విషయసూచిక

రెండు వైరుధ్య గుంపు ప్రజలు
మద్యమనగా నేమిటి?
బైబిలు ప్రకారమైతే - రెండు రకముల మద్యములున్నవి.
వివరించబడిన తికమకపరచే బైబిలు వచనములు
ప్రాణము పరితపించున దేదైనను
ప్రభు రాత్రి భోజనము సంగతేమిటి?
యేసు మద్యము సేవించువాడా?
మద్యము : బైబిలులో సిగ్గుమాలినతనమునకు గుర్తు
పులిసిన ద్రాక్షారసము శ్రమను తెచ్చును
ఆరోగ్యమునకు సంబంధించిన విషయము
భూమ్మీదనే అత్యంత ప్రాణాంతకమైన పదార్ధము
ప్రేమకు అభ్యంతరము
శోధనను ఆహ్వానించుట
శక్తివిహీనమైన సాక్ష్యములు
పెంతెకొస్తు దినమందు ద్రాక్షారసము
కడుపు కొరకు కొంచెము
ఇతర ఔషధ సంబంధమైన వినియోగము
మితముగా త్రాగుట
యాజకులు మరియు రాజులతో నిండిన దేశము
సారాంశము

ఒక అద్భుత సత్యము :

పరీక్షల ఫలితార్థమేమనగా, 3 బీరు సీసాల త్రాగిన వ్యక్తి తన జ్ఞాపక శక్తిలో 13 శాతం కోల్పోతున్నాదు. చిన్న మోతాదులో మద్యం సేవించిన టైపిస్టు 40 శాతం తప్పులు టైప్ చేస్తున్నాడు. ఒకే ఒక్క "టీ కప్పు" మద్యపానం వల్ల సమస్య అది పరిష్కార నిర్ణయాన్ని పది శాతం అలస్యం అవుతుంది. కందరాల శక్తిని 17 శాతం ఆటంకపరుస్తుంది, 35 శాతం ఏకాగ్రతను పాదు చేస్తుంది. - పాల్ హార్వే

క్రైస్తవుడు మద్యం సేవించడాన్ని పరిశుద్ధ గ్రంధము అనుమతిస్తుందా? అదే నిజమైతే.... ఎంత మేరకు?"

వివాదాస్పదమైన ఈ అంశం క్రైస్తవులలో అనేక రకాల అభిప్రాయాలను వెలికి తీసింది. ఎందుచేత? మద్యం గురించి దేవుని వాక్యం మౌనముగా ఉందా? లేక అస్పష్టత యేమైనా ఉందా?

నేనైతే మద్యం విషయంలో ఎటువంటి సందిగ్ధత కలిగి లేనని, క్రీస్తు అనుచరులకు సంబంధించినంత వరకూ బైబిలులో స్పష్టత కలదని చెప్పగలను. ఈ చిన్న పుస్తక అధ్యయనము ఈ అంశమునకు సంబంధించి బైబిలు ఆధారిత ముగింపులు నీ యంతట నీవే ఇవ్వటకు నీకు సహాయపడునని నేను నమ్ముతున్నాను.

రెండు వైరుధ్య గుంపు ప్రజలు

సున్నితమైన ఈ అంశమును గూర్చి, క్రైస్తవులలోనే ముఖ్యంగా రెండు ఆలోచనలున్న గుంపు ప్రజలు ఉన్నారు. వారిలో మొదటి గుంపు ప్రజలు క్రీస్తే స్వయంగా ద్రాక్షరసమును సేవించాడు- మరియు క్రైస్తవులంటే క్రీస్తు అనుచరులే కదా ...! అటువంటప్పుడు మద్యపానం ఏ విధంగా నిషేదించతగినది? అని వాదించేవారు. వారి వాదనకు మరికొంత గాలి పోగేసి, "సేవించినా గాని అది శృతిమించకుండా ఉండాలంటూ" ముక్తాయింపు నిస్తున్నారు.

అయితే రెండవ గుంపు ప్రజలు, "మద్యం ఒక వ్యసనం. అది వినాశనకారి గనుక నిజమైన క్రైస్తవుడు దాని నెంత మాత్రమూ సేవించకూడదు" అంటున్నారు."

నిజానికి, ఈ రెండు వైరుధ్య గుంపు ప్రజల మధ్య, అసంఖ్యాకమైన అభిప్రాయ వేదికలూ ఉన్నాయి. ఈ సూక్ష్మకార్యములో దాగియున్న అన్ని ధృక్కోణాలను నేను అవిష్కరించ లేకపోవచ్చునేమో గాని వాక్యాధారంగా నాకున్న వివేకాన్ని వినియోగించి, దానిలోని ప్రాముఖ్యమైన మూలమును పట్టుకొని యుండగలను.!

న్యాయంగా చెప్పవలసి వస్తే. ను పులియని ద్రాక్షారస పానం చేయవచ్చునని చెప్పే ప్రజల గుంపుకు చెందినవాడను. యేసు పానం చేసాడని చెబుతున్న వాక్యాలన్ని తాజా ద్రాక్షారసాన్ని సూచిస్తున్నవేనని నా నమ్మకం.

కాని, మద్యపానాసక్తుల ముందు ఈ విషయం ప్రక్కన పెడితే, నేను చెప్పేది విన్నాక నీకు నీవే ఋణపడినట్లు తెలుస్తుంది. "నేను, భోజనంతో పాటు తరచుగా మద్యాన్నో లేక బీరునో ప్రతి రాత్రీ సేవిస్తూ ఎదిగిన వచ్చినవాడను. అంతేగాదు, నా యంతట నేనే బీరును, మద్యాన్ని కాచి తయారు చేసాను. అయినప్పటికీ నేనెన్నడూ దాన్ని రుచి చూడనైననూ లేదు. అలాగని నేనొక స్థిరమైన బుద్ధిమంతుడనని గాని, జయశీలుడనని గాని మిడిసి పడుట లేదు.

మద్యమనగా నేమిటి?

ఒక నిర్వచనంతో మొదలెడదాం. "మద్యం" అని పిలువబడే ఈ మిశ్రమ మత్తు పానీయం అనేక రూపాలు కలిగియుంది. అయితే అది యే రూపంలో ఉన్నా, అన్నీ కూడా విష పదార్థాలే అనడం తప్పుకాదు. మానవ శరీరానికి ఇవి విషము -విషతుల్యములని వర్గీకరించవచ్చు. బీరు, బ్రాందీ, ద్రాక్ష కల్లు (పుల్లకల్లు) అనేవి మద్యంలో మండే రుచి గల మత్తు పానీయాలు. ఒక ప్రత్యేకమైన వాసన గల, చురుక్కున మండునట్లుండే, శుద్ధమైన ఇథనాల్ (జ205న) ద్రావణమే ఈ మద్యం.

ఇటువంటి మద్యాన్ని సేవించడం వల్ల ఏమి జరుగుతుంది? ఇంకేం జరుగుతుంది, మన శరీరంలో ప్రవహించే రక్తంలో ఇథనాల్ యొక్క ప్రభావం గాఢత 5% శాతం పెరిగితే చనిపోతాం. కాని అప్పుడప్పుడు త్రాగే అలవాటున్న వారిలో తక్షణమే ప్రవర్తన మారిపోవడం, వారికి ఒక వస్తువు రెండుగా ఉన్నట్లు కనబడడం, స్పృహ లేకపోవడం అనేవి జరగవచ్చు. అవి కూడా మోతాదు తక్కువ గాఢత కలిగియున్నప్పుడు మాత్రమే. |

ఇదేదో ఆసక్తికరంగా ఉన్నట్టుంది కదూ? హిరాయిన్, మారిజువానా వంటి నీచమైన మత్తు పదార్థాల ఫలితం కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది. గంజాయి, హిరాయిన్ ఉపయోగించేవారు ఈ రకమైన ప్రభావాలకే లోనవుతూ ఉంటారు. నరాల బలహీనతను అధిగమించడానికో లేదా నిద్రరాక బాధపడేవారు సుఖంగా నిద్రపోవడానికో కొన్ని మత్తు మందులు వాడుతూ ఉంటారు. అయితే నాకున్న అనుమానం ఏమిటనగా, అవి కూడా మత్తును కలిగించేవిగా ఉండగా క్రైస్తవ సంఘాలు, సాధారణ సామాజిక జీవన నేపధ్యంలో ఇటువంటి వాటిని ఆమోదిస్తున్నాయేమో కదా? అలాంటప్పుడు మత్తు మందులకు సంబంధించి మద్యాన్ని మాత్రం నిషేధించ దగిననుటకు ఏదైనా కారణమున్నదా?"

'బైబిలు ప్రకారమైతే - రెండు రకముల మద్యములున్నవి

బైబిలు కాలం నాటి ద్రాక్షారసమును గూర్చి మాట్లాడాలంటే, ద్రాక్షారసం అనగా అది కేవలం తాజా ద్రాక్ష పండ్ల నుండి పిండి తీసిన ద్రాక్షారసమనియు ఇతర సమయాలలోనైతే అది మద్యమనియు చెప్పబడుతుంది. మద్యం అంటే అది పులిసిన లేదా నిల్వ చేయబడిన గాఢత గల రసం. అనువాదకులు

“ద్రాక్ష పండ్ల రసం” అనే మాట ఎక్కడా ఉపయోగించలేదు. కానీ హెబ్రీ భాషలోని రచయితలైతే మత్తు ద్రాక్షరసానికీ, తాజా ద్రాక్ష పండ్లరసానికీ వేరు వేరు పదాలను ఉపయోగించారు. “తియరోష్" (tiyrosh) అనేది తాజా ద్రాక్ష పండ్ల రసానికి "యాయిన్" (yayin) అనేది పులిసిన ద్రాక్షరసానికీ ఉపయోగించడం జరిగింది, కాని కొంత మినహాయింపు నివ్వడం జరిగింది (యెషయా 16:10), ఏది ఏమైనా క్రొత్త నిబంధనలో రెండు రకాల ద్రాక్షారసానికీ ఒకే రకమైన గ్రీకు పదం వాడడం జరిగింది. అది "ఆయినిస్" (oinis) కాని సమస్య యిది కాదు. ఏ సందర్భంలో “ద్రాక్షారసం” అనే పదం వాడబడినదో గ్రహించి, అది తాజారసమా, లేక పులిసిన రసమా అనేది మనం గుర్తించాలి. ఆ సందర్భం-సరిగా అర్థం చేసుకోలేకపోతే అది క్రొత్తది పాతదో ఏ రకమయినదో మనం గ్రహించడం కష్టమవుతుంది (లూకా 5:37-39).

మార్కు 2:22లో ఓ మంచి ఉదాహరణ మన కీయబడింది. “ఎవడును

పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు; పోసిన యెడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును. రసమును తిత్తులును చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని చెప్పెను." ద్రాక్ష రసములలోనూ క్రొత్తదైనదే తాజా రసముగా స్పష్టమగుచున్నది. ॥

పాత నిబంధనలో యెషయా 65:8లో “ద్రాక్షగెలలో క్రొత్తరసము దాని కొట్టివేయకుము" అని చెప్పుదురు గదా? పైనున్న పేరాలను గమనిస్తే రెండు సందర్భాలలోని ద్రాక్ష రసములలోనూ క్రొత్తదైనదే తాజా రసముగా స్పష్టమగుచున్నది. కనబడునప్పుడు, జనులు - ఇది దీవెనకరమైనది.

వివరించబడిన - తికమకపరచే బైబిలు వచనములు |

మద్యపానం ఎట్టి పరిస్థితిలోనూ సరికాదని లేఖనాలు సుస్పష్టంగా మనకు వివరిస్తున్నాయి. కాని మానవ నైజం ఎక్కడైనా "చిన్న అవకాశం” చిక్కక పోతుందా అన్నట్లు తమకున్న త్రాగుడు బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు చిన్న ఆధారం కోసం వెదుకుతుంది.

అదే 'కానా' అను ఊరిలో జరిగిన వివాహ వేడుక, యేసు నీళ్ళను ద్రాక్షారసముగా మార్చిన సందర్భం. "ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్ళు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినది గాని ఎందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్ళ రుచి చూచినపుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇంత వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను" (యోహాను 29, 10). ఇక్కడ విందుకొచ్చిన వారు త్రాగిన ద్రాక్షారసం కేవలం మత్తు కలిగించేదే యని వాదించే వారు లేకపోలేదు ఎందుకంటే వివాహ వేడుకలో ఇది సర్వసాధారణం అనేది వారి ఉద్దేశ్యం. కాని ఒక విషయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే మనకొక విషయం అర్థమవుతుంది. అక్కడ ఆరు రాతి బానలు నింపబడ్డాయి. ఒక్కొక్కటి సుమారు 80 నుంచి 120 లీటర్లు పడుతుంది.

మత్తు మేలు చేయదని మన మెరుగుదుము.

అంటే యేసు 120 లీటర్ల మత్తునిచ్చే లేదా నష్టబరిచే మత్తు పానీయాన్ని తయారు చేసారని నమ్ముదామా? వివాహ విందుకొచ్చిన వారినందరినీ మత్తులో ముంచి, తత్తరపాటుకు గురిచేసి, తూలిపో చేయడానికే యేసు ఈ పనిచేసాడనే అనుకుందామా? అలా అనుకుంటే హబక్కూకు 2:15; లూకా 12:46; ఎఫెసీయులకు 5:18 లలో చెప్పబడిన తన మాటకు తానే వ్యతిరేకముగా వ్యవహరించిన వాడయ్యేవాడు మనము లేఖనాల మొత్తము నుండీ ఈ భాగాన్ని చూస్తే ఆయన పులియని ద్రాక్షరసమునే తయారు చేసినట్లు నిర్ధారించుకోగలము అంతేగాక విందు ప్రధాని కూడా ఆ తాజా ద్రాక్షరసము యొక్క రుచిని బట్టి- పెండ్లి కుమారుని ప్రశంసినట్లు గమనించగలము ( 24, 6, 16; 1:24; 2 2 16:10).

ప్రాణము పరితపించున దేదైనను 

ఇంకనూ మరికొన్ని వచనాలు తెలియజేసేదేమనగా, తొలిసారిగా యే వ్యక్తియైనా, కొంచెం పులిసిన ద్రాక్షరసమును త్రాగుట బైబిలానుసారమేనని తలంచేలా చేసే అదనపు వచనాలు కూడా ఉన్నాయి, అయితే పులియబెట్టిన ద్రాక్షారస పానము - బైబిలానుసారమేనని తలంచేలా చేస్తుంది, కాని అది వాస్తవము కాదు.

“ఎద్దులకేమి, గొజ్జెల కేమి, ద్రాక్షరసముకేమి, మద్యముకేమి, నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ యింటివారును సంతోషింపవలెను. (ద్వితీయోపదేశకాండము 14:26). “మద్యము” ఒక బలీయమైన మత్తు పానీయము. అది సేవించు వలన జగడము (అల్లరి) కలుగునని సొలోమోను చెప్పుచున్నాడు (సామెతలు 20:1). ఈ బలమైన మత్తు పానీయమును - "Shekar (శేకర్)". అని అంటారు. "ద్రాక్షారసము (మద్యము) తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకూ పానము చేయు వారికి శ్రమ" యని యెషయా 5:11లో చెబుతున్నాడు. ఈ బలమైన మద్యపానము యాజకులుగా నుండ గోరు వారికి నిషేదము." లేవీయకాండము 10:9-11లోనూ మరియు సంఖ్యాకాండము 6:2-4లోనూ; న్యాయాధిపతులు - 13:3-5లోనూ తెలియపరచడమైనది. ఇట్లుండగా యేలాగున అది (అనగా మద్యపానము) ఒక చోట సేవించదగినది యని మరొక చోట నిషిద్ధమైనది యని దేవుడు చెపుతున్నాడని బైబిలులో చూడలము? శేకర్ అను పదము లాగే 'యాయిన్' (yayin) అనే పదం కూడ పలు చోట్ల పులిసిన ద్రాక్షరసమునకునూ పులియని దానికినీ వాడబడినది. యెషయా 24:9లో చూడండి. శేకర్ అను మాటకు, అత్యంత ప్రముఖమైన బైబిలు గ్రంధ నిఘంటువు నందు కూడా, అది యొక తియ్యని ఔషధము, లేదా, మధుర పానీయము లేదా ఖర్జూర తేనే లేదా బలమైన చక్కెర ద్రావణం లేదా తాటి లేదా ఈత చెట్ల నుండి అప్పుడే తీయబడిన తియ్యని తాజా రసము అను అనేక అర్థములున్నవి. నిజానికి చెఱకు చక్కెర, సీమరేగు సారాయి (సిడార్), శేకర్ అనేవి శేకర్ నుండి ఉద్భవించినవి. శేకర్ (ద్రాక్షారసం) అనే పదం, ఇటు పులియని దానికీ అటు పులిసిన దానికీ కూడా వర్తిస్తున్నట్లు వాడబడినది. కాబట్టి మనం వచన సందర్భాన్ని బట్టి మాటను అర్ధము చేసుకోవాలి. అయితే దశమ భాగము యొక్క సొమ్ముతో అనైతికమైనవి, అనారోగ్యకారకమైనవి విషతుల్యమైన వాటిని కొనవచ్చని దేవుడు ప్రోత్సహిస్తున్నాడా? అట్లనరాదు, బైబిలు వచనమును తియ్యని మరి పులియని తాజా రసము అను భావములోనే వాడవలసి యుందని భావించుట యుక్తము. "

అయితే ఈ పద అనువాదము నంగీకరించుటకు ఎవరికైనా అంగీకారము కాని యెడల ద్వితీయోపదేశకాండము 14:26లో చెప్పబడిన విధంగా అది ఎట్టి పరిస్థితులలోనూ త్రాగ నిషిద్ధమేనన్న తాత్పర్యము ప్రతి ఒక్కరూ మనస్సున నుంచగలము. దూర ప్రాంతముల నుండి దేవుని సన్నిధికి నైవేద్యాలను-సమర్పించు వారు వాటినెలా రవాణా చేయనిది తెలుపుతుంది. అందుచేతనే మోషే వారితో ద్రవ్యమునే తప్ప ద్రాక్షరసమైననూ, ధాన్యమైననూ, పశువులనైనూ తీసుకురావద్దని చెప్పిచున్నాడు. వారు చేరిన పిమ్మట, వారర్పించుటకు కావలసినవన్నీ కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. జంతు బలినైతే తినవచ్చును గాని, పానీయార్పణములను నేలను పారబోయవలెనని ఆజ్ఞాపించెను. "ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పించవలసిన పానార్పణము నాల్గవ వంతు పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను" (సంఖ్యాకాండము 28:7)

ప్రభు రాత్రి భోజనము సంగతేమిటి?

యేసు ప్రభు రాత్రి భోజనమప్పుడు ద్రాక్షారస పానము చేసినందు వల్లనూ, పైగా అది శుద్ధీకరించు తన రక్తమునకు ప్రతీకయని తానే చెప్పినందు వల్లనూ అప్పుడప్పుడూ కొద్దిగా ద్రాక్షారసము పుచ్చుకొనుటలో తప్పేముంది? అని కొందరి వాదన. చివరి రాత్రి భోజనములో యేసు పులిసిన ద్రాక్షరసమునే వినియోగించాడని ఎట్టి పరిస్థితులలోనూ చెప్ప వీలుపడదు. నిజానికి క్రొత్త నిబంధన సంబంధమైన విత్తనములు ఆ చివరి భోజనము నుండీ నీరు గారి పోయినవి.

"ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న (నూతన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా రు దినము వరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను)" (మత్తయి 26:28-29). నిజానికి ఇక్కడ యేసు ద్రాక్షారసమును తన జనులతో చేయనైయున్న క్రొత్త నిబంధనకు సూచనగా ఉపయోగించాడు. తాజా (క్రొత్త) ద్రాక్షరసమే. అందుకే ఆయన దానిని "క్రొత్త ద్రాక్ష (పండ్ల) రసము" అని అంటున్నాడు. ఏదేమైనా ద్రాక్షారసము పులియబెట్టు విధానముల గుండా పోయినపుడు (లేదా కాలము గడిచే కొద్దీ) ఇకనెంతమాత్రమూ తాజా రసమనబడదు. పాలు పులిసినచో అది 'పెరుగే గాని పాలు అని యెంత మాత్రమూ పిలువబడదు కదా!!

అటువలెనే పులిసిన ఏ పదార్ధమునూ పస్కా భోజనములో వినియోగించకూడదు (నిర్గమకాండము 12:19). వులిసినది. నిల్వయుంచబడినదీ, రెండూ ఒకటే. పులిసిన పిండితో చేసిన రొట్టె ఏలాగు నిషిద్ధమో (అనగా పులిసిన లేదా పొంగిన రొట్టె ఏలాగు నిషిద్ధమో) అలాగే ద్రాక్షరసమునూ పులిసినదైతే నిషిద్ధము. ఎందుకనగా ద్రాక్షారసము క్రీస్తు రక్తమునకు సాదృశ్యము. అందువలననే ప్రభు రాత్రి భోజన సమయమున ఉపయోగించు ద్రాక్షరసము తాజా రసముగా నుండవలెను. ఎందుకనగా క్రీస్తు రక్తము పరిశుద్ధమైనది. పాపరహితమైనది కనుక అట్టి శ్రేష్టమైన రక్తమునకు గుర్తుగా, పాతది లేదా నిల్వ చేయబడిన ద్రాక్షారసమును వినియోగించకూడదు.

( యేసు, పవిత్రమైన తన బోధనలను సంపూర్ణమగు నూతన (తాజా) ద్రాక్షరసమునకు పోల్చెను (మత్తయి 9:17). అందుచేతనే పాప భూయిష్టమైన ధర్మనియమాలన్నీ. బబులోను యొక్క అపవిత్ర (వ్యభిచార) మద్యముతో పోల్చబడినవి. కావున "భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి" అని బబులోనును గూర్చి చెప్పబడినది 17:2).

మరొక ఉదాహరణ : "కాని దానియేలు, రాజ భోజనము వలన గాని, ద్రాక్షారసము (బబులోను వ్యభిచార మద్యము) వలన గాని తాను అపవిత్ర పరచబడకుండునట్లు, తనను తాను అపవిత్ర పరచుకొనకుండ ఉండుటకు వాటిని తనకీయబడకుండ సెలవిమ్మని వేడుకొనెను" (దానియేలు 1:8).

యేసు మద్యము సేవించువాడా?

పరిసయ్యులు తరచుగా యేసును ఒక తిండిపోతుగాను, త్రాగుబోతు గాను జమకట్టి దూషించేవారు. అంతేకాదు ఆయననొక దయ్యము పట్టిన వాని గాను, దేవదూషణ చేయుచున్న వానిగాను దూషించే వారే గాని ఆయన చేయు అద్భుతములను పట్టించుకునే వారు కాదు. అయితే మనము ఆయనను తిండిబోతుగా గాని, దయ్యము పట్టిన దేవదూషకునిగా గాని ఎరుగము, అటువంటప్పుడు ఎందుచేత మనము పరిసయ్యుల వలె ధర్మశాస్త్ర ప్రవీణులుగా చలామణి యగుచూ, యేసును బాహాటంగా వ్యతిరేకించే సమూహమైన పరిసయ్యుల ప్రశ్నలను బట్టి ప్రభువును అనుమానిస్తూ ఆయనను త్రాగుట యందాసక్తి గలవానిగా ఎంచుచున్నాము? వారు క్రీస్తుకు విరోధముగా ఆయన జీవనశైలిని, యోహానుతో అనగా మిడుతులు తింటూ, అడవి తేనె త్రాగుచూ, మద్యము నేమాత్రమునూ సేవించక నజరేతు పద్ధతుల ననుసరిస్తూ, మారుమనసు నిమిత్తము బాప్తిస్మమిచ్చుచున్న యోహానుతో పోల్చుతూ భేదము లెంచేవారు (సంఖ్యాకాండము 6:3; లూకా 7:33-34, 1:15; 8:48-52; ລ້ 2:7; ລ້ 3:4).

అయితే యేసు సిలువపై వ్రేలాడ దీయబడి, దప్పిగొని యున్నప్పుడు, రోమా - సైనికులు ఆయనకు చేదు కలిపిన, పులిసిన ద్రాక్షారసమును అందించిరి. అయితే అది రుచి చూసినపుడు పులిసినదియు, చేదైనదనియు గ్రహించి దానిని త్రాగనొల్లక పోయెను. మామూలుస్థితిలో ఆయన మద్యపానాసక్తి గలిగిన వాడే అయితే, అంతగా తన శరీరగాయములతోను, నొప్పులతోనూ పులిసిపోయియుండగా, పైగా మితిమీరిన దాహముతో ఉండిననూ ఆ ద్రాక్షారసపు (మద్యపు) చిరకను త్రాగలేదే (మత్తయి 27:34)? మరి మనమెందుకు త్రాగవలెను?"

మద్యము : బైబిలులో సిగ్గుమాలినతనమునకు గుర్తు 

మద్యమును గురించి మొదటగా బైబిలులో, ఆదికాండములో నోవహు త్రాగి, మత్తుడై సిగ్గునెరుగక తన దిగంబరత్వము నెరుగక తన గుడారమందు పడియున్న స్థితిని గూర్చి తెలుపుతూ ప్రస్తావించబడింది. (ఆదికాండము 9:21) నోవహు మత్తుగా ద్రాక్షారసము (మద్యము) సేవించి వస్త్రహీనుడుగా అటు, ఇటు దొర్లుచూ సిగ్గునెరగని స్థితిలో తన కుమారులకు తనను తాను కనబరచుకొన్నట్లు వ్రాయబడింది. క్రొత్త పానీయం (ఔషదము) తో తొలిసారిగా చేసిన ప్రయోగము వికటించి, అది నోవహు వంశానికి శాపంగా పరిణమించింది. 1

లోతు కూడ త్రాగి, మత్తుడై తప్పిదములో చిక్కుబడి, వావి వరుస తప్పిన వాడై, తన కుమార్తెలతో అపవిత్ర కార్యము చేసిన వాడయ్యాడు. “ఆ రాత్రి వారు (కుమార్తెలు) తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచి, పోయెనో అతనికి తెలియలేదు" (ఆదికాండము 19:33). -ఈ అపవిత్ర కార్యము వలన పుట్టిన వంశావళులే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారికి విరోధులైన మోయబీయులు, అమ్మోనీయులు. వావివరుస లెరుగని అపవిత్రకార్యములు, బలాత్కారములు వ్యభిచారములు వంటి లైంగిక దురాచారాలకు 'మద్యం' దారితీస్తుందనడానికి అనేక ఉదాహరణలు నేడు కలవు.

అయినా, ఇశ్రాయేలీయులు త్రాగి, తమ్మును తాము నగ్నపరచుకొని నాట్యమాడుచూ బంగారు దూడను పూజించుట వలన దేవుని అవమాన పరచిన అనుభవము తెలిసినదే (నిర్గమకాండము 32:6, 25). ఈ "సాంఘీక దురాచారము" దేవుని ఉగ్రతకు గురై నరమేధములో ముగిసినది.

అంతేనా! దావీదు కుమారుడైన అమ్నోను, తనకు సహోదరి యగు (దావీదు యొక్క మరొక భార్య కుమార్తె, అబ్షాలోము సోదరి) తామరు విషయములో అమ్నోను తప్పు చేసినందువల్ల, అబ్షాలోము, తన తమ్ముడైన అమ్మోనుకు ద్రాక్షరసము (మద్యము) త్రాగించి, మత్తుడై యుండగా అతనిని చంపించెను. (2 సమూయేలు 13:28). "

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మద్యపానము వలన చోటు చేసుకున్న ఇంకా భయంకరమైన ఉత్పాతాల కొరకు 2 సమూయేలు 13:28; యోబు 1:13-19 చూడండి. మద్యపానము వల్ల జరిగిన ఇన్ని అకృత్యాలు బైబిలులో మనకు పొందుపరచబడగా ఇంకా ఎందుకని, నిజ క్రైస్తవులుగా పిలుబడుచున్న కొందరు సయితము మద్యపానము విషయమై లేనిపోని వాదనలు పెడుతున్నారు? |

'పులిసిన ద్రాక్షారసము శ్రమను తెచ్చును

"శ్రమ" అనే అర్థాన్నిచ్చు 'WOE (వో' అను మాట సాధారణ (ఆంగ్ల) వ్యవహారికంలో ఈ మధ్య ఉపయోగంలో లేదు. ఈ మాటకు సిసలైన అర్థం బహుదు:ఖము లేదా వేదన లేదా గొప్ప విపత్తు అని చెప్పవచ్చు. అయితే బైబిలులో అనేక చోట్ల ఈ పదం వాడబడినట్లు చూడడం ఆశ్చర్యం కాదు, పులిసిన ద్రాక్షారస పానం (మద్యపానం) చేసిన సందర్భాలలోనే ఇది తరుచుగా వాడబడింది.

"మద్యము త్రాగుదమని వేకువనే లేచి, ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ" ( 5:11).

“ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చే వారికే గదా? కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా!" (సామెతలు 23:29-30).

“తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రత కలిపి వారికి త్రాగనిచ్చి, వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ” (ລ້ 2:15).

క్రైస్తవునికి, మద్యపానాసక్తి ఉండరాదని ఖండించే, ఇంతకన్నా గొప్ప షరతులేమైనా ఉన్నాయంటారా? ఒక సులభ క్షేమ సూత్రమేదనగా “అనుమానము కలిగినపుడు, విడుచుట మంచిది!”

ఆరోగ్యమునకు సంబంధించిన విషయము

"మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి” (1 కొరింథీయులకు 6:20) కాలేయ జబ్బు, దాని నుండి

ఉదర సంబంధమైన వ్రణములు, దాని నుండి మతిమరుపు ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మద్యపానము వల్ల తలెత్తుతున్నాయి.

ద్రాక్ష గింజల నుండి తీయబడిన మద్యము విషతుల్యము. అది కడుపులోనికి పోయి, అక్కడ నుండి నాడీ మండల వ్యవస్థను ఛిద్రం చేస్తుంది. ఈనాడు అనేకులు సేవించు “సామాజిక పానీయాలు" సైతం మెదడులోని కణజాలాన్ని నాశనం చేస్తున్నాయి.
ఒక గుక్కెడు 'విస్కీని పది నిమిషాల పాటు నోటిలో ఉంచుకుంటే, దాని ఫలితంగా నోటిలో పొక్కి పుండవుతుంది. ఇది పసిగట్టక, గుడ్డిగా పలు రకాల మత్తు పానీయాలు సేవిస్తే, అటు తరువాత నీళ్ళేవో, పాలేవో తేడా తెలియని దుస్థితికి చేరిపోతారు. ఈ ప్రయోగం వల్ల, మద్యం కేవలం మంట పుట్టించు దూర్త పానీయమే గాక, ఒళ్ళు తెలియని మత్తును కలిగించే పానీయం కూడా అగును.

మద్యం నెరిగిన గొప్ప న్యాయవాదులు కూడా, దాని సేవించిన వారు తమ దేహంతో దేవుని మహిమ పరచలేదని వినమ్రంగా ఒప్పుకుంటారనేదే నా యోచన. అంతేగాక అది నిదానంగా శరీరాన్ని మనసును నాశనం చేయుట ద్వారా ఆరవ ఆజ్ఞను అతిక్రమిస్తుందనేది విస్పష్టం.

మరో దురాగత మేదనగా, సిగరెట్టు త్రాగడం వాయిదా పద్ధతిలో ఆత్మహత్య చేసుకోవడమే. ఇది ఈనాడు భారతదేశము వంటి దేశాలలో విస్తరిస్తున్న మహమ్మారి.

శరీరాన్ని, మనస్సునూ ఆరోగ్యవంతముగా పోషించే లెక్కలేనన్ని ఆరోగ్యపానీయాలుండగా క్రైస్తవుడెవడైనా తన జీవితాన్ని, ఆరోగ్యాన్నీ, కుటుంబాన్నీ, సాక్ష్యాన్నీ చివరకు నిత్య జీవాన్ని దూరం చేసే ప్రమాదకర పానీయం (మద్యం) గురించి ఇంకా సమర్థించుకునే వాదనలు చేయడమెందుకు? మానుకోవడం వివేకం.

భూమ్మీదనే అత్యంత ప్రాణాంతకమైన పదార్థము

"మద్యపానీయం ఒక కొరుకువుండు. అది శరీరంలో ప్రాముఖ్యమైన అవయవాలనన్నిటినీ తినివేస్తూ వినాశపు ఘంటికలు మ్రోగిస్తుంది" అని అబ్రహం లింకన్ ఒక సందర్భంలో అన్నారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు, నాశనమవుతున్నాయి. నడివీధులలోను, ఇళ్ళలోనూ సమాజంలోను గొప్ప వినాశనమే కలుగజేస్తుందనడం అతిశయోక్తి కాకపోవచ్చు. నిజానికి బైబిలు ఈ విషయంపై మౌనంగా ఉన్నా, వేల సంవత్సరాల చరిత్ర నుండి ఎన్నో వినాశనకరమైన మూల పాఠాలు మనకు స్పష్టంగా విశదపరస్తున్నాయి. దీనిని ధృవపరిచే లేఖనాలూ మనకు మెండుగానే ఉన్నాయి.

“ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా! కలిపిన ద్రాక్షారసమును రుచిచూడ చేరు వారికే గదా! ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును. కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెఱ్ఱమాటలు పలుకుదువు. నీవు సముద్రమున పండుకొను వాని వలె నుందువు. ఓడ కొయ్య చివరన పండుకొను వాని వలెనునుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలు కొందును? మరల దానినెప్పుడు వెదకుదును అని నీవనుకొందువు" (৯ 23:29-35).

మరియు యిర్మీయా ఇలా అంటున్నాడు, దేశమును నాశనము చేయుటకు ఉచితంగా దొరికేలా, దేవుడు బానల కొద్దీ మద్యాన్ని ద్రాక్షారసాన్ని తయారు చేస్తాడు (యిర్మీయా 13:12-15) మన దేశం వరకైతే ఇది ఎలా నిజమవుతుందో గమనిస్తే తెలుస్తుంది. అభం శుభం తెలియని పసిపిల్లలను, పౌరులను, ముఖ్యంగా ఆయా మధ్య సంబంధిత వ్యాపార ప్రకటనలకై ప్రోత్సహిస్తున్నారు. కదా?

కొన్ని ప్రాంతాలలోనైతే త్రాగడానికి యువతను ప్రోత్సహిస్తూ మద్యపాన దురాచారాలు జరుగుతుండడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది కదా? ఈ మత్తు మందుకు బానిసలైన ఎందరో చిన్నారులు, యువకులు అనేక నేరాలకు పాల్పడుతున్న సంఘటన మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా? విస్తు గొలిపే ఒక వార్త ఏమంటే భారతదేశము దేశంలో హైస్కూలు విద్యార్థులు దాదాపు 133 లక్షల మంది ఈ మత్తు పానీయాలకు అలవాటు పడ్డారు.
మీకా కూడా హెచ్చరిస్తూ, ఒకడు వ్యర్థమైన అబద్ధాలు పలుకుతూ, ద్రాక్షరసమును గూర్చియు, మద్యమును గూర్చి మీకు చక్కని ఉపదేశమును చేయుదునంటూ (అబద్ధాన్ని) ప్రచారాన్ని చేయుచూ వారే జనులకు ప్రవక్తలుగా నున్నారు (మీకా 2:11).

మత్తును తగ్గించేలా మద్యాన్ని “తగ్గిస్తామని” తయారీదారులు గాని, త్రాగేవారు గాని అంటుంటారు. మద్యానికి బానిసయైన ఒకడు ఆ అలవాటును "తగ్గించుకోవడం అసాధ్యమని మనకు చరిత్ర చెబుతుంది.

ప్రేమకు అభ్యంతరము

మాంసము తినుట గాని, ద్రాక్షారసము (మద్యము) త్రాగుట గాని, నీ సహోదరుని కభ్యంతరము కలుగజేయునది మరేదియు గాని మాని వేయుట మంచిది (రోమీయులకు 14:21). ఎందుకనగా త్రాగు ప్రతి యేడుగురిలోను కనీసం ఒకరు సమస్యాత్మకంగా గాని లేదా వెణ్ణి చేష్టలు చేయువారిగా గాని ఉంటున్నారు. చట్టబద్ధమైన ఏ ఇతర పదార్థాల కన్నా, ఎక్కువ మందిని సమస్యలలోకి దింపే మద్య పరిశ్రమను ఒక క్రైస్తవుడు ఎలా సమర్థించగలడు? దాన్ని తయారు చేయడం తప్పు కాదని ఎలా చెప్పగలడు?

జిగ్ జిగ్లర్ ప్రకారం, అధికారిక లెక్కలు చెప్పుతున్నదేమంటే సుమారు ప్రతి పదహారు మంది సామాజిక మద్యపానము చేయు వారిలోనూ ఒకరు సమస్యాత్మక త్రాగుబోతుగా తయారవుతున్నాడు. ప్రతి పదహారు అవకాశాల్లోను ఒకటి మీ జీవితాన్ని మట్టుబెట్టి. మీ ప్రాణాలను గాల్లో కలిపేస్తుందని మీకు తెలిస్తే, మీలో ఎవరైనా విమానంలోకి అడుగు పెడతారా? (వాస్తవానికైతే 10 లక్షల సార్లు ప్రయాణించే వాణిజ్య విమానానికి ఒక విపత్తు ఎదురుకావచ్చు అయినా కూడా కొందరు విమాన ప్రయాణమంటే ముందుకు రారు. కాని వీరిలో అనేకులు తమ ప్రాణానికి ముప్పు అని తెలిసినా 'మద్యపానము'నకు మాత్రం ముందుంటారు.

ఇదిగో ఇక్కడ ఇవ్వబడిన ఇతర బహిరంగ సత్యాలు చూడండి. తదుపరి 24 గంటల్లో ఈ క్రింది నేరాలలో సుమారు సగం నేరాలకు ఈ మద్యమే కారణమవుతుంది.

  • నరహత్యలు
  • రహదారుల మీద ప్రమాదంలో చనిపోయేవారు
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోతున్నవారు.
  • కారాగారాల్లోను, జైళ్ళలోను కఠిన శిక్షలనుభవించేవారు.
  • సమాజంలోని అల్లర్లకు కారకులైనవారు.
  • పుట్టుకతో ఆరోగ్య సమస్యలు గలవారు.

ఇంతేనా! జరుగుతున్న ఆత్మహత్యలలో కనీసం నాలుగో వంతు వాటికి, ఈ మద్యమే కారణంగా ఉంది.

ఈ భయంకర సత్యాలను తెలిపే గణాంకాల నుండి సమాజ శ్రేయస్సు కోరే ఏ పౌరుడైనా ముఖ్యంగా 'క్రైస్తవుడు, తనకు తెలిసిన ప్రతి సంస్కృతీ సాంప్రదాయాలను అతలాకుతలం చేయుచున్న ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించుట తనకు గల గొప్ప బాధ్యతయని భావించాలి. నిజముగా మన సహోదరుని మరియు దేవుని ప్రేమిస్తున్న వారమైతే, ఏ కొంచెం మద్యాన్ని త్రాగడమన్నా ఎలా సమర్థించుకోగలం? పౌలు, తన సహోదరునికి అభ్యంతర మగునది మాంసము తినుట గాని, ద్రాక్షారసము (మద్యం) సేవించుట గాని అట్టిది మరేదైననూ మానివేయుదనని చెప్పుచున్నాడు. (రోమీయులకు 14:21). ఎందరో మద్యపానానికి బానిసలైన వారు, తమ వ్యసనము నుండి బయట పడుటకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా మన స్వల్పమైన ఆసక్తిని బట్టి, అట్టి వారిని తిరిగి ఆ వ్యసనంలోకి దిగజార్చడం సహేతుకం కాదు.

శోధనను ఆహ్వానించుట

"అందువలన దేవునికి సమర్పించుకొనుడి. అపవాది నెదిరించి, మీ వద్ద నుండి తరిమి వేయుడి" (యాకోబు 4:7).

చక్కగా పొందుపరచబడిన మరొక సత్యమేమంటే, కొద్దిగానైనా మద్యాన్ని సేవించడం వల్ల మన శరీరంలోని ప్రతిచర్యలు పాడు చేయబడి, రోగ నిరోధక శక్తి బలహీనపడును.

క్రైస్తవునికి, శోధనను జయించు శక్తిని తగ్గిస్తుంది. క్రైస్తవుడు, సాతాను ఉచ్చులో తనను తాను పడవేసుకుంటాడు? అనేక మంది స్త్రీ, పురుషులు, గ్లాసుల కొద్దీ మద్యాన్ని లేదా సీసాల కొద్దీ బీరును త్రాగి రాత్రంతా మత్తులో మునిగి, తెల్లారిన తరువాత కళ్ళు తెరిచి, అయ్యో మేము 7వ ఆజ్ఞను మీరి పాపం చేశామే అంటూ తెగబాధపడిపోతుంటారు. మరికొందరు తమ పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయంటూ జీవితాంతం బాధపడుతుంటారు.

ఇందు నిమిత్తమే పేతురు, "నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకు కలిగియుండుడి. మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా యని వెదకుచు తిరుగుచున్నాడు" అని గద్దించుచున్నాడు (1 పేతురు 5:8). మనలను పడద్రోయుటకు అపవాది ఇప్పటికే మన మీద గర్జించుచున్నాడు. దేవుడు మనకనుగ్రహించిన శక్తి నుండి పడద్రోయబడునట్లు మద్యము వలన మనము సులభముగా లొంగకుందము.

యేసు సిలువ మీద వ్రేలాడుతూ, అమితమైన దప్పి కలిగియు ఆయన కియ్యబడిన ద్రాక్షారసమును త్రాగనొల్లకుండెను. "చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరిగాని, ఆయన దాని రుచి చూచి, త్రాగనొల్లక పోయెను" (మత్తయి 27:34). మన విమోచన, త్రాసు నందూగుచుండగా, ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తన తీర్పును భంగపరచు మద్యము, అది ఎంత రుచిగలదైననూ సరే, ఆయన మన కొరకు అనుభవించుచున్న వేదనను తేలిక పరచునదైననూ దానిని అంగీకరించడు గదా! అలాంటపుడు మన నుండి తక్కువ ఆశిస్తాడా?

శక్తివిహీనమైన సాక్ష్యములు

కెనడా దేశపు ప్రముఖ వైద్యుడైన సర్ విలియం ఆస్లర్ ఒకనాడు "మద్యం” గురించి ఉపన్యాసమిస్తున్నాడు. అక్కడికి హాజరైన కొందరు వైద్య విద్యార్థులలో ఒకడు "అయ్యా, మద్యం త్రాగిన వారు ఏ పనైనా మెరుగ్గా చేస్తారట నిజమేనా?” అని అడిగాడు.

"కాదు" అని విలియం చెప్పారు. "పైగా వారు చేసేది తప్పే అయినా సిగ్గుపడకుండా చేస్తారు."

మద్యాన్ని సేవించు క్రైస్తవులు సంఘం బయటా, సంఘం లోపల కూడా తాము తప్పుడు సాక్ష్యాలిస్తూ ఉంటారు. పైగా తమ సాక్ష్యాలను తారుమారు చేస్తూ, రాజీపడిపోతూ తికమక పడుతుంటారు. వీరి ప్రవర్తన వారి పిల్లలను తలదించుకునేలా చేయటంతో వారి మనసు నొచ్చుకుంటుంది.

ఇటువంటి వారు ప్రార్ధన చేసేటప్పుడు కూడా అది ఎంతగానో తమ పిల్లలను గందరగోళపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వెంటనే వారు మళ్ళీ త్రాగడానికి సిద్ధపడుతూ ఉంటారు. యేసు ఇలాంటి వేషధారులను చాలా పరుష పదాలతో గద్దిస్తున్నాడు. “నా యందు విశ్వాస ముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో పడవేయబడుట వానికి మేలు" (మత్తయి 18:6).

ఒకానొక తండ్రి తొందర తొందరగా తన సంఘకాపరి యొద్దకు వెళ్ళి "అయ్యా, నా కొడుకు గతరాత్రి నిండా త్రాగి, ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికొచ్చి అర్ధరాత్రి వరకూ నేలపడి స్పృహలేక దొర్లుచూ ఉంటే, తన తల్లి. కొడుకుని ఆ స్థితిలో చూస్తూ సహించలేక ఏడుస్తూనే ఉంది. నా మట్టుకు నేను మంచి మనిషిగా చూడాలనుకున్న నా కుమారుడు ఇలా మద్యానికి బానిసై దిగజారిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మీకు పుణ్యం ఉంటుంది. కాస్త నా కొడుక్కి త్రాగొద్దని చెప్పండయ్యా” అంటూ వేడుకున్నాడు.

అప్పుడా పాస్టరు, "నేనెందుకు ... అదేదో మీరే చెప్పొచ్చు కదా!" అని ఆ తండ్రితో అన్నాడు.

"నేను చెప్పలేనయ్యా ... ఎందుకంటే దానిని నేనే నిండా భరించాల్సి వుంటుంది. ఒరేయ్! మగవాడైనందుకు త్రాగకపోతే ఎందుకురా! అని నేనే మొదట మద్యం గ్లాసును వాడికందించాను. కాని వాడు ఇలా దానికి బానిసై నా కళ్ళముందే నాశనమైపోతాడని ఊహించలేక పోయానయ్యా ... అందుకే వాడికి నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నా కొడుక్కి అర్ధమయ్యేలా చెప్పి పుణ్యం కట్టుకోండి" అని వాపోయాడు.

ఎంత విచారకర సంఘటనో చూడండి. ఈనాడు ప్రపంచంలో పలు కుటుంబాలలో తల్లిదండ్రులు, తమ పిల్లల కోసం రోధిస్తున్న ఇలాంటి సంఘటనలెన్నో కనబడుతున్నాయి.

ఇందును బట్టి "కావున మీరు వారి మధ్య నుండి బయట వచ్చి ప్రత్యేకముగా నుండుడి, అపవిత్రమైన దేదియు ముట్టకుడి... నేను మిమ్మును చేర్చుకొందును." అని ప్రభువు చెప్పుచున్నాడు” (2 కొరింథీయులకు 6:17). క్రైస్తవుడెప్పుడైతే మద్యం సేవించడం మొదలుపెట్టాడో వాడు లోకంలోని వాటి నుండి ప్రత్యేకింపబడిన వాడు కాదని ఋజువవుతుంది.

వీరు (క్రైస్తవులుగా మద్యం సేవించువారు) ఘనకార్యాలు చేసే వారే అయితే దేవుడు అట్టి వారిని ఎందుకు తన కార్యాల నిమిత్తం ఉపయోగించుకొనుట లేదు అని ఆశ్చర్యపడుతుంటారు! గుర్తుంచుకోండి, నిజానికి ఘనకార్యములు చేయు వారే అయినా అటువంటి దుర్వ్యసనానికి బానిసలైన వారిని తన పవిత్ర కార్యముల నిమిత్తము దేవుడు ఉపయోగించుకొనడు. దేవుడు కేవలము పవిత్రమైన పాత్రలనే (వ్యక్తులనే), ఆశ్చర్యకరమైన తన కార్యముల కొరకు ఉపయోగిస్తాడు.

పెంతెకొస్తు దినమందు ద్రాక్షారసము

పెంతెకొస్తు దినమందు శిష్యులందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై యుండగా మార్గమున పోవు వారందరూ "వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని" అపహాస్యము చేసిరి (అపొస్తలుల కార్యములు 2:13). ఇక్కడ "గ్రీకోస్" అనే గ్రీకు పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఇది "పులియని క్రొత్త ద్రాక్షరసము అని గాని, లేదా తాజా, తియ్యని, మరిగించిన మత్తు లేని ద్రాక్షారసమని గాని అర్ధము నిస్తుంది. అయితే ఆ బాటసారులు వీరిని చూచి, "వీరు కొత్త మద్యముతో మత్తెక్కియున్నారని” అపహాస్యము చేసారు. దీనిని బట్టి శిష్యులు మత్తు లేని ద్రాక్షారసముతో మితానుభవము కలిగియుండువారైనట్లు అగుపడుచున్నది. వారు ఎత్తి చూపిన మాదిరి అనుసరణీయము కాదని చెప్పుట ఎంత వరకు నిజము?

కడుపు కొరకు కొంచెము

పాలు, తిమోతికి వ్రాస్తూ, "ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును, తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము" (1 తిమోతికి 5:23). ఇందును బట్టి అనేకులు పౌలు, తిమోతికి మద్యము త్రాగమని సిఫారసు చేస్తున్నాడని భావిస్తున్నారు. పలు కారణముల దృష్ట్యా ఇది అసత్యము. మొదటిగా, మనమిది వరకే నేర్చుకున్న దానిని బట్టి "oinos (ఓయినోస్)" అనే పదము పులిసిన లేదా పులియని ద్రాక్షారసము అనే రెండు రకాలకూ ఉపయోగించబడినది. పైగా పులియని ద్రాక్షారసమునే ఔషదముగా వినియోగించే పద్ధతి ఉన్నట్లు, అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ఉదాహరణకు క్రీ.శ. 280 కాలంలో ఔషధ గ్రంథ పఠనము చేయు కొందరు, ఉదర సంబంధ వ్యాధుల నియంత్రణకు ద్రాక్షారసము దివ్యమని చెబుతుండేవారు.

తిమోతి కూడా నజరేతు ఊరికి సంబంధించిన వాడే అయి ఉండుట వలన నీళ్ళే త్రాగుచూ ఉన్నాడు. అందుచేతనే పౌలు, అతనికి ద్రాక్షారసము కూడా మేలు చేస్తుందని సిఫారసు చేస్తున్నాడు. ద్రాక్షారసము నిజంగానే శరీర క్రియలను చక్కబరచి, 'మేనుకు మెరుపు' కలిగిస్తుంది. బహుశా, తిమోతి ద్రాక్షారసము పుచ్చుకొనుట మానివేసి యుండవచ్చు. అందుచేత కొంచెముగా క్రొత్త (తాజా) ద్రాక్షారసము తీసుకొమ్మని పౌలు చెబుతున్నాడు. అదే పులిసినదైతే కడుపులో పుండ్లు పుట్టిస్తుంది. అందువల్ల అటువంటి దానిని, కడుపు జబ్బు కొరకు పౌలు ఎట్టి పరిస్థితిలోనూ సిఫారసు చేయడు.

పౌలు తన మొదటి పత్రికలో "అధ్యక్షుడు నిందారహితుడై ఉండాలి" (1 తిమోతి 3:2-3). అపొస్తలుడు మద్యాన్ని త్రాగాలని తిమోతి చెప్పియుండడు, ఎందుకంటే సంఘ నాయకత్వాన్ని పొందగోరు వారు విసర్జించవలసిన వాటిని గూర్చి 1 తిమోతి 3:8 మనకు తెలియచేయుచున్నది.

ఇతర ఔషద సంబంధమైన వినియోగము

"ప్రాణము పోవుచున్న వానికి మద్యము నియ్యుడి, మనో వ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి" (సామెతలు 31:6-7). ఈ వాక్యము మనకు తెలియజేసేదేమిటంటే, పతనావస్థలో ఉన్న వానికి, కట్టువైన దిగులు గలవానికి అనగా ఇక బ్రతికి బట్ట కట్టడన్న స్థితిలో ఉన్న వానికి అనే అర్థంలో వాడబడినది. ఇట్టి ఆచారము యూదులలో వాడుక. ఆ వాడుక చొప్పుననే యేసు సిలువపై దప్పిగొన్నప్పుడు, బోళము కలిపిన ద్రాక్షారసము (మద్యము) ఆయన కిచ్చినట్లు మార్కు 15:23లో చూడగలము. కాని ఆయన దానిని తృణీకరించెను. ఈ ప్రకారము, మద్యము యొక్క సాధారణ వినియోగాన్ని ఆమోదించకపోయినా, అనివార్య పరిస్థితులలో, వైద్య సూచనల మేరకు మద్యాన్నిచ్చుట సమయోచితము.

మితముగా త్రాగుట

"పరిచారకులు మాన్యులై యుండి, రెండు నాలుకలు గలవారై యుండక (ద్విమనస్కులు గాక) మిగుల మద్య పానాసక్తులును, దుర్గాభము నపేక్షించువారై యుండకుండుడి" (1 తిమోతి 3:8),

"మిగుల మద్యపానాసక్తులై యుండక" అంటే మనము మనస్సు ^నుంచవలసినదేమనగా మంచి విషయములలో మితముగా ఆసక్తి కలిగియుండుటకు దేవుడు అనుమతిస్తాడు గాని, దుష్కార్యములనైతే పూర్తిగా విడనాడమనే చెపుతున్నాడను సంగతి. ఈ అవగాహనను మనస్సు నందుంచుకొని, పౌలు పరిచారకులందరూ ఇట్టి మితానుభవము కలిగియుండి, మత్తు కలిగించు మద్యమును గాక తాజా ద్రాక్షారసమునైతే త్రాగవచ్చునని సెలవిచ్చుచున్నాడు. మంచి విషయముల యందాసక్తి కలిగి యుండటలో మితానుభవము 'గూర్చి అనేక బైబిలు వచనాలు ఉన్నవి. ఆరోగ్యకరమైన సహజ పదార్థమైనప్పటికి మితముగానే తీసుకొనవలెను గాని,

“తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు" (సామెతలు 25:27).

మంచి పదార్థముల విషయములో తినుట యందైననూ త్రాగుట యందైననూ మితిమీరి అతిగా చేయుటను బైబిలు ఖండించుచున్నది.

. (ద్వితీయోపదేశకాండము 21:20; సామెతలు 23:21) మరియు యేసు తిండిపోతు తనము (త్రాగుబోతు తనము)ను జల ప్రళ మునకు కారణమైన పాపములలో ఒకటిగా ఎంచుచూ వారికి చెప్పెను (మత్తయి 24:38). అయితే రోమీయులకు తినుట - త్రాగుట అనునవి ఒక సాధారణ విషయముగా నున్నవి. (మరియొక ముఖ్య విషయమేదనగా, పరిచారకులు సంఘ సభ్యుల గృహములను దర్శించవలసియున్నది. అతిధులెవరైనా వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి వారూ ఏదో ఒక పానీయమును మర్యాద కొరకు ఇచ్చుట కద్దు. అటువంటి సమయములలో గృహ సందర్శన చేయు పరిచారకుడు తాను తిండిపోతు (త్రాగుబోతు) గాక క్రైస్తవ విశ్వాసికి తగినట్లుండవలెనని వీటన్నిటిని బట్టి పౌలు వ్యాఖ్యానించునదేదనగా మితిమీరి పులిసిన ద్రాక్షారసము (నిల్వ యుంచిన ద్రాక్షారసము లేదా మద్యము) అనునది పరిచారకులకు నిషిద్ధము.

"మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి" అని పౌలు చెప్పినప్పుడు కొందరు ఈ వచనము అమితముగా మద్యము త్రాగవద్దని చెప్పుచున్నదని అనుకొనిరి. కానీ దుర్వ్యాపారము అనే పదము గ్రీకులో "అసోషియా” అనే మాట అల్లరి మరియు అల్లరితో కూడిన జీవనముగా అనువాదము చేయబడింది (ఎఫెసీయులకు 518& 1 పేతురు 4:4; లూకా 15:13). డర్బీస్ ఇంగ్లీషు బైబిలు ఈ వచనమును ఈ విధముగా అనువాదము చేస్తుంది: "మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము (త్రాగుబోతు తనము, భ్రష్టత్వము) కలవు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి” (ఎఫెసీయులకు 5:18). మనము దేవుని ఆత్మతో నిండిన పవిత్ర పాత్రలుగా ఉండుటకు పిలువబడితిమి.

యాజకులు మరియు రాజులతో నిండిన దేశము

క్రైస్తవులు, మద్యమునకు దూరముగా నుండవలసినదను వాదమునకు మరియొక బలమైన తార్కాణమేయనగా, మనము ఆత్మ ననుగ్రహించు వరమును పొందుటకు పిలువబడిన రాజులమైన యాజక సమూహమైయున్నాము. మద్యపానము యొక పర్యవసానమునూ, తదుపరి వచ్చు శ్రమలను గూర్చి బైబిలు బోధించునదేమనగా, గతంలో దానిని సేవించిన వారందరి హృదయముల మీద, వచనములు బలమైన ముద్ర వేయుచున్నవి.

  •  నిర్గమకాండము 19:6 - “మీరు నా కొరకు ఏర్పరచబడిన రాజులైన యాజక వంశము."
  • 1 పేతురు 2:9 - "అయితే... మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలు."
    అయితే, రాజులైన యాజక సమూహముగా నుండుటకు పిలువబడిన ఈ పరిశుద్ధ జనమును మద్యము ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ క్రింది వచనాలు గమనించండి.
  • లేవీయకాండము 10:9, 19 - "మీరు ప్రత్యక్షపు గుడారములోనికి

వచ్చునపుడు, మీరు చావకుండునట్లు, నీవును నీ కుమారులును; ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్టింపబడిన దాని నుండి లౌకిమైన దానిని, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దానిని వేరు చేయవలెను."

  • సామెతలు 31:4 - “(లెమూయేలూ)

ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. అది రాజులకు తగదు. మద్యపానాసక్తి

అధికారులకు తగదు."

రాజైన బెన్హదదు మద్యము మత్తులో ఉండుట వలన బలహీనుడై గొప్పదైన యుద్ధములో పరాజితుడయ్యాడు. “మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా, బెన్హదదును అతని సహకారులైన ఆ ముప్పది యిద్దరు రాజులునూ గుడారములలో త్రాగి మత్తులై యుండిరి" (1 రాజులు 20:16). అతడు తన ప్రతిష్టను కోల్పోయి. అవమానము పాలాయెను. "అతడు- వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను"
(1 ໙໖ 20:18).

ఇంకనూ బబులోను రాజైన బెల్షన్సరు సంగతి చూడండి. దేవుని పరిశుద్ధ మందిరము నుండి తేబడిన పరిశుద్ధ పాత్రలలో మద్యమును పోసుకుని త్రాగుట వలన, తాను మత్తుడైయుండగానే చంపబడ్డాడు (దానియేలు 5:2-5),

మనము దేవుని ఆత్మతో నిండిన పవిత్ర పాత్రలుగా ఉండుటకు పిలువబడితిమి. “మరియు మద్యముతో మత్తులై యుండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు, కాని ఆత్మపూర్ణులైయుండుడి" (ఎఫెసీయులకు 5:18),

సారాంశము

4,300 సంవత్సరాల తరువాత కూడా నోవహు చేసిన పాపం నేటికీ కుటుంబాలను నాశనం చేస్తోందని గ్రహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ మనం ఏమీ నేర్చుకోలేదా? మితముగా మద్యపానం చేయవచ్చునన్నది దేవుని సమాధానం కాదు పూర్తిగా మానుకోవాలన్నదే ఆయన ధ్యేయమైయున్నది. ప్రతి మద్యపాని అతని లేదా ఆమె దిగజారిపోయే మార్గాన్ని “మితమైన” మద్యముతో ప్రారంభించును. కొద్దిగా మద్యము తాగడం అనుమతించదగినది అని బోధించడం ద్వారా సంఘము ఆ మొదటి దశను ఎప్పటికీ క్షమించకూడదు లేదా అనుమతించకూడదు. బదులుగా, సంఘము దేవుని వాక్యము యొక్క స్పష్టమైన స్థానాన్ని సమర్థించాలి, యేసు ప్రభువు వాక్యమైయుండి శరీరధారిగా మన మధ్య నివసించుటకు వచ్చెనని తెలియజెప్పాలి.

మద్యము విషయములో దేవుని సమస్య స్పష్టంగా ఉంది మరియు ఇది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది. మద్యం అపవిత్రమైనది మరియు అపరిశుద్ధమైనది. లోక పానీయంలో పాల్గొనడం దేవుని ఉన్నత ప్రమాణాలతో రాజీ పడేలా చేస్తుంది.

మీకు మద్యపాన సమస్య ఉంటే, అమేజింగ్ ఫాక్ట్స్్ను సంప్రదించమని మరియు మద్యం మరియు క్రైస్తవులకు సంబంధించిన మా ఉచిత పుస్తకాన్ని కోరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని శక్తి ద్వారా వేలాది మంది మద్యం మరియు ఇతర వ్యసనం నుండి విముక్తి పొందడాన్ని మనం చూశాము!

"కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు" (యోహాను 8:36).