Lesson 14
ప్రజలు ఒకటి లేదా రెండు చిన్న రోడ్డు ట్రాఫిక్ చట్టములను ఉల్లంఘించుట లేదా వారు చెల్లించవల్సిన పన్నులపై "కొంచెము” మోసము చేయుట పెద్ద తప్పేమి కాదని తరుచు భావించుచున్నారు, కాని దేవుడు మరియు ఆయన చట్టములు చాలా భిన్నముగా పనిచేయును. దేవుడు మనము చేయు ప్రతి పనిని చూచుచున్నాడు, మనము చెప్పు ప్రతి మాటను వినుచున్నాడు మరియు మనము ఆయన ధర్మశాస్త్రమును ఎట్లు పరిగణించుచున్నామో ఆయన నిజముగా శ్రద్ద వహించుచున్నాడు. ప్రభువు మన పాపములకు క్షమాపణ దయచేయుచున్నాడు కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించినందుకు పరిణామములు ఉండవని కాదు. ఆశ్చర్యకరముగా, కొంతమంది క్రైస్తవులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించే ఏ ప్రయత్నమైనను క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తని చెప్పుచున్నారు. అయినను మీరు నిజముగా దేవునిని ప్రేమించిన యెడల, ఆయన అడిగినది మీరు చేయుదురని యేసు ప్రభువు చెప్పెను. కాబట్టి, విధేయత నిజముగా క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తా? ఈ స్టడీ గైడ్ పత్రికను జాగ్రత్తగా చదువుటకు సమయము కేటాయించుము. నిత్యమైన పరిణామములు ముందున్నవి!
1. దేవుడు నిజముగానే నన్ను వ్యక్తిగతముగా చూచి గమనించునా?
"చూచుచున్న దేవుడవు నీవే" (అధికాండము 16:13). "యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు. నేను కూర్చుందుట నేను లేచుట నీకు తెలియును, నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది" (కీర్తనలు 139:1-4). “మీ తల వెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి” (లూకా 12:7).
జవాబు : అవును. దేవుడు నిన్ను మరియు భూమిపై ఉన్న ప్రతి వ్యక్తిని మనలను మనము ఎరిగిన దానికంటే బాగుగా ఎరిగియున్నాడు. ఆయన ప్రతి మానవుడిపట్ల వ్యక్తిగత ఆసక్తిని కనబరచుచున్నాడు మరియు మనము చేయు ప్రతి పనిని చూచుచున్నాడు. ఆయన నుండి ఒక్క మాట, ఆలోచన లేదా క్రియ కూడ మరుగు చేయబడలేదు.
"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపదు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును" (మత్తయి 7:21). "నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము" (మత్తయి 19:17). "ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై,... తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను" (హెబ్రీయులకు 5:9, 10).
జవాబు : లేదు. దీనిపై లేఖనము చాలా స్పష్టముగా ఉన్నది. ప్రభువు ఆజ్ఞలను అనుసరించువారికే రక్షణ మరియు పరలోకరాజ్యము అనుగ్రహించబడును. దేవుడు కేవలము విశ్వాసులమని లేదా సంఘ సభ్యులమని లేదా బాప్తిస్మము పొందియున్నామని చెప్పుకొనువారికి నిత్యజీవమును వాగ్దానము చేయడు, కాని లేఖనములో వెల్లడైనట్లుగా ఆయన చిత్తప్రకారము చేయువారికే వాగ్దానము చేయును. అయితే, ఈ విధేయత క్రీస్తు ద్వారానే సాధ్యమగును (అపొస్తలుల కార్యములు 4:12).
"జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే" (మత్తయి 7:14). "నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును, నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు" (సామెతలు 8:36). "మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా ... మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను" (ద్వితీయోపదేశకాండము 6:24).
జవాబు : ఒకే ఒక మార్గము పరలోకమునకు నడుపును. బైబిలు గ్రంథము మనకు ఆ మార్గమును చూపించు పటమునైయున్నది. ఎందుకనగా ఒకే ఒక మార్గము దేవుని రాజ్యమునకు నడుపును. అన్ని రహదారులు ఒకే చోటుకు నడుపవు. బైబిలు గ్రంథము ఆ రాజ్యమునకు మార్గమును చూపించు పటమునైయున్నది - అది ఆ రాజ్యమును ఎట్లు సురక్షితముగా చేరుకొనవలెనని చెప్పు అన్ని సూచనలు, హెచ్చరికలు మరియు సమాచారముతో నిండిన మార్గదర్శి పుస్తకమునైయున్నది. దానిలో దేనినైనను విస్మరించుట మనలను దేవుని నుండి మరియు ఆయన రాజ్యము నుండి దూరము చేయును. దేవుని విశ్వము శాంతిభద్రతలతో కూడిన ధర్మములతో నిండియున్నది - అందులో సహజ, నైతిక మరియు ఆధ్యాత్మిక ధర్మములు కూడ ఉన్నవి. ఈ ధర్మములలో దేనినైనను ఉల్లంఘించుట వలన స్థిరమైన పరిణామములు తప్పవు. బైబిలు ఇయ్యబడకపోయి యుండిన యెడల, బైబిలు యొక్క గొప్ప సూత్రములు ఎప్పటికి నిలిచియున్నవని మరియు అవి నిజమైనవని ప్రజలు విచారణ మరియు విశ్లేషణ అనే పద్ధతి ద్వారా త్వరలోనే లేదా ఇంకెప్పటికైనను ప్రయోగాత్మకముగా కనుగొని యుండేవారు. వాటిని విస్మరించినప్పుడు, అవి అనారోగ్యము, హింస మరియు ప్రతి రకమైన అసంతృప్తికి కారణమగును. అందువలన, బైబిలు యొక్క మాటలు పరిణామములు లేకుండ మనము అంగీకరించగల లేదా విస్మరించగల సలహా మాత్రమే కాదు. ఈ పరిణామములు ఏమిటో కూడ బైబిలు చెప్పుచున్నది మరియు వాటిని ఎట్లు నివారించవలెనో వివరించుచున్నది. ఒక నిర్మాణకుడు ఎలాగైతే ఇంటి నమూనాను విస్మరించి ఇబ్బంది పడకుండ ఉండలేడో, అలాగే ఒకడు తన కిష్టానుసారముగా జీవించుచు ఎప్పటికి క్రీస్తు వలె మారలేడు - అందువలన మనము బైబిలు గ్రంథము యొక్క నమూనాను అనుసరించవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు. ఆయన వలె మారుటకు, తద్వారా ఆయన రాజ్యములో స్థలము కొరకు పాత్రులమగుటకు వేరొక మార్గము లేదు. సులభముగా ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన ఆనందమునకు వేరొక మార్గము లేదు.
4. అవిధేయత కొనసాగునట్లు దేవుడు ఎందుకు అనుమతించుచున్నాడు? పాపమును మరియు పాపులను ఆయన ఇప్పుడే ఎందుకు నాశనము చేయకూడదు?
"ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చును" (యూదా 1:14, 15). "నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు" (రోమీయులకు 14:11).
జవాబు : ప్రతి ఒక్కరు తన న్యాయమును, ప్రేమను మరియు దయను పూర్తిగా ఒప్పుకొనేంత వరకు దేవుడు పాపమును నాశనము చేయడు. దేవుడు, విధేయతను కోరుట ద్వారా, తన చిత్తమును మనపై బలవంతము చేయుటకు ప్రయత్నించుట లేదని, మనలను మనము బాధించుకొనకుండ మరియు నాశనము చేసికొనకుండ మనలను నివారించుటకు ప్రయత్నించుచున్నాడని అందరును చివరకు గ్రహించుదురు. అత్యంత విరక్తిగల, కఠినమైన పాపులు కూడ దేవుని ప్రేమను ఒప్పుకొని, ఆయన న్యాయవంతుడని అంగీకరించేంత వరకు పాపమనే సమస్య పరిష్కరించబడదు. కొందరిని ఒప్పించుటకు ఒక పెద్ద విపత్తు జరుగవలెనేమో, కాని పాపాత్మకమైన జీవనము యొక్క భయంకరమైన ఫలితములు చివరకు దేవుడు న్యాయవంతుడని మరియు యథార్థవంతుడని అందరిని ఒప్పించగలవు.
5.అవిధేయులు నిజముగా నాశనమగుదురా?
"దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను" (2 పేతురు 2:4). "భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును" (కీర్తనలు 145:20). "దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు" (2 థెస్సలొనీకయులకు 1:8).
జవాబు : అవును. అవిధేయులు, అపవాది మరియు అతని దూతలతో సహా అందరు నాశనమగుదురు. ఇది నిజము గనుక, ఏది తప్పు లేదా ఏది ఒప్పు అన్నదానికి సంబంధించిన అన్ని అస్పష్టతలను వదిలివేయుటకు ఖచ్చితముగా ఇది సమయము. తప్పొప్పులను నిర్దేశించే మన సొంత తలంపులు మరియు భావాభిప్రాయములపై ఆధారపడుట మనకంత సురక్షితము కాదు. మన ఏకైక భద్రత దేవుని వాక్యముపై ఆధారపడుటలోనే ఉన్నది. (పాపము యొక్క నాశనము గురించి మరిన్ని వివరముల కొరకు 11వ స్టడీ గైడ్ పత్రికను మరియు యేసు ప్రభువు రెండవ రాకడ గురించి 8వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
6. నీవు దేవునిని సంతోషపెట్టాలను కొనుచున్నావు, కాని ఆయన ఆజ్ఞల నన్నిటిని పాటించుట నిజముగా సాధ్యమేనా?
“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును” (మరియు 7:7). "సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము" (2తిమోతి 2:15). “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును" (యోహాను 7:17). "చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి" (యోహాను 12:35). "నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు” (కీర్తనలు 18:44).
జవాబు : (1) ఆయన నడిపింపు కొరకు హృదయపూర్వకముగా ప్రార్థించుచు, (2) దేవుని వాక్యమును చిత్తశుద్ధితో అధ్యయనము చేయుచు మరియు (3) నీకు చూపబడిన వెంటనే సత్యమును అనుసరించిన యెడల నిన్ను తప్పు నుండి తప్పించి సర్వసత్యములోనికి సురక్షితముగా నడిపించెదనని దేవుడు వాగ్దానము చేసెను.
“అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను” (యోహాను 9:41). "కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును" (యాకోబు 4:17). "నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక ... నేను నిన్ను విసర్జింతును" (హోషేయా 4:6). "వెదకుడి మీకు దొరకును" (మత్తయి 7:7).
జవాబు : ఒక ప్రత్యేక బైబిలు సత్యమును నేర్చుకొనుటకు నీకు అవకాశము లేకపోయిన యెడల, దేవుడు నిన్ను జవాబుదారీగా ఎంచడు. నీకు అందిన వెలుగునకు (సత్య జ్ఞానము)నకు దేవుడు నిన్ను బాధ్యుడుగా ఎంచునని బైబిలు బోధించుచున్నది. అలాగని ఆయన దయతో అజాగ్రత్తగా ఉండుము! కొందరు అధ్యయనము చేయుటకు, వెదకుటకు, నేర్చుకొనుటకు మరియు వినుటకు నిరాకరించెదరు లేదా నిర్లక్ష్యము చేసెదరు మరియు వారు "జ్ఞానమును విసర్జించినందున" వారు నాశనమగుదురు. ఈ ప్రాముఖ్యమైన విషయములలో ఉష్ట్రపక్షి (నిప్పుకోడి) క్రీడను ప్రదర్శించుట ప్రాణాంతకము. సత్యము కొరకు శ్రద్ధగా అన్వేషించుట మన బాధ్యతమైయున్నది.
8. కాని ప్రతి చిన్న వివరముపై విధేయత గురించి దేవుడు అంతగా పట్టించుకొనడు, ఆయన నిజముగా పట్టించుకొనునా?
"ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన ... కాలేబును ... యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను" (సంఖ్యాకాండము 32:11, 12). "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును” (మత్తయి 4:4). "నేను మీ కాజ్ఞాపించు వాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు" (యోహాను 15:14).
జవాబు : ఆయన తప్పక పట్టించుకొనును. పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు దీనిని కఠినమైన మార్గములో నేర్చుకొనిరి. వాగ్ధాన భూమి కొరకు ఐగుప్తును విడిచిపెట్టిన వారు లెక్కకు అనేకమంది ఉండిరి. ఈ గొప్ప సమూహములో, కాలేబు మరియు యెహోషువ అను ఇద్దరు మాత్రమే యెహెూవాను పూర్ణమనస్సుతో అనుసరించిరి, వారు మాత్రమే కనానులోకి ప్రవేశించిరి. మిగతావారు అరణ్యములోనే మరణించిరి బైబిలులోని "ప్రతి మాట" వలన మనము జీవించవలెనని యేసు ప్రభువు చెప్పెను. ఒక ఆజ్ఞ చాలా ఎక్కువ లేదా ఒక చాలా తక్కువ అని లేదు. అన్నియు ప్రాముఖ్యమైనవే!
"చీకటి మిమ్మును కమ్ముకొనకుందునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి" (యోహాను 12:35). “నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని” (కీర్తనలు 119:60). "మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" (మత్తయి 6:33). "నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు" (కీర్తనలు 18:44).
జవాబు: వేచి ఉందకూడదు. నీవు ఒక బైబిలు సత్యమును స్పష్టముగా తెలిసికొనిన తరువాత, వేచి యుండుట మంచిది కాదు. వాయిదా వేయుట ప్రమాదకరమైన ఉచ్చు. వేచి యుండుట చాలా హానిచేయనిదిగా అనిపించును, కాని ఒకడు తనకందిన వెలుగునకు వెంటనే స్పందించకపోయిన యెడల, అది త్వరగా చీకటిగా మారిపోవునని బైబిలు బోధించుచున్నది. మనము ఊరకనే నిలబడి వేచి ఉన్నంత మాత్రాన విధేయతకు అవరోధములు తొలగించబడవు బదులుగా, అవి సాధారణముగా పరిమాణములో పెరిగిపోవును. మనిషి దేవునితో, "మార్గము తెరువుము, నేను ముందుకు వెళ్లెదను" అని చెప్పును, కాని దేవుని మార్గము దీనికి సరిగ్గా వ్యతిరేకముగా ఉన్నది. ఆయన, "నీవు ముందుకు సాగుము, నేను మార్గము తెరచెదను" అని చెప్పును.
"దేవునికి సమస్తమును సాధ్యము" (మత్తయి 19:26). "నన్ను బలపరచు వానియందే (క్రీస్తునందే) నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీయులకు 4:13). "ఆయనయందు (క్రీస్తునందు) మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" (2 కొరింథీయులకు 2:14). "ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" (యోహాను 15:5). "మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్ధములను అనుభవింతురు" (యెషయా 1:19).
బాబు : మనలో ఎవరము మన సొంత శక్తితో విధేయత చూపలేము, కాని క్రీస్తు ద్వారా మనము చూపగలము మరియు తప్పక చూపవలెను. సాతానుడు, దేవుని అభ్యర్థనలను (మనవులను) అసమంజసముగా (కారణము లేనివాటిగా) కనబడునట్లు చేయుటకు, విధేయత అసాధ్యము అను అబద్ధమును కనుగొనెను.
"మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును" (హెబ్రీయులకు 10:26, 27). "చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగదు" (యోహాను 12:35).
జవాబు: బైబిలు సందేహమునకు తావివ్వదు. సమాధానము హుందాగా ఉన్నది, కాని నిజము. ఒక వ్యక్తి బుద్ధిపూర్వకముగా సత్య వెలుగును తిరస్కరించి అవిధేయతలో కొనసాగినప్పుడు, ఆ వెలుగు చివరికి చీకటిమయమై, అతడు పూర్తి అంధకారములో మిగిలిపోవును. సత్యమును తిరస్కరించు వ్యక్తి అబద్ధమును నిజమని నమ్ముటకు బలమైన "మోసము చేయు శక్తిని" పొందుకొనును (2 థెస్సలొనీకయులకు 2:11). ఇది జరిగినప్పుడు, అతడు నశించినవాడగును.
"యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, ... నను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు" అని చెప్పెను (యోహాను 14:23, 24). "మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు" (1 యోహాను 5:3).
జవాబు : కానే కాదు! దేవుని పట్ల నిజమైన ప్రేమ విధేయత లేకుండ నిజముగా ఉనికిలో ఉండదని బైబిలు వాస్తవముగా బోధించుచున్నది. దేవుని పట్ల ప్రేమ మరియు కృతజ్ఞత భావము లేకుండ ఒక వ్యక్తి నిజముగా ఆయనకు విధేయుడుగా ఉండలేడు. తన తల్లిదండ్రులను ప్రేమించితేనే తప్ప ఏ పిల్లవాడు పూర్తిగా వారికి విధేయత చూపలేడు, విధేయత చూపని యెడల తన తల్లిదండ్రులకు ప్రేమ చూపించడు. నిజమైన ప్రేమ మరియు విధేయత అంటుకొని పుట్టిన కవలపిల్లల వంటివి. విడదీసిన యెడల, అవి మరణించును.
"మీరు నా వాక్యమందు నిలిచినవారైతే... సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు" (యోహాను8:31, 32, 34). "మీరు పాపమునకు దాసులైయుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపము నుండి విమోచింపబడిన నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము” (రోమీయులకు 6:17, 18). "నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును, నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును" (కీర్తనలు 119:44, 45).
జవాబు : నిజమైన స్వతంత్రమనగా "పాపము నుండి" (రోమీయులకు 6:18), లేదా అవిధేయత నుండి, అనగా దేవుని ధర్మశాస్త్ర అతిక్రమణ లేదా ఆజ్ఞాతిక్రమము నుండి స్వతంత్రము (1 యోహాను 3:4). కాబట్టి, నిజమైన స్వతంత్రము విధేయత నుండి మాత్రమే వచ్చును. చట్టమును పాటించు పౌరులకు స్వతంత్రమున్నది. అవిధేయులు పట్టుబడి తమ స్వతంత్రమును కోల్పోవుదురు. విధేయత లేకుండ స్వతంత్ర మనునది తప్పుడు స్వతంత్రము - ఇది గందరగోళము మరియు అరాచకత్వమునకు దారితీయును. నిజమైన క్రైస్తవ స్వతంత్రమనగా అవిధేయత నుండి స్వతంత్రము. అవిధేయత ఎల్లప్పుడు ఒక వ్యక్తిని బాధించును మరియు ఒకనిని అపవాది యొక్క క్రూరమైన బానిసత్వములోనికి నడిపించును.
"నీవు బ్రదికి బాగుగా నుండునట్లు ... యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము" (యిర్మీయా 38:20). "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు" (సామెతలు 28:26). "మనుష్యులను నమ్ముకొనుట కంటె యెహోవాను ఆశ్రయించుట మేలు" (కీర్తనలు 118:8). "ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటె నా మార్గములు మీ తలంపుల కంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి" (యెషయా 55:9). “ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు?" (రోమీయులకు 11:33, 34). "వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును" (యెషయా 42:16). "జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు" (కీర్తనలు 16:11).
జవాబు : చాలా ఖచ్చితముగా చూపవలెను! మనము అర్థము చేసికొనలేని కొన్ని విషయములను మన నుండి కోరేంత వివేకియైనందుకు మనము దేవునికి ఘనత ఆరోపించవలెను. మంచి పిల్లలు తమ తల్లిదండ్రుల ఆజ్ఞలకు కారణములు స్పష్టముగా తెలియకపోయినను వారికి కట్టుబడి ఉండెదరు. సరళమైన విశ్వాసము మరియు దేవునిపై నమ్మకము మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలియునని మరియు ఆయన మనలను ఎప్పటికి తప్పు మార్గములో నడిపించడని మనము నమ్ముటకు దోహదము చేయును. దేవుని కారణములన్నిటిని మనము పూర్తిగా అర్ధము చేసికొనక పోయినను, మన అజ్ఞానములో, దేవుని నాయకత్వమును సందేహించుట మన మూర్ఖత్వమగును.
"అపవాది (సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి." "దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, ... దేవుని సంబంధులు కారు" (1 యోవాను 3:8, 10). "సర్వలోకమును మోసపుచ్చు .... సాతాను" (ప్రకటన 12:9).
జవాబు : అపవాది (సాతానుడు) ఈ అవిధేయత యంతటికి బాధ్యుడు. అవిధేయత యంతయు పాపమనియు మరియు పాపము అసంతృప్తిని, విషాదమును, దేవుని నుండి యెడబాటును మరియు చివరికి నాశనమును తెచ్చునని అతనికి తెలియును. తన ద్వేషములో, అతడు ప్రతి వ్యక్తిని అవిధేయతలోనికి నడిపించుటకు ప్రయత్నించును. ఇందులో నీవు కూడ ఉన్నావు. నీవు వాస్తవములను ఎదుర్కొని నిర్ణయము తీసికొనవలెను. అవిధేయత చూపి నశించడమా, లేదా క్రీస్తును అంగీకరించి విధేయత చూపి రక్షింపబడటమా. విధేయతకు సంబంధించి నీ నిర్ణయము క్రీస్తుకు సంబంధించిన నిర్ణయమైయున్నది. నీవు ఆయనను సత్యము నుండి వేరు చేయలేవు, ఎందుకనగా, ఆయన "నేనే... సత్యమును" అని చెప్పుచున్నాడు (యోహాను 14:6). "మీరు ఎవని సేవించెదరో... నేడు మీరు కోరుకొనుడి” (యెహోషువా 24:15)
“మీలోఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని” కొనసాగించును (ఫిలిప్పీయులకు 1:6).
జవాబు : దేవునికి స్తోత్రము! నూతన జన్మను ప్రసాదించుటకు ఆయన ఒక అద్భుతము చేసినట్లే, ఆయన రాజ్యములో మనము సురక్షితముగా ఉండు వరకు ఆయన మన జీవితములలో (మనము సంతోషముగా ఆయనను వెంబడించుచుండగా) అవసరమైన అద్భుతములను కూడ జరిగించి కొనసాగించెదనని వాగ్దానము చేయుచున్నాడు.
17. ఈ రోజే నీవు యేసు ప్రభువుకు ప్రేమపూర్వకముగా విధేయత చూపుట మరియు ఆయనను వెంబడించుట ప్రారంభించాలని కోరుకొనుచున్నావా?
నీ జవాబు:
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. తాము రక్షింపబడియున్నామని భావించు ఎవరైన నశించుదురా?
జవాలు : అవును! క్రీస్తు నామమున ప్రవచించు, దయ్యములను వెళ్లగొట్టు, మరియు ఇతర అద్భుతములు చేయు అనేకమంది నశించుదురని మత్తయి 7:21-23 స్పష్టము చేయుచున్నది. వారు "పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము" చేయనందున వారు నశించియున్నారని క్రీస్తు చెప్పెను (21వ వచనము). దేవునికి విధేయత చూపుటకు నిరాకరించువారు అబద్ధమును నమ్ముదురు (2 థెస్సలొనీకయులకు 2:11, 12), అందువలన, వారు నశించియుండగా రక్షింపబడియున్నామని వారనుకొందురు.
2. వారు తప్పు చేయుచుండగా తాము చేయుచున్నది సరైనదని నిజముగా భావించు నిజాయితీ గల ప్రజలకు ఏమి జరుగును?
జవాబు : వారిని తన సత్య మార్గములోనికి పిలిచెదనని యేసు ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నిజమైన ఆయన గొజ్జెలు ఆయన స్వరము విని ఆయనను వెంబడించునని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 10:16, 27).
3. నిజాయితీ (చిత్తశుద్ధి) మరియు ఆసక్తి (ఉత్సాహము) ఉంటే సరిపోవా?
జవాబు : సరిపోవు! మనము కూడ సరిగ్గా ఉండవలెను. మారుమనస్సు పొందుటకు ముందు క్రైస్తవులను హింసించినప్పుడు అపొస్తలుడైన పౌలు నిజాయితీపరుడుగా మరియు ఉత్సాహవంతుడుగా ఉండెను, కాని అతడు కూడ తప్పుగా ఉండెను (అపొస్తలుల కార్యములు 22:3:4, 26:9-11).
4. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకేసారి చూడగలడు అనునది శాస్త్రీయపరముగా (సైన్సుపరముగా) అసంభవము కాదా?
జవాబు : నోవహు జలప్రళయము కూడ అటువంటి (అంతకు మునుపు వర్షం పడలేదు - ఆదికాండము 2:5, 6), కాని ఏది ఏమైనను వర్షము పడెను. అవిధేయతకు "శాస్త్రీయ" కారణములు చెప్పుట రోమీయులకు 1:22లో పేర్కొనబడిన తరగతి ప్రజలకు ఇష్టమైన వినోద చర్య (కాలక్షేప చర్య), "తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. "
5. సత్యవెలుగు అందని ప్రజలకు ఏమి జరుగును?
జవాబు : అందరికిని కొంత సత్యవెలుగు అందినదని బైబిలు చెప్పుచున్నది. "నిజమైన వెలుగు ఉండెన; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" (యోహాను 1:9). ప్రతి వ్యక్తి అతడు లేదా ఆమె తనకందిన సత్యవెలుగును ఎట్లు అనుసరించునో అనుదానిని బట్టి తీర్పు తీర్చబడును. రోమీయులకు 2:14, 15 ప్రకారము అవిశ్వాసులు (అన్యజనులు) కూడ కొంత సత్యవెలుగును పొందుకొని ధర్మశాస్త్రమును అనుసరించుచున్నారు.
6. ఒక వ్యక్తి ఆయన విధేయత కోరుకొనుచున్నాడని ధృవీకరించుకొనుటకు ఒక సూచక క్రియ కొరకు మొదట దేవునిని అడుగుట సురక్షితమేనా?
జవాబు: కాదు. "వ్యభిచారులైన చెడ్డ తరుమువారు సూచక క్రియను అడుగుచున్నారు" అని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 12:39). బైబిలు యొక్క సరళమైన బోధలను అంగీకరించని ప్రజలు ఒక సూచక క్రియ ద్వారా కూడ ఒప్పించబడరు. యేసు ప్రభువు చెప్పినట్లుగా, "మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు” (లూకా 16:31).
7. హెబ్రీయులకు 10:26, 27 వచనములు ఒక వ్యక్తి తనకు బాగా తెలిసిన తరువాత కూడ ఉద్దేశపూర్వకముగా లేక బుద్ధిపూర్వకముగా ఒకే ఒక్క పాపమునకు పాల్పడిన యెడల, అతడు నశించినవాడైనట్లుగా సూచించుచున్నట్టు కనిపించుచున్నవి. ఇది నిజమేనా?
జవాబు : కాదు. ఎవరైనను అటువంటి పాపమును ఒప్పుకొని క్షమింపబడవచ్చును. బైబిలు ఇక్కడ మాట్లాడుచున్నది ఒక పాపపు చర్యను గూర్చి కాదు - పాపములో అహంకారపూరితమైన లేక దురభిమానమైన కొనసాగింపు మరియు ఒకనికి బాగా తెలిసిన తరువాత కూడ క్రీస్తుకు లోబడుటకు నిరాకరించుటను గూర్చి మాట్లాడుచున్నది. ఇటువంటి చర్య పరిశుద్ధాత్మను దుఃఖపరచును (ఎఫెసీయులకు 4:30) మరియు ఒక వ్యక్తి "సిగ్గులేనివాడై" (ఎఫెసీయులకు 4:19) నశించిపోవు వరకు అతని హృదయమును కఠినపరచును. "దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందారహితుడనగుదును" అని బైబిలు చెప్పుచున్నది (కీర్తనలు 19:13).
8. బైబిలు అర్థము చేసికొనుటకు ఒక వ్యక్తి విద్యావంతుడై యుండవలసిన అవసరము లేదా?
జవాబు : లేదు! ప్రభువుకు లోబడిన యెడల సామాన్యులు కూడ బైబిలును అర్థము చేసికొనగలరు (కీర్తనలు 19:7; 119:130; మత్తయి 11:25).
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) రక్షింపబడు ప్రజలు ఎవరనగా (1)
( ) క్రీస్తు నామమున దయ్యములను వెళ్లగొట్టువారు.
( ) క్రీస్తును ప్రేమించుచున్నామని చెప్పుకొనువారు.
( ) అంగీకరించి ప్రభువుకు విధేయత చూపువారు.
2) క్రింద జాబితా చేయబడిన ఏ మూడు విషయములు సర్వసత్యమును పొందుకొనుటకు నాకు భరోసా ఇచ్చును? (3)
( ) నా మానసిక వైద్యుడిని అడుగుట.
( ) సత్యవెలుగు కొరకు ప్రార్థించుట.
( ) నా సంఘకాపరి చెప్పినట్లు చేయుట.
( ) సంఘములో చందాలు ఇచ్చుట.
( ) నన్ను నేను శిక్షించుకొనుట.
( ) మెరుగైన ఉన్నత విద్యను పొందుట.
( ) ఒక సూచక క్రియ కొరకు దేవుని అడుగుట.
( ) బైబిలు అధ్యయనము చేయుట.
( ) నేను ఇప్పుడు అర్థము చేసికొనిన సత్యమును అనుసరించుట.
3) దేవుడు నన్ను జవాబుదారిగా యెంచి నన్ను లెక్క అడుగునది (1)
( ) నా సంఘకాపరి చెప్పినట్లు చేసిన దానికి.
( ) నా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడచిన దానికి.
( ) నేను పొందియున్న మరియు పొందగలిగిన సత్యవెలుగు విషయమై.
4) నేను నూతన సత్యమును కనుగొనినప్పుడు, నేను (1)
( ) దానిని విసర్జించవలెను.
( ) అంగీకరించుటకు అది నన్ను ఆకట్టుకొను వరకు వేచి ఉండవలెను.
( ) వెంటనే అంగీకరించి విధేయత చూపవలెను.
5) ప్రభువు ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపుట (1)
( ) ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యము కాదు.
( ) క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తు మరియు అపవాది సంబంధమైనది.
( ) క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమగును.
6) బుద్ధిపూర్వకముగా అవిధేయత చూపుట (1)
( ) అంధకారమునకు మరియు నిత్య నాశనమునకు నడిపించును.
( ) భక్తిశ్రద్ధలు గల సంఘ సభ్యులకు ఇది తగినదే.
( ) నేను మొండిగా ఉన్న యెడల దేవుడు పట్టించుకొనడు.
7) ప్రభువు యెడల నిజమైన ప్రేమ (1)
( ) విధేయత కంటే ఉత్తమమైనది.
( ) విధేయతను అనవసరముగా చేయును.
( ) ఆయనకు సంతోషముగా విధేయత చూపుటకు నాకు దోహదపడును.
8) నిజమైన క్రైస్తవ స్వతంత్రమనగా (1)
( ) ప్రతి విషయములో నాకు నచ్చిన విధముగా చేయుటకు హక్కు కలిగియుండుట.
( ) దేవునికి అవిధేయత చూపుటకు హక్కు కలిగియుండుట.
( ) అవిధేయత మరియు అపవాదికి బానిసత్వము నుండి స్వతంత్రము.
9) సత్యము యొక్క ఒక విషయము స్పష్టమైనప్పుడు, దేవుడు నన్ను ఎందుకు విధేయత చూపమని కోరుచున్నాడో నాకు అర్థమగుట లేదు, అప్పుడు నేను (1)
( ) కారణము స్పష్టమగు వరకు వేచి యుండవలెను.
( ) ఆ సత్యమును విసర్జించవలెను.
( ) దానిని అంగీకరించి దేవుని వాక్యమునకు విధేయత చూపవలెను.
10) అవిధేయత యంతటికి నిజముగా బాధ్యుడెవరు? (1)
( ) ప్రభుత్వము.
( ) నన్ను తప్పుగా పెంచిన నా తల్లిదండ్రులు.
( ) అపవాది (సాతానుడు).
11) విధేయత ఎందుకు అవసరమైయున్నది? (1)
( ) ఎందుకనగా దేవుడు నాకన్నా పెద్దవాడు కాబట్టి నేను ఆయనకు భయపడుచున్నాను.
( ) దేవునికి కోపము రాకుండ ఉండుటకు.
( ) ఎందుకనగా నేను దేవునిని ప్రేమించుచున్నాను మరియు క్రైస్తవ ప్రవర్తన కొరకు ఆయన నియమములను పాటించాలనుకొనుచున్నాను.
12) అవిధేయులను దేవుడు ఇప్పుడే ఎందుకు నాశనము చేయకూడదు? (1)
( ) ఆయనకు భయము.
( ) దుష్టత్వము అభివృద్ధి చెందుటను చూచి ఆయన ఆనందించును.
( ) తన ప్రేమను మరియు న్యాయమును గూర్చి అందరు పూర్తిగా ఒప్పుకొనేంత వరకు ఆయన వేచి చూచుచున్నాడు.
13) యేసు ప్రభువు తనను అంగీకరించి అనుసరించువారికి నూతన జన్మను ప్రసాదించుటయే కాక, ఆయన రాజ్యములో వారు సురక్షితముగా ఉండు వరకు వారి జీవితములో అవసరమైన అద్భుతములను కూడ జరిగించుచు కొనసాగించునని తెలిసికొనుట నీకు ఆనందమును కలిగించుచున్నదా?
( ) అవును.
( ) కాదు.