:6, 7),

ముందున్న కొన్ని వచనములు ఈ ప్రత్యేక సువార్త ప్రకటనలో ఏమున్నదో క్లీన్న దానిని గూర్చి స్పష్టముగా వివరిస్తాయి. అటు తరువాత యోహాను వెంటనే, "మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని మేఘము కనపడెను, మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడైయుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను ... మేఘము మీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను" (ప్రకటన 14:14, 16)

అ విషయమును మీరు గమనించారా? ఈ ప్రత్యేకమైన "సువార్త" సందేశం భూమి మీద ఉన్న సకల దేశాలకు ప్రకటించబడిన తరువాత అంతము వస్తుంది, యేసు అదే మాట చెప్పెను. "ఈ రాజ్యనువార్త. లోకమందంతటను ప్రకటించబడును. అటుతరువాత అంతము వచ్చును."

ఈ సందేశం ఏమైనప్పటికీ, అది మానవ చెవులు ఎన్నడు విననంత అత్యవసరమైనదియు, మరియు ఒప్పింపజేసేదిగా ఉండాలి. అది పూర్తయితేనే క్రీస్తు మహిమాన్వితమైన రాజ్యము వస్తుందని యోహాను మరియు యేసు ఇద్దరూ సాక్ష్యమిచ్చిరి.

ఆ తుది హెచ్చరికలో ఏమున్నది మనము తెలుసుకొనగలమా? ఇది ఎవరు సందేహించవలసిన అవసరం లేదని యోహాను దానిని చాలా సున్నితముగా మరియు సరళంగా చెప్పియున్నాడు. "మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను ... అని గొప్ప స్వరముతో చెప్పెను" (ప్రకటన 14:7), దేవుని తీర్పు ఇప్పటికే ప్రారంభమైందని ఆయన ఇచ్చిన చివరి పిలుపులో కొంత భాగం ప్రకటించటం గమనించుము. వచ్చుచున్నది అని కాక "వచ్చెను" అని అక్కడ చెప్పబడింది. భూమి యొక్క సకల దేశాలకు ఇటువంటి రాకడకు ముందు ప్రకటించాల్సిన తీర్పు సందేశమును ప్రకటించుటకు మనం ఎదురుచూడాలి, మనసుపెట్టి వినాలి.

మొదటి దూత వర్తమానము తదుపరి భాగం ఇది, "ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి” (ప్రకటన 14:7). ఈ విషయము విన్నట్టు మరియు బాగుగా తెలిసినట్టు ఉంది కదూ? ఎందుకంటే ఇది పది ఆజ్ఞలలోని నాలుగవ ఆజ్ఞ నుండి దాదాపుగా మాటకు మాటగా చెప్పబడినది, అంతిమ కాలమునకు ముందు ప్రపంచమంత ప్రకటించబడవలసిన సబ్బాతు (విశ్రాంతిదిన) సత్యం "సువార్తలో" భాగమైయున్నదని ఉద్ఘాటిస్తున్నది.

సృష్టికర్త అయిన దేవునిని మీరు ఎలా ఆరాధిస్తారు? పది ఆజ్ఞలు హృదయంలో ఉంచుకొనుట చేతనేనని దేవుడు చెప్పియున్నాడు: "ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను, అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధ పరచెను" (నిర్గమకాండము 20:11).

నిజమైన ఆరాధన దేవుని సృష్టించే శక్తిని మరియు సర్వాధికారాన్ని గుర్తించగలిగినప్పుడే జనిస్తుంది మరియు తానే సర్వమును సృజించిన సృష్టికర్త అని తెలియజేయుటకు స్థిరమైన సూచనగా విశ్రాంతిదినమును దేవుడు నియమించెను. దేవునిని ఆరాధించుమని బైబిలు పదే పదే గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆయనే అన్నింటినీ సృష్టించియున్నారు. “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితిని, నీ చిత్తమునుబట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టించబడెను" (ప్రకటన 111)

దేవుడు అబద్ద దేవతలను పదేపదే సవాలు చేశాడు, ఎందుకనగా వారు సృష్టించలేరు "ఆకాశమును ధూమిని సృష్టింపని యీ దేవతలు భూమి మీద నుండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను" (యిర్మీయా 10:11, 12), ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను యెహెూవాను నేనే మరి ఏ దేవుడును లేడు (యెషయా 45:18) I

దేవుడైన యెహోవా ఒక్కడే ఆరాధనకు యోగ్యుడని తన సార్వభౌమాధికారాన్ని గుర్తు చేసే సూచనగా ఆయన సబ్బాతును నియమించాడు. నిజమైన సబ్బాతును ప్రత్యేకపరచి సృష్టికర్త అయిన

దేవుడు వారంలో ఏడు రోజుల స్వతంత్ర చక్రాన్ని ఏర్పాటు చేశాడు. తద్వారా ఎవరిని అరాధించాలో మరియు ఎప్పుడు ఆరాధించాలో ప్రజలు తెలుసుకుంటారు కనుక వారికి సాకు చెప్పే అవకాశము ఉండదు. అందువలన మొదటి దూత వర్తమానంలో ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని ప్రజలకు పిలుపు ఇయ్యబడింది. ఇది నిజమైన సబ్బాతును పాటించమనే పిలుపు.

యోహాను వర్ణించిన రెండవ మరియు మూడవ దూతల వర్తమానాలను మనము క్లుప్తంగా గ్రహించవచ్చును; "బమిలోను కూలిపోయెను... ఆ క్రూరమృగమునకు యెవడైనను నమస్కారము చేసి, తన నోసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల, ... దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును" (ప్రకటన 14:8-10), ఎరుగక చాలా మంది విరుద్ధమైన అభిప్రాయము వ్యతిరేకముగా ధైర్యసాహసలతో ప్రకటించే ఈ క్రూరమృగమును గూర్చిన హెచ్చరిక దేవుని రాజ్య నిత్యసువార్తలో భాగమై యున్నది. క్రూరమృగము ముద్ర గురించి కూడా భూనివాసులకు, అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడువారికి ప్రతి ప్రజకు ఈ హెచ్చరిక వర్తమానము ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును.

మూడు గుర్తుల జాబితాలోనికి నాల్గవ లక్షణాన్ని (గుర్తును) జోడించడానికి మనము ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. కడవరి దినాలలో శేషించిన నిజ సంఘము ద్వారా దేవుడు భూమిలో నివశించు ప్రజలందరికీ చివరి హెచ్చరిక వర్తమానాన్ని అందించును. వర్తమానంలో ఉండే ప్రాముఖ్యమైన విషయాలు, (అ) తీర్పు తీర్చు

గడియ వచ్చెను, (ఆ) నిజమైన విశ్రాంతిరిన ఆరాధన, (ఇ) ఆధ్యాత్మిక బబులోను పతనము, మరియు (ఈ) మృగము యొక్క ముద్ర, ఇది నేటిదిన సత్య సంఘము యొక్క విశేష లక్షణాలలోనున్న (గుర్తులలోనున్న) అద్భుతమైన శ్రేణిని పూర్తి చేస్తుంది.

  1. క్రీ. శ. 1798 తరువాత ఉనికిలోనికి వచ్చును.
  2. దేవుని పది ఆజ్ఞలనన్నిటిని గైకొనున
  3. ప్రవచనసారము (లేక దేవుని ప్రవక్తను) కలిగి ఉండును.
  4. ప్రపంచవ్యాప్తముగా మూడు దూతల వర్తమానమును ప్రకటించుచుండును (ప్రకటన 14)

ఇప్పటివరకు మనం కనుగొన్న దానిపై ఎటువంటి ఆలోచనా పరుడైన భిన్నాభిప్రాయం కలిగి యుండగలడా? ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలలో ఒకదాన్ని విప్పుటకు ప్రస్తుతం మన చేతుల్లో తాళము ఉంది. ప్రకటన గ్రంథములో ఉన్న ఈ అద్భుతమైన, ప్రవచనాత్మక అధ్యాయములో ఇయ్యబడిన గుర్తులు యొక్క పోలికలను చూడండి. దేవుడు ఈ అన్ని ఆధారాలను ఒక చోట చేర్చాడు. ఇది దేవుని జాబితా, నాది కాదు. దేవుని గ్రంథము యొక్క ప్రేరేపిత పుటల నుండి నేను వాటిని ఎత్తి చూపించుచున్నాను. నేడు నిజమైన సంఘము గురించి అవి మీనకు ఏమి చెబుతున్నాయి?

మొట్టమొదటిగా, సంఘము క్రీ. శ. 1798కి ముందు ఉనికిలోనికి వచ్చి యుండలేదు. ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రసిద్ధి పొందిన ప్రొటెస్టంట్ సంఘాలను ఇది ప్రక్కకు నెట్టివేసినది. ఇవన్నీ కూడ క్రీ.శ.

1798కి ముందే ఏర్పడ్డాయి. రెండవది, అది పది ఆజ్ఞలను పాటించే సంఘమై ఉండాలి. మొదటిగా, నిజమైన సంఘమును కనుగొనుటకు ఇది అంత గొప్ప పరీక్ష కాదని అనిపించవచ్చును. ఖచ్చితంగా అందరూ దేవుని గొప్ప నీతి ధర్మశాస్త్రమును గూర్చిన విధేయతను బోధించుచు ఆచరించుచున్నారు. అయితే నిజంగానే వారు బోధించుచు ఆచరించుచున్నారా? వాస్తవానికి కొన్ని సమకాలిక సంస్థలు మరియు సంఘ సభ్యులు, పెద్దలు పది ఆజ్ఞలను పాటించాలని ప్రకటిస్తారు. అయితే నాల్గవ ఆజ్ఞ ప్రకారం ఏడవ దిన విశ్రాంతిదినమును మేము పాటించమని వారిలో చాలామంది బహిరంగముగా ఒప్పుకుంటారు. వారు విశ్రాంతిదినమునకు బదులుగా వారంలోని మొదటి దినమును ఆచరించుచున్నారు.

అధ్యాయము 6 

బైబిలు పరీక్షకు నిలువలేక విఫలమైన అత్యధిక సంఘములు

ఇది వింతగా అనిపించుటలేదా? దేవుడు తన స్వహస్తాలతో ఇలా వ్రాశాడు, "ఏడవ దినము నీ దేవుడైన యెహెూవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను ఏ పనియు చేయకూడదు" (నిర్గమకాండము 20:10). దేవుడు పవిత్రపరచి ఆజ్ఞాపించిన దినము గురించి ఎవ్వరూ గందరగోళంలో పడిపోయే పరిస్థితి లేదు. బోధకులందరు మరియు సంఘసభ్యులతో సహా వారంలోని ఏడవ దినము శనివారము అని స్వేచ్ఛగా అంగీకరిస్తున్నారు. అయితే, దేవుడు సబ్బాతు దినమున పనిని నిషేధించియున్నాడని తెలిసినను ఎందరో నిర్లక్ష్యంగా దేవుని ఆజ్ఞను ప్రతి వారము ఉల్లంఘిస్తున్నారు.

ఈ ఏడవ దిన సబ్బాతును ఉల్లఘించుచున్న దానికి పరిహారంగా, దేవుడు ఆజ్ఞాపించిన దినము స్థానములో మరొక దినము అనగా వారంలో మొదటి దినమును భర్తీ చేసియున్నారు.

దేవుని యొక్క గొప్ప నీతి ధర్మశాస్త్రమును ఉద్దేశపూర్వకముగా మీరుచున్న దానిని వారు ఎలా సమర్థిస్తారు? మనము ఎలా చూసినా పరిస్థితి ఆశ్చర్యపరచే విధముగా వుంది! చాలా సంఘాలు పది ఆజ్ఞలను మోషే వ్రాసిన ఆచార ధర్మశాస్త్రము లేదా నియమములు మరియు అవి సిలువలో కొట్టివేయబడ్డాయని బోధిస్తున్నారు! ఇతరులు వది అజ్ఞలలో ఒక్క విశ్రాంతిదినము తప్ప మిగతావి క్రొత్త నిబంధనలో కూడ ఉన్నాయని నమ్మెదరు కాని ఈ రెండు పరిస్థితుల్లో కూడ దేవుని పాపవిమోచన శక్తి మరియు సృష్టించే శక్తి ఇమిడియున్న నాల్గోవ ఆజ్ఞ తిరస్కరించబడి అపవిత్రపర్చబడుచున్నది.

అయినను పది ఆజ్ఞలను పాటించే సత్య సంఘము ఇతరుల కంటే వ్యత్యాసము కలిగి ఉండటం మనము కనుగొనియున్నాము. దానిని మీరు గుర్తించండి: బైబిలు యొక్క స్పష్టమైన బోధ ప్రకారం, ఏడవ దిన సబ్బాతుతో పాటు ఇతర తొమ్మిది ఆజ్ఞలను పాటించకపోతే అది శేషించిన సంఘము కానేరదు. ఈ మొదటి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిలో ఎక్కువ మందిని మనము చూడవచ్చు కాని రెండవ దానిని నెరవేర్చడంలో వారు విఫలమయ్యారు..

అయితే ఇప్పుడు మనము ప్రవచనమునకు అవసరమైన మూడవ అంశము ఏమైయున్నదో చూద్దాము. చివరి దినాలలో శేషించిన సంఘములో ప్రవచసారము స్పష్టంగా కనిపించాలి. దీని

ఏమిటి? సందేహం లేకుండా ఈ ప్రత్యేక గుర్తింపు యొక్క అర్హత మన జాబితాలో చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ప్రవచనాన్ని అర్ధం చేసుకోవడం మరియు బోధించడం కంటే ఎక్కువ అని మనము పరిశీలన చేయవలసియుంది.

ఇక చివరిగా ఈ ప్రత్యేక సంఘము భూమిపై ఉన్న అన్ని దేశాలకు ప్రకటించే అద్వితీయమైన వర్తమానము ద్వారా వ్యత్యాసము (ప్రత్యేకతను) కలిగి ఉంటుంది. తీర్పు ప్రారంభమైంది. ఏడవ దిన విశ్రాంతిదినము, ఆధ్యాత్మిక బబులోను పతనము మరియు మృగం యొక్క గుర్తుకు వ్యతిరేకంగా హెచ్చరికలు.

ఈ ప్రేరేపిత లక్షణాలతో సరిపోయే ఏదైనా ఆధునిక సంఘ వ్యవస్థ గురించి మనం మరింత చెప్పుకొనక ముందు, మూడవ విషయములో నున్న గుర్తును గూర్చి తెలుసుకొనుటకు మళ్లి వెనక్కి వెళ్లాము, ఎందుకంటే అది ఇంకా పూర్తిగా వివరించబడలేదు.

అధ్యాయము 7 

ప్రవచనసారము

స్త్రీ యొక్క శేషించిన సంఘము "యేసును గూర్చిన సాక్ష్యము" కలిగి ఉంటుందని యోహాను దేవుని ప్రేరణతో ప్రకటించాడు. అ వ్యక్తీకరణ కొంత అస్పష్టంగా ఉన్నందున, యోహాను తరువాత ఒక వివరణ ఇచ్చాడు, అది ఎంతో నిరీక్షణను కలిగించుచున్నది. "యేసు గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను." అని యోహాను చెప్పెను, (ప్రకటన 19:10).

కనీసం ఇది సరైన దిశలో కదులుతోంది. కాని ప్రవచనసారము అని యోహాను వివరించుటలో అర్ధం ఏమిటో మనం ఇప్పుడు కనుగొనాలి. అది ఏమైనా సరే, దేవుని యొక్క ఉన్నత స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ చివరి దినములలో ఆయన సత్య సంఘమును గుర్తించే మార్గాలలో ఒకటిగా దీనిని పేర్కొని యున్నాడు.

ప్రకటించబడిన పూర్తి వివరముల సందర్భాన్ని పరిశీలించినప్పుడు ఆ సంఘటన యొక్క దృశ్యము స్పష్టనుగును. యోహాను ముందు ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు అతడు విస్మయంతో మరియు వినయముతో నేలమీద పడెను. అప్పుడు ప్రకటనకారుడు ఇలా అన్నాడు. "అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసు గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహెూదరులతోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను" (ప్రకటన 19:10)

యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము కలిగియున్నవారెవరో ఈ వచనము వర్ణించుచున్నది. దయచేసి గమనించండి. యోహాను "సహెూదరులు" మాత్రమే అయినట్లు గుర్తించబడినదా? ఇప్పుడు. మనము యోహాను సహోదరులెవరో అన్నది మరింత తెలుసుకోవాలి. అయితే వాక్యము మనలను విఫలం కానివ్వదు. ప్రకటన 22: 8, 9లో యోహాను దేవతను గూర్చిన విషయమును మరల చెబుతూ ఇంక మరికొన్ని వివరాలను జత చేస్తాడు. "యోహానను నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా, అతడు వద్దు సుమీ నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. యోహాను సహోదరులు అంటేనే ప్రవక్తలు మరియు వారు. మాత్రమే ప్రవచనసారము కలిగి ఉంటారని చెప్పబడినది.

చిక్కు అంత ఒకేసారి అకస్మాత్తుగా వచ్చి పడింది. ప్రవచనసారము కలిగి ఉన్నవారు ప్రవక్తలు మాత్రమే ప్రవచనాన్ని తెలుసుకోవడం మరియు బోధించడం "ప్రవచనసారమని" పిలువబడితే, చాలామంది ఆధునిక బోధకులు మరియు సువార్తికులు అర్హత పొందవచ్చు. కానీ బైబిలు ప్రవచించే సామర్థ్యం కలిగియుండుట అని చాలా స్పష్టంగా చెప్పుచున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇది ప్రవచనవరము, ప్రవక్తలు మాత్రమే దానిని కలిగి యున్నారు.

ఈ వాస్తవాన్ని అపొస్తలుడైన పౌలు సమర్ధించుచున్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, నమస్త జ్ఞానములోను, ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు (1 కొరింధీయులకు 1:5-7).

యేసును గూర్చిన సాక్ష్యము ఇక్కడ ప్రవచనసారము లేదా "ప్రవచనమగు ఆత్మ" అని పిలువబడుటకు బదులుగా ఒక వరము అని పిలువబడింది. అయితే చాలా కష్టతరమైనదే అయినప్పటికి మన రక్షకుడైన యేసు తిరిగి వచ్చినప్పడు ఈ వరము ఘనమైనదిగా ప్రదర్శింపబడుతుంది.

పౌలు ఇచ్చిన ఈ ప్రేరేపిత అంతర దృష్టితో మనము ఎరిగియున్న స్థానమునకు తిరిగి వచ్చెదము. "ప్రవచనసారము" అనే మాటతో మనకు సమస్య లేదు. క్రొత్త నిబంధన లేఖనాలలో ఆత్మ పరముల వచనములతో పాటు ప్రవచనసారమును గూర్చి కూడ ఉన్నది. ఈ వరములు ఏలాగున మరియు ఎప్పుడు ఇవ్వబడ్డాయో పౌలు ఎఫెనీ సంఘములో చెప్పియున్నాడు. అందుచేత ఆయన ఆరోహాణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని. చెప్పబడియున్నది" (ఎఫెసీయులకు 4:8).

దీనిపై చిన్న వ్యాఖ్య అవసరము, ఇది అందరికి తెలిసిన విషయమే, యేసు పరమునకు తిరిగి వెళ్తునప్పుడు ఆయన భూమిపై తన ప్రజలకు కొన్ని ప్రత్యేక "వరములు" ప్రసాదించి వెళ్లెను. నిజానికి, వాటికి పేర్లున్నవి "ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను" (ఎఫెసీయులకు 413)

యేసు ఏ కారణము చేత సంఘములో కొంతమందికి ఈ తగిన ఆధ్యాత్మిక వరములు ఇచ్చాడు? "పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును" (ఎఫెసీయులకు 4:13). విశ్వాసులను వృద్ధి చేయుటకును మరియు సంఘాన్ని బలోపేతం చేయటకును ఆయన అలా చేశాడు. క్రీస్తు. శరీరమును అభివృద్ధిపరచి సభ్యులకు క్షేమాభివృద్ధి కలిగించుటకు ఈ I వరములు సంఘ నాయకులకు పరిపక్వత మరియు పరిపూర్ణతను కలిగించుటకు ఇయ్యబడెను.

ఈ వరములు సంఘంలో ఎంతకాలం అవసరమౌతాయో తదుపరి వచనం చెబుతుంది. "మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులనుగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను" (ఎఫెసీయులకు 4:11, 12)

భాషకు ఏదైనా అర్ధము ఉంటే, ఈ మాటలు ఒక ఆలోచనను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. క్రీస్తు తన సంఘములో ఉంచిన వరములన్నీ అంతిమ కాలము వరకు పనిచేస్తు కొనసాగవలెను. సంఘమును పరిపూర్ణతకు మరియు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి తీసుకురావలసిన అవసరము ఎంతైనా వుంది.

ఈ తదుపరి ప్రశ్నను మనం అడుగుటకు ధైర్యముండాలి? వేదు ఈ వరములు ఎక్కడ ఉన్నాయి? అంతిమ కాలము వరకు పవిత్రమైన కార్యమును జరిగించుటకు అవి మన ప్రభువు చేత నిర్దేశించబడ్డాయి. అప్పుడు అవి మన చుట్టూ ఉన్న సంఘములలో పని చేస్తున్నట్లు చూడవచ్చును. అలా ఉందా అని ఇప్పుడు చూద్దాము. నేటి కాలములో మన సంఘములలో ఉపదేశకులు ఉన్నారా? ఉన్నారు అని సమాధానం వస్తుంది. ఇక కాపరులు మరియు సువార్తికుల సంగతి ఏమిటి?

ఆచరణాత్మకంగా అన్ని సంఘ విభాగాల్లో వారు ఉన్నారు. అపొస్తలుల గురించి మనం ఏమి చెప్పగలం? నిజానికి ఈ మాటకు "దేశాంతర సేవకులు" అని భావము, (గ్రీకు భాషలో "పంపబడినవాడు" అని కూడ అర్ధము). మరొకసారి, అత్యధిక ఆధునిక సంఘాలు ఈ ప్రత్యేకమైన వరముపై అర్హత సాధించాయని మనము చెప్పగలం.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనకు ఇంకొక విచారణ ఉంది - ప్రవక్తల సంగతేంటి? ఈ ప్రశ్నకు తక్షణ సమాధానం మన మత సంస్థల యొద్ద లేదు. వాస్తవానికి ఇటువంటిది దాని పరిచర్యలో ఎప్పటికీ ఒక భాగమని ఏ సంఘము పేర్కొనుట లేదు.

ఎందుకు? మిగతా వరములన్నియు అవసరమైనప్పుడు, ప్రవక్తలు ఎందుకు అవసరం లేదు? ఇది ఖచ్చితంగా అదిను సంఘములో ప్రాముఖ్యముగా ఎంచబడింది. వాస్తవానికి అపొస్తలుల కార్యములు గ్రంధము ప్రకారం అన్ని ఆధ్యాత్మిక వరములను గూర్చిన ఆధారాలు మనకి ఉన్నాయి, "అంతియొకయలో నున్న సంఘములో బర్నబా. నీగెరనబడిన సుమెయాను... అను ప్రవక్తలును బోధకులును ఉండేది" (అపొస్తలుల కార్యములు 13.1) ఇక్కడ ప్రవక్తలును బోధకులును అను రెండు వరములు అంతియొకయలో సంఘములో మనకు ఆధారాలు ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 21:9లో, "కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు" అని మనం చదువుతాము ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు. స్త్రీలు ప్రవక్రీలుగా ఉండుటకు దేవుని అత్య చేత నియమింపబడిరి. వారు ప్రవచనసారమును (ప్రవచనయగు ఆత్మను) కలిగియున్నారు.

అధ్యాయము 8

సంఘములో నుండి ప్రవక్తలు ఎందుకు అదృశ్యమైరి?

అపొస్తలుల యుగములో దాని తర్వాత కొంతకాలానికి కూడా ప్రతి వరములు సమానంగా పని చేశాయి. క్రైస్తవ యుగంలో రెండు లేదా మూడువందల సంవత్సరాల తరువాత ప్రవచనవరము ఎందుకు కనుమరుగైపోయింది? ఇతర వరములు పనిచేసిన విధముగా ప్రవచనవరము ఆ కాలమునుండి సమానముగా పనిచేసినట్లు మనకు దాఖలాలు లేవు. కాపరులు, ఉపదేశకులు మరియు మొదలైన వారితో పాటు ప్రవక్తలు నేటి మన సంఘాలలో ఎందుకు కనబడుటలేదు?

లక్షలాది క్రైస్తవులు ప్రస్తుతం చేస్తునట్లుగా మనము కూడ ఈ ప్రశ్నను వేయడానికి వెనకాడము. దేవుని వాక్యం సమస్యలను ఎదుర్కొంటుంది మరియు ఈ ప్రక్రియలో ఎటువంటి గుద్దులాటలు లేవు. అనేక సంఘాల్లో ఈ వరము లేదు. వారికి ఈ ప్రత్యేకమైన వరం లేకపోవటానికి కారణాన్ని మనము కనుగొన్నాము, వారు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నరో తెలుసుకొనుట పెద్ద కష్టమేమి కాదు.

అపొస్తలుల కాలానికి పూర్వము దేవుని ప్రజలు మధ్య నుండి ప్రవచనవరము తొలగించబడడం ఇది మొదటిసారి కాదు. నిజం ఏమిటంటే, దేవుడు సంఘంతో వ్యవహరిస్తునట్లుగానే తన ప్రజలతో కూడా వ్యవహరించాడు. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ఈ రెండిటికి దైవ ప్రతినిధుల ద్వారా దేవుడు నాయకత్వం వహించాడు. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో, "మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు అజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరీలాగు చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమి మీద నున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను" అని చెప్పెను (యిర్మీయా 26:5, 6),

ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు! ఈ రెండు కలిసి పయనిస్తాయి. అవి గ్రంధంలోని రచనలను సూచించడమే కాక, దైవ మార్గదర్శకత్వం యొక్క రెండు మార్గాలను కూడా సూచిస్తారు. "

నా ప్రవక్తలు చెప్పుమాట వినుడని” దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. మరియు పరిశుద్ధ గ్రంధము చెప్పచున్నది ఏమనగా ఈ రెండింటిలో ఒకదానినైనను తిరస్కరించినట్లయితే, దేవుడు మరొకదాన్ని కూడా తొలగిస్తాడు, ఎందుకంటే వారు నిజానికి ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. అనేక సందర్భాల్లో, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం నుండి తొలిగిపొయ్యారు, ఆ విధంగా వారి నుండి ప్రవచన స్వరము నిశ్శబ్దమైంది.

"వారికి ధర్మశాస్త్రము లేకపోయెను, యెహెూవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు" అని యిర్మీయా వ్రాసెను (విలాపవాక్యములు 2:9). యెహెజ్కేలు ఇలా అంటున్నాడు వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు” (యెహెజ్కేలు 7:26). జ్ఞాని ఇదే సూత్రాన్ని వ్రాసెను : “దైవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు" (సామెతలు 29:18).

దేవుని ధర్మశాస్త్రమునకు బహిరంగంగా అవిధేయత చూపిన సమయాలలో, దేవుడు ప్రవక్తలను ఉపయోగించింది తన ప్రజలను మందలించటానికి, వెనక్కి పిలవడానికి మరియు సలహా ఇచ్చుటకు లేదా సరైన మార్గములో నడిపించుటకే కాదు. వారు ధర్మశాస్త్రమును నుండి వైదొలిగినప్పుడు, ఎవరి యొద్ద నుండి దైవ ఆదేశములు అనుగ్రహింపబడుచున్నవో అట్టి దైవ నిర్దేశాన్ని పొందగలిగే ఏకైక వేదికను కూడా పోగొటుకుంటున్నారని వారు గ్రహించారు. దేవుని మాట ధిక్కరించి భ్రష్టత్వంలో ఉన్న సౌలు రోదించుచు, “దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవియ్యకయున్నాడు" (1 సమూయేలు 28:15).

యెహెజ్కేలు 20:3లో మనకు సరైన ఉదాహరణ ఉంది. దేవుని ఆదేశము విన్న తరువాత వారు విచారించడానికి వచ్చినప్పుడు, "నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము - ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా యొద్ధ విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే? నా జీవముతోడు నా వలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు." ఈ సందర్భంలో ఆయన వారికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? 11-13 వచనములలో సమాధానం ఉన్నది "వారికి నా కట్టడలను నియమించి నా నిధులను వారికి తెలియజేసితిని, ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదునను కొంటిని."

దేవుడు సూచనను ఇవ్వకపోవటానికి కారణం వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఉల్లంఘించి విశ్రాంతిదినమును మీరియున్నారని మనం ఖచ్చితంగా చూడవచ్చును. ఇది నాల్గవ ఆజ్ఞ యొక్క ఉల్లంఘన, ఇది ప్రత్యేకముగా దేవునికి అసంతృప్తిని రేకెత్తించింది.

ఇప్పుడు క్రొత్త నిబంధనలోని ప్రవక్తలను ఉద్దేశించిన ప్రశ్నను గూర్చి వివరించుకొనుటకు మనము సిద్ధంగా ఉన్నాము, రెండు లేదా మూడు శతాబ్దాల తరువాత వారు సంఘములో నుండి ఎందుకు అదృశ్యమయ్యారు. అదే సమయంలో దేవుని ధర్మశాస్త్రానికి ఏమి జరిగింది,

మరియు ప్రవచనవరము ఎలా సంఘములో నుండి అదృశ్యమైనది? ఆ ప్రారంభ కాలం యొక్క చరిత్ర ప్రకారం విశ్రాంతిదినము పక్కన పెట్టి దానికి బదులు వారికి అనుకూలముగా సూర్యుడి ఆరాధించే అన్యమత దినానికి మార్చుకున్నారని తెలియజేస్తుంది. అన్యజనులతో రాజీపడి సూర్యుని ఆరాధించే దినముతో ఏకీభవించటం అవమానకరమైన విషయం, అది నిజమైన ఏడవదిన విశ్రాంతిదినమును బహిరంగంగా తిరస్కరించడానికి దారి తీసింది. ఇలా జరిగినప్పుడు, పూర్వకాలమున పరిశుద్ధ ధర్మశాస్త్రమును ధిక్కరించి దూరమైనప్పుడు ప్రజలకు ఆనాడు దేవుడు ఏమి చేసియున్నాడో అదే విధముగా చేసినాడు ఆయన ప్రవచనవరము యొక్క మార్గదర్శకత్వాన్ని ఉపసంహరించుకున్నాడు. మరియు ప్రవక్తలు సంఘము నుండి కనుమరుగైపోయారు.

ఇది ముఖాముఖిగా సవాలు చేస్తున్న ప్రశ్నను ఆశ్చర్యపడే విధంగా ఎదుర్కొనేటట్లు చేస్తుంది. సంఘములో తిరిగి పరిశుద్ధ ధర్మశాస్త్రమును పునరుద్ధరించి, మరియు ఏడవ దిన విశ్రాంతిదినమును గైకొనుట ప్రారంభించినప్పుడు, దేవుడు తిరిగి సంఘానికి ప్రవచనవరమును ప్రసాదిస్తాడని నమ్మడానికి కారణం ఉందా? మరియు ఇది ప్రకటన 12వ అధ్యాయములో నున్న గొప్ప విశేషమైన ప్రవచనమునకు మనలను తీసుకొని వెళ్తుంది. మరియు నిజమైన శేషించిన సంఘము గురించి దేవుని వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు, మొదటి సారిగా ఆ పదిహేడవ వచనము యొక్క పూర్తి ప్రాముఖ్యతను మనము చూడవచ్చు. "అందుచేత ఆ ఘటసర్పము అగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను" (ప్రకటన 12:17)
మీరు గమనించారా? చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడిన దేవుని ధర్మశాస్త్రము, సంఘములో దాని పూర్వ స్థానమునకే తిరిగి వచ్చింది! మరియు ధర్మశాస్త్రముతో కలిసి యేసును గూర్చి సాక్ష్యము పయనించును, అదే ప్రవచనసారము. దీని గురించి అలోచిచుడి! చివరి శేషించిన భాగములో దేవుని నిజమైన అపోస్తులుల సంఘము యొక్క ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు మళ్లీ పూర్వము ఉన్నట్టుగా కలిసి నడుచును! మత భ్రష్టత్వమునకు ముందు దినాలలో వరములు అన్ని ఏ రీతిగా పనిచేసియున్నవో మళ్లీ అలాగే అవి తిరిగి పనిచేయును.

శేషము ఎల్లప్పుడు మొట్టమొదటి దానివలె ఉండాలి మరియు అది చిట్టచివరిలో ఉండునదై చిన్నభాగమై యుండాలని గుర్తుంచుకోండి. ఈ అద్భుత ప్రవచనము అంత్యకాలములో అపొస్తలుల విశ్వాసం యొక్క పునరుద్ధరణ జరుగుతుందని వెల్లడిస్తుంది. 1,260 సంవత్సరాల పోపు అధికార ప్రభావము వలన గొప్ప అపొస్తులుల సిద్ధాంతాలు ఏవైతే తొలగించబడినవో అవి యథాస్థితికి వస్తాయి. అదే విశ్రాంతిదినము పునరుద్ధరించబడుతుంది. అవే ఆత్మఫలములు ప్రత్యక్షపరచబడతాయి.

శేషించబడినది అని పిలువబడే ఒకే సంఘము అది 1798 తరువాత కొంతకాలానికి ఉనికిలోకి వస్తుంది. విశ్రాంతిదినమును అచరించుట చేత అది ఎన్నో యుగాల వేయబడిన పునాదిని పునరుద్ధరిస్తుంది. సృష్టిలో ఆ దినమును మనుష్యుల కొరకు యేసు ప్రభువు నియమించెను. అదే విశ్రాంతిదినము, అయన భూమి మీద ఉన్నప్పుడు దానిని పాటించియున్నాడు. ఆ సంఘములో నిజమైన ప్రవచనవరము ప్రత్యక్షపర్చబడును. అభిషేకం ద్వారా పొందుకున్న అపూర్వమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదముల వలన మరియు శక్తి వలన శేషించిన సంఘము ప్రకటన 14వ అధ్యాయములో నున్న ప్రత్యేకమైన

చివరి హెచ్చరిక వర్తమానాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తీసుకువెళుతుంది. అది మనము ఇది వరకే తెలుసుకొనియున్నాము. అదే అద్భుతమైన త్రిదూత వర్తమానము. ఇందులో తీర్పుతీర్చు గడియ, విశ్రాంతిదినము, బబులోను పతనం మరియు క్రూరమృగమును గూర్చిన వర్తమానాలు ఉన్నాయి.

ఈ మాటలలో యోహాను చేత సంఘము మళ్ళీ గుర్తించబడినది. "దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన (యేసునకు కలిగిన) విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును" (ప్రకటన 14:12). ఈ విషయములను చూచి చూడనట్లుగా పోనీయకండి, దేవుని ఆజ్ఞలను గైకొను పరిశుద్ధులు ఏ పని చేయుటకైన శక్తిమంతులు, ఎందుకనగా వారు ఏది చేసినను క్రీస్తునందు, క్రీస్తుకు కలిగిన విశ్వాసముతో చేయుదురు. మీరు వారిని కనుగొన్నప్పుడు వారు తమ స్వనీతిని గూర్చి అతిశయపడరు, లేదా వారి రక్షణ కొరకై తమ పుణ్యకార్యములపై ఆధారపడరు, అందరి కంటే వారు ఆరాధించే రక్షకుడితోనే వారు ప్రేమ పూర్వకమైన, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు. వారి విధేయతను కేవలం క్రీస్తుకు ఆరోపించి మరియు ఆయన అనుగ్రహించు నీతి మీద వారి అర్హతలు ఆధారపడి ఉంటాయని వారు నమ్ముతారు. వారు దేవుని ఆజ్ఞలను పాటించేవారు. ఎందుకంటే వారు దేవుని కృప వల్లనే రక్షింపబడ్డారు మరియు వారు ఏ లాభమును ఆశించనివారు.

బైబిలు సిద్ధాంతాల ప్రకారము ఇట్టి ఆశ్చర్యపరచే నిబంధనలు కలిగిన ఏ సంఘమైన ఉనికిలో ఉన్నదా లేదా అని ఉత్సాహభరితమైన ఆశక్తిని కలిగించే స్థితిలో మీరు ఈపాటికే ఉండే వుంటారు. చాలామంది నిజమైన సంఘము తమదే అని చెప్పుకుంటారు, కాని వారి వాదనలు దేవుని వాక్యముపై ఆధారపడి ఉండవు, ప్రకటనలో

పేర్కొన్న నాలుగు నిర్దిష్ట గుర్తులకు సరిపోయే సంఘమే యోగ్యమైన సంఘము, బైబిలు ప్రకారము పరీక్షించినదానిని బట్టి చూస్తే నేటి ఈ ప్రపంచంలో ఒకే ఒక యోగ్యమైన సంఘము ఉన్నదని మనం కనుగొనగలిగామని అనుకుందాం. అప్పుడు అది మచ్చలేని సభ్యులతో కూడిన పరిపూర్ణ సంఘముగా ఉన్నదని మనము ఆశించగలమా? దీనికి వ్యతిరేకముగా, సంఘము తప్పనిసరిగా ఇతర మనుషుల మాదిరిగానే పడిపోయే స్వభావముతో సగటు స్త్రీ పురుషులు కలయికతో ఉంటుంది. అయితే ప్రమాణాలకు అనుగుణంగా శేషించినది ఒక చిన్న సంఘముగా ఉండాలి. యేసు ప్రభువు, "జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే" (మత్తయి 7:14) అని చెప్పెను. మరలా ఆయన. "నోవహు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములో జరుగును" అని ప్రకటించెను (లూకా 17:26) అధిక సంఖ్యలో ఉన్న సభ్యులును చూచి ఎవరూ మోసపోకూడదు. జలప్రళయం సమయంలో ఎనిమిది మందే ఓడలోనికి ప్రవేశించారు కనుక రక్షింబడినవారితోనే పోల్చుకొనవలెను. సత్యం ఎన్నడూ ప్రాచుర్యం పొందదు, అది చిన్న సంఘము కాబట్టి అంత్యకాలంలో శరీర సంబంధమైన అనందం కోసంగాని మరియు భౌతికవాదం కోసంగాని పరుగులు తీయదు. ప్రసిద్ధి పొందిన సంఘాలు మరియు సంతోషకరమైన జీవనశైలితో ముందుకు సాగిపోతున్న వారి మధ్య శేషించిన సంఘాలు కనుగొనబడవు. యేసు ప్రభువు, "ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల. తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను" అని చెప్పెను (ລ້ 16:24).

"మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అని ప్రభువు చెప్పుచున్నాడు" (2 కొరింధీయులకు 6:17) పౌలు తీతుకు వ్రాయుచు, "ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప సత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,... ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని ... సత్ క్రియలయందాసక్తి గల" ప్రజలుగా జీవించాలని మనకు బోధించుచున్నది. ( 2:11-14).

ఇవే కాకుండా ఇంకను అనేకమైన ఇతర సంబంధిత వచనాలు చివరి దినాలలో నిజమైన సంఘమును గూర్చి సూచిస్తున్నాయి, యేసు మరియు ఆయన అనుచరులు జీవించిన కాలములో సంఘము ఏ విధంగా ఉన్నదో అలాగే ప్రపంచము చూస్తుంది. అసలైన ఆదిమ సంఘములో నుండి విస్తరించిన శేషించిన సంఘము కనుక. ఈ సంఘము విచిత్రమైననదిగా పరిగణించబడుతుంది మరియు చివరకు, అది మరణానికి అర్హత కలిగియున్నదని భావించి దానిని ఎందరో తృణీకరించెదరు. అయితే ప్రకటన గ్రంథము అంత్య కాలానికి బైబిలు ప్రణాళికను బహిర్గతం చేస్తుంది. ఆ గుర్తును స్వీకరించువారు మరణశిక్షకు గురవుతారు. క్రూరమృగం యొక్క అధికార గుర్తు ప్రతివ్యక్తి పొందాలనే శాసనం అమలు చేయబడును. ఆ మృగం యొక్క గుర్తును ఎవరు పొందుటకు ఎవరు నిరాకరించుదురో వారికి మరణశిక్ష విధించబడును. మీరు ఈ విషయంలో చాలా అనుమానము ఉండవచ్చును. "దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును" (ప్రకటన 14:12), వారే మృగం యొక్క గుర్తును తృణీకరించెదరు.
సత్య సంఘము కొరకు అన్వేషణ ఇంకో మాటలో చెప్పాలంటే, ఇదే శేషించిన సంఘము.

మరల ఈ విషయం నొక్కి చెప్పాలి. శేషించిన సంఘానికి చెందిన వారందరూ తప్పనిసరిగా రక్షింపబడతారని లేదు. ఇతర సంఘాల మాదిరిగానే ఇందులోనూ సాధారణ ప్రజలు ఉంటారు. అయితే వారు యేసుక్రీస్తుతో నిరంతరం సత్సంబంధాన్ని కొనసాగించాలి. అన్ని సంస్థల నుండి మరియు సంఘాల నుండి ప్రజలు రక్షించబడవచ్చును లేక రక్షింపబడకపోవచ్చును. ఇది నిస్సందేహమైన వాస్తవము. ప్రతి వ్యక్తి తనకు బయలుపడిన సత్యము మరియు తనకు తెలిసినదానికి విధేయత కనపరచిన దానిని బట్టి తీర్పు పొందును. శేషించిన సంఘ సభ్యులు గొప్ప సత్యమైన వెలుగును కలిగి ఉంటారు, దాని ప్రకారమే వారు తీర్పు తీర్చబడతారు. అయితే పరీక్షింపబడిన వారెందరో విఫలమవుతారు, ఎందుకంటే క్రీస్తు నీతిలో ఉన్న రక్షణ యోగ్యత కంటే వారు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటారు. అందువల్లనే శేషించిన సంఘములో కూడా చాలా మంది నశించడము పూర్తిగా సాధ్యమే. ఇతరులకు ఈ సత్యమైన వెలుగు లేకపోవచ్చు అయినను వారు యేసును తెలుసుకొని వారికి బయలుపడిన సత్య వెలుగులో నడచిన యెడల వారు అంగీకరించబడతారు.

అయినను ఇవి పరిశీలనలు చేసిన తరువాత, దేవునికి ఒక ప్రత్యేకమైన వర్తమానము కలిగియున్న ఒక విశేషమైన సంఘము ఉన్నది, అది స్త్రీ యొక్క "శేషించిన" సంఘముగా పేర్కొనబడింది. ఇది అంత్య కాలంలో ప్రత్యక్షపర్చబడింది. అది వది అజ్ఞలను పాటించే అపొస్తులుల సంఘం మాదిరిగానే అదే సిద్ధాంతాలను కలిగి ఉంది, మరియు (విశ్రాంతిదిన సత్యముతో) సహా ప్రవచనవరమును పొందుకొని ప్రపంచమంతటికి ప్రకటన 14లో ఉన్న మూడు దూతల వర్తమానమును ప్రకటించుచున్నది.

అధ్యాయము 9
ఏ సంఘమైనను ఈ నాలుగు గుర్తులకు అనుగుణముగా ఉన్నదా?

బైబిలు గ్రంధము యొక్క నిబంధనలను తీర్చగలిగే సంఘము ఏదైన ప్రపంచములో ఇప్పుడు ఉందా? దేవుడు మనలను ఆశ్చర్యానికి గురి చేయట్లేదు. అందరు దేనికొరకు ఎదురుచూస్తున్నరో దానిని చూచుటకు ఆయన తన గుర్తును బైబిల్లో చాలా విభిన్నంగాను, స్పష్టంగాను, మరియు సులభముగా అర్థము చేసుకొనేలాగున ఉంచెను. వందలాది మంది అయోమయమును కలిగించే పేర్లు కలిగిన సంఘాలు ఉండగా వాటిని ఈ నాలుగు గొప్ప ప్రత్యేక గుర్తులతో సరిపోల్చి చూడటంలో కష్టమేదైనా ఉందా? లేనే లేదు. I

1798 తరువాత ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చాయి? కొద్ది సంఖ్యలోనే సంఘాలు వెలిచాయి, వీటిలో ఎన్ని సంఘాలు విశ్రాంతిదినముతో సహా మొత్తం పది ఆజ్ఞలను పాటించుచున్నారు? కొద్ది మంది మాత్రమే. ఈ కొద్దిమందిలో ఎంతమంది ప్రవచనవరమును కలిగియున్నరో మన చేతి వేళ్ళతో లెక్కించవచ్చు? చివరిగా, ప్రపంచములో ఉన్న అన్ని దేశాలకు మరియు ఆయా భాషలలో మాట్లాడు వారికి ప్రకటన 14వ అధ్యాయములో ఉన్న మూడు దూతల వర్తమానములను ఎంతమంది ప్రకటిస్తున్నారు?

మీరు నమ్మితే నమ్మండి, ఇది, వాస్తవం, మన పరిశీలనలో జల్లెడపట్టి తూర్పార పట్టే పద్ధతి ద్వారా తెరికించి చూడగా కేవలం ఒకే ఒక సంఘము ఉన్నదని ఋజువైనది. అయితే అసలు ఉనికిలో లేని మిశ్రమజాతి సంఘమును గూర్చి దేవుడు వివరించడేమో అని మీరనుకొనవచ్చును, ఈ సమయంలో మిమ్ములను అయోమయముగా విడిచిపెట్టడము నమ్మకద్రోహం అవుతుంది. కాబట్టి క్రైస్తవ మతానికి సంబంధించిన అన్ని అర్హతలు ఉన్న ఏకైక శేషించిన సంఘము నేటికి బైబిలు ప్రమాణాల ప్రకారము ఉనికిలో ఉన్నది.

ఇది చారిత్రక వాస్తవాల ఆధారంగా నిజ సంఘమును గూర్చి మన ముగింపు, అంతేగాని ఏదో ఒక ప్రత్యేకమైన సంఘమును గూర్చి కావాలని తీసుకొచ్చిన కల్పిత సిద్ధాంతము కాదు. ప్రకటన 12వ అధ్యాయములో ఉనికిలోనున్న ఏ సంఘమును గూర్చి భావోద్వేగపరచే పరిస్థితి దాఖలైనట్టు లేదు. సంఘటనలను బట్టి ఉన్నది. ఎంతో గొప్ప ఆసక్తిలేని వ్యక్తి ఈ ప్రవచనాత్మక దృశ్యాన్ని పరిశీలన చేసిన తర్వాత కూడా అదే నిర్ణయానికి రావాలసినదే. ఇది ప్రగల్భాలుగాని లేదా అహంకారానికి గాని చోటు ఇవ్వదు. ఏ రహస్యమైనను మనుష్యుని ద్వారా కాదు గాని దేవుని వాక్యము ద్వారానే బయలుపరచబడెను.

సంఘానికి పేరు పెడుతున్నప్పుడు అది చాలా భయభక్తులతో ఉండాలి. మన ముందు కాదనలేని సాక్ష్యాలు ఉన్నప్పటికీ, మతపరమైన అభియోగాలు మోపడానికి ఎల్లప్పుడూ కొందరు సిద్ధంగానే ఉంటారు. ఇతరులు ఈ అద్భుతమైన సత్యము నుండి కొందరిని బలవంతముగా లాగుకోవటానికి వ్యక్తిగత పక్షపాతాన్ని అనుమతిస్తారు.

నిజమైన శేషించిన సంఘముగా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము ఒక్కటే ప్రవచనాత్మక వర్ణనను నెరవేర్చుచున్న ఏకైక సంఘము. గమ్యము వైపు మన గురి అనే లక్ష్యముతో కూడిన ఉద్యమముతో చీకటి యుగములో ఏ సత్యమునైతే మనము కోల్పోయామో లేదా పోగొట్టుకొన్నమో దానిని పునరుద్ధరించుట కొరకు ముందుగా అంచన వేసిన ఒక కార్యక్రమము 1844లో ప్రారంభమైనది. క్రీస్తు యొక్క ప్రారంభ సిద్ధాంతాలు ఒకదాని తరువాత ఒకటి ప్రవేశపెట్టినప్పుడు ఈ సంఘము ఆదిమ సంఘము యొక్క పూర్వ వైభవమునకు మరియు సౌదర్యమునకు తిరిగి వచ్చింది. ధర్మశాస్త్రము మరియు సబ్బాతు యొక్క అధికారం స్థాపించబడినప్పుడు, దేవుడు తాను వాగ్దానం చేసిన దాని ప్రకారము ఆయన చేసెను: ఆయన విలక్షణమైన ప్రవచనవరమును శేషించిన సంఘమునకు తిరిగి ఇచ్చెను. ఆ ప్రవచనసారము శ్రీమతి ఎలెన్. జి. వైట్ గారి జీవితం మరియు బోధనల ద్వారా ప్రత్యక్షపరచబడినది. ఈ యువతి, కేవలం ప్రాథమిక విద్యతో, ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించిన ప్రత్యేక దర్శనాలు పొందింది. డెబ్భైకి పైగా పుస్తకాలు ఆమె ప్రేరేపిత కలం నుండి జాలువారినవి. వాటిలో అనేకమైనవి గొప్ప లౌకిక విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నవి.

ప్రవచనవరము అనే కొత్త ఉద్యమానికి ప్రేరణ నివ్వడానికి శక్తివంతమైన పద్ధతిలో పని చేసినప్పటికీ, ఇది పవిత్ర లేఖనాల సార్వభౌమాధికారానికి జోడిస్తున్న చిన్న కాంతి మాత్రమే. "ఆత్మలను ... పరీక్షించుడి” (1 యోహాను. 4:1) అనే బైబిలు నియమానికి అనుగుణంగా బయలుపరచబడిన ప్రతి ప్రత్యక్షత దేవుని వాక్యంతో పరీక్షించబడాలి. "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు" (యెషయా 8:20) ఆమె రచనలు ప్రతి విషయంలోనూ బైబిలుకు అనుగుణంగా లేకున్నట్లయితే, అవి నకిలీవిగా తిరస్కరించబడి ఉండేవి. కానీ అవి లేఖనాలు సంపూర్ణముగా ఒప్పుకునేందుకు సరిపోయిన మాటలుగా ఉన్నవి. అయితే అవి ఏ విధంగానైనను
ఒకే ఒక సంఘము ఉన్నదని ఋజువైనది. అయితే అసలు ఉనికిలో లేని మిశ్రమజాతి సంఘమును గూర్చి దేవుడు వివరించడేమో అని మీరనుకొనవచ్చును, ఈ సమయంలో మిమ్ములను అయోమయముగా విడిచిపెట్టడము నమ్మకద్రోహం అవుతుంది. కాబట్టి క్రైస్తవ మతానికి సంబంధించిన అన్ని అర్హతలు ఉన్న ఏకైక శేషించిన సంఘము నేటికి బైబిలు ప్రమాణాల ప్రకారము ఉనికిలో ఉన్నది.

ఇది చారిత్రక వాస్తవాల ఆధారంగా నిజ సంఘమును గూర్చి మన ముగింపు, అంతేగాని ఏదో ఒక ప్రత్యేకమైన సంఘమును గూర్చి కావాలని తీసుకొచ్చిన కల్పిత సిద్ధాంతము కాదు. ప్రకటన 12వ అధ్యాయములో ఉనికిలోనున్న ఏ సంఘమును గూర్చి భావోద్వేగపరచే పరిస్థితి దాఖలైనట్టు లేదు. సంఘటనలను బట్టి ఉన్నది. ఎంతో గొప్ప ఆసక్తిలేని వ్యక్తి ఈ ప్రవచనాత్మక దృశ్యాన్ని పరిశీలన చేసిన తర్వాత కూడా అదే నిర్ణయానికి రావాలసినదే. ఇది ప్రగల్భాలుగాని లేదా అహంకారానికి గాని చోటు ఇవ్వదు. ఏ రహస్యమైనను మనుష్యుని ద్వారా కాదు గాని దేవుని వాక్యము ద్వారానే బయలుపరచబడెను.

సంఘానికి పేరు పెడుతున్నప్పుడు అది చాలా భయభక్తులతో ఉండాలి. మన ముందు కాదనలేని సాక్ష్యాలు ఉన్నప్పటికీ, మతపరమైన అభియోగాలు మోపడానికి ఎల్లప్పుడూ కొందరు సిద్ధంగానే ఉంటారు.

ఇతరులు ఈ అద్భుతమైన సత్యము నుండి కొందరిని బలవంతముగా లాగుకోవటానికి వ్యక్తిగత పక్షపాతాన్ని అనుమతిస్తారు.

నిజమైన శేషించిన సంఘముగా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము ఒక్కటే ప్రవచనాత్మక వర్ణనను నెరవేర్చుచున్న ఏకైక సంఘము, గమ్యము వైపు మన గురి అనే లక్ష్యముతో కూడిన ఉద్యమముతో చీకటి యుగములో ఏ సత్యమునైతే మనము కోల్పోయామో లేదా పోగొట్టుకొన్నమో దానిని పునరుద్ధరించుట కొరకు ముందుగా అంచన వేసిన ఒక కార్యక్రమము 1844లో ప్రారంభమైనది. క్రీస్తు యొక్క ప్రారంభ సిద్ధాంతాలు ఒకదాని తరువాత ఒకటి ప్రవేశపెట్టినప్పుడు ఈ సంఘము ఆదిమ సంఘము యొక్క పూర్వ వైభవమునకు మరియు సౌదర్యమునకు తిరిగి వచ్చింది. ధర్మశాస్త్రము మరియు సబ్బాతు యొక్క అధికారం స్థాపించబడినప్పుడు. దేవుడు తాను వాగ్దానం చేసిన దాని ప్రకారము ఆయన చేసెను : ఆయన విలక్షణమైన ప్రవచనవరమును శేషించిన సంఘమునకు తిరిగి ఇచ్చెను. ఆ ప్రవచనసారము శ్రీమతి ఎలెన్. జి. వైట్ గారి జీవితం మరియు బోధనల ద్వారా ప్రత్యక్షపరచబడినది. ఈ యువతి, కేవలం ప్రాధమిక విద్యతో, ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించిన ప్రత్యేక దర్శనాలు పొందింది. డెబ్బైకి పైగా పుస్తకాలు ఆమె ప్రేరేపిత కలం నుండి జాలువారినవి, వాటిలో అనేకమైనవి గొప్ప లౌకిక విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నవి.

ప్రవచనవరము అనే కొత్త ఉద్యమానికి ప్రేరణ నివ్వడానికి శక్తివంతమైన పద్ధతిలో పని చేసినప్పటికీ, ఇది పవిత్ర లేఖనాల సార్వభౌమాధికారానికి జోడిస్తున్న చిన్న కాంతి మాత్రమే. "ఆత్మలను పరీక్షించుడి” (1 యోహాను, 4:1) అనే బైబిలు నియమానికి అనుగుణంగా బయలుపరచబడిన ప్రతి ప్రత్యక్షత దేవుని వాక్యంతో పరీక్షించబడాలి. "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడి వారికి అరుణోదయము కలుగదు" (యెషయా 8:20). ఆమె రచనలు ప్రతి విషయంలోనూ బైబిలుకు అనుగుణంగా లేకున్నట్లయితే, అవి నకిలీవిగా తిరస్కరించబడి ఉండేవి, కానీ అవి లేఖనాలు సంపూర్ణముగా ఒప్పుకునేందుకు సరిపోయిన మాటలుగా ఉన్నవి. అయితే అవి ఏ విధంగానైనను పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగంగా పరిగణించబడలేదు. అవి ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినప్పటికి, పవిత్రమైన వ్రాతలలో కలపబడవు అలాగని తీసివేయవు. కానీ భూతద్దం వలె అవి దేవుని వాక్యంలోని మాధుర్యతను మరియు సత్యమును స్పష్టముగా బయలుపరచును.

అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమేమిటంటే, శేషించిన సంఘము దేవుని యొక్క కృపను బట్టి ప్రకటన 14వ అధ్యాయములో యేసు మరియు యోహాను అంతిమ వర్తమానమని చెప్పిన బోధకు గుండె లాంటిదైనా అదే సిద్ధాంతము మీద స్థిరపరచబడింది. అంతేకాదు మరో అద్భుత విషయము కూడ ఉన్నది! 1860లో కేవలం కొద్ది మంది ప్రజలతో ఉన్న ఈ శిశువు వంటి చిన్న సంఘము జనాదరణలేని వర్తమానముతో ప్రపంచంలోనున్న ప్రతి దేశానికి సువార్త ఎలా ప్రకటించగలదు? అయిననూ అదే జరిగింది! ప్రపంచ జనాభాలో దాదాపు 100 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలలో సెవెంత్-డే అడ్వెంటిస్టుల పని స్థాపించబడి కొనసాగుతుంది. మరియు ప్రకటన 14లోని ఈ ప్రత్యేక వర్తమానాలలో ఉన్న తీర్పు, విశ్రాంతిదినము మరియు క్రూరమృగం యొక్క ముద్ర గురించి ఆ దేశాలలో ప్రతి ఒక్కరికి సాక్ష్యార్ధముగా ప్రకటించబడుచున్నది.

మొదటి విషయములో సూచింపబడిన గుర్తుకు అర్హత సాధించే అనేక సంఘాలు ఉన్నాయి, మరియు రెండవ గుర్తుకు కూడా సరిపోయే చాలా సంఘాలు ఉన్నాయి అయితే ఒకే ఒక సంఘము మాత్రమే ఈ నాలుగు గుర్తులకు ఖచ్చితంగా అనుగుణంగా ఉంటుంది అనేది వాస్తవము. అది మానవుని తర్కవాదానికి సరళముగాను మరియు న్యాయముగా విజ్ఞప్తి చేస్తుంది. దేవుడు మనలను పరిపూర్ణమైన

సత్యములోనికి నడిపిస్తాడని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తరువాత మన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఇంత వరకు మనం నడిపించబడిన ప్రేరణాత్మక ముగింపుల విషయమై మనము ఏమి చేయనై యున్నాము?

ఇటువంటి గొప్పసత్యమును గూర్చి తీర్మానించుకోకుండా ఎవరూ వెనకాడరు. మనము దానిని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి నిర్ణయించుకోవచ్చు. మనము విధేయత చూపటానికి లేదా అవిధేయత చూపడానికి కూడా ఎంచుకోవచ్చు. కానీ ఒక విషయం వాస్తవం -మీరు ఏ నిర్ణయం తీసుకున్నను ఎప్పటికి ఒకేలా మీరు ఉండరు. ప్రేరేపణ అనునది మనము నమ్మినదానిని పట్టుకోవడానికి లేదా త్రోసివేయడానికి ప్రయత్నించినను ఆ సత్యాన్ని మనతోనే ఉండేలా చేస్తుంది. నిజమైన సంఘము గురించి మీరు నేర్చుకున్న విషయాలను మీరు ఎప్పటికీ మరచిపోలేరు. మీరు బైబిల్లో ఎక్కువగా తెలుసుకోవాలని వెతికే రహస్యాన్ని మీరిప్పుడు నేర్చుకొనియున్నారు. ఇక మిగతాది మీ చేతుల్లోనే ఉన్నది.

ఈ సత్యము మీ మేధస్సును ఒప్పింపజేసిందని అంగీకరించుటకు మీరు నిర్ణయము తీసుకోవద్దని నేను మీకు విన్నవించుకుంటున్నాను. సత్యమును సత్యముగా నమ్మండి. యేసుతో ఆధ్యాత్మిక సంబంధము లేని ఎవ్వరైనను క్రీస్తు శరీరమైన సంఘములో చేరకూడదు.

నిజమైన శేషించిన సంఘము యొక్క అద్భుతమైన ప్రవచనము వెనుక సిలువపైన మీ స్థానంలో చనిపోయిన దేవుని గొర్రెపిల్లని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మన పాపము వలన సిలువపై వ్రేలాడబడియున్నాడు ఎందుకంటే ఆయనకు విధేయత చూపించేంతగా ఎవరు ఆయనను ప్రేమించలేదు. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 14:15)

మన పాపమును బట్టి విరిగి నలిగిన హృదయంతో ఆయన యెదుట మోకరిల్లి, ఆయన నా రక్షకుడు మరియు ప్రభువు అని అంగీకరించే వరకు మనం ఆయనకు నిజమైన విధేయత చూపలేము. ఆయన పట్ల ప్రేమ ఆయన మాటను నెరవేర్చడానికి బుద్ధిని మరియు శక్తిని మనకు కలిగిస్తుంది. మీరు ఆయనను ఇప్పటికే అంగీకరించకపోయిన యెడల, మీరు ఇప్పుడే ఆ మొదటి తీర్మానమును తీసుకోండి. ఆ నూతన సంబంధమైన ప్రేమ బలం క్రింద నిజమైన శేషించిన సంఘము యొక్క సభ్యులముగా ఆయన సేవలో ముందుకు సాగిపోవుదము.