Lesson 4

ఒక మహా నగరమును గూర్చి మాట్లాడుకుందాము! గుంతలు, ట్రాఫిక్, కాలుష్యము లేదా ఎలాంటి నేరములు లేకుండ నీకు ఇష్టమైన పట్టణమును లేక నగరమును ఊహించుకొనుము! అసాధ్యమా? బంగారు వీధులు గల పట్టణమును గూర్చి బైబిలు చెప్పుచున్నది! స్వచ్ఛమైన, స్పటిక సూర్యకాంతములతో కట్టబడిన దాని ఎత్తయిన గోడల లోపల, దగ్గుచు, తుమ్ముచు, లేదా జబ్బున పడుచు ఒక్క వ్యక్తి కూడ ఉండదు. అందరు పరిపూర్ణ ఆరోగ్యముతో నుందురు మరియు ఒకరి సహవాసము నొకరు ఆనందించుదురు. నీవు ఈ పట్టణమును సందర్శించాలనుకొనుచున్నావా? అలాగైతే, నీవు సందర్శించుటయే కాదు, నీవు అక్కడ నివసించవచ్చును! ఎలాగో తెలిసికొనుటకు ఈ స్టడీ గైడ్ పత్రికను చదువుము ...

God is the architect and builder of the holy city.1. ఈ బ్రహ్మాండమైన పట్టణమునకు శిల్పి మరియు నిర్మాణకుడు ఎవరు?

"అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు" (హెబ్రీయులకు 11:16).

జవాబు : తన ప్రజల కొరకు దేవుడు ఒక మహా పట్టణమును నిర్మించుచున్నాడని బైబిలు తెలియజేయుచున్నది. ఈ పట్టణము మనకు తెలిసిన పట్టణముల కన్నా నిజమైనది మరియు అక్షదార్థమైనది!

2. ఈ మహా అద్భుత పట్టణము ఎక్కడున్నది?

"మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ... పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని" (ప్రకటన 21:2). “యెహోవా నా దేవా ... నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము” (1 రాజులు 8:28, 30).

జవాబు : నిర్మింపబడుచున్న ఈ మహా పట్టణము, ప్రస్తుతము, బహుదూరములో వెలుపటి అంతరిక్షమున, పరలోకమని పిలువబడుచున్న దేవుని నివాసస్థలములో నున్నది.

It's perimeter is 1,500 miles!3. ఈ మహా అద్భుత పట్టణమును బైబిలు ఎట్లు వర్ణించుచున్నది?

జవాబు:

అ. పేరు "నూతన యెరూషలేము" అని ఆ పట్టణము పిలువబడుచున్నది (ప్రకటన 21:2).

ఆ. పరిమాణము "ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది". (ప్రకటన 21:16). ఆ పట్టణము సంపూర్ణముగా చతురస్త్రాకారములో ఉన్నది. దాని కొలత యేడు వందల యాభై కోసులు, లేక 1500 మైళ్లు (అనగా సుమారు 2400 కిలోమీటర్లు), (1 క్రోసు = 2 మైళ్లు), (1 మైలు = సుమారు 1.7 కిలోమీటర్లు), అంటే ప్రతి ప్రక్కన 375 మైళ్లు లేక సుమారు 600 కిలోమీటర్లు పొడుగు ఉందన్న మాట!

ఇ. ప్రాకారములు (గోడలు) “అతడు ప్రాకారమును కొలువగా... అది నూట నలుబది నాలుగు మూరలైనది ... ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను” (ప్రకటన 21:17, 18). పట్టణము చుట్టు 144 మూరల ఎత్తు గోడ ఉన్నది, అది 216 అడుగుల ఎత్తుతో సమానము! (ఒక మూర = 18 అంగుళములు లేక ఒకటిన్నర అడుగులు). వర్ణింపలేనంత సుందరముగా ఆ ప్రాకారము స్ఫటిక సూర్యకాంతములతో కట్టబడియున్నది. స్పటిక సూర్యకాంతములతో దాదాపు 20 అంతస్తులు ఎత్తుగా కట్టబడిన దానిని గూర్చి ఒక్కసారి ఊహించుకొనుము !

ఈ. గుమ్మములు (ద్వారములు) "ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను. ... తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపువైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి. ... దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు" (ప్రకటన 21:12, 13, 21). ఆ పట్టణమునకు ఒక్కొక్క దిక్కున మూడు గుమ్మముల చొప్పున మొత్తము పన్నెండు గుమ్మములున్నవి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడియున్నది.

ఉ. పునాదులు “ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలదై ... అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము" (ప్రకటన 21:14, 19, 20). ఆ పట్టణమునకు సంపూర్ణము చేయబడిన, నిండైన 12 గుమ్మములున్నవి. ఒక్కొక్క పునాది ఒక్కొక్క అమూల్యమైన రత్నముతో అలంకరింపబడియున్నది. ఇంద్రధనుస్సులో ఉండు ప్రతి వర్ణము (రంగు) వాటిలో కనబడును, దీనినిబట్టి కొంత దూరము నుండి ఆ పట్టణము ఖచ్చితముగా ఇంద్రధనుస్సు మీద నిలిచియున్నట్లుగా కనబడును.

ఊ. వీధులు "పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది" (ప్రకటన 21:21).

ఋ. కనబడు విధము “ఆ పరిశుద్ధ పట్టణము. ... తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి ... దేవుని మహిమగలదై, దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యరత్నమును పోలియున్నది ... ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము” (ప్రకటన 21:2, 10, 16). ఆ పట్టణము అన్నివిధములైన అమూల్యరత్నములతో, బంగారముతో అలంకరింపబడి, కాంతివంతమైన అందముగలదై, దేవుని మహిమతో నిండియుండును. దాని ఉత్కంఠభరితమైన మహిమ మరియు పరిపూర్ణత "తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెతో" పోల్చబడెను.

4. ఈ మహిమాన్విత పట్టణములోని ఏ అద్భుత రూపము ప్రతి పరలోక పౌరునికి అనంత శక్తియు మరియు యౌవనమును (ఆరోగ్యమును) కలుగజేయును?

"ఆ పట్టణపు రాజవీధి మధ్యను (నది) ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను అవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును" (ప్రకటన 22:2). "జీవవృక్ష ఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో" (ఆదికాండము 3:22).

జవాబు : 12 కాపులు కాయు జీవవృక్షము, పట్టణమునకు మధ్యను ఉన్నది (ప్రకటన 2:7), దాని ఫలములు భుజించువారందరికి అది అనంత జీవమును మరియు యౌవనమును కలుగజేయును. దాని ఆకులు సహితము అద్భుతమైన ఔషధ గుణములు కలిగియుందును. ఈ వృక్షము నెలనెలకు వేరు వేరు కాపుల ఫలములు కాయును.

5. Is it true that this amazing city will descend to this earth?5. ఈ అద్భుత పట్టణము భూమ్మీదికి దిగి వచ్చునన్న మాట వాస్తవమేనా?

“మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని” (ప్రకటన 21:2). "సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” (మత్తయి 5:5). "నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు" (సామెతలు 11:31).

జవాబు : అవును! క్రొత్తగా సృష్టింపబడిన భూమికి రాజధాని నగరముగా నుండుటకు ఆ అద్భుత పరిశుద్ధ పట్టణము భూమ్మీదికి దిగి వచ్చును. నీతిమంతులందరికి ఈ పట్టణములో గృహమనుగ్రహింపబడును.

Sin and sinners will be eradicated by fire from God.6. పాపమునకు మరియు దుర్మార్గులకు ఏమి జరుగును?

"గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలు వలె ఉందురు, ... రాబోవు దినము అందరిని కాల్చివేయును" (మలాకీ 4:1). "పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములును కాలిపోవును" (2 పేతురు 3:10). "దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె (బూడిదె వలె) ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురు" (మలాకీ 4:3). “అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” (2 పేతురు 3:13).

జవాబు : దేవుడు పాపమును మరియు దుర్మార్గులను భూమి మీద నుండి తుడిచి వేసి, ఒక పరిపూర్ణమైన క్రొత్త భూమిని చేయును, పరిశుద్ధ పట్టణము దానికి రాజధాని నగరముగా నుండును. ఇక్కడ నీతిమంతులు సంతోషము, సమాధానము, మరియు పరిశుద్ధతతో సదా జీవించెదరు. పాపము మరల తలెత్తదని దేవుడు వాగ్దానము చేసెను. నహూము 1:9 చూడుము. (నరకమును గూర్చిన పూర్తి సమాచారము కొరకు 11వ స్టడీ గైడ్ పత్రికను చూడుము).

7. ఆయన నూతన రాజ్యములో ప్రవేశించు ప్రజలకు దేవుడు చేసియున్న ఉత్తేజభరితమైన వాగ్దానములేమిటి?

జవాబు :

  1. ప్రభువు తానే తన ప్రజలతో కాపురముండును (ప్రకటన 21:3).
  2. వారు ఎన్నటికి విసుగు చెందరు. అక్కడ ఎల్లప్పుడు సంపూర్ణ సంతోషముండును (కీర్తనలు 16:11).
  3. మరణము, బాధ, కన్నీరు, వేదన, అనారోగ్యము, ఆసుపత్రులు, శస్త్రచికిత్సలు, విషాదము, నిరుత్సాహము, కలవరము, ఆకలి దప్పులు, ఇవేవియు అచట నుండవు (ప్రకటన 21:4; యెషయా 33:24; ప్రకటన 22:3; యెషయా 65:23; ప్రకటన 7:16).
  4. వారు అలసిపోరు (యెషయా 40:31).
  5. రక్షింపబడిన ప్రతి వ్యక్తి అన్ని విధములుగా సంపూర్ణ శారీరక స్వస్థత కలిగియుండును. చెవిటివారు వినెదరు, గ్రుడ్డివారు చూచెదరు, మూగవారు పాడెదరు, కుంటివారు పరుగెత్తెదరు (యెషయా 35:5, 6; ఫిలిప్పీయులకు 3:21).
  6. అసూయ, భయము, ద్వేషము, అబద్ధము, మత్సరము, మలినము, నమ్మకద్రోహము, కల్మషము, చింత, మరియు అన్ని విధములైన చెడుతనము ఇక ఎన్నటికి లేకుండ దేవుని రాజ్యములో నుండి బహిష్కరించబడును (ప్రకటన 21:8, 27; 22:15). తమ జీవితములను దిగజార్చు చీకుచింతలు మరియు విచారములు ప్రజల మీద మరెన్నటికి మోపబడవు. భయభ్రాంతులకు గురిచేయు సన్నివేశములు ఇక ఉండవు. కాలము శాశ్వతమగును, భూలోకములో అనుభవించు ఒత్తిళ్లు మరియు జీవిత గడువులు ఇక ఎన్నటికి లేకుండపోవును.

8. How will the new earth differ from our earth today?8. ఈనాడున్న మన భూమికి నూతన భూమికి యుండు తేడా ఏమిటి?

జవాబు :

  1. "నేడు మనకు తెలిసిన మహా సముద్రములు క్రొత్త భూమిలో ఉండవు" (ప్రకటన 21:1). ఈనాడు సముద్రములు మరియు మహా సముద్రములు నాలుగింట మూడు భాగములు (70 శాతము) భూఉపరితలమును వ్యాపించియున్నవి. దేవుని నూతన రాజ్యములో ఇట్లుండదు. నూతన భూమి అంతయు అక్కడక్కడ సరస్సులు, నదులు, మరియు పర్వతములతో ఒకే ఒక పెద్ద సుందరమైన వనముగా నుండును (ప్రకటన 22:1; అపొస్తలుల కార్యములు 3:20, 21).
  2. ఎడారులు వనములగును (యెషయా 35:1, 2).
  3. జంతువులన్నియు పెంచుకొనబడును. ఒకటి మరొక దానిని చంపుకొని తినదు. చిన్న బాలుడు వాటిని నడిపించును (యెషయా 11:6-9; 65:25).
  4. శాపము ఇక ఉండదు (ప్రకటన 22:3), అనగా ఆదికాండము 3:17-19లో వివరించబడిన పాపము యొక్క శాపము (మరణము) ఇక ఉండదు.
  5. ఎటువంటి హింస, బలాత్కారము ఉండదు (యెషయా 60:18). దీని అర్ధము నేరములు, తుఫానులు, వరదలు, భూకంపములు, సుడిగాలులు, దాడులు, గాయములు మొదలైనవి యుండవు.
  6. నిషిద్ధమైనదేదియు క్రొత్త భూమిలో కనుగొనబడదు (ప్రకటన 21:27). కాల్చి పడవేసిన సిగరెట్టు ముక్కలు, పొగాకు రసము, త్రాగుబోతులు, సారా దుకాణములు, మత్తు పానీయములు, వ్యభిచార గృహములు, నగ్న చిత్రములు, లేదా ఏ విధమైన దుర్మార్గత లేక అపవిత్రత అక్కడ ఉండవు.

9. దేవుని రాజ్యములో చిన్న పిల్లలుండెదరా? అయితే, వారు పెరిగి పెద్దవారగుదురా?

"ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును" (జెకర్యా 8:5). "మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు" (మలాకీ 4:2).

జవాబు : అవును, ఆ పరిశుద్ధ పట్టణములో అనేకమంది బాలురు మరియు బాలికలుందురు (యెషయా 11:6-9), ఈ పిల్లలు పెరిగి పెద్దవారగుదురు (మలాకీ 4:2). ఆదాము హవ్వలు పతనమైనప్పటి నుండి, మనము వయస్సులోను, జ్ఞానములోను, మరియు జీవన సామర్ధ్యములోను క్షీణించిపోయి యున్నాము, కాని ఇదంతయు పునరుద్ధరింపబడును! (అపొస్తలుల కార్యములు 3:20, 21).

10. తమ ప్రియులతో పరలోకములో తిరిగి ఏకమైనప్పుడు, రక్షింపబడినవారు ఒకరినొకరు గుర్తుపట్టుదురా?

"అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును" (1 కొరింథీయులకు 13:12).

జవాబు : మరణించిన నీతిమంతులు (రక్షింపబడినవారు) జీవమునకు లేపబడి, బ్రతికియున్న నీతిమంతులను (రక్షింపబడినవారిని) కలిసికొని, దేవుని నూతన రాజ్యములో కలిసి ప్రవేశించుదరని బైబిలు స్పష్టముగా బోధించుచున్నది (యెషయా 26:19; యిర్మీయా 31:15-17; 1 కొరింథీయులకు 15:51-55; 1 థెస్సలొనీకయులకు 4:13-18). నేడు భూమ్మీద ప్రజలు ఒకరినొకరు గుర్తుపట్టుచున్న విధముగానే, దేవుని నూతన రాజ్యములో ప్రజలు ఒకరినొకరు గుర్తుపట్టుదురని కూడ లేఖనము బోధించుచున్నది.

11. పరలోకములో ప్రజలు రక్తమాంసములతో కూడిన నిజమైన శరీరములు కలిగియుందురా?

"ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఇక్కడ మీ యొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను, (కొంత తేనెను) ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారి యెదుట భుజించెను" ... ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి ... వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను" (లూకా 24:36-39, 41-43, 50-51). “మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి” (అపొస్తలుల కార్యములు 1:11). “ప్రభువైన యేసుక్రీస్తు ... మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును” (ఫిలిప్పీయులకు 3:20, 21).

జవాబు : తన పునరుత్థానము తరువాత యేసు తనను తాకి చూడమని చెప్పుట ద్వారా మరియు కొంత ఆహారము భుజించుట ద్వారా తాను రక్తమాంసములు గల శరీరధారియని శిష్యులకు నిరూపించుకొనెను. రక్తమాంసములతో తన తండ్రి యొద్దకు ఆరోహణమైన యీ యేసే అదే రీతిగా మరల తిరిగి వచ్చును. నీతిమంతులకు క్రీస్తు వంటి శరీరములు అనుగ్రహింపబడి నిత్యత్వమంతయు రక్తమాంసములు కలిగిన నిజశరీరులుగా నుందురు. మరణించడము, కుళ్లిపోవడము, లేక చెడిపోవడము వంటివి పరలోక శరీరమున కుండవు. రక్షింపబడినవారు భూతములై ద్రవ మేఘములపై తేలియాడుచు వీణెలు వాయించుదురనే బోధకు బైబిలునందు ఎలాంటి ఋజువు లేదు. ఆయన ప్రేమను అంగీకరించి తన జీవితమాదిరిని విధేయతతో అనుసరించువారికి అటువంటి సాధారణ మూఢ భవిష్యత్తు నిచ్చుటకు కాదు యేసు సిలువపై మరణించినది. అటువంటి అంతరిక్ష జీవితము పట్ల ఎవరు ఆసక్తి చూపరు. ఈ కారణము చేతనే అనేకమంది దేవుని పరలోకరాజ్యములో ప్రవేశించుటకు ఇష్టపడుట లేదు. అయినను, నరకము పట్ల భయము చేతనే తరుచుగా పరలోకమును కోరుకొనుచున్నారు. ప్రజలందరును దేవుని పరిశుద్ధ పట్టణము మరియు క్రొత్త భూమి గురించి తెలిసికొనగలిగిన యెడల, అనేకమంది ఆయన ప్రేమను కనుగొని తమ పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగెదరు. ఎవరైతే దేవుని రాజ్యమును కోల్పోవుదురో వారు తమ జీవితములోనే ఒక ఘోరమైన పొరపాటు చేసియున్నారు.

12. How will people spend their time in the new kingdom?12. నూతన రాజ్యములో ప్రజలు తమ కాలమును ఎట్లు గడుపుదురు?

"జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు... వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు ... నేను ఏర్పరచుకొనినవారు. తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు" (యెషయా 65:21, 22).

జవాబు : రక్షింపబడినవారు నూతన భూమిలో తమ సొంత ఇండ్లు కట్టుకొందురు. (ప్రతి వ్యక్తి క్రీస్తు చేత నిర్మింపబడిన ఒక భవనమును కూడ కలిగియుండును - యోహాను 14:1-3 చూడుము.) వారు ద్రాక్షతోటలు నాటుకొని వాటి ఫలములు తిందురు. బైబిలు స్పష్టమైనది. పరలోకములో నిజమైన ప్రజలు నిజమైన కార్యములు చేయుచు, దాని వైభవములను పూర్తిగా అనుభవించుచు ఆనందించెదరు.

13. ఈ పరదైసులో (పరలోకములో) రక్షింపబడినవారు ఏమి చేయుదురు?

జవాబు :

  1. కీర్తనలు పాడుచు పరలోక సంగీత సునాదమును వినిపించెదరు (యెషయా 35:10; 51:11; కీర్తనలు 87:7; ప్రకటన 14:2, 3).
  2. దేవునిని ఆరాధించుటకై వారము వారము (విశ్రాంతిదినమున) ఆయన సన్నిధికి వచ్చెదరు (యెషయా 66:22, 23).
  3. వాడిపోని పూలు మరియు చెట్లను చూచి ఆనందించెదరు (యెహెజ్కేలు 47:12; యెషయా 35:1, 2).
  4. ప్రియులు, పితరులు, ప్రవక్తలు, మొదలగు వారితో కలిసి సందర్శించేదరు (మత్తయి 8:11; ప్రకటన 7:9-17).
  5. పరలోకపు జంతువులను పరిశీలన అధ్యయనము చేసెదరు (యెషయా 11:6-9; 65:25).
  6. ఏ అలుపు లేకుండ పట్టణమంతయు పయనించుచు అన్వేషించెదరు (యెషయా 40:31).
  7. దేవుని సంగీత సునాదమును వినెదరు (జెఫన్యా 3:17).
  8. హృదయవాంఛలను తీర్చుకొనెదరు (కీర్తనలు 37:3, 4; యెషయా 65:24).
  9. అన్నిటికంటే మిక్కిలి సంతోషకరమైన విషయమేమనగా - యేసువలె ఉంటు, ఆయనతో కలిసి పయనించుచు, ఆయనను ముఖాముఖిగా దర్శించు ఆధిక్యతను కలిగియుందురు (ప్రకటన 14:4; 22:4; 21:3; 1 యోహాను 3:2).

14. Can human language fully describe the glories of our home in paradise?14. మన పరలోకపు గృహము యొక్క మహిమలను మానవ భాష పూర్తిగా వర్ణించగలదా?

“దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు” (1 కొరింథీయులకు 2:9).

జవాబు : కలలో కూడ మానవ హృదయము దేవుని నిత్యరాజ్యము యొక్క మహిమలను గ్రహింపలేదు. ఆదాము కోల్పోయినదంతయు పునరుద్ధరింపబడును (అపొస్తలుల కార్యములు 3:20, 21).

15. ఈ రాజ్యము వ్యక్తిగతముగా నా కొరకు సిద్ధపరచబడుచున్నదా?

“ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” (ప్రకటన 22:17). “అక్షయమైన ... స్వాస్థ్యము ... మీ కొరకు ... పరలోకమందు భద్రపరచబడియున్నది” (1 పేతురు 1:4, 5). “మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను” (యోహాను 14:2).

జవాబు : అవును! అది వ్యక్తిగతముగా ఇప్పుడే నీ కొరకు సిద్ధపరచబడుచున్నది. ప్రభువు వ్యక్తిగతముగా నిన్ను ఆహ్వానించుచున్నాడు. మిత్రమా, ఆయన ఆహ్వానమును దయచేసి త్రోసివేయకుము!

16. ఈ గొప్పదైన మరియు అద్భుతమైన రాజ్యములో నాకు స్థలము దొరుకునని నేనెట్లు ఖచ్చితముగా చెప్పగలను?

“ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము” (ప్రకటన 3:20). "జీవవృక్షమునకు హక్కుగలవారై, గుమ్మముల గుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు (ప్రామాణిక కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషు బైబిలు ప్రకారము, ఆయన ఆజ్ఞలు గైకొనువారు) ధన్యులు" (ప్రకటన 22:14). "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును" (మత్తయి 7:21). "తన్ను ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12). “యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (1 యోహాను 1:7).

జవాబు : పాపము నుండియు మరియు పాప దురాశల నుండియు ఆయన నిన్ను పవిత్రునిగా చేయునట్లు నీ జీవితమును ఆయనకు సమర్పించి ఆయనయందు నివసించుము. అది అంత సులభము! నీవు ఆయనయందు నివసించిన యెడల, ఆయన చిత్తమును నెరవేర్చుటకును మరియు ఆయన ఆజ్ఞలను ప్రేమతో ప్రేరేపింపబడిన విధేయతతో గైకొనుటకునును దేవుడు నీకు శక్తి ననుగ్రహించును. దీని అర్థమేమనగా, నీవు క్రీస్తు జీవించినట్లు జీవించి పాపమును జయించుటకు ఆయనే నీకు సహాయము చేయును. “జయించువాడు వీటిని (సమస్తమును) స్వతంత్రించుకొనును” (ప్రకటన 21:7). క్లుప్తముగా చెప్పాలంటే, హృదయములో దేవుని రాజ్యమున్న యెడల ఆ వ్యక్తి పరలోకమునకు సిద్ధపడియున్నట్లే..

17. తన పరలోక రాజ్యములో ఆయనతో సదా జీవించుటకు యేసు ప్రభువు యిచ్చు మహిమాన్విత ఆహ్వానమును అంగీకరించుటకు నీవు నిర్ణయించుకొనియున్నావా?

నీ జవాబు :


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. రక్షింపబడినవారు నశించిన తమ ప్రియులను గూర్చి ఆలోచించునప్పుడు పరలోకము ఎట్లు ఒక సంతోష స్థలమవ్వగలదు?

జవాబు : "ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును" అని బైబిలు చెప్పుచున్నది. (ప్రకటన 21:4). క్రొత్త భూమి యొక్క సౌందర్యము మరియు సంతోషము చూచి, దేవుని చేత విమోచింపబడిన ప్రజలు వారి గత విషాదములను మరియు హృదయ వేదనలను మరచిపోయెదరు; "మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు" అని యెషయా 65:17 చెప్పుచున్నది.

2. "రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు" అని బైబిలు చెప్పుచున్నది (1 కొరింథీయులకు 15:50). అలాగైతే, విమోచింపబడినవారు రక్తమాంసములు ఎట్లు కలిగి యుండగలరు?

జవాబు : మన పునరుత్థాన శరీరములు ప్రస్తుత శరీరములకు భిన్నముగా నుండునని 1 కొరింథీయులకు 15:35-49 వచనములలో మనకు చెప్పిన మాటను పౌలు ఇక్కడ మరల నొక్కి చెప్పుచున్నాడు. క్షయమైన మానవ శరీరము పరలోక పరిపూర్ణ రాజ్యమును అనుభవించుటకు యోగ్యమైనది కాదు. మానవుడు పాపము చేసినప్పుడు, అతని స్వభావము మరియు శరీరము మారిపోయెను. అందువలన, పునరుద్ధరింపబడిన ఏదెను మహిమానందములోనికి అతడు ప్రవేశించినప్పుడు, తన శరీరము మార్చబడి పరలోక పరిపూర్ణతతో ఏకమగును. "రక్త మాంసములు" అనే మాట భూమ్మీద మానవ శరీరమునకు సాదృశ్యముగా సూచింపబడుచున్నది (మత్తయి 16:17; గలతీయులకు 1:16; ఎఫెసీయులకు 6:12 చూడుము), గనుక మనము మాటకు మాట అక్షరార్థముగా తీసికొనకూడదు. క్రీస్తు, తన పునరుత్థాన శరీరమందుండి, తాను నిజముగా "రక్త మాంసములతో కూడిన శరీరమును ధరించుకొనెనని ప్రకటించెను (లూకా 24:39). మనము క్రీస్తు వంటి శరీరములు ధరించుకొందుమని ఫిలిప్పీయులకు 3:21 చెప్పుచున్నది.

3. ఆ పరిశుద్ధ పట్టణ ద్వారములను (గుమ్మములను) పర్యవేక్షించువాడు అపొస్తలుడైన పేతురా?

జవాబు : కాదు! నూతన యెరూషలేము అను దేవుని పరిశుద్ధ పట్టణమునకు 12 గుమ్మములు కలవని, ఆ గుమ్మముల యొద్ద 12 మంది దేవదూతలుందురని బైబిలు ప్రకటన 21:12లో చెప్పుచున్నది. ఆ ద్వారములకు (గుమ్మములకు) అపొస్తలులు పర్యవేక్షకులుగా ఉందురని బైబిలునందు ఒక్క వచనమైనను సూచించుట లేదు.

4. ఆ పరిశుద్ధ పట్టణము నిజముగానే అన్ని యుగముల యందు రక్షింపబడిన ప్రజలకు సరిపోవునంత పెద్దదిగా ఉండునా?

జవాబు : పట్టణమంతయు నిండిపోయి ప్రతి ఒక్కరికి కేవలము 100 చదరపు అడుగుల స్థలమిచ్చిన యెడల, 39 బిలియన్లు (39 వందల కోట్ల) మంది ప్రజలు ఆ పట్టణములో ఉండుటకు స్థలముండును. ఈ సంఖ్య ప్రస్తుత జనాభాకు ఎన్నో రెట్లు ఎక్కువ. గణాంక శాస్త్రవేత్తలు నమ్ముచున్న ప్రకారము, ఆ పట్టణములో ఇప్పటి వరకు పుట్టి జీవించిన వారందరు రక్షింపబడినను వారందరికి తగినంత స్థలముండును. కాని, కొందరే రక్షింపబడుదురని లేఖనము స్పష్టము చేయుచున్నది (మత్తయి 7:14). అయితే కావల్సినంత స్థలము ఆ మహా పట్టణములో ఉన్నది.

5. పరలోకములో మనము పొందు బహుమానము భూమ్మీద మనము చేయు త్యాగములతో విలువ కట్టునేమోనని కొన్నిసార్లు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. సాతాను నన్ను ఓడించునేమోనన్న భావన కూడ కొన్నిసార్లు నాకు కలుగుచున్నది. దీని విషయమై బైబిలునందు నేనేదైన అభయవచనమును కనుగొనగలనా?

జవాబు : అవును! వాస్తవముగా, పౌలు కూడా తాను వ్రాసినప్పుడు మీలో ఒకని వలె ఆలోచించి యుండవచ్చును, "మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను" (రోమీయులకు 8:18). నిత్యరాజ్యములో నీ కొరకు ఎదురుచూచుచున్న నీ పరలోకపు తండ్రిని ఒకే ఒక్కసారి చూడగానే భూమ్మీద మనకెదురైన భయంకరమైన ఇబ్బందులు మరియు శ్రమలు బహుస్వల్పమైనవిగా అనిపించును! అంతట విమోచింపబడినవారు "హల్లెలూయా, "పరలోకము మాకెంతో ఉచితముగా దొరికినది!" అని కేకలు వేసెదరు.

6. మరణించు చిన్న పిల్లలు దేవుని రాజ్యములో రక్షింపబడి యుందురా?

జవాబు: ఈ ప్రశ్నకు బైబిలులో నిర్దిష్టమైన సమాధానము లేదు, కాని అనేకమంది మత్తయి 2:16-18 వచనములను ఆధారము చేసికొని చంటి పిల్లలు రక్షింపబడుదురని నమ్ముచున్నారు. అచట బేత్లహేములోని రెండు సంవత్సరాల లోపు మగ శిశువులందరిని చంపవలెనని ఆజ్ఞాపించిన దుర్మార్గపు రాజైన హేరోదును గూర్చి బైబిలు మాట్లాడుచున్నది. ఈ క్రూర విషాద సంఘటనను గూర్చి పాత నిబంధనలో ముందుగా ప్రవచింపబడెను, తమ పిల్లలు ఒకానొక దినమున తమకు తిరిగి అప్పగింపబడుదురనే అభయము నిచ్చి అక్కడి తల్లులను విలపింపవద్దని దేవుడు చెప్పెను. “ఏడువక ఊరకొనుము. .... వారు (హతమైన పిల్లలు) శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ... నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు తిరిగి వచ్చెదరు” (యిర్మీయా 31:16, 17).

7. పరలోకము, అనగా రక్షింపబడినవారి యొక్క గృహము సాక్ష్యాత్తు ఈ భూమి మీదనే ఉండునను విషయమును నేను సరిగా అర్థము చేసికొనియున్నానా?

జవాబు : అవును! "పరిశుద్ధ పట్టణము" ప్రస్తుతము దేవుని నివాసస్థలములో ఉన్నను, ఆయన దానిని క్రొత్త భూమి మీదికి తీసికొని వచ్చును. పాపము, దుర్మార్గులు అగ్ని చేత నశింపజేయబడుదురు. ఈ భూమి నూతనపర్చబడి, ఏదెను యొక్క శోభాతిశయములతో నీతిమంతులకు తిరిగి అనుగ్రహింపబడును. పరిశుద్ధ పట్టణము క్రొత్త భూమికి రాజధాని నగరముగా నుండును. దేవుడు తన సింహాసనమును సాక్షాత్తు ఈ భూమ్మీద స్థాపించి నిత్యత్వమంతయు తన నీతిమంతులందరితో కలిసి జీవించును (ప్రకటన 21:2, 3; 22:1,3). ప్రభువు ఎక్కడ నివసించునో పరలోకము అక్కడ నివసించును. ఆదాము పోగొట్టుకొనిన దానిని తిరిగి మనకిచ్చుటయే దేవుని ప్రణాళిక. ఇదే పరిపూర్ణ గ్రహము మీద పరిపూర్ణ మహిమ జీవితము. సాతాను మరియు పాపము దేవుని ప్రణాళికను అడ్డగించినను, ఇది కొనసాగును. ఈ ప్రణాళికను నూతన రాజ్యములో మనము ఒకరితో నొకరము తప్పక పంచుకొందుము - అది కోల్పోదగినది కాదు! (ఈ అంశమును గూర్చిన మరింత సమాచారము కొరకు 12వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)

8. రక్షింపబడినవారి గృహము (పరలోకము) మేఘముల మీద తేలియాడుచు ఊరకనే వీణెలు వాయించు భూతముల వంటి నివాసులు జీవించు పొగమంచు స్థలమని ఎందుకు అనేకులు నమ్ముచు బోధించుచున్నారు?

జవాబు : ఈ బోధ అబద్ధమునకు జనకుడైన అపవాదితో ప్రారంభమైనది (యోహాను 8:44). దేవుని ప్రేమా ప్రణాళికను వక్రీకరించి, అవాస్తవముగాను మరియు "ఒక భయానక" ప్రదేశముగాను పరలోకమును చిత్రీకరించి తద్వారా ప్రజలకు విరక్తిని కలిగించి, దేవుని వాక్యము పట్ల వారికి అనుమానమును పెంపొందించాలని వాడు బహుగా ఆరాటపడుచున్నాడు. ఎప్పుడైతే ప్రజలు రక్షింపబడినవారి గృహము (పరలోకమును) గూర్చిన బైబిలు సత్యమును సంపూర్తిగా అర్థము చేసికొందురో, వారి మీద తాను చెలాయించు శక్తి పటాపంచలగునని సాతానుకు తెలియును, ఎందుకనగా వారు ఆ రాజ్యములో ప్రవేశించుటకు ప్రణాళికలు వేసికొందురు. ఈ కారణము చేతనే పరలోక గృహమును గూర్చిన విషయమును మరుగుపరచి, తప్పుడు బోధను నలుమూలలా వ్యాపింపజేయాలని అపవాది సర్వదా కృషి చేయుచున్నాడు.


సారాంశ పత్రము


ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) అంతరిక్షములోని పరిశుద్ధ పట్టణము (1)

( ) నిజమైనది కాదు, అదీ కేవలము ఒక సాదృశ్యము (ఊహాగానము).

( ) తన నివాసస్థలములో ప్రస్తుతము దేవుని చేత సిద్ధపరచబడుచున్న నిజమైన పట్టణము.

( ) ఉన్నదని కొందరు భావించుచున్నను వాస్తవముగా అది ఉనికిలో లేదు.

2) ఈ పరిశుద్ధ పట్టణము (1)

( ) అణు విస్పోటనము (బాంబు పేలుడు) చేత నాశనము చేయబడును.

( ) సాతాను అతని పతనమైన దేవదూతల చేత స్వాధీనము చేసికొనబడును.

( ) భూమ్మీదికి దిగివచ్చి క్రొత్తగా సృజింపబడు భూమికి రాజధాని నగరముగా నుండును.

3) క్రింద ఇయ్యబడిన వాక్యములలో, పరిశుద్ధ పట్టణమునకు సంబంధించిన బైబిలు సత్యములను గుర్తించుము : (7)

( ) నూతన యెరూషలేము అని పిలువబడుచున్నది.

( ) లండన్ పట్టణమంత పరిమాణములో ఉన్నది.

( ) దాని గోడలు పుష్యరాగముతో చేయబడినవి.

( ) పట్టణపు పొడుగు దాని వెడల్పుతో సమానము.

( ) పట్టణపు వీధులు శుద్ధ సువర్ణమయమును పోలియున్నవి.

( ) పట్టణమునకు 14 పునాదులు కలవు.

( ) దాని గుమ్మమును అపొస్తలుడైన పేతురు పర్యవేక్షించును.

( ) దాని 12 గుమ్మములన్నియు ఒక్కొక్క రత్నముతో చేయబడినవి.

( ) దాని చుట్టుకొలత 1500 మైళ్లు లేక 2400 కిలోమీటర్లు.

( ) దాని పునాదులన్నియు అమూల్యమైన రత్నములతో చేయబడినవి.

( ) పట్టణము పరిపూర్ణ పరిమాణములో ఉండును.

4) జీవవృక్షము (1)

( ) దేవుని ప్రజలకు అనంత శక్తిని మరియు యౌవనము నిచ్చు నిజమైన చెట్టు.

( ) ఒక సాదృశ్యము, కేవలము దేవుడే తన ప్రజలకు శక్తినిచ్చునన్న మాటకు భావరూపకము.

( ) ఆదియందు ఉనికిలో ఉండెను, కాని నూతన రాజ్యములో ఉండదు.

5) క్రింది వాక్యములలో, దేవుని నూతన రాజ్యములోని ప్రజలకు చేయబడిన సత్యమైన బైబిలు వాగ్దానములను గుర్తించుము: (5)

( ) దేవుడు అనుదినము వివాహములు జరిపించును.

( ) జీవవృక్షమునకు 20 రకముల పండ్లు కాయును.

( ) దేవుడు తానే తన ప్రజలతో నివసించును.

( ) ఒక పది లక్షల సంవత్సరాల తరువాత, పరిశుద్ధులు పరలోకములో విసుగు చెందుదురు.

( ) మరణము లేదా వేదన ఇక ఉండవు.

( ) ప్రజలు ఎన్నటికి అలసిపోరు.

( ) కుంటివారు దేవదూతల చేత నడిపింపబడుదురు.

( ) దేవదూతలు వైద్యులైయుండి అన్ని శస్త్రచికిత్సలు చేసెదరు.

( ) గ్రుడ్డివారు చూపు నొందుదురు.

( ) అసూయ, భయము, ద్వేషము, అబద్దము, మత్సరము, కల్మషము ఇక ఎన్నటికి లేకుండ పోవును.

( ) చిన్న పిల్లలు పెరిగి పెద్దవారవ్వరు.

6) క్రింది వాటిలో, క్రొత్త భూమిని గూర్చిన సత్యమైన వాక్యములను గుర్తించుము : (6)

( ) నేడున్న సముద్రములు ఇకను ఉండవు

( ) ఎడారులు పెద్దవిగా నుండును.

( ) జంతువులన్నియు సుందరమైన పరలోకపు బోనులలో ఉంచబడును.

( ) గాలివానలు, భూకంపములు, మరియు వరదలు ఎన్నటికి సంభవింపవు.

( ) వీధుల్లోని చెత్తా చెదారము అనుదినము దేవదూతల చేత శుభ్రపరచబడును.

( ) పువ్వులు మరియు చెట్లు ఇక ఎన్నటికి వాడిపోవు లేక ఎండిపోవు.

( ) పరలోకము సాక్షాత్తు భూమ్మీద ఉండును.

( ) పాపము మరల తలెత్తదు.

( ) దాని మహిమలన్నిటిని వర్ణించుట కష్టము.

7) నీతిమంతులు పరలోక రాజ్యములో (1)

( ) వీణెలు వాయించు భూతములై యుండి మేఘముల మీద తేలియాడుచు నుందురు.

( ) వారితో పాటు ఉన్న తమకు ప్రియులైన వారిని మరియు మిత్రులను గుర్తుపట్టలేరు.

( ) రక్తమాంసములతో కూడిన నిజమైన శరీరములను ధరించుకొని ఒకరినొకరు గుర్తుపట్టుదురు.

8) పరలోకములో ప్రజలు నిజమైన శరీరములు కలిగియుండి నిజమైన కార్యములు చేయుదురని మనమెరుగుదుము ఎందుకనగా (1)

( ) విజ్ఞాన శాస్త్రము (సైన్సు) దీనిని నిష్కర్షగా ఋజువు చేసెను.

( ) తన పునరుత్థానము తరువాత (రక్తమాంసములతో) కూడిన నిజమైన శరీరము ధరించి నిజమైన కార్యములు చేసిన క్రీస్తు వలె మనముండెదమని బైబిలు బోధించుచున్నది.

( ) అనేకమంది ప్రసంగీకులు అట్లు బోధించుచున్నారు.

9) ఆ పరలోకరాజ్యములో నాకు స్థలము ఖచ్చితముగా దొరుకుననుటకు నిదర్శనముగా (1)

( ) నేను ప్రభువును ప్రేమించుచున్నానని ప్రతి దినము చెప్పెదను.

( ) నరకము అంటే అత్యంత భయము కలిగియుండెదను.

( ) క్రీస్తును అంగీకరించి ఆయనను వెంబడించుచు ఆయన ఆజ్ఞలను గైకొనెదను.

10) రక్షింపబడినవారు పరలోకరాజ్యములో ఏమి చేయుచుందురు? క్రింద ఇయ్యబడిన వాటిలో సత్యమైన బైబిలు వాస్తవములను గుర్తించుము : (5)

( ) ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించెదరు.

( ) ద్రాక్షతోటలు నాటుకొనెదరు.

( ) జంతువులను చంపుకొని తినెదరు.

( ) పరలోక సంగీత వాద్యములను వాయించుచు దేవునికి కీర్తనలు పాడెదరు.

( ) దేవుని సింహాసనము యెదుట ఆయన సన్నిధిని ఆరాధించెదరు.

( ) నరకము గుండ ఎగురుచు నశించిన వారిని హేళన చేసెదరు.

( ) జీవవృక్ష ఫలములను భుజించెదరు.

11) తన పరలోకరాజ్యములో ఆయనతో సదాకాలము జీవించుటకు యేసు ప్రభువు యిచ్చు ఆహ్వానమును అంగీకరించుటకు నేను నిర్ణయించుకొనియున్నాను.

( ) అవును.

( ) కాదు.