Lesson 12
1. ఈ 1,000 సంవత్సరముల కాలవ్యవధిని ఏ సంఘటన ప్రారంభించును?
"వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి" (ప్రకటన 20:4). (మరణము అను అంశముపై మరిన్ని వివరముల కొరకు పఠన మార్గదర్శి 10వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
జవాబు : ఒక పునరుత్థానము 1,000 సంవత్సరముల కాలమును ప్రారంభించును.
2. ఏ పునరుత్థానమని ఇది పిలువబడుచున్నది? ఎవరు దీనిలో లేపబడుదురు?
"ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు" (ప్రకటన 20:5, 6).
జవాబు : ఇది మొదటి పునరుత్థానమని పిలువబడుచున్నది. అన్ని యుగముల నుండి రక్షింపబడిన "ధన్యులును మరియు పరిశుద్ధులైనవారు" దీనిలో లేపబడుదురు.
"ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు (దుర్మార్గులు) బ్రదుక లేదు" (ప్రకటన 20:5). "సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు" (యోహాను 5:28, 29).
జవాబు : రెండవ పునరుత్థానము 1,000 సంవత్సరముల కాలము ముగింపులో జరుగును. ఈ పునరుత్థానములో రక్షింపబడనివారు లేపబడుదురు. ఇది దండన లేదా తీర్పు పునరుత్థానమని పిలువబడుచున్నది.
దయచేసి గమనించుము :
రక్షింపబడినవారి పునరుత్థానము 1,000 సంవత్సరములను ప్రారంభించును. రక్షింపబడనివారి పునరుత్థానము 1,000 సంవత్సరములను ముగించును.
"ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును" (ప్రకటన 1:7). "ఆర్భాటముతోను, ... పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుందు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము" (1 థెస్సలొనీకయులకు 4:16, 17). "పెద్ద భూకంపము కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, ... అయిదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను" (ప్రకటన 16:18, 21). (యిర్మీయా 4:23-26; యెషయా 24:1, 3, 19, 20; యెషయా 2:21 కూడ చూడుము.) 5 మణుగులు = 1 తలాంతు, 1 తలాంతు (టాలెంట్) బరువు 58 నుండి 100 పౌండ్ల వరకు ఉండునని పండితుల అంచనాలు వేయుచున్నారు! 2 పౌండ్లు = ఇంచుమించు 1 కేజి, 58 పౌండ్లు = ఇంచుమించు 29 కేజిలు, 100 పౌండ్లు = ఇంచుమించు 50 కేజిలు, అంటే వడగండ్లు ఒక్కొక్కటి ఇంచుమించు 30 నుండి 50 కేజిల బరువు ఉండును!
జవాబు : 1,000 సంవత్సరములు ప్రారంభమైనప్పుడు జరుగబోవు ఇతరు ముఖ్యమైన సంఘటనలు : చరిత్రలోనే అత్యంత వినాశకరమైన భూకంపము మరియు వడగండ్లు భూమిని తాకును, యేసు ప్రభువు తన ప్రజల కొరకు మేఘముల మీద తిరిగి వచ్చును, యేసు ప్రభువును కలిసికొనుటకు పరిశుద్ధులందరు ఆకాశమండలమునకు కొనిపోబడుదురు. (క్రీస్తు రెండవ రాకడ గురించి మరింత తెలిసికొనుటకు 8వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.)
5. యేసు ప్రభువు రెండవ రాకడలో రక్షింపబడని - జీవించుచున్న మరియు మరణించినవారికి - ఏమి జరుగును?
"తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును" (యెషయా 11:4). "ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికి, ... ప్రతిదండన చేయునప్పుడు" (2 థెస్సలొనీకయులకు 1:6, 7). "భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు గాక" (కీర్తన 68:2). "ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు" (ప్రకటన 20:5).
జవాబు : రెండవ రాకడ యందు క్రీస్తు సన్నిది చేత రక్షింపబడనివారు చంపబడుదురు. యేసు ప్రభువ్వు సమాధి యొద్ద ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు, రోమా కావలివారందరు చచ్చినవారి వలె నుండిరి (మత్తయి 28:2, 4). సమస్త దేవదూతల యొక్కయు, తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క ప్రకాశపు వెలుగు ఏకమైనప్పుడు, రక్షింపబడనివారు మెరుపులతో కొట్టబడినట్లు చనిపోవుదురు. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు అప్పటికే చనిపోయిన దుర్మార్గులు 1,000 సంవత్సరముల చివరి వరకు వారి సమాధులలోనే ఉందురు.
6. రక్షింపబడనివారికి 1,000 సంవత్సరముల కాలమందు పశ్చాత్తాపము నొందుటకు అవకాశము ఉండునని చాలామంది నమ్ముచున్నారు. దీని గురించి బైబిలు ఏమి చెప్పుచున్నది?
"ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశము యొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును" (యిర్మీయా 25:33). "నేను చూడగా నరుడొకడును లేకపోయెను" (యిర్మీయా 4:25).
జవాబు : 1,000 సంవత్సరముల కాలమందు ఏ వ్యక్తియైనను పశ్చాత్తాపము నొందుట అసాధ్యము, ఎందుకనగా భూమిపై సజీవముగా ఒక వ్యక్తి కూడ ఉండడు. నీతిమంతులందరు పరలోకములో ఉందురు. దుర్మార్గులందరు భూమి మీద మృతులై పడియుందురు. యేసు ప్రభువు తిరిగి రాకముందే ప్రతి వ్యక్తి యొక్క కేసు పరిశీలించబడి ముగించబడునని ప్రకటన 22:11, 12 స్పష్టము చేయుచున్నది. 1,000 సంవత్సరములు ప్రారంభమయ్యే వరకు క్రీస్తును అంగీకరించుటకు వేచియున్నవారు చాలా ఆలస్యము చేసియున్నారు.
7. 1,000 సంవత్సరముల కాలమందు సాతానుడు "అగాధము"లో బంధించబడునని బైబిలు చెప్పుచున్నది. ఈ అగాధము ఏమిటి?
"అగాధము యొక్క తాళపుచెవి గల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడుచువరకు ... అగాధమును మూసి దానికి ముద్ర వేసెను” (ప్రకటన 20:1-3).
జవాబు : "అగాధము" అను మాటకు ఆదిమ గ్రీకు భాషలో పాతాళము "అబుస్సోస్" లేదా అగాధపు లోయ అని అర్ధము. ఇదే పదము భూమి యొక్క సృష్టికి సంబంధించి పాత నిబంధన యొక్క గ్రీకు భాషాంతరములో ఆదికాండము 1:2లో ఉపయోగించబడినది. "భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను." “అగాధము," "అడుగులేని గొయ్యి," మరియు "అగాధపు లోయ" అను పదములు ఇదే విషయమును సూచించుచున్నవి - దేవుడు దాని క్రమీకరించుటకు ముందు భూమి పూర్తిగా చీకటిగా, అస్తవ్యస్తముగా ఉన్న స్థితి. యిర్మీయా, 1,000 సంవత్సరముల కాలములో ఈ భూమి యొక్క పరిస్థితిని వివరించుచు, ఆదికాండము 1:2లోని అవే పదములను వాస్తవముగా ఉపయోగించెను : "నిరాకారముగాను శూన్యముగాను," "వెలుగు లేకపోయెను," "నరుడొకడును లేకపోయెను," మరియు "కారు కమ్మియున్నది" (యిర్మీయా 4:23, 25, 28). కాబట్టి మనుష్యులు లేని దెబ్బతిన్న, చీకటి భూమి 1,000 సంవత్సరములలో, సృష్టి పూర్తియగుటకు ముందు సరిగ్గా ఆదియందున్నట్టు, అడుగులేని గొయ్యి లేదా అగాధము అని పిలువబడుచున్నది. అలాగే, యెషయా 24:22 సాతాను మరియు అతని దూతల గురించి 1,000 సంవత్సరములలో "గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు" అన్నట్లుగా చెప్పుచున్నది.
“మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని ... యొక దేవదూత ... సాతానును ... పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి ... ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచుకుందునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను" (ప్రకటన 20:1-3).
జవాబు : సంకెళ్లు సాదృశ్యముగా వాడబడెను - అవి పరిస్థితుల సంకెళ్లు. ప్రకృతికి అతీతమైన వ్యక్తిని అక్షరార్థమైన ప్రత్యక్ష సంకెళ్లతో పరిమితము చేయలేము. మోసగించుటకు ప్రజలు లేనందున సాతాను చేతులు సాదృశ్యముగా "కట్టివేయబడెను." రక్షింపబడని వారందరు మృతులైయున్నారు మరియు రక్షింపబడిన వారందరు పరలోకములో ఉన్నారు. ప్రభువు అపవాదిని ఈ భూమికి పరిమితము చేయును కాబట్టి అతడు మోసగించుటకు ఎవరినైన కనుగొందుననే ఆశతో విశ్వమంతట తిరుగలేడు. మోసగించుటకు ఎవ్వరు లేని వెయ్యి సంవత్సరములు ఒంటరిగా తన దయ్యములతో.. కలిసి భూమిపై ఉండుటకు అపవాదిని బలవంతము చేయుట అతనికి ఇప్పటివరకు బంధించిన అత్యంత భయంకరమైన సంకెళ్లగును.
- వినాశకరమైన భూకంపము మరియు వడగండ్లు (ప్రకటన 16:18-21; ప్రకటన 6:14-17).
- తన పరిశుద్ధుల కొరకు యేసు ప్రభువు రెండవ రాకడ (మత్తయి 24:30, 31).
- రక్షింపబడిన మృతులు జీవమునకు లేపబడుట (1 థెస్సలొనీకయులకు 4:16).
- రక్షింపబడినవారు అమర్త్యతను ధరించుకొనుట (1 కొరింతీయులకు 15:51-55).
- రక్షింపబడినవారు యేసు వంటి శరీరములు ధరించుకొనుట (1 యోహాను 3:2; ఫిలిప్పీయులకు 3:21).
- నీతిమంతులందరు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుట (1 థెస్సలొనీకయులకు 4:16, 17).
- ప్రభువు పెదవుల ఊపిరి చేత బ్రతికియున్న దుర్మార్గులు హతమగుట (యెషయా 11:4).
- రక్షింపబడని మృతులు 1,000 సంవత్సరములు గడచు వరకు వారి సమాధులలోనే ఉందురు (ప్రకటన 20:5).
- యేసు ప్రభువు నీతిమంతులను పరలోకమునకు తీసికొని పోవును (యోహాను 13:33, 36; 14:1-3).
- సాతానుడు బంధించబడును (ప్రకటన 20:1-3).
"అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శ చేయుటకు అధికారము ఎయ్యబడెను. ... వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి" (ప్రకటన 20:4). "పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా?.... మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా?" (1 కొరింథీయులకు 6:2, 3).
జవాబు: అన్ని యుగముల నుండి రక్షింపబడినవారు (మరియు మంచి దేవదూతలు కూడ) 1,000 సంవత్సరముల కాలమందు తీర్పులో పాల్గొందురు. అపవాది మరియు అతని దూతలతో సహా నశించినవారి కేసులు విమర్శ చేయబడును. ఈ తీర్పు నశించినవారి గురించి రక్షింపబడినవారికి మిగిలియున్న ఏవైన ప్రశ్నలను పరిష్కరించును. చివరికి, నిజముగా యేసు ప్రభువు వలె జీవించుటకు లేదా ఆయనతో ఉండుటకు ఇష్టపడని యెడల మాత్రమే ప్రజలు పరలోకము నుండి బహిష్కరించబడుదురని అందరును చూచెదరు.
- భారీ వడగండ్లు మరియు వినాశకరమైన భూకంపము వలన భూమి దెబ్బతిన్న స్థితిలో ఉండుట (ప్రకటన 16:18-21; 6:14-17).
- భూమి పూర్తిగా అంధకారమయమైన మరియు నిర్మానుష్యమైన పరిస్థితిలో, ఒక “అగాధము"గా విడిచిపెట్టబడుట (యిర్మీయా 4:23, 28).
- సాతానుడు బంధింపబడి భూమిపై ఉండుటకు బలవంతము చేయబడుట (ప్రకటన 20:1-3).
- పరలోకములో నీతిమంతులు తీర్పులో పాల్గొందురు (ప్రకటన 20:4).
- దుర్మార్గులందరు మృతులైయుందురు (యిర్మీయా 4:25; యెషయా 11:4).
1,000 సంవత్సరముల కాలమందు, భూమిపై ఇప్పటివరకు జీవించిన ప్రతి వ్యక్తి రెండు ప్రదేశములలో ఒక చోట ఉండును: (1) భూమ్మీద, మరణించి నశించి యుండును. లేదా (2) పరలోకములో, తీర్పులో పాల్గొనుచుండును. ప్రభువు నిన్ను పరలోకములో ఉండుటకు ఆహ్వానించుచున్నాడు. దయచేసి ఆయన ఆహ్వానమును అంగీకరించుము!
"నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము ... పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ... అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ... అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని" (ప్రకటన 21:2, 3, 4). "ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది." "ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టున నున్న ఒలీవకొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ ... నడిమికి విడిపోయి ... అప్పుడు నీతో కూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును." "మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును" (జెకర్యా 14:1, 4, 5, 10).
జవాబు : నూతన యెరూషలేము దిగివచ్చి ఇప్పుడు ఒలీవకొండ ఉన్న చోట నిలుచును. పట్టణము దిగివచ్చి స్థిరముగా నిలుచునట్లు కొండ గొప్ప మైదానముగా సమతలమగుటకు చదును చేయబడును. అన్ని యుగముల నీతిమంతులందరు (జెకర్యా 14:5), పరలోకపు దేవదూతలు (మత్తయి 25:31), తండ్రియైన దేవుడు (ప్రకటన 21:2,3), మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు (మత్తయి 25:31) యేసు ప్రభువు ప్రత్యేక మూడవ రాకడ కొరకు పరిశుద్ధ పట్టణముతో భూమికి తిరిగి వచ్చెదరు. రెండవ రాకడ ఆయన పరిశుద్ధుల కొరకు వచ్చును, మూడవ రాకడ ఆయన పరిశుద్ధులతో వచ్చును.
యేసు ప్రభువు మూడు రాకడలు:
మొదటి రాకడ : బేత్లహేమునకు పశువుల తొట్టెలో వచ్చెను. |
రెండవ రాకడ : మేఘారూఢుడై 1,000 సంవత్సరములు కాలము ప్రారంభమునందు తన ప్రజలను పరలోకము తీసికొన పోవుటకు వచ్చును. |
మూడవ రాకడ : పరిశుద్ధ పట్టణముతోను నీతిమంతులందరితోను 1,000 సంవత్సరముల ముగింపునందు పరలోకము నుండి వచ్చును. |
11.ఈ సమయమందు మృతులైన దుర్మార్గులకు ఏమి జరుగును? ఇది సాతానును ఎట్లు ప్రభావితము చేయును?
“ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుక లేదు.” “వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ... జనములను, ... మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును" (ప్రకటన 20:5, 7, 8).
జవాబు : 1,000 సంవత్సరముల ముగింపునందు (యేసు ప్రభువు మూడవసారి వచ్చినప్పుడు), దుర్మార్గులు లేపబడుదురు. తన బంధకముల నుండి విడుదల పొందిన సాతానుడు, అంతట మోసగించుటకు ప్రజలతో (ప్రపంచ దేశములన్నిటితో) నిండిన భూమిని కలిగియుండును.
12. అప్పుడు సాతానుడు ఏమి చేయును?
"సాతాను ... భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న ... వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ... "వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా” (ప్రకటన 20:7-9).
జవాబు : తన స్వభావమునకు తగినట్టుగా సాతానుడు వెంటనే భూమిపై మిగిలిపోయిన ప్రజలకు - అన్ని యుగముల నుండి వచ్చిన దుర్మార్గులకు అబద్ధము చెప్పుట ప్రారంభించును. ఈ పట్టణము నిజముగా తనదేనని, అతడు అన్యాయముగా పరలోక రాజ్యము నుండి త్రోసివేయబడెనని, దేవుడు అధికార దాహము గలవాడును క్రూరుడని అతడు అనవచ్చును. వారు ఏకమైన యెడల, దేవునికి అవకాశము ఉండదని అతడు వారిని ఒప్పించును. ప్రపంచమంతయు ఒక పట్టణమునకు వ్యతిరేకముగా ఉండుటతో, విజయము వారికి ఖచ్చిత మనిపించును. అప్పుడు నూతన యెరూషలేమును చుట్టుముట్టుటకు దేశములు తమ సైన్యములను ఏకము చేసి పట్టణము మీదికి పంపును. (సాతానుడు యొక్క ఆరంభము, మూలము, మరియు ఉనికి గురించి మరింత సమాచారము కొరకు, 2వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.)
"పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను." "ఇది రెండవ మరణము" (ప్రకటన 20:9, 10; 21:8). "నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి (బూడిద) వలె ఉందురని, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు" (మలాకీ 4:3).
జవాబు : అగ్ని (చాలామంది నమ్ముచున్నట్లుగా, నరకము నుండి కాక) అకస్మాత్తుగా పరలోకము నుండి దుర్మార్గుల మీదికి దిగివచ్చును, అపవాది అతని దూతలతో సహా అందరును బూడిదగా మార్చబడుదురు (మత్తయి 25:41). పాపమును, పాపులను నాశనము చేయు ఈ అగ్ని రెండవ మరణము అని పిలువబడుచున్నది. ఈ మరణము నుండి పునరుత్థానము లేదు. ఇదే అంతిమము. సాధారణముగా నమ్ముచున్నట్లుగా, అపవాది అగ్నిని పర్యవేక్షించు చుండడని గమనించుము. అతడు దానిలో ఉండును, అది అతనిని ఉనికిలో లేకుండ నాశనము చేయును. (కొన్నిసార్లు నరకము అని పిలువబడుచున్న ఈ అగ్ని గురించి పూర్తి సమాచారము కొరకు, 11వ స్టడీ గైడ్ పత్రిక చూడుము. మరణము గురించి మరింత సమాచారము కొరకు, 10వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.)
“ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను” (యెషయా 65:17). "క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును" (2 పేతురు 3:13). “అప్పుడు సింహాసనాసీనుడై యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను” (ప్రకటన 21:5). "దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును" (ప్రకటన 21:3).
జవాబు : దేవుడు క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని సృజించును, మరియు నూతన యెరూషలేము క్రొత్త భూమికి రాజధాని నగరమగును. పాపము మరియు దాని వికారము శాశ్వతముగా తొలగిపోవును. దేవుని ప్రజలు చివరికి వారికి వాగ్దానము చేయబడిన రాజ్యమును పొందుదురు. "వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును" (యెషయా 5:10). ఇది వివరించలేనంత అద్భుతమైనది మరియు కోల్పోలేనంత మహిమాన్వితమైనది! దేవుడు నీ కొరకు అక్కడ ఒక స్థలమును సిద్ధము చేసెను (యోహాను 14:1-3). దానిలో నివసించుటకు ప్రణాళిక వేసికొనుము. యేసు ప్రభువు నీ అంగీకారము కొరకు ఎదురుచూచుచున్నాడు. (పరలోకము గురించి పూర్తి సమాచారము కొరకు, 4వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.)
- తన పరిశుద్ధులతో యేసు ప్రభువు మూడవ రాకడ వచ్చును (జెకర్యా 14:5).
- పరిశుద్ధ పట్టణము గొప్ప మైదానముగా మారబోవు ఒలీవకొండ మీదికి దిగివచ్చి నిలుచును (జెకర్యా 14:4, 10).
- తండ్రి, ఆయన దేవదూతలు మరియు నీతిమంతులందరు యేసు ప్రభువుతో వచ్చెదరు (ప్రకటన 21:1-3; మత్తయి 25:31; జెకర్యా 14:5).
- మృతులైన దుర్మార్గులు లేపబడుదురు, సాతానుడు తన చెర నుండి విడిపింపబడును (ప్రకటన 20:5, 7).
- సాతానుడు ప్రపంచమంతటిని మోసగించును (ప్రకటన 20:8).
- దుర్మార్గులు పరిశుద్ధ పట్టణమును చుట్టుముట్టెదరు (ప్రకటన 20:9).
- దుర్మార్గులు అగ్నిచేత నాశనమగుదురు (ప్రకటన 20:9).
- క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి సృజింపబడును (యెషయా 65:17; 2 పేతురు 3:13; ప్రకటన 21:1).
- దేవుని ప్రజలు క్రొత్త భూమిలో దేవునితో నిత్యత్వమును అనుభవించుదురు (ప్రకటన 21:2-4).
"మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి" (మత్తయి 24:33). "ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను" (లూకా 21:28). "ప్రభువు తన మాట (కార్యము) సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును" (రోమీయులకు 9:27) “లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, ... వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును” (1 థెస్సలొనీకయులకు 5:3).
జవాబు : యేసు ప్రభువు తన రాకడ యొక్క సూచనలు, అవి నేటి వలె వేగముగా నెరవేరుచుండగా, మనము సంతోషించి, ఈ పాప ప్రపంచము యొక్క అంతము సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నదని తెలిసికొనవలెనని చెప్పెను. ప్రపంచములో శాంతిభద్రతల కొరకు గొప్ప ఉద్యమము జరిగినప్పుడు మనము అంతము సమీపమునే యున్నదని తెలిసికొనగలమని అపొస్తలుడైన పౌలు చెప్పెను. చివరగా, దేవుడు తన మాటను (కార్యమును) క్లుప్తపరచునని బైబిలు చెప్పుచున్నది (రోమీయులకు 9:27, 28). కాబట్టి ఎటువంటి సందేహము లేకుండ, మనము అరువు తెచ్చుకొన్న సమయములో జీవించుచున్నాము. ప్రభువు అకస్మాత్తుగా మరియు ఊహించని విధముగా వచ్చును - ఆయన వచ్చు గడియ తండ్రియైన దేవునికి తప్ప మరెవరికి తెలియదు (మత్తయి 24:36; అపొస్తలుల కార్యములు 1:7). మన ఏకైక భద్రత ఇప్పుడే సిద్ధముగా ఉండుటలోనే ఉన్నది.
నీ జవాబు :-
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. పరిశుద్ధ పట్టణము దిగివచ్చు దినము నుండి దుర్మార్గులు పరలోకము నుండి దిగివచ్చు అగ్ని ద్వారా నాశనమగు వరకు ఎంత కాలముండును?
జవాబు : ఇది "కొంచెము కాలము" ఉండునని బైబిలు చెప్పుచున్నది (ప్రకటన 20:3). తన ప్రణాళికను అనుసరించుటకు మరియు యుద్ధ ఆయుధములను సిద్ధము చేయుటకు ప్రజలను ఒప్పించుటకు సాతానుకు తగినంత సమయము అవసరము. సరిగ్గా ఇంత సమయముండునని లేఖనములో వెల్లడించబడలేదు.
2. దేవుని నూతన రాజ్యములో ప్రజలు ఎటువంటి శరీరములను కలిగి యుందురు?
జవాబు : విమోచించబడినవారికి యేసు వంటి శరీరములు ఉండునని బైబిలు చెప్పుచున్నది. (ఫిలిప్పీయులకు 3:20, 21). యేసు ప్రభువు తన పునరుత్థానము తరువాత రక్తమాంసములతో కూడిన నిజమైన శరీరమును కలిగి యున్నాడు (లూకా 24:36-43). రక్షింపబడినవారు భూతములుగా ఉండరు. నిజమైన శరీరములు గలిగిన ఆధామవ్వల వలె వారు నిజమైన వ్యక్తులుగా ఉందురు.
3. యేసు ప్రభువు రెండవ రాకడయందు నశించినవారు ఎట్లు స్పందించుదురో బైబిలు చెప్పుచున్నదా?
జవాబు : అవును. వారు "సింహాసనాసీనుడై యున్న వాని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొట్టెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను" చెప్పుదురని బైబిలు చెప్పుచున్నది (ప్రకటన 6:16, 17). (14 మరియు 15 వచనములు కూడ చూడుము). నీతిమంతులు, మరోవైపు, "ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము" అని చెప్పుదురు (యెషయా 25:9).
4. నూతన యెరూషలేము లోపల ఉన్న నీతిమంతులను దుర్మార్గులు చూడగలరా?
జవాబు : మనకు ఖచ్చితముగా తెలియదు, కాని బైబిలు పట్టణపు ప్రాకారము పారదర్శకముగా స్ఫటికము వలె స్పష్టముగా ఉండునని చెప్పుచున్నది (ప్రకటన 21:11, 18). కీర్తనలు 37:34 మరియు లూకా 13:28 రక్షింపబడినవారు మరియు రక్షింపబడనివారు ఒకరినొకరు చూడగలరని సూచించుచున్నట్టు కొందరు నమ్ముచున్నారు.
5. దేవుడు తన ప్రజల కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయునని మరియు మరణము, దుఃఖము లేదా బాధలు ఇక ఉండవని బైబిలు చెప్పుచున్నది. ఇది ఎప్పుడు జరుగును?
జవాబు : ప్రకటన 21:1-4 మరియు యెషయా 65:17 ప్రకారము, పాపము భూమి నుండి శుద్ధి చేయబడిన తరువాత ఇది జరుగునని తెలియుచున్నది. అంతిమ తీర్పు మరియు పాపమును అగ్ని ద్వారా నాశనము చేయునప్పుడు, తీవ్ర దుఃఖమునకు దేవుని ప్రజలు అనేక కారణములు కలిగి యుందురు. బంధువులు మరియు స్నేహితులు నశించిపోయిరని మరియు వారు ప్రేమించిన వ్యక్తులు అగ్నిలో నాశనమగుచున్నారని వారు గ్రహించినప్పుడు, ఆ వేదన నిస్సందేహముగా దేవుని ప్రజలకు కన్నీళ్లను మరియు హృదయవేదనను తెచ్చును. అగ్ని ఆరిపోయిన తరువాత, ప్రభువు వారి కన్నీళ్లను తుడిచివేయును. అప్పుడు ఆయన తన ప్రజల కొరకు కొత్త ఆకాశములను మరియు క్రొత్త భూమిని సృజించును, అది వారికి చెప్పలేని ఆనందమును మరియు సాఫల్యమును తెచ్చును. మరియు దుఃఖము, విచారము, ఏడుపు మరియు హృదయవేదన ఇక ఎన్నటికి లేకుండ పోవును. (దేవుని ప్రజల పరలోక గృహము గురించి మరింత తెలిసికొనుటకు, 4వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.)
6. దుష్ట దూతలు మరియు ప్రజల నాశనము తండ్రియైన దేవుని మరియు ఆయన కుమారుని ఎట్లు ప్రభావితము చేయును?
జవాబు : పాపమనే వికారమైన కొరుకుపుండు (క్యాన్సరు) శాశ్వతముగా తొలగిపోయెనని మరియు విశ్వము ఇక ఎప్పటికి సురక్షితముగా ఉన్నదని వారు ఉపశమనము పొంది ఆనందించెదరన్నది నిస్సందేహము. కాని ఖచ్చితముగా, వారు ప్రేమించిన వారిలో - మరియు ఎవరి కొరకైతే యేసు ప్రభువు మరణించెనో వారిలో - చాలామంది పాపమునకు అతుక్కొని రక్షణను తిరస్కరించుటను బట్టి వారు తీవ్ర దుఃఖమును అనుభవించుదురు. సాతానుడు ఒకప్పుడు వారి స్నేహితుడు, మరియు అగ్నిలో చాలామంది ఒకప్పుడు వారి ప్రియమైన పిల్లలు. అది తప్పు చేసిన మీ సొంత పిల్లలలో ఒకరు చంపబడుటను చూసిన వేదన వలె ఉండును. పాపము అది ప్రారంభమైనప్పటి నుండి తండ్రి మరియు కుమారునిపై తీవ్రమైన భారముగా ఉన్నది. వారి లక్ష్యము ప్రజలను ప్రేమించుట మరియు వారిని రక్షణకు శాంతముగా ఆకర్షించుట. వారి భావాలు హెూషేయా 11:8లో వ్యక్తీకరించబడినవి, "ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? ... నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది."
7. యేసు ప్రభువు ఎటువంటి శరీరమును కలిగి యున్నాడు?
జవాబు : ఆయనకు రక్తమాంసములతో కూడిన శరీరమున్నది. తన పునరుత్థానము తరువాత, యేసు తన శిష్యులకు కనబడెను (లూకా 24:36-43) మరియు ఆయన తన శరీరమును తాకి చూడమని చెప్పుట ద్వారా మరియు కొన్ని చేపలు మరియు కొంత తేనె తినుట ద్వారా ఆయన రక్తమాంసములతో కూడిన శరీరమును కలిగి యున్నాడని నిరూపించెను.
యేసు ఆరోహణమగుట
తరువాత ఆయన వారితో బేతనియ వరకు నడిచెను మరియు, ఆయన వారితో మాట్లాడుట చాలించుచుండగా, పరలోకమునకు ఆరోహణమాయెను (లూకా 24:49-51). యేసు ప్రభువు ఆరోహణమగుచుండగా శిష్యులకు కనబడిన దేవదూతలు, "మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి” (అపొస్తలుల కార్యములు 1:11).
యీ యేసే తిరిగి వచ్చును
దేవదూతలు ప్రాముఖ్యముగా చెప్పినదేమిటనగా, (రక్తమాంసములు కలిగిన) “యీ యేసే” తిరిగి వచ్చును. ఆయన నిజమైనవాడు, భూతము కాదు, మరియు తిరిగిలేచిన పరిశుద్ధులు ఆయనను పోలిన శరీరములను కలిగి యుందురు (ఫిలిప్పీయులకు 3:20, 21; 1 యోహాను 3:2). పరిశుద్ధుల నూతన శరీరములు కూడ అక్షయమైనవిగాను మరియు అమర్త్యమైనవిగాను ఉండును (1 కొరింథీయులకు 15:51-55).
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) ప్రకటన 20వ అధ్యాయములోని 1,000 సంవత్సరముల కాలము ప్రారంభములో జరుగబోవు సంఘటనలను గుర్తించుము : (10)
( ) యేసు ప్రభువు రెండవ రాకడ.
( ) భూకంపము మరియు వడగండ్లు.
( ) మృతులైన నీతిమంతులు లేపబడుట.
( ) సాతానుడు బంధించబడుట.
( ) బ్రతికియున్న దుర్మార్గులు హతమగుట.
( ) నీతిమంతులు అమర్త్యతను ధరించుకొనుట.
( ) పరిశుద్ధ పట్టణము దిగివచ్చుట.
( ) నీతిమంతులు పరలోకము తీసికొనిపోబడుట.
( ) సమాధులలో నున్న దుర్మార్గులు మృతులుగానే నిలిచియుండుట.
( ) నీతిమంతులు యేసు వంటి శరీరములు ధరించుకొనుట.
( ) నీతిమంతులు మేఘముల మీద కొనిపోబడుట.
( ) కొందరు రక్షింపబడినవారు భూమ్మీదే విడిచిపెట్టబడును.
2) భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి యేసు ప్రభువును తన రెండవ రాకడయందు చూచును. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
3) నీతిమంతులు పరలోకములో భూతము వంటి శరీరములు కలిగి యుందురు. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
4) 1,000 సంవత్సరముల కాలము గురించి క్రింది వాటిలో ఏవి నిజమైనవి? (2)
( ) చాలామంది పాపులు మారుమనస్సు నొందుదురు.
( ) సాతానుడు అతని దూతలు భూమిపై ఉండుటకు బలవంతము చేయబడుదురు.
( ) వీక్షించుటకు టీవీ లేదన్న వాస్తవము చేత సాతానుడు బంధించబడును.
( ) ఈ 1,000 సంవత్సరముల కాలమందు భూమిపై ప్రకాశవంతముగాను మరియు ఎండగాను ఉండును.
( ) సాతానుడు తనకు తోడుగా ఉండుటకు మృతులైన దుర్మార్గులను జీవమునకు లేపును.
( ) నీతిమంతులు పరలోకములో తీర్పులో పాల్గొనుచు నుందురు.
5) 1,000 సంవత్సరముల కాలము ముగింపు నందు జరుగబోవు సంఘటనలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజమైనవి? (4)
( ) క్రీస్తు ఐదవసారి వచ్చును.
( ) పరిశుద్ధ పట్టణము హైదరాబాద్ ప్రాంతములో దిగును.
( ) మంచి దేవదూతలు, తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధులు యేసుతో కూడ వచ్చెదరు
( ) దుర్మార్గులు లేపబడుదురు.
( ) యేసు ప్రభువు తన పరిశుద్ధులతో వచ్చును.
( ) మెట్టుకు దేవుడు దుర్మార్గులను లేపకూడదని నిర్ణయించుకొనును.
( ) కోపముతో ఉన్న దుష్టదూతల చేత దుర్మార్గులు నాశనమగుదురు.
( ) దేవుడు క్రొత్త ఆకాశములను, క్రొత్త భూమిని సృజించును.
( ) దేవుడు సాతానును విశ్వము యొక్క వెలుపటి ప్రాంతములకు బహిష్కరించును.
( ) అపవాది శక్తివంతమైన క్రొత్త మిస్సైల్ (క్షిపణి) వాయుబాంబుతో పరిశుద్ధ పట్టణమును తుడిచివేయును.
6) సాతానును బంధించే సంకెళ్లు (3)
( ) సాదృశ్యమైనవి - పరిస్థితుల సంకెళ్లు.
( ) అతనిని భూమిపై ఉండుటకు బలవంతము చేయును.
( ) ఒక క్రొత్త, చాలా కఠినమైన లోహముతో తయారు చేయబడును.
( ) 24 గంటల్లో అపవాది చేత విరుగగొట్టబడును.
( ) పరలోకములో సురక్షితముగా ఉండబోవు దేవుని ప్రజలను శోధించకుండ నివారించును.
7) “అగాధము”నకు సంబంధించి ఏ ప్రకటనలు నిజమైనవి? (2)
( ) ఇది భూమి లోపల లోతైన గొయ్యి లేదా రంధ్రము.
( ) దీని అర్థము "అగాధపు లోయ (పాతాళము).”
( ) ఇది చీకటిగాను, నిరాకారముగాను, మరియు శూన్యముగాను ఉన్న భూమిని సూచించుచున్నది.
( ) ఇది నరకమునకు మరొక పేరు.
8) యేసు ప్రభువు మొదటి, రెండవ మరియు మూడవ రాకడలకు సంబంధించి ఏ ప్రకటనలు నిజమైనవి? (3)
( ) మొదటి రాకడ బేత్లహేమునకు శిశువుగా వచ్చెను.
( ) మొదటి రాకడ నోవహు దినములలో జరిగెను.
( ) రెండవ రాకడ మార్టిన్ లూథర్ దినములలో జరిగెను.
( ) రెండవ రాకడ 1,000 సంవత్సరముల కాలము ప్రారంభములో జరుగును.
( ) మూడవ రాకడ 1,000 సంవత్సరముల కాలము ముగింపునందు జరుగును.
( ) మూడవ రాకడ క్రొత్త భూమి సృష్టించబడిన తరువాత జరుగును.
9) అగ్ని గుండములో దుర్మార్గులు మరణించు మరణము రెండవ మరణము. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
10) యేసు ప్రభువు ప్రత్యేకించి నా కొరకే పరలోకములో సిద్ధము చేయుచున్న అద్భుతమైన గృహములో నివసించుటకు నేను ఖచ్చితముగా ప్రణాళిక వేసికొనుచున్నాను.
( ) అవును.
( ) కాదు.