Lesson 19
సాక్షాధారాలు పరిశీలించడమైనది, తీర్పు చెప్పబడినది – కేసు మూసివేయబడినది! కొన్ని ఆలోచనలు మరింత హుందాగా ఉంటాయి. యుగయుగాలుగా జీవించిన వారందరూ సర్వమెరిగిన దేవుని ముందు వారి జీవితాలను పరిశీలించే రోజు అతి సమీపములో ఉన్నది (2 కొరింథీయులకు 5:10). కానీ ఇది నిన్ను ఆందోళనపరచ నియ్యవద్దు - ధైర్యముగా ఉండుము! ఈ స్టడీ గైడ్లో వెల్లడించిన తీర్పు సందేశమును శుభవార్తగా లక్షలాది మంది ఇప్పటికే కనుగొన్నారు! ప్రకటన గ్రంథములో మహా తీర్పు గురించి ప్రస్తావించిన నాలుగు సందర్భాలలో, ఇది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తలంపును మనకు తెస్తుంది! బైబిలు తీర్పును వెయ్యి కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించిందని నీకు తెలియునా? దాదాపు ప్రతి బైబిలు రచయిత దీనిని సూచిస్తారు, కాబట్టి దాని ప్రాముఖ్యతను అతిశయోక్కగా చెప్పలేము. రాబోయే కొద్ది నిమిషాల్లో, నిరక్ష్యము చేయబడిన ఈ అంశముపై నిజమైన కనువిప్పు నీకు కలుగుతుంది.
గమనిక: అంతిమ తీర్పుకు మూడు దశలు ఉన్నవి - నీవు ఈ పాఠమును అధ్యయనము చేస్తున్నప్పుడు వాటి కొరకు కనిపెట్టుము!
అంతిమ తీర్పు యొక్క మొదటి దశ
1. గబ్రియేలు దేవదూత 1844 పరలోకపు తీర్పును గూర్చిన ప్రవచనమును దానియేలుకు ఇచ్చెను. తీర్పు యొక్క మొదటి దశను “పూర్వ- ఆగమన తీర్పు” అని పిలుస్తారు. ఎందుకనగా ఇది యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు జరుగును. తీర్పు యొక్క మొదటి దశలో ఏ సమూహపు ప్రజలు పరిశీలించబడుదురు? ఇది ఎప్పుడు ముగియును?
"తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది" (1 పేతురు 4:17). “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుందనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది” (ప్రకటన 22:11, 12).
జవాబు : ఇది యేసు రెండవ రాకడకు ముందే ముగుస్తుంది. (1844 ప్రారంభ తేదీ 18వ స్టడీ గైడ్ పత్రికలో స్థాపించబడింది.) క్రైస్తవులమని చెప్పుకున్న సజీవులు లేదా చనిపోయిన వారు "(దేవుని ఇల్లు)" రాకడకు ముందు జరిగే తీర్పులో పరిగణింపబడుదురు.
2. తీర్పుకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? రక్షణ న్యాయవాది ఎవరు? న్యాయమూర్తి ఎవరు? ప్రతివాది ఎవడు? సాక్షి ఎవరు?
“మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ... ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను,” “తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను” (దానియేలు 7:9, 10). "నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు" (1 యోహాను 1:2). “తండ్రి ... తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు” (యోహాను 5:22, 23). “రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు” (ప్రకటన 12:10). “ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా” (ప్రకటన 3:14). (కొలొస్సయులకు 1:12-15 కూడ చూడుము.)
జవాబు : తండ్రియగు దేవుడు, మహావృద్ధుడు, తీర్పులో అధ్యక్షత వహిస్తాడు. ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు (యోహాను 16:27). సాతానుడు నీ ఏకైక ప్రతివాది. పరలోక న్యాయస్థానంలో, నిన్ను ప్రేమిస్తున్న మరియు నీ నిజమైన మంచి స్నేహితుడు యేసు నీ న్యాయవాది, న్యాయమూర్తి మరియు సాక్షి, మరియు తీర్పు “పరిశుద్ధులకు అనుకూలంగా ఉంటుంది" అని ఆయన వాగ్దానము చేశాడు (దానియేలు 7:22).
3. రాకడకు ముందు తీర్పులో ఉపయోగించిన సాక్ష్యాల మూలం ఏమిటి? ఏ ప్రమాణము ద్వారా అందరూ తీర్పు తీర్చబడతారు? ప్రతి వ్యక్తి గురించి దేవునికి ఇప్పటికే ప్రతిదీ తెలియును గనుక, తీర్పు ఎందుకు?
"తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను" (దానియేలు 7:10). ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి" (ప్రకటన 20:12). "(వారు)... స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవుదురు" (యాకోబు 2:12). "మేము (మనము) లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా (నాటక దృశ్యముగా) నున్నాము” (1 కొరింథీయులకు 4:9).
జవాబు : ఈ న్యాయస్థానంలో సాక్ష్యము "గ్రంథముల" నుండి వచ్చింది, దీనిలో ఒకరి జీవితంలోని అన్ని వివరాలు నమోదు చేయబడతాయి. విశ్వాసుల కొరకు, ప్రార్ధన, పశ్చాత్తాపము, మరియు పాప క్షమాపణ యొక్క దాఖలు అందరికీ కనిపిస్తుంది. దేవుని శక్తి క్రైస్తవులకు మార్పునొందిన జీవితములు జీవించుటకు వీలు కల్పిస్తుందని దాఖలు చేయబడిన వివరములు రుజువు చేస్తాయి. దేవుడు తన పరిశుద్ధుల యందు సంతోషించి మరియు వారి జీవితాల సాక్ష్యాలను పంచుకోవడంలో ఆనందిస్తాడు. తీర్పు “శరీరము ననుసరింపక “ఆత్మననుసరించియే నడుచుకొను”... "క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు" అని రూఢిపరచును (రోమియులకు 8:1).
తీర్పు నందు పది ఆజ్ఞల ధర్మశాస్త్రము దేవుని ప్రమాణము. (యాకోబు 2:10-22). ఆయన ఆజ్ఞను అతిక్రమించుట పాపము (1 యోహాను 3:4). ధర్మశాస్త్రము యొక్క నీతి ఆయన ప్రజలందరిలో యేసు ప్రభువు చేత నెరవేర్చబడును (రోమీయులకు 8:3, 4). ఇది అసాధ్యమని చెప్పుకోవడం యేసు మాటను, ఆయన శక్తిని అనుమానించడం.
తీర్పు దేవునికి తెలియజేయడం కాదు. ఆయనకు ఇప్పటికే పూర్తి సమాచారం ఉంది (2 తిమోతి 2:19). బదులుగా, విమోచన పొందినవారు పాపంతో దిగజారిన ప్రపంచం నుండి పరలోకమునకు వస్తారు. ఇద్దరూ దేవుని రాజ్యంలో ఎవరినైనా అంగీకరించడం పట్ల అసౌకర్యంగా భావిస్తారు, వారు మళ్లీ పాపాన్ని ప్రారంభించవచ్చు. ఆ విధంగా, తీర్పు వారికి ప్రతి వివరాలను తెరుస్తుంది మరియు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. సాతాను యొక్క నిజమైన లక్ష్యం ఎల్లప్పుడూ దేవుణ్ణి అన్యాయంగా, క్రూరంగా, ప్రేమలేనివాడుగా, మరియు అసత్యంగా కించపరచడమే. దేవుడు పాపులతో ఎంత సహనముగా ఉన్నాడో అను విషయమును విశ్వములోని సమస్త ప్రజలందరు చూచుటకు ఇది మరింత ముఖ్యమైన విషయము. దేవుని స్వభావము న్యాయవంతమైనదని నిరూపించుట తీర్పు యొక్క మరొక ముఖ్యమైన ఉద్దేశ్యం (ప్రకటన 11:16-19; 15:2-4; 16:5, 7; 19:1, 2; దానియేలు 4:36, 37). తీర్పును నిర్వహించిన విధానమును బట్టి స్తుతియు మహిమయు దేవునికి చెల్లింపబడునని గమనించండి.
“గూఢమైన ప్రతియంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును” (ప్రసంగి 12:14). "కోత కాలము వరకు రెంటని కలిసి (గోధుమలను మరియు గురుగులను) యెదుగ నియ్యుడి." "మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని... సమకూర్చెదరు. (మత్తయి 13:30, 41), “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది” (ప్రకటన 22:12).
జవాబు : రహస్య ఆలోచనలు మరియు దాచిన చర్యలతో సహా జీవితంలోని ప్రతి వివరాలు సమీక్షించబడతాయి. ఈ కారణంగా, ఈ తీర్పు యొక్క మొదటి దశను "పరిశోధనాత్మక తీర్పు" అని పిలుస్తారు. క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో ఎవరు రక్షింపబడతారో ఈ తీర్పు నిర్ధారిస్తుంది. ఎవరి పేర్లు అయితే పూర్వ ఆగమన తీర్పునందు ఎవరి పేర్లు నిర్ణయించబడలేదో వారు నశించిన వారిగా కూడా ఇది నిర్ధారిస్తుంది. కృప ద్వారా మనము రక్షింపబడినను, చర్యలు, క్రియలు లేదా ప్రవర్తన ఆధారంగా ప్రతిఫలములు (జీతములు) ఇవ్వబడతాయి - ఇది క్రైస్తవుడి విశ్వాసం యొక్క నిజాయితీని రుజువు చేస్తుంది (యాకోబు 2:26).
అంతిమ తీర్పు యొక్క రెండవ దశ
5. ప్రకటన 20వ అధ్యాయములోని 1000 సంవత్సరాలలో జరుగు పరలోక తీర్పునందు ఏ సమూహం ప్రజలు పాల్గొంటారు? ఈ రెండవ దశ తీర్పు యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
"పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? ... మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా?" (1 కొరింథీయులకు 6:2,3). "అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులైయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను” (ప్రకటన 20:4).
జవాబు : "పరిశుద్ధులు" - క్రీస్తు తన రెండవ రాకడలో పరలోకమునకు తీసికొనిపోవు యుగయుగాలుగా జీవించిన నీతిమంతులు, ఈ రెండవ దశ తీర్పులో పాల్గొనెదరు. హత్య చేయబడిన వారి ప్రియమైన కుమారుడు పరలోకంలో లేడని ఒక కుటుంబం కనుగొన్నట్లు అనుకుందాం - కాని హంతకుడున్నాడు. అప్పుడు ఆ కుటుంబమునకు తలెత్తు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరమవుతాయనడంలో సందేహం లేదు. ఈ రెండవ దశ తీర్పు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుంది. సాతాను మరియు అతని దూతలతో సహా నశించిపోయిన ప్రతి వ్యక్తి యొక్క జీవితమును రక్షింపబడినవారు సమీక్షిస్తారు, చివరికి ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన విధికి సంబంధించి యేసు నిర్ణయాలతో వారు అంగీకరిస్తారు. తీర్పు ఏకపక్ష విషయం కాదని అందరికీ స్పష్టమవుతుంది. బదులుగా, యేసు లేదా మరొక యజమానికి సేవించడానికి ప్రజలు ఇప్పటికే చేసుకున్న ఎంపికలను ఇది నిర్ధారిస్తుంది (ప్రకటన 22:11, 12). (1,000 సంవత్సరముల సమీక్ష కొరకు, 12వ స్టడీగైడ్ పత్రిక చూడండి).
అంతిమ తీర్పు యొక్క మూడవ దశ
6. అంతిమ తీర్పు యొక్క మూడవ దశ ఎప్పుడు, ఎక్కడ జరుగును? తీర్పు యొక్క ఈ దశలో ఏ క్రొత్త సమూహపు ప్రజలు పాల్గొనెదరు?
"ఆ దినమున యెరూషలేము ఎదుట ... ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా, ... అప్పుడు నీతో కూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును." "మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును" (జెకర్యా 14:4, 5, 10). “మరియు (యోహాను అను) నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ... పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని" (ప్రకటన 21:2). "వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను ... భూమి నలుదిశల యందుండు జనములను ... మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును" (ప్రకటన 20:7, 8).
జవాబు : తీర్పు పరిశుద్ధ పట్టణముతో యేసు భూమికి తిరిగి వచ్చిన తరువాత, ప్రకటన 20వ అధ్యాయం యొక్క 1,000 సంవత్సరాల ముగింపులో మూడవ దశ తీర్పు భూమిపై జరుగుతుంది. అపవాది మరియు అతని దూతలతో సహా, ఇప్పటివరకు జీవించిన దుర్మార్గులందరూ పాల్గొనెదరు. 1,000 సంవత్సరముల ముగింపునందు, యుగయుగాలుగా మరణించిన దుర్మార్గులు లేపబడుదురు (ప్రకటన 20:5). వారిని మోసం చేయడానికి సాతాను శక్తివంతమైన దుష్ప్రచారాన్ని ప్రారంభిస్తాడు. ఆశ్చర్యకరంగా, వారు పరిశుద్ధ పట్టణమును స్వాధీనం చేసుకోగలరని భూజనులందరిని ఒప్పించడంలో అతడు విజయం సాధిస్తాడు.
7. తరువాత ఏమి జరుగును?
"వారు (దుర్మార్గులు) భూమి యందంతట వ్యాపించి., పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా" (ప్రకటన 20:9).
జవాబు : దుర్మార్గులు పట్టణాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి సిద్ధమవుతారు.
8. వారి (దుర్మార్గుల) యుద్ధ ప్రణాళికకు ఏది అంతరాయం కలిగిస్తుంది, మరియు ఏ ఫలితాలతో ?
“మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి" (ప్రకటన 20:12). "మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును” (2 కొరింథీయులకు 5:10). "నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను" (రోమీయులకు 14:11, 12).
జవాబు : అకస్మాత్తుగా, దేవుడు పట్టడానికి పైన ప్రత్యక్షమగును (ప్రకటన 19:11-21). నిజము బహిర్గతమగు క్షణము ఆసన్నమైనది. లోకము పుట్టినది మొదలుకొని నశించిన ప్రతి వ్యక్తి, సాతాను మరియు అతని దూతలతో సహా, ఇప్పుడు దేవుణ్ణి తీర్పులో ఎదుర్కొనెదరు. ప్రతి నేత్రము రాజులకు రాజుపై బంధితమవుతుంది (ప్రకటన 20:12).
సమీక్షించిన ప్రతి జీవితము
సమీక్షించిన ప్రతి జీవితం ఈ సమయంలో, నశించిన ప్రతి వ్యక్తికి తన జీవిత కథను గుర్తుచేస్తుంది: పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుటకు దేవుని స్థిరమైన, వెచ్చని, ఆ ప్రశాంతమైన మెల్లని స్వరము; తరుచుగా వచ్చిన ఆ అద్భుతమైన ప్రేరణలు; స్పందించుటకు పదేపదే జరిపిన నిరాకరణలు. ఇదంతయు గుర్తుకు వచ్చును. దాని ఖచ్చితత్వము నిస్సందేహమైనది. దాని వాస్తవములు తిరస్కరించ వీలులేనివి. దుర్మార్గులు పూర్తిగా అర్ధం చేసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. అన్ని విషయాలను స్పష్టం చేయడానికి ఆయన కోరుకున్న వివరాలను అందిస్తాడు. గ్రంథములు మరియు జీవిత చరిత్రల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఏదియు కప్పిపుచ్చబడదు
దేవుడు కొన్ని ఖగోళ సంబంధమైన విషయములను కప్పిపుచ్చడంలో పాల్గొనడు. ఎటువంటి ఆధారాలను నాశనం చేయలేదు. దాచడానికి ఏమీ లేదు. ప్రతిదీ తెరిచి ఉంది, మరియు ఇప్పటివరకు జీవించిన ప్రతి వ్యక్తి మరియు మంచి మరియు చెడు దూతలందరూ అతిపెద్ద నాటకీయ సన్నివేశాన్ని వీక్షించబోవుదురు.
నశించిన వారి ప్రతి మోకాలు వంగును
అకస్మాత్తుగా ఒక కదలిక ఏర్పడును. నశించిన వ్యక్తి తన అపరాధమును ఒప్పుకొనుటకు మరియు దేవుడు తనతో ఎంతగానో న్యాయవంతముగా వ్యవహరించెనని బహిరంగముగా ఒప్పుకొనుటకు తన మోకాళ్ళ మీద పడును. అతని మొండి పట్టుదల అహంకారం అతనికి స్పందించకుండా చేసింది. ఇప్పుడు అన్ని వైపులా, ప్రజలు మరియు దుష్ట దూతలు కూడా అదే విధంగా మోకరిల్లారు (ఫిలిప్పీయులకు 2:10, 11). అంతట ఒక గొప్ప సన్నివేశం, దాదాపుగా ఏకకాలంలో సాతానుతో సహా మిగిలిన ప్రజలు మరియు దుష్ట దూతలు దేవుని ముందు సాష్టాంగపడెదరు. (రోమీయులకు 14:11). వారు అన్ని తప్పుడు ఆరోపణల నుండి దేవుని పేరును తొలగించి వారి యెడల ఆయన ప్రేమ న్యాయవంతముగా మరియు దయనీయముగా వ్యవహరించిన దానిని బట్టి సాక్ష్యమిచ్చెదరు.
శిక్షావిధి (తీర్పు) న్యాయవంతమైనదిగా ఒప్పుకొనెదరు
వారి (దుర్మార్గుల) మీద విధించబడిన మరణశిక్ష న్యాయవంతమైనదని పాపమును పరిష్కరించుటకు గల ఏకైక మార్గమని అందరు ఒప్పుకొందురు. నశించిన ప్రతి వ్యక్తిని గూర్చి "నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు" అని చెప్పబడవచ్చును (హోషేయా 13:9). దేవుడు ఇప్పుడు విశ్వం ముందు నిరూపించబడ్డాడు. సాతాను యొక్క ఆరోపణలు మరియు వాదనలు కఠినమైన పాపి యొక్క వికృత అబద్ధాలుగా బహిర్గతమయ్యాయి.
9. ఏ చివరి దశలు విశ్వము నుండి పాపమును నిర్మూలము చేసి నీతిమంతులకు ఒక సురక్షితమైన గృహము మరియు భవిష్యత్తును అందించును?
"వారు (దుర్మార్గులు) పరిశుద్ధుల శిబిరమును... ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను" (ప్రకటన 20:9, 10). "దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి (బూడిద) వలె ఉందురు" (మలాకీ 4:3). "ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను" (యెషయా 65:17). "క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటి యందు నీతి నివసించును" (2 పేతురు 3:13). “దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, .... వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును” (ప్రకటన 21:3).
జవాబు : పరలోకము నుండి అగ్ని దిగివచ్చి దుర్మార్గుల మీద పడును. అగ్ని పాపమును మరియు పాపులను ఇక ఎన్నటికి లేకుండ విశ్వము నుండి సమూలముగా నిర్మూలము చేయును. (నరకాగ్ని గురించి పూర్తి వివరముల కొరకు 11వ పఠన మార్గదర్శి (స్టడీగైడ్) పత్రికను చూడుము. దేవుని ప్రజలకు ఇదొక లోతైన విచారము మరియు మనోవేదన (విఘాతము)తో కూడుకొన్న సమయముగా ఉండును. నిజానికి రక్షింపబడిన వారికి చెందిన ప్రియమైన వాడో లేదా స్నేహితుడో అగ్నితో ఉండును. సంరక్షక దేవదూతలు సంవత్సరాలుగా వారు సంరక్షించిన వారిని పొగొట్టుకొనుటను చూచి బహుశా కన్నీరు కార్చెదరు. క్రీస్తు సహితము ఎంతో కాలము ఆయన ప్రేమించి విన్నవించుకొనిన వారిని పోగొట్టుకొనుటకు చూచి విలపించునన్నది నిస్సందేహము. ఆ భయంకరమైన సమయమందు, మన ప్రేమామయుడైన దేవుడు అనుభవించు వేదన (క్షోభ)ను వర్ణించుట మిక్కిలి కష్టతరమగును.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి :
అంతట దేవుడు విమోచింపబడిన తన ప్రజల ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి వేసి (ప్రకటన 21:4) తన పరిశుద్ధుల కొరకు వర్ణణాతీతమైన సౌందర్యము గల క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని సృజించును. అన్నిటికంటే గొప్ప శుభవార్త ఏదనగా, ఆయన తన ప్రజలతో నిత్యత్వమంతము నివాసముండును! వివేకముతో ఆలోచించు ఏ వ్యక్తియు దీనిని పొగొట్టుకోవాలని అనుకోడు.
10. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారపు "ప్రాయశ్చిత్త దిన" సేవ తీర్పును మరియు విశ్వం నుండి పాపాన్ని నిర్మూలించడానికి మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడానికి దేవుని ప్రణాళికను ఎలా సూచించినది?
జవాబు : పఠన మార్గదర్శి 2వ (స్టడీ గైడ్) నందు, సాతాను ఏ విధముగా దేవునిపై అపనిందలు మోపి సవాలు విసిరి మరియు కూరూపమైన పాపమనే పుండును విశ్వములోనికి ఏ విధముగా తెచ్చెనో అని మనము నేర్చుకొనియున్నాము. పురాతన ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త దినము, దేవుడు ఏ విధముగా పాపమును పరిష్కరించి ప్రాయశ్చిత్తము చేత సామరస్యతను తిరిగి విశ్వములోనికి తీసుకొని వచ్చునన్న విషయమును సాదృశ్యరూపకముగా బోధించెను. (ప్రాయశ్చిత్తము (అటోన్మెంట్) "యట్-వన్-మెంట్" అనగా "సమస్తమును పూర్తి దైవ సామరస్యతలోనికి తెచ్చుట." భూలోక గుడారమందు, సాదృశ్యరూపకమైన దశలు ఏవనగా:
A. యెహోవా పేరట మేక ప్రజల పాపములను కప్పివేయుటకు వధించబడెను.
B. యాజకుడు కృపాపీఠము యెదుట రక్తమును ప్రొక్షించి పరిచర్య చేసెను.
C. న్యాయతీర్పు ఈ క్రమములో జరిగెను :
(1)నీతిమంతులు నిర్ధారించబడిరి, (2) పశ్చాత్తాపము నొందని వారు కొట్టివేయబడిరి, (3) పాపాల ఖాతా ప్రత్యక్ష గుడారము నుండి తొలగింపబడెను.
D. విడిచిపెట్టే మేక అరణ్యములోనికి పంపబడెను.
E. పాపాల ఖాతా విడిచిపెట్టే మేక మీద ఉంచబడెను.
F. ప్రజలు తమ పాపము నుండి పవిత్రపరచబడిరి.
G. అందరు పరిశుద్ధతతో క్రొత్త సంవత్సరమును ప్రారంభించిరి.
సాదృశ్యపూర్వకమైన ఈ ఐదు దశలు విశ్వమునకు దేవుని పరలోక ప్రధాన కార్యాలయమైన పరలోక ప్రత్యక్ష గుడారము నుండి నియమించబడిన ప్రత్యక్ష ప్రాయశ్చిత్త సంఘటనలను సూచించుచున్నవి. పరలోకములో జరుగు మొదటి సంఘటన భూమ్మీద మొదటి జరుగు సంఘటనకు గుర్తు; పరలోకములో జరుగు రెండవ సంఘటన భూమ్మీద రెండవదిగా జరుగు రెండవ సంఘటనకు గుర్తు. ఈ గొప్ప ప్రాయశ్చిత్త సంఘటనలను దేవుడు ఎంత స్పష్టముగా సాదృశ్చపరచెనో గమనించుము :
A. మనుష్యుల స్థానములో యేసు ప్రభువు బలియాగముగా మరణించెను (1 కొరింథీయులకు 15:3; 5:7).
B.మన ప్రధాన యాజకుడుగా యేసు ప్రభువు ప్రజలను దేవుని స్వరూపములోనికి పునరుద్ధరించును (హెబ్రీయులకు 4:14-16; రోమీయులకు 8:29).
C. నీతిమంతులను మరియు దుర్మార్గులను నిర్ధారించుటకు తీర్పు జీవిత గ్రంథములను సమకూర్చును, తరువాత పరలోక ప్రత్యక్ష గుడారము నుండి పాపాల ఖాతాను తొలగించును. (ప్రకటన 20:12; అపొస్తలుల కార్యములు 3:19-21).
D. పాపమును ప్రారంభించినందుకు మరియు పాపము చేసేలా ప్రజలను నడిపించినందుకు సాతాను బాధ్యత వహించి తగిన మూల్యము చెల్లించును (1 యోహాను 3:8; ప్రకటన 22:12).
E. సాతాను అరణ్యములోనికి బహిష్కరించబడెను (ప్రకటన 20వ అధ్యాయములో ఇయ్యబడిన 1,000 సంవత్సరములు).
F. సాతాను, పాపము, మరియు దుర్మార్గులు శాశ్వతముగా నిర్మూలన చేయబడుదురు. (ప్రకటన 20:10; 21:8; కీర్తన 37:10, 20, నహూము 1:9).
G. దేవుని ప్రజల కొరకు క్రొత్త భూమి సృష్టింపబడును. పాపము చేత పోగొట్టుకొన్నదంతయు ప్రభువు పరిశుద్ధులకు పునరుద్ధరించబడును. (2 పేతురు 3:13; అపొస్తలుల కార్యములు 3:20, 21).
విశ్వము మరియు దానిలో ఉన్నదంతయు పాపము ఇక ఎన్నటికి తలెత్తదనే భరోసాతో పాపము ప్రవేశించుటకు ముందున్న స్థితికి పునరుద్ధరించబడేంత వరకు ప్రాయశ్చిత్తము పూర్తి కాలేదు.
11. ఈ స్టడీ గైడ్ పత్రికలో బయలుపరచబడిన రీతిగా తీర్పును గూర్చిన శుభవార్త ఏమిటి?
జవాబు : మేము మీ కొరకు శుభవార్తను క్రింద సంగ్రహించాము.....
A. దేవుడు మరియు పాప సమస్యను పరిష్కరించే విధానం మొత్తం విశ్వం ముందు నిరూపించబడుతుంది. ఇది తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం (ప్రకటన 19:2).
B. దేవుని ప్రజలకు అనుకూలంగా తీర్పు నిర్ణయించబడుతుంది (దానియేలు 7:21, 22).
C. నీతిమంతులు పాపము నుండి సదాకాలము సురక్షితముగా నుందురు (ప్రకటన 22:3-5).
D. పాపము సమూలముగా నివారించబడును, మరల తలెత్తదు (నహూము 1:9).
E. పాపము ద్వారా ఆదాము హవ్వలు కోల్పోయినదంతయు విమోచింపబడిన వారికి తిరిగి పునరుద్ధరించబడును (ప్రకటన 21:3-5).
F. దుర్మార్గులు బూడిదెగా మార్చివేయబడుదురు- యుగయుగములు అగ్నిలో వేధించబడరు (మలాకీ 4:1).
G. తీర్పులో, యేసే న్యాయమూర్తి, న్యాయవాది మరియు సాక్షి (యోహాను 5:22; 1 యోహాను 2:1; ప్రకటన 3:14).
H. తండ్రి మరియు కుమారుడు ఇద్దరూ మనలను ప్రేమించుచున్నారు. అపవాది మనపై నిందలు వేయును (యోహాను 3:16; 17:23; 13:1; ప్రకటన 12:11).
I. పరలోక గ్రంథములు నీతిమంతులకు సహాయ పూర్వకముగా ఉండును ఎందుకనగా వారు తమ విమోచనలో దేవుని నడిపింపును కనుపరచెదరు (దానియేలు 12:1).
J. క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. తీర్పు ఆ సత్యాన్ని స్పష్టం చేస్తుంది (రోమీయులకు 8:1).
K. దేవుడు అన్యాయస్థుడని ఏ ఒక్కడును (మనిషి లేదా దేవదూతయైనను) ఆరోపింపరు. దేవుడు అందరితో వ్యవహరించడంలో ప్రేమగాను, న్యాయముగాను, కనికరముగాను, మరియు దయతో వ్యవహరించాడని ప్రజలందరు ఏకగ్రీవముగా ఒప్పుకొందురు (ఫిలిప్పీయులకు 2:10, 11).
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. యేసును నా రక్షకుడుగా అంగీకరించుటకు మరియు ఆయనను నా ప్రభువుగా అంగీకరించుటకు మధ్య వ్యత్యాసమేమిటి?
జవాబు : వ్యత్యాసము ముఖ్యమైనది. రక్షకునిగా నేనాయనను అంగీకరించినప్పుడు, దోషము నుండి మరియు పాపపు విధి (మరణము) నుండి ఆయన నన్ను రక్షించి నూతన జన్మనిచ్చును. పాపి నుండి పరిశుద్ధునిగా ఆయన నన్ను మార్చివేయును. ఈ పరివర్తన కార్యము ఒక మహిమాన్విత అద్భుత కార్యమును మరియు రక్షణకు అవసరమైయున్నది. ఇది లేకుండ ఎవరును రక్షింపబడలేరు. ఏది ఏమైనను, యేసు ప్రభువు నాలో జరిగించు కార్యము విషయమై ఇక్కడితో ఆగిపోలేదు. నేను నూతనముగా ఆయన యందు జన్మించియున్నాను, కాని ఆయన ప్రణాళిక ఏదనగా నేను ఆయన వలె మారుటకు ఎదగవలసియున్నాను (ఎఫెసీయులకు 4:13). నా జీవితమునకు అధిపతిగా, లేక ప్రభువుగా నేనాయనను అనుదినము అంగీకరించినప్పుడు, ఆయన, తన అద్భుత కార్యముల చేత, నేను క్రీస్తునందు సంపూర్ణ పరిపక్వత చెందునంత వరకు ఆయన కృప యందు మరియు క్రైస్తవ సత్ప్రవర్తన యందు నన్ను ఎదిగింపజేయును (2 పేతురు 3:18).
సమస్య - మన సొంత మార్గము
సమస్య ఏదనగా మనకిష్టానుసారమైన త్రోవకు తొలగిపోవుట, మనకిష్టమైనది చేయుట. బైబిలు దీనిని "దోషము" లేక పాపమని పిలుచుచున్నది (యెషయా 53:6). ఆయనను "ప్రభువు"గా క్రొత్త నిబంధన 766 సార్లు పేర్కొనుచున్నందున యేసుక్రీస్తును నా ప్రభువుగా చేసికొనుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము! ఒక్క అపొస్తలుల కార్యములు గ్రంథములోనే, ఆయనను "ప్రభువు"గా 110 సార్లు మరియు "రక్షకుడుగా" రెండు సార్లు సూచిస్తున్నందున "ప్రభువుగా" మరియు అధిపతిగా ఆయనను అంగీకరించుట ఎంత ప్రాముఖ్యమో అర్థమగుచున్నది.
నిర్లక్ష్యము చేయబడిన అత్యవసరము - ఆయనను ప్రభువుగా చేసికొనుట
యేసు ప్రభువు తన ఆధిపత్యమును గూర్చి పదేపదే నొక్కి చెప్పెను ఎందుకనగా ఆయనను ప్రభువుగా సంబోధించుట మరచిపోయిన మరియు నిర్లక్ష్యం చేయబడిన అత్యవసరం అని ఆయనకు తెలుసు (2 కొరింథీయులకు 4:5). మనం ఆయనను మన జీవితాలకు ప్రభువుగా చేయకపోతే, క్రీస్తు నీతిని ధరించిన పరిణితి చెందిన క్రైస్తవులుగా మనం ఎదగడానికి మార్గం లేదు. దీనికి బదులుగా, నేను " దౌర్భాగ్యుడుగా, దిక్కుమాలినవాడుగా, దరిద్రుడుగా, గ్రుడ్డివాడుగా, దిగంబరుడుగా" మరియు "నాకేమియు కొదువలేదనే" దారుణమైన భావనతో మిగిలిపోవుదును (ప్రకటన 3:17).
2. ప్రాయశ్చిత దినమున దేవుని ప్రజలు యొక్క పాపపు ఖాతాలు విడిచిపెట్టే మేక మీదికి బదిలీ చేయబడినందున, అది (సాతాను) కూడ మన పాపములను మోసేవాడుగా చేయలేదా? యేసు మాత్రమే మన పాపములను మోయలేదా?
జవాబు : సాతానును సూచిస్తున్న విడిచిపెట్టే మేక ఏ విధముగాను మన పాపములను మోయలేదు లేదా వాటికి పరిహారము చెల్లించదు. ప్రాయశ్చిత్త దినమున బలిగా వధింపబడిన యెహోవా పేరట వచ్చిన మేక, మన స్థానములో మన పాపముల కొరకు కల్వరి సిలువలో ప్రాయశ్చిత్తము చెల్లించిన యేసు ప్రభువును సూచించుచున్నది. యేసు ప్రభువు మాత్రమే "లోక పాపమును మోసికొనుపోవును" (యోహాను 1:29). సాతాను (ఇతర పాపులు (దుర్మార్గుల) వలె తన పాపముల విషయమై తప్పక శిక్షింపబడును - (ప్రకటన 20:12-15) అనగా (1) పాపమును ప్రారంభించినందుకు, (2) అతని సొంత దుష్ట చర్యలకు, మరియు (3) పాపము చేయులాగున భూమ్మీద నున్న ప్రతి వ్యక్తిని ప్రభావితము చేసినందుకు మూలకారకుడుగా శిక్షనొందును. దుష్టత్వమునకు జవాబుదారునిగా ప్రాయశ్చిత్త దినమున పాపమును విడిచిపెట్టే మేక (సాతాను) మీదికి బదిలీ చేసే సాదృశ్యరూపమిదే.
3. ఒప్పుకొనిన అన్ని పాపములను దేవుడు క్షమించునని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది (1 యోహాను 1:9). క్షమించబడినను, ఈ పాపముల యొక్క ఖాతా అంత్యకాలము వరకు పరలోకపు గ్రంథములలో నిలిచియుండునన్నది కూడ స్పష్టమైన విషయమే (అపాస్తలుల కార్యములు 3:19-21), క్షమించబడినప్పుడు పాపములు ఎందుకు కొట్టివేయబడలేదు?
జవాబు : దీనికి ఒక చక్కని కారణమున్నది. దుర్మార్గులకు తీర్పు యుగాంతమందు, సరిగ్గా వారి నాశనమునకు ముందు జరిగేంత వరకు పరలోక న్యాయతీర్పు పూర్తయినట్లు కాదు. న్యాయతీర్పు యొక్క అంతిమ దశకు ముందే ఈ ఖాతాలను దేవుడు నాశనము చేసిన యెడల, ఏదో పెద్ద విషయమును కప్పిపుచ్చినందుకు గాను దేవుడు నిందించబడే అవకాశమున్నది. ప్రవర్తనను గూర్చిన ఖాతాలన్నియు న్యాయతీర్పు పూర్తయ్యేంత వరకు చూచుటకు లేదా పరిశీలించుటకు బహిరంగముగా నిలిచియుండును.
4. తీర్పు సిలువ వద్ద జరిగినదని కొందరు అంటున్నారు. మరికొందరు అది మరణమందు జరిగినదని అంటున్నారు. న్యాయతీర్పును గూర్చి ఈ స్టడీ గైడ్ పత్రికలో చూపిన విధముగా తీర్పు సమయము సరైనదని మనము ఖచ్చితముగా చెప్పగలమా?
జవాబు : అవును. కాబట్టి తీర్పు యొక్క సమయానికి సంబంధించి మనం ఖచ్చితంగా చెప్పగలం, దానియేలు 7వ అధ్యాయము లో దేవుడు మూడు సార్లు దీనిని గూర్చి విశేషముగా ప్రస్తావించెను. దేవుని నిర్దిష్ట సమయాన్ని గమనించుము. దేవుడు అనిశ్చయతకు చోటు ఇవ్వడు. ఈ ఒక్క అధ్యాయములో దైవ కాలక్రమము (7:8-14, 20-22, 24-27) ఈ విధముగా పేర్కొనబడినది :
- I. చిన్నకొమ్ము అధికారము - క్రీ.శ. 538 నుండి 1798 వరకు పరిపాలించెను.
- న్యాయతీర్పు - 1798 తరువాత (1844లో) ప్రారంభమై యేసు ప్రభువు రెండవ రాకడ వరకు కొనసాగును.
- దేవుని నూతన రాజ్యము - న్యాయతీర్పు యొక్క ముగింపునందు స్థాపించబడును.
కాబట్టి తీర్పు మరణమందు లేదా సిలువయందు జరుగదు, కాని 1798 మరియు యేసు ప్రభువు రెండవ రాకడకు మధ్య జరుగునని దేవుడు స్పష్టము చేయుచున్నాడు. మొదటి దూత వర్తమానములో భాగముగా "ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను" అని చెప్పబడినదని గుర్తుంచుకొనుము (ప్రకటన 14:6, 7). దేవుని అంత్యకాల ప్రజలు అంతిమ న్యాయతీర్పు ప్రస్తుతము జరుగుచున్నదని ప్రపంచమునకు తెలియజెప్పవలెను.
5. తీర్పుపై మన అధ్యయనము నుండి మనము ఏ ముఖ్యమైన పాఠములు నేర్చుకోవచ్చును?
జవాబు : క్రింది ఐదు విషయములను గమనించుము :
- దేవుని చర్యలు ఆలస్యమైనట్టుగా అగుపడవచ్చును కాని ఆయన సమయం సరైనది. నశించిపోయిన ఏ వ్యక్తి అయినా "నాకు అర్ధం కాలేదు" లేదా "నాకు తెలియదు" అని చెప్పలేరు.
- సాతాను మరియు అన్ని రకాల చెడు చివరికి తీర్పు ద్వారా దేవునితో వ్యవహరించబడుతుంది. అంతిమ తీర్పు దేవుని పని మరియు ఆయనకు అన్ని వాస్తవాలు ఉన్నందున, మనం ఇతరులను తీర్పు తీర్చడం మానేసి, ఆయన దానిని చేయనివ్వండి. దేవునికి తీర్పు తీర్చడం మనకు చాలా తీవ్రమైన విషయం. ఇది అతని అధికారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అవుతుంది.
- మనం ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉంటాయో, ఎవరికి సేవ చేస్తామో నిర్ణయించుకొనడానికి దేవుడు మనందరినీ స్వేచ్ఛగా వదిలివేస్తాడు. అయితే, ఆయన వాక్యానికి విరుద్ధంగా మనం నిర్ణయించుకున్నప్పుడు తీవ్రమైన పరిణామాలకు మనం సిద్ధంగా ఉండాలి.
- దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఈ అంత్యకాల సమస్యలు స్పష్టమగుటకు ఆయన మనకు దానియేలు ప్రకటన గ్రంథములను ప్రసాదించి యున్నాడు. ఆయన మాట వినడం మరియు ఈ గొప్ప ప్రవచనాత్మక పుస్తకాల నుండి ఆయన సలహాలను పాటించడం మన ఏకైక భద్రత.
- సాతాను మనలో ప్రతి ఒక్కరినీ నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతని మోసపూరిత వ్యూహాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి మరియు చాలా కొద్దిమంది తప్ప అందరూ చిక్కుకుపోతారు. అపవాది యొక్క ఉచ్చుల నుండి మనలను రక్షించడానికి, యేసు యొక్క పునరుత్థాన శక్తి మన జీవితంలో ప్రతిరోజూ పని చేయకపోతే, మనం సాతాను చేత నాశనం చేయబడతాము.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) అంతిమ తీర్పుకు ఎన్ని దశలు ఉన్నాయి? (1)
( ) ఆరు.
( ) ఒకటి.
( ) మూడు.
2) తీర్పు యొక్క మొదటి దశకు సంబంధించిన సత్యమైన విషయములను గుర్తించుము. (7).
( ) ఇది రెండవ రాకడకు ముందు జరిగే తీర్పు.
( ) ఇది క్రీ.శ. 1844 లో ప్రారంభమాయెను.
( ) ఇది ప్రస్తుతము జరుగుచున్నది.
( ) సాతానుడు ప్రతివాది (నిందితుడు).
( ) గబ్రియేలు దేవదూత న్యాయమూర్తి.
( ) దేవుడు అధ్యక్షత వహించును.
( ) ప్రవక్తయగు యోనా దీనిని గూర్చి ముందుగానే ప్రవచించెను.
( ) దేవుని ధర్మశాస్త్రము ప్రమాణము (గీటురాయి).
( ) ఇది క్రైస్తవులమని చెప్పుకొనిన వారి జీవితములను పరిగణలోనికి తీసికొనును.
3) 1,000 సంవత్సరముల కాలమందు జరుగబోవు తీర్పు యొక్క రెండవ దశకు సంబంధించి క్రింద ఇయ్యబడిన ఏ వాక్యములు సత్యమైనవి? (3)
( ) అన్ని యుగాలయందున్న నీతిమంతులు పాల్గొనెదరు.
( ) సాతానుడు న్యాయస్థానములో జరిగే కార్యక్రమములను అదేపనిగా అడ్డగించును.
( ) సాతానుడి యొక్క శిక్షావిధి న్యాయమైనదని అందరు ఒప్పుకొందురు.
( ) సాతానుని దూతలు క్షమించబడుదురు.
( ) దుర్మార్గులు తమ హక్కులను కోరెదరు.
( ) నీతిమంతులు తమ స్నేహితుల్లో కొందరు ఎందుకు నశించిరో తెలిసికొందురు.
4) యేసు మూడు స్థానములలో పరిచర్య చేయును. ఏమిటి అవి? (3)
( ) న్యాయమూర్తి.
( ) సాక్షి.
( ) ప్రధాన న్యాయాధికారి.
( ) న్యాయస్థానములో గుమాస్తా.
( ) న్యాయవాది.
5) 1,000 సంవత్సరముల ముగింపు నందు దుర్మార్గులు పరిశుద్ధ పట్టణమును ముట్టడి చేసిన తరువాత వారు నిజమైన వ్యక్తులుగా తీర్పు కొరకు నిలువబడెదరు. (1)
( ) అవును.
( ) కాదు.
6) అతడు లేక ఆమె ఎందుకు నశించెనన్న విషయమును నశించిన ప్రతి వ్యక్తికి మరియు దేవదూతకు దేవుడు స్పష్టముగా వివరించును. (1)
( ) అవును.
( ) కాదు.
7) తీర్పు యొక్క ఏ దశలో ఇప్పటివరకు జీవించిన ప్రతి వ్యక్తి (మంచి మరియు చెడు), అలాగే అన్ని దుష్ట దూతలు మరియు సాతానుడు వ్యక్తిగతంగా పాల్గొంటారు? (1)
( ) మొదటి దశ - ప్రస్తుతము రెండవ రాకడకు ముందు జరిగే దశ.
( ) రెండవ దశ - 1,000 సంవత్సరముల కాలమందు జరిగే దశ.
( ) మూడవ దశ - 1,000 సంవత్సరముల ముగింపు నందు జరిగే దశ.
8) జీవిత చరిత్రలు దాఖలైన గ్రంథములు పరలోక తీర్పులో ఎందుకు అవసరమైయున్నవి? (1)
( ) వాస్తవములను దేవునికి తెలియజేయుటకు.
( ) దేవుడు మరచిపోయిన సంగతులను ఆయనకు గుర్తు చేయుటకు.
( ) దేవదూతలకు ఏదొక పని అప్పజెప్పుటకు.
( ) దేవుడు తీర్పుతీర్చే విషయములో వ్యవహరించిన వైనము నీతి న్యాయములు గలదని ప్రజలు, దేవదూతలు, ఇతర లోకముల నివాసులు అర్ధము చేసికొనుటకు.
9) “ప్రాయశ్చిత్తము (అటోన్మెంట్)” అనగా “అన్నింటినీ సంపూర్ణ దైవ సామరస్యములోనికి తెచ్చుట.” ఈ క్రింది విషయములలో ఏవి పరలోకపు మహా ప్రాయశ్చిత్తములో భాగమైయున్నవి? (5)
( ) సిలువపై యేసు ప్రభువు మరణము.
( ) తీర్పు.
( ) మన ప్రధాన యాజకుడుగా యేసు ప్రభువు పరిచర్య.
( ) నోవహు దినములలో జలప్రళయము.
( ) సింహాల గుహలో దానియేలు.
( ) పాపము మరియు పాపుల యొక్క అంతిమ సమూల నాశనము.
( ) క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క సృష్టి.
10) తీర్పును గూర్చిన ఏ విషయములు శుభవార్తయై యున్నవి? (5)
( ) తీర్పు పరిశుద్ధులకు అనుకూలముగా నిర్ణయించబడును.
( ) అపవాది యుగయుగములు నరకములో కాలును.
( ) పాపము ఇక మరలా ఎన్నటికి తలెత్తదు.
( ) చాలా కాలము తరువాత పాపము మరల అతి సులభముగా తలెత్తగలదు.
( ) యేసు ప్రభువు మన న్యాయమూర్తి, న్యాయవాది, మరియు సాక్షి.
( ) పాపము మరియు రక్షణ ప్రణాళిక విషయములో దేవుడు వ్యవహరించిన వైనము న్యాయవంతమైనదని పూర్తిగా నిరూపించబడును.
( ) పాపము ద్వారా ఆదాము హవ్వలు కోల్పోయినదంతయు తిరిగి పునరుద్ధరించబడును.
11) తీర్పులో విడిచిపెట్టే మేకగా (నిందితుడుగా) సాతాను గురించి సత్యమేమిటి? (3).
( ) పాపమును ప్రారంభించినందుకు అతడు శిక్షింపబడును.
( ) ప్రతి వ్యక్తిని పాపములోనికి నడిపించినందుకు అతడు శిక్షింపబడును.
( ) మన పాపముల కొరకు పరిహారము చెల్లించే విషయములో అతనికి ఏ సంబంధము లేదు.
( ) విడిచిపెట్టే మేకగా (నిందితుడుగా) ఉండుటకు సాతానుడు తృణీకరించి తప్పించుకొనెను.
12) తీర్పు ఏకపక్ష నిర్ణయము కాదు. బదులుగా, యేసును సేవించటానికి లేదా మరొక యజమానిని ఎన్నుకోవటానికి ప్రజలు ఇప్పటికే చేసిన ఎంపికలను ఇది నిర్ధారిస్తుంది. (1)
( ) అవును.
( ) కాదు.
13) తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యము పాపము యొక్క విషాదమును అది ప్రారంభమైనది మొదలుకొని దేవుడు దానిని వివేకముగా, సమర్థవంతముగా న్యాయవంతముగా, మరియు నిష్పక్షపాతముగా (సమధర్మముగా) ఎట్లు నిర్వహించుచు వచ్చెనన్న విషయమును సాతానుకు, మంచి మరియు చెడు దూతలకు, మరియు ఇతర లోకముల నివాసులకు స్పష్టము చేయుట. (1)
( ) అవును.
( ) కాదు.
14) నీ జీవితములోనికి ప్రవేశించమని ఆయనను ఆహ్వానించి, తన ఆధీనములో ఉంచుటకు ఆయనను అనుమతించిన యెడల, పరలోక తీర్పులో నిన్ను నిర్దోషిగా ఎంచెదనని దేవుడు వాగ్దానము చేసెను. ఈ రోజే నీ జీవితములోనికి ప్రవేశించుటకు నీవు ఆయనను ఆహ్వానించెదవా?
( ) అవును.
( ) కాదు.