విషయసూచిక
| 1. అత్యున్నత అంశము |
| 2. ఒక పెద్ద సమస్య. |
| 3. యేసు మాత్రమేనా? |
| 4. యేసు సంపూర్ణముగా దేవుడేనా? |
| 5. ఆయన శత్రువులు ఎరిగియుండిరి |
| 6. మధ్యయుగ లోపమా? |
| 7. ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు |
| 8. ఏకత్వమా లేక పరిమాణమా? |
| 9. ప్రకృతిలో వ్యక్తీకరించబడిన దేవుడు |
| 10. తప్పుగా అర్ధము చేసుకునేందుకు మూలము |
| 11. ఎవరి పైన ఎవరు? |
| 12. స్నేహితుడైన వ్యక్తియా లేక శక్తియా? |
| 13. కల్వరి వద్ద ప్రేమ . |
| 14 త్రిత్వములో చీలిక . |
| 15. ముగింపు |

ఒక అద్భుతమైన వాస్తవ సత్యము : కాంతి మూడు ప్రాథమిక కిరణాలతో లేదా తరంగదైర్ఘ్యము (తరంగ-పొడవు) సమూహాలతో ఏర్పడిందని సైన్స్ (విజ్ఞాన శాస్త్రము) చెప్పుచున్నది. ఒకదానికొకటి స్పష్టంగా భిన్నంగా, మిగతావి లేకుండా వాటిలో ఏనీ అంత తేలికగా కాంతిగా ఉండవు. ప్రతి కిరణానికి దాని సొంత ప్రత్యేక పనితీరు ఉంటుంది. మొదటిది ఉద్భవిస్తుంది. రెండవది ప్రకాశిస్తుంది. మరియు మూడవది పూర్తి అవుతుంది. మొదటి కిరణాన్ని తరచుగా అదృశ్య కాంతి అని పిలుస్తారు, చూడలేము లేదా తాకి అనుభూతి పొందలేము.- రెండవది చూడవచ్చు మరియు తాకి అనుభూతి పొందవచ్చు. మూడవది కనిపించదు కాని వేడిగా ఉంటుంది.
కాంతి వలె, మన "ఒకే దేవుడు" తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే మూడు విభిన్న వ్యక్తులలో బయలుపరచబడ్డాడు. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము, “పరలోకనుందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా తండ్రియు, వాక్యమును, పరిశుద్ధాత్మయును, ఈ ముగ్గురు ఏకమై యున్నారు" (1 యోహాను 5:7).
1. అత్యున్నత అంశము
త్వము యొక్క ఇతివృత్తం కంటే కొన్ని సిద్ధాంతపరమైన ఆ విషయాలు క్రైస్తవులలో ఎక్కువ ఉద్వేగభరితమైన చర్చను సృష్టించాయి. సంఘాలు విడిపోయాయి మరియు దేవుని స్వభావాన్ని చుట్టుముట్టే సమస్యలపై యుద్ధాలు కూడా జరిగాయి.
దేవుని స్వభావంపై కలవరం లేదా తికమక కొత్త కాదు. సృష్టికార్యం నుండి, మానవుడు ఆయనను అర్ధం చేసుకోవడానికి మరియు వివరించడానికి శ్రద్ధగా ప్రయత్నించాడు. యోబు గ్రంధంలో, జోఫరు ప్రతి మానవ హృదయం యొక్క కేకను ఇలా ప్రకటించాడు, "దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళముకంటె లోతుగా నున్నది, నీవేమి యెరుగుదువు?" (యోబు 11:7, 8).
జాన్ వెస్లీ జోడిస్తూ ఇలా చెప్పెను. "ఒక మనిషిని అర్ధం చేసుకోగలిగే పురుగును నాకు చూపించండి. అప్పుడు త్రియేక దేవుణ్ణి అర్ధం చేసుకోగల వ్యక్తిని నేను మీకు చూపిస్తాను!"
దేవుని గూర్చిన అధ్యయనం పోటీ లేనిది ఏ మానవుడైనా సంప్రదించడానికి లేదా ఆలోచించటానికి ప్రయత్నించగల అత్యున్నత అంశము. దేవుడు తనను తాను నిత్యుడు మరియు సర్వ శక్తిమంతుడు, అంతర్యామి మరియు జ్ఞాని అని నిర్వచించుకున్నందున, ఈ అధ్యయన రంగం మిగతా వాటి కంటే లోతైనదిగా, విస్తృతమైనదిగా మరియు విశాలమైనదిగా ఉంది.
"ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి" (యెషయా 55:9). మన బలహీనమైన కాళ్ళతో నక్షత్రాల పైకి దూకడం ఎంత కష్టమో, పరిమితమైన మానవ మనస్సులు శాశ్వతమైన దేవుని గురించి ప్రతిదీ పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. అందువల్ల, ఆయన వ్యక్తిని చుట్టుకొనియున్న ఈ మర్మాన్ని పెద్ద ఎత్తున చెప్పులు లేని కాళ్ళుతో కూడిన భక్తితో మరియు లోతైన వినయంతో మనం సంప్రదించాలి.
మోషే మాదిరిగానే, అతను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, "నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము” కాబట్టి మన చెప్పులు విడవాలి (నిర్గమకాండము 3:5) మన ముందస్తు ఆలోచనలు, అభిప్రాయాలు మరియు సంఘములో పొందిన సరైన అవగాహన లేని శిక్షణను పక్కన పెట్టడం ద్వారా, మనం నేరుగా దేవుని వాక్యానికి వెళ్లి తన గురించి వెల్లడించడానికి ఆయన ఎంచుకున్న వాటిని మనం నేర్చుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మాత్రమే దేవునిని పూర్తిగా అర్థం చేసుకోగలడు, కాబట్టి చాలా శ్రద్ధగల పరిశోధనల తరువాత కూడా, మనకు ఇంకా జవాబు లేని కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు, అవి నిత్యత్వమంతటా కూడా ఫలవంతమైన అధ్యయన క్షేత్రంగా నిరూపించబడతాయి.
2. ఒక పెద్ద సమస్య
“కానీ అగండి" అని ఎవరో చెప్పారు. "ఒకే దేవుడు ఉన్నాడని బైబిల్ బోధిస్తే, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉంటాడు?" ఒకే దేవుడు ఉన్నాడని లేఖనం నిస్సందేహంగా ప్రకటిస్తుంది. 3,000 సంవత్సరాలకు పైగా, యూదులు ద్వితీయోపదేశకాండము 6:4 ను తమ నోటితో స్మరణ చేశారు. "ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహెూవా అద్వితీయుడగు యెహోవా.” ఈ పవిత్రమైన భాగాన్ని షెమా అని పిలుస్తారు. (హెబ్రీ భాషలో దాని మొదటి పదానికి అనుగుణంగా పేరు పెట్టబడింది) మరియు ఇది చాలా గౌరవంగా ఉంచబడింది మరియు శతాబ్దాలుగా భక్తులైన యూదులచే కంఠస్థం చేయబడింది.
తన గురించి దేవుని సాక్ష్యాన్ని యెషయా నమోదు చేశాడు. "ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను" (యెషయా 44:6, 8).సు "ఏకైక నిజమైన దేవుడు" గురించి కూడా బోధించాడు. (యోహాను 17:3) మరియు పౌలు ఇలా వ్రాశాడు, “దేవుడొక్కడే,” ( 2:5).
చాలా మంది విశ్వాసులు ఈ ప్రధాన సత్యంతో ఏకీభవిస్తుండగా, సంఘ చరిత్ర అంతటా దాని లోతైన చిక్కులపై తీవ్ర చర్చ జరిగింది. మూడు వేర్వేరు పేర్లు ఉన్న వ్యక్తి ఉన్నాడని దీని అర్ధమా? లేదా ఒక వ్యక్తిగా మర్మమైన రీతిలో రూపాంతరం పొందిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఉన్నారా? యేసు కేవలం మంచి మనిషిగా, మనలను విమోచించడానికి వచ్చిన సృష్టింపబడిన వ్యక్తా, మరియు తండ్రి మాత్రమే దేవుడా? మరికొందరు తండ్రి మరియు కుమారుడు నిజంగా దేవుడు అని, కాని పరిశుద్ధాత్మ అనేది వారి అనుకున్నది జరిగించే వ్యక్తిత్వం లేని శక్తి మాత్రమే అని నమ్ముతారు. ఈ ప్రతి విరుద్ధమైన ఆలోచనలు దాని నమ్మకమైన అనుచరులను ఆకర్షించాయి. ఈ అభిప్రాయాల ఆధారాన్ని పరిశీలిద్దాం మరియు వాటిని బైబిల్ తో పోల్చి చూద్దాం.
3. యేసు మాత్రమేనా?
3 వ శతాబ్దంలో, రోమాలో నివసిస్తున్న లిబియా యాజకుడు సబెలియస్, దేవుడు వేర్వేరు బిరుదులతో లేదా పేర్లతో ఉన్న ఒకే వ్యక్తి అని బోధించాడు-దీనిని మోడలిజం (త్రియేక వేదసిద్ధాంతము) అని పిలుస్తారు. ఆ విధంగా, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఆ యా సమయంలో మనిషితో ఎలా సంభాషించాలనుకుంటున్నారో అన్నదానిని బట్టి దేవుడు ధరించే విభిన్న పేర్లు లేదా బిరుదులను సూచిస్తారు. ఇది ఘన, ద్రవ లేదా వాయువు రూపాన్ని తీసుకోగల నీటికి సారూప్యంగా ఉంటుంది.
అయితే, అవి ఒక్క వ్యక్తి పోషించిన మూడు పాత్రలు కాదు. సంఘం సబెలియస్ ఆలోచనలను బైబిల్ బోధకు విరుద్ధంగా గుర్తించింది మరియు అతను త్వరలోనే బహిష్కరించబడ్డాడు. అయినప్పటికీ “ఏకత్వం” లేదా “యేసు మాత్రమే" సిద్ధాంతం అని పిలువబడే వాటిలో ఆయనకు ఇప్పటికీ అనుచరులు ఉన్నారు. యేసు మాత్రమే అనే బోధ యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే అని కాదు, తండ్రి మరియు పరిశుద్దాత్మ కూడా అని పేర్కొన్నది. యెషయా 9:6 దీనిలో మెస్సీయాను (లేదా వాగ్దానం చేసిన కుమారుని) "నిత్యుడగు తండ్రి" అని పిలుస్తారు. దీనిని ఈ నమ్మకానికి బైబిల్ మద్దతును అందించడానికి ఉపయోగిస్తారు.
ఏదేమైనా, ఏకత్వ సిద్ధాంతం, ఆధ్యాత్మిక అంధకారంతో పట్టుబడుతున్న ప్రపంచానికి తండ్రి అయిన దేవుని నిజమైన స్వభావాన్ని వెల్లడించడానికి కుమారుడు భూమ్మీదికి వచ్చాడనే విషయాన్ని విస్మరిస్తుంది. యేసు గెత్సెమనేలో తన తండ్రికి ఇలా ప్రార్థించాడు, "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని" (యోహాను 17:5, 6). యేసు మాత్రమే తండ్రిని బయలుపరచగలడు, ఎందుకనగా ఆయన తండ్రి యొక్క స్పష్టమైన స్వరూపం (లూకా 10:22, హెబ్రీయులకు 1:3).
ఆ విధంగా శిష్యులు తండ్రిని మాకు కనబరచుమని క్రీస్తును అడిగినప్పుడు, "నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు" అని ఆయన వారితో చెప్పెను (యోహాను 14:9). యేసు తండ్రి స్వభావానికి ఎంతగా అద్దం పట్టాడంటే, ఆయన తండ్రిని సంపూర్ణంగా ప్రతిబింబించాడు. అందుకే "నిత్యుడగు తండ్రి" అనే బిరుదు లేదా పేరు ఆయనకున్నది. యేసును నిత్యుడగు తండ్రి అని పిలవడానికి మరొక కారణం ఏమిటంటే. ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదీ క్రీస్తు ద్వారా సృష్టించబడింది. కాబట్టి చాలా నిజమైన అర్ధంలో, యేసు మన తండ్రి (హెబ్రీయులకు 1:2, 1:3).
యేసు తండ్రి అని పిలువబడిన ఏకైక ప్రదేశం యెషయా 9:6. యేసు తనను తాను మనుష్యకుమారుడు, మన సోదరుడు, మన గొర్రెల కాపరి, మన స్నేహితుడు మరియు మన ప్రధాన యాజకుడు అని కూడా పిలుచుకున్నాడని గుర్తుంచుకోండి. ఒకే లేఖన వచనంపై సిద్ధాంతాన్ని స్థాపించడమన్నది ఒకే కంచె కర్ర పైన నిరాధారంగా ఇల్లు కట్టుకోవడమంత మూర్ఖత్వం. బైబిల్ శారీరకంగా లేదా భౌతికంగా తండ్రి మరియు కుమారుడిని వేరు చేస్తుంది. క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు, ఆయన పరలోకంలో ఉన్న తన తండ్రిని ప్రస్తావించాడు. "పరలోకమందున్న నా తండ్రి" (మత్తయి. 10:32), ఆయన ఎల్లప్పుడూ తన ప్రార్ధనలను పరలోకం వైపు తన తండ్రికి నిర్దేశించాడు మరియు తండ్రిలోనే తన వ్యక్తిగత సంకల్పం లేదా చిత్తం ఉందని చెప్పాడు. "తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము, అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్ధించెను” (లూకా 22:43). "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను" (లూకా 23:46). ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత, ఆయన "దేవుని కుడి పార్శ్వమున” కెక్కిపోయెను (రోమీయులకు 8:34). ఇది తండ్రికి ప్రత్యేక ఉనికి లేదా సన్నిధి ఉన్నదని సూచిస్తుంది.
వాస్తవానికి, యేసు 80 సార్లు కంటే ఎక్కువ తాను తండ్రి కాదని చెప్పాడు. ఎల్లప్పుడూ ఒకే ఉద్దేశ్యం మరియు మూలం కలిగి ఉండగా, యేసు మరియు తండ్రి స్పష్టంగా వేరువేరు విభిన్న వ్యక్తులు. మరియు ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో, తండ్రి పరలోకం నుండి యేసుతో మాట్లాడాడు. “మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను" (మత్తయి 3:17). యేసు మరియు తండ్రి గాని ఇద్దరు వేర్వేరు వ్యక్తులై యుండాలి, లేదా యేసు నిపుణుడైన వెంట్రిలోక్విస్ట్ (తన తండ్రి మాటను తన నోటిలో పలికించినవాడై) యుండాలి.
4. యేసు సంపూర్ణముగా దేవుడేనా?
మ రొక సమూహం వారు యేసు నిత్యుడగు దేవుని లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాడా అని ప్రశ్నించారు. వారు 4వ శతాబ్దపు అలెగ్జాండ్రియన్ యాజకుడుడైన ఏరియస్ నుండి వచ్చారు, అతను దేవునిపై భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. మరేదైనా చేయడానికి ముందు, దేవుడు తండ్రితో సమానం కాని, సహనిత్యత్వం లేని కుమారుణ్ణి సృష్టించాడని బోధించాడు. ఏరియనిజం (ఏరియన్లవాదం) అని పిలువబడే ఈ ఆలోచన ప్రకారం, యేసుక్రీస్తు ప్రకృతికి అతీతమైన జీవి, కానీ ఆయన పూర్తిగా మానవుడు లేదా పూర్తిగా దైవం కాదు. మరికొందరు ఈ సిద్ధాంతం యొక్క అంతగా పరిపక్వంకాని సిద్ధాంతాన్ని స్వీకరిస్తారు. కాలం ప్రారంభంలో, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతో అంతరిక్ష సంబంధమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడని మరియు యేసు ఉత్పత్తి అని భావిస్తారు. “మీరు ఆయనను కుమారుడు అని ఎలా పిలుస్తారు?" అని వారు వాదిస్తారు.
ఏదేమైనా, ఈ భావనలు క్రొత్త నిబంధన యొక్క బోధనకు పూర్తిగా విరుద్ధం, దీనిలో యేసు నిత్యుడగు సృష్టికర్తగా వెల్లడయ్యాడు, సృష్టించబడిన జీవిగా కాదు (యోహాను 1:1-4). మనము దేవుని లేఖన గ్రంథ నిర్వచనాలను యేసు బైబిల్ చరిత్రతో పోల్చినప్పుడు, యెహోవా దేవుని లక్షణాలు యేసుకు కూడా ఆపాదించబడ్డాయి. ఈ శక్తివంతమైన ఉదాహరణలను గమనించండి :
ఆయన (యేసు) స్వయం ప్రతిపత్తి గలవాడు (తనకు తానుగా ఉనికి ఉన్నవాడు) (యోహాను 1:1-4, 14:6), దేవుడు మాత్రమే స్వయం ప్రతిపత్తి గలవాడు (కీర్తన 90:2).
భూత . యేసు తనను తాను నిత్యుడుగా నిర్వచించుకున్నాడు. "అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు" (ప్రకటన 1:8) ఆయనే నిత్యజీవము మరియు ఆయనయందు నిత్యజీవమున్నది (1 ລ້ 5:11, 12, 20).
1:3). . ఆయన సర్వశక్తిమంతుడు (ప్రకటన 1:8). ఆయన సమస్తమును సృష్టించాడు (యోహాను "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” (ఆదికాండము 1:1). “ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి. సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను" (కొలొస్సయులకు 1:16).
తండ్రి సహితము యేసును దేవుడు అని పిలిచెను. "తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, నీ రాజదండము న్యాయార్థమయినది" (హెబ్రీయులకు 1:8).
యేసు పాపాన్ని క్షమించలడు (లూకా 5:20,21), దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగడని బైబిల్ చెప్పుచున్నది (໖ 43:25).
పది ఆజ్ఞల ప్రకారం సర్వశక్తిమంతునికి (సర్వాధికారియైన దేవునికి) మాత్రమే ప్రత్యేకించబడిన ఆరాధనను యేసు అంగీకరించాడు (మత్తయి 14:33). "వారు ... త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా (ఆరాధించగా)” (మత్తయి 28:8, 9). తిరిగి లేచిన రక్షకుడిని చూసిన తరువాత, మారుమనస్సు నొందిన సంశయవాది తోమా. "నా ప్రభువా, నా దేవా!" అని ఆయనను ఒప్పుకొనెను (యోహాను 20:26-29)
దేవదూతలు కూడా యేసును ఆరాధిస్తారు. “మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము (ఆరాధన) చేయవలెనని చెప్పుచున్నాడు” (హెబ్రీయులకు 1:6).
. నరుని హృదయపు ఆలోచనలు దేవునికి మాత్రమే ఎరుగునని లేఖనాలు బోధిస్తున్నాయి (1 రాజులు 8:39). అయినప్పటికీ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు స్థిరంగా ఎరిగియున్నాడు. ఎందుకనగా "ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు" (యోహాను 2:25). "నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను” ( 1:48).
ఆత్మ ద్వారా, యేసు సర్వాంతర్యామియై (సర్వమును వ్యాపించువాడునై యున్నాడు. "ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను" (మత్తయి 28:20). "నేను నీకు తోడైయున్నాను. నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నది” (అపొస్తలుల కార్యములు 18:10).
ఆయనకు జీవము దయచేసే శక్తి ఉన్నది, మరియు తనకు తానుగానే పునరుత్థానుడయ్యాడు. “ఎవడును నా ప్రాణము తీసికొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు" (యోహాను 10:18). "పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును" (యోహాను 11:25).
అందువల్ల, దేవుని ప్రాధమిక నిర్వచనాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, మరియు యేసు ఆ నిర్వచనాలలో ప్రతిదానికి సరిపోయేటట్లు చూడటం ద్వారా, యేసు నిత్యుడగు దేవుడై యుండాలి.
5. ఆయన శత్రువులు ఎరిగియుండిరి
యే సు శత్రువులు కూడా తండ్రి దేవునితో సమానత్వం గురించి 0 ఆయన వాదనను అర్థం చేసుకున్నారు మరియు గుర్తించారు. "నేనును తండ్రియును ఏకమై యున్నాము” అని ఆయన ధైర్యంగా ప్రకటించినప్పుడు, యూదా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు ఆయనను చంపడానికి ప్రయత్నించారు. యేసు తనను తాను దేవుడనని చెప్పుకుంటున్నాడని వారు నిస్సందేహంగా అర్థం చేసుకున్నారు. “అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి” (యోహాను 10:33).
మండుచున్న పొద వద్ద ఉపయోగించిన యెహోవా అనే స్వయం ప్రతిపత్తి పేరును ఆయన తనకు ఆపాదించుకున్నప్పుడు యూదులు క్రీస్తు మీద రాళ్ళు రువ్వడానికి కూడా ప్రయత్నించారు. యేసు వారితో, “యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను" (యోహాను 8:58, 59).
“అయితే యేసు నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు. నేనును చేయుచున్నాను" అని చెప్పినప్పుడు యేసు దేవునితో సమానత్వం పొందాడని యూదులు అర్ధం చేసుకున్నారు. "దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి” (యోహాను 5:17, 18).
ఈ భాగాలను చదవడం ద్వారా కేవలం మూడు ముగింపులకు మాత్రమే ఎవరైనా రాగలరు. మొదటిది, ఈ దారుణమైన ప్రకటనలు చేసినప్పుడు యేసు పిచ్చివాడై యుండాలి. రెండవది, ఆయన అబద్ధికుడై యుండాలి. ఇవి ఆమోదయోగ్యం కాని ఎంపికలు. మూడవ అవకాశం ఏమిటంటే ఆయన ఒక శ్రేష్ఠమైన సత్యాన్ని పలికాడు. సిలువపై క్రీస్తు ప్రత్యామ్నాయ మరణాన్ని అంగీకరించిన క్రైస్తవునికి, మూడవ ఎంపిక ఒక్కటే ఆమోదయోగ్యమైనది. లేకపోతే, ఒక అబద్ధికుడు లేదా భ్రమపడే వ్యక్తి మన రక్షకుడుగా ఉండేంత నీతిమంతుడు కాలేడు.
6. మధ్యయుగ లోపమా?
వుని గురించి క్రైస్తవ దృక్పథాన్ని "త్రిత్వము" అని పిలుస్తారు విభిన్న వ్యక్తులు ఉన్నారని మరియు వారికి తండ్రి, కుమారుడు (యేసుక్రీస్తు) మరియు పరిశుద్ధాత్మ అనే పేర్లు ఉన్నాయని ఈ ప్రజాదరణ పొందిన నమ్మకం బోధిస్తుంది. ఒక్కొక్కరికి అసలైన, అద్వితీయ, మరియు స్వాభావికంగా అపరిమితమైన జీవం ఉంటుంది. వారందరూ సమానంగా దేవుడైయుండి స్వభావంలో, గుణంలో మరియు ఉద్దేశ్యంలో ఏకమైయుండి ఒకరితో నొకరు ఏకీభవిస్తారు. వారు ముగ్గురు "దేవతామూర్తులు" కారు, కానీ ముగ్గురు విభిన్న వ్యక్తుల కలయికలో ఉన్న ఒకే దేవుడు.
కొంతమంది త్రిత్వవాదాన్ని మత విరోధమైన సిద్ధాంతముగా సూచించారు, ఎందుకంటే మధ్యయుగ సంఘము దీనిని మొదట ప్రవేశపెట్టిన అపరాధి అని వారు పేర్కొన్నారు. వాస్తవానికి, క్యాథలిక్ సంఘం రూపొందించిన త్రిత్వము నుండి దూరం కావడానికి, 19వ శతాబ్దానికి చెందిన చాలా మంది ప్రొటెస్టంట్ నాయకులు త్రియేక దేవునిని సూచించేటప్పుడు "గాడ్ హెడ్ (దేవత్వము)” అనే బైబిల్ పదానికి ప్రాధాన్యం చూపడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు.
ఏదేమైనా, మతభ్రష్ట సంఘం త్రిత్వమును లేదా విషయానికొస్తే మరే ఇతర సిద్ధాంతాన్నైనా నమ్ముతున్నంత మాత్రాన, దానిని బైబిలువేతర సిద్ధాంతముగా చేయదు. దీనికి వ్యతిరేకమైనది కూడా నిజం. ప్రారంభ సంఘ నాయకులలో కొందరు ఒక పదవిని లేదా స్థానాన్ని సమర్థించినంత మాత్రాన అది ఖచ్చితమైనది కాదు. అపొస్తలులు కూడా యేసు మొదటి రాకడ యొక్క స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సిద్ధాంతపరమైన ప్రామాణికత బైబిల్ అధికారం మీద ఆధారపడి ఉండాలే గాని దానిని సమర్థించే వారి మీదో లేదా తిరస్కరించే వారి మీదో ఆధారపడి ఉండకూడదు.
పాత నిబంధన క్రైస్తవ సంఘ ఉనికికి చాలా కాలం ముందు వ్రాయబడింది. మతభ్రష్ట సంఘమైనా లేదా నిజమైన సంఘమైనా, మరియు దేవత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఇది బోధిస్తుంది. యెషయా గ్రంథములో, క్రొత్త నిబంధనలో విమోచకుడైన యేసుక్రీస్తు (గలతీయులకు 4:4, 5), తన విమోచన లక్ష్యసాధనకై ఆయనను పంపించుటకు "ప్రభువగు యెహెూవాయు ఆయన ఆత్మయు" బాధ్యులని ప్రకటించాడు (యెషయా 48:16, 17).
"ట్రినిటి (త్రిత్వము)" (ట్రినిటాస్ అనే లాటిన్ పదం నుండి వస్తుంది మరియు "త్రీనెస్ (త్రైపాక్షికత్వము)" అని దీని అర్ధం), ఈ మాట బైబిల్లో కనుగొనబడనందున, త్రియేక దేవుడు అనే భావన సరైనది కాదని కొందరు అనుకుంటారు. ఏదేమైనా, వెయ్యి సంవత్సరాలు అనే మాటకు "మిల్లెనియమ్ (సహస్రాబ్ది)" అనే పదం ప్రకటన 20లో కనిపించనప్పటికీ. యేసు తిరిగి వచ్చిన తరువాత భూమి యొక్క 1,000 సంవత్సరాల విశ్రాంతిని వివరించడానికి మనము దీనిని ఉపయోగిస్తాము. ఒక బైబిల్ బోధ ఏమిటో అని స్పష్టంగా నిర్వచించడానికి అదనపు బైబిల్ పదాన్ని ఉపయోగించినంత మాత్రాన ఆ బోధ ఏ విధంగానూ సత్యానికి తక్కువ అయిపోదు. ఇది త్రిత్వమునకే గాని, రెండవ రాకడకే గాని, పరిశీలనా తీర్పుకే గాని మరియు క్లుప్తంగా అన్ని అంశాలతో కూడిన ఇతర సిద్ధాంతాలకు కూడా వర్తిస్తుంది.
7. ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు
దేవుని పేర్లు ఆయన స్వభావం యొక్క లక్షణాలను వెల్లడిస్తాయి. ఒక వ్యక్తి యొక్క స్వభావమును వివరించడానికి వివిధ పేర్లను ఉపయోగించడం దేవునికి చాలాకాలంగా ఉన్న అలవాటు. తన తండ్రి ఆశీర్వాదం తన సోదరుడు ఏశావు నుండి దొంగిలించడానికి మోసమును ప్రయోగించినప్పుడు యాకోబు తన పేరుకు “మోసగాడు” అని అర్థాన్నిచ్చే పేరును సంపాదించాడు (ఆదికాండము 27:35, 36) తన మారుమనస్సు నందు, యాకోబు దేవదూతతో పొరాడి దేవుని ఆశీర్వాదం కొరకు పట్టుబట్టాడు. అప్పుడు అతని పేరు “ఇశ్రాయేలు” గా మార్చబడింది. అనగా "దేవునితో ఒక యువరాజు" అని అర్థము (ఆదికాండము 32:26-28).
అదే విధంగా, ఆదికాండము మరియు ఇతర చోట్ల కనిపించే దేవుని పేర్లు మన సృష్టికర్త గురించి ఆయన పరిమాణాలను చెప్పుచున్నవి. "దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము" (ఆదికాండము 1:26). దేవునికి ఇక్కడ వాడబడిన హెబ్రీ పదం ఎలోహిమ్. ఇది బహువచన నామవాచకం, ఇది పాత నిబంధనలో 2,700 కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించబడింది. దీనర్థం దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన రచయితలు దేవునిని వర్ణించినప్పుడు "ఎల్" అనే ఏకవచనం కంటే బహువచనమైన ఎలోహిమ్ను 10 రెట్లు ఎక్కువగా ఉపయోగించటానికి ఇష్టపడ్డారు. పాత నిబంధనలోని దానియేలు గ్రంథంలో కూడా, తండ్రి మరియు కుమారుని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూస్తాము. "రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను" (దానియేలు 7:13). మనుష్యకుమారుడు, యేసు, మహావృద్ధుని (స్పష్టంగా, తండ్రి అయిన దేవుని) సముఖమునకు తేబడుట మనం చూస్తాం.
క్రొత్త నిబంధన రచనలు ముగ్గురు ఏకమైన, సంపూర్ణ దైవిక వ్యక్తులతో ఉన్న ఒక్క దేవుడు అనే ఈ భావనతో నిండియున్నాయి.. ముగ్గురు దైవిక వ్యక్తులు ఉన్నారని అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు "శరీర మొక్కటే. ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు" (ఎఫెసీయులకు 4:4-6).
పౌలు తరచుగా దేవుని యొక్క ముగ్గురు వేర్వేరు వ్యక్తులను సూచించాడు. "ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక” (2 కొరింధీయులకు 13:14) "నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును" (హెబ్రీయులకు 9:14).
దేవుని యొక్క ముగ్గురు వ్యక్తులను పరిచయం చేస్తూ ప్రకటన గ్రంధము ప్రారంభమవుతుంది. "ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మల నుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను" (ລ້ 1:4-6).
అదనంగా, యేసు బాప్తిస్మము వద్ద ముగ్గురు విభిన్న వ్యక్తులను మనం స్పష్టంగా చూస్తాము. "యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలొ నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని' ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను" (ລ້ 3:16, 17).
దేవత్వములో యేసు మాత్రమే వ్యక్తి అయితే, "ఈయనే నా ప్రియ కుమారుడు" అని ప్రకటించిన స్వరము ఎక్కడ నుండి వచ్చింది? ఆయన తనను తాను పరలోకం నుండి స్వరంగా, ఆకాశం గుండా తేలియాడుతున్న పావురంగా, మరియు నది ఒడ్డున ఆయన శరీరంగా మూడు సమాన భాగాలుగా విభజించుకున్నాడా? లేదు. ఇది కేవలం పరిశుద్ధ పొగ మరియు అద్దాలతో కూడిన కుయుక్తి చర్య కాదు, కానీ త్రిత్వము యొక్క సత్యాన్ని వెల్లడించే రాజరిక పునఃసంయోగం. మరియు దీని పైన, ఈ ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్య అధికారం ద్వారానే మనం బాప్తిస్మం తీసుకోవడానికి నియమించబడ్డాము. "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు వారికి బోధించు" (మత్తయి 28:19, 20).
8. ఏకత్వమా లేక పరిమాణమా?
“దేవత్వములో ఉన్న వ్యక్తుల సంఖ్యకు సంబంధించిన చాలా గందరగోళం “ఒక్కటి లేదా ఏకము" అనే పదాన్ని సరళంగా అపార్ధం చేసుకోవడం నుండి ఉద్భవిస్తుంది. సరళంగా చెప్పాలంటే, బైబిల్లో "ఒక్కటి లేదా ఏకము" అనే మాట ఎల్లప్పుడూ సంఖ్యా పరిమాణానికి అర్ధం కాదు. లేఖనాన్ని బట్టి, "ఒక్కటి" అనే మాట తరచుగా ఐక్యతను లేదా ఏకత్వమును సూచిస్తుంది.
ఈ సూత్రం లేఖనంలో చాలా ప్రారంభంలో స్థాపించబడింది. "కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైయుందురు" (ఆదికాండము 2:24). ఇక్కడ "ఏక శరీరము" అనగా వివాహితులు తమ పెళ్లి తర్వాత ఒక్క మనిషిగా కరిగించబడతారని కాదు, కానీ వారు ఒకే కుటుంబంలో ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలి. యేసు అపొస్తలులు ఒక్కటిగా లేదా ఏకముగా ఉండాలని ప్రార్థిస్తూ, "నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని" () 17:22, 23).
అని "మన దేవుడైన యెహెూవా అద్వితీయుడగు యెహోవా” మోషే చెప్పినప్పుడు, ఇశ్రాయేలు బహుదేవతలతో చుట్టుముట్టబడిందని, అనవసరమైన గొడవలు మరియు శత్రుత్వాలలో నిరంతరం నిమగ్నమైన అనేక మంది దేవతలను ఆరాధించేవారని మనం మన మనస్సులో ఉంచుకోవాలి (ద్వితీయోపదేశకాండము 6:4), అయితే సృష్టించిన దేవుడు వారి జీవులను రక్షించడం మరియు స్థిరముగా నడిపించడం అనే వారి లక్ష్యసాధనలో సంపూర్ణంగా ఏకమైన మూడు వేర్వేరు వ్యక్తులుగా కూడి యున్నారు. తండ్రి మరియు కుమారుడు ఇద్దరి చిత్తాన్ని ఆత్మ అమలు చేస్తున్నప్పుడు, అది ఆయన చిత్తం కూడా.
ఇంగ్లీష్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ప్రకారము, “పరలోకములో దాఖలా నమోదు చేయువారు ముగ్గురు, అనగా తండ్రియు, వాక్యమును (యేసుక్రీస్తు), పరిశుద్ధాత్మయును, ఈ ముగ్గురు ఏకమై యున్నారు” (1 యోహాను 5:7). ఒక్క దేవుడు ("ఆయన”) కూడా, మరియు సమానంగా, "వారు" అని గ్రహించడం మెదడుకు మేత లేదా వ్యాయామం. మూడు ఏక దారాలతో అల్లిన ఒక తాడు వలె, తండ్రి, కుమారుడు మరియు ఆత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవునిని నిర్మిస్తారు.
9. ప్రకృతిలో వ్యక్తీకరించబడిన దేవుడు
ప్రపంచంలో దేవుణ్ణి తగినంతగా వివరించేది ఏదీ ఈ లేనప్పటికీ, "జగదుత్పత్తి మొదలుకొని ఆయన అదృశ్య లక్షణములు" "ఆయన నిత్యశక్తియు దేవత్వమును" అర్ధం చేసుకోవడంలో మనకు సహాయపడతాయని పౌలు ప్రకటించాడు. (రోమీయులకు 1:20), దేవుడు ఇద్దరు అదృశ్య వ్యక్తుల (తండ్రి మరియు ఆత్మల) యొక్కయు మరియు ఒక దృశ్య వ్యక్తి (యేసు) యొక్క 'త్రి-యేకత్వము" అనే సత్యం సృష్టికార్యంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
విశ్వం మూడు నిర్మాణాలతో కూడి ఉంది ఆకాశవిశాలం, పదార్థం మరియు సమయం. ఈ మూడింటిలో పదార్ధం మాత్రమే కనిపిస్తుంది. ఆకాశాన్ని రూపొందించడానికి విశాలానికి పొడవు, ఎత్తు మరియు వెడల్పు అవసరం. ప్రతి పరిమాణం దానిలో వేరుగా మరియు విభిన్నంగా ఉంటుంది, అయినప్పటికీ మూడు రూపాల విశాలం-ఎత్తును తొలగిస్తే, ఇక ఆకాశవిశాలం ఉండదు. సమయం కూడా వర్తమాన భూత భవిష్యత్కాలాల యొక్క త్రియేకత్వము.
రెండు అదృశ్యమైనవి (గతము (భూతకాలము) మరియు భవిష్యత్తు), మరియు ఒకటి దృశ్యమైనది (కనిపించేది) (వర్తమానం). ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనది మరియు విభిన్నమైనది. అలాగే సమయం ఉనికిలో ఉండటానికి అవసరమైనవి. మనిషి కూడా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక భాగాలను కలిగి ఉన్న "త్రియేకత్వము”. మళ్ళీ, రెండు అదృశ్యమైనవి (మానసిక మరియు ఆధ్యాత్మిక భాగాలు) మరియు ఒకటి దృశ్యమైనది (కనిపించేది) (శారీరక భాగం). కణాలు సమస్త జీవులకు ప్రాధమిక నిర్మాణ భాగాలుగా ఉంటాయి. సమస్త సహజ సంబంధమైన జీవితాలు మూడు ప్రాధమిక భాగాలను కలిగి ఉన్న కణాల నుండి తయారవుతాయి బాహ్య గోడ, సైటోప్లాజమ్ (కణంలో నిండి ఉండు ప్రోటోప్లాజం లేదా జీవపదార్ధం) మరియు కేంద్రకం (గ్రుడ్డు పైని షెల్ (గుల్ల), గ్రుడ్డు తెలుపు మరియు గ్రుడ్డులో ఉండే పచ్చ సొన వంటివి). ఏది తీసివేసినా, కణం చనిపోతుంది.
ఈ ప్రతి ఉదాహరణలో, ఏదైనా ఒక భాగాన్ని తొలగించడం అనేది మొత్తం మరణానికి దారితీస్తుంది. అదే విధంగా, దేవత్వములో ముగ్గురు విభిన్న వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ప్రతి ఒక్కరూ దేవుడే (ఎఫెసీయులకు 4:6, తీతుకు 2:13, అపొస్తలుల కార్యములు 5:3,4), అయినప్పటికీ ఒక్క దేవుడే ఉన్నాడు. ఒక వ్యక్తిని తొలగించడం మొత్తం ఏకత్వమును నాశనం చేస్తుంది.
సువార్త కథనం కూడా త్రీ లేదా మూడు సంఖ్య యొక్క పరస్పర సహకారాన్ని వివరిస్తుంది. ప్రత్యక్ష గుడారానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి : ప్రాంగణము లేదా ఆవరణము, పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. రక్షణకు మూడు దశలు ఉన్నాయి. నీతిమంతులుగా తీర్చబడుట, పవిత్రీకరణ మరియు మహిమ ప్రవేశం. యెషయా 6:3లో, దేవుని సింహాసనం చుట్టూ ఉన్న దేవదూతలు "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని మూడుసార్లు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి- ఒకసారి తండ్రి కొరకు, ఒకసారి కుమారుడి కొరకు, మరియు ఒకసారి పరిశుద్ధాత్మ కొరకు,
10. తప్పుగా అర్థము చేసుకునేందుకు మూలము
యే" సును "దేవుని కంటే తక్కువ"గా చిత్రీకరించడానికి త్రిత్వమును తిరస్కరించేవారు ఉపయోగించిన దాదాపు అన్ని లేఖనాలు మానవావతారాన్ని అర్ధం చేసుకోవడంలో ప్రాధమిక వైఫల్యం నుండి ఉద్భవించాయి. యేసు, కుమారుడైన దేవుడు, ఆయన భూమికి వచ్చినప్పుడు తన దైవత్వం యొక్క పూర్తి కోణాన్ని పక్కన పెట్టాడు లేదా కప్పుకున్నాడు. ఆయన మనుష్యులలో దేవుడిగా ఇంకెలా జీవించగలడు?
"దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను" (రోమీయులకు 8:4).
“మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను" (2 కొరింధీయులకు 8:9).
נגס "క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను" (ఫిలిప్పీయులకు 2:5-8).
ఆయన మానవ అవతారానికి ముందు మరియు తరువాత. యేసు మరలా మరలా మసకబారని దైవిక మహిమతో ప్రకాశిస్తున్నాడని కూడా మనం స్పష్టంగా చూస్తాము. "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” (యోహాను 17:5). " మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము" (హెబ్రీయులకు 2:9).
దేవుడు కుమారుడు భూమికి వచ్చినప్పుడు తన మహిమను కప్పి ఉంచకపోతే, ఆయన మాదిరి నుండి చాలా తక్కువ నేర్చుకున్న మనుష్యులు ఆయన అద్భుతమైన సన్నిధిని తట్టుకొని జీవించలేరు.
11. ఎవరి పైన ఎవరు?
ఇప్పుడు మనం కొంచెం లోతుగా పవిత్ర మైదానంలోకి వెళ్లాం. దేవుని రహస్య మర్మాలను మనము పరిశీలిస్తున్నప్పుడు, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన అధికారం యొక్క క్రమం ఉన్నట్లు మనము గమనిస్తాము. ఈ ముగ్గురు గుణాలు మరియు లక్షణాలలో ఒక్కటిగా, మరియు బలము మరియు మహిమలో సమానంగా ఉన్నప్పటికీ, తండ్రిదే అత్యున్నత అధికారం (పై స్థాయి)గా గుర్తించబడిందని గుర్తుంచుకోండి. “మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు" (1 కొరింథీయులకు 3:23). "క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను" (1 కొరింధీయులకు 11:3), కుమారుడు తన మహిమ, బలము, సింహసనము మరియు ప్రత్యేక హక్కులను తండ్రి నుండి న్యాయాధిపతిగా నిరంతరం పొందుతాడు (యోహాను 3:35, యోహాను 5:22). నిజమే, కుమారుని "అనుగ్రహించినది" తండ్రియైన దేవుడు. వాస్తవానికి, అది తప్పు కాకపోవచ్చు. యేసును లేదా ఆత్మను ప్రార్ధించమని మనకు ఎప్పుడూ చెప్పబడలేదు- బదులుగా కుమారుని పేరిట తండ్రికి ప్రార్థించాలి. అయినప్పటికీ తండ్రికి అత్యున్నత అధికారం ఉన్నట్లు అనిపించినందున, అది యేసు మరియు ఆత్మ యొక్క దైవత్వమును ఏ విధంగానూ తగ్గించలేదు. అది ఒక చిన్న స్థాయి సైనికాధికారి ఒక తక్కువ హెూదా ఉన్న వ్యక్తి కంటే సైనికుడి కంటేనే తక్కువ అని చెప్పడం లాంటిది.
దేవత్వము యొక్క ముగ్గురు సభ్యులలో, ప్రాముఖ్యత కొరకు, గుర్తింపు కొరకు పోటీపడటం లేదా అధికారంలో ఆనందించడం వంటివి మనం చూడలేము. బదులుగా, దీనికి సరిగ్గా వ్యతిరేకమైనదే నిజం. వాస్తవానికి, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఒకరినొకరు అధిగమించి మహిమపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. తండ్రి కుమారుని మహిమపరచాలని కోరుకుంటాడు. కుమారుడు తండ్రిని మహిమపరచడానికి జీవిస్తాడు. మరియు తండ్రి మరియు కుమారుని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ జీవిస్తాడు (యోహాను 17:1, 5, యోహాను 16:14, 13:31, 32).
12. స్నేహితుడైన వ్యక్తియా లేక శక్తియా?
తత్వమును గూర్చిన బోధకు అదనపు వక్రీకరణను పరిష్కరించకుండా ఈ శ్రేష్టమైన అంశాన్ని వదిలివేయడం పొరపాటు. నిజాయితీగల క్రైస్తవులలో మరొక తరగతి వారు, తండ్రి మరియు కుమారుడు నిజంగా విభిన్న వ్యక్తులు అయినప్పటికీ, వారు పరిశుద్ధాత్మను విశ్వ శక్తిగా లేదా సారముగా తండ్రి మరియు కుమారుని అనుకున్నది జరిగించే ఒక వ్యక్తిత్వం లేని శక్తి మాధ్యమం లేదా వాహకంగా మాత్రమే చూస్తారు.
పరిశుద్ధాత్మను దృశ్యమానం చేసుకోవడానికి మరియు నిర్వచించటానికి దేవత్వములోని కఠినతరమైన సభ్యుడుగా ఎందుకు కనబడుతున్నాడో అన్నదానిని బట్టి మనం అభినందించవచ్చు. కొన్నిసార్లు ఆయనను హెూలీ ఘోస్ట్ (పవిత్ర ఆత్మ) అని పిలుస్తారు. ఇది ప్రజల మనసుల్లో ఒక "భయానక" చిత్రం మెదిలేలా చేస్తుంది. లేఖనాలు ఆయనను వాయువు మరియు అగ్ని నుండి, పావురం, నీరు మరియు రక్షణ న్యాయవాది వరకు సమస్తముతో పోల్చాయి!
కానీ పరిశుద్ధాత్మ యొక్క వివిధ లక్షణాలను మనం పరిశీలించినప్పుడు, ఆయనకు ప్రత్యేకమైన మరియు విభిన్నమైన, తెలివైన, వ్యక్తిగత జీవి యొక్క అన్ని నిదర్శనాలు ఉన్నాయని మనం త్వరగా చూడవచ్చు.
పరిశుద్ధాత్మ నడిపించును మరియు మార్గనిర్దేశము చేయును. "అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును" (యోహాను 16:13), మ్యాప్ (పటము) లేదా జీపీయస్ (భూమిపై ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే మ్యాప్ వ్యవస్థ) మిమ్మల్ని నడిపిస్తాయనేది నిజం, కానీ ఎవరూ మ్యాప్‌ను "అతడు" అని వ్యక్తిని పిలిచినట్టు పిలవరు. "అది వచ్చినప్పుడు" అని యేసు చెప్పడం చాలా సులభం, కాని యేసు పరిశుద్ధాత్మను "ఆయన" అని 15 కంటే ఎక్కువసార్లు పిలిచాడు. తన సొంత స్వాభావిక శక్తిని వ్యక్తీకరించడానికి దేవుడు అది తన నుండి స్వతంత్రంగా వ్యవహరించు భావోద్వేగాలు, ఆలోచనలు మరియు సంభాషణను కలిగి ఉంటుంది అనేంతలా ఎందుకు చాలా ఇబ్బందులకు గురవుతాడు.
పరిశుద్ధాత్మ ఆదరణను కూడా కలుగజేయును. "నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును" (యోహాను 14:16). ఆదరణ నిమిత్తం కౌగిలించుకోవడం కోసం ఒక ఒంటరి పిల్లవాడు వ్యాక్యూమ్ క్లీనర్ దగ్గరకు పరిగెత్తడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు-తెలివైన జీవులు మాత్రమే ఆదరణ నిస్తారు. యేసు తన ఆరోహణమునకు ముందు, ఆయన వేరొక ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశాడు. పారాక్లేట్ అనేది గ్రీకు పదం, ఇది సలహాదారు, ఉపదేశకుడు, న్యాయవాది, సహాయకుడు, ఆదరణకర్త, మిత్రుడు మరియు మద్దతు వారుడు అనే అర్థాల నిస్తుంది (యోహాను 14:16, 17, 26, 15:26-27, 16:7-15). ఇవన్నీ సాధారణంగా ఒక వ్యక్తి లేదా స్నేహితునికి చెందిన లక్షణాలు. పరిశుద్ధాత్మ కేవలం దేవుని క్రియాశీల శక్తి అయితే, యోహాను 16:7, 8 అర్ధం లేనిది : "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు, నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును." యేసు ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ మరింత వ్యక్తిగతంగా ఉండునని ఈ వచనం నుండి స్పష్టంగా తెలుస్తుంది. పరిశుద్దాత్మ కేవలం శక్తి అయితే, యేసు వెళ్ళకపోతే ఆయన ఎందుకు రాలేడు అనేదానికి వివరణ లేదా తర్కం లేదు.
పరిశుద్ధాత్మ దుఃఖించును కూడా (ఎఫెసీయులకు 4:30). కార్లు చాలా ప్రత్యేక లక్షణాలు మరియు వివేచనలను కలిగి ఉంటాయి. కొన్ని సమయాల్లో, వాటికి "వ్యక్తిత్వం" ఉన్నట్లు కూడా అనిపించవచ్చు. కానీ మోటారు వాహనాలు దుఃఖించలేవు. పరిశుద్ధాత్మ వలె అవి మాట్లాడలేవు. "అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రధము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను" (అపొస్తలుల కార్యములు 8.29), సంభాషణను పునర్నిర్మించగల కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి, కానీ అవి ప్రేరేపిత ఆలోచనను సృష్టించలేవు. పవిత్ర లేఖనములు పరిశుద్దాత్మ చేత ప్రేరేపించబడి (దైవావేశము వలన కలిగెను) (2 పేతురు 1:21).
మనము ప్రకటన 1:4, 5లో, తండ్రి, ఆత్మ మరియు యేసుక్రీస్తు నుండి కృప మరియు సమాధానము కొరకు చేసే ప్రార్ధన కూడా చదువుతాము. మనం అడగాలి, యోహాను ఆత్మను దైవిక మేధస్సుగా భావించకపోతే తండ్రి మరియు కుమారుడి మధ్య ఆత్మను ఉంచేవాడా?
పరిశుద్ధాత్మ కేవలం ఏదో దైవిక శక్తి అయితే, కుమారునికి వ్యతిరేకంగా లేదా విరోధంగా మాట్లాడటం కంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా లేదా విరోధంగా దూషించడం మరింత ప్రమాదకరం ఎందుకు? "కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు" (మత్తయి 12:31, 32) నిర్వచనం ప్రకారం, దేవదూషణ అనగా "తిరస్కరణతో కూడిన క్రియ లేదా అపవిత్రమైన చర్య, దేవునికి వ్యతిరేకంగా లేదా విరోధంగా పలికే పలుకులు లేదా వ్రాత." ఈ సాధారణ మినహాయింపు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండాలి! పరిశుద్ధాత్మతో అబద్ధమాడటం అంటే దేవునితోనే అబద్దమాడటం అని పేతురు చెప్పినది కూడా ఇందుకే (అపొస్తలుల కార్యములు 5:3, 4);
పరిశుద్ధాత్మ సాక్షి కూడా కావచ్చు (హెబ్రీయులకు 10:15). ప్రపంచంలోని ఏ న్యాయస్థానంలోనైనా, వ్యక్తులను మాత్రమే సాక్షులు అని యిస్తారు. చివరగా, పరిశుద్ధాత్మ తన సొంత మనస్సు కలిగి ఉన్నాడని చెప్పబడింది (రోమీయులకు 8:27)
పరిశుద్దాత్మ కేవలం శక్తి కాదని, దేవత్వములోని మూడవ దైవిక వ్యక్తి అని మనం స్పష్టంగా చూడవచ్చు. ఆత్మ అయినప్పటికీ, ఆయన ఒక వ్యక్తి మరియు వ్యక్తి యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. మాట్లాడే, బోధించే, మార్గనిర్దేశం చేసే, ఎంపికలు చేసే, సాక్ష్యమిచ్చే, ఆదరించే, మరియు దుఃఖించే వ్యక్తిగా ఆత్మ స్పష్టంగా చిత్రీకరించబడెను. “ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక" (2 కొరింథీయులకు 13:14).
13. కల్వరి వద్ద ప్రేమ
యేక దేవుని గూర్చిన సత్యాన్ని సువార్తలో కూడా చూడవచ్చు. సారాంశంలో, మనము యోహానును పరిగణించినప్పుడు, తండ్రియైన దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని, మనం ఆత్మయైన దేవుని నుండి పుట్టడానికి ఆయన దేవుని కుమారుడైన దేవుని పంపించాడని చదువుతాం (యోహాను 3:8, 13, 16, 17)
“కానీ ముఖ్యంగా గొల్గొతా కొండపై త్రిత్వమును గూర్చిన సిద్ధాంతం అర్ధంతో భగ్గుమని ఒక క్రైస్తవ విభాగాల పోరాట అంశం కంటే ఎక్కువ అవుతుంది. భూమి యొక్క సృష్టికి ముందు, త్రియేక దేవుడు మనిషి యొక్క తిరుగుబాటు మరియు పతనం యొక్క సామర్థ్యాన్ని చర్చించాడు. దైవిక ముందస్తు జ్ఞానం యొక్క లెన్స్ (అద్దాల) ద్వారా, ప్రపంచంపై పాపం అత్యాచారం కలిగించే భీభత్సాన్ని ఆయన చూశాడు. అక్కడ, మనిషి రూపించబడటానికి ముందు. యేసు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మానవాళికి ప్రత్యామ్నాయంగా (వారికి బదులు స్థానంగా) మారాలని నిర్ణయించబడింది. యేసు "జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొట్టెపిల్ల" (ప్రకటన 13:8, 1 2 1:19, 20)
14. త్రిత్వములో చీలిక
ప రిగణించవలసిన మరో విషయం ఏమిటంటే, పాపము సృష్టికర్త నుండి వేరుచేస్తుంది (యెషయా (యెవ 59.2) మానవ జాతి యొక్క అపరాధములు దేవుని కుమారునిపై ఉంచబడెను (యెషయా 53:6). మన పాపాల కొరకైన బాధ ననుభవిస్తూ, యేసు సిలువపై వేలాడినప్పుడు, ఆయన తండ్రి మరియు ఆత్మతో శాశ్వతమైన సంబంధం చీలిపోవడంతో ఆయన శరీరంలోని ప్రతి నరము నలిగిపోతుంది. ఆవేదనతో ఆయన. "నా దేవా (తండ్రి కొరకు), నా దేవా (ఆత్మ కొరకు), నన్నెందుకు చెయ్యి విడిచితివని" బిగ్గరగా కేకవేసెను (మత్తయి 27:46). దేవత్వములో ఒక వ్యక్తి మాత్రమే ఉండి ఉంటే, యేసు హృదయం నుండి జీవితాన్ని గట్టిగా పిండి బయటకి తీయడానికి ఈ మనోవేదన కలిగించే బాధ ఉండేది కాదు.
విమోచన ప్రణాళికలో నిజమైన ప్రమాదం. మనిషిని కోల్పోవడమే కాకుండా, దేవత్వములో విచ్ఛిన్నం లేదా చీలికయై యున్నది. యేసు పాపం చేసి ఉంటే, ఆత్మతో మరియు తన తండ్రితో ఆయన విరుద్ధ-ప్రయోజనాల కొరకు పని చేసేవాడు. సర్వశక్తిగల మంచి సర్వశక్తిగల చెడు మీద పొరాడి ఓడేది. అప్పుడు మిగిలిన సృష్టికి ఏమి జరిగి ఉంటుంది? పతనంకాని విశ్వం ఎవరిని సరైనదిగా చూస్తుంది? ఒక్క పావం దేవునిని మరియు విశ్వమును విశ్వ గందరగోళంలోకి నెట్టేది, ఈ విపత్తు యొక్క పరిమాణాలు ఎంతో విస్మయమైనవి. అయినప్పటికీ దేవత్వము మనిషి యొక్క రక్షణ కొరకు ఈ విచ్ఛిన్న ప్రమాదాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇది దేవుని అద్భుతమైన ప్రేమ యొక్క లోతును తెలుపుతుంది.
15. ముగింపు
గస్టిన్, గొప్ప దైవదాసుడు, ఒకప్పుడు సముద్ర తీరాన అనడుస్తున్నప్పుడు త్రిత్వమును గూర్చిన సిద్ధాంతం గురించి చాలా కలవరపడ్డాడు. అతను ధ్యానం చేస్తున్నప్పుడు, సముద్రపు గవ్వ ఉన్న ఒక చిన్న పిల్లవాడు నీటి అంచు నుండి ముందుకు వెనుకకు పరిగెత్తుతూ, తన గవ్వను నీటితో నింపి, ఆపై ఇసుకలో ఒక పీత రంధ్రంలోకి పోయడం గమనించాడు. "బాబూ, నీవు ఏమి చేస్తున్నావు?" అని అగస్టిన్ అడిగాడు
"ఆ." "నేను ఈ రంధ్రంలో సముద్రం మొత్తాన్ని తెచ్చి నింపడానికి ప్రయత్నిస్తున్నాను" అని బాలుడు బదులిచ్చాడు అగస్టిన్ తన పాఠం నేర్చుకున్నాడు.
అతను అలా వెళ్తుండగా, అగస్టిన్ ఇలా అన్నాడు. "నేను అదే చేయటానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఇప్పుడు అర్ధమవుతుంది. కాలమనే తీరాన నిలబడి, ఈ చిన్న పరిమిత మనస్సులో అపరిమితమైన విషయాలను పొందడానికి ప్రయత్నిస్తున్నాను.' అదే విధంగా, మనకు ఇంకా తెలియని కొన్ని విషయాలను దేవునికి తెలియజేయడానికి ఇష్టపడదాం.
మనము దేవుని గురించి ప్రతిదీ అర్ధం చేసుకున్నట్లు నటించడం చాలా ఆడంబరంగా మరియు అర్ధరహితంగా ఉంటుంది. "ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు!" (రోమీయులకు 11:33), కొన్ని జన్యు సంకేతాలను విభజించడం వలె మనం ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోగలిగితే, ఆయన దేవుడు కాడు.
ఏదేమైనా, మన ఆశీర్వాదం కొరకు దేవుని గురించి బయలుపరచబడినది చాలా ఉంది. "రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగును" (ద్వితీయోపదేశకాండము 29:29). త్రిత్వమును గూర్చిన ఈ బోధ దేవునికి ముఖ్యమైనదిగా ఉండాలి అని బయలుపడినది. యేసు పరిచర్య రెండూ దేవత్వములోని ముగ్గురు వ్యక్తులను పదేపదే నొక్కిచెప్తూ ప్రారంభమై ముగుస్తాయి. యేసు బాప్తిస్మము వద్ద మరియు ఆయన పరలోకానికి ఎక్కిపోయినప్పుడు తండ్రి, కుమారుడు మరియు ఆత్మ ఉన్నారు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం తీసుకోవాలని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు.
దేవత్వమును ముగ్గురు దేవుళ్ళుగా విడదీయలేము లేదా ఒక వ్యక్తిలో విలీనం చేయలేమని లేఖనం యొక్క సాక్ష్యం సూచిస్తుంది. ఈ త్రీ-ఇన్-వన్ (ఒకరిలో ముగ్గురు) మనలను సృష్టించడమే కాదు, వారు మనల్ని ప్రేమిస్తారు మరియు పరలోకంలో ఆయన సన్నిధికి మనలను పునరుద్ధరించడానికి పాపం నుండి నశించిన ప్రపంచాన్ని రక్షించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించారు.
"ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. ఆమేన్" (2 కొరింధీయులకు 13:14).

