Lesson 9
నీవు నీ ప్రియమైన వారిని బాధించుటలో విసిగిపోయావా? నీ గత పొరపాట్లను తలంచుకొనుచు నీవు నిరంతరము విచారములో జీవించుచున్నావా? నీవు ఎప్పుడైన నీ శరీరము లోపల బయట శుభ్రముగా కడుగబడాలని కోరుకున్నావా? అయితే నీ కొరకు మాకొక గొప్ప శుభవార్త ఉన్నది - నీవు కడుగబడవచ్చును! నీ పాపములను పూర్తిగా కడిగివేసి నీ స్వభావమును ఉన్నతశక్తితో నింపగల ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. హాస్యాస్పదముగా ఉన్నదా? కానే కాదు! బైబిలు, "మనము బాప్తిస్మము వలన ... ఆయనతో (క్రీస్తుతో) కూడ పాతిపెట్టబడితిమి" అని చెప్పుచున్నది (రోమీయులకు 6:4). నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు, పాత జీవితము మరణించునని మరియు నీ పాపములన్నిటిని మరచిపోవుదునని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు! అంతే కాదు, ప్రతి పాపపు అలవాటును అధిగమించుటకు ఆయన నీకు సహాయము చేయగలడు. సిలువను గూర్చి బైబిలులో 28 సార్లు ప్రస్తావించబడగా, బాప్తిస్మము 97 సార్లు ప్రస్తావించబడినదని నీకు తెలియునా? ఇది చాలా ప్రాముఖ్యమైనదై యుండాలి - దీనిని గూర్చి ఆశ్చర్యపోనవసరము లేని విషయమేమిటంటే, ఇది వెంటాడే, పాపముతో నిండిన గతమును జ్ఞాపకమునకు రాకుండ భూస్థాపితము చేసి నూతన జీవితమును సూచించుచున్నది. బైబిలు యొక్క అద్భుతమైన సత్యములను చదువుము!
"నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును" (మార్కు 16:16).
జవాబు : అవును! దీనిని ఇంతకంటే స్పష్టముగా ఎట్లు చెప్పగలము?
2. కాని సిలువపై ఉన్న దొంగ బాప్తిస్మము పొందలేదు, కాబట్టి మనమెందుకు పొందవలెను?
"మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు" (కీర్తనలు 103:14).
జవాబు : యెహోవా యెహెజ్కేలు 33:15లో తన ప్రజలను నిర్దేశించినట్లు, సిలువపై ఉన్న దొంగ తాను దొంగిలించిన వాటిని కూడ తిరిగి ఇచ్చివేయలేదు. మనము చేయగలిగినదానికే దేవుడు మనలను జవాబుదారులుగా ఉంచును, కాని "మట్టి" వారమైన మన యొక్క పరిమితులను కూడ ఆయన గుర్తించును. శారీరకముగా అసాధ్యమైన దానిని ఆయన కోరడు. దొంగ సిలువపై నుండి క్రిందికి దిగి రాగలిగితే, బాప్తిస్మము పొందేవాడే. పొందుటకు సాధ్యమైన ప్రతి వ్యక్తి బాప్తిస్మము పొందవలెను.
3. "బాప్తిస్మము" అని పిలువబడే అనేక విధులు పద్ధతులు ఉన్నవి. ఒక వ్యక్తి దాని గురించి చిత్తశుద్ధితో నిజాయితీగా ఉంటే, వీటిలో ఏదైనను ఆమోదయోగ్యము కాదా?
"ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే" (ఎఫెసీయులకు 4:5).
జవాబు : కాదు. ఒకే ఒక్క నిజమైన బాప్తిస్మము మాత్రమే ఉన్నది. బాప్తిస్మములు అని పిలువబడే మిగతావన్ని నకిలీ బాప్తిస్మములు. "బాప్తిస్మము" అనే మాట "బాప్టిస్మా" అనే గ్రీకు పదము నుండి వచ్చినది. దీని అర్ధము నీటి అడుగుకు ముంచుట లేదా నీటిలో మునిగిపోవుట లేదా నీటిలో ముంచి లేపుట." క్రొత్త నిబంధనలో ద్రవముల వాడకమును వర్ణించుటకు ఉపయోగించబడిన ఎనిమిది గ్రీకు పదములు ఉన్నవి. కాని ఈ వివిధ పదములకు – చిలకరించుట, పోయుట, లేదా నీటిలో పూర్తిగా ముంచి లేపుట అని అర్ధము కలదు - అయితే బాప్తిస్మమును వివరించుటకు "నీటిలో" పూర్తిగా ముంచి లేపుట" (బాప్టైజో) అనే ఒక్క అర్ధము మాత్రమే ఉపయోగించబడును.
గమనిక : బాప్తిస్మము విషయమై అనేక "ఇష్టానుసారమైన నకిలీ పద్ధతుల ప్రణాళిక గల అపవాది నీతో ఇట్లనును. "నీకు నచ్చిన పద్ధతిలో బాప్తిస్మము పొందుము. ఏ పద్ధతిలో పొందుచున్నామన్నది ముఖ్యము కాదు. ఆత్మ సిద్ధపాటే ముఖ్యము. కాని బైబిలు, "ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే" అని చెప్పుచున్నది. అంతేకాక, “యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము" అని కూడ బైబిలు చెప్పుచున్నది (యిర్మీయా 38:20).
“యేసు ... యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను” (మార్కు 1:9, 10).
జవాబు : యేసు ప్రభువు "నీటిలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి" ద్వారా బాప్తిస్మము పొందెను. ఆ కార్యక్రమము తరువాత, ఆయన "నీళ్లలో నుండి" ఒడ్డునకు వచ్చెనని గమనించుము. చాలామంది నమ్ముచున్నట్లుగా యేసు ప్రభువు నది ఒడ్డున కాక, "యోర్దాను నదిలో" బాప్తిస్మము పొందెను. బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిచ్చుటకు ఎల్లప్పుడు "నీళ్లు విస్తారముగా" (యోహాను 3:23) ఉండే ప్రదేశమునే కనుగొనెను, కనుక అది తగినంత లోతుగా ఉండును. యేసు ప్రభువు మాదిరిని అనుసరించుటకు మనము పిలువబడితిమని బైబిలు చెప్పుచున్నది. (1 పేతురు 2:21).
"ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి, అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను" (అపొస్తలుల కార్యములు 8:38, 39).
జవాబు : లేదు! ఆదిమ క్రైస్తవ సంఘ నాయకుడైన ఫిలిప్పు ఐతియొపీయ దేశపు కోశాధికారికి సరిగ్గా బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువుకు బాప్తిస్మమిచ్చినట్లే "నీటిలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి" ద్వారా బాప్తిస్మమిచ్చెనని దయచేసి గమనించుము. సంఘములో అతని లేదా ఆమె పదవి లేదా స్థానము ఎంతదైనను, దేవుని ప్రత్యక్ష శాసనములను లేదా ఆదేశములను మార్చుటకు ఏ వ్యక్తికి అధికారము లేదు.
"మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు" (మత్తయి 15:9).
జవాబు : తప్పు మార్గములో నడిపింపబడిన వ్యక్తులు దేవుని వాక్యమునకు ప్రత్యక్ష విరుద్ధముగా ఇతర బాప్తిస్మ పద్ధతులను ప్రవేశపెట్టిరి. యేసు ప్రభువు, "మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?", "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు" అని చెప్పెను (మత్తయి 15:3, 6). మనుష్యులు కల్పించిన బోధను అనుసరించే ఆరాధన వ్యర్థమైనది. ఒక్కసారి ఆలోచించుము! బాప్తిస్మము యొక్క పరిశుద్ధమైన నియమమును ప్రజలు తక్కువ పర్యవసానముగా మార్చుటకు ప్రయత్నించుటలో వారు దానిని దుర్బోధగా చిత్రీకరించి యున్నారు. “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని" బైబిలు మనకు ఉపదేశించుటలో ఆశ్చర్యము లేదు (యూదా 1:3).
7. బాప్తిస్మము కొరకు సిద్ధపడుటకు ఒక వ్యక్తి ఏమి చేయవలెను?
జవాబు :
అ. దేవునికి కావల్సినవి తెలిసికొనుము. "కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి... బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” (మత్తయి 28:19, 20).
ఆ. దేవుని వాక్య సత్యమును నమ్ముము. "నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును" (మార్కు 16:16).
ఇ. పశ్చాత్తాపపడి నీ పాపముల నుండి తిరిగి మారుమనస్సు అనుభవము పొందుము. "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి" (అపొస్తలుల కార్యములు 2:38). "మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి" (అపొస్తలుల కార్యములు 3:20).
"తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగల వారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగల వారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువ వేయబడెనని యెరుగుదుము” (రోమీయులకు 6:4-6).
జవాబు : బాప్తిస్మము విశ్వాసి క్రీస్తుతో తన మరణము, భూస్థాపన మరియు పునరుత్థానములో ఏకమగుటను సూచించుచున్నది. ఈ సాదృశ్యము లోతైన అర్ధముతో నిండి యున్నది. బాప్తిస్మములో కళ్లు మూసికొని, మరణములో ఉన్నట్లుగా శ్వాస నిలిపివేయబడును. అప్పుడు నీటిలో భూస్థాపన మరియు నీటి సమాధి నుండి క్రీస్తులో నూతన జీవితమునకు పునరుత్థానము జరుగును. నీటిలో నుండి పైకి లేచినప్పుడు, కళ్లు తెరుచుకొనును మరియు విశ్వాసి తిరిగి ఊపిరి పీల్చుకొనుట ప్రారంభించును మరియు స్నేహితులతో కలిసిపోవును - ఇది పునరుత్థానమునకు సాదృశ్యము. క్రైస్తవ్యము మరియు ఇతర మతములన్నిటి మధ్య గొప్ప వ్యత్యాసము క్రీస్తు మరణము, భూస్థాపన మరియు పునరుత్థానము. ఈ మూడు చర్యలలో దేవుడు మన కొరకు చేయాలనుకునేదంతయు సాధ్యమగును. ఈ మూడు ప్రాముఖ్యమైన చర్యలను క్రైస్తవుల మనస్సులలో అంత్యకాలము వరకు సజీవముగా ఉంచుటకు, ప్రభువు "నీటిలో పూర్తిగా ముంచి లేపే" బాప్తిస్మమును ఒక జ్ఞాపకార్ధముగా నియమించెను. ఇతర బాప్తిస్మ పద్ధతులలో మరణము, భూస్థాపన మరియు పునరుత్థానము యొక్క సాదృశ్యము లేదు. “నీటిలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి” మాత్రమే రోమీయులకు 6:4-6 యొక్క అర్ధమును నెరవేర్చును.
“నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు” (1 యోహాను 2:1).
జవాబు : ఇది ఒక బిడ్డ ఎన్నటికి జారడు మరియు పడడు అని నమ్మకము కలుగు వరకు నడుచుటకు ప్రయత్నించకూడదని చెప్పుట వంటిది. ఒక క్రైస్తవుడు క్రీస్తులో అప్పుడే నూతనముగా జన్మించిన "శిశువు" వంటివాడు. అందుకే మారుమనస్సు అనుభవమును "క్రొత్తగా జన్మించుట" అని అంటారు. ఒక వ్యక్తి యొక్క పాపాత్మకమైన గతము మారుమనస్సు సమయములో దేవుని చేత క్షమించబడి మరువబడును. మరియు బాప్తీస్మము ఆ పాత జీవితము యొక్క దురాశల భూస్థాపనను సూచించుచున్నది. మనము క్రైస్తవ జీవితమును పెద్దలుగా కాక శిశువులుగా ప్రారంభించెదము మరియు అపరిపక్వ క్రైస్తవులుగా మనము అనుభవించే జారుట మరియు పడిపోవుట వంటి కొన్ని బలహీనతల బట్టి కాక, మన వైఖరి మరియు మన జీవిత ధోరణిని బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చును.
"నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్ధన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుము" (అపొస్తలుల కార్యములు 22:16).
జవాబు : బాప్తిస్మము అనునది పశ్చాత్తాపపడే పాపి యేసు ప్రభువు చేత క్షమించబడి, పరిశుద్ధపరచబడి యున్నాడని (1 యోహాను 1:9) మరియు అతని పాపపు గతము అతని వెనుక మరువబడి యున్నదనుటకు బహిరంగ సాక్ష్యము. మారుమనస్సు తరువాత ఒక వ్యక్తిపై ఏ నేరారోపణలు లేవు. నేడు పురుషులు మరియు స్త్రీలు అధికభారముతో కూడిన పాపము మరియు అపరాధభావముతో పోరాడుచున్నారు, మరియు ఈ అపరిశుద్ధత మరియు భారము మానవ వ్యక్తిత్వమునకు ఎంత వినాశకరమైనదంటే, ప్రజలు క్షమాపణ మరియు ప్రక్షాళన (పవిత్రీకరణ) అనే భావనను సాధించుటకు దాదాపు ఎంత దూరమైన వెళతారు. క్రీస్తు యొద్దకు వచ్చుటలోనే నిజమైన సహాయము దొరుకును, ఆయన చెంతకు చేరువారందరికి, ఆయన, "నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని" చెప్పుచున్నాడు (మత్తయి 8:3). ఆయన మనలను పవిత్రులనుగా చేయుట మాత్రమే కాక, మనలోని పాపపు పాత స్వభావమును సిలువ వేయుట కూడ ప్రారంభించును. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకనగా అది యేసు ప్రభువు మన కొరకు చేసిన అద్భుతమైన నిబంధనను మనము బహిరంగముగా అంగీకరించుటయే!
మారుమనస్సు సమయములో, దేవుడు
- మన పాపపు గతమును క్షమించి మరచిపోవును.
- అద్భుతరీతిలో మనలను నూతన ఆధ్యాత్మిక వ్యక్తులుగా మార్చుటకు ప్రారంభించు
- తన సొంత కుమారులు కుమార్తెలుగా మనలను స్వీకరించును.
మారుమనస్సు నొందిన ఏ వ్యక్తియు ఈ అద్భుత కార్యములన్నిటిని జరిగించినందుకు యేసు ప్రభువును బహిరంగముగా గౌరవించు బాప్తిస్మమును ఆలస్యము చేయుటకు ఇష్టపడదు.
11. బాప్తిస్యము కొరకు సిద్ధపడుటకు ఎంత సమయము పట్టును?
జవాబు : అది వ్యక్తిపై ఆధారపడి ఉండును, కొందరు ఇతరులకన్నా త్వరగా విషయములను గ్రహించెదరు. కాని చాలా సందర్భాలలో, సిద్ధపాటుకు తక్కువ సమయమే పట్టవచ్చును. కొన్ని బైబిలు ఉదాహరణలు ఇచ్చటున్నవి
అ. ఐతియొపీయ ధనాగారాధికారి (అపొస్తలుల కార్యములు 8:26-39) - ఇతడు సత్యమును విన్న అదే దినమున బాప్తిస్మము పొందెను.
ఆ. ఫిలిప్పీయ చెరసాల నాయకుడు మరియు అతని కుటుంబము (అపొస్తలుల కార్యములు 16:23-34) – వీరు సత్యమును విన్న అదే రాత్రి బాప్తిస్మము పొందిరి.
ఇ. తార్సువాడైన పౌలు (అపొస్తలుల కార్యములు 9:1-18) - దమస్కు మార్గమున యేసు ప్రభువు ఇతనితో మాట్లాడిన తరువాత మూడు రోజులకు బాప్తిస్మము పొందెను.
ఈ. కొర్నేలి (అపొస్తలుల కార్యములు 10:1-48) - ఇతడు కూడ సత్యమును విన్న అదే దినమున బాప్తిస్మము పొందెను.
12. మారుమనస్సు నొందిన వ్యక్తి యొక్క బాప్తిస్మము గురించి దేవుడు ఎట్లు భావించును?
జవాబు : ఆయన తన కుమారుని బాప్తిస్మమందు "ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాననెను" (మత్తయి 3:17). ప్రభువును ప్రేమించే వారు ఆయనను సంతోషపెట్టుటకు ఎల్లప్పుడు ప్రయత్నించుదురు (1 యోహాను 3:22; 1 థెస్సలొనీకయులకు 4:1). నిజముగా మారుమనస్సు నొందిన వ్యక్తి విషయమై పరలోకములో మహానందము కలుగును!
జవాబు : లేదు! దేవుడు దీనిని స్పష్టముగా వివరించెను :
అ. మనమందరము ఒక్క శరీరములోనికి పిలువబడితిమి. “మీరొక్క శరీరముగా పిలువబడితిరి” (కొలొస్సయులకు 3:15).
ఆ. సంఘమే ఆ శరీరము. "సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు" (కొలొస్సయులకు 1:18).
ఇ. ఆ శరీరములోనికి మనము బాప్తిస్మము ద్వారా. ప్రవేశించుదుము. “మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి" (1 కొరింధీయులకు 12:13).
ఈ. దేవుని మారుమనస్సు నొందిన ప్రజలు సంఘములోనికి చేర్చబడుదురు. "ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో (సంఘములో) చేర్చుచుండెను" (అపొస్తలుల కార్యములు 2:47).
14. బాప్తిస్యము చేయని నాలుగు విషయములను గమనించుము :
మొదటిది : బాప్తిస్మము దానికదే హృదయమును మార్చదు, అది హృదయములో జరిగిన మార్పుకు గుర్తు. ఒక వ్యక్తి విశ్వాసము లేకుండ, పశ్చాత్తాపము లేకుండ, నూతన హృదయము లేకుండ బాప్తిస్మము పొంది యుండవచ్చును. అతడు యేసు ప్రభువు యొక్క మాదిరి ననుసరించి నీటిలో మునిగి యుండవచ్చును, కాని అతడు నీటిలో నుండి ఒక తడవని పాపికి బదులుగా తడిసిన పాపిగా ఇంకను విశ్వాసము లేకుండ, పశ్చాత్తాపము లేకుండ, నూతన హృదయము లేకుండ పైకి వచ్చును. బాప్తిస్మము ఒక వ్యక్తిని నూతనపరచదు. అది ఎవరిని మార్చదు లేదా ఎవరికి నూతనజన్మను ప్రసాదించదు. హృదయమును మార్చునది పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన శక్తియే. "ఒకడు ఆత్మమూలము గాను నీటిమూలము గాను" జన్మింపవలెను (యోహాను 3:5).
రెండవది : బాప్తిస్మము దానికదే ఒక వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించదు. అది తప్పనిసరిగా మన భావములను మార్చదు. బాప్తిస్మము తర్వాత వ్యత్యాసము కనిపించకపోవడముతో కొంతమంది నిరాశ చెందెదరు. రక్షణ అనునది భావోద్వేగమునకు సంబంధించినది కాదు, కాని అది విశ్వాసము మరియు విధేయతకు సంబంధించినది.
మూడవది : బాప్తిస్మము శోధనలను తొలగించదు. ఒక వ్యక్తి బాప్తిస్మము పొందినంత మాత్రాన అపవాది అతనిని విడిచిపోడు. అదే సమయములో యేసు ప్రభువు కూడ, "నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను" అని వాగ్దానము చేసెను (హెబ్రీయులకు 13:5). తప్పించుకునే మార్గము లేకుండ ఏ శోధనలు రావు. ఇది లేఖనము యొక్క వాగ్దానము (1 కొరింథీయులకు 10:13).
నాలుగవది : బాప్తిస్మము రక్షణకు హామీ ఇచ్చే ఏదో మాయాచారము కాదు. ఒకడు నూతన జన్మ అనుభవము పొందినప్పుడు యేసు క్రీస్తు ఇచ్చు ఉచిత బహుమానముగా మాత్రమే రక్షణ వచ్చును. బాప్తిస్మము నిజమైన మారుమనస్సునకు గుర్తు, మరియు మారుమనస్సు బాప్తిస్మమునకు ముందు జరుగని యెడల, అట్టి ఆచారము అర్ధరహితమైనది లేదా నిరర్థకమైనది.
15. నీ పాపములు కడిగివేయబడిన దానికి గుర్తుగా బాప్తిస్మము పొందుమని యేసు ప్రభువు నిన్ను అడుగుచున్నాడు. ఈ పరిశుద్ధమైన నియమమును జరిగించుట కొరకు త్వరలోనే ప్రణాళిక వేసికొనుటకు నీవు ఇష్టపడుచున్నావా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. ఒకటి కంటే ఎక్కువసార్లు బాప్తిస్మము పొందుట ఎప్పటికైన సరియైన విషయమేనా?
జవాబు : అవును, కొన్ని సందర్భాల్లో బైబిలు తిరిగి బాప్తిస్మము పొందుటను ఆమోదించుచున్నట్లు అపొస్తలుల కార్యములు 19:1-5 చూపించుచున్నది.
2. శిశువులు బాప్తీస్మము పొందవలెనా?
జవాబు : అతడు లేదా ఆమె (1) దేవుని సత్యమును తెలిసికొని, (2) దానిని నమ్మి, (3) పశ్చాత్తాప పడి మరియు (4) మారుమనస్సు అనుభవము పొందితేనే తప్ప ఎవరును బాప్తిస్మము పొందకూడదు. ఏ శిశువు ఈ విషయములలో అర్హత సాధించలేదు. ఒక శిశువుకు బాప్తిస్మమిచ్చే హక్కు ఎవరికి లేదు. అట్లు చేయుట బాప్తిస్మమునకు సంబంధించి దేవుడిచ్చిన ప్రత్యక్ష శాసనములను లేదా ఆదేశములను విస్మరించినట్లే అగును. సంఘములో తప్పు మార్గములో నడిపింపబడిన వ్యక్తులు బాప్తిస్మము పొందని శిశువులు నశించిపోయిరని సంవత్సరాల క్రితము ఆదేశించిరి. కాని ఇది బైబిలు ప్రకారము అవాస్తవము. కేవలము బాప్తిస్మ మిప్పించుటలో వారి తల్లిదండ్రులు విఫలమైనందున అమాయక శిశువులను నాశనము చేసే అన్యాయమైన నిరంకుశుడుగా ఇది దేవునికి అపకీర్తి తెచ్చిపెట్టును. ఇట్టి బోధ విషాదకరమైనది.
3. బాప్తిస్యము వ్యక్తిగత అభిప్రాయమునకు సంబంధించిన విషయము కాదా?
జవాబు : అవును - కాని అది నీ అభిప్రాయమో లేదా నా అభిప్రాయమో కాదు. క్రీస్తు అభిప్రాయమే ముఖ్యము. బాప్తిస్మము తనకు ముఖ్యమని క్రీస్తు చెప్పెను. "ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు" (యోహాను 3:5). బాప్తిస్మమును నిరాకరించుట మనునది సాక్ష్యాత్తు దేవుని ప్రత్యక్ష ఉపదేశమును నిరాకరించుటయే (లూకా 7:29, 30).
4. బాప్తిస్మము కొరకు అర్హత సాధించుటకు ఒకడు ఎంత వయస్సు కలిగి యుండవలెను ?
జవాబు : మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసమును గ్రహించుటకు మరియు క్రీస్తుకు లోబడి ఆయనను అనుసరించుటకు తెలివైన నిర్ణయము తీసికొనేంత వయస్సు కలిగి యుండవలెను. చాలా మంది పిల్లలు 10 లేదా 11 సంవత్సరాల వయస్సులోనే బాప్తిస్మము కొరకు సిద్ధముగా ఉంటారు, కొందరు 8 లేదా 9 ఏళ్లకే సిద్ధముగా ఉంటారు. మరికొందరు 12 లేదా 13 ఏళ్లకు కూడ సిద్ధముగా ఉండరు. బైబిలులో బాప్తిస్మము కొరకు వయోస్థాయి పేర్కొనబడలేదు. పిల్లలకు వివిధ స్థాయిల్లో అనుభవము మరియు అవగాహన ఉంటాయి. కొందరు ఇతరులకన్నా ముందే బాప్తిస్మము కొరకు సిద్ధముగా ఉంటారు.
5. బాప్తిస్మము దానికదే నిన్ను రక్షించగలదా?
జవాబు : లేదు. కాని బాప్తిస్మమును నిరాకరించుట ఒకనిని నశించిపోవునట్లు చేయును, ఎందుకనగా అది అవిధేయతతో సమానము. రక్షణ “తనకు విధేయులైన వారికందరికి” కలుగును (హెబ్రీయులకు 5:10).
6. కాని అవసరమైనదల్లా పరిశుద్ధాత్మ మూలముగా బాప్తిస్మము మాత్రమే కాదా?
జవాబు : లేదు. పరిశుద్ధాత్మ మూలముగా బాప్తిస్మము దానికి ముందుగానే ఉన్నప్పటికి, నీటి మూలముగా బాప్తిస్మము కూడ అవసరమని బైబిలు అపొస్తలుల కార్యములు 10:44-48లో చూపించుచున్నది.
7. మనము యేసు నామములో మాత్రమే బాప్తిస్మము పొందకూడదా?
జవాబు : మత్తయి 28:19లో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందవలెనని మనకు చెప్పబడినది. ఇవి యేసు ప్రభువు పవిత్రమైన మాటలు. అపొస్తలుల గ్రంథములో, నూతన విశ్వాసులు యేసు నామములో బాప్తిస్మము పొందిరి. యేసును మెస్సీయాగా గుర్తించుట ఆనాటి ప్రజలకు చాలా ముఖ్యమైన మెట్టు, అందువలన, ఆయన నామములో బాప్తిస్మము పొందుటకు ఇది నిర్దేశించబడినది. నేడు కూడ ఇది చాలా ముఖ్యమైనదని మనము నమ్ముచున్నాము. మత్తయి యొక్క సాక్ష్యములను అపొస్తలుల గ్రంథముతో కలిపి, తండ్రి, కుమారుడు (యేసు) మరియు పరిశుద్ధాత్మ నామములో ప్రజలకు బాప్తిస్మ మిచ్చుచున్నాము. ఈ పద్ధతిని అనుసరించిన యెడల ఒక లేఖనమును మరొకదాని కంటే ఎక్కువగా హెచ్చించే ఆలోచన నివారించబడును.
8. నేను సమర్పించుకొని అధిగమించుటకు కష్టమైన పాపమొకటి ఉన్నది. నేను బాప్తీస్మము పొందవలెనా?
జవాబు : కొన్నిసార్లు మనము ఫలానా పాపముతో పోరాడుచు దానిని అధిగమించలేమని భావించెదము. నిరాశ చెందకుము! మన "ప్రతి భారమును, సుళువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్త"వలెనని దేవుడు కోరుకొనుచున్నాడు (హెబ్రీయులకు 12:2). ఏ పాపము మీదనైనను దేవుడు నీకు విజయము నియ్యగలడు! నీకు ఆ సమర్పణ ఉంటేనే తప్ప, బాప్తిస్మపు నీటిలో భూస్థాపన చేయబడుటకు నీవు సిద్ధముగా లేవు, ఎందుకనగా పాపపు పాత జీవితము మరణించలేదు. మన స్వార్ధమునకు మనము మరణించినప్పుడే మనము క్రీస్తు కొరకు జీవించగలము.
9. "క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు" (గలతీయులకు 3:27). ఈ వాక్యమును వివరించగలరా?
జవాబు : ఇక్కడ దేవుడు బాప్తిస్మమును వివాహముతో పోల్చుచుచున్నాడు. వివాహ సమయములో చాలా మంది వధువులు తమ భర్త పేరును ధరించుకొనినట్లు బహిరంగముగా ప్రకటించునట్లు, బాప్తిస్మము పొందిన అతడు లేదా ఆమె క్రీస్తు పేరు (క్రిస్టియన్) ధరించుకొనినట్లు బహిరంగముగా అంగీకరించును. బాప్తిస్మములో, వివాహము మాదిరిగానే, అనేక సూత్రములు వర్తించును :
అ. నిజమైన ప్రేమ ఉన్నతముగా పాలించబడితేనే తప్ప ఇందులోనికి ఎప్పటికి ప్రవేశించకూడదు.
ఆ. అభ్యర్థి ఇరుకులు ఇబ్బందుల్లోను దేవునికి నమ్మకముగా ఉండాలని కోరుకుంటేనే తప్ప ఇందులోనికి ఎప్పటికి ప్రవేశించకూడదు.
ఇ. దీనికి పూర్తి అవగాహనతో చేరువవ్వవలెను లేదా సమీపించవలెను.
ఈ. దీనిని అకాలముగా లేదా అనవసరముగా ఆలస్యము చేయకూడదు.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) బైబిలు మనకు తెలియజేయునది ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే మరియు (1)
( ) 15 బాప్తిస్మములు.
( ) 5 బాప్తిస్మములు.
( ) 12 బాప్తిస్మములు.
( ) బాప్తిస్మమొక్కటే.
2) బాప్తిస్మము యొక్క అవసరమును యేసు ప్రభువు బోధించెనా? (1)
( ) అవును.
( ) కాదు.
3) యేసు ప్రభువు బాప్తిస్మము పొందినది (1)
( ) నీటి కుమ్మరింపు పద్ధతి ద్వారా.
( ) నీటి చిలకరింపు పద్ధతి ద్వారా.
( ) నీళ్లలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి ద్వారా.
4) “బాప్టైజ్” లేదా “బాప్తిస్మమిచ్చుట” అను మాటకు అర్థము (1)
( ) సంతోషముగా ఉండుట.
( ) చిలకరించుట.
( ) కుమ్మరించుట లేదా పోయుట.
( ) నీళ్ల క్రిందికి ముంచుట, లేదా పూర్తిగా నీళ్లలో ముంచుట.
5) నేటి అనేక నకిలీ బాప్తిస్మములు (1)
( ) క్రీస్తు మనకు ఇచ్చెను.
( ) అపొస్తలులు మనకు ఇచ్చిరి.
( ) తప్పు మార్గములో నడిపింపబడిన వ్యక్తులు.
6) బాప్తిస్మము కొరకు సిద్ధపడుటకు ఒక వ్యక్తి చేయవలసిన పనులను గుర్తించుము : (4)
( ) బైబిలును పూర్తిగా ఐదుసార్లు చదువవలెను.
( ) సత్యము నమ్మవలెను.
( ) మారుమనస్సు అనుభవము పొందవలెను.
( ) 10 రోజులు క్రమము తప్పక ప్రార్థించవలెను.
( ) 40 రోజులు ఉపవాసముండవలెను.
( ) దేవునికి కావల్సినవి తెలిసికొనవలెను.
( ) పాపమును గూర్చి పశ్చాత్తాపపడి పాపమును విడిచిపెట్టవలెను.
7) బాప్తిస్మము (1)
( ) ప్రపంచ సృష్టికి గుర్తు.
( ) పరిశుద్ధ గ్రంథము (బైబిలు)కు గుర్తు.
( ) పరలోకమునకు గుర్తు.
( ) క్రీస్తు మరణము, భూస్థాపన, మరియు పునరుత్థానమునకు గుర్తు.
( ) దేవదూతలకు గుర్తు.
8) ఒక నూతనముగా బాప్తిస్మము పొందిన క్రైస్తవుడు, (1)
( ) ఒక ఆధ్యాత్మిక శిశువు..
( ) ఒక ఆధ్యాత్మిక వయోజనుడు (పెద్ద వ్యక్తి).
9) ప్రార్థన, చిత్తశుద్ధి, మరియు అవగాహనతో ప్రవేశించిన బాప్తిస్మము (1)
( ) మారుమనస్సును బహిరంగముగా అంగీకరించును.
( ) ఈతకు వెళ్లుటకు మించి వేరే అర్థము కాదు.
( ) ఒక వ్యక్తి మరల ఇక ఎన్నటికి శోధింపబడడని అతనికి భరోసా నిచ్చును.
10) శిశు బాప్తిస్మము లేఖనాధారమైనదేనా? (1)
( ) అవును.
( ) కాదు.
11) కొంతమంది పిల్లలు ఇతరుల కన్నా ముందే బాప్తిస్మము కొరకు సిద్ధముగా ఉంటారు. (1)
( ) అవును.
( ) కాదు.
12) బైబిలు బాప్తిస్మము గురించి క్రింది వాటిలో సత్యమైన వాక్యములేవి? (6)
( ) బాప్తిస్మమును బైబిలు వివాహముతో పోల్చుచున్నది.
( ) పరిశుద్ధాత్మయే నీకు కావలసిందల్లా.
( ) దేవుని బోధలు మనిషి బోధల కంటే గొప్పవి.
( ) యేసు ప్రభువు మనకు మాదిరిగా బాప్తిస్మము పొందెను.
( ) లేఖనములో తిరిగి బాప్తిస్మము పొందుటను గూర్చి ఉదాహరణ ఉన్నది.
( ) బాప్తిస్మము నూతనజన్మకు గుర్తు.
( ) పాత జీవితము బాప్తిస్మములో పాతిపెట్టబడును.
( ) నీవు ఏడుసార్లు బాప్తిస్మము పొందవలెను
13. బాప్తిస్మము కొరకు సిద్ధపడుటకు ఒక వ్యక్తికి చాలా వారములు లేదా నెలలు పట్టుట ఎల్లప్పుడు అవసరమేనా? (1)
( ) అవును.
( ) కాదు.
14. ఒక వ్యక్తి సంఘములో సభ్యత్వము పొందకుండ నిజమైన బాప్తిస్మము యొక్క అనుభూతిని పొందగలడా? (1)
( ) అవును.
( ) కాదు.
15. నేను వీలైనంత త్వరగా “నీళ్లలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి” ద్వారా బాప్తిస్మము పొందాలనుకొనుచున్నాను.
( ) అవును.
( ) కాదు.
( ) నేను “నీళ్లలో పూర్తిగా ముంచి లేపే పద్ధతి” ద్వారా బాప్తిస్మము పొందియున్నాను.