విషయ సూచిక

దేవుడు ఏమి చేయగలడు?
సృష్టి - దేవుని సార్వభౌమత్వమునకు గుర్తు
పరివర్తన - సృజించే శక్తి పనిని జరిగించుట
అధికారము కొరకు పోరాటము
ధర్మశాస్త్రము పాటించబడుటకు పరీక్ష
పెద్ద అబద్ధము 1 - విశ్రాంతిదినము యూదుల --కొరకు మాత్రమే నియమింపబడెను.
పెద్ద అబద్ధము 2 - వారపు ఏడు దినములలో -ఏ దినమునైనను ఆచరించుము
పెద్ద అబద్ధము 3 - నిజమైన ఏడవ దినమును -మనము గుర్తించలేము
పెద్ద అబద్దము చ 4 - విశ్రాంతిదినము ఐగుప్తులో-నుండి విడుదలకు మాత్రమే జ్ఞాపకార్ధమైన గుర్తు......
పెద్ద అబద్ధము ఎ5 - పునరుత్థానమునకు గౌరవార్ధముగా ఆదివారమును ఆచరించుము ...

జ్ఞాపకముంచుకొనుము అని దేవుడు చెప్పినదెందుకు?

అధ్యాయము -1
'దేవుడు ఏమి చేయగలడు?

దేవుని యొక్క సృష్టి వృత్తాంతమును తిరస్కరించుటయే ప్రముఖ నవీన “సంశయవాదము" అని అనేక సర్వేలు, పరిశోధనలు మరియు ప్రశ్నాపత్రముల జవాబులు నిర్ధారించుచున్నవి. బైబిలు చెప్పుచున్నట్లుగా ఈ ప్రపంచము నిజముగా దేవుని వాక్కు (మాట)ను బట్టి ఉనికిలోనికి వచ్చినదా అని కొందరు సువార్త సేవకులను ముఖాముఖిగా ప్రశ్నించగా వారిలో 72 శాతము మంది హెచ్చుతగ్గు రూపములో వారి సందేహమును వ్యక్తము చేసిరి. ఈ ప్రధానమైన అపనమ్మకమే కన్యక యొక్క గర్భమునందు జన్మించుట మరియు పాపప్రాయశ్చిత్తము మొదలగు ఇతర క్రైస్తవ మూల సిద్ధాంతములను తిరస్కరించుటకు నడిపించినది.

ఇక్కడ మనము గమనించవలసిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆదికాండములో దాఖలైన దేవుని ఆజ్ఞను బట్టి ఉనికిలోనికి వచ్చినట్లుగా వ్రాయబడిన సృష్టిని గూర్చి వివాదమేర్పడునని దేవుడు ముందుగానే ఎదురు చూచియున్నాడు. ఆయన ఆజ్ఞ వలననే ఈ అస్థిరమైన ద్రవ్యరాశి ఉనికిలోనికి వచ్చినదని తయారైనదని దేవుడు చెప్పినప్పుడు, ఇట్టి సృష్టిని గూర్చిన వృత్తాంతమును అంగీకరించని అవిశ్వాసులు, అపనమ్మకస్తులు తప్పక ఉండెదరు. క్రొత్తగా రానైయున్న కోట్లాది నకిలీ దేవతల గలిబిలి ప్రభావమును బట్టి పై వృత్తాంతమును చదివి అర్ధము చేసుకొన్నవారు కూడ ఈ అద్భుత సత్యమును త్వరలోనే మరచిపోవుదురు.

కనుక దేవుడు జరిగించినట్టి ఈ గొప్ప సృష్టికార్యమునకు సంబంధించిన జ్ఞానమును భద్రపరచుటకుగాను ఒక అసాధారణమైన దానిని ఆయన చేయవలసియున్నది. ఏ వాక్కు శక్తి అయితే ఆకాశమును మరియు భూమిని ఉనికిలోనికి తెచ్చెనో, అదే శక్తి ఆయనను నకిలీ దేవతలు మరియు మోసపూరిత వాదనలదరి నుండి ప్రత్యేకపర్చుచున్నది. దేవుడు తన దైవాధికారామును శాశ్వతముగా స్థాపించినప్పుడు, మానవాళి దృష్టి ఎల్లప్పుడు తిరిగి సృష్టికి మూలస్థానమైన సృష్టి మొదటివారముపై యుండునట్లుగ ఆయన ఏమి చేయగలడు లేక ఏమి చేయవలెను?|

అధ్యాయము -2

సృష్టి--దేవుని సార్వభౌమత్వమునకు గుర్తు

దేవుడు తన సృజించే శక్తి ప్రదర్శనకు స్మారకముగా సృష్టి వారములోని ఏడవ దినమును ప్రత్యేకపరచి, పరిశుద్ధ విశ్రాంతిదినముగాను మరియు జ్ఞాపకముంచుకునే దినముగాను దానిని దేవుడు ఎన్నుకొనెను. అది దేవుని సార్వభౌమత్వమునకు గొప్ప కాపుదలగాను మరియు ఏకైక సత్యదేవునిగా పరిపాలించే అర్హతకు గుర్తుగాను ఉన్నది. అదే సమయములో, అది ఈ భూమిని, ఆకాశములను సృష్టింపని ప్రతి నకిలీ దేవతకు ఘోర అప్రతిష్ఠగా నిలుచును.

దేవుని అసాధారణ సృజించే శక్తిని జ్ఞాపకము చేసే ఎన్నో పాత నిబంధన గ్రంథ ప్రవక్తల రచనలున్నవి. దావీదు, "జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహెూవా ఆకాశవిశాలమును సృజించినవాడు” అని వ్రాసెను (కీర్తన 96:5). “యెహెూవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను" అని యిర్మీయా వ్యక్తపరచెను" (-10:10-12).
సృష్టికార్య సత్యమును కాపాడుట అత్యవసరమని తలంచి దానిని దేవుడే స్వయముగా ఈ ప్రపంచపు కళ్ల ముందు స్పష్టముగా ప్రదర్శించియున్నాడా?. అవును. ఎంతమేరకంటే ప్రతి జీవించే వ్యక్తి ఆయన దైవాధికారమును ఒప్పుకొని పరిశుద్ధ విశ్రాంతిదినమును ధర్మబద్ధుడుగా ఆచరించునట్లు ఆయన దానిని తన గొప్ప నీతి ధర్మశాస్త్రమైన పది ఆజ్ఞలకు మధ్యలో వ్రాసియున్నాడు. దేవుని నిత్య సూత్రములు ఆయన ప్రభుత్వాధికారమునకు పునాదిగా చేసుకొని, ఆయన పరిపూర్ణ గుణశీలమును ప్రతిబింబించునట్లుగా దేవుడు, “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహెూవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు.-ఆరు దినములలో యెహెూవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను అందుచేత యెహెూవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను" అను మాటలను వ్రాసెను (నిర్గమకాండము 20:8-11).

సర్వశక్తివంతమైన సృష్టికార్యమును ఉన్నతపరచే ఆ కార్యము ఎంత గొప్పది! భూగోళము తన అక్షముపై తాను తిరుగుతూ ఉండగా, వారమున కొకసారి ప్రతి స్త్రీకి, పురుషునికి, పిల్లవానికి జ్ఞాపకముంచు కొనవల్సిన సబ్బాతు వర్తమానమును అందిస్తూ, తక్షణమే జరిగిన సృష్టికార్యమును గుర్తు చేయుచున్నది. జ్ఞాపకముంచుకొనుము అని దేవుడు ఎందుకు చెప్పెను? ఎందుకనగా సబ్బాతును మరచిపోవుట సృష్టికర్తను కూడ మరచిపోవుటయే.

అధ్యాయము- 3
పరివర్తన - సృజించే శక్తి పనిని జరిగించుట |

ఈ భౌతిక ప్రపంచమును సృష్టించుటకు సమాంతరముగా దేవుడు తన శక్తి చేత మానవ హృదయమును తిరిగి సృష్టించుటను మనము కనుగొనుచున్నాము. స్పష్టముగా ఈ రెండు ప్రక్రియలు ఉద్భవించుటకు మూలము ఆ సర్వశక్తియే. సృష్టించుట ద్వారా ఒక దానిని ఉనికిలోనికి తెచ్చుటకు ఏ శక్తి అవసరమో, అదే శక్తి పునర్నిర్మించుటకు లేదా పరివర్తన (మార్పు) కలిగించుటకు అవసరమైయున్నది. "నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు (ఎఫెసీయులకు 4:24). నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసిని గుర్తించుటకు ప్రాముఖ్యమైన ప్రాధమిక గుర్తు నూతనజన్మయై యున్నది. నిజ దేవుని నకిలీ దేవుళ్లు దేవతల నుండి వేరు చేయునది.

సృష్టించే శక్తి గనుక, ఆ శక్తిని గూర్చి బైబిలు రచయితలు పదే పదే జ్ఞాపకము చేయుట అతిశయోక్తి కాదు.

భౌతిక సృష్టిని గూర్చిన వాస్తవమును తెలుపుటయే గాక దేవుడు దానికి మించిన విషయమును కూడ ఈ మాటలలో చెప్పెను, "యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని" (- 20:12).

ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ విశ్రాంతిదినము పవిత్రపరచబడిన ప్రజలకు గుర్తుగా ఉన్నదని మనము గ్రహించవలసియున్నది. “పరిశుద్ధపరచుట" అనే మాటకు ఒక పరిశుద్ధ కార్యము కొరకు (అనగా దేవుని సృజించే శక్తిని తెలియజేయుచున్న దినము) కొరకు ప్రత్యేకపరచుట అని అర్ధము, దేవుడు పరిశుద్ధ కార్యము కొరకు పునర్జననము లేదా పునర్నిర్మాణము (నూతనసృష్టి) ద్వారా పరిశుద్ధ జనాంగమును ప్రత్యేకపర్చునని విశ్రాంతిదినము జ్ఞాపకము చేయుచున్నది.

ఈ వాస్తవాల వెలుగులో, సాతానుడు నిరంతరము ఏడవ దిన విశ్రాంతిదినమునకు వ్యతిరేకముగా ఎందుకు తీరని, తెగింపుతో కూడిన పోరాటము చేయుచున్నాడో సులభముగా అర్ధము చేసుకొనవచ్చును. దాదాపు ఆరు వేల సంవత్సరములుగా సాతానుడు దేవుని పరిశుద్ధ అధికారమునకు ప్రత్యేక గుర్తుగా ఉన్న విశ్రాంతిదినమును నాశనము చేయుటకు ఆచార సంబంధమైన గర్వమును, తప్పుడు సమాచారమును, మరియు మూఢవిశ్వాసమును ఉపయోగించుకొనుచున్నాడు.

దేవుని పరిపాలనా హక్కుకు గుర్తుగా ఉన్న విశ్రాంతిదినము దేవుని స్థానమును పొందాలని గొప్పలు చెప్పుకునే సాతానుకు సవాలుగా నిలిచినది. "దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును.... మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును" అని విరోధియైన అపవాది పలికెను (యెషయా 1413, 14). నిజానికి సాతానుడు ఆరాధింపబడాలని కోరుకొనెను. దీనిని సాధించాలంటే దేవునికున్న నిజమైన పరిపాలన అధికారమును గూర్చి చెప్పే దానిని చెరిపి వేయవలసి యున్నది. దేవుని అధికారము ఆయన సృష్టికర్తనని చెప్పుటలో ఉన్నది. ఆ అధికారమునకు గుర్తు విశ్రాంతిదినము. దేవుని విశ్రాంతిదినమును నాశనము చేసి, నకిలీ ఆరాధన దినమును తన నకిలీ అధికారమునకు గుర్తుగా ఎన్నుకొని, వీటి ఆధారముతో నకిలీ ప్రభుత్వమును స్థాపించే మార్గమును సాతానుడు సిద్ధపరచుచున్నాడు.

అధ్యాయము 4
అధికారము కొరకు పోరాటము

క్రీస్తుకు మరియు సాతానుకు మధ్య జరిగిన యుగాలనాటి మహా గొప్ప పోరాటమును వెనుకకు తిరిగి చూచుట ఎంతో మనోహరము. ఎల్లప్పుడు ఆ పోటీ అధికారాన్ని చెలాయించే దానిపైనే కేంద్రీకరించబడియున్నది.

సృష్టికర్తనని దేవుడు చెప్పుకొను దానిని సాతానుడు రెండు విధములుగా దాడి చేయుట అతని వ్యూహము. మొదటిది, మానవుని ఆలోచన నుండి పుట్టిన జీవపరిణామ సిద్ధాంతము. అదేమనగా జీవులు సృష్టింపబడలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక ద్వారా పరిణామము చెంది ఉనికిలోనికి వచ్చినవని చెప్పు సిద్ధాంతము. రెండవది, దేవుని సృష్టించే శక్తికి గుర్తుగా ఉన్న విశ్రాంతి దినాచరణను నాశనము చేయుటకు యుగయుగములుగా చేయుచున్న ప్రయత్నము.

దీనిని గూర్చి మనమొకటి మాత్రము చెప్పవచ్చును. దేవుని అధికారమును గుర్తించకుండా చేసిన ఈ ప్రతి ప్రయత్నము ఊహించిన దాని కన్నా ఇంకా ఎంతో ఎక్కువైన చేదు అనుభవాన్ని తెచ్చిపెట్టెను.

ప్రకృతి శాస్త్రవేత్తయైన చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతము వలన లక్షలాది మంది మత సంశయవాదులు గాను, అజ్ఞానులు గాను మారిరి. మనిషి పాపములో పడుటను తృణీకరించుటను బట్టి పాపము నుండి కాపాడుటకు రక్షకుని యొక్క అవసరము లేదని జీవపరిణామ సిద్ధాంతము విమోచన ప్రణాళికను మరియు సృష్టి వృత్తాంత సత్యాన్ని దెబ్బకొట్టినది.
ఇదే పంధాలో విశ్రాంతిదిన ఆజ్ఞపై దాడి చేయుట ద్వారా దేవుని ధర్మశాస్త్రమంతటికి విధేయత చూపుటకు పరీక్షగా ఇయ్యబడిన ఆ ఒక్క ఆజ్ఞకు అవిధేయులగునట్లు సాతానుడు లక్షలాది మందిని నడిపించెను."

నిజమైన దేవునికి సమర్పించుకున్న లక్షలాది మంది యథార్థతను దెబ్బకొట్టుటకు సాతానుకు ఒక దుష్ట ప్రణాళిక అవసరమైయున్నది. దీనికి సమయము అవసరము. మోసపూరితముగా మనస్సును మార్చుటకు శతాబ్దాల కాలము అవసరము.

దేవుని సేవ నుండి సాతానుని సేవ వైపునకు తిరుగుట ఒక నాటకీయముగా జరిగేది కాదు. కనుక మతమును ఉపయోగించుకొని మభ్యపెట్టి జనుల విధేయతను చురగొనుటయే రహస్యము. పౌలు కలము పట్టి రాయక మునుపే రోమీయులకు వ్రాసిన పత్రిక 6:16లో ఉన్న సూత్రమును సాతానుడు అర్ధము చేసుకొనియున్నాడు. అదేమనగా, "లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?".

విధేయత అనునది ఉన్నతమైన రాజభక్తి మరియు ఆరాధనకు ప్రతిరూపము. దేవునికి విధేయత కలిగి ఉండకుండునట్లు సమస్యను సృష్టిస్తే సాతానుడు తన పని నెరవేర్చుకొనుటకు మరియు మనుష్యుల విధేయత చురగొనుటకు సమాన అవకాశము కలిగియుండును. ఈ నిర్ణయాత్మక పోరాటము దేవుని చట్టముపై జరుగుతుంది. చట్టము దేవుని ప్రభుత్వానికి పునాదియై యున్నది. దేవుని చట్టముపై ఉన్న విశ్వాసాన్ని నాశనము చేసి దానికి బదులుగా సాతానుడు ఏ విధముగా మనుష్యులను తనకు విధేయులగునట్లు చేయగలడు. మరియు ఏ ఆజ్ఞపైన సాతానుడు దాడి చేయాలి. తప్పకుండా ఏదైతే దేవుని సృష్టించే శక్తిని, మరియు ఆయన పరిపాలన హక్కును చూపుతుందో దానినే.

నిజదేవుని గుర్తించుటకు సూచనగా వున్న విశ్రాంతిదినమే ఎల్లప్పుడూ సాతానుడి ద్వేషకారణము. పాత నిబంధనలో ఆయన చట్టము యెడల యథార్థతకు పరీక్షగా దేవుడు విశ్రాంతిదినమును ఎన్నుకొనెను. “యెహెూవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను” (నిర్గమకాండము 16:4).|

అధ్యాయము- 5
ధర్మశాస్త్రము పాటించబడుటకు పరీక్ష 

దేవుడు పది ఆజ్ఞలన్నింటికి విశ్రాంతిదినము (సబ్బాతు) ను ఒక పరీక్ష విషయముగా చేసెను గనుక, సాతానుడు దీనిని యుగయుగాలకు గొప్ప సమస్యగా చేయ నిర్ణయించుకొనెను. విశ్రాంతిదినము (సబ్బాతు) ను నాశనము చేయుట ద్వారా, నకిలీ ఆరాధ దినమునకు విధేయత ప్రజలు చూపునట్లుగా సాతానుడు తన గొప్ప ప్రణాళికను ప్రవేశపెట్టుటకు సిద్ధపడవచ్చును. అన్యమత ప్రభావములకు నెమ్మదిగా తలవంచిన రాజీపడ్డ క్రైస్తవత్వ బలహీనతను ఉపాయముగా వాడుకొని, సాతానుడు తన మహత్తర ప్రణాళికైన - ఒక ప్రపంచవ్యాప్త సంఘము ప్రభుత్వమును నిలబెట్టును. అది నిర్దాక్షిణ్యముగా తన నకిలీ ఆరాధన పద్ధతులకు లొంగిపోవునట్లు బలవంతము చేయును.
వెయ్యి సంవత్సరాలకు పైగా అంటే, అన్యమతస్తుడైన కాన్స్టాంటీన్ చక్రవర్తి మారుమనస్సు పొందినట్లుగా చెప్పబడిన సమయము నుండి, భ్రష్టమైన చీకటి చరిత్ర బయలుపడెను. నూతనముగా నామకార్ధపు క్రైస్తవుడుగా మారిన తరువాత చక్రవర్తి తన మొదటి కార్యముగా విశ్రాంతిదిన ఆచరణకు వ్యతిరేకముగా వారములోని మొదటి దినముననే విశ్రమించాలని, ఆ దినము అన్యమత సూర్యారాధనకు ప్రతిష్ఠ చేయబడి మరియు సూర్య సంబంధమైన సెలవు దినముగా ఉండునట్లు ఒక శాసనమును జారీ చేసెను.

ప్రస్తుతం మనము లిఖితపూర్వకముగా అందుబాటులో ఉన్న పోపుల సంఘ ఆలోచన సభలు ఎట్లు అన్యమత ఆదివార ఆచరణను బలవంతముగా ఆచరింపజేసినవో, లేనిచో మరణ శిక్ష విధించిన విషయములను మాట్లాడుకోవడము లేదు. విశాల మనస్సుతో ఎవరు గ్రంధమును పరిశోధించుదురో వారికి వాస్తవములు బాగుగా తెలియును. బైబిలు నిజ సబ్బాతు (విశ్రాంతిదినము)ను తీసివేసి నాలుగవ మరియు ఐదవ శతాబ్దాలలో పోపుల శాసనముల ద్వారా వారములోని మొదటి దినము హెచ్చింపబడినది.

దురదృష్టవశాత్తు, విశ్రాంతిదిన ఆచరణ ఆదివారమునకు మార్చిన చారిత్రక ఋజువులు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నప్పటికిని పక్షపాతము మరియు తప్పుడు సమాచారము వేలాది మంది క్రైస్తవులను ఈ సత్యాలకు కళ్లు మూసుకునేలాగున నడిపించెను. వారి పక్షపాతమునకు గల మూలకారణములను గుర్తించుట కష్టమేమీ కాదు. సులభముగా విడిచిపెట్ట బడకుండునట్లు తన వ్యతిరేక పద్ధతిపై సాతానుడు ఎంతోకాలము పని చేసియున్నాడు. నకిలీ ఆరాధన దినము హెచ్చుస్థాయిలో విధేయత పొందునట్లు యుగాయుగాలుగా వరుసక్రమములో మోసపూరిత తప్పుడు వాడనలను సమగ్రవంతముగా తీర్చిదిద్దెను. ఈనాడు ఇంకా సాతానుడు నిజ దేవుని గుర్తించే విశ్రాంతిదినమును ద్వేషించుచున్నాడు.

ఏడవ దిన విశ్రాంతిదినముపై జరుగుతున్న దాడులను మనము బహిర్గతము చేసినప్పుడే, వారములోని మొదటి దిన ఆరాధన కొనసాగించుటకు బైబిలులో ఒక్క ఆధారము కూడా లేనప్పటికి ఎందుకు లక్షలాది మంది ఇంకా కొనసాగిస్తున్నారో మనకు అర్ధమగును. దేవుని చేతితో వ్రాయబడిన చట్ట భావమును గూర్చి ఎవరికీ భిన్నాభిప్రాయము లేదు, “ఏడవ దినము నీ దేవుడైన యెహెూవాకు విశ్రాంతి దినము. దానిలో నీవు ... ఏ పనియు చేయకూడదు." అయినప్పటికీ లక్షలాది మంది దానికి విధేయత చూపుట లేదు. ఆదివారము అన్యాచారము నుండి ఉనికిలోనికి వచ్చినదనుటకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పటికీ, లక్షలాది మంది దేవుడు సూటిగా ఆజ్ఞాపించిన పది ఆజ్ఞలలోని విశ్రాంతిదినమునకు -బదులుగా ఆదివారమును ఆచరించుచున్నారు. ఎందుకు? నేను మళ్లీ ఉప్పుచున్నాను. తెలివైన సాతాను వాదనలే పరిశుద్ద విశ్రాంతిదినమునకు వ్యతిరేక వాతావరణమును సృష్టించి పక్షపాతమును కలుగజేసినవి. ఇప్పుడు మనము కొన్ని పెద్ద అబద్ధములను పరిశీలించుదము.

అధ్యాయము-6
పెద్ద అబద్ధము 1 - విశ్రాంతిదినము-యూదుల కొరకు మాత్రమే నియమింపబడెను

ఈ అబద్ధము ఎంత ప్రాచుర్యము పొందినదంటే అనేకమంది క్రైస్తవులు దీనిని యూదుల విశ్రాంతిదినము అని పిలుచుచున్నారు. కాని పరిశుద్ధ గ్రంధములో ఎక్కడా కూడా మనము యూదుల విశ్రాంతిదినము అన్న మాటను కనుగొనలేము. అది “యెహెూవాకు విశ్రాంతిదినము" అని వ్రాయబడియున్నది (నిర్గమకాండము 20:10). కాని యూదులకు విశ్రాంతిదినమని ప్రస్తావింపబడలేదు. క్రొత్త నిబంధన రచయిత అన్యుడైన లూకా యూదులకు సంబంధించిన దానిని గూర్చి ప్రత్యేకముగా వ్రాసియున్నాడు. ఆయన, “యూద జనులు (జనాంగము),” “యూదులను ప్రజలు," "యూదుల దేశము," మరియు "యూదుల సమాజమందిరము” అని వ్రాసియున్నాడు (అపొస్తలుల కార్యములు 10:22; 12:11; 10:39, 14:1). దయచేసి గమనించండి. లూకా విశ్రాంతిదినమును గూర్చి పలుమార్లు ప్రస్తావించెను గాని యూదుల విశ్రాంతిదినమని ఎక్కడా కూడ ప్రస్తావించలేదు.

మరియు “విశ్రాంతిదినము మనుష్యుల కొరకే నియమింపబడెను అని క్రీస్తు స్పస్టముగా బోధించెను (మార్కు 2:27). వాస్తవమేమనగా దేవుడు విశ్రాంతిదినమును నియమించినప్పుడు ఆదాము అను ఒక నరుడు మాత్రమే ఉనికిలో ఉండెను. సృష్టి జరిగిన తర్వాత 2000 సంవత్సరాల వరకు ప్రపంచములో యూదులు లేరు. యేసు ప్రభువు మానవాళి నంతటిని సాధారణముగా “నరుడు” అని పరిగణించెను. దేవుడు - ఇదే పదమును సృష్టి ఆరంభములో వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు పలికెను. విశ్రాంతిదినము మనుష్యుల కొరకు ఏ విధముగా నియమింపబడెనో అదే విధముగా పురుషుని (నరుని) కొరకు స్త్రీ (నారి) నియమింపబడెను. ఖచ్చితముగా వివాహముఅ యూదుల కొరకు మాత్రమే నియమించబడెనని ఎవరూ నమ్మరు.
ఇక్కడ వాస్తవమేమనగా వివాహము మరియు విశ్రాంతిదినము అనే ఈ రెండు సుందరమైన మొదటి వ్యవస్థలు పాపము ఈ లోకములో ప్రవేశింపక ముందే దేవుని చేత స్థాపించబడెను. ఈ రెండూ మనుష్యుని కొరకే నియమింపబడెను, రెండు వ్యవస్థలు సృష్టికర్త నుండి ప్రత్యేకమైన దీవెనలు పొందెను, మరియు ఏదెను తోటలో అవి ఎట్లు - పవిత్రపరచబడి యున్నవో, ఇప్పుడు కూడ ఈ రెండు వ్యవస్థలు అంతే పవిత్రమైనవిగా కొనసాగుచున్నవి.

సృష్టి జరిగిన మొదటి వారములో స్వయముగా యేసు ప్రభువే విశ్రాంతిదినమును నియమించెనని తెలుసుకొనుట ఎంతో ఆసక్తికరము. మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని (మార్కు 2:28) ఆయన చెప్పుకొనుటకు కారణమున్నది. ఆయన విశ్రాంతిదినమునకు ప్రభువైనట్లయితే, విశ్రాంతిదినము తప్పనిసరిగా ప్రభువు దినమే. యోహానుకు ప్రకటన 1:10 ప్రకారము "ప్రభువు దినమందు" దర్శనము కలిగెను. ..తప్పనిసరిగా ఆ దినము విశ్రాంతిదినమై యుండాలి. ఆ దినమే ప్రత్యేకముగా ... జీవుడు ఎన్నుకొనిన దినముగా పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడి యున్నది. పది ఆజ్ఞలను వ్రాసినప్పుడు దేవుడు దానిని "నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము" అని పిలిచెను (నిర్గమకాండము 20:10) యెషయా గ్రంథములో ఆయన, “విశ్రాంతిదినము యెహెూవాకు ప్రతిష్ఠిత దినము" అని పేర్కొనెను (యెషయా 58:13).

కాని ఈ లోకమును సృష్టించి విశ్రాంతిదినమును నియమించిన దేవుడు స్వయముగా యేసుక్రీస్తే అన్న సత్యమును మరువకూడదు. యోహాను వ్రాసిన ప్రకారము, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను 1:1-3, 14).

క్రీస్తు సృష్టికర్త అని, 'దేవుని ప్రియకుమారుడని పౌలు స్పష్టముగా గుర్తించెను. దేవుడు "ప్రేమించిన తన... కుమారునియందు (ఆయన రక్తము ద్వారా) మనకు విమోచనము,... “సర్వమును ఆయన ద్వారాను సృజింపబడెను” (కొలొస్సయులకు 1:13, 14, 16). "

క్రైస్తవులు క్రీస్తును సబ్బాతు నుండి వేరు చేయుట శోచనీయమైన పొరపాటు. ఆయనే ఆదియు, సృష్టికర్తయు, పవిత్రపరచువాడును. మరియు విశ్రాంతిదిన నిర్మాణకుడునై యున్నాడు. విశ్రాంతిదినముపై ఆయన ఉంచిన దీవెనలను లెక్కచేయకపోవుట ఆయన అధికారమును నిరాకరించుటయే.
ఈ వాదన (క్రీస్తును సబ్బాతు నుండి వేరు చేయుట) విశ్రాంతిదినము సృష్టికార్యము జరిగిన తరువాత కొంతకాలము మాత్రమే ఉనికిలో ఉన్నదని నమ్ముటకు అనేకులను నడిపించినది.

అయితే ఇది వాస్తవమేనా? - నిజానికి విశ్రాంతిదినము దేనికీ ఛాయారూపకమైనను లేక పోలికయైనను కానే కాదు. ఎందుకనగా, అసలైన ఒకే కారణమేదనగా, విశ్రాంతిదినము మానవ కుటుంబములోనికి పాపము ప్రవేశించక ముందే స్థాపించబడెను. అయితే కొన్ని ఛాయలు మరియు మరికొన్ని గుర్తులతో కూడిన ఆచరణలు పావము ప్రవేశించుటను బట్టి ఏర్పరచబడినవి, మరియు అవి పాపము నుండి విమోచనకు సూచనగా ఉన్నవి.

అటువంటి బలులు అర్పణలు, దేవుని గొర్రెపిల్ల క్రీస్తు మరణమునకు సూచనగా ప్రవేశపెట్టబడెను. పాపము లేకపోతే జంతు బలియర్పణలు ఆచరణలో ఉండేవే కావు. ఈ అర్పణలన్నియు క్రీస్తు సిలువపై మరణించుటలో రద్దు చేయబడెను, ఎందుకనగా సూచనగా ఇయ్యబడిన బలులు క్రీస్తు మరణము ద్వారా నెరవేర్చబడెను (మత్తయి 27:51). కాని పాపము ఈ లోకములో ప్రవేశించక ముందు ఛాయారూపకము ఏమీ లేదు, కనుక విశ్రాంతిదినమును ఛాయారూపకమైన ఆచార ధర్మశాస్త్రములో ఉంచుటకు వీలులేదు.
అయితే పౌలు . ఈ తాత్కాలిక ఆచార వ్యవస్థలు మనకు వ్యతిరేకముగా - మరియు మనకు విరుద్ధముగా ఉన్నవని కొలొస్సయులకు 2:14-16 వచనములలో చెప్పెను. పౌలు వీటిని “కొట్టివేయబడిన" ఆచార ధర్మశాస్త్రములోని అన్నపానముల విషయములతోను, సావత్సరిక పండుగ అమావాస్య విశ్రాంతి దినములతోను ముడి పెట్టి చెప్పెను. ఈ వచనములలో ఆయనవి అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. అవును ఆయన విశ్రాంతిదినములను గూర్చి కూడ ప్రస్తావించెను, కాని మనము వాటిని జాగ్రత్తగా గమనించిన యెడల అవి రాబోవు వాటికి ఛాయగా ఉన్న విశ్రాంతిదినములు అని వ్రాయబడెను. కొన్ని విశ్రాంతిదినములు సిలువలో కొట్టివేయబడినవా? అవును, కనీసము సంవత్సరములో వచ్చు నాలుగు విశ్రాంతిదినములు నెలలో కొన్ని ప్రత్యేకమైన తారీకులలో వచ్చేవి సిలువలో కొట్టివేయబడెను, అవి ఛాయారూపకమైనవి వాటిలో ప్రత్యేకమైన అన్నపానార్పణల నిచ్చుట అవసరమై యుండెను,

ఈ సావత్సరిక విశ్రాంతిదినములు లేవీయకాండము 23:24–36లో వివరించబడినవి “యెహెూవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మ్రొక్కుబడి దినములు గాకయు, మీరు యెహెూవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహెూవాకు హెూమ ద్రవ్యమునేమి, దహనబలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను" (లేవీయకాండము 23:37, -38).

లేఖనములు - ఎంతో స్పష్టముగా సావత్సరిక - ఛాయా విశ్రాంతిదినములకును మరియు ప్రతీవారము వచ్చు యెహెూవా నియమించిన ఏడవ దిన విశ్రాంతిదినములకు మధ్య వత్యాసమును వివరించుచున్నవి. ఆచార విశ్రాంతిదినములు సిలువలో కొట్టివేయబడెను.

అవి కేవలము పాప ప్రవేశమును బట్టి కలుపబడినవి. కాని పది ఆజ్ఞలలో నియమింపబడిన విశ్రాంతిదినము పాపము ప్రవేశించక మునుపే పరిశుద్ధపరచబడెను. అటు తరువాత దేవుడు ఆయన సొంత వ్రేలితో వ్రాసిన నీతి ధర్మశాస్త్రములో అది ఉంచబడెను. అది స్వాభావికముగానే నిత్యముగా స్థాపించబడినది.

అధ్యాయము-7

పెద్ద అబద్ధము 2 - వారపు ఏడు-దినములలో ఏ దినమునైనను ఆచరించుము॥

సాతానుడు ఈ వాదనను ఆధారము చేసుకొని దేవుడు ఆజ్ఞాపించిన విశ్రాంతిదినమునకు ప్రత్యామ్నాయ దినమును అంగీకరించునట్లుగా లోకమును సిద్ధపరచి యున్నాడు. రాతి పలకల మీద యుగయుగముల నాటి మార్పులేని గొప్ప శాసనములను దేవుడు వ్రాసియున్నాడు. ప్రతిమాట ముఖ్యమైనది మరియు అర్ధముతో కూడుకున్నది. ఒక్క వాక్యము కూడ అర్ధము కానిది గాని మర్మమైనది గాని కాదు. పాపులు, క్రైస్తవులు, విద్యావంతులు, మరియు నిరాక్షరాస్యులు సులభమైన, స్పష్టమైన పది ఆజ్ఞలలోని మాటలను అర్థము చేసుకొనుట యందు ఎటువంటి సమస్య లేదు. దేవుడు చెప్పవలెనన్న దానినే చెప్పెను. ఆయన చెప్పినదే ఆయన చెప్పవలెనని అనుకున్నది. ధర్మశాస్త్రమును గ్రహించుట కష్టమని ఎవరు దానిని తొలగించు ప్రయత్నము చేయలేదు.

పది ఆజ్ఞలలో ఎక్కువ ఆజ్ఞలు "నీవు చేయకూడదు" అనే మాటలతో ప్రారంభమగును. కాని దేవుని పది ఆజ్ఞలలో మధ్యభాగములో వ్రాయబడిన నాలుగవ ఆజ్ఞ "జ్ఞాపకముంచుకొనుము" అను మాటతో ప్రారంభమైనది. ఈ ఒక్కటే ఎందుకు భిన్నమైనది? కారణము, అది మునుపున్నది, అయితే అది మరువబడెను గనుక దానిని “జ్ఞాపకముంచుకొనుము" అని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. విశ్రాంతిదినము యొక్క ఉనికి ఆదికాండములో ఈ విధమగు మాటలతో వివరించబడెను. "ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేసి, ... దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను" (ఆదికాండము 2:1-3).

దేవుడు ఆశీర్వదించి మరియు పరిశుద్ధపరచిన దినమేది? ఏడవ దినము. దానిని ఏ విధముగా పరిశుద్ధముగా ఆచరించవలెను? ఇతర ఆరు దినములలో ఏ దినమునైనను పరిశుద్ధముగా ఆచరించవచ్చునా? కాదు. ఎందుకు? దేవుడు మిగిలిన దినములలో విశ్రమించక పనిచేయవలెనని ఆజ్ఞాపించియున్నాడు. దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకతతో కూడిన మార్పును కలుగజేయునా? అవును ఖచ్చితముగా. ఇందు నిమిత్తమే తల్లిదండ్రులు తమ బిడ్డలను దీవించమని దేవుణ్ణి ప్రార్ధించెదరు. మార్పు కలుగునని వారు విశ్వసించెదరు. ఏడవదినము ఇతర ఆరు దినముల కంటే భిన్నమైనది. ఎందుకనగా దేవుని దీవెనలను ఆ దినము కలిగియున్నది.

మరికొన్ని ప్రశ్నలు : దేవుడు ఆ దినమును ఎందుకు ఆశీర్వదించెను? ఎందుకనగా ఆరు దినములలో ఆయన ఈ లోకమును సృష్టించి యున్నాడు. అది ప్రపంచము యొక్క జన్మదినమైయున్నది, ఆయన చేసిన గొప్పు కార్యమునకు జ్ఞాపకార్ధమైయున్నది. జ్ఞాపకార్ధమైన విశ్రాంతిదినమును మార్చవచ్చునా? లేదు. ఎన్నటికి కాదు. ఎందుకనగా అది మునుపు సాధించిన కార్యము వైపు చూపుచున్నది. ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవము. దానిని మార్చవచ్చునా? మార్చలేము. ఎందుకనగా ఆగస్టు 15, 1947 సంవత్సరము స్వాతంత్య్రమును ప్రకటించిన ప్రకటనపై సంతకము చేసిరి. ఆ విధముగానే నీ జన్మదినమును కూడ నీవు మార్చుకొనలేవు. ఎందుకనగా అది ఒక ప్రత్యేక దినమున సంభవించిన నీ పుట్టుకకు జ్ఞాపకార్థమైన దినము. నీ పుట్టినదినము, స్వాతంత్య్రదినము మరియు విశ్రాంతిదినమును మార్చవలెనంటే చరిత్ర మరలా వెనుకకు పరుగులు తీయాలి. పునరావృతమవ్వాలి. వేరొకదినమును నీ పుట్టిన రోజని, వేరొకదినమును స్వాతంత్య్రదినమని మరియు మరియొక రోజును విశ్రాంతిదినమని మనము పిలువవచ్చును, అంతమాత్రాన అవి నీ పుట్టిన రోజు లేదా స్వాతంత్య్రదినము లేదా విశ్రాంతిదినము అయిపోవు.

ఎప్పుడైనను దేవుడు మానవునికి విశ్రాంతి తీసుకొనుటకు తన సొంత విశ్రాంతిదినమును ఎన్నుకొను ఆధిక్యత నిచ్చెనా? ఆయన ఇయ్యలేదు. దేవుడే స్వయముగా విశ్రాంతిదినమును పవిత్రముగా ఎన్నుకొని ఆయన అధికారమునకు గుర్తుగా నియమించుకొనేనని పరిశుద్ధ గ్రంధము నిర్ధారణ చేయుచున్నది. కావున దానిని ఎవరూ మార్చుటకు వీలు లేదు. మన్నాను కురుపించుటను గూర్చి నిర్గమకాండము 16వ అధ్యాయములో చదువుము. దేవుడు 40 సంవత్సరములు ఐగుప్తు ప్రజలకు పరిశుద్ధ దినమేదో తెలియజేయుట కొరకు ప్రతివారము మూడు అద్భుత కార్యములను చేసియున్నాడు. (1) ఏడవ దినమున ఆకాశము నుండి మన్నా కురువలేదు. (2) మరుసటి రోజుకు అదనముగా బత్తెము తీసుకున్నపుడు అది పురుగులు పట్టి పాడైపోయినది. (3) విశ్రాంతిదినము కొరకు కూర్చుకొన్నది పాడవ్వకుండ తాజాగా ఉన్నది.

అనేకమంది నవీన క్రైస్తవుల వలె ఇశ్రాయేలీయులలో కొందరు అదే తలంపును కలిగి యున్నారు. వారు కూడ వారములోని ఏడు దినములలో ఏ దినమునైనను పరిశుద్ధముగా ఆచరించుట సరియైనదని భావించిరి - "అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. అందుకు యెహెూవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? (నిర్గమకాండము16:27,28).

జరిగిన దానిని ఊహించుకొన గలుగుచున్నారా? ఏడవ దినము వలె వారములోని ఏ దినమైన పరిశుద్ధముగా ఆచరించవచ్చునని ఆ ప్రజలు అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే వారికి అనుకూలమైన దినమును ఆచరించవచ్చునని అనుకున్నారు. అయితే ఏమి జరిగినది? దేవుడు వారిని కలుసుకొని ఆయన ధర్మశాస్త్రమును మీరి (అతిక్రమించి), విశ్రాంతిదినమున పని చేసినందుకు దేవుడు వారిని నిందించెను. ఈనాడు విశ్రాంతిదినమును బుద్ధిపూర్వకముగా అతిక్రమించుచున్న వారితో దేవుడు అదే విధముగా చెప్పునా? నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మార్పులేనివాడు. కనుక ప్రజలు ఏమి తలంచినా విశ్రాంతిదినమున పని చేయువాడు ధర్మశాస్త్రము నతిక్రమించి దోషిగా ఎంచబడునని దేవుడు స్పష్టము చేసియున్నాడు.

ధర్మశాస్త్రములోని ఒక్క ఆజ్ఞను మీరినను అది పాపమేనని, మరియు అది ధర్మశాస్త్రమంతటిని మీరినట్లేనని యాకోబు స్పష్టముగా చెప్పుచున్నాడు.

“ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును వ్యభిచరింప వద్దని చెప్పినవాడు నరహత్య చేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధి వైతివి" (యాకోబు 2:10-11). "

అధ్యాయము 8

పెద్ద అబద్ధము చే 3- నిజమైన-ఏడవ దినమును మనము గుర్తించలేము ॥

ఈ అబద్ధము నాలుగవ ఆజ్ఞ కవిధేయత చూపు చాలమందికి ఓదార్పు కలుగజేసినది. అది వాస్తవము కాదు. విశ్రాంతిదినమును గుర్తించే నాలుగు నిరూపణలు క్రింద చూడుము :

1. » పరిశుద్ధ లేఖనముల ప్రకారము, క్రీస్తు శుక్రవారమున మరణించి వారములోని మొదటి దినమైన ఆదివారమున

సహజముగా అన్ని సంఘముల వారు ఈ వాస్తవమును అంగీకరించి "గుడ్ ఫ్రైడే" (శుభ శుక్రవారము) మరియు "ఈస్టర్ సండే" (ఈస్టర్ ఆదివారము)లను జరుపుకుంటారు. పరిశుద్ధ గ్రంధము నుండి దీనికి ఆధారము ఇక్కడున్నది.. "అతడు పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను” (లూకా 23:52-54),

యేసు ప్రభువు విశ్రాంతిదినమునకు ముందురోజు చనిపోయెనని చెప్పుటకు ఋజువు ఇక్కడున్నది. ఆ దినము సిద్ధపాటు దినమని పిలువబడినది, ఎందుకనగా అది విశ్రాంతిదినము కొరకు సిద్ధపడే రోజు. ఆ తదుపరి వచనములు కూడ చదువుదము: "అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి" (లూకా 23:55, 56).

దయచేసి గమనించుము, ఆ స్త్రీలు ఆజ్ఞ ప్రకారము విశ్రాంతిదినమున తీరికగా యున్నారు. ఏడవ దినము విశ్రాంతిదినమని ఆజ్ఞ తెలియజేయుచున్నది. అందువల్లనే వారు శనివారమున విశ్రమించిరి. ఆ తదుపరి వచనము ఈ విధముగా చెప్పుచున్నది, “ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి" (లూకా 24:1, 2).

వరుసగా వచ్చే ఈ మూడు దినములు మన కొరకు ఎంతో స్పష్టముగా వివరింపబడెను. ఆయన శుక్రవారమున మరణించెను, ఆ దినము సిద్ధపాటు దినము, దీనిని సాధారణముగా “గుడ్ ఫ్రైడే" (శుభ శుక్రవారము) అని పిలుస్తారు. ఆజ్ఞచొప్పున ఆయన ఏడవ దినమున సమాధిలో విశ్రమించి యున్నాడు. ఆ దినము శనివారము. ఎంతో మంది వారములోని మొదటి దినమైన ఆదివారమున యేసు ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచెనని, "ఈస్టర్ సండే" (ఈస్టర్ ఆదివారము) ను జరుపుకుంటారు.

ఎవరైతే “గుడ్ ఫ్రైడే” (శుభ శుక్రవారము) మరియు “ఈస్టర్ సండే" (ఈస్టర్ ఆదివారము)లను గుర్తించెదరో, వారికి నిజమైన విశ్రాంతిదినమును గుర్తించుటలో ఎటువంటి సమస్య ఉండదు. "

2. వారములోని దినములు తారుమారు అగునట్లు క్యాలెండరు. మార్పు చేయబడలేదు.
మనము యే ఏడవ దినమును పరిశుద్ధముగా ఆచరిస్తున్నామో అదే ఏడవ దినమును యేసు ప్రభువు కూడ ఆచరించియున్నాడు. క్రీ. శ. 1582లో పోప్ గ్రెగొరీ XIII క్యాలెండరును మార్చెను, కాని వారములో ఉండే దినముల క్రమమును మార్పు చేయలేదు. ఆయన 1582లో చిన్న మార్పు చేసినటువంటి క్యాలెండరును ఆయన పేరుతో పిలుస్తూ దానిని ఇప్పుడు మనము వాడుచున్నాము.

పోప్ గ్రెగొరీ క్యాలెండరులో ఏ మార్పులు చేసియున్నాడు? 1582 సంవత్సరమునకు ముందు చక్రవర్తి జూలియస్ సీజర్ క్రీ. పూ. 46వ సంవత్సరములో ప్రవేశపెట్టిన క్యాలెండరు జూలియన్ క్యాలెండరు పేరుతో ఉపయోగించబడినది. ఒక సంవత్సరము కాలవ్యవధి 365 రోజులుగా జూలియన్ క్యాలెండరు లెక్కించినది. అయితే వాస్తవమునకు వారు లెక్కించిన ఈ సంవత్సరము సౌర సంవత్సరము కన్నా 11 నిమిషములు తక్కువ ఉన్నది. అయితే 1582 సంవత్సరమునకు ఈ తేడా మొత్తము 10 రోజులు తేడాగా తేలినది. ఈ తేడా సౌర కుటుంబము వ్యవస్థతో వచ్చినది. కనుక ఆ 10 రోజులను గ్రెగొరీ కలిపి సౌర కుటుంబ వ్యవస్థ నిజకాలముతో సరిచేసెను. అది గురువారము అక్టోబరు నెల 4వ తేదీ 1582వ సంవత్సరము. మరుసటి రోజు శుక్రవారము అక్టోబరు 5వ-తేదీ 1582 అవ్వాలి. కాని గ్రెగొరీ దానిని శుక్రవారము అక్టోబరు 15, 1582గా తీసుకొని ఆకాశములో ఉన్న సౌర కుటుంబ వ్యవస్థ కాలముతో సరిపోవునట్లు మార్పు చేసెను. (10 రోజులు లెక్కించబడకుండ 5వ తేదీ 15వ తేదీ అయినది.

వారములోని దినముల క్రమములో తారుమారు జరిగినదా? లేదు. గురువారము తర్వాత శుక్రవారమే వచ్చియున్నది, మరియు శుక్రవారము తర్వాత శనివారమే వచ్చియున్నది. అదే ఏడవ దినము నిలిచి యున్నది. వారములో వచ్చు దినములకు అంతరాయము కలుగలేదు. మనము శనివారము ఏడవ దినమును, విశ్రాంతిదినముగా ఆచరించినట్లైతే యేసు ప్రభువు వారము వారము ఆచరించిన విశ్రాంతిదినమును మనము ఆచరించినట్లేనని లూకా 4:16 తెలియజేయుచున్నది.

3. »వాస్తవమైన విశ్రాంతిదినమును ఋజువు చేసే ఈ నిదర్శనము అన్నిటికంటే స్పష్టమైనది. యూదులు ఏడవ దినమును విశ్రాంతిదినముగా అబ్రాహాము కాలము నుండే ఆచరించుచున్నారు. నేటికిని ఆ ఆచరణను కొనసాగిస్తున్నారు.

కొన్ని వేల సంవత్సరాల నుండి వారము తర్వాత వారమును క్యాలెండరు వున్నా లేకపోయినా ఎంతో శ్రద్ధగా ఆ సమయమును కాపాడుతూ వున్న అ దేశ ప్రజలు దారి తప్పియున్నారా?

అది అసంభవము. వారు తప్పిపోవాలంటే ఒకే ఒక మార్గమున్నది. ఒక రోజును పొగొట్టుకోవాలంటే ఆ దేశ ప్రజలందరు అదనముగా 24 గంటలు నిద్రించాలి, మరియు వారు 24 గంటలు అదనముగా నిద్రించినట్లు తరువాత ఎవ్వరు వారికి చెప్పకూడదు.

ఆదియందు దేవుడు ఆదికాండములో నియమించిన విశ్రాంతిదినములో ఎటువంటి మార్పులు కాని సమయమును కోల్పోవుట గాని జరుగలేదు.

వారము యొక్క ఉనికి సృష్టి కథనములో చెప్పబడినది. వారములో ఏడు రోజులు ఉండుటకు శాస్త్రీయ కారణములు గాని, సూర్య సంబంధమైన కారణములు గాని ఏమీ లేవు. దానిని దేవుడే ఏకపక్షముగా ఏర్పరచుకొని అద్భుత రీతిలో కాపాడుటకున్న ఒకే ఒక్క కారణమేమనగా, నిజ దేవునికున్న సృష్టించే శక్తిని తెలియజేయుచున్నది. విశ్రాంతిదినము ఈ లోకము పైన మరియు మానవ జీవితముల పైన దేవుడే సర్వాధికారమును కలిగియున్నాడనుటకు గుర్తు, సృష్టి మరియు పాపవిమోచనకు గుర్తు.

దేవుడు విశ్రాంతిదినమును నిత్యమూ కాపాడుటకు కారణమిది. కాదా? యెషయా ఇట్లు వ్రాసెను: "నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహెూవా వాక్కు ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు" (యెషయా 66:22, 23).

విశ్రాంతిదినము; దేవునికెంతో ప్రశస్తమైనది, ఆ సుందరమైన నూతన భూమిలో సదాకాలము ఆయన ప్రజలు విశ్రాంతిదినమును ఆచరించుచూ ఉందురు. ఆయనకది ప్రశస్తమైనదైతే, అది మనకు ప్రశస్తమైనది కాదా? రాబోవు కాలములో దానిని ఆచరించవలసి యున్నట్లయితే, ఇప్పుడే దానిని ఆచరించకూడదా?!

అబద్దపు దేవుళ్లు దేవతలున్న ఈ కాలములో, నాస్తికత్వము, పరిణామ సిద్ధాంతములు నమ్ముతున్న ఈ కాలములో, మానవ సాంప్రదాయము కట్టడలు అనుసరించబడుచున్న ఈ కాలములో, ఈ లోకమునకు మునుపెప్పుడూ లేనంతగా విశ్రాంతిదిన అవసరత యున్నది. విశ్రాంతిదినము మన సృష్టికర్తయైన గొప్ప దేవునికి నమ్మకముగా నుండుటకు పరీక్ష మరియు ఆయన శక్తి ద్వారా పరిశుద్ధపరచబడుటకు గుర్తు. "
4. ఈ లోకములో వందకు పైగా భాషలలో శనివారమునకు “సబ్బాతు" అనే పదము నుపయోగించుచున్నారు. దీనిలోనే నాలుగవ సత్యము దాగియున్నది.

ఉదాహరణకు స్పానిష్ భాషలో 'శనివారము'నకు వాడబడిన “సబాడో” (Sabado), దీనికి అర్ధము సబ్బాతు (విశ్రాంతిదినము). ఇది దేనిని ఋజువు చేయుచున్నది? ఈ వందల భాషలు అనేక సంవత్సరాల క్రిందట పుట్టినప్పుడు వారు శనివారమును విశ్రాంతిదినము (సబ్బాతు)గా గుర్తించి, వారి వాడుక భాషలో శనివారమును సబ్బాతు (విశ్రాంతిదినము)గా దాని నుపయోగించుకున్నారు.

 

అధ్యాయము-9

పెద్ద అబద్ధము 4 - విశ్రాంతి దినము ఐగుప్తులో-నుండి విడుదలకు మాత్రమే జ్ఞాపకార్ధమైన గుర్తు

విశ్రాంతిదినము కేవలము ఐగుప్తు విడుదలకు జ్ఞాపకార్ధమైన గుర్తు మాత్రమే అనే ఈ ఒక్క విచిత్రమైన ఆలోచన పాత నిబంధనలో ఒక చోట ఉన్న వచనములను తీసుకొని విశ్రాంతిదినము యొక్క వాస్తవ ఉనికిని ప్రాముఖ్యతను తెలియజేయు అనేక స్పష్టమైన వచనములకు వ్యతిరేకముగా వక్రీకరించి ఉపయోగించిరి. ఆ వచనములు ద్వితీయోపదేశకాండము 5:14,15లో ఈ విధముగా వ్రాయబడినవి.

"ఏడవ దినము నీ దేవుడైన యెహెూవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీగాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు.
ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. "

ఈ వచనములను బట్టి, ఐగుప్తు బానిసత్వ విడుదలకు జ్ఞాపకార్ధమైన గుర్తుగా విశ్రాంతిదినము ఇయ్యబడినదని కొంతమంది అర్ధము చేసుకొనిరి. కాని విశ్రాంతిదినము నియమితమైన దానిని గూర్చి ఆదికాండములో ఇయ్యబడిన కథనమును బట్టి (ఆదికాండము 2:1-3) మరియు నాలుగవ ఆజ్ఞలో దానిని గూర్చి దేవుడే స్వయముగా చెప్పిన మాటలు గమనించినచో (నిర్గమకాండము 20:11) విశ్రాంతిదినము సృష్టికి జ్ఞాపకార్థమైన గుర్తుగా ఇయ్యబడినదని అర్థమగుచున్నది. "

ఆ రెండు ముఖ్యమైన వచములను అర్ధం చేసుకొనుటకు "బానిస” అనే పదమును అర్థము చేసుకొనవలెను. ఐగుప్తు దేశములో నీవు బానిసగా ఉన్నావని జ్ఞాపకముంచుకొనుమని దేవుడు చెప్పెను. అదే వచనములో వారికి ఈ విషయమును గుర్తు చేసెను. “నీ దాసుడును, నీ దాసియు నీ వలె విశ్రమింపవలెను.” ఇంకో మాటలో చెప్పాలంటే, వారు బగుప్తులో బానిసలుగా ఉన్న అనుభవము గుర్తు చేసుకొని వారి బానిసలతో యథార్థముగా నడుచుకొని విశ్రాంతిదినమును ఆచరించుటకు వారికి అవకాశమియ్యవలెనని భావము.

పైన చెప్పిన విధముగానే ఇచ్చట దేవుడు ఈ విధముగా ఆజ్ఞాపించెను “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి” (లేవీయకాండము 19:33, 34).

ఇతర ఆజ్ఞలకు విధేయులుగా జీవించునట్లు వారిని ప్రోత్సాహపరచుటకు దేవుడు ఐగుప్తు విడుదలను పదే పదే జ్ఞాపకము చేయుట అసాధారణ విషయమేమీ కాదు. ద్వితీయోపదేశకాండము 24:17, 18లో ఈ విధముగా చెప్పెను, “పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించెనని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. ''

న్యాయముగా నడుచుకొనుటకు, లేదా ఐగుప్తు విడుదలను జ్ఞాపకముంచుకొనుటకు విశ్రాంతిదినమును ఆచరించమని దేవుడు-చెప్పలేదు. దేవుడు ఆయన మంచితనమును బట్టి వారిని విడిపించుటకు మరొక బలమైన కారణమున్నది. అదేమనగా వారు విశ్రాంతిదినమున వారి బానిసల పట్ల దయగాను, విధవరాండ్రు మరియు పరదేశుల పట్ల న్యాయముగాను ఉండవలెను.

ఇదే విధముగా దేవుడు లేవీయకాండము 11:45లో ఈ విధముగా మాట్లాడెను, "ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానుA... మీరును పరిశుద్ధులు కావలెను.” ఖచ్చితముగా ఐగుప్తు విడుదలకు ముందు పరిశుద్ధత లేదని ఎవ్వరూ నొక్కి చెప్పలేరు. అదే విధముగా దేవుని పరిశుద్ధత కేవలము యూదులకు మాత్రమే పరిమితమైనదని ఎవరూ చెప్పరు. పరిశుద్ధత కేవలము ఐగుప్తు విడుదలకు జ్ఞాపకార్థముగా నున్నదని చెప్పుటకు వీలులేదు.

అధ్యాయము 10

పెద్ద అబద్ధము 5 - పునరుత్థానమునకు గౌరవార్ధముగా ఆదివారమును ఆచరించుము

అవును యేసు ప్రభువు వారములోని మొదటి దినమైన ఆదివారముననే తిరిగి లేచెను, కాని పరిశుద్ధ గ్రంధములో ఎక్కడా కూడ ఆ దినమును పరిశుద్ధముగా ఆచరించాలని చిన్నపాటి సూచనయైనను లేదు. విశ్రాంతిదినమును ఆచరించుటకు ఆధారము దేవుడు ఆయన స్వహస్తముతో వ్రాసిన ఆజ్ఞయే.

వారములోని కొన్ని దినములలో ఎన్నో అద్భుత కార్యములు సంభవించినవి, కాని వాటిని పరిశుద్ధముగా ఆచరించాలనే ఆజ్ఞ ఇయ్యబడలేదు. యేసు ప్రభువు మన పాపముల నిమిత్తము శుక్రవారము నాడు చనిపోయెను. చరిత్రలో వ్రాయబడిన అత్యంత ప్రాముఖ్య ఘట్టము ఇదే. నా యొక్క మరణశిక్ష ఆయన మీద మోపబడి నాకు రక్షణ కలిగెను. ఈ గొప్ప ప్రాముఖ్యమైన దినమును పరిశుద్ధముగా ఆచరించవలెనని పరిశుద్ధ గ్రంధము ఎక్కడ కూడ సూచించలేదు.

ఆదివారము ఉదయము యేసు ప్రభువు సమాధి నుండి తిరిగి లేచుట ఒక ప్రభావిత సమయము, అయినప్పటికిని ఆ పునరుత్థానమును గౌరవిస్తూ ఆ దినమును ఆచరించవలెనని పరిశుద్ధ గ్రంథములో ఏ మాత్రపు ఋజువు లేదు. వ్రాయబడిన లేఖనములలో ఆదివారమును ఆచరించినట్లు ఏ సందర్భము లేదు.

పునరుత్థానమునకు జ్ఞాపకార్ధము పరిశుద్ధ గ్రంథములో ఒకటి ఇయ్యబడినది. అయితే అది ఆదివారమును ఆచరించుటను గూర్చి కాదు.

పౌలు రోమీయులకు 6:4లో ఈ విధముగా అంటున్నాడు, "కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, అలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతి పెట్టబడితిమి. '

బాప్తిస్మము అనునది యేసు ప్రభువు మరణమునకు, భూస్థాపనకు మరియు పునరుత్థానమునకు గుర్తు. ఆదివారమును ఆచరించవలెనని విశ్వసించువారు, యేసు ప్రభువు తిరిగి లేచిన దినమున మేడ గదిలో శిష్యులు కూడుకొన్న సందర్భాన్ని చూపి ఆ కూడిక పునరుత్థాన వేడుకను జరుపుకొనుటకు కూడుకున్నారని చెప్పుదురు. కాని మనము పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన విషయము చదివితే అక్కడ చోటు చేసుకొన్న సంఘటనలు భిన్నముగా వున్నవి. కళ్లారా చూసిన దానిని గూర్చి శిష్యులకు సాక్ష్యమిచ్చిన మగ్దలేనే మరియను వారు విశ్వసించలేదు. "ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను" (మార్కు 16:12-14). "

ఖచ్చితముగా మేడ గదిలో ఉన్న శిష్యులెవ్వరు యేసు ప్రభువు తిరిగి లేచెనన్న సత్యాన్ని నమ్మలేదు. అందుకనే వారు పునరుత్థాన వేడుకను సంతోషముగా జరుపుకొనలేదు. "ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు

మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను” (యోహాను 20:19).

పరిశుద్ధ విశ్రాంతిదినమునకు విరుద్ధముగా ఉపయోగించిన వాదనలన్నిటిని మనము పరిశీలించితిమి. లేవనెత్తిన అభ్యంతరములన్నిటిలో ఏ ఒక్కటి కూడా దేవుడు విశ్రాంతిదినమును గూర్చి తన మనస్సును మార్చుకొన్నాడని చెప్పుటకు మనకు కనబడలేదు. ఆయన తన నాలుగవ ఆజ్ఞలో “జ్ఞాపకముంచుకొనుము" అనే మాటను వ్రాసినప్పుడు మన గోడ మీద ఉన్న క్యాలెండరులో చూపుచున్న ఏడవ దినమును ఆయన చూపుచున్నాడు. మానవులు గాని, దయ్యములు గాని, దేవుని నిత్యమైన ధర్మశాస్త్రము యొక్క విలువను తగ్గించలేరు.

విశ్రాంతిదినము మన ప్రేమ మరియు విధేయతలకు ప్రత్యకమైన పరలోక పరీక్షగా గ్రహించి సబ్బాతు దిన ఆజ్ఞను ఘనపరచుటకు దేవుడు మనలో ప్రతి యొక్కరికి ధైర్యము ననుగ్రహించును గాక. మనము తెలుసుకొనిన విధముగానే, యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడ కలిసి విశ్రాంతిదినమును యుగయుగములు అంతము లేకుండ గైకొందుము. అవును, ప్రభువైన యేసూ, రమ్ము.