Lesson 22
ప్రతి వివాహం నమ్మకంపై ఆధారపడాలి. అదే విధంగా క్రీస్తుతో మన ఐక్యతలో, మనం కూడా ఆయనకు, ఆయన వాక్యానికి విశ్వాసంగా ఉండాలి. ప్రకటన గ్రంథము క్రీస్తు యొక్క నిజమైన వధువు గురించి మాట్లాడుతుంది, కాని విశ్వాసులను మోహించి దేవుని వాక్యానికి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న వేరొక “స్త్రీ” ఉన్నది. బబులోనుకూలిపోయెను, మరియు ప్రజలు దాని మాయలను తప్పించుకోవాలి లేదా నశించాలి! ఈ విధంగా మూడు దూతల వర్తమానముల రెండవ భాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు ఆధ్యాత్మిక బబులోను యొక్క అద్భుతమైన నిజమైన గుర్తింపును మరియు ఆమె ప్రాణాంతక సౌందర్యము చేతమరలు గొల్పబడకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటారు. అంతకన్నా ముఖ్యమైనది ఏమిటి?
1. ప్రకటన గ్రంథములో యేసు ప్రభువు బబులోను గురించి ఎలా వివరించాడు?
“విస్తార జలముల మీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను.".... “దేవదూషణ నామములతో నిండుకొని, యేదు తలలును పది కొమ్ములును గల ఎఱ్ఱని మృగము మీద కూర్చుండిన యొ స్త్రీని చూచితిని, ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను" (ప్రకటన 17:1, 3-5).
జవాబు : ప్రకటన 17:1-6 లో, బబులోను ఎరుపు మరియు ఊదా రంగు దుస్తులు ధరించిన వేశ్యగా యేసు వర్ణించాడు. ఆమె ఏడు తలలును పది కొమ్ములును గలిగి విస్తార జలముల మీద కూర్చున్న ఎఱ్ఱని మృగము మీద కూర్చొనియున్నది.
2. ప్రకటన 12వ అధ్యాయము లో సాదృశ్యముగా చెప్పబడిన పవిత్రురాలైన స్త్రీ ఎవరు?
జవాబు : సూర్యుని ధరించుకొనియున్న పవిత్రురాలైన స్త్రీ ప్రకటన 12:1-6 లో వర్ణించబడినది. ఈ పవిత్రురాలైన స్త్రీ దేవుని పవిత్రమైన సంఘమునకు గుర్తు అని మనము 20వ స్టడీ గైడ్ పత్రికలో తెలుసుకున్నాము, అది తన భర్త (యజమానుడు) యేసుకు నమ్మకమైనది. మనము 23వ స్టడీ గైడ్ పత్రికలో ప్రకటన 12వ అధ్యాయాన్ని లోతుగా అధ్యయనం చేస్తాము.
3. బైబిల్ ప్రవచనంలో వేశ్య దేనిని సూచిస్తుంది?
"యెరూషలేము చేసిన హేయకృత్యములను దాని తెలియజేయము.” ... "నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, ..... బహుగా వ్యభిచరించుచు వచ్చితివి" (యెహెజ్కేలు 162 15).
జవాబు: పవిత్రురాలైన స్త్రీ యేసుకు విశ్వాసపాత్రమైన పవిత్రమైన సంఘమును సూచిస్తుంది కాబట్టి, అపవిత్రురాలైన స్త్రీ యేసుకు నమ్మకద్రోహమైన అపవిత్రమైన లేదా పతనమైన సంఘమును సూచిస్తుంది (యాకోబు 4:4).
4. ప్రకటన 17వ అధ్యాయము లో “వేశ్యలకు తల్లియైన మహా బబులోను" అని పిలువబడే వేశ్య (సంఘము) ను మనము గుర్తించగలమా?
జవాబు : అవును, తల్లి సంఘమని చెప్పుకునే ఒకే ఒక సంఘమున్నదని, అది రోమన్ కథోలిక్ సంఘమేనన్నది జగమెరిగిన సత్యము. ప్రఖ్యాతిగాంచిన ఒక కథోలిక్ పాదిరి, జాన్.ఎ. ఒబ్రియెన్ ఇలా అన్నారు. “ఆ ఆచారం (ఆదివార ఆచరణ) తల్లి సంఘానికి గుర్తుగా ఉంది, దాని నుండి కథోలిక్లు కాని వర్గాలు విడిపోయారు.”1
తల్లియైన బబులోను గురించి వివరించడానికి ప్రకటన 17లో ఉపయోగించిన అంశాలు మరియు ఆమె కూర్చున్న మృగము పేపసీ (పోపు వ్యవస్థ) కి సరిపోతుంది:
A. ఆమె పరిశుద్ధులను హింసించింది (6వ వచనము). (15 మరియు 20వ స్టడీ గైడ్ పత్రికలు చూడండి.)
B. ఆమె ధూమ్రరక్తవర్ణము గల వస్త్రము ధరించి ఉంది (4వ వచనము). పోపులు తరుచుగా ప్రాముఖ్యమైన కార్యక్రమములకు ఘనమైన ఊదా రంగు గల వస్త్రములు ధరిస్తారు మరియు ఎరుపు అనేది కథోలిక్ అధిపతులు యొక్క వస్త్రాల రంగు.
C. ఆ స్త్రీ కూర్చోనియున్న మృగము యొక్క ఏడు తలలు (3వ వచనము) ఏడు కొండలు (9వ వచనము). పేపసీ (పోపు వ్యవస్థ) యొక్క ప్రధాన కార్యాలయం రోము ఏడు కొండలు లేదా పర్వతాలపై నిర్మించబడినన్నది జగమెరిగిన సత్యము.
D.మృగము దేవదూషణకు పాల్పడింది (3వ వచనము) ఇది పేపసీకి స్పష్టంగా సరిపోతుంది. (15 మరియు 20వ స్టడీ గైడ్ పత్రికలు చూడండి.)
E. ఆమె “భూరాజులనేలెను" (18వ వచనము) 13వ శతాబ్దం నాటికి, పోప్ "కనీసం సిద్ధాంతంలో... తాత్కాలిక మరియు ఆధ్యాత్మిక వ్యవహారాలలో ప్రపంచం మొత్తానికి పాలకుడు" అని అలెగ్జాండర్ ఫ్లిక్ చెప్పారు. ఈ విషయము ఇతర భూసంబంధమైన రాజ్యానికి లేదా ప్రభుత్వానికి సరిపోదు. పేపసీ ప్రకటన 17లో చాలా స్పష్టంగా వివరించబడింది.2
గమనిక : సంఘ సంస్కరణోద్యమమునకు సంబంధించిన చాలా మంది నాయకులు (హస్, వైక్లిఫ్, లూథర్, కాల్విన్, జ్వింగ్లీ, మెలాంక్షన్, క్రాన్మెర్, టిండేల్, లాటిమర్, రిడ్లీ, మరియు తదితరులు) ఇక్కడ చెప్పబడిన అధికార శక్తి పేపసీ అని బోధించిరి.3
5. "బబులోను" అనే పదానికి అక్షరార్ధం ఏమిటి, దాని మూలం ఏమిటి?
“మనము ... ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొందము.” ... "అప్పుడు యెహోవా ... మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. “దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ... ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను (ఆదికాండము 11:4, 6, 7, 9).
జవాబు : "బాబెలు" మరియు "బబులోను" అనే పదాలకు "తారుమారు" అని అర్ధము. బబులోను అనే పేరు బాబేలు గోపురము వద్ద నిర్మించబడింది, ఇది జలప్రళయము తరువాత ఎంతటి వరద నీరైనను ముంచి వేయకుండునంత పెద్ద ఎత్తుగల గోపురము కట్టనుద్దేశించిన తిరుగుబాటు స్వభావము గల విగ్రహారాధికుల చేత నిర్మించబడినది (4వ వచనము). అయితే దేవుడు వారి భాషను తారుమారు చేసెను. ఫలితంగా ఏర్పడిన గందరగోళం చాలా గొప్పది, వారు నిర్మాణాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అప్పుడు వారు ఆ గోపురమును "బాబెలు" (బబులోను), "లేదా "తారుమారు" అని పిలిచిరి. అటు తరువాత, పాత నిబంధన రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా అన్యమత రాజ్యంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు శత్రుదేశమైన బబులోను అనే పేరు వచ్చింది. ఇది తిరుగుబాటు, అవిధేయత, దేవుని ప్రజలను హింసించడం, అహంకారం మరియు విగ్రహారాధనను కలిగి ఉంది (యిర్మీయా 39:6, 7; 50:29, 31-34; 51:24, 34, 47; దానియేలు 3 మరియు 5 అధ్యాయములు) వాస్తవానికి, యెషయా 14వ అధ్యాయము లో దేవుడు బబులోనును సాతానుకు గుర్తుగా ఉపయోగిస్తాడు, ఎందుకనగా బబులోను దేవుని పనికి మరియు ఆయన ప్రజలకు విరోధముగా మరియు అడ్డంకుగా ఉండెను. క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో, "బబులోను" అనే పదాన్ని ఆయన సంఘమైన దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు శత్రువు అయిన మత రాజ్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు (ప్రకటన 14:8; 16:19).
6. ప్రకటన 17:5 లో వర్ణించబడిన తల్లియైన బబులోను యొక్క వేశ్య కుమార్తెలు ఎవరు?
జవాబు : వీరు తల్లి బబులోను యొక్క తప్పుడు బోధలను నిరసిస్తూ, గొప్ప ప్రొటెస్టంట్ సంస్కరణల సమయంలో ఆమెను విడిచిపెట్టిన కొన్ని సంఘములు. కానీ తరువాత వారు తల్లి యొక్క సూత్రాలను మరియు చర్యలను అనుకరించడం ప్రారంభించారు మరియు తద్వారా వారు పడిపోయారు. ఏ స్త్రీ పుట్టుకతోనే వేశ్యకాదు. అదే విధముగా సాదృశ్యపర్చబడిన ప్రొటెస్టెంట్ కుమార్తెలు (సంఘములు) కూడ పుట్టుకతోనే పతనమైనవి కావు, బబులోను యొక్క తప్పుడు సిద్ధాంతాలు మరియు ఆచారములను బోధించే మరియు అనుసరించే ఏ సంఘమైనను లేదా సంస్థయైనను పతనమైన సంఘము లేదా కుమార్తె కావచ్చు. కాబట్టి బబులోను అనేది తల్లి సంఘము మరియు పతనమైన దాని కుమార్తెలు కూడా పడిపోయిన కుటుంబ నామము.
7. ప్రకటన 17 లో, తల్లి బబులోను మృగము మీద కూర్చుండినట్టుగా ఎందుకు చిత్రీకరించబడింది? మృగము దేనిని సూచిస్తుంది?
జవాబు : ప్రకటన 13:1-7 లో యేసు ప్రభువు పేపసీని సంఘము మత-రాజకీయ కలయికగా చిత్రీకరించాడు. (మరింత సమాచారం కొరకు, 20వ స్టడీగైడ్ పత్రిక చూడండి). ప్రకటన 17వ అధ్యాయము లో, యేసు ప్రభువు సంఘము (వేశ్యను) మరియు రాజ్యాధికారము (మృగమును) ప్రత్యేకమైన సంస్థలుగా వర్ణించాడు. స్త్రీ మృగము మీద ఇరువైపులా కాలుమోపి కూర్చున్నది. ఇది సంఘము రాజ్యాధికార నియంత్రణలో ఉందని సూచిస్తుంది.
8. అంత్య-కాల సంఘటనలను నెరవేర్చడంలో పేపసీతో ఏ ఇతర అధికార శక్తులు ఏకం అవుతాయి?
"మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని బయలు వెళ్లెను" (ప్రకటన 16:13, 14).
జవాబు : ప్రకటన 12:3, 4 లో చెప్పబడిన క్రూరమృగము మరియు ప్రకటన 13:11-14; 19:20 లో చెప్పబడిన అబద్ధ ప్రవక్త ప్రకటన 13:1-8 లో చెప్పబడిన మృగము లేదా పేపసీతో సంబంధం పెట్టుకుంటారు.
A. ప్రకటన 12 లోని ఘటసర్పము అన్యమత రోమా ద్వారా ద్వారా పనిచేసే సాతానును సూచిస్తుంది. (మరిన్ని వివరముల కొరకు 20వ స్టడీగైడ్ పత్రిక చూడండి). ఈ అంత్యదినములలో అపవిత్ర భాగస్వామ్యంలో ఇస్లాం, బౌద్ధమతం, షింటోయిజం, హిందూ మతం, నూతన యుగం, లౌకిక మానవవాదం మొదలైన క్రైస్తవేతర మతాలు ఉన్నాయి.
B. అబద్ధ ప్రవక్త అమెరికా దేశములో కేంద్రీకృతమై ఉన్న మతభ్రష్టత్వ ప్రొటెస్టెంట్ వాదమును సూచించును. ఇది మృగం యొక్క ప్రపంచవ్యాప్త ఆరాధనను ప్రోత్సహించడంలో ముందుంటుంది (21వ స్టడీగైడ్ పత్రిక చూడండి).
C. మృగము పేపసీకి గుర్తుగా ఉన్నది (20వ స్టడీగైడ్ పత్రిక చూడండి).
D. ఈ మూడు అధికార శక్తులు : క్రైస్తవేతర మతములు మరియు ప్రభుత్వములు, రోమన్ కథోలిక్కు మతము, మరియు మత భ్రత్వష్ట ప్రొటెస్టెంట్ వాదములు దేవునికి, ఆయన ధర్మశాస్త్రమునకు, మరియు ఆయన నమ్మకమైన అనుచరులకు వ్యతిరేకంగా జరుగు అంతిమ యుద్ధమైన హర్మెగిద్దోనులో మిత్రులుగా ఏకమగుదురు. ఈ అధికార కూటమిని యేసు ప్రభువు ప్రకటన 18:2 లో "మహా బబులోను" అని పిలుస్తారు.
9. ఇటువంటి విభిన్న చరిత్రలు కలిగిన సంస్థలు ఎలా సమర్థవంతంగా ఏకం అవుతాయి?
"వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు" (ప్రకటన 17:13).
జవాబు : ప్రకటన 16:13, 14 లోని "కప్పల వంటి అపవిత్రాత్మలు" అనగా "దయ్యముల ఆత్మలు" చేయు సూచక క్రియలద్వారా వారిని ఏకం చేస్తాయి. ఆత్మల వాదము - చనిపోయినవారు సజీవంగా ఉన్నారని మరియు జీవించి ఉన్నవారిని సంప్రదించగలరనే నమ్మకం అందరినీ కలిపి ఉంచే సిద్ధాంతం. సాతాను మరియు అతని దూతలు మృతులైన ప్రియుల ఆత్మలుగా, పురాతన ప్రవక్తలుగా, పరలోక దేవదూతలుగా (2 కొరింథీయులకు 11:13, 14), మరియు క్రీస్తు వలె వేషము ధరించుకొని (మత్తయి 24:24) ప్రపంచమును ఎంతగా ఒప్పించెదరంటే వారు సాక్ష్యాత్తు పరలోకము నుండి పంపబడినవారని నమ్మించెదరు (10వ స్టడీగైడ్ పత్రిక చూడండి). యాదృచ్ఛికంగా, మూడు సంస్థలు చనిపోయినవారు సజీవంగా ఉన్నారని నమ్ముతారు:
A.క్యాథలిక్కులుమరియను మరియు ఇతర మరణించిన పరిశుద్ధులను ప్రార్ధించుచు ఈ పరిశుద్ధులు తమ అనుచరులను అద్భుతాలతో ఆశీర్వదిస్తారని నమ్ముతారు.
B.క్రైస్తవేతర మతములుఅధికంగా చనిపోయినవారి ఆత్మలపై నమ్మకం మరియు ఆరాధనపై ఆధారపడి ఉంటాయి. క్రొత్త యుగం “మృతులతో సంభాషణ” మరణించిన వారి ఆత్మలతో మాట్లాడవచ్చుననే నమ్మకమును నొక్కి చెబుతుంది.
C. భ్రష్టత్వము చెందిన ప్రొటెస్టెంటులు చనిపోయినవారు చనిపోలేదని, వారు, పరలోకము లేదా నరకములో సజీవంగా ఉన్నారని నమ్ముతారు. అందువల్ల వారు మృతుల ఆత్మల వేషమును ధరించుకొను దయ్యములచే మోసానికి గురవుతారు.
10. దేవుడు ఏ పాపముల నిమిత్తము బబులోనును నిందించుచున్నాడు?
“మహాబబులోను కూలిపోయెను" (ప్రకటన 18:2). "అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, ... ఆయెను."... "జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి" (ప్రకటన 18:2, 23). "భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి."... "ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రలో" మత్తులైరి (ప్రకటన 17:2, 4, 18:3). "భూరాజులు దానితో వ్యభిచరించిరి" (ప్రకటన 18:3)
జవాబు : కూలిపోవుట లేదా పతనమగుట అనగా బైబిల్ సత్యం మరియు నిజమైన దేవుని ఆరాధన నుండి తప్పుకోవడం (2 పేతురు 3:17, 18). ఈ విధంగా, దేవుడు బబులోనును (1) దెయ్యాలతో సంభాషణ ద్వారా ఆత్మలను ఆహ్వానించడం ద్వారా మరియు (2) అబద్ధం, దెయ్యాల ఆత్మలతో సంభాషణ ద్వారా వాస్తవంగా ప్రపంచం మొత్తాన్ని మోసం చేసినందుకు నేరారోపణ చేస్తున్నాడు. అబద్ధాలు బైబిల్లో ఒక రకమైన అసహ్య కార్యములు (సామెతలు 12:22). భూనివాసులు బబులోను యొక్క వ్యభిచార మధ్యములో మత్తులైరి, వారు ఆమె సువర్ణ పాత్రలోని ఏహ్యమైన కార్యములలోను వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను ఆధ్యాత్మికంగా మత్తులైరి. దీనికి విరుద్ధంగా, సంఘము క్రీస్తు వధువుగా (ప్రకటన 19:7, 8) ఆయనను ప్రేమిస్తుంది మరియు ఆయనకు మాత్రమే విధేయత చూపిస్తుంది - యేసు దీనర్థం ఆయన ఆజ్ఞలను పాటించడం అని చెప్పాడు (యోహాను 14:15). అందువల్ల, తన భర్త యేసు (యాకోబు 4:4) నుండి వైదొలిగినందుకు మరియు తన మద్దతు కొరకు పౌర ప్రభుత్వాలతో (మత-రాజకీయ కలయికతో) అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నందుకు ఇక్కడ పేపసీ నిందించబడింది. అదనంగా, "మనుష్యుల ప్రాణములను" బబులోను అక్రమ రవాణా చేసి (ప్రకటన 18:11-13), తద్వారా, దేవుని ప్రశస్తమైన పిల్లలుగా కాకుండా ప్రజలను వ్యాపార వస్తువులుగా భావించినందుకు దేవుడు బబులోనును ఖండించాడు.
11. ప్రజలను ఆధ్యాత్మికముగా మత్తులను చేసి గందరగోళానికి గురిచేసే బబులోను మద్యములో ఉన్న కొన్ని తప్పుడు అబద్ధ బోధలు ఏమిటి?
జవాబు : ఆశ్చర్యకరంగా, నేడు ప్రొటెస్టంటుల యొక్క కొన్ని ప్రముఖ సిద్ధాంతాలు బైబిల్లో కనిపించవు. వాటిని ప్రొటెస్టంట్ సంఘములలోకి రోమ్ యొక్క తల్లి సంఘము తీసుకువచ్చింది, వారు అన్యమతవాదం నుండి స్వీకరించారు. ఈ తప్పుడు బోధలలో కొన్ని:
A. దేవుని ధర్మశాస్త్రము సవరించబడినది లేదా రద్దు చేయబడింది. దేవుని ధర్మశాస్త్రము ఎప్పటికీ మార్చబడదు లేదా రద్దు చేయబడదు (లూకా 16:17). ఈ సత్యం యొక్క శక్తివంతమైన సాక్ష్యం కొరకు 6వ స్టడీగైడ్ పత్రిక చూడండి.
B. ఆత్మకు అమరత్వమున్నది. బైబిలు "ప్రాణము" మరియు "ఆత్మ" అనే మాటలను దాదాపు 1,000 సార్లు ప్రస్తావించింది. వాడబడిన ఏ చోటను ఆత్మకు అమరత్వమున్నట్లు చెప్పబడలేదు. ప్రజలు మర్యులు (యోబు 4:17), మరియు యేసు ప్రభువు రెండవ రాకడ వచ్చేంత వరకు ఎవరికీ అమరత్వం లభించదు. (1 కొరింథీయులకు 15:51-54) (మరింత సమాచారము కొరకు 10వ స్టడీగైడ్ పత్రిక చూడండి).
C.పాపులు శాశ్వతముగా నరకములో కాలుదురు.పాపులు ఆత్మ మరియు దేహముతో సహా నరకాగ్నిలో ఉనికిలో లేకుండ పూర్తిగా దహించివేయబడుదురు అని బైబిలు చెప్పుచున్నది (మత్తయి 10:28). చిత్రయాతనతో కూడిన నిత్య నరకము బైబిల్లో బోధించబడలేదు. (మరిన్ని వివరముల కొరకు 11వ స్టడీ గైడ్ చూడండి).
D.నీటిలో ముంచి లేపే పద్ధతి ద్వారా బాప్తిస్మం అవసరం లేదు.నీటిలో ముంచి లేపే పద్ధతి ద్వారా బాప్తిస్మం అనేది లేఖనం గుర్తించిన ఏకైక బాప్తిస్మం, (మరింత సమాచారం కొరకు 9వ స్టడీ గైడ్ పత్రిక చూడండి.)
E. ఆదివారం దేవుని పరిశుద్ధ దినం. దేవుని పరిశుద్ధ దినం ఏడవ దిన విశ్రాంతిదినం -శనివారం అని బైబిల్ బోధిస్తుంది. (వివరాల కొరకు, 7వ స్టడీ గైడ్ పత్రిక చూడండి.)
గమనిక: ఈ అబద్ద బోధలను ఒక్కసారి నమ్మినట్లయితే, అది "తారుమారు (తికమక)" కలుగజేస్తుంది (ఇది "బబులోను" అనే పదానికి అక్షరార్థం) మరియు లేఖనమును అర్థం చేసుకోవడం చాలా కష్టతరం చేస్తుంది.
ఒక హుందాగా ఉన్న ఆలోచన
కొందరు తెలియకుండానే బబులోను మద్యమును తాగుతున్నారని అనుకోవడం చాలా హుందాగా ఉంది. బహుశా ఇదంతా మీకు క్రొత్తగా అనిపించవచ్చును. అలా అయితే, మీకు మార్గనిర్దేశం చేయమని దేవుణ్ణి అడగండి (మత్తయి 7:7, 8). అప్పుడు లేఖనాలను పరిశోధించండి (అపొస్తలుల కార్యములు 17:11). యేసు నడిపించు మార్గమును మీరు అనుసరిస్తారని ప్రమాణము చేయండి అప్పుడు ఆయన మిమ్మల్ని అబద్ధములో విడిచిపెట్టబడకుండ ఆయనే నిన్ను కాపాడును (యోహాను 7:17).
12. హార్ మెగిద్దోనను యుద్ధములో ప్రభువు పక్షాన ఎవరు ఉంటారు?
జవాబు : ఈ అంతిమ యుద్ధములో, పరలోకపు దేవదూతలు (హెబ్రీయులకు 1:13, 14; మత్తయి 13:41, 42) మరియు దేవుని శేషించిన ప్రజలు - (ప్రకటన 12:17) - సాతాను మరియు అతని సహకారులకు విరోధముగా పరలోక సైన్యములను (ప్రకటన 19:11-16) నడిపించు యేసు పక్షమున చేరెదరు. దేవుని శేషించిన ప్రజలలో బబులోను యొక్క అసత్య సిద్ధాంతములను తిరస్కరించినవారు ఉండెదరు (23వ స్టడీగైడ్ పత్రిక చూడండి) వారు : (1) యేసును ప్రేమిస్తారు. (1 యోహాను 5:2, 3), (2) ఆయన పట్ల విధేయత మరియు విశ్వాసం చూపిస్తారు. (ప్రకటన 14:12), మరియు (3) ఆయన వాక్యానికి, ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు. (ప్రకటన 12:17; యోహాను 8:31, 32).
13. దేవుని సత్యం మరియు సాతానుడి అబద్ధాల మధ్య ఈ అంతిమ సంఘర్షణలో సాతానుడి వ్యూహం ఏమిటి?
జవాబు : సాతానుడు దేవుణ్ణి మరియు ఆయన కుమారుని ద్వేషిస్తున్నప్పటికీ, అతడు దానిని బయటకు ఒప్పుకొనడు. వాస్తవానికి, అతడు మరియు అతని దయ్యములు పరిశుద్ధ దేవదూతలుగా మరియు సద్భక్తి గలిగిన క్రైస్తవ పాదిరిలుగా వేషము ధరించుకొందురు (2 కొరింథీయులకు 11:13-15). తన పక్షమున అతడు చూపించే ఋజువు ఎంత నీతి గలదిగా, ఆధ్యాత్మికమైనదిగా, మరియు యేసును పోలినట్లుగా ఉండునంటే తద్వారా దాదాపుగా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ మోసపోతారు మరియు అతనిని అనుసరిస్తారు (మత్తయి 24:24). అరణ్యంలో యేసును శోధించినప్పుడు ఉపయోగించినట్టుగా అతడు బైబిలును ఉపయోగిస్తాడు (మత్తయి 4:1-11). సాతానుని కుయుక్తి ఎంత ప్రభావితమైనదంటే అది మూడవ వంతు మంది దేవదూతలను, ఆదాము హవ్వలను, మరియు (జలప్రళయ సమయంలో, ఎనిమిది మంది మినహా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని మోసగించింది.
14. దేవుని ప్రతి వ్యూహం ఏమిటి?
"ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు" (యెషయా 8:20).
జవాబు : దేవుడు ఎల్లప్పుడూ సాతాను అబద్ధాలను సత్యంతో ఎదుర్కుంటారు. అరణ్యంలో సాతాను శోధించినప్పుడు, యేసు పదేపదే లేఖనాన్ని ఉటంకించాడు (మత్తయి 4:1-11). దేవుడు తన శేషించిన ప్రజల ద్వారా, దేవుడు మహాబబులోను యొక్క బైబిలు సంబంధము కాని స్వభావమును గూర్చిన సత్యమును వెల్లడించును. బబులోను కోట్ల మంది మోసగించబడి నశించి పోవుటకు యెడముగా ద్వారమును తెరచిన ఒక అబద్ధ సువార్తను (గలతీయులకు 1:8-12) ప్రకటించుచున్నదని ఆయన స్పష్టము చేయును. దేవుని ఎదురు ఉద్యమము ప్రకటన 14:6-14 లో ఇయ్యబడిన మహా త్రిదూత వర్తమానములలో వివరించబడింది, వీటిని మనము 27 స్టడీ గైడ్ పత్రికల్లో ఈ వరుస క్రమములోని తొమ్మిది స్టడీ గైడ్ పత్రికల్లో పరిశీలించుచున్నాము. ఈ మూడు అద్భుతమైన వర్తమానములు సాతానుడి అబద్ధాలు మరియు నకిలీలకు వ్యతిరేకంగా హెచ్చరించి దేవుణ్ణి ఆత్మతోనే కాదు, బైబిలు సత్యముతో కూడా ఆరాధించమని మరియు ఆయనకు విధేయత చూపమని ప్రజలను పిలుస్తాయి.
15. హెచ్చరిక మరియు నిరీక్షణతో కూడిన దేవుని అంత్యకాల వర్తమానములు ప్రభావవంతంగా ఉంటాయా?
“అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను" (ప్రకటన 18:1).
జవాబు : లేఖనంలో, దేవదూతలు దూతలను లేదా వర్తమానాలను సూచిస్తారు (హెబ్రీయులకు 1:13, 14). దేవుని అంత్యకాల మనవి ఒక శక్తివంతమైన దేవదూత చేత సూచించబడింది. అతని శక్తి ఎంత గొప్పదిగా ఉండునంటే లోకమంతయు దేవుని సత్యము మరియు మహిమ చేత వెలిగించబడుతుంది. ఈ అంతిమ, దైవానుగ్రహ వర్తమానము లోకమందున్న నివాసులందరికి ప్రకటింపబడుతుంది (ప్రకటన 14:6; మార్కు 16:15; మత్తయి 24:14).
16. బబులోనులో ఉన్న వారికి యేసు ప్రభువు ఏ చివరి, అత్యవసర విజ్ఞప్తి చేస్తున్నాడు?
జవాబు : ఆయన ఇలా అంటాడు, "నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు" (ప్రకటన 18:4, 5). యేసు ప్రభువు బబులోనులోని చాలా మందిని "నా ప్రజలు" అని సూచిస్తున్నారని దయచేసి గమనించండి. ఈ హెచ్చరిక వర్తమానమును ఇంకా వినని లక్షలాది మంది నిజాయితీగల క్రైస్తవులు బబులోనులో ఉన్నారు. ఈ ప్రజలు ప్రభువును అత్యున్నతముగా ప్రేమించువారు, వారు తన బిడ్డలని యేసు ప్రభువు చెప్పాడు.
17. యేసును ప్రేమిస్తున్న కాని ఇప్పుడు బబులోనులో ఉన్న ప్రజలు బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి విన్నప్పుడు వారు ఎలా స్పందిస్తారు?
జవాబు : యేసు ఇలా అంటాడు. "ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును."... "నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి సన్ను వెంబడించును" (యోహాను 10:16, 27). యేసు బబులోనులో ఉన్న తన బిడ్డలను గుర్తించాడు. ఇంకా, బబులోను నాశనమయ్యే ముందు వారిని పిలుస్తానని వాగ్దానం చేశాడు. మరియు అన్నిటికంటే మహిమాన్వితమైన విషయమేమిటనగా, ఇంకా బబులోనులో ఉన్న తన ప్రజలు తన స్వరాన్ని వింటారని మరియు గుర్తించి భద్రతకు వస్తారని వాగ్దానం చేశాడు.
గమనిక : ప్రకటన 14:6-14 లోని త్రిదూత వర్తమానములపై చర్చించే మా తొమ్మిది వరుస స్టడీ గైడ్ పత్రికల్లో ఇది ఏడవ స్టడీగైడ్ పత్రిక. మా తదుపరి స్టడీ గైడ్ పత్రిక దేవుని అంత్యకాల సంఘము గురించి ఎంత స్పష్టముగా వివరించునంటే, మీరు దానిని గుర్తించడంలో విఫలం కాలేరు.
18. నీవు బబులోనులో ఉండిన యెడల, దానిని విడిచి బయటకు రావాలనే యేసు ప్రభువు అత్యవసర విజ్ఞప్తిని నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. నేను బబులోనులో ఉండి, విడిచి బయటకు రావడానికి బదులు దానిని సరిదిద్దడానికి ప్రయత్నించకూడదా?
జవాబు : లేదు. బబులోను సరిదిద్దబడలేదు గాని నాశనమవుతుందని యేసు చెప్పాడు. అది పూర్తిగా దాని మద్యములో (ప్రకటన 18:5, 6 ప్రకారము అసత్య సిద్ధాంతములో) మత్తిల్లినది. ఈ కారణము చేతనే ఆయన తన ప్రజలను బయటకు రండని పిలుచుచున్నాడు (ప్రకటన 18:4).
2. ప్రకటన 16:12 లో చెప్పబడిన తూర్పు రాజులు ఎవరు?
జవాబు : తూర్పు రాజులెవరనగా పరలోకపు రాజులు (తండ్రి మరియు కుమారుడు). వారు తూర్పు రాజులు పిలువబడుచున్నారు, ఎందుకనగా పరలోకపు వాసులు భూమిని సమీపించే దిశ ఇది. ఉదాహరణకు, క్రింది వాటిని గమనించండి :
- యేసు ప్రభువు రెండవ రాకడ తూర్పు దిక్కు నుండి వచ్చును (మత్తయి 24:27).
- దేవుని మహిమ తూర్పు దిక్కు నుండి వచ్చును (యెహెజ్కేలు 43:2).
- ప్రకటన గ్రంథములో చెప్పబడిన ముద్రించే దేవదూత తూర్పు దిక్కు నుండి వచ్చును (ప్రకటన 7:2).
- యేసు ప్రభువుకు గుర్తుగా ఉన్న సూర్యుడు తూర్పున ఉదయించును (మలాకీ 4:2)
3. బబులోను పతనం గురించి హెచ్చరిక బబులోను ఎప్పుడూ పడిపోలేదని సూచిస్తుందా?
జవాబు : అవును, నిజమే! బబులోనుతో కూడిన అనేక సంఘములు గతములో యేసు ప్రభువుకు ఎంతో నమ్మకముగా, దృఢముగా మరియు విధేయతగా ఉన్నాయి. వాటి వ్యవస్థాపకులు దేవునికి ఎంతో ఒద్దికగలవారై యుండి బైబిలు సత్యమంతటిని కనుగొనుటకు శ్రద్ధతో దానిని పరిశోధించుచుండిరి. నేడు అన్ని సంఘములు పతనము కాలేదు. ఏది ఏమైనప్పటికి, తల్లి బబులోను యొక్క తప్పుడు సిద్ధాంతాలను బోధించే మరియు దాని పద్ధతులను అనుసరించే ఏ సంఘమైనను దాని పతనమైన, పడిపోయిన కుమార్తెలలో ఒకరు కావచ్చు.
4. బబులోనులో నుండి బయటకు పిలిచినప్పుడు, ఒక క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళవలెను?
జవాబు : దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసును గూర్చి విశ్వాసము కలిగి, ప్రపంచవ్యాప్తముగా మూడు దూతల వర్తమానములను ప్రకటించువారిని కనుగొని వారితో చేరండి (ప్రకటన 14:6-12). 23వ స్టడీగైడ్ పత్రిక అంత్యదినములలో దేవుని సంఘాన్ని పూర్తిగా వివరిస్తుంది.
5. ప్రకటన 17:12-16 లో చెప్పబడిన 10 మంది రాజులు దేనిని సూచిస్తారు?
జవాబు : 10 మంది రాజులు ప్రపంచ దేశములకు గుర్తు. దానియేలు 2వ అధ్యాయములోని ప్రతిమ పాదముల యొక్క పది వ్రేళ్ళు మరియు దానియేలు 7వ అధ్యాయములోని భయంకరమైన మృగము యొక్క పది కొమ్ములు ఐరోపాలోని 10 రాజ్యాలను సూచిస్తాయి. ఏది ఏమయినప్పటికీ, ప్రకటన 11 నుండి 18 అధ్యాయములలో “భూరాజులందరు" లేదా "సమస్తమైన జనములు (అన్ని దేశములు)" అని దీని అర్థం విస్తరించబడింది. (ప్రకటన 16:14, 18:3 చూడండి.)
6. ప్రకటన 16:13,14 లో “కప్పలు" అని వాడబడిన సాదృశ్యం యొక్క అర్థమేమిటి?
జవాబు : ఒక కప్ప తన ఎరను తన నాలుకతో బంధిస్తుంది, ఇది నేడు ఈ ప్రపంచమును ముంచెత్తుచున్న అన్యభాషలు మాట్లాడే వరమునకు విరుద్ధబోధయై యుండవచ్చును. సూచక క్రియలు, అన్యభాషలు మాట్లాడే వరముతో సహా, అద్భుతాలు ఒక విషయం మాత్రమే నిరూపిస్తాయని దయచేసి గుర్తుంచుకోండి - అదే ప్రకృతికి అతీతమైన శక్తి. కాని బైబిలు ప్రకృతికి అతీతమైన శక్తి దేవుని నుండి లేదా సాతాను నుండి కూడ వచ్చునని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సాతానుడు, పరలోక వెలుగుదూత వేషము ధరించుకొని (2 కొరింథీయులకు 11:13-15) ప్రకృతికి అతీతమైన సూచక క్రియలను అద్భుతాలను ఎంత సమర్థవంతంగా ఉపయోగించునంటే దాదాపుగా ప్రపంచమంతయు మోసగింపబడి అతనిని వెంబడించును (ప్రకటన 13:3). ప్రస్తుతము, అతడు అన్ని విధములైన సంఘములు మరియు మతములను కలిపేందుకు అన్యభాషలతో మాట్లాడే వరమునకు నకిలీ బోధను ఉపయోగిస్తున్నాడు. వీటిలో ప్రతి ఒక్కటి అన్యభాషలతో మాట్లాడే వరము ప్రామాణికతకు ఋజువుగా అని భావిస్తుంది.
మనము ఆత్మలను పరీక్షించవలెను
బైబిల్ మనం ఆత్మలను పరీక్షించాలని హెచ్చరిస్తుంది (1 యోహాను 4:1). వారు బైబిలుతో ఏకీభవించకపోతే, వారు అబద్ధ బోధకులు (యెషయా 8:19, 20). అంతేకాక, దేవుని పరిశుద్ధాత్మ యొక్క నిజమైన పరములు ఉద్దేశపూర్వకంగా మరియు తెలిసి దేవునికి అవిధేయత చూపేవారికి ఇవ్వబడవు (అపొస్తలుల కార్యములు 5:32). అన్యభాషలు మాట్లాడే నిజమైన వరమొకటి కలదు. ఇది ప్రసంగీకుడు. మునుపెన్నడూ ఎరుగని, నేర్చుకొనని అన్యభాషలను అనర్గళముగా, స్పష్టముగా, అద్భుతరీతిలో మాట్లాడగలుగుట (అపొస్తలుల కార్యములు 2:4-12). దేవుడు తన అంత్య-కాల వర్తమానము ఇతర భాషల వారికి అందించడానికి అవసరమైనప్పుడు ఈ వరమును ఉపయోగిస్తాడు. పెంతెకొస్తు దినమందు ఇది అవసరమైంది ఎందుకనగా 17 భాషల సమూహాల ప్రజలు ఆ గుంపులో ఉన్నారు మరియు ఆయన శిష్యులకు ఆ భాషలన్నీ తెలియదు.
7. మంచి మరియు చెడుల మధ్య జరిగే చివరి అంత్య-కాల సంఘర్షణలో నూతన యుగ ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందా?
జవాబు : సందేహం లేకుండా! ఇది క్షుద్ర, మానసిక దృగ్విషయం, ఆత్మలతో సంభాషణ (వశీకరణ విద్య), మరియు ఆత్మల వాదముతో బలముగా నిండియుండును - ఆత్మల వాదము (మృతుల ఆత్మలతో సంభాషించ వచ్చుననే నమ్మకము) ఖచ్చితముగా భూమి యొక్క అంతిమ నాటకములో ఒక ప్రధాన పాత్ర పోషించును. అన్యభాషలతో మాట్లాడే నకిలీ వరము ప్రపంచవ్యాప్తమైన సంఘముల సంకీర్ణంతో అనుబంధంగా, ఆత్మల వాదము ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంది. ఆత్మలతో సంభాషణ మరియు పునర్జన్మ అనే నూతన యుగ నమ్మకం మరేదో కాదు క్రొత్త ముసుగులో ఉన్న పురాతన అన్యమతవాద సిద్ధాంతము. అమర్త్యమైన, మరణించని ఆత్మ భూప్రజలతో సంభాషించుననే దాని నమ్మకము, ఏదెనులో హవ్వతో సాతాను ఆడిన అదే మొట్టమొదటి అబద్ధం : "మీరు చావనే చావరు" (ఆదికాండము 3:4), (మరణము అనే అంశంపై మరిన్ని వివరాలకై 10వ స్టడీగైడ్ పత్రిక చూడండి).
8. దానియేలు 7వ అధ్యాయం మరియు ప్రకటన 13, 17, మరియు 18వ అధ్యాయాలలో క్రీస్తువిరోధి లేదా పేపసీ యొక్క కార్యకలాపాలను దేవుడు వెల్లడిస్తున్నాడని స్పష్టమవుతుంది. క్రీస్తువిరోధి లేఖనములో మరెక్కడైనా ప్రస్తావించబడినాడా?
జవాబు : అవును, మృగము లేదా క్రీస్తువిరోధి శక్తి (లేదా దాని కార్యకలాపాలు) పాత మరియు క్రొత్త నిబంధనలలో కనీసం తొమ్మిది ప్రవచనాలలో సూచించబడుతుంది : దానియేలు 7; దానియేలు 8, 9; దానియేలు 11; ప్రకటన 12; ప్రకటన 13; ప్రకటన 16; ప్రకటన 17; ప్రకటన 18; ప్రకటన 19. నిశ్చయంగా, దేవుడు ఒకే శక్తిని తొమ్మిది వేర్వేరు సార్లు నొక్కిచెప్పినప్పుడు, మనం వినాలని ఆయన కోరుకుంటాడు!
9. "బబులోను” అని పిలువబడే సాతాను రాజ్యం బాబేలు గోపురము వద్ద ఉద్భవించిందా?
జవాబు : లేదు. సాతాను పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఇది పుట్టింది. వాస్తవానికి ప్రవక్త యెషయా లూసిఫర్ను అతని పతన సమయంలో రాజుగా వర్ణించాడు. (యెషయా 14:4; 12-15). పాపం ప్రారంభం నుండే దేవుడు సాతాను రాజ్యాన్ని బబులోనుగా చూశాడు. దేవుని రాజ్యాన్ని తుడిచిపెట్టడం మరియు తన స్వంత రాజ్యాన్ని స్థాపించడం సాతాను యొక్క లక్ష్యం. రెండే మార్గములున్నవని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 7:13, 14). భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి చివరికి యేసు ప్రభువు పక్షమున లేదా బబులోను పక్షమున నిలిచెదరు. అది జీవనమరణములకు సంబంధించిన విషయము. ఎవరైతే యేసు ప్రభువుకు సేవించి ఆయనకు సహకరించెదరో వారు ఆయన పరలోక రాజ్యములో రక్షింపబడుదురు. బబులోనుకు మద్దతు ఇచ్చే వారు నాశనమవుతారు. మరియు నిర్ణయం తీసుకోవడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. అందుకే బబులోనుకు వ్యతిరేకంగా యేసు ప్రభువు చేయుచున్న అంత్యకాల హెచ్చరికను పాటించడం చాలా కీలకమైనది మరియు అత్యవసరం.
10. ప్రకటన 16:12 లో, తూర్పు రాజులకు మార్గం సిద్ధం చేయడానికి యూఫ్రటీసు నది జలము ఆరిపోవుట అంటే ఏమిటి?
జవాబు : పురాతన బబులోను సామ్రాజ్యము మాదీయ రాజ్యపు సైన్యాధిపతియగు ధర్యావేషు చేత పట్టబడుటకు ముందు పట్టణము యొక్క గోడల క్రింద భాగమున ప్రవహించిన యూఫ్రటీసు నది జలము, మనుష్యులచేత కట్టబడిన కాలువలోనికి మళ్లించారు. ఇలా నీటిని మళ్లించటము ద్వారా దర్యావేషు మరియు అతని సైన్యము ఎండిపోయి ఆరిపోయిన ఖాళీనది గుండా గోడల యొక్క అడుగుభాగములో నుండి ప్రవేశించి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతించింది. ప్రకటన యొక్క ప్రవచనాలలో, "జలము (నీరు)” ప్రజలను సూచిస్తుంది (ప్రకటన 17:15). ఈ విధంగా, యూఫ్రటీసు నది జలాలు "మహా బబులోను" అనుచరులను సూచిస్తాయి, దానిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వారు బబులోనుకు వ్యతిరేకంగా మారినప్పుడు వారి మద్దతు ఎండిపోయి ఆరిపోతుంది (ప్రకటన 17:16).
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) "బబులోను” అనే పదానికి ఏమిటి? (1)
( ) తారుమారు.
( ) తిరుగుబాటు.
( ) మోసగాడు.
2) బైబిలు ప్రవచనంలో తల్లి బబులోను ఎవరిని సూచిస్తుంది? (1)
( ) ఐక్యరాజ్యసమితి.
( ) పోపుల వ్యవస్థ (పేపసీ).
( ) యేసు తల్లి మరియ.
3) తల్లి బబులోను కుమార్తెలు ఎవరు? (1)
( ) క్రొత్త నిబంధన స్త్రీలు - ప్రిస్కిల్ల, ఎలీసబెతు, దొర్కా అనువారు.
( ) ఐరోపా మహారాణులు.
( ) తల్లి బబులోను యొక్క తప్పుడు సిద్ధాంతాలు మరియు ఆచారాలను అనుసరించే సంఘాలు.
4) ఎఱ్ఱని మృగము మీద కూర్చున్న తల్లి బబులోను దేనిని సూచిస్తుంది? (1)
( ) దీనికి దగ్గరగా మద్దతు ఇచ్చే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంఘము.
( ) మహిళలు మంచి జంతు శిక్షకులు అవుతారు.
( ) మహిళలు కూర్చోవాలి, నడవకూడదు.
5) బబులోను యొక్క ఏ తప్పుడు సిద్ధాంతాలు ప్రజలను ఆధ్యాత్మికంగా గందరగోళానికి గురి చేస్తాయి? (4)
( ) వివాహం యొక్క పవిత్రత.
( ) మరణం ఒక నిద్ర.
( ) పాపులు (దుర్మార్గులు) శాశ్వతంగా నరకంలో కాలిపోతారు.
( ) ఆదివారం దేవుని పరిశుద్ధ దినం.
( ) ఆత్మలు, లేదా వ్యక్తులు అమరత్వం గలవారు.
( ) నీటిలో ముంచి లేపే పద్ధతి ద్వారా బాప్తిస్మం.
( ) దేవుని ధర్మశాస్త్రం రద్దు చేయబడింది లేదా మార్పు చేయబడింది.
6) "బబులోను కూలిపోయెను" అనగా (1)
( ) ఒక దేవదూత పరలోకములో నుండి పడిపోయెనని అర్థం.
( ) బబులోను భూకంపం చేత దెబ్బతిన్నదని అర్థం
( ) దాని తప్పుడు బోధలను స్వీకరించే తల్లి సంఘం మరియు ఇతర సంఘాలు బైబిల్ సత్యం మరియు నిజమైన దేవుని ఆరాధన నుండి తప్పిపోయాయని అర్థం.
7) క్రింద ఇయ్యబడిన రెండు వరుస క్రమములలో ప్రతి గుర్తుకు ముందు ఉన్న రోమన్ సంఖ్యలను ప్రత్యక్ష అర్థానికి ముందు నిలువు వరుసలో వున్న ఖాళీ గడులల్లో జతపడేలా పూరించండి (క్రింద ఉదాహరణ చూడండి).
గుర్తు | ప్రత్యక్ష అర్థము |
I. స్త్రీ - | యేసు మరియు ఆయన తండ్రి |
II. జలము (నీరు) - | ప్రజలను గందరగోళపరిచే తప్పుడు సిద్దాంతం |
III. మృగము - | అన్యమతవాదం ద్వారా పనిచేసే సాతానుడు. |
IV. తూర్పు రాజులు I | సంఘము. |
V. అబద్ద ప్రవక్త - | దూత లేదా వర్తమానము. |
VI. బబులోను మద్యము - | రాజకీయ అధికార శక్తి లేదా రాజ్యం. |
VII. పది మంది రాజులు - | ప్రజలు / జనాభా అమెరికాలో కేంద్రీకృతమైన |
VIII. ఘటసర్పము - | భ్రష్టత్వము పొందిన ప్రొటెస్టెంట్ వాదం. |
IX. దేవదూత - | గందరగోళము |
X. బబులోను - | ప్రపంచ దేశములు |
8) యూఫ్రటీసు నది జలములు (నీరు) ఎండిపోయి ఆరిపోవడం దేనిని సూచిస్తుంది? (1)
( ) అంత్య దినములలో తీవ్రమైన నీటి కొరత.
( ) అంత్య కాలములో ఆహార సరఫరా ఉండదు.
( ) బబులోను తన అనుచరుల మద్దతును కోల్పోతుంది.
9) బబులోను అనునది దాదాపు అన్ని మతములు మరియు సంఘములను కలిగి ఉన్న కుటుంబ నామము. (1)
( ) అవును.
( ) కాదు.
10) బబులోనును విడిచి బయటకు రండని ప్రజలను నిజముగా ఎవరు పిలుస్తారు? (1)
( ) దేవదూతలు.
( ) 10 మంది రాజులు.
( ) లూసిఫరు.
( ) యేసు ప్రభువు.
11) పడిపోయిన సంఘమును విడిచి బయటకు రాకుండా దాన్ని మార్చడానికి ప్రయత్నించడం మంచిది కాదా? (1)
( ) అవును.
( ) కాదు.
12) బబులోను మద్యము తాగి మత్తులై ఉండటం అంటే ఏమిటి? (1)
( ) త్రాగుబోతుగా ఉండటం.
( ) పార్టీలో (వినోదంలో) దానితో చేరి ఆనందించడం.
( ) శారీరకంగా అనారోగ్యంతో ఉండటం.
( ) దాని తప్పుడు సిద్ధాంతాలతో గందరగోళం చెందడం.
13) అంత్య కాలములో యేసు మరియు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఏ మూడు అధికార శక్తులు ఏకం అవుతాయి? (3)
( ) క్రైస్తవేతర మతాలు.
( ) అంతరిక్షయానులు.
( ) పేపసీ (పోపు వ్యవస్థ).
( ) ఐక్యరాజ్యసమితి .
( ) భ్రష్టత్వం పొందిన ప్రొటెస్టంట్ వాదం.
14) యేసు తన ప్రజలను బబులోనును విడిచి రండని పిలిచినప్పుడు, వారు బయటకు వస్తారా? (1)
( ) అవును.
( ) లేదు.
15) చాలా మంది ప్రజలు బబులోనులో ఉన్నారు, కానీ అది వారికి తెలియదు? (1)
( ) అవును.
( ) కాదు.
16) నీవు బబులోనులో ఉంటే, దానిని విడిచి బయటకు రావాలని యేసు చేసిన అత్యవసర విజ్ఞప్తిని నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా?
( ) అవును.
( ) లేదు.