Lesson 7
దాదాపుగా ప్రతి ఒక్కరు మరచిపోయిన ప్రాముఖ్యమైన దినమొకటున్నదని నీకు తెలియునా? మానవ చరిత్రలోనే ఇది అత్యంత ప్రాముఖ్యమైన దినమైనను, కొద్దిమందికి మాత్రమే ఈ దినమును గూర్చి తెలియునన్న విషయము ఆశ్చర్యమును కలిగించుచున్నది! ఇది భూతకాలమునకు మాత్రమే కాక, నేడు మనకును భవిష్యత్తు కాలమునకు కూడ చెందిన దినమునైయున్నది. ఇదియు కాక, నిరక్ష్యము చేయబడిన ఈ దినమందు ఏమి జరుగునో, అది నీ జీవితము మీద సానుకూలమైన ప్రభావమును చూపించగలదు. చరిత్రలో మరువబడిన ఈ దినమును గూర్చి మరిన్ని అద్భుత సత్యములను తెలిసికొనగోరుచున్నావా? అయితే ఈ పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను జాగ్రత్తగా చదువుము.
1. ఏ దినమున యేసు ప్రభువు వాడుక చొప్పున ఆరాధించెను?
“ఆయన తాను పెరిగిన నజరేతునకు తిరిగి వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా” (లూకా 4:16).
జవాబు : విశ్రాంతిదినమున ఆరాధించుట యేసు ప్రభువుకు వాడుకయైయున్నది.
2. కాని చరిత్రలో మరువబడిన దినమేది?
"ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము" (నిర్గమకాండము 20:10). "విశ్రాంతిదినము గడచిపోగానే ... వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా" (మార్కు 16:1, 2).
జవాబు : ఈ ప్రశ్నకు సమాధానము చెప్పుటకై కొద్దిపాటి పరిశోధనా పని అవసరమైయున్నది. అనేకమంది ప్రజలు విశ్రాంతిదినము వారములో మొదటి దినమైన ఆదివారమని నమ్ముచున్నారు, కాని, వాస్తవముగా విశ్రాంతిదినము వారములో మొదటిదినమునకు సరిగ్గా ముందు వచ్చే దినమని బైబిలు చెప్పుచున్నది. లేఖనము ప్రకారము, వారములో ఏడవ దినము (శనివారము) విశ్రాంతిదినము.
"ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" ... "దేవుడు తాను చేసిన తన పని యేడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని యంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను" (ఆదికాండము 1:1; 2:2, 3)
జవాబు: దేవుడు ఈ ప్రపంచమును సృష్టించినప్పుడు, సృష్టి కార్యమందు విశ్రాంతిదినమును నియమించెను. ఆయన విశ్రాంతిదినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచెను, అనగా, దానిని ఒక పరిశుద్ధ కార్యక్రమము కొరకు ప్రత్యేకపరచెను.
4. తన సొంత వ్రేలితో వ్రాసిన పది ఆజ్ఞలలో విశ్రాంతి దినమును గూర్చి దేవుడు ఏమి చెప్పుచున్నాడు?
“విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను, అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను” (నిర్గమకాండము 20:8-11). "అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను" (ద్వితీయోపదేశకాండము 9:10).
జవాబు : పది ఆజ్ఞలలోని నాల్గవ ఆజ్ఞలో, ఏడవ దిన విశ్రాంతిదినమును ఆయన పరిశుద్ధ దినముగా మనము ఆచరించాలని దేవుడు చెప్పుచున్నాడు. వారములో మరి ఏ ఇతర దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని ఎవరికిని, ఎక్కడను, మరియు ఎప్పుడును ఆయన ఆజ్ఞాపించలేదు. ప్రజలు తన విశ్రాంతిదినమును మరచిపోయే అవకాశమున్నదని దేవుడు ఎరిగియుండెను గనుక ఆయన ఈ ఆజ్ఞ ప్రారంభములోనే "జ్ఞాపకముంచుకొనుము" అనే మాట ఉంచెను.
నిర్గమకాండము 20:1 "దేవుడు ఈ ఆజ్ఞలన్నియు (స్వయముగా) వివరించి చెప్పెను" అని చెప్పుచున్నది. (తరువాత 2-17 వచనములలో పది ఆజ్ఞలు వివరించబడినవి, అవి దేవుని పెదవుల గుండ వెడలి వచ్చినవని మనము గుర్తుంచుకొనవలెను.) "నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండ బయలువెళ్లిన మాటను మార్చను" అని దేవుడు చెప్పెను (కీర్తన 89:34). "ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుట కంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము" అని యేసు ప్రభువు చెప్పెను (లూకా 16:17).
జవాబు : లేదు, నిజమే! దేవుని నీతి ధర్మశాస్త్రములో ఏదైనను మారుట అసాధ్యము. పది ఆజ్ఞలన్నియు ఎన్నటికి నిలిచేయున్నవి, అవి నేటికిని ఆచరింపబద్ధమైనవి. మిగతా తొమ్మిది ఆజ్ఞలు మారనట్లే, నాల్గవ ఆజ్ఞ కూడ మారలేదు.
“పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి ... లేఖనములలో నుండి .... వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను” (అపొస్తలుల కార్యములు 17:2,3). "పౌలును అతనితో కూడ ఉన్నవారును ... విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి" (అపొస్తలుల కార్యములు 13:13, 14). “విశ్రాంతిదినమున గవిని దాటి నది తీరమున ప్రార్ధన జరుగుననుకొని (అక్కడ ప్రార్ధన జరుగుట వాడుక), అక్కడకు వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి” (అపొస్తలుల కార్యములు 16:13). "అతడు (పౌలు) ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను" (అపొస్తలుల కార్యములు 18:4).
జవాబు : అవును. పౌలు మరియు ఆదిమ సంఘ తొలి క్రైస్తవులు ఏడవ దిన విశ్రాంతిదినమును ఆచరించియున్నారని అపొస్తలుల కార్యముల గ్రంథము స్పష్టము చేయుచున్నది.
దేవుడు ఆజ్ఞాపించెను: "విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు." ... "నా నిబంధనను ఆధారము చేసికొనుచు ... ఆయన (దేవుని) పక్షమున చేరు అన్యులను ... నా ప్రార్థన మందిరములో... ఆనందింపజేసెదను ... నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిర మనబడును" (యెషయా 56:2, 6, 7).
అపొస్తలులు బోధించిరి : “వారు సమాజమందిరములో నుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు (అన్యజనులు) వేడుకొనిరి” ... "మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను" (అపొస్తలుల కార్యములు 13:42, 44). "అతడు (పౌలు) ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను" (అపొస్తలుల కార్యములు 18:4).
జవాబు : ఆదిమ సంఘములోని తొలి అపొస్తలులు దేవుని విశ్రాంతిదిన ఆజ్ఞకు విధేయులై యుండుట మాత్రమే కాక, మారుమనస్సు నొందిన అన్యజనులకు విశ్రాంతిదినమున ఆరాధించమని బోధించిరి.
జవాబు: లేదు. యేసు గాని, ఆయన తండ్రి గాని లేదా అపొస్తలులు గాని ఎప్పుడైనను, ఏ పరిస్థితుల్లోనైనను, పరిశుద్ధ ఏడవదిన విశ్రాంతిదినమును వేరొక దినమునకు మార్చినట్లు లేఖనములలో ఎక్కడను ఏ సూచన లేదు. నిజానికి, బైబిలు దీనికి వ్యతిరేకమైన దానిని బోధించుచున్నది. నీకు నీవే సాక్ష్యాధారములను పరిశీలించుము :
A.దేవుడు విశ్రాంతిదినమును ఆశీర్వదించెను :
"యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను" (నిర్గమకాండము 20:11). "దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను" (ఆదికాండము 2:3).
B.యెరూషలేము నాశనమైనప్పుడు క్రీ. శ. 70లో కూడ తన ప్రజలు ఇంకను విశ్రాంతిదినమును ఆచరించుచుందురని క్రీస్తు ఆశించెను.
క్రీ. శ. 70లో రోమా చేత యెరూషలేము నాశనమగునని పూర్తిగా ఎరిగిన యేసు, తన అనుచరులను ఆ కాలమును గూర్చి హెచ్చరించుచు, "మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్ధించుడి" అని చెప్పెను (మత్తయి 24:20). ఆయన పునరుత్థానమైన 40 సంవత్సరాల తరువాత కూడ తన ప్రజలు విశ్రాంతిదినమును ఆచరించుచుందురని యేసు స్పష్టము చేసెను.
C. క్రీస్తు మృతదేహమును అభిషేకించుటకు వచ్చిన స్త్రీలు విశ్రాంతిదినమును ఆచరించిరి.
యేసు ప్రభువు "విశ్రాంతిదినమునకు పూర్వదినము" మరణించెను (మార్కు 15:37, 42). దీనిని తరచుగా "గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారము)" అని పిలుస్తారు. ఆయన దేహమునకు పూయుటకై స్త్రీలు “సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞ చొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి” (లూకా 23:56). "విశ్రాంతిదినము గడచిపోగానే" (మార్కు 16:1) స్త్రీలు తమ విచారకరమైన పనిని కొనసాగించుటకు “ఆదివారమున” (మార్కు 16:2) వచ్చిరి. అప్పుడు వారు యేసు "ఆదివారము ఉదయమున" లేచెనని కనుగొనిరి (9వ వచనము), దీనిని సాధారణముగా “ఈస్టర్ ఆదివారము" అని పిలుస్తారు. విశ్రాంతిదినము “ఆజ్ఞ ప్రకారము” ఈస్టర్ ఆదివారమునకు ముందు రోజుని అనగా నేడు మనము పిలిచే "శనివారము" అని గమనించుము.
D. అపొస్తలుల కార్యములు గ్రంథకర్తయైన లూకా, ఆరాధన దినము యొక్క ఏ మార్పును గూర్చి సూచించుట లేదు. మార్పు గురించి బైబిలులో దాఖలాల్లేవు.
యేసు ప్రభువు బోధల “నన్నిటిని” గూర్చి తన సువార్తలో (లూకా గ్రంథములో) తాను వ్రాసెనని అపొస్తలుల కార్యములు గ్రంథములో లూకా చెప్పెను. (అపొస్తలుల కార్యములు 1:1-3). కాని విశ్రాంతిదిన మార్పు గురించి లూకా ఎన్నడు వ్రాయలేదు.
"నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు" (యెషయా 66:22, 23).
జవాబు : అవును. యుగయుగాలుగా రక్షింపబడిన ప్రజలు క్రొత్త భూమిలో విశ్రాంతిదినమును గైకొందురని బైబిలు చెప్పుచున్నది.
"విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు" (యెషయా 58:13). "మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు" (మత్తయి 12:8).
జవాబు : కాదు ప్రకటన 1:10లో ప్రభువు దినము" గురించి బైబిలు మాట్లాడుచున్నది, కాబట్టి ప్రభువుకు ఒక ప్రత్యేక దినమున్నది. కాని లేఖనమందు ఏ వచనము ఆదివారము ప్రభువు దినమని సూచించలేదు. బదులుగా, బైబిలు ఏడవ దిన విశ్రాంతిదినము ప్రభువు దినమని స్పష్టముగా గుర్తించుచున్నది. ప్రభువు ఎప్పటికి ఆశీర్వదించిన మరియు తన సొంతమని చెప్పుకొనిన ఏకైక దినము ఏడవ దిన విశ్రాంతిదినము
"క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగల వారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువ వేయబడెనని యెరుగుదుము" (రోమీయులకు 6:3-6).
జవాబు : లేదు! పునరుత్థానమునకు గౌరవార్ధముగానైనను లేదా మరే ఇతర కారణము వలననైనను ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించుటను గూర్చి బైబిలు ఎన్నడును సూచించలేదు. మనము నేరుగా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారానే క్రీస్తును గౌరవించెదము లేదా ప్రేమించెదము (యోహాను 14:15) - అంతేకాని, మానవ కల్పిత సంప్రదాయములను ఆయన శాశ్వతమైన ధర్మశాస్త్రము స్థానములో భర్తీ చేయుట ద్వారా మాత్రము కాదు.
"అతడు ... కాలములను న్యాయపద్ధతులను నివారణ (మార్పు) చేయ బూనుకొనును" (దానియేలు 7:25). “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు.” “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు” (మత్తయి 15:6, 9). "దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు."... "దాని ప్రవక్తలు ... యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు” (యెహెజ్కేలు 22:26, 28).
జవాబు : యేసు ప్రభువు పునరుత్థానమై సుమారు 300 సంవత్సరాలైన తరువాత, కొంతవరకు యూదులపై ద్వేషము కారణముగా, తప్పు మార్గములో నడిపింపబడిన వ్యక్తులు దేవుని పరిశుద్ధ ఆరాధన దినమును శనివారము నుండి ఆదివారమునకు మార్చాలని సూచించిరి. అది జరుగునని దేవుడు ముందుగానే ఊహించెను, ఊహించినట్లే అది జరిగెను. ఈ అబద్ధము ప్రమాదమును గుర్తెరుగని మన తరమునకు నిజమైనట్టుగా (వాస్తవమైనట్టుగా) ప్రాప్తించినది. ఏదేమైనను, ఆదివారపు ఆచరణ అనునది కేవలము మనుష్యుల సంప్రదాయము మాత్రమే, ఇది విశ్రాంతిదినమును గైకొనుమని ఆజ్ఞాపించే దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించుచున్నది. దేవుడు మాత్రమే ఒక దినమును పరిశుద్ధపరచగలడు. దేవుడు విశ్రాంతిదినమును ఆశీర్వదించెను, దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఎవరును దానిని “తిరిగి మార్చలేరు” (సంఖ్యాకాండము 23:20).
"మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు" (ద్వితీయోపదేశకాండము 4:2). "దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ... ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు" (సామెతలు 30:5, 6).
జవాబు : ప్రజలు తన ధర్మశాస్త్రములో దేనినైనను తీసివేయుట లేదా కలుపుట ద్వారా మార్పులు చేర్పులు చేయుటను దేవుడు నిషేధించియున్నాడు. దేవుని ధర్మశాస్త్రములో మార్పులు చేర్పులు చేయుట అనునది ఒక వ్యక్తి చేయగలిగే అత్యంత ప్రమాదకరమైన పని, ఎందుకనగా దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణమైనదై చెడు నుండి మనలను సంరక్షించుటకు రూపొందించబడినది.
A. సృష్టి కార్యమునకు గుర్తు : "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." "ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను" (నిర్గమకాండము 20:8, 11).
B. పాపవిమోచనకు మరియు పవిత్రీకరణకు గుర్తు : “మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని” (యెహెజ్కేలు 20:12).
జవాబు : దేవుడు విశ్రాంతిదినమును రెండిటికి గుర్తుగా ఉండుటకు ఇచ్చెను :
1) ఇది ఆరు అక్షరార్థమైన దినములలో ఆయన ప్రపంచమును సృష్టించెననుటకు గుర్తు, మరియు
2) ప్రజలను పాపము నుండి విమోచించుటకు మరియు పవిత్రపరచుటకు దేవుని మహోన్నతమైన శక్తికి కూడ గుర్తు. సృష్టికార్యమునకు మరియు పాపవిమోచనకు దేవుని ప్రశస్తమైన గుర్తుగా ఏడవ దిన విశ్రాంతిదినమును ప్రేమించుట మనునది క్రైస్తవునికి సహజ స్పందనయై యున్నది (నిర్గమకాండము 31:13, 17; యెహెజ్కేలు 20:12, 20). దేవుని విశ్రాంతిదినమును కాళ్లు క్రింద త్రొక్కుట ఎంతో అగౌరవము లేక అవమానకరము. యెషయా 58:13, 14లో, ధన్యులగు వారందరు తన పరిశుద్ధ దినము నుండి వారి పాదములను తప్పక వెనక్కి తీసికొందురని దేవుడు చెప్పుచున్నాడు.
“ఆజ్ఞాతిక్రమమే పాపము” (1 యోహాను 3:4). "పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమీయులకు 6:23). “ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును” (యాకోబు 2:10). “క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” (1 పేతురు 2:21). “తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను” (హెబ్రీయులకు 5:10).
జవాబు : ఇది జీవమరణములకు సంబంధించిన విషయము. దేవుని ధర్మశాస్త్రములోని నాల్గవ ఆజ్ఞ ద్వారా విశ్రాంతిదినము కాపాడబడినది మరియు సమర్ధించబడినది. పది ఆజ్ఞలలో దేనినైననను బుద్ధిపూర్వకముగా మీరుట పాపము. క్రైస్తవులు విశ్రాంతిదినమును పాటించుటకు క్రీస్తు ఉదాహరణను (మాదిరిని) సంతోషముగా అనుసరించుదురు. భక్తి శ్రద్ధలతో “సత్యవాక్యమును సరిగా ఉపదేశించు” వారముగా బైబిలును ధ్యానించుటయే మనకు క్షేమము (2 తిమోతి 2:15). మనము అనుసరించు ప్రతి క్రైస్తవ నియమమునకు సానుకూలమైన లేఖన ఆధారము తప్పనిసరిగా ఉండవలెను.
“దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు ... నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.” "కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును" (యెహెజ్కేలు 22:26, 31).
జవాబు : కొంతమంది మత నాయకులు అంతగా తెలియక (లేదా సరైన అవగాహన లేక) ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించుచున్నారు, కాని బుద్ధిపూర్వకముగా అట్లు చేయువారు దేవుడు పరిశుద్ధమని పిలిచిన దానిని అపరిశుద్ధ పరుచుచున్నారు. దేవుని నిజమైన విశ్రాంతిదినము నుండి తమ కళ్లను చెవులను మూసుకొనుటలో, చాలామంది మత నాయకులు దానిని అపరిశుద్ధపర్చునట్లు ఇతరులను నడిపించియున్నారు. ఈ విషయములో లక్షలాది మంది తప్పుదారి పట్టించబడి యున్నారు. తమ పారంపర్యాచారము చొప్పున పది ఆజ్ఞలలో ఒకదానిని నిరర్ధకము చేయుచు దేవునిని ప్రేమించుచునట్లు నటించినందుకు యేసు పరిసయ్యులను తీవ్రముగా గద్దించెను (మార్కు 7:7-13).
17. విశ్రాంతిదినమును గైకొనుట మనునది వ్యక్తిగతముగా నన్ను ప్రభావితము చేయునా?
"మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు" (యోహాను 14:15). "కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును" (యాకోబు 4:17). "విశ్రాంతిదినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినము కొరకు నియమింపబడలేదు" అని యేసు ప్రభువు చెప్పెను (మార్కు 2:27). "జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు" (ప్రకటన 22:14).
గమనిక : ప్రకటన 22:14 తెలుగు బైబిలులో "ఆయన ఆజ్ఞలు గైకొనువారు ధన్యులు" అనుటకు బదులుగా "తమ వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు" అని వ్రాయబడినది. ప్రామాణికమైన కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషు బైబిలులో, "ఆయన ఆజ్ఞలు గైకొనువారు ధన్యులు" అని వ్రాయబడినది. దయచేసి గమనించుము.
జవాబు : అవును! విశ్రాంతిదినము అనునది ఐహిక విచారముల నుండి ఉపశమనము కలిగించుటకు నీ కొరకు దానిని నియమించిన దేవుని యొద్ద నుండి వచ్చిన బహుమానము! ఆయనను ప్రేమించు ప్రజలు ఆయన విశ్రాంతిదిన ఆజ్ఞను పాటించాలని కోరుకొనుట సహజము. నిజానికి, ఆజ్ఞను గైకొనలేని ప్రేమ నిజమైన ప్రేమే కాదు (1 యోహాను 2:4). ఇది మనమందరము తీసికొనవలసిన నిర్ణయము, దీనిని మనము నివారించలేము. శుభవార్త ఏమిటంటే, విశ్రాంతిదినమును గైకొనాలని కోరుకొనుట అనునది నీకు ఎంతగానో ఆశీర్వదకరమగును!
విశ్రాంతిదినమున, నీవు నీ మనస్సులో ఏ సంకోచము, అపరాధ భావన లేకుండ అనుదిన కార్యకలాపాలు, పని మరియు వస్తు కొనుగోలు వంటివి విరమించుకొని, వాటికి బదులుగా, విశ్వమును సృజించిన సృష్టికర్తతో సమయము గడుపుము. తోటి విశ్వాసులతో దేవునిని ఆరాధించుట, కుటుంబముతో సమయమును గడుపుట, ప్రకృతిలో నడుచుట, ఆధ్యాత్మికముగా బలపరచే పుస్తకములను చదువుట మరియు రోగులను దర్శించుట మరియు ప్రోత్సహించుట, ఇవన్నియు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు గల చక్కని మార్గములు. ఆరు రోజుల పని ఒత్తిడి తరువాత, నీ ప్రయాస అంతటి నుండి విశ్రాంతి తీసికొనుటకు మరియు నీ ప్రాణమును పోషించుకొనుటకు దేవుడు నీకు విశ్రాంతిదినమనే బహుమానము నిచ్చెను. నీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలియునని నీవు విశ్వసించవచ్చును!
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. కాని విశ్రాంతిదినము యూదుల కొరకు మాత్రమే నియమింపబడినది కాదా?
జవాబు : కాదు, యేసు ప్రభువు, "విశ్రాంతిదినము మనుష్యుల కొరకే నియమింపబడెను" అని చెప్పెను (మార్కు 2:27). ఇది యూదుల కొరకు మాత్రమే కాదు కాని సమస్త మానవాళికి అనగా ప్రతి చోట నున్న స్త్రీ పురుషులందరి కొరకు నియమింపబడెను. విశ్రాంతిదినము నియమింపబడిన 2,500 సంవత్సరముల వరకు యూదా దేశము (జాతి) ఉనికిలోనే లేదు..
2. అపొస్తలుల కార్యములు 20:7-12 వచనములు శిష్యులు ఆదివారమును పరిశుద్ధ దినముగా ఆచరించిరనుటకు ఋజువు కాదా?
జవాబు : బైబిలు ప్రకారము, ప్రతి దినము సూర్యాస్తమయము నుండి ప్రారంభమై మరుసటి సూర్యాస్తమయముతో ముగియును (ఆదికాండము 1:5, 8, 13, 19, 23, 31; లేవీయకాండము 23:32) మరియు రోజు యొక్క చీకటి భాగము మొదట వచ్చును. కాబట్టి విశ్రాంతిదినము శుక్రవారము రాత్రి సూర్యాస్తమయము నుండి ప్రారంభమై శనివారము రాత్రి సూర్యాస్తమయముతో ముగియును. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయములో చర్చించబడిన ఈ సభ ఆదివారము చీకటి భాగములో జరిగెను, లేదా ఇప్పుడు మనము శనివారము రాత్రి అని పిలుస్తాము. ఇది శనివారము రాత్రి జరిగిన సభ, ఇది అర్ధరాత్రి వరకు కొనసాగెను. పౌలు వీడ్కోలు ప్రయాణములో ఉండెను మరియు అతడు ఈ ప్రజలను మరల చూడలేదని అతనికి తెలియును (25వ వచనము). కనుక అతడు అంతసేపు బోధించెనని ఆశ్చర్యపోనవసరము లేదు! (కాని సాధారణ వారపు సభ అయితే రాత్రంతయు జరిగి యుండేది కాదు.) పౌలు “మరునాడు వెళ్లనైయుండెను” (7వ వచనము). రొట్టె విరుచుటను గూర్చి ఇక్కడ ప్రత్యేక ప్రాముఖ్యత లేదు, ఎందుకనగా వారు అనుదినము రొట్టె విరిచిరి (అపొస్తలుల కార్యములు 2:46). ఈ వచనములో మొదటి దినము పరిశుద్ధమైనదని గాని, లేదా ఈ ఆదిమ సంఘ తొలి క్రైస్తవులు దీనిని అట్లు భావించినట్లు గాని సూచనలు లేవు. విశ్రాంతిదినము మార్చబడినదనుటకు ఎటువంటి ఆధారాలు లేవు. (యాదృచ్ఛికముగా, ఈ సభ కేవలము ఐతుకు క్రింద పడి చనిపోయినవాడై తిరిగి జీవమునకు ఎత్తబడిన అద్భుత కార్యమును బట్టి ప్రస్తావించబడి యుండవచ్చును.) యెహెజ్కేలు 46:1లో, దేవుడు ఆదివారమును ఆరు సాధారణ "పనిచేయు దినములలో" ఒకటిగా సూచించుచున్నాడు.
3. 1 కొరింథీయులకు 16:1, 2 వచనములు ఆదివారపు సంఘ సండే స్కూల్ చందాలను గూర్చి మాట్లాడుట లేదా?
జవాబు : లేదు. ప్రజలు కూడుకునే సంఘ ఆరాధన సమావేశము గురించి ఇక్కడ ప్రస్తావనే లేదు. డబ్బును ఇంటి వద్దనే ఎవరికి వారే వ్యక్తిగతముగా ఒక ప్రక్కనపెట్టి ఉంచాలి. చిన్న ఆసియాలోని సంఘములను యెరూషలేములో పేదరికముతో బాధపడుచున్న వారి సహోదరులకు సహాయము చేయమని పౌలు వ్రాయుచున్నాడు (రోమీయులకు 15:26-28). ఈ క్రైస్తవులందరు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించినవారే, కాబట్టి విశ్రాంతిదినము గడచిన తరువాత, ఆదివారము ఉదయమున, వారు తమ పేద సహోదరుల కొరకు కొంత విరాళమును ఒక ప్రక్కనపెట్టి ఉంచాలని పౌలు సూచించెను, కనుక అతడు వచ్చినప్పుడు అది తన చేతి కందజేయబడును. ఇది ఎవరికి వారే వ్యక్తిగతముగా, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇంటి వద్దనే చేయవలసియున్నది. ఆదివారము పరిశుద్ధ దినమనే ప్రస్తావనే ఇక్కడ లేదు.
4. కాని క్రీస్తు జీవించిన కాలము నుండి కాలము క్రమము తప్పి వారము యొక్క దినముల క్రమము మారలేదా?
జవాబు : లేదు! క్యాలెండర్ మారినను, వారపు ఏడు దినముల క్రమము ఎప్పుడు మారలేదని పండితులు మరియు చరిత్రకారులు అంగీకరించుచున్నారు. అందుచేత, మన ఏడవ దినము యేసు ప్రభువు పరిశుద్ధముగా ఆచరించిన అదే ఏడవ దినమని నీవు ఖచ్చితముగా నమ్మవచ్చును!
5. యోహాను 20:19వ వచనము క్రీస్తు పునరుత్థానమునకు గౌరవార్ధముగా శిష్యులు ఆదివారపు ఆచరణను నియమించిరనుటకు ఋజువు కాదా?
జవాబు : కాదు. శిష్యులు ఈ సమయమందు పునరుత్థానము జరిగినదని నమ్మలేదు. వారు "యూదులకు భయపడి" అక్కడ కూడుకొనిరి. యేసు ప్రభువు వారి మధ్యన ప్రత్యక్షమైనప్పుడు, “తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున” ఆయన వారిని గద్దించెను (మార్కు 16:14). వారు ఆదివారమును పరిశుద్ధ దినముగా ఎంచినట్లు లేదా భావించినట్లు ఎటువంటి సూచనలు లేవు. క్రొత్త నిబంధనలో ఎనిమిది వచనములు మాత్రమే వారములో మొదటి దినమును గూర్చి ప్రస్తావించుచున్నవి, వాటిలో ఏవియు అది పరిశుద్ధమైనదని సూచించవు.
6. కొలొస్సయులకు 2:14-17 వచనములు ఏడవ దిన విశ్రాంతిదినము కొట్టివేయబడెనని చెప్పుట లేదా?
జవాబు : లేనే లేదు. ఇది "రాబోవు వాటికి ఛాయ"గా ఉన్న ప్రతి సంవత్సరము వచ్చెడి, విధిరూపకమైన ఆచార విశ్రాంతిదినములను మాత్రమే సూచించుచున్నది గాని ఏడవ దిన విశ్రాంతిదినమును కాదు. ప్రాచీన ఇశ్రాయేలులో ప్రతి సంవత్సరము వచ్చెడి ఏడు పరిశుద్ధ దినములు లేదా పండుగలు ఉండేవి, ఇవి కూడ విశ్రాంతిదినములని పిలువబడినవి (లేవీయకాండము 23వ అధ్యాయము చూడుము). ఇవి "యెహెూవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు" లేదా ఏడవ దిన విశ్రాంతిదినముతో పాటు అదనముగా ఇయ్యబడినవి (లేవీయకాండము 23:37, 38). వాటి ప్రధాన ప్రాముఖ్యత సిలువకు ఛాయా రూపకముగా చూపించి లేదా సూచించి, సిలువలో కొట్టివేయబడుట యందుండెను. దేవుని ఏడవ దిన విశ్రాంతిదినము ఆదాము పాపము చేయక మునుపే నియమించబడెను, గనుక అది పాపవిమోచన గురించి ఛాయారూపకముగా ఏమియు సూచించదు. అందుచేతనే కొలొస్సయులకు 2వ అధ్యాయము “ఛాయ” అయిన విశ్రాంతిదినములను వేరు చేసి ప్రత్యేకముగా ప్రస్తావించుచున్నది.
7. రోమీయులకు 14:5 ప్రకారము, మనము ఏ దినమును ఆచరించుచున్నామన్నది వ్యక్తిగత అభిప్రాయము కాదా?
జవాబు : ఈ అధ్యాయమంతయు "సంశయములను తీర్చుకునే" విషయములో (1వ వచనము) ఒకరినొకరు తీర్పు తీర్చుకునే అంశము మీద మాట్లాడుచున్నదని గమనించుము (4, 10, 13 వచనములు). ఇక్కడ సమస్య ఇతర మత దినముల మీదనే కాని నీతి ధర్మశాస్త్రములో భాగమైన ఏడవ దిన విశ్రాంతి దినము మీద కాదు. యూదా క్రైస్తవులు వాటిని ఆచరించనందుకు అన్యజన క్రైస్తవులను తీర్పు తీర్చుచుండెడివారు. "మీరు ఒకని నొకడు తీర్పు తీర్చుకొనకుడి. ఆ విధరూపకమైన ఆచార ధర్మశాస్త్రము ఇకపై అమలులో లేదు" అని పౌలు చెప్పుచున్నాడు.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) యేసు ప్రభువు (1)
( ) ఆదివారమును పరిశుద్ధ దినముగా ఆచరించెను.
( ) వారములో ఏడవ దిన విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించెను.
( ) ఇతర దినములన్నిటిని పరిశుద్ధముగా ఆచరించెను.
2) ప్రభువు దినమేదనగా (1)
( ) వారములో మొదటి దినమైన ఆదివారము.
( ) వారములో ఏడవ దినమైన విశ్రాంతిదినము.
( ) ప్రభువు కొరకు మనము ప్రతిష్టించే ఏ దినమైనను ప్రభువు దినమే.
3) విశ్రాంతిదినము (1)
( ) యూదుల కొరకు మాత్రమే నియమింపబడెను.
( ) సృష్టి కార్యమందు దేవుని చేత అన్ని చోట్లనున్న స్త్రీ పురుషులందరి కొరకు మరియు అన్ని కాలముల కుండుటకు నియమింపబడెను.
( ) పాత నిబంధన కాలములలో జీవించిన ప్రజల కొరకు మాత్రమే నియమింపబడెను.
4) విశ్రాంతిదినమును ఆదివారమునకు మార్చినది (1)
( ) క్రీస్తు.
( ) అపొస్తలులు.
( ) తప్పు మార్గములో నడిపింపబడిన వ్యక్తులు.
5) విశ్రాంతిదిన ఆజ్ఞ ఇమిడియున్న దేవుని నీతి ధర్మశాస్త్రము (1 )
( ) నేడు అమలులో లేదు.
( ) ఎన్నటికి మారదు. అది నేటికిని ఆచరింపబద్ధమైనది.
( ) క్రీస్తు మరణమందు కొట్టివేయబడెను.
6) క్రొత్త నిబంధన సంఘములో మారుమనస్సు పొందిన అన్యుజనులు మరియు అపొస్తలులు (1)
( ) ఆదివారమును పరిశుద్ధ దినముగా ఆచరించిరి.
( ) మనస్ఫూర్తిగా ఆచరించిన యెడల ఏ దినమైనను పరిశుద్ధమగునని వారు బోధించిరి
( ) విశ్రాంతిదినమును ఆచరించిరి.
7) విశ్రాంతిదినము (1)
( ) సిలువలో కొట్టివేయబడెను.
( ) యేసు ప్రభువు రెండవ రాకడయందు నిలిపివేయబడును.
( ) దేవుని నిత్య రాజ్యములో అన్ని యుగాల యందు విమోచింపబడినవారి చేత ఆచరింపబడును.
8) విశ్రాంతిదినము దేవుని ధర్మశాస్త్రములో భాగము గనుక, విశ్రాంతిదినమును మీరుట అనునది (1)
( ) క్రీస్తు మరణము నుండి పెద్దగా పట్టించుకోదగ్గ విషయమేమి కాదు.
( ) పాపము, ఎందుకనగా అది పరిశుద్ధమైన వాటిని కాళ్ల క్రింద త్రొక్కిన దానితో సమానము.
( ) నేడు అంత ప్రాముఖ్యమైన విషయమేమి కాదు.
9) యేసు ప్రభువును నిజముగా ప్రేమించి అనుసరించు వారందరు (1)
( ) యేసు వలె విశ్రాంతిదినమును గైకొందురు.
( ) ఇతర దినములన్నిటిని పరిశుద్ధముగా ఆచరించుదురు.
( ) ఆదివారమును పరిశుద్ధ దినముగా ఆచరించుదురు.
10) విశ్రాంతిదినము (1)
( ) వారములో మొదటి దినమైన ఆదివారము.
( ) వారములో ఏడవ దినమైన శనివారము. (శుక్రవారము సూర్యాస్తమయము నుండి శనివారము సూర్యాస్తమయము వరకు).
( ) మనము దేవునికి ప్రతిష్టించే ఏ దినమైనను విశ్రాంతిదినమే.
11) ఆదివారపు ఆచరణ అనునది (1)
( ) బైబిలులో ముందుగానే చెప్పబడినట్లుగా మనుష్యులు కల్పించిన బోధ.
( ) నేటి మన తరము ప్రజల కొరకు దేవుని ప్రణాళిక (నియమము).
( ) క్రీస్తు పునరుత్థానమందు ప్రారంభమై పెంతెకొస్తు దినమందు ఆమోదించబడెను.
12) విశ్రాంతిదినమును గైకొనుట మనునది (1)
( ) క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తు.
( ) యూదులకు మాత్రమే ప్రాముఖ్యము.
( ) సృష్టి కార్యమునకు మరియు పాప విమోచనకు దేవుడిచ్చిన రెండు విధములైన గుర్తు.
13) యేసు ప్రభువు మాదిరి ననుసరించి విశ్రాంతిదినమును గైకొనుటకు నేను ఇష్టపడుచున్నాను.
( ) అవును.
( ) కాదు.