Lesson 5

నీవు బహుశ విని యుండవచ్చును, వివాహము చేసికొనిన వారిలో దాదాపు సగము మంది వివాహములు విడాకులతో ముగిసిపోవుచు, భార్యాభర్తలకు చేదనుభవమును మరియు నిద్రలేచిన పిల్లలకు గందరగోళమును మిగుల్చుచున్నవి. ఇది నీకు జరుగనియ్యకుము! నీ వివాహ జీవితము కఠినమైన ఇబ్బందుల నెదుక్కొనుచున్నను లేక వైవాహిక ఆనందము ననుభవించుచున్నను, లేక నీవు ఇంకను వివాహము చేసికొనలేదు కాని చేసికొనే ఆలోచనలో ఉన్నను, నీ వివాహము స్థిరముగా నుండుటకు సహాయపడు ఉచితమైన మరియు నిరూపణ చేయబడిన కొన్ని సలహాలు ఇచ్చటున్నవి. అవి వివాహమును స్థిరపరచి ఘనపరచిన సాక్షాత్తు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నవి! నీవు అన్ని విధములుగా ప్రయత్నించియున్న యెడల, దేవునికి ఒక్క అవకాశము నెందుకియ్యకూడదు? ఈ స్టడీ గైడ్ పత్రికలోని సూత్రములను పాటించుము, అప్పుడు నీవు నీ గృహమును భద్రపరచుకొనగలవు.

దేవుని గొప్ప గ్రంథము (బైబిలు) నుండి సంతోషకరమైన వివాహమునకు పదిహేడు సూత్రములు :

1. మీ సొంత ప్రత్యేక గృహమును స్థిరపరచుకొనుడి.

“కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” (ఆదికాండము 2:24).

వ్యాఖ్య : దేవుని నియమమేదనగా వివాహ దంపతులు తమ తల్లితండ్రుల గృహమును వీడి, సరిపడునంత డబ్బు లేక ఒకే గది గల ఇల్లయినను వారు తమ సొంత, ప్రత్యేక గృహమును స్థిరపరచుకొనవలెను. భార్యాభర్తలు ఒకటిగా దీనిని కలిసి నిర్ణయించుకొని, ఎవరు వ్యతిరేకించినను నిలుకడగా ఉండవలెను. ఈ సూత్రమును జాగ్రత్తగా పాటించిన యెడల అనేక వివాహములు బలపడి మెరుగుపడును.

2. మీ ప్రేమానురాగములను ఒకరియందొకరు కొనసాగనియ్యుడి!

“ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి” (1 పేతురు 4:8). "ఆమె పెనిమిటి ఆమెను పొగదును" (సామెతలు 31:29). “పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని ... చింతించుచున్నది” (1 కొరింథీయులకు 7:34). “ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” (రోమీయులకు 12:10).

వ్యాఖ్య : మీ జీవితానుబంధము యొక్క ప్రేమానురాగములను మీ వివాహ జీవితములో కొనసాగనియ్యుడి లేక ఉత్తేజపర్చుకొనుడి. విజయవంతమైన వివాహములు ఊరకనే ఏర్పడవు; అవి అభివృద్ధి చెందుచుండవలెను. ఒకరి కొకరు పట్టీపట్టనట్టు ఉండకుడి ఎందుకనగా దాని ఫలితముగా వచ్చు మార్పు మీ వివాహమునకు హాని తలపెట్టవచ్చును. ఒకరి యెడల ఒకరు ప్రేమను వ్యక్తపర్చుకొనుచు దానిని అలాగే వృద్ధి చెందనియ్యుడి; లేని యెడల అది క్రమేణ నశించి మీరు విడిపోయే ప్రమాదమున్నది. ప్రేమ మరియు ఆనందము మీ కొరకు మీరు మాత్రమే వెదుక్కొనుట ద్వారా కాదు గాని వాటిని తోటివారికి పంచుట ద్వారానే కనుగొనబడును. కలిసిమెలిసి పనులు చేయుచు సాధ్యమైనంత సమయమును గడుపుడి. ఒకరినొకరు అభిమానముతో పలకరించుకొనుట నేర్చుకొనుడి. కలిసి విశ్రాంతి తీసికొనుడి, ప్రదేశములను దర్శించుడి, ప్రకృతిని తిలకించుడి, భోజనము చేయుడి. చిన్న చిన్న మర్యాదలను, ప్రోత్సాహములను, మరియు ప్రేమానురాగములను తీసిపారవేయకుడి. బహుమతులతో మరియు ఉపకారములతో ఒకరినొకరు ఆశ్చర్యపరచుకొనుడి. ఒకరినొకరు "అమితముగా ప్రేమించుకొనుటకు" ప్రయత్నించుడి. మీ వివాహములో మీరు ఇచ్చేదాని కన్నా ఎక్కువ ఆశించకుడి లేదా తీసికొనుటకు ప్రయత్నించకుడి. వివాహము నాశనమగుటకు అతిపెద్ద కారణము ప్రేమ నశించుటయే.

3. దేవుడే మిమ్మును వివాహములో జతపరచెనని జ్ఞాపకముంచుకొనుడి.

"ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, ... కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు" (మత్తయి 19:5, 6).

వ్యాఖ్య : మీ గృహములో ప్రేమ దాదాపుగా నశించిపోయినదా? అపవాదియే (ఆ కరడుగట్టిన గృహవినాశనుడే) దీనికి కారణము. మిమ్మును శోధించి తద్వారా మిమ్మును విడదీయాలని సాతాను కోరుకొనుచుండగా, దేవుడే మిమ్మును వివాహములో జతపరచెననియు, మీరు కలిసిమెలసి సంతోషముగా జీవించాలన్నదే ఆయన సంకల్పమనియు మీరు మరువకుడి. మీరు ఆయన దైవశాసనములకు (ఆజ్ఞలకు) విధేయత చూపిన యెడల ప్రేమ మరియు సంతోషములను మీ జీవితములలో ఆయనే కలుగజేయును. "దేవునికి సమస్తమును సాధ్యము" (మత్తయి 19:26). నిరాశ చెందకుడి. ప్రాణాంతకమైన కుష్టురోగముతో బాధపడుచున్న రోగిని చేరదీయుటకు ఒక సువార్తసేవకుని హృదయమును ప్రేమతో నింపు దేవుడు, మీరు అనుమతించిన యెడల ఆయన ఆత్మ మీ హృదయమును మీ భాగస్వామి హృదయమును మార్చివేయును.

4. మీ తలంపులను కాచుకొనుడి - మీ ఇంద్రియముల చేత మీరు చిక్కుకొనకుడి.

"(ఒకడు తన హృదయములో తలంచిన దానిని బట్టి అతని ప్రవర్తన ఉండును), అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు" (సామెతలు 23:7). "నీ పొరుగువాని భార్యనైనను ... ఆశింపకూడదు" (నిర్గమకాండము 20:17). "నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" (సామెతలు 4:23). “ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి” (ఫిలిప్పీయులకు 4:8).

వ్యాఖ్య : తప్పుడు ఆలోచన మీ వివాహమునకు తీవ్ర హాని కలిగించును. "మా వివాహము ఒక పొరపాటు," "ఆమె నన్ను అర్ధము చేసికొనదు," "ఇంక నా వల్లకాదు," "అవసరమైతే మేము ఎప్పుడైన విడాకులు తీసికొనుటకు సిద్ధమే," “నేను నా పుట్టింటికి వెళతాను," లేదా, "మా ఆయన ఆమె వంక చూచి నవ్వాడు" వంటి ఆలోచనలతో అపవాది మిమ్మును శోధించును." ఈ రకమైన ఆలోచన ప్రమాదకరము ఎందుకనగా మీ ఆలోచనలే చివరకు మీ చర్యలను నియంత్రించును. అవిశ్వాసముగా ఉండాలని సూచించు ఎవరినైనను లేక దేనినైనను చూచుట, చెప్పుట, చదువుట, లేదా వినుట మానుకొనుడి. అనియంత్రిత ఆలోచనలు నిటారుగా ఉన్న కొండపై తటస్థముగా మిగిలిపోయిన వాహనము వంటివి; ఫలితము విపత్తు కావచ్చును.

5. ఒకరి మీద ఒకరు కోపము ఉంచుకొని నిద్రపోకుడి.

"సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి యుండకూడదు" (ఎఫెసీయులకు 4:26). "మీ (అపరాధములను, లేక తప్పిదములను) ఒకనితోనొకడు ఒప్పుకొనుడి" (యాకోబు 5:16). "వెనుక ఉన్నవి మరచి" (ఫిలిప్పీయులకు 3:13). "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి" (ఎఫెసీయులకు 4:32).

వ్యాఖ్య : చిన్నవైనను లేక పెద్దవైనను బాధలు మరియు మనోవేదనల విషయమై కోపముగా నుండుట ప్రమాదకరము. సమయోచితముగా పరిష్కరించకపోయిన యెడల, చిన్న సమస్యలు కూడ మీ మనస్సులో బలముగా నాటుకుపోయి జీవితము మీద మీకున్న అభిప్రాయమునకు ప్రతికూల ప్రభావమును చూపును. ఇందుచేతనే పడుకునే ముందు మీ కోపమును చల్లబరచుకొనుడని దేవుడు చెప్పెను. క్షమించుటకు మరియు "నన్ను క్షమించు" అని చెప్పుటకు ముందుండుడి. ఎవ్వరును పరిపూర్ణులు కారు, మీరిద్దరు ఒకే జట్టులో ఉన్నారు, కాబట్టి మీరు పొరపాటు చేసినప్పుడు దానిని ఒప్పుకొనేంత దయగా ఉండుడి. అంతేకాకుండ, వివాహ భాగస్వాములను అసాధారణమైన శక్తులతో దగ్గర చేయుట ఎంతో ఆహ్లాదకరమైన అనుభవము. దేవుడే దానిని సూచించుచున్నాడు! ఇది పనిచేయును!

6. క్రీస్తును మీ గృహమునకు కేంద్రముగా ఉంచుకొనుడి.

"యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్ధమే" (కీర్తనలు 127:1). “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” (సామెతలు 3:6). “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” (ఫిలిప్పీయులకు 4:7).

వ్యాఖ్య : ఇది నిజముగా గొప్ప సూత్రము, ఎందుకనగా ఇది మిగతా వాటినన్నిటిని బలపరచును. గృహములో ఆనందమునకు ముఖ్యమైన అంశము ఉపాయము, | వ్యూహము, లేదా సమస్యలను అధిగమించుటకు మన ప్రయాసలో లేదు గాని క్రీస్తుతో ఐక్యతలోనే ఉన్నది. క్రీస్తు ప్రేమతో నిండిన హృదయములు ఎక్కువ కాలము విడిగా ఉండలేవు. గృహములో క్రీస్తుతో, వివాహము విజయవంతమగుటకు గొప్ప అవకాశమున్నది. యేసు ప్రభువు చేదనుభవమును మరియు నిరాశను తుడిసివేసి ప్రేమ మరియు ఆనందమును పునరుద్ధరించగలడు.

7. కలిసి ప్రార్ధించుడి.

"మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము" (మత్తయి 26:41). “ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి” (యాకోబు 5:16). మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు" (యాకోబు 1:5).

వ్యాఖ్య : ఒకరితో నొకరు కలిసి ప్రార్ధించుడి! ఇది మీరు కనిన మనోహరమైన కలలకు మించి మీ వివాహము విజయవంతమగుటకు సహాయపడు అద్భుతమైన కార్యము. దేవుని సన్నిధిలో మోకరించి, ఒకరి యెడల ఒకరికి నిజమైన ప్రేమ కొరకు, క్షమాపణ కొరకు, బలము కొరకు, జ్ఞానము కొరకు - సమస్యల పరిష్కారము కొరకు ఆయనను అడుగుడి. దేవుడు సమాధానమిచ్చును. మీ ప్రతి పొరపాటు వెంటనే నివారణ కాకపోవచ్చును, కాని మీ హృదయమును మరియు చర్యలను మార్చుటకు దేవునికి ఎక్కువ పొందిక ఉండును.

8. విడాకులు పరిష్కారము కాదని అంగీకరించుడి.

"దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు" (మత్తయి 19:6). "వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు" (మత్తయి 19:9). “భర్త గల స్త్రీ, భర్త బ్రకియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు” (రోమీయులకు 7:2).

వ్యాఖ్య : వివాహ సంబంధములు విడదీయరానివని బైబిలు చెప్పుచున్నది. వ్యభిచార విషయములో మాత్రమే విడాకులు అనుమతించబడును. కాని అప్పుడు కూడ, అది తప్పనిసరి కాదు. అవిశ్వాసము విషయములో కూడ విడాకుల కన్న క్షమాపణే ఎల్లప్పుడు మిన్నయైనది.

దేవుడు ఏదెను తోటలో మొదటి వివాహమును జరిగించినప్పుడు, ఆయన దానిని జీవితకాలమునకు నియమించెను. అందువలన, వివాహ ప్రమాణములు ఒక వ్యక్తి చేయుటకు ఎంతో గంభీరమైనవి మరియు కట్టుబడి ఉండవలసినవి. కాని గుర్తుంచుకొనుడి, మన జీవితములను ఉద్దరించుటకును మరియు మన అవసరములను అన్ని విధములుగా తీర్చుటకును దేవుడు వివాహమును ఉద్దేశించి నియమించెను. విడాకుల గురించి ఆలోచించుట కూడ మీ వివాహము నాశనమగుటకు కారణమగును. విడాకులు ఎల్లప్పుడు వినాశకరమైనవి మరియు సమస్యకు ఎప్పుడు పరిష్కారము కాదు; బదులుగా, అది ఆర్ధిక ఇబ్బందులు, దుఃఖించు పిల్లలు మొదలైనటువంటి పెద్ద పెద్ద సమస్యలను సృష్టించును.

9. Keep the family circle closed tightly.9. వ్యక్తిగత కుటుంబ విషయములు బయటపడకుండ చూచుకొనుడి.

“వ్యభిచరింపకూడదు” (నిర్గమకాండము 20:14). “ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును ..... ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు” (సామెతలు 31:11, 12). "యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను" (మలాకీ 2:14). "చెడు స్త్రీ యొద్దకు పోకుండ ... నిన్ను కాపాడును. ... దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము ... ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన యెడల వాని వస్త్రములు కాలకుండునా? ... తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు" (సామెతలు 6:24, 25, 27, 29).

వ్యాఖ్య : వ్యక్తిగత కుటుంబ విషయములు మీ ఇంటి బయట వారితోను, కనీసము తల్లిదండ్రులతో కూడ ఎన్నడును పంచుకొనకూడదు. మీ ఇద్దరి మధ్య సానుభూతి చూపించుటకును లేదా ఫిర్యాదులను వినుటకును వచ్చు మూడో వ్యక్తిని అపవాది భార్యాభర్తల హృదయములను విడదీయుటకు ఉపయోగించుకొనును. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలను వ్యక్తిగతముగానే పరిష్కరించుకొనుడి. ఒక పాస్టర్ గారు లేదా వివాహ సలహాదారు తప్ప మరెవరు కలుగజేసికొనకూడదు. ఎల్లప్పుడు ఒకరితో నొకరు నిజాయితీగా ఉండుడి మరియు ఇద్దరి మధ్య ఎన్నడును రహస్యములు ఉంచుకొనకుడి. మీ జీవిత భాగస్వామి యొక్క మనోభావాలను పణంగా పెట్టి మరీ వేళాకోళమాదక, ఒకరి భావాల నొకరు విపరీతముగా గౌరవించుకొనుచు సానుకూలముగా ఉండుడి. వ్యభిచారము ఎల్లప్పుడు మిమ్మును మరియు మీ కుటుంబములోని వారినందరిని బాధించును. మన మనస్సు, దేహము, మరియు భావాలను ఎరిగిన దేవుడు, మీరు "వ్యభిచరింపకూడదు" అని చెప్పెను (నిర్గమకాండము 20:14). సరసాలాపములు (లైంగిక ఆకర్షణను ప్రదర్శించే ప్రవర్తనలు) ఇప్పటికే ప్రారంభమైన యెడల, వాటిని వెంటనే తెంపివేయుడి - లేని యెడల అంత తేలికగా ఎత్తివేయలేని ఛాయలు (తొలగిపోని చెడు ముద్రలు) మీ జీవితము మీద స్థిరముగా నిలిచిపోవును.

10. దేవుడు ప్రేమను వర్ణించుచున్నాడు : దానిని అనుభవించుట మీ అనుదిన గురిగా పెట్టుకొనుడి.

"ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును" (1 కొరింథీయులకు 13:4-7).

వ్యాఖ్య : ఈ బైబిలు వాక్యభాగము దేవుని ప్రేమ యొక్క గొప్ప వర్ణనలలో ఒకటి. దీనిని మరల చదువుడి. మీరు ఈ మాటలను మీ వివాహ అనుభవములో ఒక భాగముగా చేసికొనియున్నారా? నిజమైన ప్రేమ కేవలము ఒక భావావేశ ప్రేరణ కాదు, అది మీ వివాహ జీవితములోని ప్రతి అంశమును ఇమిడియున్న పవిత్ర సూత్రము. నిజమైన ప్రేమతో, మీ వివాహము గొప్పగా విజయవంతమగు అవకాశమున్నది; అది లేకుండ, వివాహము త్వరగా విఫలమగు ప్రమాదము కూడ ఉన్నది.

11. విమర్శించే మరియు విసిగించే గుణము ప్రేమను నశింపజేయునని గుర్తుంచుకొనుడి.

"భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్టురపెట్టకుడి" (కొలొస్సయులకు 3:19). "ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు" (సామెతలు 21:19). "ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము" (సామెతలు 27:15). “నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? (మత్తయి 7:3). "ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు" (1 కొరింథీయులకు 13:4).

వ్యాఖ్య : మీ భాగస్వామిపై విమర్శలు చేయుట, అసభ్యకరముగా ప్రవర్తించుట, మరియు తప్పులు వెదకుట ఆపివేయుడి. మీ జీవిత భాగస్వామి చాలా విషయములలో తక్కువగా ఉండవచ్చును, కాని విమర్శలు సహాయపడవు. పరిపూర్ణతను ఆశించుట మీకు మీ భాగస్వామికి చేదనుభవమును మిగుల్చును. లోపములను పట్టించుకొనక మంచి విషయముల కొరకు వెంపర్లాడుడి. మీ భాగస్వామిని తప్పుదిద్దుటకు (వేలెత్తి చూపుటకు), నియంత్రించుటకు లేదా బలవంతము చేయుటకు ప్రయత్నించకుడి - మీరు ప్రేమను నశింపజేసెదరు. దేవుడు మాత్రమే మనుష్యుల మనస్సులను మార్చగలడు. నవ్వుచు నవ్వించే స్వభావము, ఉల్లాసమైనహృదయము, దయ, సహనము, మరియు ఆప్యాయత మీ వివాహ సమస్యలను చాలావరకు తొలగించును. మీ జీవిత భాగస్వామిని మంచిగా మార్చే దానికన్నా సంతోషపెట్టుటకు ప్రయత్నించుడి, మంచితనము దానికదే వచ్చును. విజయవంతమైన వివాహమునకు రహస్యము సరైన భాగస్వామిని కలిగి ఉండుటలో లేదు గాని సరైన భాగస్వామిగా ఉండుటలోనే ఉన్నది.

12. ఏ విషయములోను మితి మీరి చేయకుడి; మితముగా ఉండుడి.

“పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును” (1 కొరింథీయులకు 9:25). "ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; ... స్వప్రయోజనమును విచారించుకొనదు" (1 కొరింథీయులకు 13:4, 5). “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” (1 కొరింథీయులకు 10:31). “నా శరీరమును నలుగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” (1 కొరింథీయులకు 9:27). “ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదు” (2 థెస్సలొనీకయులకు 3:10). "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను" (హెబ్రీయులకు 13:4). “కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి” (రోమీయులకు 6:12, 13).

వ్యాఖ్య : ఏ పనినైనను మితిమీరి లేక మితిలోపించి చేయుట మీ వివాహమును పాడుచేయును. దేవునితో సమయము, పని, ప్రేమ, విశ్రాంతి, వ్యాయామము, ఆటలు, భోజనము మరియు సామాజిక సంబంధములు వివాహములో సమతుల్యముగా (సమతూకముగా) ఉండవలెను లేని యెడల ఏదైన జరుగరానిది జరుగవచ్చును. ఎక్కువ పని మరియు సమపాళ్లలో విశ్రాంతి, ఆహారము మరియు వ్యాయామము లేకపోవుట మిమ్ములను తీవ్రముగాను, అసహనముగాను, మరియు అసానుకూలముగాను మార్చుటకు దారితీయును. మితానుభవమైన లైంగిక జీవితమును కూడ బైబిలు సిఫారసు చేయుచున్నది (1 కొరింథీయులకు 7:3-7). ఎందుకనగా అవమానకరమైన (అసభ్యకరమైన) మరియు మితానుభవము లేని లైంగిక చర్యలు ఒకరిపై ఒకరికి ప్రేమ మరియు గౌరవమును నశింపజేయును. ఇతరులతో సామాజిక సంబంధము అవసరమైనది; నిజమైన ఆనందము ఒంటరి జీవితములో లభించదు. ఆరోగ్యకరమైన, అనుకూలమైన సమయములలో నవ్వుట మరియు ఆనందించుట మనము నేర్చుకొనవలెను. ఎప్పుడు మూతిముడుచుకొని యుండుట కూడ ప్రమాదకరమే. ఏ పనినైనను మితిమీరి లేక మితిలోపించి చేయుట మనస్సును, శరీరమును, మనస్సాక్షిని, మరియు ఒకరినొకరు ప్రేమించుకొను మరియు గౌరవించుకొను సామర్ధ్యమును బలహీనపరచును. అమితానుభవము ద్వారా మీ వివాహమును పాడుచేసికొనకుడి.

13. Respect each other's personal rights and privacies.13. మీ వ్యక్తిగత హక్కులను మరియు అంతర్గత విషయములను (రహస్యములను) ఒకరికొకరు గౌరవించుకొనుడి.

“ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ... అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును (స్వార్థమును) విచారించుకొనదు; ... దుర్నీతి విషయమై సంతోషపడక ... అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును” (1 కొరింథీయులకు 13:4-7). “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” (రోమీయులకు 12:10).

వ్యాఖ్య : ప్రతి జీవిత భాగస్వామికి కొన్ని వ్యక్తిగత విషయములకు దేవుడిచ్చిన హక్కు ఉన్నది. అనుమతి లేకుండ పర్సులను, వ్యక్తిగత ఈ-మెయిళ్లను, మరియు ఇతర వ్యక్తిగత వస్తువులను సోదా చేయకుడి. ఏదైన ముఖ్యమైన పనిలో నిమగ్నమైయున్నప్పుడు వ్యక్తిగత హక్కులు మరియు శాంతి హక్కులు గౌరవించబడవలెను. మీ భర్త లేక భార్యకు కొన్ని వీలుకాని సమయములలో ఆరా తీయబడకుండ "సెలవు" తీసికొనే హక్కున్నది. వివాహ భాగస్వాములు ఒకరినొకరు స్వాధీనపరచుకొనరు గనుక బలవంతముగా వ్యక్తిత్వ మార్పులను చేయుటకు ప్రయత్నించకూడదు. దేవుడు మాత్రమే అట్టి మార్పులు చేయగలడు. ఈ విషయములో మనమంతా ఆయనకు వ్యక్తిగతముగా జవాబియ్యవలసిన వారమైయున్నాము (రోమీయులకు 14:12). ఆనందము కొరకు ఒకరిపై ఒకరికి విశ్వాసము మరియు నమ్మకము చాలా అవసరము, గనుక ఒకరినొకరు ఎల్లప్పుడు అనుమానించుకొనకుడి. మీ జీవిత భాగస్వామిని "పరిశోధించుటకు (తప్పుపట్టుటకు)" తక్కువ సమయము సంతోషపెట్టుటకు ఎక్కువ సమయము వెచ్చించుడి. ఈ సూత్రము అద్భుతముగా పనిచేయును.

14. శుభ్రముగా, నమ్రతగా, క్రమబద్ధముగా, మరియు కర్తవ్యముగా ఉండుడి.

"మరియు స్త్రీలును ... తగుమాత్రపు వస్త్రముల చేతనే" తమను తాముఅలంకరించుకొనవలెను (1 తిమోతి 2:9). "ఆమె ... తన చేతులారా వాటితో పని చేయును. ... ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును. ... ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండ ఆమె భోజనము చేయదు" (సామెతలు 31:13, 15, 27). "మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి" (యెషయా 52:11). "సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి" (1 కొరింథీయులకు 14:40). "ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును" (1 తిమోతి 5:8). "మీరు మందులు (సోమరిపోతులు) కాక" యుందుడి (హెబ్రీయులకు 6:11).

వ్యాఖ్య : సోమరితనము మరియు క్రమబద్ధత లేని బుద్ధిని ఒకరి యెడల ఒకరికున్న మీ మర్యాదను మరియు ఆప్యాయతను నాశనము చేసి, తద్వారా మీ వివాహమునకు హాని తలపెట్టుటకు అపవాది ఉపయోగించుకొనవచ్చును. తగుమాత్రపు నాణ్యమైన వస్త్రధారణ, పటుత్వమైన చక్కని దేహములు భార్యాభర్తలిద్దరికి ముఖ్యమైనవి. ఇద్దరు భాగస్వాములు శుభ్రమైన మరియు క్రమబద్ధమైన ఇంటి వాతావరణమును సృష్టించుటకు తగిన జాగ్రత్త తీసికొనవలెను, ఇది శాంతి మరియు సమాధానములు నెలకొనుటకు మనోహరమైన సూత్రము. ఇంటికి సహకరించలేని సోమరియైన, మార్పులేని భర్త లేక భార్య కుటుంబమునకు శాపము మరియు దేవుని దృష్టికి అవమానకరము. ఒకరికొకరు చేసికొనునవి అన్నియు జాగ్రత్తతో మరియు మర్యాదతో చేసికొనవలెను. ఇటువంటి చిన్న చిన్న విషయములలో అజాగ్రత్త లెక్కలేనన్ని గృహములలో విభజనకు లేదా విడాకులకు కారణమైనది.

15. మృదువుగా మరియు ప్రేమగా మాట్లాడుటకు నిర్ణయించుకొనుడి.

"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును" (సామెతలు 15:1). "నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము" (ప్రసంగి 9:9). “ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని” (1 కొరింథీయులకు 13:11).

వ్యాఖ్య : వివాదములలో కూడ మీ జీవిత భాగస్వామితో ఎల్లప్పుడు మృదువుగాను మరియు దయగాను మాట్లాడుడి. కోపపడి, అలసిపోయి లేదా నిరుత్సాహపడి తీసికొన్న నిర్ణయములు ఎంతైనను నమ్మదగినవి కావు, గనుక మాట్లాడే ముందు కోపము చల్లబరచుకొనుట మంచిది. మీరు మాట్లాడేటప్పుడు, మీ మాట ఎల్లప్పుడు నెమ్మదిగాను మరియు ప్రేమగాను ఉండనియ్యుడి. కఠినమైన, కోపముతో కూడిన మాటలు మిమ్మును సంతోషపెట్టాలన్న మీ జీవిత భాగస్వామి కోరికను క్రుంగదీయును.

16. కుటుంబ ఆర్థిక వ్యవహారములలో జ్ఞానయుక్తముగా ఉండుడి.

"ప్రేమ మత్సరపడదు (స్వాధీనపరచుకొనదు); ... అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును (స్వార్ధపూరిత లాభమును) విచారించుకొనదు" (1 కొరింథీయులకు 13:4, 5). "దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" (2 కొరింథీయులకు 9:7).

వ్యాఖ్య : ప్రతి భాగస్వామికి కొంత డబ్బును తగిన విధముగా మరియు ఇంటి రాబడిని బట్టి ఖర్చు చేయుటకు హక్కు ఉండునట్లు కుటుంబ ఆదాయము వివాహ జీవితములో పంచబడవలెను. వేరు వేరు బ్యాంకు ఖాతాలు ఆరోగ్యకరమైన వివాహము కొరకు నమ్మకమును లోతుగా పెంపొందించే ప్రాముఖ్యమైన ఆధిక్యతను తొలగించును. డబ్బు నిర్వహణ అనేది ఒక జట్టుగా కూడి చేయు ప్రయత్నము. ఇద్దరు పాల్గొనవలెను, కాని తీర్మానించు నిర్ణయ బాధ్యతలు ఒకరే తీసికొనవలెను. డబ్బు నిర్వహణ స్థానములు వ్యక్తిగత సామర్థ్యములు మరియు ప్రాధాన్యతలను బట్టి నిర్ణయించబడవలెను.

17. ఒకరితో నొకరు మనస్సు విప్పి మాట్లాడుకొనుడి.

"ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు" (1 కొరింథీయులకు 13:4, 5). “శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును” (సామెతలు 15:32). "తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుట కంటె మూర్ఖుని గుణపరచుట సుళువు" (సామెతలు 26:12).

వ్యాఖ్య : ప్రాముఖ్యమైన నిర్ణయములపై బహిరంగ చర్చల కంటే కొన్ని విషయములు మీ వివాహమును ఎక్కువ బలోపేతము చేయును. వేరే ఉద్యోగము వెతుక్కొనుట, ఖరీదైన వస్తువులు కొనుట, మరియు ఇతర జీవిత నిర్ణయములు తీసికొనుట వంటివి భార్యాభర్తలిద్దరు కలిసి చేయవలసినవి - భిన్నాప్రాయములు గౌరవించబడవలెను. మనస్సు విప్పి మాట్లాడుకొనుట మీ వివాహమును తీవ్రముగా బలహీనపరచు అనేక పెద్ద పెద్ద పొరపాట్లను నివారించును. ఒకవేళ, చాలా చర్చలు మరియు శ్రద్ధగల ప్రార్ధనల తరువాత కూడ అభిప్రాయములు ఇంకను భిన్నముగా ఉండిన యెడల, భార్య తన భర్త నిర్ణయమునకు లోబడవలెను, ఆ నిర్ణయము తన భార్య పట్ల అతనికున్న లోతైన ప్రేమ మరియు ఆమె శ్రేయస్సు కొరకైన అతని బాధ్యతను బట్టి ప్రేరేపించబడి ఉండవలెను. ఎఫెసీయులకు 5:22-24 చూడుము.

18. నీ వివాహము దేవుని నిస్వార్థమైన, నిబద్ధతతో కూడిన, మరియు ఆనందకరమైన ప్రేమను నీ కొరకు ప్రతిబింబింపజేయాలని నీవు కోరుకొనుచున్నావా?

నీ జవాబు :


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. కుటుంబములో గొడవ జరిగిన తరువాత సమాధానపరచుటకు భార్యాభర్తల్లో మొదట ఎవరు క్షమాపణ కోరవలెను?

జవాబు : ఎవరి పక్షమున తప్పు లేదో వారే మొదట క్షమాపణను కోరవలెను!

2. మా కుటుంబ విషయములలో జోక్యము చేసికొను అత్తమామల కొరకు మీరేదైన సూచన ఇయ్యగలరా?

జవాబు : అవును! భాగస్వాములిద్దరు మీ సలహా కోరితేనే తప్ప మీ కుమారుడు లేదా కుమార్తె వివాహములో జోక్యము చేసికొనకుడి. (1 థెస్సలొనీకయులకు 4:11 చూడుము.) భూమ్మీద కొంతమేరకు స్వర్గముగా ఉండవలసిన అనేక వివాహములు కొందరు అత్తమామల దుష్ప్రవర్తన వల్ల దెబ్బతిని నరకముగా మారినవి. నూతనముగా ఏర్పడిన గృహములో భార్యాభర్తల నిర్ణయములను మరియు వారి కుటుంబ విషయములను ఖచ్చితముగా వారికే వదిలివేయుట ప్రతి అత్తమామల విధి.

3. నా భర్త దైవభక్తి లేనివాడు, నేను క్రైస్తవురాలుగా ఉండుటకు ప్రయత్నించుచున్నాను. తన వైఖరి నన్ను, భయంకరముగా ప్రభావితము చేయుచున్నది. నేను అతనితో విడాకులు తీసికొనవలెనా?

జవాబు : తీసికొనకూడదు! 1 కొరింథీయులకు 7:12-14 మరియు 1 పేతురు 3:1, 2 వాక్యములను చదువుము. దేవుడే చక్కని ఖచ్చితమైన జవాబిచ్చును.

4. నా భార్య నన్ను విడిచి వేరోక పురుషునితో వెళ్లిపోయినది. ఇప్పుడు పశ్చాత్తాపపడి, తిరిగి ఇంటికి రావలెనని తపించుచున్నది. నేను ఆమెను తిరిగి చేర్చుకొనవలెనని మా పాస్టర్ గారు చెప్పుచున్నాడు, కాని దేవుడు దీనిని నిషేధించుచున్నాడు, నిజమేనా?

జవాబు : లేదు, కానే కాదు! వ్యభిచారము విషయములో దేవుడు విడాకులను అనుమతించుచున్నాడే గాని ఆజ్ఞాపించుటలేదు. క్షమాపణ ఎల్లప్పుడు మిన్నయైనది గనుక దానికే ఎల్లప్పుడు ప్రాధాన్యత నియ్యవలెను. (మత్తయి 6:14, 15 చూడుము.) విడాకులు మీ జీవితమును మరియు మీ పిల్లల జీవితములను తీవ్రముగా బాధించును. ఆమెకు మరో అవకాశమిచ్చి చూడుము! సువర్ణ నియమము (మత్తయి 7:12) ఈ విషయములో వర్తించును. మీరు మీ భార్య మీ జీవితములను క్రీస్తు వైపుకు త్రిప్పుకొనిన యెడల, ఆయన మీ వివాహమును అత్యున్నత ఆనందకరముగా మార్చివేయును. సమయము మించిపోలేదు.

5. పురుషులు ఎల్లప్పుడు నా పట్ల చొరవ తీసికొని చనువుగా ప్రవర్తించుచు నాతో సరసము లాడుచున్నారు. నేనేమి చేయగలను?

జవాబు : మీ ప్రవర్తన విషయములో జాగ్రత్త కలిగియుండుము. "ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు"మని దేవుడు సెలవిచ్చుచున్నాడు (1 థెస్సలొనీకయులకు 5:22). బహుశ చుట్టుప్రక్కల ఉన్న పురుషులతో మీ ప్రవర్తన ఒక కారణము కావచ్చును. మీ నవ్వు, మీకు తగని అసభ్య వస్త్రధారణ, చనువుతో కూడిన పరిహాసములు, లేక "హద్దుమీరి” ప్రవర్తించే మీ వైఖరి వారి చర్యలకు ప్రోత్సాహము నిచ్చేవిగా ఉండవచ్చును, పురుషుడు తన స్థానము నుండి హద్దు మీరకుండ చేసేది ఒక మంచి క్రైస్తవ ప్రవర్తన మరియు గౌరవము మాత్రమే. "మనుష్యులు మీ సత్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడని" క్రీస్తు చెప్పెను, (మత్తయి 5:16). మీరు క్రీస్తును నిజముగా మీ జీవితములో ప్రకాశింపజేసిన యెడల, దుష్టుల వలన మరియు వారి చొరవల వలన ఏ ఇబ్బందులు మీకు రావు.

6. పాపము ద్వారా పడిపోయి తిరిగి పరిపూర్ణ పశ్చాత్తాపము నొందిన వారికి దేవుని ఉపదేశమేమై యున్నదో స్పష్టముగా మీరు నాకు వివరించగలరా?

జవాబు : చాలా కాలము క్రితము అవినీతిలో పడిపోయి పశ్చాత్తాపము నొందిన ఒక స్త్రీని సూచించుచు యేసు ప్రభువు, "నీవు వెళ్లి ఇక పాపము చేయకుము" అని చెప్పెను (యోహాను 8:11). ఆనాటి ఉపదేశము నేటికిని వర్తించబడును.

7. విడాకులు తీసికొనుట యందు కొన్నిసార్లు "ఏ తప్పు చేయని భార్య లేక భర్త" కూడ కొంత మేరకు అపరాధి లేక దోషియగును గదా?

జవాబు : ఖచ్చితముగా, కొన్ని సమయాల్లో "ఏ తప్పు చేయని భార్య లేక భర్త" తమ భాగస్వామి పట్ల ప్రేమ చూపకనో, అశ్రద్ధగానో, అహంకారముతోనో, ద్వేషము ద్వారానో, స్వార్ధము ద్వారానో, యెత్తిపొడుపు మాటల ద్వారానో వారిలో చెడు ఆలోచనలు మరియు దుష్ట చర్యలకు నడిపించే మనస్సును ప్రోత్సహించి యుండవచ్చును. ఆ సమయములో "నిర్దోషియైన భార్య లేక భర్త" దేవుని దృష్టిలో "దోషియైన భార్య లేక భర్త"గా పరిగణింపబడును. దేవుడు మన హృదయాలోచనలను ఎరిగినవాడైయుండి వాటి ప్రకారము తీర్పు తీర్చును. "మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును" (1 సమూయేలు 16:7).

8. శారీరకముగా వేధించే భర్తతో నేను జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడా?

జవాబు : శారీరకముగా వేధించే చర్య ప్రాణాంతకమును మరియు వెంటనే తగిన చర్య తీసుకోదగినంత తీవ్ర సమస్యయైయున్నది. దెబ్బలు తగిలిన భార్య మరియు కుటుంబ సభ్యులు, ఉండుటకు ఒక సురక్షిత ప్రదేశమును వెంటనే వెతుక్కొనవలెను. భార్యభర్తలిరువురు ఒక గుర్తింపు పొందిన క్రైస్తవ వివాహోపదేశకుని వద్దకు వెళ్లి వ్యవహార సంబంధమైన సహాయము లేక ఉపదేశము కొరకు అడుగవలెను.

9. నా భర్త నన్ను బాధ పెట్టినప్పుడు, నేను తనతో కలిసి ఉండను. నాదే తప్పని నా భర్త నాతో వాదించుచున్నాడు. తప్పు నాదేనా?

జవాబు : అవును! ఈ ప్రశ్నకు 1 కొరింథీయులకు 7:4, 5 లో దేవుడే ఖచ్చితమైన జవాబిచ్చుచున్నాడు.


సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) వివాహమనగా (1)

( ) స్త్రీ పురుషులు జీవితకాలము కలిసి ఉండుటకు దేవుని చేత జతపరచబడుట.

( ) ఇద్దరు వ్యక్తులు అనుకూలముగా ఉంటారో లేదో చూచుటకు చేయు ఒక తాత్కాలికమైన, ప్రయోగాత్మక ఏర్పాటు.

( ) అనవసరమైనది. స్త్రీ పురుషులు వివాహము లేకుండ కలిసి జీవించుటకు స్వతంత్రులు.

2) విడాకులకు దేవుడు ఒకే ఒక కారణమును గుర్తించెను. అది : (1)

( ) అసానుకూలత.

( ) విసిగించే భార్య లేక భర్త.

( ) వ్యభిచారము లేక వివాహేతర సంబంధము.

( ) దైవభక్తి లేని భార్య లేక భర్త.

3) జీవితానుబంధము యొక్క ప్రేమానురాగములు (1)

( ) అలాగే వివాహ జీవితమందు కొనసాగవలెను.

( ) వివాహమైన వెంటనే ఆగిపోవలెను.

( ) పనికిరానివి గనుక అనవసరము.

4) వివాహములో విజయమునకు ఉత్తమ హామీ ఏదనగా (1)

( ) హృదయములో మరియు గృహములో క్రీస్తును కలిగియుండుట.

( ) భర్త తన భార్యను అన్ని విషయముల యందు బలవంతపెట్టుట.

( ) భార్య తన దారికి వచ్చునట్లు విడాకుల భయము చూపించుచు భర్తను బెదిరించుట.

5) విభేదములలో భద్రత కొరకు, ఈ క్రింది వాటిని చేయుడి : (3)

( ) ఒకరితో నొకరు మృదువుగా దయగా మాట్లాడుకొనుడి.

( ) మీ భార్య లేక భర్త చేసిన తప్పును బలవంతముగా ఒప్పించుడి.

( ) సమస్యను పరిష్కరించుటకు ఇరుగుపొరుగు వారిని పిలువుడి.

( ) మాట్లాడకుండ మీ భార్య లేక భర్త నోరు బలవంతముగా మూయించుడి.

( ) మీ భార్యను లేక భర్తను విడిచి అనేక దినములు వరకు ఇంటికి దూరముగా ఉండుడి.

( ) కలసి ప్రార్థించుడి.

( ) మీ కోపమును తెల్లవారక ముందే అధిగమించుడి (చల్లబరచుకొనుడి).

6) క్రింది వాటిలో వివాహమును జయప్రదము చేయు సూత్రములను గుర్తించుము : (2)

( ) కుటుంబ విషయములు మూడో వ్యక్తికి తెలియకుండ చూచుకొనుడి.

( ) మీ తల్లిదండ్రుల గృహములో నివసించుడి.

( ) కోపము వచ్చినప్పుడు పుట్టింటికి పారిపోవుడి.

( ) మీ భార్య లేక భర్త చేసిన పొరపాట్లను మీ స్నేహితులకు చెప్పుడి.

( ) మీ సొంత ప్రత్యేక గృహమును స్థిరపరచుకొనుడి.

( ) ఏదైన సమస్య వచ్చినప్పుడు సలహా కొరకు మాజీ ప్రియుని సంప్రదించుడి.

( ) ఏదైన గొడవ జరిగినప్పుడు తప్పును ఎప్పుడు మొదట ఒప్పుకొనకుడి.

7) మీ వివాహ భాగస్వామిని బలపర్చుటకు ఉత్తమమైన మార్గములేవనగా (2)

( ) మాట వినని యెడల ఇల్లు విడిచి వెళ్లిపోమని బెదిరించుడి.

( ) విమర్శలతో విసిగించుడి.

( ) క్రీస్తుతో మీ వ్యక్తిగత సంబంధమును అభివృద్ధి చేసికొనుడి.

( ) మీ భార్యను లేక భర్తను విడిగా లేక ఒంటరిగా నిద్రపోయేలా చేయుడి.

( ) ప్రేమగా, మెప్పుగా, మరియు క్షమించే గుణము కలిగి ఉండుడి.

( ) మారాలని మీ భార్యను లేక భర్తను బలవంతపెట్టుడి.

8) క్రింది వాటిలో వివాహమును ప్రమాదములో పడవేయు విషయములను గుర్తించుము : (6)

( ) విమర్శించే గుణము.

( ) పిసినారి భర్త.

( ) డబ్బును దుబారాగా ఖర్చు చేయు భార్య.

( ) బద్ధకము (సోమరితనము).

( ) క్రైస్తవ గృహము.

( ) కలిసి ప్రార్థించుట.

( ) క్రమములేని అపరిశుభ్రత.

( ) క్షమించే మనస్సు.

( ) అసూయ.

9) ముఖ్యమైన నిర్ణయములు తీసికొనుటలో విజయము కొరకు, (2)

( ) భార్యాభర్తలిద్దరు కలిసి మనస్సు విప్పి మాట్లాడుకొనుచు సూచన లిచ్చుకొనవలెను.

( ) తన నిర్ణయమే నెగ్గులాగున భర్త భార్యను బలవంత పెట్టవలెను.

( ) ఇద్దరు కలిసి ప్రార్థనలో దేవుని ఉపదేశము కొరకు అడుగవలెను.

( ) ఎవరి సొంత నిర్ణయముల మీద వారు పట్టుదల కలిగియుండవలెను.

10) అత్తమామలకు ఒక చక్కని సూచన ఏదనగా (1)

( ) మీ పని మీరు చూచుకొనుచు నూతన వధూవరులను ఒంటరిగా వదిలివేయుడి.

( ) నూతన వధూవరులు మీతో కలిసి ఉండాలని పట్టుబట్టుడి.

( ) అనవసరముగా వారి విషయములలో జోక్యము చేసికొనుడి.

11) మీ భాగస్వామి మీతో నమ్మకముగా వ్యవహరించని యెడల, మీరు చేయవలసిన ఉత్తమ పని ఏదనగా (1)

( ) వెంటనే ఇల్లు వదిలిపెట్టి ఇక ఎన్నటికి తిరిగి రాకండి.

( ) వెంటనే మీ భాగస్వామి ఎంత “చెడ్డవాడో” అందరికి చెప్పండి.

( ) సాధ్యమైనంత వరకు ఒకరినొకరు క్షమించుకొని మీ గృహమును భద్రపరచుకొనండి.

12) తలంపులు జాగ్రత్తగా కాచుకొనబడవలెను ఎందుకనగా (2)

( ) చెడు తలంపులు చెడు పరిణామములకు దారితీయును.

( ) మీ భార్య లేక భర్త మీ తలంపుల గుట్టును తెలిసికొనగలరు.

( ) తప్పుడు ఆలోచన మీ వివాహ జీవితమునకు తీవ్రముగా హాని కలిగించును.

13) నా వివాహ జీవితము దేవుని నిస్వార్థమైన, నిబద్ధతతో కూడిన, మరియు ఆనందకరమైన ప్రేమను నా కొరకు ప్రతిబింబింపజేయాలని నేను ఆశించుచున్నాను.

( ) అవును.

( ) కాదు.