Lesson 26

ప్రేమలో ఉండుట వలన ప్రతిదీ మారిపోవును! ఒక యువతి తన విశ్వవిద్యాలయము యొక్క ఇంగ్లీషు సాహిత్య కోర్సు కొరకు ఒక పెద్ద పుస్తకమును చదువుచున్నపుడు, ఆమెకు చాలా చికాకుగా అనిపించి చదివేటతపుడు దృష్టి పెటలేకపోయినది. కాని కొన్ని రోజులైనప్పుడు ఆమె కాలేజీ క్యాంపస్లో ఒక అందమైన యువ ప్రొఫెసర్ను కలుసుకొన్నది, వారు త్వరగా ప్రేమలో పడ్డారు. వెంటనే, ఆమె అతి కష్టము మీద చదివిన పుస్తకమును రచించింది తన ప్రియుడని ఆమె గ్రహించినది. ఆ రాత్రంత ఆమె మేల్కొని ఉండి, మోతము పుస్తకమును నమిలి మింగేసింది, “ఇది నేను చదివిన ఉతమ పుస్తకము!” అని ఆమె ఎరిగి గంతేసింది. ఆమె దృక్పథమును మార్చినది ఏమిటి? ప్రేమ . అదే విధముగా, ఈ రోజులో చాలా మంది బైబిలును చికాకుగా, ఆకర్షణీయముగా లేనిదిగా మరియు అణచివేసేధిగా బావించుచునారు. మీరు దాని రచయితతో (యేసు ప్రభువుతో) ప్రేమలో పడినపుడు ఆ ఆలోచనంతయు మారిపోవును. ఇది ఎలాగో ఈ హృదయమును ఆత్మీయతతో నింపే స్టడీ గైడ్ పత్రికను చదివి తెలుసుకొనుము!

1. లేఖనము (బైబిలు) యొక్క గ్రంథకర్త ఎవరు?

"ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, ...తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు . ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి" (1 పేతురు 1:10, 11).

జవాబు : వాస్తవానికి బైబిలు యొక్క ప్రతి గ్రంథము యేసుక్రీస్తును సూచించుచున్నది - పాత నిబంధన గ్రంథములతో సహా. యేసు ప్రభువు ప్రపంచమును సృష్టించెను (యోహాను 1:1-3, 14; కొలొస్సయులకు 1:13-17), పది ఆజ్ఞలను వ్రాసెను (నెహెమ్యా 9:6, 13), ఆయన ఇశ్రాయేలీయుల దేవుడైయుండి (1 కొరింథీయులకు 10:1-4), ప్రవక్తల రచనలకు మార్గనిర్దేశము చేసెను (1 పేతురు 1:10, 11), కాబట్టి, యేసుక్రీస్తే లేఖనము (బైబిలు) యొక్క గ్రంథకర్త.

2. భూప్రజల పట్ల యేసు ప్రభువు వైఖరి ఏమిటి?

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

జవాబు: యేసు ప్రభువు మనందరిని సమస్త జ్ఞానమునకు మించిన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు.

3. మనము యేసు ప్రభువును ఎందుకు ప్రేమించుచున్నాము?

"మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను" (రోమీయులకు 5:8). "ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” (1 యోహాను 4:19).

జవాబు : మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఎందుకనగా మనమింకను ఆయన శత్రువులమై యుండగానే ఆయన మనకొరకు చనిపోయేంతగా మనలను ప్రేమించెను.

4. విజయవంతమైన వివాహము మరియు క్రైస్తవ జీవితము ఏ అంశములలోసమానముగా ఉంటాయి?

"మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును" (1 యోహాను 3:21).

జవాబు: మంచి వివాహములో దంపతులు ఒకరికొకరు విధేయత చూపుకొనుట వంటి కొన్ని విషయములు తప్పనిసరి. ఇతర విషయములు పెద్దవిగా అనిపించకపోవచ్చును, కాని అవి జీవిత భాగస్వామిని సంతోషపెడితే అవసరమే.  ఒకవేళ అవి అసంతృప్తి కలిగించిన యెడల, వాటిని నిలిపివేయవలెను. క్రైస్తవ జీవితములో కూడ ఇదే విషయము జరుగును. యేసు ప్రభువు ఆజ్ఞలు అత్యవసరమైనవి. కాని బైబిలులో యేసు ప్రభువు తనను సంతోషపెట్టే ప్రవర్తన సూత్రములను కూడ మనకు వివరించెను. మంచి వివాహము మాదిరిగానే, క్రైస్తవులు మనము ప్రేమించు యేసు ప్రభువును సంతోషపెట్టే పనులను చేయుట ఆనందముగా భావించెదరు. ఆయన కిష్టములేని పనులను కూడ చేయక వాటిని మనము నివారించెదము.

5. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట వలన కలుగు ఫలితములేవని యేసు ప్రభువు చెప్పుచున్నాడు?

"మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను" (యోహాను 15:10, 11).

జవాబు: క్రైస్తవ సూత్రములను పాటించుట మనునది విరక్తిగా, విసుగుగా. నీచముగా మరియు క్రియల ద్వారా రక్షణ అనే సిద్ధాంతమునకు గుర్తుగా ఉన్నదని అవవాది చెప్పును. కాని అది సంపూర్ణ ఆనందమును మరింత సమృద్ధి జీవము నిచ్చునని యేసు ప్రభువు చెప్పెను. (యోహాను 10:10). అపవాది యొక్క అబద్ధములను నమ్ముట హృదయ వేదనను తెచ్చును మరియు ప్రజలు “నిజముగా జీవింపజేయు” జీవమును కోల్పోవునట్లు వంచించును.

6. క్రైస్తవ జీవనము కొరకైన నిర్దిష్ట సూత్రములను యేసు ప్రభువు మనకు ఎందుకిచ్చుచున్నాడు?

జవాబు : ఎందుకనగా అవి:

 అ. "మనకు నిత్యము మేలు కలుగుటకై" ఇయ్యబడినవి. (ద్వితీయోపదేశకాండము 6:24). మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సూత్రములను బోధించునట్లు, యేసు ప్రభువు తన పిల్లలకు మంచి సూత్రములను బోధించును.

ఆ. పాపము నుండి మనకు భద్రత కల్పించును (కీర్తన 119:11) యేసు ప్రభువు సూత్రములు సాతాను మరియు పాపము యొక్క ప్రమాదకర ఉచ్చుల్లో చిక్కుకొనకుండ మనలను సంరక్షించును.

ఇ. క్రీస్తు అడుగుజాడల ననుసరించి నడుచుకొనుట ఎలాగో మనకు చూపించును. (1 పేతురు 2:21).

. మనకు నిజమైన ఆనందమును తెచ్చును. (యోహాను 13:17).

ఉ. ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచుటకు మనకు అవకాశమిచ్చును.(యోహాను 15:10)

ఊ. ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండుటకు మనకు సహాయపడును (1 కొరింథీయులకు 10:31-33; మత్తయి 5:16).

7. According to Jesus, how should Christians relate to the evil of the world and to worldliness?

7. యేసు ప్రభువు ప్రకారము, క్రైస్తవులు లోకములోని చెడుతనముతోను మరియు లోక సంబంధమైన వాటితోను ఎటువంటి సంబంధము కలిగి ఉండవలెను?

జవాబు : ఆయన ఆజ్ఞలు మరియు సూచనలు స్పష్టముగాను మరియు నిర్దిష్టముగాను ఉన్నవి :

అ. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇందులో (1) శరీరాశ, (2) నేత్రాశ, మరియు (3) జీవపు డంబము ఉన్నవి (1 యోహాను 2:16). సమస్త పాపము ఈ మూడు వర్గములలో ఏదొక దానిలో కనబడును. ఇహలోక ప్రేమలోనికి మనలను ఆకర్షించుటకు. సాతానుడు ఈ మార్గములను ఉపయోగించును. మనము లోకమును ప్రేమించుట ప్రారంభించినప్పుడు, మనము దేవుని శత్రువుల మగుదుము (1 యోహాను 2:15, 16; యాకోబు 4:4).

 ఆ. ఇహలోక మాలిన్యము మనకంటకుండ మనలను మనము కాపాడుకొనవలెను (యాకోబు 1:27).

8. లోకమునకు సంబంధించి దేవుడు మనకు ఏ అత్యవసర హెచ్చరిక నిచ్చుచున్నాడు?

జవాబు: యేసు, “ఈ లోక మర్యాదను అనుసరింపక” యుండుడి అని హెచ్చరించెను (రోమీయులకు 12:2). అపవాది ఊరకనే లేడు. వాడు ప్రతి క్రైస్తవుణ్ణి నిరంతరము ఒత్తిడి చేయును. యేసుక్రీస్తు నందే (ఫిలిప్పీయులకు 4:13), మనము అవవారి సూచనలను గట్టిగా ఎదిరించవలెను, అప్పుడు వాడు మనయొద్ద నుండి పారిపోవును (యాకోబు 4:7).  మన ప్రవర్తనను ప్రభావితము చేయుటకు "మనలను నియంత్రించే” మరే ఇతర కారకాలను మనము అనుమతించిన మరుక్షణము, మనము మతభ్రష్టత్వములోనికి జారుట ప్రారంభించెదము. క్రైస్తవ ప్రవర్తన ఒకని భావాలు మరియు అధికమంది అంగీకారము చేత కాక యేసు ప్రభువు మాటల చేతనే నిర్ణయించబడును.

9. మన ఆలోచనలను మనము ఎందుకు కాపాడుకొనవలెను?

"అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు" (సామెతలు 23:7).

జవాబు : ఆలోచనలు మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి కాబట్టి మన ఆలోచనలను మనం కాపాడుకోవాలి. మన "ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు” దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు (2 కొరింథీయులకు 10:5). కాని సాతానుడు "లోకాశలను" మన ఆలోచనలలోకి తీసుకురావాలని తీవ్రంగా కోరుకుంటాడు. అతడు మన పంచేంద్రియాల ద్వారా మాత్రమే అది చేయగలడు - ముఖ్యముగా చూపు మరియు వినికిడి. అతడు తన దృశ్యాలను మరియు శబ్దాలను మన ఆలోచనలలోనికి రప్పించును. వాటిని మనం స్థిరంగా తిరస్కరించకపోతే, అతడు మనల్ని వినాశనానికి దారితీసే విశాల మార్గములోనికి నడిపిస్తాడు. మనము పదేపడే చూచే మరియు వినే వాటివలెనే మనము తయారవుతామని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది. (2 కొరింథీయులకు 3:18).

10. క్రైస్తవ జీవనమునకు కొన్ని సూత్రములేమిటి?

"యే యోగ్యతయైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుడి" (ఫిలిప్పీయులకు 4:8).

Answer

జవాబు : క్రైస్తవులు నిజాయితీ, న్యాయము, పవిత్రత, మాన్యత మరియు ఖ్యాతి లేని అన్ని విషయాల నుండి తమను తాము వేరు చేసుకొనవలెను. అప్పుడు వారు క్రింది వాటికి దూరంగా ఉంటారు.

అ. ప్రతి విధమైన అనిజాయితీతో కూడిన మోసము, అబద్ధము, దొంగతనము, అన్యాయము, మోసగించే గుణము, అపవాదము మరియు ద్రోహము.

ఆ. ప్రతి విధమైన అపవిత్రత – జారత్వము, వ్యబిచారము, అక్రమ సమంధము, స్వలింగ సంపర్కము, అశిల్లత, అపరిశుద్ధత, అసభ్యకరమైన సంభాషణ, వ్యర్ధమైన కుళ్లు జోకులు, క్షీణింపజేసే పాటలు, సంగీతము, నాట్యము మరియు టీవీలో, సినిమా థియేటర్లలో చూపించబడే దృశ్యాలు.

ఇ. రాత్రిళ్ళు జరిగే క్లబ్బులు, సారా దుకాణములు, జూధగ్రుహములు, పందెపు శాలలు మొదలైనవి మనతో పాటు యేసును ఎప్పుడూ ఆహ్వానించలేని ప్రదేశాలు. జనాదరణ పొందిన సంగీతము, నాట్యము, టీవీ మరియు థియేటర్లలో చూపించే వాటి ప్రమాదాలను అర్ధము చేసుకొనుటకు కొన్ని నిమిషములు తీసుకుందాం.

సంగీతము మరియు పాటలు:

అనేక రకములైన లౌకిక డ్యాన్స్ సంగీతముల వంటివి పెద్ద ఎత్తున సాతాను చేత పట్టబడినవి. వాటిలో వాడే మాటలు, సాహిత్యము చెడుతనమును మహిమపరచి ఆధ్యాత్మిక విషయముల కొరకు ఆకాంక్షను నశింపజేయును. పరిశోధకులు సంగీతమునకును దుష్ప్రభావములకు కొన్ని ఆసక్తికరమైన విషయములను కనుగొనిరి:

1) అది ఆలోచనలను తప్పుద్రోవ పట్టించును.

2) అది శరీరములోని ప్రతి అవయవమును వ్యవస్థను ప్రభావితము చేయును.

3) అది నాడి, శ్వాస క్రమములను మార్చివేసి, వినువారికి తెలియకుండానే ప్రతిచర్య చూపును.

4) మధ్యలో ధ్వని లోపించిన డ్యాన్స్ సంగీత లయలు మానసిక స్థితిని మార్చివేసి వినువారిలో ఒక తెలియని సమ్మోహనమును కలుగజేయును. పాటలో మాటలు లేకుండా వట్టి సంగీతమైనా సరే, అది ఒక వ్యక్తి యొక్కబావవేశాములను, ఆకాంక్షను మరియు తలంపులను క్షీనిమ్పజేయును. లౌకిక రాక్ సంగీతకారులు  దీనిని బహిరంగముగా ఒప్పుకొనుచున్నారు. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ గాయకులు రోలింగ్ స్టోన్స్ నాయకులు మిక్ జాగుర్, "రాక్ సంగీతము వినుచున్నప్పుడు మన శరీరము గుండా ఎడ్రెనలిన్ అనే గ్రంథిరసము ప్రవహించును. అది లైంగిక పరమైనది."' అని చెప్పిరి. హాల్ అండ్ ఓట్స్కు చెందిన ఓట్స్ అనే నేపథ్య గాయకుడు "రాక్ అండ్ రోల్ సంగీతము 99 శాతము లైంగిక పరమైనదని చెప్పిరి.” ఇటువంటి సంగీతము యేసు ప్రభువును సంతోషపరచునా? నేటి మన ఆధునిక లౌకిక సంగీతకారులు మరియు గారడీ విద్య, దయ్యముల

ఆరాధనలో ఉపయోగించిన సంగీతము ఒక్కటే! అని విగ్రహారాధనకు మళ్లిన విదేశీయులు, మనతో చెప్పుచున్నారు. నిన్ను నీవు ప్రశ్నించుకొనుము : "యేసు నన్ను దర్శించుటకు వచ్చిన యెడల, నాతో వినమని ఆయనను అడుగుటకు నాకు ఏ సంగీతము సౌకర్యముగా ఉండును?" నీకు ఖచ్చితముగా తెలియని ఏ సంగీతమునైనను వదిలివేయవలెను. లౌకిక సంగీతమును గూర్చి మరింత లోతైన విశ్లేషణ కొరకు అమేజింగ్ ఫ్యాక్ట్స్ సంస్థ నుండి కొనదగిన కార్ల్ సాటల్ బసిడిస్ రచించిన డ్రమ్స్, రాక్ అండ్ వర్షిప్ అనే పుస్తకమును మీకు సిఫార్సు చేయుచున్నాము.) మనము యేసు ప్రభువుతో ప్రేమలో పడిన యెడల, ఆయనే మన సంగీత వాంఛలను మార్చివేయును. "తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు" (కీర్తన 40:3). దేవుడు తన ప్రజల కొరకు క్రైస్తవ అనుభవమును ప్రేరేపించు, ఉపశమనపరచు, ఉద్ధరించు మరియు బలపరచు సుమధుర సంగీతమును పుష్కలముగా సమకూర్చెను. దీని స్థానములో ఎవరైతే మనలను దిగజార్చు అపవాది సంగీతమును అంగీకరించుదురో వారు జీవితములో కోల్పోరాని దీవెనలను కోల్పోవుదురు.

లౌకికపరమైన నాట్యములు (డ్యాన్సులు)

లౌకికపరమైన నాట్యములు (డ్యాన్సులు) ఖచ్చితముగా యేసు ప్రభువు మరియు ఆధ్యాత్మికత నుండి దూరపరచును. ఇశ్రాయేలియులు బంగారు దూడ చుట్టు దేవుని మరచిపోయి లౌకికపరముగా నాట్యమాడిరి (నిర్గమకాండము 32:17-25). దుర్మార్గురాలైన హేరోదియ కుమార్తె హేరోదు రాజు యెదుట నాట్యమాడినప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను తలగొట్టబడెను (మత్తయి 14:6-10).

టీవీ, సినిమాలు, మరియు ఇంటర్నెట్

టీవీలో, సినిమా థియేటర్లలో లేక ఇంటర్నెట్లో వీక్షించే దశ్యములు నీ దిగువ లేక ఉన్నత స్వభావములకు ఒప్పుదలగా ఉన్నాయా? అవి నిన్ను యేసు ప్రభువుకు అత్యున్నత ప్రేమ చూపులాగున నడిపించుచున్నాయా,  లేక లోకాశల వైపు నడిపించుచున్నాయా? అవి యేసును మహిమపరచుచున్నాయా, లేక సాతాను దుష్టత్వమునా? నేడు లౌకికవాదులు మరియు అన్యులు కూడా అనేక టీవీ మరియు చిత్ర నిర్మాణములకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నారు. సాతాను కోట్లమంది కళ్ళు మరియు చెవులను స్వాధీనము చేసుకున్నాడు, దాని ఫలితము, ప్రపంచాన్ని అనైతికత, నేరము మరియు నిస్సహాయతతో కూడిన మురికిగుంటగా వేగముగా మారుస్తోంది. ఒక అధ్యయనము ప్రకారము, టీవీ లేకుండా "భారతదేశములో సంవత్సరానికి 20 వేల తక్కువ హత్యలు, 30 వేల తక్కువ అత్యాచారాలు మరియు 4 లక్షల తక్కువ దాడులు జరిగేవి. " నిన్ను ప్రేమిస్తున్న యేసు, సాతాను యొక్క ఆలోచన నియంత్రణల నుండి మీ కళ్ళను త్రిప్పి వాటిని ఆయనపై సారించమని అడుగుచున్నాడు. "భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి" అని ఆయన చెప్పుచున్నాడు (యెషయా 45:22).

11.టీవీ చూచుటకు మార్గదర్శకముగా ఉపయోగించుకొనుటకు యేసు ప్రభువు మనకు ఏ జాబితాను ఇచ్చుచున్నాడు?

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అదేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపుచెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను" (గలతీయులకు 5:19-21).

జవాబు : లేఖనమును అపార్థము చేసికొనలేము, అది అంత స్పష్టమైనది పైన పేర్కొనబడిన ఏ పాపములనైనను ప్రదర్శించే లేదా అంగీకరించే అన్ని టీవీ కార్యక్రమములను ఒక కుటుంబము నిషేధించవలెనంటే, చూచుటకు చాలా తక్కువ ఉంటుంది. యేసు ప్రభువు మిమ్ములను సందర్శించుటకు వచ్చిన యెడల, ఏ టీవీ కార్యక్రమములను మీతో చూడమని ఆయనను కోరడం మీకు సౌకర్యముగా ఉంటుంది? మిగతా అన్ని ప్రదర్శనలు బహుశా క్రైస్తవులు చూచుటకు అనర్హమైనవి.

12. నేడు చాలామంది యేసుతో సహా ఎవరి నుండి సలహా లేకుండా ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు భావించుచున్నారు. అలాంటి వారి గురించి యేసు ప్రభువు ఏమి చెప్పుచున్నాడు?

జవాబు: యేసు యొక్క స్పష్టమైన ప్రకటనలను, వినండి: “నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు” (ద్వితీయోపదేశకాండము 12:8). “ఒకని మార్గము వాని దృష్టికి యధార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును” (సామెతలు 16:25) “మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును” (సామెతలు 12:15). "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు" (సామెతలు 28:26).

13. మన జీవితముల మాదిరి మరియు ప్రభావము గురించి యేసు ఏ గంభీరమైన హెచ్చరిక నిచ్చుచున్నాడు?

"నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని (పాపము చేయుటకు) అభ్యంతర పరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు" (మత్తయి 18:6). "సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుండుము" (రోమీయులకు 14:13). "మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు" (రోమీయులకు 14:7).

జవాబు : నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులు మరియు ప్రముఖులు మంచి ఉదాహరణను చూపిస్తూ వారి ప్రభావాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని మనమందరము ఆశిస్తాము. కానీ నేటి ప్రపంచములో, ఈ ప్రముఖ వ్యక్తుల యొక్క అసహ్యకరమైన, బాధ్యతా రహితమైన చర్యల వల్ల మనం తరచుగా భ్రమలో పడుతున్నాము. అదే విధంగా, తమ సొంత ప్రభావాన్ని మరియు ఉదాహరణను పట్టించుకోని క్రైస్తవులు ప్రజలను తన రాజ్యం నుండి దూరంగా నడిపించే ప్రమాదం ఉందని యేసు గంభీరంగా హెచ్చరించాడు!

14.వస్త్రధారణ మరియు ఆభరణములకు సంబంధించి యేసు ప్రభువు యొక్క ప్రవర్తన సూత్రములేమిటి?

Answer

జవాబు :

ఆ. తగుమాత్రపు వస్త్రములను ధరించుకొనుడి. 1 తిమోతి 2:9 చూడుము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ద్వారా లోకాశలు మన జీవితములలోనికి తేబడినవని గుర్తుంచుకొనుము (1 యోహాను 2:16). అణకువలేని వస్త్రధారణ ఈ మూడింటిని కలుగజేయును మరియు క్రైస్తవున్ని హద్దుమీరేలా ప్రవర్తింపజేయును.

B. ఆ. నగలు మరియు ఆభరణములను ఒక ప్రక్కన పడవేయుము."జీవపుడంబము" ఈ విషయములో పెద్ద సమస్యగా ఉన్నది. యేసు యొక్క అనుచరులు ప్రత్యేకముగా అగుపడవలెను. వారి ఆకారము (అగుపడు విధము) ఇతరులకు సాక్ష్యముగా వెలుగు నందించును (మత్తయి 5:16). ఆభరణములు ఆకర్షింపజేసి గర్వమును రేకెత్తును. బైబిలులో విశ్వాసములో సడలిపోవుట (వెనుకబడుట) మరియు భ్రష్టత్వమునకు ఇది గుర్తుగా ఉన్నది. యాకోబు మరియు తన కుటుంబము తమ జీవితములను మరొకసారి దేవునికి సమర్పించుకొనినప్పుడు, వారు తమ ఆభరణములను భూమిలో పాతిపెట్టిరి (ఆదికాండము 35:1, 2, 4) ఇశ్రాయేలీయులు సరిగ్గా వాగ్దానభూమిలో ప్రవేశించేనప్పుడు, తమ నగలను తీసివేయవలసిందిగా దేవుడు వారి కాజ్ఞాపించెను (నిర్గమకాండము 33:5, 6). యెషయా 3వ అధ్యాయములో, ఆభరణములు (కడియములు, ఉంగరములు, చెవి కమ్మలు, మొదలగునవి) ధరించుకొనుట యందు ఆయన ప్రజలు పాపము చేయుచున్నారు. (9వ వచనము) దేవుడు స్పష్టముగా (యెషయా 3:19-23లో జాబితా చేయబడిన), హోషేయా 2:13లో ప్రభువు చెప్పునదేమనగా, ఇశ్రాయేలీయులు ఆయనను మరచినప్పుడు, వారు మళ్ళీ నగలు ధరించుట ప్రారంభించిరి. 1 తిమోతి 2:9 మరియు 1 పేతురు 3:3లో, పౌలు మరియు పేతురులిద్దరు దేవుని ప్రజలు బంగారము, ముత్యములు, మరియు ఖరీదైన వస్త్రములతో తమను తాము అలంకరించుకొనరని మనకు సమాచారమిచ్చిరి. పౌలు మరియు పేతురు తన ప్రజలు ధరించవలెనని దేవుడు కోరుకొనుచున్న ఆభరణముల గురించి కూడ మాట్లాడిరని గమనించుము. అవేవనగా: "సాధువైనట్టియు, మృధువైనట్టియునైన గుణము" (1 పేతురు 3:4) మరియు "సత్క్రియలు" (1 తిమోతి 2:10). యేసు ప్రభువు దీనిని కుదించి ప్రకటన 12:1లోని ఆయన నిజమైన సంఘమును సూర్యుని (యేసు ప్రభువు ప్రకాశమానము మరియు నీతి) ధరించుకొనిన పవిత్రురాలైన స్త్రీగా మరియు భ్రష్టత్వము నొందిన సంఘమును బంగారము, అమూల్యమైన రత్నములు మరియు ముత్యములతో అలంకరింపబడిన వేశ్యగా సూచించెను (ప్రకటన 17:3, 4), బబులోను నుండి తమను తాము వేరుపర్చుకొనమని (ప్రకటన 18:2, 4-6) దానికి సాదృశ్యమైన గర్వమునకు దృష్టి మళ్ళీంచు ఆచరణములను సహా విడనాడి వాటికి బదులుగా (ప్రకటన 18:2-4) తమను తాము యేసు నీతితో అలంకరించుకొనమని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. మనము యేసుతో ప్రేమలో పడినప్పుడు ఆయన జీవన విధానమును అనుసరించి జీవించుట మనకు మిక్కిలి సంతోషము మరియు ఆనందదాయకమగును.

15. ప్రవర్తన మరియు విధేయత రక్షణతో ఎట్లు సంబంధము కలిగి ఉంటాయి?

జవాబు: క్రైస్తవ విధేయత మరియు ప్రవర్తన నేను యేసు క్రీస్తు చేత రక్షింపబడి యున్నాననుటకు ఋజువు లేక నిదర్శనము (యాకోబు 2:20-26). నిజానికి ఒకడు మారుమనస్సు నొందిన తరువాత మార్పు చూపించని యెడల, ఆ మారుమనస్సు వాస్తవానికి నిజమైనది కాదు. మారుమనస్సు నొందిన వ్యక్తి అన్ని విషయములలో యేసు చిత్తమును కనుగొనుట యందు మరియు ఆయన చూపించు మార్గమును వెంబడించుట యందు తన ఉన్నతానందమును కనుగొనును.

విగ్రహారాధన విషయమై జాగ్రత్తగా ఉండుడి.

యోహాను వ్రాసిన మొదటి పత్రిక క్రైస్తవ ప్రవర్తనను గూర్చి మాట్లాడుచున్నది. దాని ముగింపు నందు (1 యోహాను 5:21), విగ్రహములకు దూరముగా ఉండుడని యేసు తన దాసుని ద్వారా మనలను హెచ్చరించుచున్నాడు. ఆయన యెడల మన ప్రేమను తగ్గుముఖము పట్టించు దేనినైనను విగ్రహముగా బోధకుడు సూచించుచున్నాడు - అవి దుష్టపరమైన సంగీతము, దురలవాట్లు, ఆస్తులు, అలంకరణ, దుష్టపరమైన వినోదము మొదలగునవి. నిజమైన మారుమనస్సు యొక్క సహజ ఫలము, లేక ఫలితమేదనగా యేసును సంతోషముగా వెంబడించుచు ఆయన జీవన విధానమును అనుసరించుటయే.

16. క్రైస్తవ జీవన శైలిపై ప్రతి ఒక్కరు ఆమోదముతో కూడిన దృష్టితో చూడాలని మనము ఆశించవలెనా?

జవాబు: లేదు దేవుని విషయములు ప్రకృతి సంబంధమైన మనుష్యునికి వెఱ్ఱితనముగా ఉన్నవి ఎందుకనగా అవి ఆత్మానుభవము చేత వివేచింపబడలేదు. (1 కొరింథీయులకు 2:14) ప్రవర్తనను గూర్చి యేసు ప్రభువు సూచించునప్పుడు, తన ఆత్మచేత నడిపింపబడుటకు వెదకువారి కొరకు ఆయన సూత్రముల నిచ్చుచున్నాడు. ఆయన ప్రజలు కృతజ్ఞులై సంతోషముతో ఆయన ఉపదేశము నంగీకరింతురు. ఇతరులు దానిని అర్ధము చేసికొనకపోవచ్చును లేదా అంగీకరించకపోవచ్చును.

17. ప్రవర్తన కొరకు యేసు యొక్క ప్రమాణములను తిరస్కరించు వ్యక్తి పరలోకమును ఏ దృష్టితో చూచును?

జవాబు : అటువంటి వ్యక్తి పరలోకములో అసౌకర్యముగా ఉండును. వినోద మందిరములు, మద్యపానములు, అశ్లీల సన్నివేశములు, వ్యభిచార స్త్రీలు, కామ సంగీతము, కామాతుర పుస్తకములు అపవిత్రత, జూదము లేవని అతడు సణుగుకొనుచు అసంతృప్తి వ్యక్తము చేయును. యేసుతో నిజమైన ప్రేమ సంబంధమును ఏర్పరచుకొనని వారికి పరలోకము "నరలోకము"లాగా ఉండును. ఇందుచేత క్రైస్తవ ప్రమాణములు వారికి అర్ధము కానివిగాను అవివేకముగాను(వెఱ్ఱితనముగాను) ఉన్నవి (2 కొరింథీయులకు 6:14-17).

18. How can I follow these Bible guidelines without appearing judgmental or legalistic?

18. విమర్శనాత్మకముగాను లేదా క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమును అనుసరించుచున్నట్లుగాను కనిపించకుండ నేను ఈ బైబిలు మార్గదర్శకాలను ఎలా అనుసరించగలను?

జవాబు : మనము చేయునదంతయు మనస్సులో ఒకే ఒక్క తలంపుతో చేయవలెను. యేసుకు మన ప్రేమను మరియు ఘనతను వ్యక్తపరచుట  (1 యోహాను 3:22). యేసు పైకెత్తబడి ప్రజలకు కనపరచబడినప్పుడు (యోహాను 12:32), వారు ఆయన యొద్దకు ఆకర్షింపబడెదరు. మన ప్రశ్న ఎప్పుడూ ఇలా ఉండాలి, "ఈ సంగీతము, పానీయము, టీవీ కార్యక్రమము, సినిమా, పుస్తకము మొదలైనవి యేసును ఘనపరుస్తాయా?" మన జీవితంలోని ప్రతి కోణంలో మరియు కార్యకలాపాలలో యేసు సన్నిధిని మనం గ్రహించాలి. మనము ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు, మనం ఆయనలాగే అవుతాము (2 కొరింథీయులకు 3:18) - మరియు మన చుట్టూ ఉన్న ప్రజలు ఆనాటి కాలములోని శిష్యులకు స్పందించినట్లు మనకు స్పందిస్తారు: "వారు ఆశ్చర్యపడి, .. వారు యేసు కూడ ఉండినవారని గుర్తెరిగిరి" (అపొస్తలుల కార్యములు 4:13). ఆ విధముగా జీవించు క్రైస్తవులు ఎన్నడును దొంగభక్తులుగా, విమర్శనాత్మకముగా, క్రియల ద్వారా రక్షణను నమ్మువారుగా మారరు. పాత నిబంధన దినములలో, దాదాపుగా స్థిరమైన భ్రష్టత్వములో దేవుని ప్రజలుండిరి, ఎందుకనగా దేవుడు వారికి నిర్దేశించిన నిర్దిష్టమైన జీవిత విధానము ననుసరించుటకు బదులుగా వారు తమ పొరుగు అన్యజనుల వలె జీవించుటకు ఎంపిక చేసుకొనిరి (ద్వితీయోపదేశకాండము 31:16, న్యాయాధిపతులు 2:17; 1 దినవృత్తాంతములు 5:25; యెహెజ్కేలు 23:30). నేడు అదే ఇంకను వాస్తవముగా జరుగుచున్నది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై యుండనేరడు (మత్తయి 6:24). లోకమునకు దాని జీవన విధానమునకు వ్రేలాడువారు నెమ్మదిగా సాతానుచేత నిర్దేశింపబడుదురు. క్రైస్తవ ప్రవర్తన కొరకు యేసు నిర్దేశించిన సూత్రములను అనుసరించువారు ఆయన స్వరూపములోనికి మార్చబడి పరలోకము కొరకు సిద్ధపరచబడుదురు, తటస్థమైన మార్గము లేనేలేదు.

19. క్రైస్తవ జీవనమునకు ఆయన సూత్రములను పాటించుట ఆనందము మరియు సంతోషదాయకమగునంత ఎక్కువగా నీవు క్రీస్తును ప్రేమించాలనుకొనుచున్నావా?

నీ జవాబు :


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1.నా జీవనశైలికి సంబంధించి దేవుడు నేనేమీ చేయాలని కోరుచున్నాడో నాకు తెలియును, కాని నేను దీనిని ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నానని నాకు అనిపించుట లేదు. మీరేమి సూచిస్తారు?

జవాబు : నేడే దీనిని చేయుట ప్రారంభించండి! మీ సొంత భావాలపై ఎప్పుడూ ఆధారపడకండి. దేవుడు లేఖనములోని ప్రమాణవాక్యము ద్వారా మార్గనిర్దేశము చేస్తాడు (యెషయా 8:20). భావాలు తరచూ మనల్ని దారితప్పేలా చేస్తాయి. యూదా మత నాయకులు యేసును సిలువ వేయాలని భావించారు, కాని వారు తప్పుడు ఆలోచనతో ఉన్నారు. యేసు రెండవ రాకడకు ముండే అనేకమంది రక్షింపబడినామని భావిస్తారు, కాని బదులుగా వారు నశించుదురు (మత్తయి 7:21-23). అపవాది భావావేశాలను ప్రభావితము చేస్తాడు. మన సొంత భావాలపై ఆధారపడిన యెడల, అతడు మనల్ని నాశనానికి దారి తీస్తాడు.

2. నేను ఒక పని చేయాలని ఎంతగానో ఆశపడుచున్నాను. అయినప్పటికీ, అది కనబడే విధానమును బట్టి, నేను చెడు చేస్తున్నానని కొందరు భావిస్తున్నారని నేను గ్రహించాను. నేనేమి చేయవలెను?

జవాబు : "ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి" అని బైబిలు చెప్పుచున్నది (1 థెస్సలొనీకయులకు 5:22). విగ్రహాలకు అర్పించే ఆహారాన్ని తినడం ఒకరిని అభ్యంతరపరచిన యెడల, తాను ఆ ఆహారాన్ని మరలా ముట్టడని అపొస్తలుడైన పౌలు చెప్పెను (1 కొరింధీయులకు 8:13). అతడు అభ్యంతరపడిన వ్యక్తి యొక్క భావాలను విస్మరించి, మాంసము తినుటయందు నిలిచియున్న యెడల, తాను పాపము చేయునని కూడ అతడు చెప్పెను.

3. నేను చేయవలసిన చాలా విషయములు మరియు నేను చేయకూడని చాలా పనులను సంఘమ జాబితా చేస్తున్నట్లు నాకనిపించుచున్నది. ఇది నాకు చికాకు పుట్టించుచున్నది. యేసును అనుసరించుట నిజముగా ముఖ్యము కాదా?

 జవాబు : అవును - యేసును అనుసరించడమే ముఖ్యము. ఏదేమైనా, యేసును అనుసరించడం అంటే ఒక్క వ్యక్తికి ఒకలాగా అర్ధమవుతుంది, మరొకరికి ఇంకోలా అర్ధమవుతుంది. యేసును అనుసరించడం అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఉన్న ఏకైక సురక్షితమైన మార్గమేమిటంటే, బైబిల్లో ఏ ప్రశ్నకైనా యేసు సమాధానాన్ని చెప్పడాన్ని కనుగొనడమే. యేసు ఆజ్ఞలను ప్రేమతో పాటించేవారు త్వరలో ఒక రోజు ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తారు. (ప్రకటన 22:14). మనుష్యులు కల్పించిన పద్ధతులు పాటించే వారు త్రోవతప్పి ఆయన రాజ్యమునకు దూరముగా నడిపించబడతారు (మత్తయి 15:3-9).

4. దేవుని అవసరములు కొన్ని అసమంజసమైనదిగా మరియు అనవసరమైనదిగా అనిపించవచ్చును. కాని అవి ఎందుకు అంత ముఖ్యమైనవి?

జవాబు : పిల్లలు తమ తల్లిదండ్రుల అవసరములు కొన్ని (ఉదాహరణకు "వీధిలో ఆడకండి") వంటివి అసమంజసమైనవని పిల్లలు భావిస్తారు. కాని సంవత్సరాలు గడిచేకొద్ది, పిల్లవాడు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతాడు! దేవునితో వ్యవహరించడంలో మనము పిల్లలము", ఎందుకనగా ఆకాశము భూమి పైన ఎంతో ఎత్తుగా ఉన్నట్లుగా ఆయన ఆలోచనలు, తలంపులు మనకంటే ఎత్తుగా ఉన్నవి (యెషయా 55:8, 9). మన ప్రేమామయుడైన పరలోకపు తండ్రిని మనం అర్ధం చేసుకోలేని కొన్ని ప్రాంతాలలో కూడా విశ్వసించి, ఆయనకు అవసరమైతే “వీధిలో ఆడటం” ఆపాలి. ఆయన మనకు ఏ మేలును చేయక మానదు (కీర్తన 84:11). మనం యేసును నిజంగా ప్రేమిస్తున్నప్పుడు, ఇది ఎందుకో అని మనకు ఎల్లప్పుడు అర్ధము కాకపోయినను మనం ఆయనకు ప్రయోజనకరముగా ఆయన చిత్తమును చేస్తాము. దీనికి నూతనముగా జన్మించడమే కీలక సూత్రము. మనం మరలా జన్మించినప్పుడు, లోకమును జయించుట కష్టము కాదని బైబిలు చెప్పుచున్నది, ఎందుకనగా మారుమనస్సు నొందిన వ్యక్తికి ప్రతి విషయములో యేసును సంతోషముగా అనుసరించే నమ్మకము ఉంటుంది (1 యోహాను 5:4). ఆయనకున్న కారణాలపై మనకు స్పష్టత లేనందున ఆయనను అనుసరించుటకు నిరాకరించుట మన రక్షకుడిపై మన అపనమ్మకమును ప్రదర్శిస్తుంది.

5. యేసు యొక్క ప్రేమామయమైన సూత్రములు, చట్టములు మరియు ఆజ్ఞల నుండి నేను ప్రయోజనము పొందుదునా?

జవాబు : ఖచ్చితముగా! యేసు యొక్క ప్రతి సూత్రము, నియమము, చట్టము లేదా ఆదేశము నమ్మశక్యము కాన్ని ఆశీర్వాదములను మనకందించును. తన విధేయులైన పిల్లలకు దేవుని గొప్ప ఆశీర్వాదములతో పోల్చినప్పుడు చరిత్రలో అతిపెద్ద అదృష్ట లాటరీ విజయము కూడా చాలా తక్కువగా ఉండును. యేసు నియమములను పాటించుట ద్వారా కలుగు కొన్ని ప్రయోజనములు ఇక్కడున్నవి :

1.వ్యక్తిగత స్నేహితుడిగా యేసు 2. వ్యాపారములో భాగస్వామిగా యేసు 3. అపరాధము నుండి విముక్తి 4. మనశ్శాంతి 5. భయము నుండి విముక్తి 6. వర్ణించలేని ఆనందము 7. దీర్ఘాయువు 8. పరలోకములో గృహమును గూర్చిన భరోసా 9. మంచి ఆరోగ్యము 10. దుష్ప్రభావములు ఉండవు

ధనము ఐశ్వర్యము గురించి మాట్లాడండి! నిజమైన క్రైస్తవుడు తన పరలోకపు తండ్రి నుండి భూమిపై ధనవంతులు కూడా ఎన్నడూ కొనలేని ప్రయోజనాలను పొందుతాడు.

6. ప్రమాణాలు మరియు జీవనశైలికి సంబంధించి, వాటి గురించి ఇతర వ్యక్తులను బోధపరచే బాధ్యత నాపై ఉన్నదా?

జవాబు : మన సొంత జీవనశైలి గురించి చూచుకొనుట మనము పాటించవల్సిన ఉత్తమ నియమము, 2 కొరింథీయులకు 13.5లో "మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి” అని బైబిలు చెప్పుచున్నది. మన జీవనశైలి ఎట్లుండవలెలో, మన జీవిత మాదిరి ఒక నిశ్శబ్ద సాక్షిగా పనిచేయును, మనము ఎవరికిని ఉపన్యసించవలసిన అవసరము లేదు. అయితే యేసును ఎట్లు అనుసరించవలెనో తమ పిల్లలను అర్థము చేసికొనజేసే ప్రత్యేక బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది.

7. నేడు క్రైస్తవులకున్న గొప్ప ప్రమాదములేమిటి?

జవాబు : గొప్ప ప్రమాదములలో ఒకటి విభజించబడిన విధేయతలు లేక విశ్వాసములు. చాలామంది క్రైస్తవులకు హృదయమును విభజించే రెండు ప్రేమలున్నవి: యేసు పట్ల ప్రేమ మరియు లోకము దాని పాపపు పద్ధతులు పట్ల ప్రేమ. చాలామంది వారు లోకమును ఎంత దగ్గరగా అనుసరించగలరో చూడాలనుకొనుచు ఇంకను క్రైస్తవులుగా పరిగణించబడాలని కోరుకుంటారు. ఇది పనిచేయదు. “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరదు" అని యేసు హెచ్చరించెను (మత్తయి 6:24).

8. అయితే ఈ ప్రవర్తనా నియమములను పాటించుట క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తు కాదా?

 జవాబు : కాదు, ఒక వ్యక్తి రక్షింపబడుటకు చేస్తే తప్ప. రక్షణ యేసు నుండి ఒక అద్భుతమైన, ఉచిత బహుమానముగా మాత్రమే వచ్చును. క్రియల ద్వారా రక్షణ (లేదా ప్రవర్తన) అనేది అస్సలు రక్షణే కాదు. అయినను, మనము రక్షింపబడినందున యేసు ప్రవర్తనా ప్రమాణాలను పాటించుచు ఆయనను ప్రేమించుట మనునది క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకమునకు గుర్తు కాదు.

9. మన వెలుగు ప్రకాశింపజేయమనిన యేసు ఆజ్ఞతో క్రైస్తవ ప్రమాణాలు నిమగ్నమైయున్నవా?

 జవాబు : ఖచ్చితముగా! నిజమైన క్రైస్తవుడు వెలుగైయున్నాడని యేసు చెప్పెను (మత్తయి 5:14). ఆయన "మనుష్యులు మీస సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి" అని చెప్పెను (మత్తయి 5:16). మీరు వెలుగును వినరు, మీరు దానిని చూస్తారు! తన ప్రవర్తన - వస్త్రధారణ, ఆహారము, సంభాషణ, వైఖరి, సానుభూతి, పవిత్రత, దయ మరియు నిజాయితీ ద్వారా క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు ప్రకాశించుట ప్రజలు చూచెదరు మరియు వారు అలాంటి జీవనశైలి గురించి తరుచు ఆరా తీసి క్రీస్తు యొద్దకు కూడ నడిపించబడెదరు.

10. క్రైస్తవ ప్రమాణాలు సాంస్కృతికముగా (సాంప్రదాయముగా) లేవా? కాలముతో పాటు అవి మారకూడదు?

జవాబు : సాంప్రదాయాలు మారవచ్చును, కాని బైబిలు ప్రమాణాలు ఎన్నటికి నిలుచును. "మన దేవుని వాక్యము నిత్యము నిలుచును" (యెషయా 40:8). క్రీస్తు సంఘము తప్పక నడిపించాలి. అనుసరించకూడదు. ఇది సంస్కృతి, మానవతావాదము లేదా అనుదిన పోకడల ద్వారా నడిపింపబడకూడదు. మనము సంఘమును మానవ తప్పుడు ప్రమాణాలకు దిగజార్చడము కాదు గాని, యేసు పవిత్రమైన ప్రమాణాలకు అది చేరువగునట్లు చేయడమే ముఖ్యము. ఒక సంఘము లోకము వలె మాట్లాడినప్పుడు, కనిపించినప్పుడు మరియు ప్రవర్తించినప్పుడు, సహాయము కొరకు ఎప్పుడైనా దాని వద్దకు ఎవరు వెళతారు? యేసు తన ప్రజలకు మరియు సంఘమునకు ఒక స్పష్టమైన పిలుపునిస్తూ, "మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడి, నేను మిమ్మును చేర్చుకొందును" అని చెప్పెను (2 కొరింథీయులకు 6:17). క్రీస్తు సంఘము లోకమును అనుకరించడము కాదు, దానిని జయించాలి. "లోకము" కోట్లాదిమందిని సర్వనాశనము చేసినది. సంఘము దాని అల్లకల్లోలములో చేరకూడదు. సంఘము ఎత్తుగా నిలువబడవలెను మరియు దయగల స్వరముతో, యేసు మాట వినుటకు మరియు ఆయన ప్రమాణాలకు దగ్గరగా వచ్చుటకు ప్రజలను పిలువవలెను. ఆ పిలుపును విన్నవాడు యేసుతో ప్రేమలో పడి తన జీవితమును ఆయన ఆధీనములో ఉంచుకొనమని కోరినప్పుడు, రక్షకుడు అతనిని మార్చుటకు అవసరమైన అద్భుతాలను చేయును మరియు అతనిని దేవుని శాశ్వతమైన రాజ్యానికి సురక్షితముగా తీసుకొనిపోవును. ఈ మార్గము తప్పు పరలోకమునకు వేరొక మార్గము లేదు.

11. ఖచ్చితముగా అన్ని నాట్యములు (డ్యాన్సులు) చెడ్డవి కావు. దావీదు యహోవా సన్నిధి ఎదుట నాట్యము చేయలేదా?

జవాబు : నిజమే, అన్ని నాట్యములు (డ్యాన్సులు) చెడ్డవి కావు. ఆయన ప్రసాదించిన దీవెనల నిమిత్తము స్తుతులర్పించుచు దావీదు ప్రభువు సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడెను (2 సమూయేలు 6:14-16). అది కూడ అతడు స్వయముగా తానే నాట్యమాడుచుండెను. దావీదు నాట్యము యేసు నామములో పేతురు ద్వారా స్వస్థత పొందిన తరువాత ఆనందముతో ఎగిరి గంతులు వేసిన కుంటివాని నాట్యానికి సమానముగా ఉన్నది (అపొస్తలుల కార్యములు 3:8-10). ఇటువంటి నాట్యమును, లేదా గంతులు వేయుటను, హింసింపబడుచున్న వారి కొరకు యేసు ప్రభువు ప్రోత్సహించుచున్నాడు (లూకా 6:22, 23), పర స్త్రీ లేక పురుషునితో కలిసి నాట్యము చేయుట (అనైతికతకు మరియు  విరిగిన గృహాలకు దారితీసే నాట్యము) మరియు అసభ్యకరమైన నాట్యము (శృంగార లేక అశ్లీల నాట్యము వంటిది), ఇవి రెండు బైబిలు ఖండించుచున్న నాట్యములు.

12. ప్రజలు ఒకరినొకరు ఖండించుకొనుట మరియు తీర్పు తీర్చుకొనుటను గురించి బైబిలు ఏమి చెప్పుచున్నది?

జవాబు : "మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును" (మత్తయి 7:1, 2). "కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? (రోమీయులకు 2:1). ఇది ఎట్లు స్పష్టముగా ఉండును? క్రైస్తవులు ఎవరికైనను తీర్పు తీర్చుటకు ఎటువంటి అవసరముగాని లేదా సమర్ధింపుతో కూడిన కారణముగాని లేదు. యేసే తీర్పు తీర్చువాడు (యోహాను 5:22). మనము ఇతరులపై తీర్పు వెలువరించినప్పుడు, మనము క్రీస్తు న్యాయాధిపతి పాత్రను అన్యాయముగా స్వాధీనము చేసికొనినవారమై ఒక చిన్నపాటి క్రీస్తువిరోధిగా తయారవుతాము (1 యోహాను 2:18), నిజముగా ఇదొక గంభీరమైన ఆలోచన!

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) ప్రవర్తన కొరకు యేసు యొక్క ప్రేమామయమైన సూత్రములు నేను ఆయనతో ప్రేమలో పడినప్పుడు అనుసరించుట ఆనందకరమగును (1)

( ) అవును. ( ) కాదు.

 2) నేను రక్షింపబడినందున యేసు యొక్క ప్రవర్తనా ప్రమాణాలను పాటించుట మరియు ఆయనను ప్రేమించుట క్రియల ద్వారా రక్షణ అనే

నమ్మకమునకు గుర్తు. (1)

( ) అవును. ( ) కాదు.

3) బైబిలు గ్రంథము యొక్క నిజమైన రచయిత యేసు. (1)

( ) అవును.  ( ) కాదు.

4) "లోకమును ప్రేమింపకుడి" అనగా మనము (1)

( ) మన దేశమును ప్రేమించకూడదు.

( ) లోకమును మన గ్రహముగా ప్రేమించకూడదు

( ) ఈ లోకములోని పాపాత్మకమైన, దుష్ట, భక్తిహీన మార్గములు మరియు విషయములను ప్రేమించకూడదు.

5) యేసు ప్రభువు మనకు నిర్దిష్ట ఆజ్ఞలు, చట్టాలు మరియు నియమములను ఎందుకిచ్చును? (5)

( ) ఎల్లప్పుడు మన మేలు కొరకు.

( ) తద్వారా ఇతరులకు మంచి మాదిరిగా ఎలా ఉండాలో మనకు తెలియును.

( ) మన స్వతంత్రమును తీసివేయుటకు.

( ) తద్వారా మనము క్రీస్తు అడుగుజాడలో నడవవచ్చును.

( ) పాపము నుండి మనలను రక్షించుటకు .

( ) మనలను బలవంతముగా నియంత్రించుటకు.

( ) మనకు నిజమైన ఆనందమును తెచ్చుటకు.

6) సరైన క్రైస్తవ ప్రవర్తన ఏమిటో  నిర్ణయించుటకు రెండు మంచి నియమములు క్రింద ఉన్నవి : (2)

( ) బైబిలు ఏమి చెప్పుచున్నదో కనుగొనుము.

( ) సంఘ సభ్యులు ఏమి చేస్తారో గమనించి చూడుము.

( ) వ్రేళ్ళను ఒక సుచికపై పెట్టిజవాబులు తెలుసుకునే లిపి ఫలకమును సంప్రదించుము.

( ) మీ బావాలకు అనుగుణముగా వెళ్ళుము.

( ) నీ స్థానములో ఉంటే యేసు ఏమి చేస్తాడో నిన్ను నీవే ప్రశ్నించుకోనుము.

7) మన పంచేంద్రియాల ద్వారా మాత్రమే సాతానుకు మనలో ప్రవేశమున్నది. (1).

( ) అవును. ( ) కాదు.

8. క్రింద జాబితా చేయబడిన క్రిస్తవ ప్రవర్తన యొక్క ఏ లక్షణాలు లేక అంశాల కొరకు యేసు కొన్ని నిర్దిష్ట సలహాలు మరియు మార్గదర్శకాలను అందిమ్చుచున్నాడు? (5)

( ) మన వస్త్రధారణ ఎలా ఉన్నది.

( ) ఆరోగ్యకరమైన జీవనము,

( ) దేహ అలంకరణ.

( ) ఒలింపిక్ శీతాకాలపు మంచు క్రీడ

( ) తినుట మరియు త్రాగుట.

( ) విమానమును నడుపుట.

( ) ఇల్లు కొనుక్కొనుట.

( ) మాదిరి మరియు ప్రభావము.

9) ప్రవర్తన మరియు విధేయత రక్షణకు ఎట్లు సంబంధము కలిగి ఉంటాయి? (1)

( ) మన ప్రవర్తన మరియు విధేయత ద్వారా మనము రక్షింపబడ్డాము.

( ) రక్షింపబడిన వ్యక్తి ప్రవర్తన మరియు విధేయతను విస్మరించి ఇంకను పరలోకమునకు సిద్ధముగా ఉండగలడు.

( ) ప్రవర్తన మరియు విధేయత అనేది ఒకడు మారుమనసు పొందెను, లేదా నూతనముగా మరల జన్మించెననుటకు నిదర్శనము.

10) ఆభరణములు, లోకపరమైన సంగీతము లేదా అనైతిక టీవీ కార్యక్రమములు చూచుట వంటి వాటిని విడిచిపెట్టమని యేసు నన్ను కోరినట్లయితే, వాటిని విడిచిపెట్టుటకు నేను నిరాకరించిన యెడల, దేవుడు ఆ విడిచిపెట్టని విషయమును నాకు విగ్రహముగా పరిగణించును. (1)

( ) అవును. ( ) కాదు.

11) క్రైస్తవ జీవితము ఒక మంచి వివాహము వంటిది, అందులో విజయము మనలను ప్రేమించు వ్యక్తిని సంతోషపెట్టుట మనలక్షమైనపుడు వచ్చును. (1)

( ) అవును. ( ) కాదు.

12) క్రింద జాబితా చేయబడిన ఏ మూడు మార్గముల ద్వారా సాతానుడు ప్రజలను పాపములోనికి" నడిపించును? (3)

( ) వారి బైబిళ్లను వారి నుండి దాచుట ద్వారా

( ) జీవపుడంబము ద్వారా.

( ) ఆకాశములో సందేశములు వ్రాయుట ద్వారా.

( ) శరీరాశ ద్వారా.

( ) నేత్రాశ ద్వారా.

  1. 13. మన ఆలోచనలను కాపాడుకొనుట చాలా ప్రాముఖ్యము, ఎందుకనగా ఆలోచనలు చర్యలుగా మారును. (1)

( ) అవును. ( ) కాదు.

14) యేసును నమ్మకముగా అనుసరించుట వలన వాగ్దానము చేయబడిన కొన్ని ప్రయోజనములు క్రింద ఉన్నవి : (7)

( ) ఎట్లు ప్రవచించాలో నీకు తెలియును.

( ) ఎక్కువ కాలము నీవు జీవించుదువు.

( ) వర్ణించలేని ఆనందమును నీవు పొందుదువు.

( ) మంచి ఆరోగ్యము నీకుండును.

( ) పరలోకములో ఉన్న గృహమును గూర్చిన భరోసా నీకుండును.

( ) భయము నుండి విముక్తి నీకుండును.

( ) వ్యక్తిగత మిత్రునిలా యేసు నీకుండును.

( ) మనశ్శాంతిని నీవు పొందుదువు.

15) నా ప్రవర్తన వేరొక క్రైస్తవుని అభ్యంతరపరచిన యెడల, నేను ఏమి చేయవలెను? (1)

( ) పట్టించుకొనుము. ఎవ్వరూ ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేరు.

( ) ఒకనితో నొకడు పోరాడి తేల్చుకొనుడి.

( ) ఆ వ్యక్తితో తెగదెంపులు చేసుకొనుము.

( ) ప్రతి ఒక్కరికి తెలియజెప్పుము, తద్వారా సంఘ సభ్యులు ఏమి చెయ్యాలో నిర్ణయించవచ్చును.

( ) ఆ అభ్యంతరపరిచే పనేదో దానిని చేయుటమానివేయుము.

16) బైబిలు సలహాలను వినుట కంటే తన దృష్టికి సరియైనదిగా కనబడు సొంత మార్గమును కలిగి ఉండాలని నిశ్చయించుకున్న వ్యక్తిని యేసు ఏమని పిలుచుచున్నాడు? (1).

( ) స్వతంత్రముగా ఆలోచించువాడు.

( ) తెలివైన వ్యక్తి.

( ) బుద్ధిహీనుడు (మూర్ఖుడు).

17) క్రైస్తవ జీవనము కొరకు యేసు ప్రమాణాలను తిరస్కరించే వ్యక్తి (1).

( ) పరలోకమునకు చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆధ్యాత్మిక విషయములను ప్రేమించుట ప్రారంభించును.

( ) పరిశుద్ధ పట్టణములో కొన్ని రోజుల తరువాత అతని హృదయ కాఠిన్యమును బట్టి పశ్చాత్తాపపడును.

( ) పరలోకములో సంతోషముగా ఉండలేదు.

18) క్రైస్తవ జీవనము కొరకు ఆయన సూత్రములను పాటించుట ఆనందము మరియు సంతోషదాయక మగునంత ఎక్కువగా నేను క్రీస్తును ప్రేమించాలను కొనుచున్నాను.

( ) అవును. ( ) కాదు.