Lesson 18
త్వరపడుము నీవిపుడు బైబిలులోనే అతిపెద్ద కాల ప్రవచనమును అన్వేషించబోవుచున్నావు. - ఈ ప్రవచనము యేసు ప్రభువు మొదటి రాకడను మరియు ఆయన మరణమును గూర్చిన కాలమును పరిపూర్ణముగా ప్రవరించెను. 16వ స్టడీగైడ్ పత్రికలో యేసుక్రీస్తు తిరిగి రాకముందు ప్రపంచమంతయు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన వర్తమానము దేవుని కొకటున్నదని నీవు నేర్చుకొనియున్నావు! మొదటి వర్తమానము ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక దేవునిని ఆరాధించి మహిమపరచుడని ఆజ్ఞాపించుచున్నది (ప్రకటన 14:7). దానియేలు 8 మరియు 9 అధ్యాయాలలో, దేవుడు తన అంతిమ తీర్పు ప్రారంభమయ్యే తేదీని మరియు క్రీస్తే మెస్సీయా అని ఋజువు చేయు శక్తివంతమైన ప్రవచనాత్మక సాక్ష్యాలను బయలుపరిచాడు. కనుక ఈ ప్రవచనము లేఖనములలో ఇయ్యబడిన ప్రవచనాలన్నిటి కంటే ఎంతో ప్రాముఖ్యమైనది, అయినను కొందరే దీనిని గూర్చిన కనీస అవగాహన కలిగియున్నారు! మిగతావారు దీనిని పూర్తిగా తప్పుగా అర్థము చేసుకొనుచున్నారు. ఈ స్టడీగైడ్ పత్రికను అధ్యయనము చేయుట ప్రారంభించక ముందు దయచేసి దానియేలు 8 మరియు 9 అధ్యాయాలను చదువుము, అద్భుతమైన ఈ పాఠమును అర్ధము చేసుకొనుటకు దేవుని ఆత్మ నడిపింపు కొరకు ఆయనకు ప్రార్థించుము.
1. దర్శనమందు, దానియేలు రెండు - కొమ్ములు గలిగి పశ్చిమముగాను, ఉత్తరముగాను మరియు దక్షిణముగాను పొడుచుచు దానికెదురైన ప్రతి జంతువును జయించుచున్న ఒక పొట్టేలును చూచెను (దానియేలు 8:3, 4). ఆ పొట్టేలు దేనిని సూచించుచున్నది?
“నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది" (దానియేలు 8:20).
జవాబు : పొట్టేలు, దానియేలు 7:5 లో ఎలుగుబంటిగా సూచింపబడిన ప్రపంచ రాజ్యమైన మాదీయ- పారసీకుల రాజ్యమును సూచించుచున్నది (స్టడీ గైడ్ 15వ పత్రికను కూడ చూడండి). బైబిలులోని దానియేలు మరియు ప్రకటన గ్రంథములలోని ప్రవచనములు “పునరావృతము మరియు విస్తరణ” అనే సూత్రమును పాటిస్తాయి. దీనర్థమేమనగా ఈ గ్రంథములు వాటి మునుపటి అధ్యాయాలలో ఉన్న ప్రవచనాలను పునరావృతము చేసి ఆ ప్రవచనాలను మరింత విస్తరించి వివరముగా వర్ణిస్తాయి. ఈ విధానం బైబిల్ ప్రవచనాలకు స్పష్టత మరియు నిశ్చయతను తెస్తుంది.
2. దానియేలు తరువాత ఏ అసాధారణమైన జంతువును చూచెను?
కింగ్ జేమ్స్ వర్షన్ బైబిలు ప్రకారము, "బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది (విరిగిన) పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా: నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు" (దానియేలు 8:21, 22).
జవాబు : తరువాత దానియేలు దర్శనమందు, రెండు కన్నుల మధ్య ఒక పెద్ద కొమ్ము కలిగిన బొచ్చుగల మేకపోతు కనబడెను, అది మహా వేగముతో పయనించుచున్నది. అది పొట్టేలు మీద దాడి చేసి దానిని జయించెను. అంతట ఆ పెద్ద కొమ్ము విరిగిపోయి దాని స్థానములో నాలుగు కొమ్ములు మొలిచెను. ఆ బొచ్చుగల మేకపోతు మూడవ ప్రపంచ రాజ్యమైన గ్రీకు రాజ్యమును సూచించెను, మరియు దాని రెండు కన్నుల మధ్యనున్న పెద్ద కొమ్ము అలెగ్జాండర్ మహాచక్రవర్తిని సూచించెను. విరిగిపోయిన ఆ పెద్ద కొమ్ము స్థానములో మొలిచిన నాలుగు కొమ్ములు విభజింపబడిన అలెగ్జాండర్ సామ్రాజ్యము యొక్క నాలుగు రాజ్యాలును సూచించుచున్నవి. దానియేలు 7:6 లో, గ్రీకు దేశమును కూడ సూచించుచున్న ఈ నాలుగు రాజ్యములు చిరుతపులిని పోలిన జంతువుకున్న నాలుగు తలల చేత సూచింపబడినవి. ఈ చిహ్నములు లేక గుర్తులు ఎంత ఖచ్చితమైనవంటే వాటిని చరిత్రలో గుర్తించుట ఎంతో సులభము.
జవాబు : చిన్న కొమ్ము రోమా సామ్రాజ్యమును సూచించుచున్నది. కొందరు చిన్న కొమ్ము క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దములో పాలస్తీనాను పాలించిన సెల్యూసిడ్ సామ్రాజ్యపు రాజైన యాంటైకస్ ఎఫిఫేన్సు సూచించుచున్నదని భావించారు. ఇతడు యూదుల ఆరాధన సేవా కార్యక్రమములను భంగపరచెను. మరికొందరు, సంఘ సంస్కరణ నాయకులతో సహా, చిన్న కొమ్ము దాని అన్యమత విగ్రహారాధన మరియు పోపు వ్యవస్థ రోమా సామ్రాజ్యమును సూచించుచున్నదని నమ్మారు. సాక్ష్యాధారాలను పరిశీలిద్దాము :
A."పునరావృతము మరియు విస్తరణ" అనే ప్రవచనాత్మక నియమమునకు అనుగుణంగా సూచింపబడిన అధికారము రోమా సామ్రాజ్యమై యుండాలి, ఎందుకనగా గ్రీకు సామ్రాజ్యము తరువాత అధికారములోనికి వచ్చేది రోమా సామ్రాజ్యమేనని దానియేలు 2 మరియు 7వ అధ్యాయాలు సూచించుచున్నవి. దానియేలు 7:24-27 కూడా రోమా సామ్రాజ్యపు పోపు వ్యవస్థ క్రీస్తు రాజ్యము చేత జయింపబడుననే వాస్తవాన్ని ధృవపర్చుచున్నది. (15వ స్టడీగైడ్ పత్రికను కూడా చూడండి). ఈ విషయములో దానియేలు 8వ అధ్యాయములో చెప్పబడిన చిన్న కొమ్ము సరిగ్గా సరిపోవుచున్నది: అది గ్రీకు సామ్రాజ్యము తరువాత వచ్చును మరియు చివరికి యేస్సు ప్రభువు రెండవ రాకడ యందు అత్యద్భుత రీతిలో నాశనము చేయబడును లేక "చేతి సహాయము లేక విరుగగొట్టబడును." (దానియేలు 8:25 ను దానియేలు 2:34 తో పోల్చిచూడుము.)
B. దానియేలు 8వ అధ్యాయము చెప్పుచున్న ప్రకారము, మాదీయ-పారసీకులు తమ "బలము" చూపుచూ వచ్చిరి (4వ వచనము), గ్రీకులు "అత్యధికముగా బలము" చూపుచూ వచ్చిరి (8వ వచనము), మరియు చిన్న కొమ్ము అధికారము తన మరింత "అత్యధిక బలము" చూపుచూ వచ్చెను. (9వ వచనము). గ్రీకు మరియు ఇశ్రాయేలు దేశాల తరువాత, రోమా సామ్రాజ్యము తప్ప మరే అధికారము “మరింత అత్యధికముగా బలము” చూపలేదని చరిత్ర స్పష్టము చేయుచున్నది.
C. రోమా సామ్రాజ్యము సరిగ్గా ప్రవచింపబడిన రీతిగా (9వ వచనము) దాని అధికారాన్ని దక్షిణమునున్న (ఐగుప్తునకు, " తూర్పుననున్న మాసిదోనియాకు, మరియు "సుందర భూమి"యైన పాలసీనా దాకా, విస్తరించుకున్నది. ఈ గుర్తు రోమా సామ్రాజ్యమునకు సరిపోయినంతగా మీరే గొప్ప అధికారమునకు సరిపోదు.
D. కేవలము రోమా సామ్రాజ్యము మాత్రమే యేసు ప్రభువు, (సైన్యములకు అధిపతికి) (11వ వచనము) మరియు (రాజాధిరాజుకు) (25వ వచనము) విరోధముగా నిలిచెను. అన్యమత రోమా ఆయనను సిలువ వేసెను. అది యూదా దేవాలయమును కూడా నాశనము చేసెను.
అంతేకాక, అన్యమత రోమా సామ్రాజ్యము పరలోకములో మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువు యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య స్థానమును పాపములను క్షమించగలదనే ఒక భూలోక యాజకత్వముతో భర్తీ చేయుట ద్వారా పరలోక గుడారమును (ఆలయమును) ప్రభావితముగా "పడద్రోసెను" (11వ వచనము) మరియు "కాళ్ల క్రింద త్రొక్కివేసెను" (13వ వచనము). దేవుడు తప్ప మరెవ్వడును పాపమును క్షమించలేడు (లూకా 5:21). యేసు మాత్రమే మన యాజకుడు లేక మధ్యవర్తి (ఉత్తరవాదియై యున్నాడు (1 తిమోతి 2:5).
4. ఈ చిన్న కొమ్ము అధికారము అనేక మంది దేవుని ప్రజలను నాశనము చేసి (10, 24, 25 వచనములు) సత్యమును నేలపాలు కూడ చేయునని (12వ వచనము) దానియేలు 8వ అధ్యాయము మనకు తెలియ జేయుచున్నది. దేవుని ప్రజలు మరియు పరలోక ఆలయము ఎంత కాలము కాళ్ళక్రింద త్రొక్కబడునని అడిగినప్పుడు పరలోకము నుండి వచ్చిన స్పందన ఏమిటి?
“అందుకతడు రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును” అని చెప్పెను (దానియేలు 8:14).
జవాబు : పరలోకపు స్పందన ఏదనగా పరలోకపు ఆలయం 2,300 ప్రవచన దినముల తరువాత పవిత్రపరచబడును, అనగా అక్షరాలా 2,300 సంవత్సరాలు.(గుర్తుంచుకోండి, బైబిల్ ప్రవచనములో ఒక దినం ఒక సంవత్సరంతో సమానమనే సూత్రమున్నది. యెహెజ్కేలు 4:6 మరియు సంఖ్యాకాండము 14:34 చూడండి.) భూసంబంధమైన ప్రత్యక్ష గుడారము యొక్క పవిత్రీకరణ ప్రాచీన ప్రాయశ్చిత్త దినమున జరిగినదని మనము ఇప్పటికే తెలుసుకున్నాము. ఇశ్రాయేలు. ఆ దినమున దేవుని ప్రజలు ఆయన ప్రజలుగా స్పష్టంగా గుర్తించబడిరి మరియు వారి పాపముల ఖాతా తొలగించబడెను. పాపమునకు అతుక్కుపోయినవారిని ఇశ్రాయేలీయులలో నుండి శాశ్వతంగా కొట్టివేయబడిరి. ఆ విధంగా పాళెము పాపము నుండి శుద్ధి చేయబడెను. ఇక్కడ పరలోకము దానియేలుకు హామీ ఇచ్చినదేమనగా పాపం మరియు చిన్న కొమ్ము అధికారం వృద్ధి చెందుట, లోకమును నియంత్రించుట మరియు దేవుని ప్రజలను హింసించుట శాశ్వతంగా కొనసాగదు. బదులుగా, 2,300 సంవత్సరములలో దేవుడు పాపమును మరియు పశ్చాత్తాపపడని పాపులను గుర్తించబడి, తరువాత విశ్వము నుండి శాశ్వతముగా తొలగించబడినప్పుడు పరలోక ప్రాయశ్చిత్త దినము లేదా తీర్పుతో అడుగు పెడతారు. ఆ విధముగా విశ్వము పాపము నుండి శుద్ధి చేయబడుతుంది. దేవుని ప్రజలకు విరోధముగా ఉన్న తప్పులు చివరికి సరిచేయబడతాయి మరియు ఏదేను వనము యొక్క శాంతి మరియు సామరస్యము మరోసారి విశ్వాన్ని నింపుతాయి.
"అతడు (గబ్రియేలు) నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమనెను. “ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. "అది యనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను" (దానియేలు 8:17, 19, 26).
జవాబు : గబ్రియేలు పదే పదే నొక్కి చెప్పినదేమనగా, 2,300 దినముల దర్శనములో మనము 15వ స్టడీగైడ్ పత్రికలో నేర్చుకొనిన 1798లో ప్రారంభమైన అంత్యకాల సంఘటనలు ఇమిడియున్నవి. 2,300 దినముల ప్రవచనము ప్రాముఖ్యముగా భూలోక చరిత్ర యొక్క అంత్యకాలములో జీవించుచున్న మనందరికి వర్తించబడునన్న విషయమును మనము అర్థము చేసికోవాలని దేవదూత కోరుకొనెను. దీనికి నేడు ఒక ప్రత్యేక అర్ధమున్నది.
దానియేలు 9వ అధ్యాయమునకు పరిచయము
8వ అధ్యాయములో దానియేలు పొందిన దర్శనము తరువాత, గబ్రియేలు దేవదూత వచ్చి ఆ దర్శనభావము దానియేలునకు వివరించుట ప్రారంభించెను. గబ్రియేలు 2,300 దినముల విషయము గురించి చెప్పే సమయానికి దానియేలు కుప్పకూలి కొంతకాలము మూర్చిల్లెను. అతడు కోలుకొని తిరిగి రాజు పనులను చూచుకొనుట కొనసాగించెను గాని తన ఆలోచనంతయు 2300 దినముల ప్రవచన దర్శనములోని వివరింపబడని భాగము మీదనే ఉండెను. మాదీయ- పారసీకము నందు బానిసలైయున్న తన యూదా ప్రజల గురించి దానియేలు దేవునికి ప్రాధేయపడి ప్రార్ధించెను. తన పాపములను అతడు ఒప్పుకొని తన ప్రజల పాపములను క్షమించమని దేవునిని వేడుకొనెను. దానియేలు 9వ అధ్యాయము పాపములు ఒప్పుకొనుచు, మరియు మొఱ్ఱపెడుతూ దేవునికి చేసిన ప్రాధేయపూర్వక ప్రార్ధనతో ప్రారంభమగును. ఈ స్టడీగైడ్ పత్రికలో ముందున్న భాగమును చదువక ముందు దయచేసి దానియేలు 9వ అధ్యాయము చదువుటకు కొంత సమయము తీసికొనుము.
6. దానియేలు ప్రార్ధన చేయుచున్నప్పుడు, అతనిని ఎవరు, ఏ వర్తమానముతో ముట్టెను (దానియేలు 9:21-23)?
జవాబు : గబ్రియేలు దేవదూత అతనిని ముట్టి దానియేలు 8వ అధ్యాయములో వర్ణించబడిన దర్శనము యొక్క మిగతా భాగమును వివరించుటకు తానొచ్చెనని అతనితో చెప్పెను (దానియేలు 8.26 ను దానియేలు 9:23 తో పోల్చిచూడుము). గబ్రియేలు వర్తమానాన్ని అర్ధం చేసుకోవడానికి దానియేలు దేవునికి ప్రార్ధించాడు.
7. 2300 సంవత్సరాలలో ఎన్ని దానియేలు ప్రజలు, యూదులు మరియు వారి రాజధాని నగరం యెరూషలేమునకు "విధింపబడతాయి"(లేక కేటాయింప బడతాయి) (దానియేలు 9:24)?
జవాబు : డెబ్బది ప్రవచన వారములు యూదులకు "విధింపబడెను." డెబ్బది ప్రవచన వారములు అక్షరాలా 490 సంవత్సరములకు సమానము (70×7=490). దేవుని ప్రజలు త్వరలో మాదీయ-పారసీ బానిసత్వము నుండి తిరిగి వచ్చెదరు, మరియు దేవుడు 2,300 సంవత్సరములలో నుండి 490 సంవత్సరములు దేవుని ప్రజలు పశ్చాత్తాపపడి ఆయనను సేవించుటకు మరొక అవకాశముగా విధింపబడును.
8. 2,300 సంవత్సరములు మరియు 490 సంవత్సరముల ప్రవచనములకు ప్రారంభమును గుర్తించుటకు సంఘటన మరియు తేదీలు ఏవి? (దానియేలు 9:25)?
జవాబు : ప్రారంభ సంఘటన పారసీకుల రాజైన అర్తహషస్త మాదీయ-పారసీకలో బానిసలుగా ఉన్న దేవుని ప్రజలు యెరూషలేమునకు తిరిగి వచ్చి పట్టణమును మరల కట్టుటకు జారీ చేసిన ఆజ్ఞయై యున్నది. ఎజ్రా 7వ అధ్యాయము లో కనుగొనబడిన ఈ ఆజ్ఞ క్రీ.పూ 457లో జారీ చేయబడెను, అది రాజు యొక్క ఏడవ ఏలుబడి సంవత్సరము (7వ వచనము) మరియు శరదృతువులో (ఆకులురాలే కాలములో) అమలు చేయబడెను. రాజైన అర్తహషస్త క్రీ.పూ. 464లో తన ఏలుబడిని (పరిపాలనను ప్రారంభించెను.
జవాబు : అవును నిజమే! గణిత లెక్కల ప్రకారము క్రీ.శ. 457 శరదృతువు (ఆకులురాలే కాలము) నుండి ఆరోహణ క్రమములో 483 సంవత్సరములు ముందుకు వెళ్ళిన యెడల, అది క్రీ.శ. 27 శరదృతువునకు చేరుకొనును "మెస్సీయా" అనే మాటకు "అభిషిక్తుడు" అని భావము (యోహాను 1:41). యేసు ప్రభువు తన బాప్తిస్మము నందు (లూకా 3:21, 22) పరిశుద్ధాత్మతో (అపొస్తలుల కార్యములు 10:38) అభిషేకించబడెను. ఆయన అభిషేకము తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు (లూకా 3:1) అనగా క్రీ. శ. 27వ సంవత్సరమందు జరిగేను. ఈ ప్రవచనము 500 సంవత్సరములకు పూర్వము చెప్పబడినదంటే ఆలోచించండి! అంతట యేసు ప్రభువు “కాలము సంపూర్ణమైయున్నది” అని (మెస్సీయాకు చేరనైయున్న 483 సంవత్సరములను సూచిస్తూ) ప్రకటించుట ప్రారంభించెను. ఈ విధముగా ఆయన ప్రవచనమును రూఢిపరచెను (మార్కు 1:14, 15; గలతీయులకు 4:4) యేసు ప్రభువు వాస్తవానికి తన పరిచర్యను స్పష్టముగా 2,300 దినముల ప్రవచనమును సూచిస్తూ దాని ప్రాముఖ్యతను మరియు ప్రమాణమును నొక్కి వక్కాణిస్తూ ప్రారంభించెను.
ఈ విషయము ఎంతో ఆశ్చర్యమును కలిగించునదై మూడు సంగతులను ఋజువు చేయుచున్నది:
A. బైబిలు దైవావేశము వలన కలిగినది.
B. యేసే మెస్సీయా
C. 2,300 దినములు/490 - సంవత్సరముల ప్రవచనములోని మిగతా తేదీలన్నియు ప్రామాణికమైనవి. నిర్మించుటకు ఇది ఎంత ధృడమైన పునాది?
10. 490 - సంవత్సరాల ప్రవచనములో 483 సంవత్సరాలను మనమిప్పుడు పరిగణించాము. ఇంకా ఒక ప్రవచనాత్మక వారం -అనగా అక్షరాల ఏడు సంవత్సరాలు ఉన్నవి (దానియేలు 9:26, 27). తరువాత ఏమి జరుగును మరియు ఎప్పుడు?
జవాబు : యేసు "అర్ధవారమునకు" అనగా ఆయన అభిషేకించబడిన మూడున్నర సంవత్సరాలకు లేదా క్రీ.శ. 31 వసంత ఋతువునకు నిర్మూలము చేయబడును" లేదా సిలువ వేయబడును. దానియేలు 9:28 లో సువార్త బయలుపడెనని దయచేసి గమనించుము. "ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ (తన కొరకు కాకుండ) అభిషిక్తుడు నిర్మూలము చేయబడును" దేవునికి స్తోత్రము, యేసు ప్రభువు నిర్మూలము చేయబడినది తన కొరకు కాదు. "ఆయన పాపము చేయలేదు" (1 పేతురు 2:22). మన పాపముల నిమిత్తము సిలువ మరణము పొందెను (1 కొరింథీయులకు 15:3, యెషయా 53:5). వెలకట్టలేని యేసు జీవితము మనలను పాపము నుండి రక్షించుటకు ప్రేమ పూర్వకముగా మరియు మనస్పూర్తిగా అర్పింపబడెను. హల్లెలూయా! ఎంతటి గొప్ప రక్షకుడు! దానియేలు 8 మరియు 9 అధ్యాయములలోని అతి ప్రాముఖ్యమైన అంశమేదనగా యేసు ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త బలియాగము.
11. యేసు మూడున్నర సంవత్సరముల తరువాత మరణించెను గనుక, దానియేలు 9:27 లోని ప్రవచనము ప్రకారము, ఆయన చివరి ఏడు సంపూర్ణ సంవత్సరముల వరకు "అనేకులకు నిబంధనను" ఎట్లు స్థిరపరచును?
జవాబు : నిబంధన ఏదనగా ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన తండ్రితో చేసికొనిన శుభప్రదమైన ఒడంబడికయైయున్నది (హెబ్రీయులకు 10:16, 17). మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య ముగిసిన తరువాత, యేసు తన శిష్యుల ద్వారా నిబంధనను స్థిరపరచెను (హెబ్రీయులకు 2:3). ఆయన వారిని మొదట యూదా జనాంగము నొద్దకు పంపెను (మత్తయి 10:5, 6), ఎందుకనగా ఆయన ఎన్నుకున్న ప్రజలు ఒక దేశముగా పశ్చాత్తాపపడు నిమిత్తము వారికియ్యబడిన 490 సంవత్సరాలలో ఇంకా మూడున్నర సంవత్సరాలు మిగిలియున్నవి.
12. క్రీ.శ. 34 శరదృతువు (ఆకులురాలే కాలములో) యూదా జనాంగానికి 490 సంవత్సరాల తుది అవకాశం ముగిసినప్పుడు, శిష్యులు ఏమి చేసిరి?
జవాబు : ఇతర జాతుల ప్రజలకు మరియు ప్రపంచ దేశములకు సువార్త ప్రకటించుట వారు ప్రారంభించిరి (అపొస్తలుల కార్యములు 13:46). స్తెఫను, నీతిపరుడైన ఒక పరిచారకుడు. క్రీ.శ. 34వ సంవత్సరములో బహిరంగముగా రాళ్లతో కొట్టబడెను. ఆ తేదీ నుండి, యూదులు, వారు యేసును మరియు దేవుని ప్రణాళికను సమిష్టిగా తిరస్కరించినందున, ఇకపై దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా లేదా దేశముగా ఉండలేరు. బదులుగా, ఇప్పుడు ఆయనను అంగీకరించి సేవించు అన్ని జాతుల ప్రజలను దేవుడు ఆధ్యాత్మిక యూదులుగా యెంచును. వారు ఆయన ఎన్నుకున్న ప్రజలు, "వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు" (గలతీయులకు 3:27-29). యూదా ప్రజల్లో కూడ ఎవరైతే వ్యక్తిగతముగా యేసు ప్రభువును అంగీకరించి సేవించుదురో వారును ఆధ్యాత్మిక యూదులై యున్నారు (రోమీయులకు 2:28, 29).
జవాబు : 1,810 సంవత్సరములు మిగిలియున్నవి. (2,300-490(తీసివేత)=1,810). ఈ ప్రవచనము ముగిసే తేది క్రీ.శ. 1844 (క్రీ.శ. 34+1810-1844). ఈ తేదిన పరలోక ఆలయము పవిత్రీకరించబడునని, లేదా పరలోక తీర్పు ప్రారంభమగునని దేవదూత చెప్పెను. (భూలోక దేవాలయము క్రీ.శ. 70లో నాశనము చేయబడెను.) మనము 17వ స్టడీగైడ్ పత్రికలో, పరలోక ప్రాయశ్చిత్త దినము అంత్య-కాలము కొరకు నిర్దేశించబడెనని నేర్చుకొని యున్నాము. దీనినిబట్టి ప్రారంభ తేదీ 1844 అని మనకు ఇప్పుడు తెలిసియున్నది. ఈ తేదీని దేవుడే నిర్దేశించెను. మెస్సీయాగా యేసు అభిషేకించబడుటకు నిర్దేశించిన క్రీ.శ. 27 వలె క్రీ.శ. 1844 కూడ ఖచ్చితమైనది. దేవుని అంత్య-కాల ప్రజలు దీనిని ప్రకటించవలసి యున్నారు.. (ప్రకటన 14:6, 7). 19వ స్టడీగైడ్ పత్రికలో ఈ తీర్పు వివరాలను తెలుసుకోవడం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నోవహు దినములలో, జలప్రళయ తీర్పు 120 సంవత్సరములలో సంభవించునని దేవుడు చెప్పెను (ఆదికాండము 6:3) - అది జరిగెను. దానియేలు దినములలో, అంత్య-కాల తీర్పు 2,300 సంవత్సరములలో ప్రారంభమగునని దేవుడు చెప్పెను (దానియేలు 8:14) అది జరిగెను! దేవుని అంత్య-కాల తీర్పు క్రీ.శ. 1844వ సంవత్సరము నాటినుండి జరుగుచున్నది.
ప్రాయశ్చితము యొక్క అర్థము
"అటోన్మెంట్ (ప్రాయశ్చితము)" అనే ఆంగ్ల పదము యొక్క అసలైన అర్థము "ఒప్పందంలో ఉన్న స్థితి" లేదా "ఒడంబడికలో ఉన్న స్థితి, " ఇది బంధము యొక్క సామరస్యతను చాటుచున్నది. సంపూర్ణ సామరస్యత మొట్టమొదట విశ్వమంతటా నిండియుండెను. అప్పుడు (2వ స్టడీగైడ్ పత్రికలో మనము నేర్చుకున్న ప్రకారము) లూసిఫరు, ఒక సౌందర్య వంతమైన పరలోక దేవదూతగా యుండి దేవునితో మరియు ఆయన రాజ్యపాలన సూత్రములతో సవాలు విసిరెను. మూడవ వంతు మంది పరలోక దేవదూతలు లూసిఫరు తిరుగుబాటులో చేతులు కలిపిరి (ప్రకటన 12:3, 4,7-9).
దేవునికి మరియు ఆయన ప్రేమపూర్వక సూత్రములకు వ్యతిరేకంగా చేసిన ఈ తిరుగుబాటును బైబిల్లో అతిక్రమము లేదా పాపము అంటారు (యెషయా 53:6;1 యోహాను 3:4). ఇది హృదయవేదనను, కలతను, వినాశనమును, విషాదమును, నిరుత్సాహమును, విచారమును, ద్రోహమును, మరియు అన్ని విధములైన దుష్టత్వమును తెచ్చెను. అన్నింటికంటే ఘోరమైన మరణము దాని జరిమానము (రోమీయులకు 6:23). ఈ మరణము పునరుత్థానము లేనిదై - అగ్ని గుండములో జరుగును. (ప్రకటన 21:8). అతి వేగముగా వ్యాపించే పాపము అతిభయంకరమైన క్యాన్సర్ (కొరుకుపుండు వ్యాధి) కంటే ప్రాణాంతకమైనది. అది విశ్వమును సైతము ఒక అపాయకరమైన స్థితికి దిగజార్చును.
అందుచేత దేవుడు లూసిఫరును మరియు అతని దూతలను పరలోకములో నుండి పడద్రోసెను (ప్రకటన 12:7-9)
మరియు అంతట లూసిఫరు "విరోధి" అని అర్ధమునిచ్చు "సాతాను" అనే క్రొత్త పేరును పొందెను. అతని పతనమైన దూతలు ఇప్పుడు దయ్యములుగా పిలువబడుచున్నారు. సాతానుడు ఆదాము హవ్వలను లోబరుచుకొనెను. తత్ఫలితముగా పాపము మానవులందరి మీదికి వ్యాపించెను. ఇది ఎంతటి భయంకరమైన విషాదము! మంచికి చెడుకు మధ్య నాశనకరమైన పోరాటము ఆరంభమాయెను, చెడు విజయము సాధించునట్లుగా అగుపడుచున్నది. పరిస్థితి నిరీక్షణ లేనిదిగా అనిపించుచున్నది.
కాని, అట్లు జరుగదు! యేసు, దేవుని కుమారుడు - సాక్ష్యాత్తు దేవుడే-ప్రతిపాపి శిక్షావిధికి జరిమానా చెల్లించుటకు తన ప్రాణమును త్యాగము చేయుటకు అంగీకరించెను (1 కొరింథీయులకు 5:7) ఆయన త్యాగమును అంగీకరించుట ద్వారా, దోషము, పాపపు సంకెళ్ల నుండి పాపులు విముక్తులగుదురు (రోమీయులకు 3:25). ఈ మహిమాన్విత ప్రణాళికలో యేసు ఆహ్వానించబడినప్పుడు ఒక వ్యక్తి హృదయములోనికి ప్రవేశించును (ప్రకటన 3:20) మరియు అతనిని ఒక కొత్త వ్యక్తిగా (1 కొరింధీయులకు 5:17) మార్చును. ఇది సాతానును ఎదిరించుటకు మరియు ప్రతి మారుమానస్సు పొందిన వ్యక్తి తాను సృజింపబడిన దేవుని స్వరూపములోనికి పునరుద్ధరించబడుటకు యేసు ప్రభువు ద్వారా సమకూర్చబడెను (ఆదికాండము 1:26, 27; రోమీయులకు 8:29).
ఈ శుభప్రదమైన ప్రాయశ్చిత్త ప్రతిపాదన పాపమును పారద్రోలి సాతానుడు, అతని పతనమైన దూతలు మరియు తిరుగుబాటులో అతనితో కూడ చేతులు కలిపే వారందరితో సహా నాశనమును చేసే ప్రణాళికతో కూడుకున్నది (మత్తయి 25:41, ప్రకటన 21:8). అటు తరువాత, యేసు ప్రభువు, ఆయన ప్రేమ ప్రభుత్వమునకు సంబంధించిన పూర్తి సమాచారము మరియు సాతానుడు, అతడి రాక్షస పాలనను గూర్చిన పూర్తి సమాచారము భూమ్మీద నున్న ప్రతి వ్యక్తికి ఇయ్యబడును, తద్వారా వారందరు క్రీస్తుతో లేదా సాతానుతో కలిసియుండుటకు ఒక వివేచనాత్మకమైన, జ్ఞానయుక్తమైన తీర్మానము చేసికొనెదరు (మత్తయి 24:14; ప్రకటన 14:6, 7).
ప్రతి వ్యక్తి కేసు పరలోకపు న్యాయస్థానములో పరిశీలించబడును (రోమీయులకు 14:10-12), క్రీస్తును లేక సాతానుని సేవించుటకు చేసికొనబడిన ప్రతి ఒక్కరి ఎంపికను దేవుడు గౌరవించును (ప్రకటన 22:11, 12). చివరిగా, పాపము సమూలముగా నిర్మూలము చేయబడిన తరువాత, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుట దేవుని ప్రణాళికయైయున్నది (2 పేతురు 3:13; యెషయా 65:17), అచ్చట పాపము మరలా తలెత్తదు (నహూము 1:9), అది నిత్యత్వమంతటికి వారి గృహముగా ఉండునట్లు దేవుడు దానిని తన ప్రజలకిచ్చును (ప్రకటన 21:1-5). అంతట తండ్రి మరియు కుమారుడు వారి ప్రజలతో కలిసి సంపూర్ణానందము మరియు సామరస్యతలతో సదా నివాసముండెదరు.
ఇదంతయు "యట్-వన్-మెంట్" (ప్రాయశ్చిత్తము)" అనే మాటలో ఇమిడియున్నది. దేవుడు దేనిని గూర్చి తన వాక్యమందు తెలియజేసెను, మరియు పాత నిబంధన గుడారపు సేవల్లో-ప్రత్యేకముగా ప్రాయశ్చిత్త దినమందు దృష్టాంతపరచెను. యేసుక్రీస్తే ప్రాయశ్చిత్తమునకు మూలము. కల్వరిలో ఆయన చేసిన ప్రేమామయమైన బలియాగము దీనంతటిని సాధ్యపరచుచున్నది. మన జీవితములలో మరియు విశ్వములో వున్న పాపమునకు స్వస్తి చెప్పుట ఆయన ద్వారానే సాధ్యపడును (అపొస్తలుల కార్యములు 4:12). ప్రపంచమునకు పరలోకపు త్రియాంశముల అంత్యకాల వర్తమానము ఆయనను మాత్రమే ఆరాధించమని మనందరికి పిలుపునివ్వడంలో ఆశ్చర్యము లేదు (ప్రకటన 14:6-12).
14. కొంతమంది బైబిల్ వ్యాఖ్యాతలు యుదా జాతికి విధించిన 490 సంవత్సరాలలో చివరి వారం (లేదా ఏడు సంవత్సరాలను) ఎందుకు వేరు చేసి, భూచరిత్ర చివరిలో క్రీస్తువిరోధి పనికి వర్తింపజేస్తున్నారు?
జవాబు : వాస్తవాలను పునర్విమర్శ చేద్దాము :
A. 490 సంవత్సరముల ప్రవచనములో ఏ సంవత్సరంలోనైనా అంతరాన్ని (దూరాన్ని) చొప్పించడానికి ఎటువంటి ఋజువు లేదా ఆధారాలు లేవు. అది దానియేలు 9:2 లో పేర్కొనబడిన దేవుని ప్రజల 70 ఏళ్ళ చెర వలె నిరాటంకముగా కొనసాగేటు వంటిది.
B.లేఖనములో ఎప్పుడూ కాలప్రమాణాల సంఖ్య (దినములు, వారములు, నెలలు, సంవత్సరములు) నిరంతరాయంగా ఉంటాయి. అందువల్ల, ఋజువు చేసే భారం ఎప్పుడైనా ప్రవచనం యొక్క ఏదైనా భాగాన్ని వేరు చేసి తరువాత లెక్కించాలని వాదించే వారిపైనే ఉంటుంది.
C.క్రీ.శ. 27 (యేసు ప్రభువు బాప్తిస్మము పొందిన సంవత్సరము) ప్రవచనము యొక్క చివరి ఏడు సంవత్సరములకు ప్రారంభ తేదీ, దీనిని “కాలము సంపూర్ణమైయున్నది” (మార్కు 1:15) అని వెంటనే ప్రకటించుట ద్వారా యేసు నొక్కిచెప్పెను.
D. క్రీ.శ. 31 వసంత కాలమందు, సిలువ మీద ఆయన మరణించే సమయంలో, యేసు ప్రభువు "సమాప్తమాయెను" అని కేక వేసెను (యోహాను 19:30). ఇక్కడ రక్షకుడు దానియేలు 9వ అధ్యాయము లో తన మరణము విషయమై చెప్పబడిన ప్రవచనములను స్పష్టముగా సూచించుచున్నాడు. అవి :
1. "మెస్సీయా (అభిషిక్తుడు)" నిర్మూలము" చేయబడును (దానియేలు 9:26).
2. దేవుని నిజమైన గొఱ్ఱెపిల్లగా మరణించుట ద్వారా (1 కొరింథీయులకు 5:7, 15:3) ఆయన "బలిని నైవేద్యమును నిలిపివేయును" (దానియేలు 9:27).
3. ఆయన “దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును" (దానియేలు 9:24).
4. ఆయన "అర్ధవారమందు" మరణించును (దానియేలు 9:27).
490 సంవత్సరాలలో చివరి ఏడు సంవత్సరాలు (ప్రవచనాత్మక వారాలను) వేరుచేయడానికి బైబిలులో ఆధారం లేదు. నిజమే, 490 సంవత్సరాల ప్రవచనం నుండి చివరి ఏడు సంవత్సరాలను వేరుచేయడం వల్ల దానియేలు మరియు ప్రకట గ్రంథాలలోని అనేక ప్రవచనాల యొక్క నిజమైన అర్థాన్ని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేరు. అంతకంటే దారుణంగా, ఏడు సంవత్సరాలను వేరుచేసే సిద్ధాంతం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది!
15. యేసు ప్రాయశ్చిత్త బలియాగం నీ కొరకు జరిగెను. పాపము నుండి నిన్ను పవిత్రపరచుటకు మరియు నిన్ను కొత్త వ్యక్తిగా మార్చుటకు నీవు ఆయనను నీ జీవితములోనికి ఆహ్వానించెదవా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. ఒక చిన్న కొమ్ము అధికారము దానియేలు 7 మరియు దానియేలు 8వ అధ్యాయములో కనబడును. అవి రెండూ ఒకే అధికారమేనా?
జవాబు : దానియేలు 7 లోని చిన్న కొమ్ము అధికారము పోపు అధికారమునకు (పేపసీకి) గుర్తుగా ఉన్నది. దానియేలు 8 లోని చిన్న కొమ్ము అధికారము అన్యమత మరియు పోపు అధికార రోమా (పేపల్ రోమ్) ను సూచించుచున్నది.
2. హెబ్రీ భాష నుండి అక్షరాలా అనువదించబడిన దానియేలు 8:14 లోని "రెండు వేల మూడు వందల దినములు" "రెండు వేల మూడు వందల అస్తమయములు ఉదయములు" అని చదువబడుతుంది. కొంతమంది వాదించినట్లు దీని అర్ధం 1,150 దినములా?
జవాబు : కాదు. ఆదికాండము 1:5, 8, 13, 19, 23, 31 వచనములలో ఒక అస్తమయము ఒక ఉదయము ఒక దినముతో సమానమని బైబిలు స్పష్టముగా చూపించుచున్నది. అంతేకాక, చరిత్రలో ఈ ప్రవచనమును నెరవేర్చే ఏ సంఘటన 1,150 దినముల చివరిలో జరుగలేదు.
3. క్రైస్తవుడి జీవితములో "ఎంపిక" ఏ పాత్ర పోషించును?
జవాబు : మన ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేవుని మార్గం ఎల్లప్పుడూ ఎన్నుకునే స్వేచ్ఛను దయచేస్తుంది (యెహోషువా 24:15). ఆయన ప్రతి వ్యక్తిని రక్షించాలని కోరుకుంటున్నప్పటికీ (1 తిమోతి 2:3, 4) ఆయన ఉచిత ఎంపికను అనుమతిస్తాడు (ద్వితీయోపదేశకాండము 30:19). తిరుగుబాటు చేయడానికి ఎన్నుకోవటానికి దేవుడు సాతానును అనుమతించాడు. ఆయన అవిధేయతను ఎన్నుకోవటానికి ఆదాము హవ్వలను అనుమతించాడు. నీతి అనేది ఎప్పటికీ ఒకడు ఎలా జీవించినను లేదా ఆ వ్యక్తికి వెళ్ళాలని లేకపోయినను పరలోకమునకు తీసికొని పోవుటకు కట్టుదిట్టము చేయబడిన నిబంధన కాదు. ఎంపిక అంటే మన మనస్సు మార్చుకోవడానికి మనము ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాము. యేసు తనను ఎన్నుకోమని అడుగుచున్నాడు (మత్తయి 11:28-30) మరియు మన ఎంపికను అనుదినము ధృవీకరించుకోమని కూడ అడుగుచున్నాడు (కీర్తన 86:3, యెహోషువా 24:15). మనము ఇది చేసినప్పుడు, ఆయన మనలను ఆయనలాగే మారుస్తాడు మరియు చివరికి మనలను తన క్రొత్త రాజ్యంలోనికి తీసుకువెళతాడు. కానీ దయచేసి గుర్తుంచుకోండి, మనము ఎప్పుడైనా తిరగడానికి మరియు మరొక దిశకు వెళ్ళడానికి ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాము. దేవుడు మనలను బలవంతం చేయడు. అందువల్ల, ఆయనను సేవించడానికి మన అనుదిన ఎంపిక అత్యవసరం.
4. దానియేలు 8వ అధ్యాయములో చెప్పబడిన చిన్న కొమ్ము అధికారము సెల్యూసిడ్ వంశపు రాజైన యాంటైకస్ ఎఫిఫేన్సు అని అనేక మంది నమ్ముచున్నారు. ఇది నిజము కాదని మనము ఎలా ఖచ్చితముగా చెప్పగలము?
జవాబు : దీనికి అనేక కారణములున్నవి. వాటిలో కొన్ని క్రింద ఇయ్యబడినవి :
- ప్రపచనము ఆదేశించుచున్న ప్రకారము యాంటైకస్ ఎపిఫేన్స్ "అత్యధికముగా బలిసిన" అధికారము పొందిన రాజు కాదు (దానియేలు 8:9).
- అతడు ప్రవచనము ఆజ్ఞాపించుచున్న ప్రకారము ప్రభుత్వము యొక్క "అంత్యకాలమందు" లేదా సెల్యూసిడ్ వంశీయుల రాజ్యము యొక్క చివరిలో పరిపాలన చేయలేదు (దానియేలు 8:23) కాని, మధ్యకాలమందు పరిపాలన చేసెను.
- ఎవరైతే యాంటైకస్ ఎఫిపేన్స్ చిన్న కొమ్ము అధికారమని బోధించుదురో వారు 2,300 దినములను 2,300 ప్రవచన దినములు లేక సంవత్సరములుగా కాక అక్షరాలా 2,300 దినములని తప్పుగా లెక్కించెదరు. దాదాపుగా ఆరు సంవత్సరములుండే ఈ అక్షరార్ధమైన స్వల్పకాలము దానియేలు 8వ అధ్యాయమునకు ఏ అర్ధవంతమైన సూత్రమును అన్వయించదు. ఈ అక్షరార్ధమైన నియమిత కాలమును యాంటైకస్ ఎఫిఫేన్సునకు జోడించాలనే ప్రయత్నములన్నియు ఏకగ్రీవముగా విఫలమొందెను.
- చిన్న కొమ్ము అధికారము "అంత్యకాలమందు" ఇంకను బ్రతికేయుండును (దానియేలు 8:12, 17, 19) అయితే యాంటైకస్ ఎఫిఫేన్సు క్రీ.పూ. 164వ సంవత్సరములో మరణించెను.
- చిన్నకొమ్ము దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు (పాలస్తీనా) దిక్కుగాను “అత్యధికముగా బలువవలసియున్నది” (దానియేలు 8:9). యాంటైకస్ ఎఫిపేన్స్ కొంతకాలము పాలస్తీనా దేశమును పరిపాలించినప్పటికి, అతడు ఐగుప్తులో (దక్షిణముగాను) మరియు మాసిదోనియలో (తూర్పుగాను) దాదాపు ఏ విజయము పొందలేదు.
- చిన్న కొమ్ము దేవుని ఆలయమును పడద్రోయును (దానియేలు 8:11). యాంటైకస్ ఎఫిపేన్స్ యెరూషలేములోనున్న దేవాలయమును నాశనము చేయలేదు. అతడు దానిని హేయపరచెను, కాని. అది క్రీ.శ. 70వ సంవత్సరములో రోమీయుల చేత నాశనము చేయబడెను. ప్రవచనము నిర్దేశించుచున్న ప్రకారము అతడు యెరూషలేమును కూడా నాశనము చేయలేదు (దానియేలు 9:26).
- క్రీస్తు దానియేలు 9:26 లో చెప్పబడిన నాశనకరమైన హేయకృత్యములను క్రీ.పూ. 167లో ఎఫిపేన్స్ తన గతములో చేసిన హింసాత్మక దాడులకు అన్వయించుట లేదు గాని, రాబోవు సమీప భవిష్యత్తులో తన తరములోనే క్రీ.శ. 70లో యెరూషలేమును మరియు దేవాలయమును నాశనము చేయనైయున్న రోమా సైన్యమునకు అన్వయించెను (లూకా 21:20-24). మత్తయి 24:15 లో యేసు ప్రభువు ప్రవక్తయైన దానియేలును గూర్చి ప్రస్తావించుచు, దానియేలు 9:26, 27 లోని తన ప్రవచనములు క్రైస్తవులు రానున్న కాలములో నాశనకరమైన హేయవస్తువులు “పరిశుద్ధ స్థలమందు నిలువబడియుండుట” చూచినప్పుడు నెరవేరునని చెప్పెను . ఇది ఎంతో స్పష్టముగా ఉన్నది గనుక అపార్థము చేసికొనే అవకాశమే లేదు.
- యేసు ప్రభువు యెరూషలేము యొక్క నాశనము ఆయనను రాజుగా మరియు రక్షకుడుగా అంగీకరించుటకు ఇశ్రాయేలీయుల అంతిమ తిరస్కరణను కారణమని స్పష్టముగా అభివర్ణించెను. (మత్తయి 21:33-45, 23:37, 38, లూకా 19:41-44). మెస్సీయాను తిరస్కరించుటకు మరియు పట్టణ మరియు దేవాలయ నాశనమునకు మధ్య ఉన్న సంబంధమే దానియేలు 9:26, 27 వచనములు ప్రకటించుచున్న ప్రాముఖ్యమైన వర్తమానము. ఇశ్రాయేలీయులకు అదనపు 490 సంవత్సరముల ప్రేమామయమైన కృపాకాల గడువిచ్చినను ఇది మెస్సీయాను ఎడతెగకుండా తిరస్కరించుట వలన కలిగే పర్యవసానములను ప్రకటించే వర్తమానమైయున్నది. ఈ ప్రవచనమును క్రీ.పూ. 164లో మరణించిన యాంటైకస్ ఎఫిఫేన్సునకు అన్వయించుట, క్రీస్తు పుట్టుకకు చాలా కాలము పూర్వము బైబిలంతటిలో అతి ప్రాముఖ్యమైన కాల ప్రవచనమైన దానియేలు 8 మరియు 9 అధ్యాయముల యొక్క భావార్ధములను పూర్తిగా నిరర్ధకము చేయును.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) దానియేలు 8 లోని పొట్టేలు సూచించు రాజ్యము (1)
( ) బబులోను.
( ) గ్రీకు.
( ) మాదీయ-పారసీక.
( ) రోమా.
2) దానియేలు 8 లోని మేకపోతు ఏ రాజ్యమును సూచించుచున్నది? (1)
( ) ఐగుప్తు.
( ) గ్రీకు.
( ) పాలస్తీనా.
( ) అష్షూరు.
3) దానియేలు 8 లోని చిన్న కొమ్ము సూచించునది (1)
( ) యాంటైకస్ ఎఫిపేన్స్.
( ) అన్యమత మరియు పోప్ అధికారములో ఉన్న రోమా.
( ) నాస్తిక వాదము.
( ) ఇరాక్.
4) ప్రాచీన ఇశ్రాయేలులో ప్రాయశ్చిత్త దినము తీర్పు దినమునై యున్నది. (1)
( ) అవును.
( ) కాదు.
5) 2,300 సంవత్సరములలో ఎన్ని సంవత్సరములు యూదులకు విధింపబడినవి? (1)
( ) 490 సంవత్సరములు.
( ) 700 సంవత్సరములు.
( ) 1,810 సంవత్సరములు.
( ) 100 సంవత్సరములు.
6) బైబిలు ప్రవచనములో, ఒక ప్రవచన దినము అక్షరాలా ఒక సంవత్సరముతో సమానము. (1)
( ) అవును.
( ) కాదు.
7) 2,300 సంవత్సరముల ప్రవచనము (ఇది జరుగుటకు 500 సంవత్సరములకు ముందు) మెస్సీయా క్రీ.శ. 27లో ప్రత్యక్షపరచబడునని ప్రవచించెను. ఆయన సరిగ్గా అదే సమయమునకు ప్రత్యక్షపడెను. ఇది ఋజువు చేయునదేమనగా (3)
( ) బైబిలు దైవావేశము వలన కలిగినది.
( ) గబ్రీయేలు దేవదూత ఒక అదృష్ట అంచనా వేసెను.
( ) ప్రవచనములోని ఇతర తేదీలన్నియు ఖచ్చితమైనవి.
( ) యేసే మెస్సీయా.
8) యూదా జనాంగానికి విధించిన 490 సంవత్సరాలు క్రీ.శ. 34 లో ముగిసినప్పుడు, శిష్యులు ఏమి చేశారు? (1)
( ) వారు ఇతర దేశాలు లేదా జాతుల ప్రజలకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు.
( ) వారు సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లారు.
( ) క్రీ.శ. 34 తర్వాత ఏ యూదుడు ఎప్పటికీ రక్షించబడలేడని వారు చెప్పారు.
9) దానియేలు 8 మరియు 9 అధ్యాయాలలోని 2,300 సంవత్సరాల ప్రవచనం ప్రకారం, 1844 లో ఏమి జరిగింది? (1)
( ) తీర్పు పరలోకంలో ప్రారంభమైంది.
( ) యూదా జాతికి కృపాకాల పరిశీలన దినం ముగిసింది.
( ) యేసు పరలోకానికి ఎక్కిపోయాడు.
( ) దేవుడు ప్రజలందరికీ కృపాకాల పరిశీలన ద్వారమును మూసివేసాడు.
10) పరలోకపు ప్రాయశ్చిత్త దినం, లేదా “ఒకే ఒప్పందంలో ఉన్న స్థితి" విశ్వమంతటిని దేవునితో పూర్తి సామరస్యంలోకి తెస్తుంది. ప్రాయశ్చిత్తం యొక్క కొన్ని అంశాల గురించి కిందివాటిలో ఏవి సత్యము చెప్పుచున్నవి? (10)
( ) మన మరణశిక్షకు జరిమానా చెల్లించుటకు యేసు తన ప్రాణాన్ని అర్పించెను.
( ) యేసు పాపపు అపరాధం నుండి మనలను విడిపించెను.
( ) యేసు మనలను మార్చి మనలను పూర్తిగా క్రొత్త వ్యక్తులుగా చేయును.
( ) యేసు మనలను దేవుని స్వరూపానికి పునరుద్ధరించును.
( ) పరలోక న్యాయస్థానంలో, క్రీస్తును లేదా సాతానుడిని సేవించుటకు ప్రతి వ్యక్తి చేసుకునే ఎంపికను దేవుడు గౌరవించును.
( ) నాశనం చేయాలనే సాతానుడి ప్రణాళిక మరియు ప్రజలను రక్షించే దేవుని అద్భుతమైన ప్రణాళిక గురించి భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి పూర్తి సమాచారం ఇవ్వబడుతుంది.
( ) పాపం, సాతానుడు మరియు పాపులు వేరుచేయబడి నాశనం చేయబడతారు.
( ) దేవుడు తన ప్రజల కొరకు కొత్త ఆకాశమును, కొత్త భూమిని సృష్టించును మరియు వారితో కలిసి నివసించును.
( ) పాపం మరలా తలెత్తదు.
( ) కల్వరిపై యేసు చేసిన బలియాగం ద్వారా ప్రాయశ్చిత్తం సాధ్యమైంది.
( ) సాతానుడు మరియు అతని దూతలు మార్చబడి రక్షింపబడతారు.
11) యూదా జాతికి విధించిన 490 సంవత్సరాలలో చివరి వారం-ఏడు సంవత్సరాలను వేరుచేయడానికి, వాటిని భూచరిత్ర యొక్క అంతము సమీపములో క్రీస్తువిరోధి పనికి వర్తింపజేయడానికి బైబిల్లో ఆధారం లేదు. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
12) క్రీ.శ. 34లో (3)
( ) దేవుడు ఎన్నుకున్న జాతిగా యూదులకు కృపాకాలము ముగిసింది.
( ) శిష్యులు ఇతర ప్రజలకు, జాతులకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు.
( ) నీతిమంతుడైన స్తెఫను రాళ్లతో కొట్టబడ్డాడు.
( ) తీర్పు పరలోకంలో ప్రారంభమైంది.
13) 2,300 సంవత్సరాల కాలము ప్రారంభమైన తేదీ (1)
( ) క్రీ.శ. 34.
( ) క్రీ.పూ. 1491.
( ) 1944.
( ) క్రీ.పూ. 457.
14) దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనాలు ప్రధానంగా మనకు మరియు మన కాలానికి వర్తిస్తాయి. (1)
( ) అవును.
( ) కాదు.
15) నా జీవితము కొరకైన క్రీస్తు ప్రాయశ్చిత్త బలియాగాన్ని నేను అంగీకరించితిని మరియు పాపము నుండి నన్ను పవిత్రపరచుటకు ఆయనను ఆహ్వానించితిని.
( ) అవును.
( ) కాదు.