Lesson 3

నీవు దహించి వేయుచున్న మంటల్లో కాలిపోవుచున్న ఒక ఇంట్లో ఊపిరి ఆడకుండ చేయు పొగమంటల మధ్య ఒంటరిగా చిక్కుకొనియున్నట్లుగా ఆ భయానక సన్నివేశమును ఊహించుకొనుము. అటువంటి పరిస్థితి నుండి క్షేమముగా బయటకు తీయబడినప్పుడు నీవు ఎంత ఉపశమనమును పొంది ఎంత కృతజ్ఞుడవై యుండెదవో కూడా ఊహించుకొనుము. వాస్తవముగా, ఈ భూగ్రహము మీద ఉన్న ప్రతి వ్యక్తి నిశ్చయ మరణము పొంచియున్న భయంకరమైన పరిస్థితిలో చిక్కుకొనియున్నాడు. తక్షణమే మనకు విమోచన అవసరమైయున్నది. ఆ విమోచన అగ్నిమాపక సిబ్బంది నుండి కాక, మన పరలోకపు తండ్రి నుండియే మనకు అవసరమైయున్నది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించుచున్నాడంటే, నిన్ను రక్షించుటకు ఆయన తన ఏకైక కుమారుని పంపెను. ఇదంతయు నీవు ముందుగానే విని యుండవచ్చును. కాని, ఇది ఏమిటోనన్న విషయమును నీవు నిజముగా అర్థము చేసికొనియున్నావా? అలాగైతే ఏ విధముగా నీవు దీనిని అర్థము చేసికొనియున్నావు, ఇది నీ జీవితమును నిజముగా మార్చివేయగలదా? ఈ పత్రికను చదువుచు సమాధానమును కనుగొనుము!

1. దేవుడు నిజముగా నా గురించి పట్టించుకొనునా?

ఆయన ఇట్లనెను: "నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను" (యెషయా 43:4). “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను” (యిర్మీయా 31:3).

జవాబు : మన ఊహలకు అందని అనంతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఈ విశ్వములో నీవు ఒక్కడివే నశించిన ఆత్మవనుకొని ఆయన నిన్ను ప్రేమించును. విమోచించుటకు పాపులు మరెవ్వరు లేకపోయినను నీ కొరకు లేక నా కొరకు ఆయన తన ప్రాణమును అర్పించియుండేవాడు. ఈ సత్యమును ఎన్నడు మరువకుము. నీవు ఆయన దృష్టికి ప్రియుడవైతివి గనుక ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు.

2. దేవుడు తన ప్రేమను మన యెడల ఎట్లు వ్యక్తపరచెను?

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16). “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయకుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” (1 యోహాను 4:9, 10).

జవాబు : ఆయన మనలను ఎంతో ప్రేమించెను గనుకనే, నీ నుండి నా నుండి తనను తాను సదా వేరుపరచుకోకుండు నిమిత్తము, తన ఏకైక కుమారుడు హింసింపబడి చంపబడుట ఆయనకు ఇష్టమాయెను. ఈ ప్రేమను మనము అర్థము చేసికొనలేకపోవచ్చును, కాని ఆయన దీనిని నీ కొరకును, నా కొరకును చేసెను!

Jesus’ love for you is clearly seen in His willingness to forgive your sins and His desire to give you victory over every temptation in your life! 3. ఆయన నావంటి వ్యక్తిని ఎట్లు ప్రేమించగలడు?

“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను” (రోమీయులకు 5:8).

జవాబు : నిశ్చయముగా నేను దానిని సంపాదించితినని గాని లేక దానికి యోగ్యుడనైతినని గాని కాదు. మనలో ఒక్కడును పాపమునకు జీతమైన మరణమును తప్ప మరి దేనిని సంపాదించలేదు (రోమీయులకు 6:23). దేవుని ప్రేమ అవధులు లేనిది మరియు అది షరతులు లేనిదైయున్నది. ఆయన దొంగలను, వ్యభిచారులను మరియు నరహంతకులను సహితము ప్రేమించుచున్నాడు. స్వార్ధపరులను, కపటబుద్ధిగలవారిని, మరియు అపవిత్రమైన దూషకులను సహితము ఆయన ప్రేమించును. కాని, ఆయన నన్ను ప్రేమించున్నాడన్నది అన్నిటికంటే గొప్ప విషయము! నా పాపములు కేవలము శ్రమలకు మరియు మరణమునకు దారితీయునని ఆయన యెరుగును గనుక, నా పాపముల నుండి నన్ను రక్షించాలన్నదే ఆయన ఆకాంక్షమైయున్నది. అందుచేతనే ఆయన మరణించెను.

4. ఆయన మరణము నాకు ఏమి చేయును?

“మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి” (1 యోహాను 3:1). “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12).

జవాబు : నాకు విరోధముగా ఉన్న మరణశిక్షకు పరిహారము చెల్లించుటకై క్రీస్తు మరణించెను. నేను పొందవలసిన మరణబాధను తాను పొందుటకై ఆయన నరునిగా జన్మించెను. అంతట ఆయన చేసిన త్యాగము వలన కలిగిన ఘనతను ఆయన నాకు ఆరోపించెను. అనగా, నేను నీతిమంతునిగా యెంచబడుటకు ఆయన పాపరహిత జీవితము అందుకు కారణమాయెను. ఆయన మరణము నా గత పాపములన్నిటి విషయమై పరిపూర్ణ పరిహారముగా దేవుని చేత అంగీకరించబడెను, ఆయన నాకు చేసిన దానిని ఒక బహుమానముగా నేను అంగీకరించుట ద్వారా, ఆయన కుమారునిగా లేక కుమార్తెగా దేవుని కుటుంబములోనికి నేను చేర్చుకొనబడితిని. ఇది మనస్సును పరవశింపజేయుచున్నది!

5. నేను యేసు ప్రభువును ఎట్లు స్వీకరించి తద్వారా మరణము నుండి జీవములోనికి దాటిపోవుదును?

జవాబు : దేవుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప బహుమానము కొరకు అడుగుట ద్వారా, దానియందు నమ్మికయుంచి, అంగీకరించుట ద్వారా నేను మరణము నుండి జీవములోనికి దాటిపోవుదును.

మూడు విషయములు ఒప్పుకొనుము :

  1. నేను పాపిని.

"అందరును పాపము చేసిరి" (రోమీయులకు 3:23).

  1. నాకు మరణశిక్ష విధింపబడెను.

"పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమీయులకు 6:23).

  1. నన్ను నేనుగా రక్షించుకొనలేను.

"నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" (యోహాను 15:5).

అటు తరువాత, మూడు విషయములు నమ్ముము :

  1. ఆయన నా కొరకు మరణించెను.

"ఆయన (యేసు) ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు" (హెబ్రీయులకు 2:9).

  1. ఆయన నన్ను క్షమించును.

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును" (1 యోహాను 1:9).

  1. ఆయన నన్ను రక్షించును.

ఆయనను “విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు” (యోహాను 6:47).

జీవితమును మార్చు ఈ సత్యములను పరిశీలించము :

Answer

* నా పాపముల వలన, నాకు మరణశిక్ష విధింపబడెను.

* ఆ పాపపరిహారమును నిత్యజీవము కోల్పోకుండ నేను చెల్లించలేను. ఎందుకనగా నా పాపముల కొరకు నేను మరణించిన యెడల, నాకు నేనుగా పునరుత్థానము పొందలేను. శాశ్వతముగా మరణించే యుందును.

* నేను చెల్లించలేని దానికి నేను ఋణపడియున్నాను! ఆ పరిస్థితుల్లో యేసు ఒక మిత్రునిలా వెన్నంటి, "నేను చెల్లించెదను. నీ స్థానములో నేను మరణించి దాని ఘనతను నీకు ఆరోపించెదను. అప్పుడు నీ పాపముల కొరకు నీవు మరణించవలసిన అవసరము ఉండదు" అని భరోసా నిచ్చెను.

* ఈ త్యాగమును నేను అంగీకరింపవలెను! ఇది సులభమే, కదూ? నా పాపముల కొరకైన ఆయన మరణమును నేను బహిరంగముగా ఒప్పుకొని అంగీకరించెదను. దీనిని చేసిన మరుక్షణము, నేను దేవుని కుమారుడను లేక కుమార్తెనైతిని!

6. రక్షణ అను ఈ బహుమానమును పొందుటకై నేనేమి చేయవలెను?

“కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” (రోమీయులకు 3:24). "కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము" (రోమీయులకు 3:28).

జవాబు : నేను చేయగలిగినదల్లా దానిని ఒక పరిపూర్ణ బహుమానముగా అంగీకరించుటయే. విధేయతతో కూడిన నా సొంత క్రియలు నీతిమంతునిగా తీర్చబడు అనుభవములో నాకెంతమాత్రము సహాయము చేయలేవు. విశ్వాసముతో రక్షణ కొరకు అడుగువారందరికి అది ఉచితముగా అనుగ్రహింపబడును. మిక్కిలి నీతిమంతుడు ఏ విధముగా అంగీకరింపబడునో, అతి నీచాతి నీచమైన పాపియు ఆ విధముగానే అంగీకరింపబడును. మునుపటి సంగతులు లెక్కకు రావు. దేవుడు అందరిని సమానముగా ప్రేమించుచున్నాడనియు, అడుగువారికి క్షమాపణను ఆయనే దయచేయుచున్నాడనియు మనము జ్ఞాపకముంచుకొనవలెను. "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" (ఎఫెసీయులకు 2:8).

7. నేను విశ్వాసము ద్వారా ఆయన కుటుంబములో చేర్చబడినప్పుడు, యేసు ప్రభువు నా జీవితములో చేయు మార్పు ఏమిటి?

“కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2 కొరింథీయులకు 5:17).

జవాబు : క్రీస్తు నా హృదయములోనికి ఆహ్వానింపబడి యుండగా, ఆయన నాలోని పాత పాపపు స్వభావమును తీసివేసి ఒక నూతన ఆధ్యాత్మిక సృష్టిగా నన్ను మార్చివేయును. పాపముతో కూడిన నా పాత జీవితము ఇప్పుడు నాకు అసహ్యముగాను మరియు అవాంఛనీయముగాను మారును. దోషము మరియు శిక్షావిధి నుండి మహిమాన్వితమైన స్వతంత్రమును తొలిసారిగా నేను సంతోషముతో అనుభవించుదును. క్రీస్తులేని నా జీవితము ఎంత వెలితిగా ఉన్నదో నేను కనుగొందును. బల్ల క్రింద పొట్టు భుజించుటకు బదులుగా, ఇప్పుడు నేను రాజవిందును ఆరగింతును. దేవునితో ఒక్క నిమిషము గడుపుట వలన అపవాదికి జీవితకాలము సేవ చేసిన దానికంటే ఎక్కువ ఆనందము నాకు కలుగును. ఏమి పరివర్తనము! దీనిని అంగీకరించుటకు ఎందుకు నేను ఇంత కాలము వేచియుంటిని?

8. నా పాత పాపాత్మకమైన జీవితము కంటే ఈ మారిన జీవితము నిజముగా సంతోషముగా ఉండునా?

యేసు ఇట్లనెను : "మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను" (యోహాను 15:11). “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు” (యోహాను 8:36). "గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 10:10).

జవాబు : ఆంక్షలు మరియు ఆత్మపరిత్యాగముతో కూడిన క్రైస్తవ జీవితము అంత సంతోషకరముగా ఉండదని అనేకమంది భావించెదరు. కాని దీనికి సరిగ్గా వ్యతిరేకమైనదే నిజము! యేసు ప్రేమను నీవు అంగీకరించినప్పుడు, ఆనందముతో నీలో నీవు ఎగిరి గంతులు వేసెదవు. కష్టసమయము లొచ్చినను, క్రైస్తవుడు వాటిని ఎదుర్కొనుటకు భరోసాతో కూడిన మరియు శక్తివంతమైన దేవుని సన్నిధిని మరియు "సమయోచితమైన సహాయము" పొందుకొని ఆనందించగలడు (హెబ్రీయులకు 4:16)..

9.క్రైస్తవులు చేయవలసిన అన్ని పనులను నేను చేయగలనా?

"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్త నాయందు జీవించుచున్నాడు" (గలతీయులకు 2:20). “నన్ను బలపరచు వానియందే " (క్రీస్తునందే) నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీయులకు 4:13).

జవాబు : ఈ విషయములోనే క్రైస్తవ జీవితము యొక్క గొప్ప అద్భుతము బయలుపరచబడును. నీతిగా జీవించమని ఎవ్వరు నిన్ను బలవంతపెట్టరు! క్రైస్తవునిగా నీవు చేసే ప్రతి కార్యము నీయందు జీవించుచున్న వేరొక వ్యక్తి (యేసుక్రీస్తు) యొక్క జీవితము ఉన్నపాటుగా నీయందు ప్రత్యక్షపర్చబడుటయే. నీ జీవితములో విధేయత అనునది ప్రేమతో కూడిన సహజ స్పందనయే. క్రీస్తునందు నూతన సృష్టిగా జన్మించిన నీవు, ఆయన జీవితము నీ జీవితములో భాగమాయెను గనుకనే ఆయనకు విధేయత చూపుచున్నావు. నీవు ప్రేమించు వ్యక్తిని ఆనందింపజేయుట నీకు సంతోషమే కాని భారము కాదు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది” (కీర్తనలు 40:8).

10. అంటే పది ఆజ్ఞలకు విధేయత చూపుట కూడ భారమేమి కాదని దాని భావమైయున్నదా?

“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు” (యోహాను 14:15). "మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు" (1 యోహాను 5.3). "ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను" (1 యోహాను 2:5).

జవాబు : బైబిలు ఎల్లప్పుడు విధేయతను ప్రేమ సంబంధమునకు ముడిపెట్టుచున్నది. క్రీస్తునందు తిరిగి నూతనముగా జన్మించిన క్రైస్తవులు పది ఆజ్ఞలు గైకొనుట భారముగా భావింపరు. నా గత పాపములన్నియు ఆయన ప్రాయశ్చిత్త మరణము చేత కప్పబడి, నా ప్రస్తుత మరియు ఇక ముందు నేను చూపబోవు విధేయత నా అంతరంగమందున్న ఆయన జయించిన జీవితము మీద ఆధారపడియున్నది. వాస్తవముగా, నా జీవితమును మార్చిన ఆయనను నేను ఎంతగానో ప్రేమించుదును గనుక, నేను పది ఆజ్ఞలకు మించి విధేయతను చూపగలను. ఆయన చిత్తము కొరకు అనుదినము నేను బైబిలును పరిశోధింతును, తద్వారా నా ప్రేమను ఆయనకు వ్యక్తపరచు చిన్న చిన్న మార్గములను కనుగొందును. “మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును” (1 యోహాను 3:22).

Keeping the Ten Commandments to earn salvation always results in failure and despair. It’s too late to save yourself because you have already sinned! But the person who has accepted the gift of salvation delights in walking the path of obedience to God’s laws.11. పది ఆజ్ఞలను పాటించుట క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తు కాదని నేనెట్లు ఖచ్చితముగా చెప్పగలను?

"దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్చు (పట్టువిడువని విశ్వాసము) ఇందులో కనబడును" (ప్రకటన 14:12). "వారు (పరిశుద్ధులు) గొట్టెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని (సాతానును) జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు" (ప్రకటన 12:11).

జవాబు : "లీగలిజమ్" అనునది రక్షణను ఉచిత బహుమానముగా అంగీకరించుటకు బదులుగా మంచి క్రియల ద్వారా దానిని సంపాదించుటకు ప్రయత్నించుట. బైబిల్లోని పరిశుద్ధులు నాలుగు గుణగణములను కలిగి ఉన్నట్లు గుర్తించబడియున్నారు :

  1. దేవుని ఆజ్ఞలను గైకొనుట,
  2. గొర్రెపిల్ల రక్తమును విశ్వసించుట,
  3. యేసుపై తమ విశ్వాసమును ఇతరులతో పంచుకొనుట, మరియు
  4. పాపము చేయుటకు బదులు మరణించుటకు ఎంచుకొనుట. క్రీస్తును ప్రేమించాలని మరియు ఆయనను అనుసరించాలని కోరుకొను వ్యక్తి యొక్క నిజమైన గుర్తులు ఇవి.

12. క్రీస్తుతో నా సంబంధములో విశ్వాసము మరియు ప్రేమ పెరుగుచునే ఉండునని నేనెట్లు ఖచ్చితముగా చెప్పగలను?

“(లేఖనములు పరిశోధించుడి)” (యోహాను 5:39). “యెడతెగక ప్రార్థన చేయుడి” (1 థెస్సలొనీకయులకు 5:15). “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ... ఆయన యందుండి నడుచుకొనుడి” (కొలొస్సయులకు 2:6, 7). “నేను దినదినమును చనిపోవుచున్నాను” (1 కొరింథీయులకు 15:31).

జవాబు : ఒకరితో ఒకరికి సంభాషణ లేకుండ ఏ ప్రేమ బంధము వర్ధిల్లదు. ఈ బంధమును పెంపొందించుటకై ప్రార్ధన మరియు బైబిలు పఠనము అత్యంత అవసరమైయున్నది. ఆధ్యాత్మిక జీవితమును పోషించుకొనుటకు ఆయన వాక్యమందు నా కొరకు దాగియున్న "ప్రేమలేఖ"ను నేను అనుదినము చదువవలసియున్నాను. ప్రార్ధన యందు ఆయనతో సంభాషించుట ద్వారా నా ప్రార్ధన జీవితము మరింత అభివృద్ధి చెందుటయే కాక నా యెడల ఆయనకున్న ప్రేమను గూర్చిన జ్ఞానమును పెంపొందించుటకు అది నా మనస్సును మిక్కిలి ఉత్తేజపరచును. నా సంతోషము కొరకు ఆయన తలపెట్టిన గొప్ప కార్యములను కనుగొనుట యందు నేను అనుదినము ఆశ్చర్యచకితుడనగుదును. ప్రేమ నశించిన యెడల, పరలోకము కూడ ఒక నరకములాగానే ఉండును. ప్రేమ అదృశ్యమైనప్పుడు, ఆ బంధము, బలవంతమైన విధులతోను ముడిపడి యుండును. అదే విధముగా, ఒక క్రైస్తవుడు క్రీస్తును అత్యున్నతముగా ప్రేమించుట మానివేసినప్పుడు, అతని మతము కేవలము కొన్ని నియమములకు కట్టుబడి నియంత్రితమయ్యేదిగా నుండును.

13. ఆయనతో నీ జీవితమును మార్చివేయు సంబంధము గురించి అందరికి ఎట్లు తెలియజేయగలవు?

"కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, అలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి"... "పాపశరీరము నిరర్థకమగునట్లు" (రోమీయులకు 6:4, 6). "పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని" (2 కొరింథీయులకు 11:2).

జవాబు : నిజమైన విశ్వాసి జీవితములో జరుగవలసిన మూడు ప్రాముఖ్యమైన కార్యక్రమములకు బాప్తిస్మము గుర్తుగా ఉన్నది.

  1. పాపపు స్వభావమునకు మరణించుట,
  2. క్రీస్తునందు నూతనముగా జన్మించుట, మరియు
  3. నిత్యత్వమునకు క్రీస్తును వివాహము చేసికొనుట లేక క్రీస్తుతో జతపడుట. ఈ ఆధ్యాత్మిక ఏకత్వము కాలము గడచుచున్న కొలది మరింత బలముగాను మరియు మధురముగాను వర్ధిల్లును.

మన ఆధ్యాత్మిక వివాహమును దేవుడే ముద్రించును.

మన ఆధ్యాత్మిక వివాహమును నిత్యత్వమునకు ముద్రించుటకై, నన్ను ఎన్నడును విడనాడనని (కీర్తనలు 55.22; మత్తయి 28:20; హెబ్రీయులకు 13:5), అనారోగ్యముగా ఉన్నపుడు నన్ను జాగ్రత్తగా చూచుకొందునని (కీర్తనలు 41:3; యెషయా 41:10), మరియు నా జీవితములో కలుగు ప్రతి అవసరమును తీర్చుదునని (మత్తయి 6:25–34) ఆయన వాగ్దానము చేసెను. విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించి, ఆయన వాగ్దానములు నాకు చాలునని నేను కనుగొనినందున, నాకు కలుగు ప్రతి అవసరమును తీర్చువాడు ఆయనే అని నేను విశ్వసించుచునే యుందును గనుక ఆయన నన్ను ఎన్నడు నిస్సహాయ పరిస్థితుల్లో విడువడు.

14. నీవు ఇప్పుడే యేసు ప్రభువును నీ జీవితములోనికి ఆహ్వానించి క్రొత్త జీవితము అనుభవించాలని ఆశించుచున్నావా?

నీ జవాబు :


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. ఒక మనుష్యుని మరణము సమస్త మానవాళి పాపపరిహారమును ఏ విధముగా చెల్లించగలదు? ఒక భయంకరమైన పాపపు జీవితమును నేను జీవించియున్నాను. నా వంటి ఘోర పాపి కొరకు యేసు మరణముతో పాటు దేవుడు ఇంకను ఏదైన ప్రత్యేకమైనది చేయవలసియున్నదని నాకనిపించుచున్నది. ఇది నిజమేనా?

జవాబు : రోమీయులకు 3:23 “అందరును పాపము చేసియున్నారు” అను విషయమును మనకు తెలియజేయుచున్నది. “అందరును పాపము చేసిరి” గనుక, జన్మించిన ప్రతి వ్యక్తి కొరకు "ఏదో ఒక ప్రత్యేకమైనది" అవసరమైయున్నది. మానవులందరికి సమానమైన జీవితము మాత్రమే సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు మరణించగలదు. సమస్త జీవమునకు సృష్టికర్త యేసే గనుక, ఆయన అర్పించిన జీవితము ప్రజలందరి జీవితములతో సమానము. సృష్టించబడిన ప్రతి ఒక్కరి కొరకు అర్పింపబడిన ఆయన జీవితము ద్వారా ప్రాయశ్చితము కలిగించుటయే కాక, ప్రాయశ్చిత్త మరణము పొందిన ఆయనే తిరిగి ఆ మరణము నుండి తిరిగి లేచుటకు సమర్థుడుగా ఉండవలెను. ఎందుకు? విశ్వాసము ద్వారా ఎందరైతే అంగీకరించుదురో వారికందరికి ప్రాయశ్చితము వలన కలిగిన ప్రయోజనములను ఆరోపించుటకై అట్లు జరుగవలెను. ఆయన, "తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు" (హెబ్రీయులకు 7:25).

2. నేను క్రీస్తును ఆయన క్షమాపణను అంగీకరించి, మరల పాపము చేసిన యెడల, ఆయన నన్ను మరల క్షమించునా?

జవాబు : మన పాపములను పశ్చాత్తాపముతో ఒప్పుకొనిన యెడల, దేవుడు మరల మనలను క్షమించునని మనము నమ్మవచ్చును. "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును" (1 యోహాను 1:9).

3. పాపపు స్థితిలో ఉన్న నేను దేవుని యొద్దకు ఎట్లు రాగలను? నా కొరకు ప్రార్ధన చేయుమని సంఘకాపరి యొద్దకో లేక దైవ సేవకుని యొద్దకో వెళితే సరిపోవును కదా?

జవాబు : యేసు శరీరధారియై జీవించి "మన వలెనే శోధింపబడెను" (హెబ్రీయులకు 4:15), గనుక మనలను అర్థము చేసికొనుటకును మరియు దయ చూపించుటకును మనకు దేవుడొకడున్నాడు. "మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము"అని హెబ్రీయులకు 4:16లో చెప్పబడెను. యేసుక్రీస్తు తప్ప వేరొక మధ్యవర్తి అవసరము లేకుండ మనము ప్రత్యక్షముగా దేవుని యొద్దకు రావచ్చును; యేసు నామములో (యోహాను 14:14) మనము ధైర్యముగా ఆయన యొద్దకు చేరవచ్చును. 1 తిమోతి 2:5 "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు" అని చెప్పుచున్నది.

4. దేవుడు నన్ను రక్షించుటలో సహాయపడుటకు నేనేదైన చేయగలనా?

జవాబు : లేదు. ఆయన ప్రణాళిక పూర్తిగా కృపతో కూడుకొనియున్నది (రోమీయులకు 3:24; 4:5); అది "దేవుని వరమే" (ఎఫెసీయులకు 2:8). విశ్వాసము ద్వారా దేవుడు మనకు కృపను అనుగ్రహించుట మాత్రమే కాక, ఆయనకు విధేయత చూపుటకు బలమును మరియు శక్తిని ఆయనే మనకనుగ్రహించును. ఇది ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారానే కలుగును. అయితే, ఈ విధేయత కూడ దేవుని ఉచిత కృప వలన కలిగినదే. విధేయత – (సేవ మరియు ప్రేమతో కూడిన విధేయత) - శిష్యరికమునకు నిజమైన పరీక్షయు మరియు యేసుక్రీస్తునందున్న విశ్వాసము ద్వారా కలిగిన సహాజ ఫలితము.

5. ఒక్కసారి దేవుడు నా పాపమును క్షమించినప్పుడు, నేను ఇంకను ఏదైన పరిహారమును చెల్లించవలసిన అవసరమున్నదా?

జవాబు : “కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు" అని లేఖనము చెప్పుచున్నది (రోమీయులకు 8:1). మన అతిక్రమముల కొరకు క్రీస్తు పూర్తి పరిహారమును చెల్లించెను, విశ్వాసముతో ఆయనను అంగీకరించు వారందరు పవిత్రపరచబడుటకు వారేమియు చెల్లించనవసరము లేదు, ఎందుకనగా వారు గొఱ్ఱెపిల్ల రక్తములో "కడుగబడియున్నారు!" యెషయా 43:25లో దేవుని క్షమాగుణమును చూపించు ఒక చక్కని వాగ్దానమున్నది : "నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను." మీకా 7:18, 19 ప్రజల పట్ల విమోచకుడైన దేవునికి ఉన్న చక్కని వైఖరిని చూపించుచున్నది : "తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు."


సారాంశ పత్రము


ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) ఏ గొప్ప బహుమానము ద్వారా దేవుడు పరలోకపు సంపూర్ణతను మానవులకు అనుగ్రహించెను? (1)

( ) బైబిలు

( ) ఆయన సంఘము

( ) యేసుక్రీస్తు

( ) ధర్మశాస్త్రము

2) ఈ ప్రపంచము ఎన్నడూ చూడని అత్యున్నత ప్రేమ ప్రదర్శన ఏదనగా (1)

( ) రొట్టెలు మరియు చేపలు.

( ) సిలువపై యేసు మరణము.

( ) పెంతెకొస్తు.

( ) పేతురు ఒప్పుకోలు.

3) క్రీస్తు సిలువపై బలియైనది (1)

( ) ప్రతి ఒక్కరి కొరకు.

( ) నీతిమంతుల కొరకు మాత్రమే.

( ) పాపుల కొరకు మాత్రమే.

( ) రక్షణ పొందుటకు ముందుగానే నిర్ణయింపబడిన వారి కొరకు.

4) ఎవరిని దేవుడు ఎక్కువగా ప్రేమించును? (1)

( ) సంఘ సభ్యులను

( ) వ్యభిచారులు మరియు దొంగలను

( ) అందరిని సమానముగా

( ) మారుమనస్సు పొందిన క్రైస్తవులను

5) క్రీస్తు నరునిగా జన్మించినది (1)

( ) పాపమునకు పరిహారము చెల్లించుటకు

( ) మనము ఎంత బలహీనులమో తెలిసికొనుటకు

( ) వడ్రంగి పనిలో ప్రావీణ్యతను సాధించుటకు

6) రక్షణ పొందుటకు, ఒక వ్యక్తి (1)

( ) బైబిలు కోర్సు చదువవలెను.

( ) సంఘములో సభ్యుడై ఉండవలెను.

( ) అన్యభాషలతో మాటలాడవలెను.

( ) దానిని ఒక ఉచిత బహుమానముగా అంగీకరించవలెను.

7) మనము రక్షింపబడినది (1)

( ) మన పుణ్యకార్యములు (సత్రియల) ద్వారా.

( ) కృప ద్వారా.

( ) రక్షింపబడాలనే తపన కలిగియుండుట ద్వారా.

8) పాపక్షమాపణ మరియు అంగీకరణ మనలను (2)

( ) పాపము చేస్తూనే ఉండవచ్చుననే భావనకు నడుపును.

( ) వదులుకున్న సుఖసంతోషముల విషయమై చింతించే భావనకు నడుపును.

( ) సంతోషము మరియు సమాధానమునకు నడుపును.

( ) నిత్యజీవమును గూర్చిన హామీకి నడుపును.

9) విధేయత ఆధారపడి యుండవలసినది (1)

( ) నరకమును గూర్చిన భయము మీద.

( ) స్నేహితుల ఆమోదము కొరకైన తపన మీద.

( ) యేసు నివాస సన్నిధి / ఆయనపై మనకున్న ప్రేమ మీద.

10) క్రైస్తవ సత్ప్రవర్తన, లేదా ఆజ్ఞలు గైకొనుట మనునది, (1)

( ) క్రియల ద్వారా రక్షణ అనే సిద్ధాంతమునకు గుర్తు - లీగలిజమ్.

( ) నిజమైన మారుమనస్సు వలన కలిగిన ఫలములలో ఒకటి.

( ) అంత ప్రాముఖ్యమేమి కాదు.

11) క్రీస్తుతో వివాహము అనునది (1)

( ) సన్యాసుల ఆశ్రమము లేదా మఠములో చేరుటకు గుర్తుగా ఉన్నది.

( ) బాప్తిస్మమునకు గుర్తుగా ఉన్నది.

( ) కుడి చేతికి ధరించిన పెళ్లి ఉంగరమునకు గుర్తుగా ఉన్నది.

( ) బ్రహ్మచర్యమును పాటించుటకు గుర్తుగా ఉన్నది.

12) క్రీస్తుతో ప్రేమలో జీవించుటకు గల రెండు గొప్ప మార్గములేవనగా (2)

( ) అనుదిన బైబిలు ధ్యానము.

( ) ఉదారముగా చందాలిచ్చుట.

( ) పంది మాంసము తినుటను మానివేయుట.

( ) స్థిరమైన ప్రార్ధన మనస్సు.

13) యేసు ప్రభువును నా జీవితములోనికి అంగీకరించి, నూతనజన్మ అనుభవము పొందాలన్నదే నా కోరికయైయున్నది.

( ) అవును.

( ) కాదు.

( ) నేను ఇప్పటికే పొందియున్నాను.