Lesson 11
అవునా? దేవుడు నిజముగానే అపవాదిని తన వేతనదారుల పట్టీపై నశించినవారి శిక్షను లెక్కించు ప్రధాన నరక పర్యవేక్షకునిగా నియమించునా? దాదాపుగా ప్రపంచమంతయు నరకము గురించి బైబిలుకు అస్సలు సంబంధము లేని అభిప్రాయమును కలిగి ఉన్నది, నరకము గురించి బైబిలు నిజముగా ఏమి చెప్పుచున్నదో తెలిసికొనుటకు నీకు నీవుగా బాధ్యత కలిగియుండుము. మోసపోకుము - ఎందుకనగా నరకము గురించి నీవు ఏమనుకొనుచున్నావో అది దేవుని స్వభావము గురించి నీవు ఏమనుకొనుచున్నావో అను దానిపై మిక్కిలి ప్రభావము చూపును! నేడే నీవు తెలిసికొనవలసిన అద్భుతమైన వాస్తవ సత్యములను పొందుకొనుటకు కొంత సమయము తీసికొనుము!
"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, ... శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు” (2 పేతురు 2:9, 10).
జవాబు : నేడు నరకాగ్నిలో ఒక్క ఆత్మకు కూడ శిక్ష విధింపబడుట లేదు. శిక్షింపబడు తీర్పుదినము వరకు దుర్మార్గులను దేవుడు కావలిలో ఉంచునని, లేదా నిలిపివేయునని బైబిలు చెప్పుచున్నది.
2. నశించినవారు నరకాగ్నిలో ఎప్పుడు పడద్రోయబడుదురు?
ఆటంకములగు సకలమైనవాటిని, దుర్నీతిపరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు” (మత్తయి 13:40-41). “నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును” (యోహాను 12:48).
జవాబు : నశించినవారు యుగాంతమందు మహా తీర్పుదినమున నరకాగ్నిలో పడద్రోయబడుదురే కాని వారు మరణించినప్పుడు కాదు. యుగాంతమందు ప్రతి స్త్రీ పురుషుని కేసు దేవుని న్యాయస్థానములో విచారించబడి నిర్ణయించబడేంత వరకు దేవుడు ఏ వ్యక్తిని అగ్నిలో శిక్షించడు. 5,000 సంవత్సరాల క్రితము మరణించిన హంతకున్ని నేడు అదే పాపము చేసి మరణించి అదే శిక్షకు పాత్రుడైన హంతకుని కంటే 5,000 సంవత్సరాల సుదీర్ఘకాలము దేవుడు అగ్నిలో కాల్చును లేదా బాధించుననుటలో అర్థమున్నదా? (ఆదికాండము 18:25 చూడుము.)
3. ఇప్పటికే మరణించిన రక్షింపబడనివారు ఎక్కడున్నారు?
"ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు" (యోహాను 5:28, 29). "దుర్జనులు ఆపత్కాలము (వరకు కావలికాయబడుదురా?)... వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును" (యోబు 21:30, 32).
జవాబు : బైబిలు నిర్దిష్టముగా చెప్పుచున్నది. రక్షింపబడని మరియు మరణించిన వారిరువురు పునరుత్థాన దినము వరకు వారి సమాధులలోనే “నిద్రించియుందురు.” (మరణమందు నిజముగా ఏమి జరుగునో తెలిసికొనుటకు మరింత సమాచారము కొరకు 10వ స్టడీ గైడ్ పత్రికను చూడుము. )
"ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము" (రోమీయులకు 6:23). "పాపము పరిపక్వమై మరణమును కనును" (యాకోబు 1:15), "దేవుడు ... తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).
జవాబు : పాపమునకు జీతము (లేదా ఫలితము) మరణము, నరకాగ్నిలో నిత్యయాతన కాదు. దుర్మార్గులు "నశించెదరు" లేదా "మరణము" పొందెదరు. నీతిమంతులు "నిత్యజీవము" పొందెదరు.
5.నరకాగ్నిలో దుర్మార్గులకు ఏమగును?
“పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును, అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు, ఇది రెండవ మరణము" (ప్రకటన 21:8).
జవాబు: దుర్మార్గులు నరకాగ్నిలో రెండవ మరణము పొందుదురు. దుర్మార్గులు సదాకాలము నరకములో సజీవులుగా బాధించబడుచు ఉండిన యెడల, వారు అమరులై ఉందురు. కాని ఇది అసాధ్యము ఎందుకనగా దేవుడు “మాత్రమే... అమరత్వము గలవాడై యున్నాడు” అని బైబిలు చెప్పుచున్నది (1 తిమోతి 6:16). ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి పంపివేసినప్పుడు, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఒక దేవదూత నియమించబడెను, తద్వారా పాపులు ఆ చెట్టు ఫలమును తినరు మరియు "నిరంతరము జీవించరు" (ఆదికాండము 3:22-24). పాపులు నరకములో అమరులై యుందురు అనే బోధ సాతానుతో ప్రారంభమైనది మరియు అది పూర్తిగా అవాస్తవము. దేవుడు దీనిని పాపము ఈ భూమిలోనికి ప్రవేశించినప్పుడు జీవ వృక్షమును కాచుట ద్వారా నిరోధించెను.
దుర్మార్గులు తుడిచివేయబడుదురని బైబిలు చెప్పుచున్నది.
దుర్మార్గులు ... "మరణము" చేత బాధించబడుదురు | రోమీయులకు 6:23 |
... "ఆపత్కాలము" (నాశనము) ననుభవించుదురు | యోబు 21:30 |
... “నశించిపోవుదురు” | కీర్తన 37:20 |
... "కాల్చివేయబడుదురు" | మలాకీ 4:1 |
... "నశించుదురు" | కీర్తన 37:38 |
... "కనబడకపోవుదురు" | కీర్తన 37:20 |
... "నిర్మూలమగుదురు" | కీర్తన 37:9 |
... "హతులగుదురు" | యెహెజ్కేలు 21:29 |
దేవుడు వారిని "నాశనము" చేయును. | కీర్తన 145:20 |
అగ్ని వారిని "దహించును." | కీర్తన 21:9 |
ఈ బైబిలు వచనములన్నియు దుర్మార్గులు మరణించి నాశనమగునని స్పష్టము చేయుచున్నట్లు గమనించుము. వారు నరకయాతనలోయుగయుగములు జీవించరు.
"అలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును, ... వారు దుర్నీతిపరులను అగ్నిగుండములో పడవేయుదురు (మత్తయి 13:40, 41), "వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్దుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను" (ప్రకటన 20:9). "నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా?" (సామెతలు 11:31).
జవాబు : దేవుడు నరకాగ్నిని రగిలించునని బైబిలు చెప్పుచున్నది. పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వచ్చిన తరువాత (ప్రకటన 21:2), దుర్మార్గులు దానిని బలవంతముగా ఆక్రమించుకోవాలని ప్రయత్నించుదురు. ఆ సమయములో, దేవుడు భూమిపై పరలోకము నుండి అగ్నిని కురిపించును, అది దుర్మార్గులను దహించివేయును. ఈ అగ్నియే బైబిలులో చెప్పబడిన నరకాగ్ని
7. నరకాగ్ని ఎంత పెద్దదిగాను మరియు ఎంత వేడిగాను ఉండును?
"ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములును కాలిపోవును" (2 పేతురు 3:10).
జవాబు : నరకాగ్ని ఈ భూమి అంత పెద్దదిగా ఉండును ఎందుకనగా భూమియే అగ్నిమయమగును. ఈ అగ్ని భూమిని కరిగించి, “దాని మీద నున్న కృత్యములన్నిటిని” కాల్చివేయును. వాతావరణ ఆకాశములు విస్ఫోటనము చెంది “మహాధ్వనితో గతించి పోవును.”
“ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది” (ప్రకటన 22:12). “ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును” (మత్తయి 16:27). “తన యజమానుని చిత్త మెరిగి యుండియు ... అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును” (లూకా 12:47,48).
జవాబు : అగ్నిలో మరణము పొందే ముందు దుర్మార్గులు ఎంతకాలము శిక్షించబదురని బైబిలు చెప్పుట లేదు. అయినను, అందరు వారి వారి క్రియల చొప్పున శిక్షించబదురని దేవుడు ప్రత్యేకముగా చెప్పెను. దీనర్థము కొందరు వారి క్రియల మోతాదును బట్టి ఇతరుల కన్నా ఎక్కువ శిక్షను పొందుదురు.
“వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ముతాము తప్పించుకొనలేక యున్నారు. అది కాచుకొనుటకు నిప్పుకాదు. ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.” (యెషయా 47:14) “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని.” “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను" (ప్రకటన 21:1, 4).
జవాబు : అవును. నరకాగ్ని ఆరిపోవునని, "కాచుకొనుటకు నిప్పైనను, ఎదుట కూర్చుని __కాచుకొనుటకు అగ్నియైనను మిగలకపోవునని” బైబిలు ప్రత్యేకముగా బోధించుచున్నది. దేవుని నూతన రాజ్యములో మునుపటి లేదా "మొదటి సంగతులన్నియు గతించిపోవునని బైబిలు చెప్పుచున్నది. మునుపటి సంగతులలో నరకము ఒకటిగా ఉన్నది, గనుక అది తొలగించబడి గతించిపోవుననే దేవుని వాగ్దానము మనకున్నది.
దేవుడు తన శత్రువులను నిత్యత్వమంతయు మండుచున్న ఒక భయానక గదిలో చిత్రహింసకు గురి చేసిన యెడల, అతి దారుణమైన దుర్మార్గతలో పాల్గొనిన మానుష్యుల కంటే దుర్మార్గుడుగాను మరియు క్రూరుడుగాను ఆయన పరిగణించబడును. అతినీచమైన పాపిని సహితము ప్రేమించు దేవునికి కూడ శాశ్వతకాల నరకయాతన ఒక నరకముగానే ఉండును.
"ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్టులందరును దుర్మార్గులందరును కొయ్యకాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయును." "దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె (బూడిద వలె) నుందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు" (మలాకీ 4:1, 3).
జవాబు : నేడు చాలా మంది నమ్ముచున్నట్లుగా, దుర్మార్గులు నారపురాయి లేక రాతినార వలె కాక, పూర్తిగా కాలిపోవు కొయ్యకాలు వలె కాలిపోవుదురని పై వచనము చెప్పుచున్నట్లుగా గమనించుము. "పోవును" అనే చిన్న మాట పూర్తి కావటమును సూచించుచున్నది. అగ్ని ఆరిపోయినప్పుడు బూడిద తప్ప మరేమియు మిగలదు. కీర్తన 37:10, 20లో దుర్మార్గులు పొగ వలె కనబడక పూర్తిగా నాశనమగుదురని బైబిలు చెప్పుచున్నది.
"నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా" (మత్తయి 5:30). “ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి (మత్తయి 10:28). "పాపము చేయువాడే మరణము నొందును" (యెహెజ్కేలు 18:20).
జవాబు : అవును. నిజమైన, జీవించే ప్రజలు (దుర్మార్గులు) తమ శరీరములతో నరకములోనికి ప్రవేశించి ఆత్మ మరియు దేహము రెండిటితో నాశనము చేయబడుదురు. పరలోకమందు దేవుని యొద్ద నుండి అగ్ని దిగివచ్చి నిజమైన వ్యక్తులపై పడి వారిని ఉనికిలో లేకుండ తుడిచివేయును (కాల్చి బూడిద చేయును).
“వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను” (ప్రకటన 20:10) “జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదెగా చేసెదను. ... నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు” (యెహెజ్కేలు 28:18, 19).
జవాబు : ఖచ్చితముగా కాదు! అపవాది అగ్నిలో పడద్రోయబడును, అది అతనిని బూడిదగా మార్చివేయును.
13. బైబిలులో వాడబడిన "నరకము" అనే మాట ఎల్లప్పుడు ఒక కాలుచున్న లేదా శిక్షించే ప్రదేశమును సూచించుచున్నదా?
లేదు. తెలుగు బైబిలులో ఈ మాట ఒకే అర్థముతో వివిధములుగా వాడబడినది. "హెల్ (నరకము)" అనే మాట కింగ్ జేమ్స్ వర్షన్ (KJV) ఇంగ్లీష్ బైబిలులో 54 సార్లు వాడబడినది, మరియు కేవలము 12 సందర్భాల్లో ఇది "ఒక కాలే ప్రదేశమును" సూచించుచున్నది. క్రింద సూచించిన విధముగా ఇది వివిధ మాటల నుండి వివిధ అర్థములతో అనువదించబడినది :
పాత నిబంధనలో
31 సార్లు “షియోల్ (అగాధపు లోయ)” అనే మాటకు "సమాధి" అని అర్ధము. క్రొత్త నిబంధనలో 10 సార్లు "హెడీస్ (పాతాళ లోకము)" అనే మాటకు "సమాధి" అని అర్ధము. 12 సార్లు "గెహెన్నా(నరకము)" అనే మాటకు "కాలే ప్రదేశము" అని అర్ధము. 1 సారి "టార్టరస్ (అగాధము)" అనే మాటకు "చీకటి ప్రదేశము" అని అర్ధము. |
గమనిక : "గెహెన్నా" అనే మాట హెబ్రీ "గె-హిన్నోమ్" అనే మాట యొక్క లిప్యంతరీకరణము లేదా ప్రతిలేఖనము, అనగా “హిన్నోమ్ లోయ” అని అర్థము. యెరూషలేమునకు దక్షిణ-పశ్చిమ వైపున ఉన్న ఈ లోయ, చనిపోయిన జంతువులు, చెత్త మరియు ఇతర వ్యర్థపదార్థములు పోగుగా కుమ్మరించే ప్రదేశము. ఆధునిక స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య స్థలములలో చెత్తా చెదారము కాలునట్లుగా అక్కడ అగ్ని మంటలు నిరంతరము మండెను. బైబిలు "గెహెన్నా" లేదా "హిన్నోమ్ లోయ"ను అంత్యకాలములో నశించినవారిని నాశనము చేయు అగ్నికి గుర్తుగా ఉపయోగించుచున్నది. గెహెన్నా యొక్క అగ్ని శాశ్వతకాలముండేది కాదు. అయిన యెడల, అది ఇప్పటికి యెరూషలేమునకు నైరుతి దిశలో మండుచు ఉండేది. అలాగే నరకము యొక్క అగ్ని కూడ నిరంతరముండేది కాదు.
"శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి" (మత్తయి 25:41). “ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను” (ప్రకటన 20:15). "ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు." "... యెహోవా విరోధులు ... పొగవలె కనబడకపోవుదురు” (కీర్తన 37:10, 20).
జవాబు : దేవుని ఉద్దేశ్యమేమిటనగా, ప్రపంచమును నిత్యత్వమునకు సురక్షితము చేయుటకు, నరకము అపవాదిని, సకల పాపమును, మరియు రక్షింపబడనివారిని నాశనము చేయును. ఈ భూగ్రహము మీద మిగిలియున్న పాపము యొక్క ఏ అవశేషమైనను లేదా గురుతైనను విశ్వమునకు ఎప్పటికి ముప్పు కలిగించే ఒక ప్రాణాంతక వైరస్ (మహమ్మారి) అగును. ఇక ఎన్నటికి ఉనికిలో లేకుండ పాపమును శాశ్వతముగా తొలగించుటయే దేవుని ప్రణాళిక!
నిత్య నరకము పాపమును నిరంతరీకించును
శాశ్వతకాల నరకయాతన పాపమును నిరంతరీకరించును మరియు దాని నిర్మూలనను అసాధ్యము చేయును. శాశ్వతకాల నరకయాతన దేవుని మహా గొప్ప ప్రణాళికలో భాగము కానే కాదు. అటువంటి సిద్ధాంతము ప్రేమామయుడైన దేవుని పరిశుద్ధ నామమునకు ఘోరమైన అభాండము. మన ప్రేమామయుడైన సృష్టికర్త ఒక క్రూరమైన నిరంకుశ ప్రభువుగా చిత్రీకరించబడుటను చూచి అపవాది ఆనందించును.
నిత్య నరకము అనే బోధ బైబిలులో లేదు.
"శాశ్వతకాల నరకయాతన" అనే సిద్ధాంతము బైబిలు నుండి కాక, తప్పుదారి పట్టించి, అపవాది చేత పరాకుగా నడిపించబడిన వ్యక్తుల నుండి పుట్టినది. నరకమును గూర్చిన భయము మన దృష్టిని ఆకర్షించినను, మనము భయము ద్వారా కాక దేవుని కృప ద్వారానే రక్షింపబడుచున్నాము.
"నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, మనస్సు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు" (యెహెజ్కేలు 33:11). "మనుష్యకుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు" (లూకా 9:55). "నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ... యెహోవా లేచును" (యెషయా 28:21).
జవాబు : అవును - దేవుని కార్యము ఎల్లప్పుడు రక్షించుటకే గాని నాశనము చేయుటకు కాదు. నరకాగ్నిలో దుర్మార్గులను నాశనము చేసే పని దేవుని స్వభావమునకు పూర్తిగా భిన్నమైనది, బైబిలు దానిని ఆయన "అపూర్వమైన కార్యము" అని పిలుచుచున్నది. దేవుని గొప్ప హృదయము దుర్మార్గులు నాశనమగుట వలన బాధ నొందును. ఆహా, ప్రతి ఆత్మను లేక వ్యక్తిని రక్షించుటకు ఆయన ఎంత శ్రద్ధగా పని చేయుచున్నాడు! ఒకడు తన ప్రేమను తిరస్కరించి పాపమునకు అతుక్కొనిన యెడల, అంత్య దినపు అగ్నిలో "పాపము" అని పిలువబడే భయంకరమైన, ప్రాణాంతక విష మహమ్మారిని విశ్వములో నుండి ఆయన సమూలముగా నిర్మూలించునప్పుడు, పశ్చాత్తాపపడని పాపిని నాశనము చేయుట తప్ప దేవునికి వేరొక మార్గము ఉండకపోవును.
"బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును" (నహూము 1:9). "ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు" (యెషయా 65:17). "ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను" (ప్రకటన 21:3, 4).
జవాబు : నరకాగ్ని ఆరిపోయిన తరువాత, దేవుడు క్రొత్త భూమిని సృజించి, పాపము ప్రవేశించుటకు పూర్వము ఏదెను వనముకున్న సౌందర్య శోభాతిశయములతో మరియు మహిమానందముతో నింపి దానిని తన ప్రజలకు పునరుద్ధరించును. నొప్పి, మరణము, విషాదము, దుఃఖము, కన్నీళ్లు, అనారోగ్యము, నిరాశ, వేదన మరియు సకల పాపము శాశ్వతముగా బహిష్కరించబడును.
పాపము మరల తలెత్తదు
పాపము మరల తలెత్తదని దేవుడు వాగ్దానము చేసెను. ఆయన ప్రజలు పరిపూర్ణమైన శాంతి, ప్రేమ, ఆనందము మరియు సంతృప్తితో నింపబడుదురు. సంపూర్ణ సంతోషముతో నిండిన వారి జీవితములు వట్టి నోటి మాటలు ఎప్పటికి వర్ణించగలిగే దానికంటే ఎంతో మహిమాన్వితమైనవిగాను మరియు అద్భుతమైనవిగాను ఉండును. నరకము యొక్క నిజమైన విషాదము పరలోకమును కోల్పోపుటలో ఉన్నది. ఈ అద్భుతమైన రాజ్యములోనికి ప్రవేశించకూడదని ఎంచుకున్న వ్యక్తి తన జీవితములోనే ఒక విచారకరమైన ఎంపిక చేసికొనియున్నాడు.
17. దేవుడు దుర్మార్గులను సదాకాలము నరకాగ్నిలో శిక్షించుట లేదని తెలిసికొనినందుకు నీవు కృతజ్ఞుడవైయున్నావా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. "నిత్య నరకయాతన" గురించి బైబిలు మాట్లాడుట లేదా?
జవాబు : లేదు. "నిత్య నరకయాతన" అనే మాట బైబిలులో ఎక్కడ కనిపించదు.
2. అలాగైతే దుర్మార్గులు ఆరని అగ్నితో నాశనమగుదురని బైబిలు ఎందుకు చెప్పుచున్నది?
జవాబు : ఆరని అగ్ని అనగా ఆర్పజాలని అగ్ని, కాని అది సమస్తమును బూడిదగా మార్చివేసినప్పుడు ఆరిపోవును. యిర్మీయా 17:27 ఆర్పజాలని అగ్నితో యెరూషలేము నాశనమగునని చెప్పుచున్నది, మరియు 2 దినవృత్తాంతములు 36:19-21లో ఈ అగ్ని "యిర్మీయా ద్వారా పలుకబడిన యెహెూవా మాట నెరవేరుటకై" పట్టణమును కాల్చివేసి దానిని పాడుగా చేసెనని బైబిలు చెప్పుచున్నది. ఈ అగ్ని ఆరిపోయెనని మనమెరుగుదుము, ఎందుకనగా నేడు యెరూషలేము కాలిపోవుట లేదు.
3. దుర్మార్గులు “నిత్య శిక్ష” పొందుదురని మత్తయి 25:46 చెప్పుట లేదా?
జవాబు : ఈ మాట"శిక్ష" అని గమనించుము, "శిక్షించుట" కాదు. శిక్షించుట అనేది కొనసాగే ప్రక్రియ, అయితే శిక్ష అనేది ఒకేసారి జరిగిపోయే చర్య, దుర్మార్గులు శిక్ష మరణము, ఈ మరణము శాశ్వతమైనది.
4. "ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి" (మత్తయి 10:28). ఈ వాక్యమును వివరించగలరా?
జవాబు : "ఆత్మ" అనే మాటకు బైబిలులో మూడు అర్థములున్నవి : (1) జీవాత్మ (ఒక జీవించే వ్యక్తి), ఆదికాండము 2:7, - (2) మనస్సు - కీర్తన 143:8, మరియు (3) ప్రాణము - 1 సమూయేలు 18:1, అలాగే, మత్తయి 10:28 దానిని అంగీకరించు వారందరికి దేవుడు ఇచ్చెదనని హామీ ఇచ్చే నిత్యజీవముగా ఆత్మను సూచించుచున్నది. దీనిని ఎవరు తీసివేయలేరు.
5. మత్తయి 25:41 దుర్మార్గులు "నిత్యాగ్ని" దండన గురించి మాటలాడుచున్నది. అగ్ని ఆరిపోవునా?
జవాబు : అవును. బైబిలు ప్రకారము, అది ఆరిపోవును. మనము బైబిలును బైబిలే వివరించుటకు అనుమతించవలెను. సొదొమ గొమొఱ్ఱాలు శాశ్వతమైన, లేదా నిత్యాగ్నితో నాశనమైనవి (యూదా 1:7), మరియు ఆ అగ్ని "ముందుకు భక్తిహీనులగువారికి" హెచ్చరికగా ఉండుటకు ఆ పట్టణములను "భస్మము (బూడిద)" చేసెను (పేతురు 2:6). ఈ పట్టణములు నేడు కాలిపోవుట లేదు. సమస్తము కాలిపోయిన తరువాత అగ్ని ఆరిపోయెను. అదే విధముగా, దుర్మార్గులను బూడిద చేసిన తరువాత నిత్యాగ్ని ఆరిపోవును (మలాకీ 4:3). అగ్ని యొక్క ప్రభావములు శాశ్వతమైనవి, కాని కాలిపోవుట శాశ్వతము కాదు.
6. లూకా 16:19-31లో ధనవంతుడు మరియు లాజరు కథ నిత్య నరకయాతన గురించి బోధించుట లేదా?
జవాబు: లేదు! ఇది ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక పాఠమును నొక్కి చెప్పుటకు యేసు ప్రభువు ఉపయోగించిన ఉపమానము. కథ యొక్క ముఖ్యాంశము 31వ వచనములో కనుగొనబడును. ఉపమాన కథలను అక్షరాలా ప్రత్యక్ష అర్ధము తీసికొనకూడదు - లేని యెడల, చెట్లు మాట్లాడునని మనము నమ్మెదము! (న్యాయాధిపతులు 9:8-15 చూడుము.) లూకా 16:19-31 ఒక ఉపమానమని స్పష్టము చేసే కొన్ని వాస్తవములు ఇక్కడున్నవి
- అబ్రాహాము రొమ్ము పరలోకము కాదు (హెబ్రీయులకు 11:8-10, 16).
- నరకములో ఉన్నవారు పరలోకములో ఉన్న వారితో మాట్లాడలేరు (యెషయా 65:17).
- చనిపోయినవారు వారి సమాధులలోనే ఉన్నారు (యోబు 17:13; యోహాను 5:28, 29). ధనవంతుడు కన్నులు, నాలుక మొదలైన వాటితో శరీరమును కలిగి యున్నాడు, అయినను బైబిలు చెప్పుచున్న ప్రకారము, శరీరము మరణమందు నరకమునకు వెళ్లదు, కాని సమాధిలోనే ఉండునని మనమెరుగుదుము.
- ప్రజలు క్రీస్తు రెండవ రాకడలో ప్రతిఫలము పొందుదురు, మరణమందు కాదు (ప్రకటన 22:12).
- నశించినవారు యుగ సమాప్తియందు నరకములో పడద్రోయబడుదురు, వారు మరణించినప్పుడు కాదు. (మత్తయి 13:40-42).
7. దుర్మార్గులు "ఎల్లప్పుడు (సదాకాలము, నిరంతరము)" నరకయాతనకు గురియగుటను గూర్చి బైబిలు మాట్లాడుచున్నది. ఇది నిజమేనా?
జవాబు : కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిలులో ఇప్పటికే అంతమైపోయిన విషయములకు సంబంధించి “ఎల్లప్పుడు (ఫరెవర్)” అనే మాట 56 సార్లు ఉపయోగించబడినది. ఇది “పొడవు (ఎత్తు)” అనే మాట వంటిది, అనగా పురుషులు, చెట్లు లేదా పర్వతములను వర్ణించుటలో ఏదైన వ్యత్యాసము అని అర్ధము. తెలుగు బైబిలులో "ఎల్లప్పుడు" అనే మాట నానార్ధములతో నానావిధములుగా వాడబడెను. యోనా 2:6లో, "మరెన్నటికిని" అనగా "మూడు దినములు (మూడు రాత్రింబగళ్లు)." (యోనా 1:17 కూడ చూడుము.) ద్వితీయోపదేశకాండము 23:3లో, "ఎన్నడును" అనగా 10 తరములు. మానవజాతి విషయములో, "(ఎప్పటికి) తిరిగి రాక లేదా నిరంతరము లేదా సదాకాలము" అనగా "ఒకడు బ్రతికినంత కాలము" లేదా “మరణము వరకు” అని అర్థము (1 సమూయేలు 1:22, 28; నిర్గమకాండము 21:6; కీర్తన 48:14.) కాబట్టి దుర్మార్గులు జీవించినంత కాలము లేదా మరణము వరకు అగ్నిలో కాలిపోవుదురు. పాపమునకు జీతముగా ఈ అగ్ని దండన ప్రతి వ్యక్తికి వాని వాని పాపముల స్థాయిని బట్టి వేరుగా ఉండును, కాని శిక్ష ముగిసిన తరువాత, అగ్ని ఆరిపోవును. అపవాది కనిపెట్టిన ఏ ఇతర తప్పుడు బోధల కన్నా నిత్య నరకయాతన అనే బైబిలుకు సంబంధము లేని బోధ, ప్రజలను నాస్తికత్వమునకు నడిపించుటలో ఎక్కువ పాత్ర పోషించినది. ఇది కృపామయుడైన పరలోకపు తండ్రి యొక్క ప్రేమామయమైన స్వభావముపై అభాండము మరియు క్రైస్తవ్యమునకు తీరని భంగము.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) దుర్మార్గులు నరకాగ్నిలో పడద్రోయబడునది (1)
( ) వారు మరణించినప్పుడు.
( ) ఈ యుగ సమాప్తియందు.
( ) అపవాది చేత.
2) నరకాగ్నిలో పాపులు పొందు ప్రతిఫలము (1)
( ) మరణము.
( ) నిత్య నరకయాతన.
( ) నరకమునకు పర్యవేక్షకుడైన అపవాది చేత చిత్రహింసకు గురియగుట.
3) నరకాగ్ని (1)
( ) అనగా ప్రపంచము మొత్తం దేవునిచేత అగ్ని రగిలించబడుట.
( ) ఇప్పుడు కాలుచున్నది.
( ) నిత్యజీవము ఉన్నంత కాలము యుగయుగములు కాలుచుండును.
4) మరణించిన పాపులు (1)
( ) పర్గటరి - దేహము యొక్క పాపమును అగ్ని చేత శుద్ధి చేసికొను స్థలములో ఉన్నారు.
( ) నరకాగ్నిలో ఉన్నారు.
( ) వారి సమాధులలో ఉన్నారు.
5) నేడు నరకములో జనాభా (1)
( ) సరిగ్గా సున్న.
( ) లక్షలాది మంది.
( ) ఖచ్చితముగా చెప్పలేము.
6) నరకాగ్ని (1)
( ) దుర్మార్గుల దేహమును మాత్రమే నాశనము చేయును.
( ) దుర్మార్గుల ఆత్మను నిత్యత్వమంతయు చిత్రహింసకు గురి చేయును.
( ) నశించినవారి ఆత్మ మరియు దేహము రెండిటిని నాశనము చేసి - వాటిని బూడిదగా మార్చివేయును, అటు తరువాత ఆరిపోవును.
7) నిత్య నరకయాతన (1)
( ) దేవుని గొప్ప ప్రణాళికలో ఒక ప్రాముఖ్యమైన భాగము.
( ) అపవాది యొక్క సిద్దాంతమును మరియు ప్రజలు బాధ నొందుటను చూచి తట్టుకోలేని దేవుని పరిశుద్ధమైన, ప్రేమామాయమైన నామముపై అభాండము.
( ) శాశ్వతకాలము చేయుటకు సాతానుకు ఒక ఉద్యోగము నిచ్చును.
8) బైబిలులో “నరకము” అనే మాట (1)
( ) ఎల్లప్పుడు ఒక కాలే ప్రదేశమును సూచించును.
( ) అనేక అర్థములున్నవి, వాటిలో ఒకటి “సమాధి.”
( ) సాతాను యొక్క భూగర్భ చిత్రహింస గదులను సూచించును.
9) నరకము ఉండుటలో అసలు ఉద్దేశ్యము (1)
( ) దేవుని శత్రువులను హింసించి ప్రతీకారము తీర్చుకొనుట.
( ) మంచిగా మారుటకు ప్రజలను భయపెట్టుట.
( ) విశ్వము నుండి పాపము మరియు చెడుతనమును పూర్తిగా తొలగించి, నీతిమంతులను నిత్యజీవము కొరకు సురక్షితము చేయుట.
10) నరకములో ప్రజలను నాశనము చేయుట (1)
( ) పరలోకపు మహా దేవునికి ఆనందము కలిగించును.
( ) దేవునికి “అపూర్వమైన చర్య (ఆయన స్వభావమునకు భిన్నమైన చర్య)” ఎందుకనగా ఇది ప్రజలను రక్షించే ఆయన ప్రేమపూర్వక ప్రణాళికకు ఎంతో భిన్నమైనది.
( ) దేవుని ప్రణాళిక సహకారముతో, ఇది అపవాది యొక్క పని అగును.
11) నరకాగ్ని ఆరిపోయిన తరువాత, (1)
( ) దేవుడు సాతానును అంతరిక్షములోనికి బహిష్కరించును.
( ) పాపము మరల తలెత్తని ఒక పరిపూర్ణమైన క్రొత్త భూమిని దేవుడు సృజించి, దానిని తన ప్రజల కిచ్చును.
( ) నీతిమంతులు పాపము మరల తలెత్తవచ్చుననే భయముతో జీవించుదురు.
12.ధనవంతుడు మరియు లాజరు యొక్క కథ (1)
( ) ఒక ఉపమానము మాత్రమే మరియు అక్షరార్థముగా తీసికొనకూడదు.
( ) నిత్య నరకయాతన ఉన్నదని బోధించుటకు బైబిలు ఆధారము.
( ) నరకములో ఉన్న ఆత్మలు పరలోకములో ఉన్న ఆత్మలతో మాట్లాడునని రుజువు చేయును.
13) ఒక వ్యక్తి జీవితమునకు సంబంధించి బైబిలు ఉపయోగించే “ఎల్లప్పుడు" అనే మాట (1)
( ) “అనంతకాలము” అని అర్థము నిచ్చును.
( ) మర్మమైనది మరియు అర్థము కానిది.
( ) సాధారణముగా “ఒకని జీవితకాలము” లేదా “అతడు మరణించేంత వరకు" అని అర్థము.
14) దేవుడు దుర్మార్గులను సదాకాలము నరకాగ్నిలో శిక్షించడని తెలిసికొనినందుకు నేను కృతజ్ఞుడనైయున్నాను.
( ) అవును.
( ) లేదు.