Lesson 16

దేవదూతలు నిజముగా ఉన్నారు! కొన్నిసార్లు కెరూబులు లేదా సెరాపులుగా పిలువబడే ఈ శక్తివంతమైన దైవ పరిచారక దూతలు బైబిలు చరిత్రయంతటిలో కనిపిస్తారు. తరచుగా వారు దేవుని ప్రజలను రక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడం మరియు కొన్నిసార్లు వారు చెడును శిక్షిస్తుండడం కనిపిస్తుంది. కానీ వారి అతి ముఖ్యమైన కార్యకలాపాలలో ఒకటి ప్రవచనాన్ని బయలుపరచడం మరియు వివరించడం.

తీరిక లేని మన ప్రపంచంలో విపరీతంగా బిజీ అయిపోయి ఒత్తిడికి గురైన ప్రజలకు దేవుడు తన దేవదూతల ద్వారా ప్రత్యేకమైనది ఏదో చెప్పాడని నీకు తెలియునా? ప్రకటన 14 లో, దేవుడు తన అద్భుతమైన అంత్యదిన వర్తమానములను ఆకాశములో ఎగురు మూడు దూతల సూచనప్రాయముగా బయలుపరిచాడు. ఈ వర్తమానములు చాలా ముఖ్యమైనవి, అవన్నీ నెరవేరే వరకు యేసు తిరిగి రాడు! ఈ స్టడీ గైడ్ పత్రిక నీకొక కనువిప్పు కలిగించే వివరణ నిచ్చును, రాబోయే ఎనిమిది స్టడీ గైడ్ పత్రికలు మరిన్ని నమ్మశక్యం కాని వివరాలను నీకు వెల్లడిపరచును. సిద్ధంగా ఉండుము - దేవుని వ్యక్తిగత వర్తమానము ఇప్పుడు నీకు వివరించబడుచున్నది!

1. మనము ప్రకటన గ్రంథమును ఎందుకు చదువుచున్నాము? ఇది ముద్రవేయబడలేదా?

జవాబు : ప్రకటన గ్రంథమును అధ్యయనము చేయడానికి ఆరు కీలకమైన కారణాలు ఉన్నాయి :

A.ఇది ఎప్పుడూ ముద్రవేయబడలేదు (ప్రకటన 22:10).క్రీస్తు మరియు సాతానుల మధ్య జరుగుతున్న యుగయుగాల మహా సంఘర్షణ, అపవాది పన్నాగములతో సహా తప్పుదోవ పట్టించెడి అంత్యదిన మోసములు ప్రకటన గ్రంథములో బయలుపర్చబడినవి. తన అబద్ద తన మోసాల గురించి ముందుగానే తెలుసుకున్న వ్యక్తులను సాతానుడు మోసగించలేడు గనుక, ప్రకటన గ్రంథము ముద్రవేయబడిందని ప్రజలు నమ్ముతారని అతడు ఆశిస్తున్నాడు.

B."ప్రకటన" అనే పేరుకు "తెరచుట,” విప్పుట," లేదా "బయలుపరచుట" అని అర్ధము.ఇది ముద్రవేయబడడానికి వ్యతిరేకం. ఇది ఎల్లప్పుడూ తేటగా తెరవబడియున్నది.

C.ప్రకటన గ్రంథము అనేది విశేషముగా యేసు ప్రభువు గ్రంథము.ఈ గ్రంథము మొదటి వచనములోనే "యేసు క్రీస్తు ... ప్రత్యక్షత" (లేక, ప్రకటన) అనే మాటలు ఉన్నవి (ప్రకటన 1:1) ఇది ప్రకటన 1:13-16 లో ఆయనను గూర్చిన వాక్యవర్ధనను కూడా ఇచ్చుచున్నది. ప్రకటన గ్రంథము బయలుపరచినంతగా మరే ఇతర బైబిలు పుస్తకము యేసును మరియు తన పరిచర్య కొరకును మరియు తన ప్రజల కొరకైన ఆయన అంత్యదిన సూచనలు మరియు ప్రణాళికలను బయలుపరచుదు.

D. ప్రకటన గ్రంథము ప్రధానముగా, సరిగ్గా యేసు రాకడకు ముందు జీవించుచున్న నేటి మన కాలపు ప్రజల కొరకే వ్రాయబడినది (ప్రకటన 1:1-3; 3:11; 22:6, 7, 12, 20).

E.ప్రత్యేక ఆశీర్వాదము ప్రకటించబడినది, ప్రకటన గ్రంథము చదివి అందులో వ్రాయబడిన సూచనలను పాటిస్తున్న వారిపై (ప్రకటన 1:3; 22:7).

F.ప్రకటన గ్రంథము దేవుని అంత్య-కాల ప్రజలను (ఆయన సంఘమును)ఆశ్చర్యకరమైన స్పష్టతతో వివరిస్తుంది. ప్రకటన గ్రంథములో బయలుపరచబడిన అంత్యదిన సంఘటనలను చూసినప్పుడు ఇది బైబిలుకు ప్రాణం పోస్తుంది. ఈ అంత్యదినములలో దేవుని సత్య సంఘము ఏమి బోధించాలో కూడా ఇది ఖచ్చితంగా చెప్పుచున్నది (ప్రకటన 14:6-14). ఈ స్టడీ గైడ్ పత్రిక ఆ బోధను గూర్చిన వృత్తాంతమును తెలియజేస్తుంది, కాబట్టి నీవు విన్నప్పుడు దానిని గుర్తించవచ్చును.

గమనిక : ముందుకు కొనసాగడానికి ముందు, దయచేసి మీ బైబిలు గ్రంథమును తెరచి ప్రకటన 14:6-14 వచనములను చదవండి.

2. ప్రతి వ్యక్తికి సువార్తను ప్రకటించమని దేవుడు తన సంఘమును ఆదేశించెను (మార్కు 16:15). ప్రకటన గ్రంథములో ఈ పవిత్రమైన కార్యమును ఆయన ఎట్లు సూచించెను?

"మరియొక దూతను చూచితిని. అతడు ... ప్రకటించునట్లు నిత్యసువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ... వేరొక దూత, అనగా రెండవ దూత, ... మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి" (ప్రకటన 14:6, 8, 9).

జవాబు : "దేవదూత" అనే పదానికి "వర్తమానికుడు" అని అర్ధము, కాబట్టి దేవుడు తన మూడు అంశముల సువర్తమానమును అంత్యదినములలో ప్రకటించుటను సూచించుటకు ముగ్గురు దేవదూతలను ఉపయోగించుట సముచితము. ప్రకృతికి అతీతమైన శక్తి (దైవశక్తి) వర్తమానములతో పాటు వచ్చునని మనకు గుర్తు చేయుటకు దేవుడు దేవదూతలను సూచన ప్రాయముగా ఉపయోగించును.

3. What two crucial points does Revelation14:6 reveal about God’s message for the last days?3. అంత్య దినములలో దేవుని వర్తమానము గురించి ప్రకటన 14:6 ఏ రెండు కీలకమైన అంశములను వెల్లడించెను?

“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులను, అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాటలాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను” (ప్రకటన 14:6).

జవాబు : రెండు కీలకమైన అంశాలు : (1) ఇది "నిత్యసువార్త", మరియు (2) ఇది భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ప్రకటించబడవలెను. మూడు దూతల వర్తమానములు ప్రజలు విశ్వాసము మూలముగా యేసు క్రీస్తును అంగీకరించుట ద్వారా మాత్రమే రక్షింపబడుదురని స్పష్టము చేయు సువార్తను గూర్చి నొక్కి చెప్పుచున్నవి (అపొస్తలుల కార్యములు 4:10-12 యోహాను 10:26; మార్కు 10:26, 27) రక్షణకు యేసు క్రీస్తు తప్ప వేరొక మార్గము లేదు గనుక, వేరొక మార్గమున్నదని ప్రకటించుట దుర్మార్గము.

సాతాను యొక్క నకిలీ బోధలు

సాతాను యొక్క అనేక మోసపు బోధలలో చాలా ప్రభావవంతమైనవి రెండు ఉన్నవి : (1) క్రియల ద్వారా రక్షణ, మరియు (2) పాపంలో రక్షణ, ఈ రెండు మోసములు మూడు దూతల వర్తమానములలో బయలుపర్చబడినవి. చాలామంది, దానిని గ్రహించకుండా, ఈ రెండు అబద్ద మోసాలలో ఒక దానిని అంగీకరించి, వారి రక్షణను అసాధ్యమైన దానిపై నిర్మించుకుంటున్నారు. ఎవరైతే మూడు దూతల వర్తమానములను చేర్చకుండ వాక్యమును బోధిస్తున్నారో వారు నిజంగా అంత్య కాలమునకు యేసు సువార్తను ప్రకటించుట లేదని కూడా మనము నొక్కి చెప్పాలి.

4. What four distinctive points does the first angel’s message cover?

4. మొదటి దూత వర్తమానము ఏ నాలుగు ప్రత్యేకమైన అంశములను వివరించుచున్నది?

"అతడు (మొదటి దూత), మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను" (ప్రకటన 14:7).

జవాబు :

A.దేవునికి భయపడుడి.దీనర్ధం మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తము సంతోషముగా నెరవేర్చుట యందు ప్రేమ, నమ్మకము, మరియు విధేయత కలిగి యుండవలెను. ఇది మనలను చెడుతనము నుండి కాపాడును. “యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు" (సామెతలు 16:6). జ్ఞానియైన సొలొమోను కూడా, "దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి" అని చెప్పెను (ప్రసంగి 12:13).

B. దేవునిని మహిమపరచుడి. మనకు ఆయన చూపిన మంచితనముకై దేవునికి స్తుతి మరియు కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా మనము ఈ ఆజ్ఞను నెరవేర్చెధము. ఈ అంత్యదినములలోని చేయు గొప్ప పాపాలలో ఒకటి కృతజ్ఞత లేకపోవడం (2 తిమోతి 3:1, 2).

C.ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను.ప్రతి ఒక్కరూ దేవునికి జవాబుదారీగా ఉన్నారని ఇది సూచించుచున్నది, మరియు తీర్పు ఇప్పటికే జరుగుతున్నదనుటకు ఇది స్పష్టమైన ప్రకటన. అనేక బైబిలు తర్జుమాలలో తీర్పు తీర్చు గడియ "వచ్చెను" అనుటకు బదులుగా “వచ్చియున్నది" అని చెప్పబడినది. (ఈ తీర్పును గూర్చిన పూర్తి వివరములు 18 మరియు 19 స్టడీ గైడ్ పత్రికల్లో ఇవ్వబడినవి.)

D.సృష్టికర్తను మాత్రమే ఆరాధించుడి. ఈ ఆజ్ఞ స్వీయ ఆరాధనతో సహా అన్ని రకాల విగ్రహారాధనను తిరస్కరిస్తుంది మరియు దేవుడు సృష్టికర్త మరియు విమోచకుడు అని ఖండించు జీవ పరిణామ సిద్ధాంతమును పూర్తిగా తిరస్కరిస్తుంది. (నేటి చాలా పుస్తకాలు మరియు చర్చలు స్వీయ ఆరాధనకు దారితీసే అహంకృతిని చూపుతున్నాయి. క్రైస్తవులు తమ విలువను మనలను దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా చేయు క్రీస్తులో కనుగొంటారు. )

సువార్త పరలోకపు దేవుడును మరియు ప్రభువైన యేసుక్రీస్తు చేత ఈ లోకము సృష్టింపబడినదనియు మరియు విమోచింపబడినదని చెప్పుచున్నది. సృష్టికర్తను ఆరాధించడం అనేది సృష్టికి గుర్తుగా ఆయన ప్రత్యేకించిన ఏడవ దిన విశ్రాంతిదినమున ఆయనను ఆరాధించడం. ప్రకటన 14:7 విశ్రాంతిదినమును సూచిస్తుందని "ఆకాశమును, భూమిని, సముద్రమును" అన్న మాటలు నిర్గమకాండము 20:11 లోని విశ్రాంతిదిన ఆజ్ఞలో నుండి సేకరింపబడి ఇక్కడ వాడబడుట ద్వారా స్పష్టమగుచున్నది. (విశ్రాంతిదినము గురించి మరింత సమాచారం కొరకు 7వ స్టడీ గైడ్ పత్రిక చూడుము.) మన నిజమైన మూల పునాదులు ఆదియందు మనలను తన స్వరూపములో సృష్టించిన దేవునిలో మాత్రమే కనిపిస్తాయి. ఎవరైతే దేవునిని సృష్టికర్తగా ఆరాధించని వారు ఇంక దేనినైనను ఆరాదించినను వారి మూల పునాదులను ఎప్పటికీ కనుగొనలేరు.

5. రెండవ దూత బబులోను గురించి ఏ గంభీరమైన ప్రకటన చేసెను? ప్రకటన 18 లోని దేవదూత దేవుని ప్రజలను ఏమి చేయమని కోరెను?

"వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి... మహా బబులోను కూలిపోయెను... అని చెప్పెను" (ప్రకటన 14:8). "వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ... అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను మహా బబులోను కూలిపోయెను. ... మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, ... దానిని విడిచి రండి" (ప్రకటన 18:1, 2, 4).

జవాబు : రెండవ దూత "బబులోను కూలిపోయెను" అని చెప్పెను మరియు పరలోకములో నుండి వచ్చిన స్వరము దేవుని ప్రజలందరినీ తక్షణమే బబులోను విడిచి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తుంది, అందువల్ల వారు దానితో పాటు నాశనం చేయబడరు. బబులోను అంటే ఏమిటో నీకు తెలియకపోతే, నీవు దానిలోనే సులభంగా ఉండి పోయెదవు. దాని గురించి ఆలోచించుము. నీవు ఇప్పుడు బబులోనులో ఉన్నావేమో! (20వ స్టడీ గైడ్ పత్రిక బబులోను గురించి స్పష్టమైన వివరణ ఇస్తుంది.)

6. దేనికి వ్యతిరేకముగా మూడవ దూత వర్తమానము గంభీరముగా హెచ్చరించుచున్నది?

“మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను, ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారము చేసి తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల, ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును" (ప్రకటన 14:9, 10).

జవాబు : మూడవ దూత వర్తమానము ప్రజలను మృగమును దాని ప్రతిమను ఆరాధించుటకు మరియు వారి నొసటియందేమి లేదా చేతి మీదనేమి మృగము యొక్క ముద్రను వేయించుకొనుటకు వ్యతిరేకముగా హెచ్చరించుచున్నది. మొదటి దూత నిజమైన ఆరాధనను గూర్చి ఆజ్ఞాపించెను. మూడవ దూత అబద్ధ ఆరాధనకు సంబంధించిన విషాద పరిణామాల గురించి చెప్పెను. మృగమెవరో, అతని ముద్ర ఏమిటో నీకు ఖచ్చితముగా తెలుసా? నీకు తెలియకపోతే, నీవు మృగాన్ని తెలియకుండా ఆరాధించవచ్చు. (20వ స్టడీ గైడ్ ప్రతిక మృగము మరియు దాని ముద్రకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. 21వ స్టడీ గైడ్ పత్రిక దాని ప్రతిమను వివరిస్తుంది.)

7. మూడు దూతల వర్తమానములను అంగీకరించి వాటి ప్రకారము నడుచుకొను తన ప్రజలను గూర్చి ప్రకటన 14:12 లో దేవుడు ఏ నాలుగు అంశములు వివరణ ఇచ్చెను?

"దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును" (ప్రకటన 14:12).

జవాబు :

A.వారు ఓర్పుతో, పట్టుదలతో, అంతము వరకు నమ్మకముగా ఉంటారు.దేవుని ప్రజలు వారి సహనం, ఓర్పు, పట్టు వదలని విశ్వాసము, మరియు ప్రేమతో కూడిన ప్రవర్తన మరియు వారి జీవితాలలో పరిశుద్ధత కలిగి జీవించేందుకు విశ్వసనీయత ద్వారా ఆయనను బయలుపరుస్తారు.

B. వారు పరిశుద్ధులు, లేదా "పవిత్రులు," ఎందుకనగా వారు పూర్తిగా దేవుని పక్షాన ఉన్నారు.

C.వారు దేవుని ఆజ్ఞలను గైకొందురు.ఈ విశ్వాసులు దేవుని పది ఆజ్ఞలను మరియు ఆయన ఇచ్చిన అన్ని ఆజ్ఞలను సంతోషంగా పాటిస్తారు. వారి మొదటి లక్ష్యం వారు ప్రేమించే ఆయనను సంతోషపెట్టడం (1 యోహాను 3:22). (6వ స్టడీ గైడ్ పత్రిక పది ఆజ్ఞలపై మరింత సమాచారం ఇస్తుంది.)

D. వారికి యేసుకు కలిగిన విశ్వాసము ఉన్నది. దీనిని "యేసుపై విశ్వాసము" అని కూడా అనువదించవచ్చును. ఈ రెండు సందర్భాల్లో, దేవుని ప్రజలు యేసును పూర్తిగా అనుసరిస్తారు మరియు ఆయనను పూర్తిగా విశ్వసిస్తారు.

When all have heard Jesus' end-time message, He will return to earth to take His people with Him to heaven.

8. మూడు దూతల వర్తమానములను ప్రజలందరికీ ప్రకటించిన వెంటనే ఏమి జరుగును?

“మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడైయుండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము ... ఉండెను" (ప్రకటన 14:14).

జవాబు : ప్రతి వ్యక్తికి మూడు దూతల వర్తమానములను ప్రకటించిన వెంటనే, యేసు తన ప్రజలను వారి పరలోక గృహమునకు తీసుకొని పోవుటకు మేఘాలలో తిరిగి వచ్చును. ఆయన కనిపించినప్పుడు, ప్రకటన 20వ అధ్యాయములోని 1,000 సంవత్సరాల గొప్ప చీకటి కాలము ప్రారంభమగును. (12వ స్టడీ గైడ్ పత్రిక ఈ 1,000 సంవత్సరాల గురించి చెబుతుంది. 8వ స్టడీ గైడ్ పత్రిక యేసు రెండవ రాకడ వివరాలను ఇస్తుంది.)

9. 2 పేతురు 1:12 లో అపొస్తలుడైన పేతురు మాట్లాడుతున్న " అంగీకరించిన (తత్కాల) సత్యము" అన్న మాటకు అతని అర్థమేమిటి?

The special emphasis of Noah’s “present truth” was a coming floodజవాబు : తత్కాల ప్రస్తుత సత్యం అనేది నిత్య సువార్త యొక్క ఒక అంశం, ఇది ఒక నిర్దిష్ట సమయం కొరకు ప్రత్యేకమైన ఆవశ్యకతను కలిగి ఉన్నది. ఉదాహరణలు :

A. జలప్రళయమును గూర్చి నోవహు వర్తమానము (ఆదికాండము 6 మరియు 7 అధ్యాయములు; 2 పేతురు 2:5). నోవహు నీతి బోధకుడు. ప్రపంచాన్ని నాశనం చేసే రాబోయే జలప్రళయము గురించి హెచ్చరిస్తూ అతడు దేవుని ప్రేమ సువార్తను బోధించెను. ఆ కాలానికి జలప్రళయమును గూర్చిన వర్తమానము "తత్కాల ప్రస్తుత సత్యము." దాని అత్యవసర పిలుపేదనగా "ఓడలోనికి ప్రవేశించుడి." మరియు అది ఎంత ప్రాముఖ్యమైనదంటే, దానిని బోధించకుండా ఉండుట బాధ్యతారహితమైన పని.

B.నీనెవె పట్టణమునకు యోనా వర్తమానము (యోనా 3:4). నీనెవె పట్టణము 40 దినములలో నాశనమగును అనునది యోనా యొక్క "తత్కాల ప్రస్తుత సత్యము." యోనా కూడా రక్షకుణ్ణి (యేసు క్రీస్తును) ఎత్తి చూపడము వలన, పట్టణము పశ్చాత్తాపపడింది. 40 దినముల హెచ్చరికను విస్మరించడం నమ్మకద్రోహం. ఇది "తత్కాల ప్రస్తుత సత్యము." అనగా ఇది ప్రత్యేకించి ఆ కాలానికి తగిన వర్తమానము.

C.బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క వర్తమానము (మత్తయి 3:1-3; లూకా 1:17). యోహాను యొక్క "తత్కాల ప్రస్తుత సత్యము" ఏమిటనగా, మెస్సీయా అయిన యేసు ప్రత్యక్షపర్చబడు సమయము వచ్చెను. అతని పని ఏదనగా, సువార్తను ప్రకటించి యేసు మొదటి రాకడ కొరకు ప్రజలను సిద్ధము చేయడం. అతని దినములో ప్రభువు మొదటి రాకడను గూర్చిన సువార్త అంశాన్ని విస్మరించడాన్ని ఊహించలేము.

D.మూడు దూతల వర్తమానములు (ప్రకటన 14:6-14). నేటి కాలానికి దేవుని "తత్కాల ప్రస్తుత సత్యము" మూడు దూతల వర్తమానములలో ఉన్నది. వాస్తవానికి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అనే బోధ ఈ వర్తమానములకు ప్రధానమైనది. ఏదేమైనా, మూడు దూతల వర్తమానములలోని "తత్కాల ప్రస్తుత సత్యము" యేసు రెండవ రాకడకు ప్రజలను సిద్ధం చేయడానికి మరియు సాతాను యొక్క అత్యంత కుయుక్తితో కూడిన ఒప్పింపజేసే మోసములను గూర్చి వారి కళ్ళు తెరవడానికి కూడా ఇవ్వబడినది. అర్థం చేసుకోకపోతే, సాతాను వారిని పట్టుకుని నాశనం చేయగలడు. మనకు ఈ ప్రత్యేక మూడు వర్తమానములు అవసరమని యేసుకు తెలుసు, కాబట్టి ప్రేమతో ఆయన వాటిని ఇచ్చెను. వాటిని మనము విస్మరించకూడదు. రాబోయే ఎనిమిది స్టడీ గైడ్ పత్రికల్లో మనము ఈ వర్తమానములను ఒకదాని తరువాత మరొకటిగా పరిశీలించ బోవుచుండగా దేవుని ప్రత్యేక నడిపింపు కొరకు దయచేసి ప్రార్ధించుడి.

మీరు కనుగొనబోవు కొత్త విషయములు మీకు ఆశ్చర్యము కలిగించవచ్చును. కానీ అవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. మీ హృదయం మిక్కిలి కదిలింపబడుతుంది. యేసు మీతో మాట్లాడుతున్నట్లు మీరు గ్రహిస్తారు! ఎందుకనగా, అవి ఆయన వర్తమానములు.

10. ప్రభువు మహాదినము (ప్రభువు రాకడ దినము) రాకమునుపు "తత్కాల ప్రస్తుత సత్య" వర్తమానము ప్రకటించుటకు ఎవరు వచ్చేదరని బైబిలు చెప్పుచున్నది?

"యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపెదను" (మలాకీ 4:5).

జవాబు : ప్రవక్తయగు ఏలీయా వచ్చును. ఏలీయాను గురించి అతని వర్తమానము గురించి ముఖ్యమైన విషయం ఉన్నది. అదేమిటో తదుపరి కొన్ని ప్రశ్నలలో మనం చూస్తాము.

11. యెహోవా దృష్టి తనపై కేంద్రీకృతమయ్యేందుకు ఏలీయా ఏమి చేసెను?

గమనిక : దయచేసి 1 రాజులు 18:17-40 చదవండి.

జవాబు : వారు ఎవరిని సేవించెదరో ఎంపిక చేసుకోవాలని ఏలీయా ప్రజలను కోరాడు (21వ వచనము). దేశం దాదాపు పూర్తిగా విగ్రహారాధనలో ఉంది. చాలామంది నిజమైన దేవుణ్ణి మరియు ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టారు. దేవుని పక్షాన ఒక్కడే ప్రవక్త మరియు బయలు దేవత పక్షాన 450 అన్యమత ప్రవక్తలుండిరి (22వ వచనము). తాను మరియు బయలు విగ్రహారాధకులు ఇద్దరూ బలిపీఠాలను నిర్మించి, వాటిపై కలప (కట్టెలు) మరియు ఎద్దును వుంచవలెనని ఏలీయా సూచించాడు. తన బలిపీఠమునకు అగ్ని రగిలించడం ద్వారా తనను తాను బయలుపరచుకొనమని వారు నిజమైన దేవుడిని కోరాలని అతడు సూచించాడు. వారి అన్యదేవత స్పందించలేదు. కాని, ఏలీయా యొక్క నిజమైన దేవుడు పరలోకము నుండి అగ్నిని పంపి ఏలీయా యొక్క బలి అర్పణను దహింపజేసెను.

వర్తమానము ఒక నిర్ణయమును లేక తీర్మానమును కోరినది

లోతైన ఆధ్యాత్మిక సంక్షోభం మరియు జాతి మతభ్రష్టత్వ సమయంలో ఏలీయా వర్తమానము వచ్చింది. ఇది పరలోకము వచ్చిన శక్తితో వచ్చింది, అది "యథావిధిగా వ్యాపారము" ఆపి జాతీయ దృష్టిని ఆకర్షించింది. దేవుడు లేదా బయలు దేవత ఎవరిని సేవించాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఏలీయా అప్పుడు పట్టుబట్టాడు. లోతుగా కదిలింపబడి, పూర్తిగా ఒప్పించబడి, ప్రజలు నిజమైన దేవుణ్ణి ఎన్నుకున్నారు (39వ వచనము).

John the Baptist presented the “Elijah” message of his day. Those who preach Revelation 14:6–14 have the Elijah message for today.

12. ఏలీయా వర్తమానమునకు రెండు రెట్లు ప్రయోగమున్నది. ఇది యేసు మొదటి రాకడ కొరకు ప్రజలను సిద్ధము చేయుటకు “తత్కాల సత్య” వర్తమానము మరియు తన రెండవ రాకడకు ప్రజలను సిద్ధము చేయుటకు "ప్రస్తుత సత్య" వర్తమానము. తన మొదటి రాకడ కొరకు ప్రజలను సిద్ధము చేయుటకు ఏలీయా వర్తమానమును ఎవరు బోధించెనని యేసు చెప్పెను?

“బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదు.” “ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఏలీయా యితడే” (మత్తయి 11:11, 14).

జవాబు : ప్రజలను తన మొదటి రాకడ కొరకు సిద్ధపరచు బాప్తిస్మమిచ్చు యోహాను బోధను యేసు "ఏలీయా" లేదా ఏలీయా వర్తమానము అని పిలిచెను. ఏలీయా దినము వలె యోహాను వర్తమానము సత్యమును చాలా స్పష్టముగా చెప్పి, ఆపై నిర్ణయం తీసుకోవాలని నొక్కి చెప్పెను. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి బైబిలు, "అతడు..... ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ... వెళ్లును" అని చెప్పెను (లూకా 1:17).

13. How do we know the prophecy has a second application to our time–just before the second advent?

13.ప్రవచనమునకు రెండవ రాకడకు సరిగ్గా ముందు మన కాలమునకు రెండవ ప్రయోగమున్నదని మనకెట్లు తెలియును?

“యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపెదను" (మలాకీ 4:5). "యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును" (యోవేలు 2:31).

జవాబు : యోవేలు 2:31 లో పేర్కొన్న "యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము" రాకముందే రెండు సంఘటనలు జరుగుతాయని దయచేసి గమనించండి - ఒకటి, ఏలీయా వర్తమానం రావడం మరియు రెండు, ఆకాశములో బ్రహ్మాండమైన సూచనలు కనపడటం. ఇది రెండు సంఘటనలను గుర్తించడంలో మనకు సహాయపడుతుంది. చీకటి రోజు 1780 మే 19న సంభవించింది. అదే రాత్రి, చంద్రుడు రక్తవర్ణంగా కనిపించాడు. మత్తయి 24:29 లో మరో సూచన ఉన్నది - ఇది నక్షత్రాలు రాలడం (ఉల్కాపాతము). ఇది నవంబర్ 13, 1833న జరిగింది. దీని నుండి, ఏలీయా యొక్క అంత్యకాల వర్తమానము 1833వ సంవత్సరం దగ్గర లేదా తరువాత ప్రభువు యొక్క మహాదినము రాకముందు ప్రారంభం కావాలని మనకు తెలుస్తున్నది.

ఆకాశములో సూచనలు తరువాత రెండవ ఏలీయా వర్తమానము

యోహాను యొక్క "ఏలీయా వర్తమానము" రెండవ “ఏలీయా వర్తమానము"నకు వర్తించబడదని స్పష్టమైంది, ఎందుకనగా దేవుని గొప్ప ఆకాశ సూచనలు యోహాను తన వర్తమానమును ప్రకటించిన 1700 సంవత్సరాల తరువాత కనబడినవి. యోవేలు 2:31 లోని ఏలీయా వర్తమానము 1833 నాటి ఆ ఆకాశ సూచనల తరువాత ప్రారంభం కావాలి మరియు యేసు రెండవ రాకడకు ప్రజలను సిద్ధం చేయాలి. ప్రకటన 14:6-14 లోని మూడు రెట్ల "తత్కాల ప్రస్తుత సత్య" వర్తమానము ఖచ్చితంగా సరిపోతుంది. ఇది 1844 లో ప్రారంభమైంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను యేసు రెండవ రాకడ (14 వ వచనము) కొరకు సిద్ధం చేస్తోంది, ఇది భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి మూడు రెట్ల వర్తమానము వచ్చిన తరువాత జరుగుతుంది. (1844 తేదీపై వివరాలు 18 మరియు 19వ స్టడీ గైడ్ పత్రికల్లో ఇవ్వబడ్డాయి.)

వర్తమానము ఒక నిర్ణయమును కోరుచున్నది.

దుష్టత్వముతో కూడిన విగ్రహారాధన రూపుమాపబడి ప్రజలందరూ ఎవని సేవించెదరో నిర్ణయించుకొనమని ఏలీయా పట్టుబట్టెను. ఇదే విషయమును నేడు మనకు దేవుని మూడు దూతల మూడు రెట్లు వర్తమానము కూడా నొక్కి చెప్పుచున్నది. ప్రతి ఒక్కరు నిర్ణయము తీసుకొనవలసియున్నది. దేవుని మూడు రెట్లు వర్తమానము సాతానును మరియు అతని పన్నాగములను బయటపెట్టును. ఇది దేవుని ప్రేమను మరియు ఆయన అవసరములను మనకు బయలుపరచును. దేవుడు నేడు ప్రజలను సృష్టికర్తను మాత్రమే ఆరాధించవలెనన్న నిజమైన దేవుని ఆరాధనకు తిరిగి పిలుస్తున్నాడు. ఈ కీలకమైన అంత్యదినాల్లో దేవునిని తప్ప మరి ఎవరినైనను లేక దేనినైనను బుద్ధిపూర్వకముగా సేవించిన యెడల అది అవిధేయతగా పరిగణింపబడి నిత్య మరణమునకు దారితీయును. ఏలీయా దినములలో (1 రాజులు 18:37, 39) మరియు బాప్తిస్మమిచ్చు యోహాను దినములలో, దేవుడు అద్భుత రీతిలో ప్రజల హృదయాలకు చేరువాయెను. ఈ అంత్య దినములలో కూడా మూడు దూతల వర్తమానములకు ప్రజలు స్పందిస్తున్నందున దేవుడు అదే చేయును (ప్రకటన 18:1-4).

God’s final Elijah message will bring families together in joy, love, and happiness.14. ఏలీయా సందేశము (మూడు దూతల వర్తమానములు) ప్రకటించుట ఎంత అద్భుతమైన ఆశీర్వాదము తెచ్చును?

"ఏలీయా ... తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును" (మలాకీ 4:5, 6).

జవాబు : దేవునికి స్తోత్రము! ఏలీయా వర్తమానము లేదా మూడు దూతల వర్తమానములు, కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకముగా, సన్నిహితముగా, ఆనందముగా, పరలోక సంబంధముతో ఒకటి చేయును. ఇది ఎంతటి ఆశీర్వాదకరమైన వాగ్దానము!

15."సువార్త" అనే మాటకు "శుభవార్త" అని అర్ధము. ప్రకటన 14 లోని మూడు దూతల వర్తమానములు మనకు శుభవార్తను అందజేయుచున్నాయా?

జవాబు : అవును! మూడు దూతల వర్తమానములు వృత్తాంతంలో మనం కనుగొన్న శుభవార్తను సమీక్షిధాం :

A. ప్రతి వ్యక్తికి అంత్యదిన సువార్త వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరు కూడా ప్రకటింపబడకుండా ఉండరు..

B. ప్రజలను పట్టి నాశనము చేయవలెనన్న సాతాను యొక్క "శక్తివంతమైన పన్నాగములు మనకు బయలుపర్చబడును, కాబట్టి మనం చిక్కుకోవలసిన అవసరం లేదు.

C. ఈ అంత్యదినములలో దేవుని వర్తమానము వ్యాప్తి చెందడానికి అతీతమైన పరలోక దైవశక్తి తోడగును.

D. దేవుని ప్రజలు ఓర్పుతో పట్టు విడువని విశ్వాసమును కలిగియుందురు. ఆయన వారిని "పరిశుద్ధులు" అని పిలుచును.

E. దేవుని ప్రజలకు యేసుకు కలిగిన విశ్వాసం ఉంటుంది.

F. దేవుని ప్రజలు ప్రేమతో ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.

G. దేవుడు మనలను ఎంతగా ప్రేమించుచున్నాడంటే యేసు రెండవ రాకడకు మనలను సిద్ధపరచుటకై ఆయన ప్రత్యేక వర్తమానములను పంపాడు.

H. ఈ అంత్యదినములలో దేవుని వర్తమానములు కుటుంబ సభ్యులను ప్రేమ మరియు ఐక్యతతో ఒకటి చేస్తాయి.

I. మూడు దూతల వర్తమానములకు ప్రధాన ప్రాధాన్యత ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికీ రక్షణ అందించబడింది. మన గత పాపములను కప్పివేయుటకు ఆయన తన నీతిని మనకు అనుగ్రహించును మరియు మనము కృపలో నిజాయితీగా ఎదుగుతూ ఆయన వలె మారుటకు ఆయన అద్భుత రీతిలో తన నీతిని అనుదినము మనకు ఆరోపించును. ఆయన మనతో ఉంటే, మనం విఫలం కాలేము. ఆయన లేకుండా మనం విజయం సాధించలేము.

అదనపు విషయములు :

రాబోయే స్టడీ గైడ్ పత్రికల్లో వివరించబడే మూడు దూతల వర్తమానములలోని ముఖ్యాంశాలు :

A. దేవుని తీర్పు తీర్చు గడియ వచ్చెను

B. కూలిపోయిన లేక పతనమైన బబులోనులో నుండి బయటకు రండి.

C. మృగము యొక్క ముద్రను వేయించుకొనకుడి.

రాబోయే ఎనిమిది స్టడీ గైడ్ పత్రికల్లో ఈ అంశములను మనము ప్రార్ధనా పూర్వకముగా అధ్యయనము చేయబోవుచుండగా మరింత శుభవార్త బయలుపడును. మీరు కొన్ని విషయాలను చూసి ఆశ్చర్యపోయి ఆనందిస్తారు, మరికొన్ని విషయాలను చూసి మనస్తాపానికి గురై బాధపడతారు. కొన్ని అంశాలను అంగీకరించడం కష్టం. ఈ అంత్య దినములలో మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి యేసు పరలోకము నుండి ప్రత్యేక వర్తమానములను పంపినందున, ప్రతీ వర్తమానమును వినడం, ప్రతి ఒక్కదానిని పూర్తిగా అర్థం చేసుకోవడం మరియు ప్రతి ఒక్కదానిని పూర్తిగా అనుసరించడం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు.

16. భూచరిత్ర యొక్క ఈ అంత్యదినములలో తన ప్రజలను నడిపించుటకు మరియు సహాయము చేయటకు యేసుకు ప్రత్యేకమైన మూడంశముల వర్తమానమున్నదని తెలుసుకున్నందుకు నీవు కృతజ్ఞుడవైయున్నావా?

నీ జవాబు :

మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. యేసు తిరిగి రాకముందే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి మూడు దూతల వర్తమానములు ప్రకటింపబడతాయా? ఇప్పుడు కోట్ల కొలది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది?

జవాబు : అవును - దేవుడు వాగ్దానం చేసినందున అది జరుగుతుంది (మార్కు 16:15). సువార్త తన దినములలో "ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి" ప్రకటింపబడెనని పౌలు చెప్పెను (కొలొస్సయులకు 1:23). దేవుని కృప వలన యోనా మొత్తం నీనెవె పట్టణానికి 40 దినములలోగా దేవుని వాక్కును ప్రకటించెను (యోనా 3:4-10). దేవుడు తన పనిని ముగించి, దానిని క్లుప్తపరచునని బైబిలు చెప్పుచున్నది (రోమీయులకు 9:27). లెక్కబెట్టుకోండి. ఇది తప్పక అతి త్వరలోనే జరుగుతుంది!

2. మోషే మరియు ఏలీయా వాస్తవానికి యేసుతో రూపాంతరపు పర్వతము నొద్ద కనిపించారా (మత్తయి 17:3) లేదా అది ఒక దర్శనము మాత్రమేనా?

జవాబు : సంఘటన అక్షరాలా జరిగింది. 9వ వచనములో "దర్శనము" అని అనువదించబడిన గ్రీకు పదం "హోరామా” అంటే “చూచినది" అని అర్థము. మోషే మృతులలో నుండి లేపబడి పరలోకమునకు తీసుకొని పోబడెను (యూదా 1:9), మరియు ఏలియా మరణాన్ని చూడకుండా పరలోకమునకు ఎత్తబడెను (2 రాజులు 2:1, 11, 12). భూమిపై జీవించి అపవాది యొక్క దాడుల నుండి మరియు దేవుని ప్రజల తిరుగుబాటు నుండి తీవ్రంగా బాధపడిన ఈ ఇద్దరు వ్యక్తులు, యేసు ఏమి అనుభవించాడో అర్థం చేసుకున్నారు. మరణాన్ని చూడకుండా (ఏలీయా వలె) ఆయన రాజ్యంలోనికి ఎత్తబడే వారందరిని గూర్చి మరియు మన పాపముల కొరకైన ఆయన బలియాగము ద్వారా మోషే వలె సమాధిలో నుండి జీవములోనికి లేపబడి ఆయన రాజ్యములోనికి ప్రవేశించు వారందరిని గూర్చి ప్రోత్సహించడానికి మరియు ఆయనకు జ్ఞాపకము చేయడానికి వారు వచ్చిరి.

3. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి యేసు ఏలీయా యితడే అని చెప్పినపుడు (మత్తయి 11:10-14), తాను ఏలీయా కాదని యోహాను ఎందుకు చెప్పెను (యోహాను 1:19-21)?

జవాబు : సమాధానం లూకా 1:3-17 లో మనకు దొరకును. రాబోయే యోహాను పుట్టుకను ప్రకటించిన దేవదూత, "నీ భార్యయైన ఎలీసబేతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ... తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు (యేసుక్రీస్తుకు) ముందుగా వెళ్లును" అని చెప్పెను (13-17 వచనములు). యేసు యోహానును ఏలీయా అని పిలిచినప్పుడు, ఆయన ఏలీయా వలె మెలుగుతున్న తన జీవితము, ఆత్మ, శక్తి మరియు పనిని సూచిస్తున్నాడు. అంత్యదినముల కొరకైన ఏలీయా వర్తమానములో కూడా ఇదే పరిస్థితి. మనకు ప్రాముఖ్యత వర్తమానమునకు, మనిషికి కాదు. కాబట్టి యోహాను వ్యక్తిగతంగా ఏలీయా కాదు, కానీ అతడు ఏలీయా వర్తమానమును అందించినవాడు లేదా ప్రకటించినవాడు.

4. మూడు దూతల వర్తమానములను చేర్చకుండా ఎవరైనా నేటి తరానికి యేసు యొక్క సంపూర్ణ అంత్యకాల సత్యమును బోధించడం సాధ్యమేనా?

జవాబు : లేదు. మూడు దూతల వర్తమానములను తప్పక చేర్చాలి. ప్రకటన గ్రంథములో, యేసు స్వయంగా తన అంత్యకాల వర్తమానమును బయలుపరిచాడు (ప్రకటన 1:1) మరియు ఆయన ప్రజలు గ్రంథములో ఆయన బయలుపరచిన వాటిని అనుసరిస్తూ ఉండాలని చెప్పాడు (ప్రకటన 1:3, 22:7). కాబట్టి అంత్యకాల విశ్వాసులు ప్రకటన గ్రంథములోని యేసును గూర్చిన వర్తమానములను బోధించాలి. వాస్తవానికి, ప్రకటన 14:6-14 లోని ఆయన మూడంశముల వర్తమానమును చేర్చి బోధించాలి. యేసు ప్రభువు ఈ వర్తమానములను 6వ వచనములో "నిత్య సువార్త" అని పిలుస్తున్నట్లు గమనించండి. ఆయన తన ప్రజల కొరకు తిరిగి రాకముందే వాటిని భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి వద్దకు తీసుకెళ్లాలని ఆయన చెప్పాడు. ఇక్కడ మూడు గంభీరమైన తలంపులు ఉన్నాయి :

  1. ఒకడు మూడు దూతల వర్తమానములను చేర్చకపోతే అతడు నిజంగా యేసు యొక్క "నిత్య సువార్తను" ప్రకటిస్తున్నట్లు కాదు.
  2. ఒకడు మూడు దూతల వర్తమానములను వదిలివేస్తే అతని సందేశాలను నిత్య సువార్త అని పిలవడానికి ఎవరికీ హక్కు లేదు.
  3. మూడు దూతల వర్తమానములు యేసు రెండవ రాకడకు ప్రజలను సిద్ధం చేస్తాయి (ప్రకటన 14:12-14). యేసు ప్రభువు యొక్క మూడంశముల అంత్య-కాల వర్తమానములను నీవు వినకుండ, అర్థము చేసుకొనకుండా మరియు అంగీకరించకుండ ఆయన రెండవ రాకడ కొరకు నీవు సిద్ధముగా యుండలేవు.

అంత్యకాలము కొరకు ప్రత్యేక వర్తమానములు

మనకు ఏది అవసరమో తెలిసిన యేసు ప్రభువు, అంత్యకాలము కొరకు మూడు ప్రత్యేక వర్తమానములను ఇచ్చెను. మనము వాటిని అర్ధము చేసుకొని అనుసరించాలి. తదుపరి ఎనిమిది స్టడీ గైడ్ పత్రికలు ఈ వర్తమానములను మనకు స్పష్టముగా వివరిస్తాయి.

5. లూకా 1:17 ఏలీయా వర్తమానము "అవిధేయులను నీతిమంతుల జ్ఞానము వనుసరించుటకు" త్రిప్పుట కొరకని చెప్పుచున్నది. దీని అర్థమేమిటి?

జవాబు : "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమీయులకు 1:17). తమ రక్షణ రక్షకునిపై విశ్వాసముంచుట ద్వారానే లభించినదని చెప్పుటకు నీతిమంతులు జ్ఞానము కలిగియున్నారు. "మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” (అపొస్తలుల కార్యములు 4:12). ఇది అందరికీ స్పష్టం చేయడమే యోహాను యొక్క ఏలీయా వర్తమానము. యేసుక్రీస్తు మీద తప్ప మరెవరి మీదనైనను లేక దేని మీదనైనను ఆధారపడిన విశ్వాసం ఎప్పటికీ పాపం నుండి ప్రజలను రక్షించలేదు మరియు ఒక మారిన జీవితమునకు నడిపించలేదు. ప్రజలు దీనిని విని అర్థం చేసుకోవాలి. ఈ సత్యము నేటి కొరకైన దేవుని మూడంశముల ఏలీయా వర్తమానమునకు కేంద్ర భాగము.

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) ప్రకటన 14 లోని ముగ్గురు దేవదూతలు (1)

( ) అక్షరాలా నిజమైనవారు మరియు వినబడేలా వారు బిగ్గరగా అరవాలి.

( ) వేగము మరియు శక్తితో కదులుతున్న దేవుని అంత్య-దిన వర్తమానమును సూచించుచున్నారు.

( ) ఒకరి ఊహ యొక్క కల్పన.

2) క్రింది ఏ విషయములు ప్రకటన గ్రంథము గురించి నిజము చెప్పుచున్నవి? (3)

( ) గ్రంథము ముద్రవేయబడినది.

( ) ఆ పేరుకు “తెరచుట" లేదా "బయలుపరచుట" అని అర్థము.

( ) అంత్య దినములలో దేవుని ప్రజలు ఏ వర్తమానమును ప్రకటించుదురో ఇది చెప్పుచున్నది.

( ) యేసును గూర్చిన ప్రత్యక్షత ఇందులో వాక్యరూపముగా చిత్రీకరించబడినది.

( ) దేవుడు దానిని చదువువారిపై శాపము ప్రకటించెను.

3) యేసు ప్రభువు తిరిగి రాకముందు మూడు దూతల వర్తమానము ప్రతి వ్యక్తికి ప్రకటింపబడవలెను. (1)

( ) అవును.

( ) కాదు.

4) మొదటి దూత వర్తమానము ఈ క్రింది వాటిని నొక్కి చెప్పుచున్నది : (3)

( ) ఇది ప్రకటించబడుచున్న నిత్య సువార్త.

( ) ఇది అర్థము కాదు.

( ) పరిణామవాదము చక్కటి క్రైస్తవ సిద్ధాంతము.

( ) తీర్పు ఇప్పుడు జరుగుచున్నది.

( ) మనము దేవునిని గౌరవించి, నిజముగా విశ్వసించవలెను.

( ) ప్రతి వ్యక్తి తనకిష్టమైన దానిని లేదా ఇష్టమైన వారిని ఆరాధించవలెను.

5) రెండవ దూత వర్తమానము బబులోను కూలిపోయెనని చెప్పెను, మరియు ప్రకటన 18 లోని దూత బబులోనులో ఉన్న దేవుని ప్రజలను దానిని విడిచి బయటకు రండని విజ్ఞప్తి చేసెను. (1)

( ) అవును.

( ) కాదు.

6) మూడవ దూత వర్తమానము దేవుని ప్రజలందరిని మృగము యొక్క ముద్రను వేయించుకొనమని విజ్ఞప్తి చేయుచున్నది. (1)

( ) అవును.

( ) కాదు.

7) ప్రకటన 14:12 దేవుని ప్రజల గురించి ఎలా మాట్లాడుచున్నది? (2)

( ) వారు ఓర్పుగలవారు.

( ) వారు పరిశుద్ధులు.

( ) వారు పది ఆజ్ఞలను నమ్మరు.

( ) వారికి చాలా తక్కువ విశ్వాసమున్నది.

8) సువార్త ప్రతి వ్యక్తికి ప్రకటించబడిన వెంటనే ఏమి జరుగుతుంది? (1)

( ) దేశాలన్ని మార్చబడతాయి.

( ) దేవుడు విజయవాడను మరియు యెరూషలేములను తిరిగి నిర్మిస్తాడు.

( ) యేసు ప్రభువు రెండవ రాకడ జరుగుతుంది.

9) ఈ క్రింది వాటిలో నేటి తరానికి "తత్కాల ప్రస్తుత సత్య" వర్తమానములు ఏవి? (1)

( ) నీనెవె పట్టణమునకు యోనా వర్తమానము.

( ) జలప్రళయమునకు ముందు నోవహు వర్తమానము.

( ) ప్రకటన 14:6-14 లోని మూడు దూతల వర్తమానములు.

10. మూడు దూతల వర్తమానములు గురించి ఏ విషయములు నిజమైనవి? (6)

( ) ఈ వర్తమానములు ఇప్పుడు ప్రకటించబడుచున్నవి.

( ) ఈ వర్తమానములు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగునని నొక్కి చెప్పుచున్నవి.

( ) వాటిని "ఏలీయా వర్తమానము” అని కూడా పిలువవచ్చును.

( ) వాటిని ప్రకటించుటలో సహకరించుటకు ఏలీయా వ్యక్తిగతముగా కనిపించును.

( ) అవి పరిణామవాదము యొక్క క్రైస్తవ విలువలను నొక్కి చెప్పును.

( ) అనేక మంది వాటి గురించి ఎప్పటికీ వినరు.

( ) అవి కుటుంబ సభ్యులను సన్నిహిత, ప్రేమపూర్వక సంబంధములో ఒకటి చేయును.

( ) అతీతమైన దైవశక్తి వాటికి తోడ్పడును.

( ) అవి యేసు రెండవ రాకడకు ప్రజలను సిద్ధము చేయుటలో సహాయపడును.

11) బాప్తిస్మమిచ్చు యోహాను తన దినములో ఏలీయా అని పిలువబడెను ఎందుకనగా (1)

( ) అతడు పరలోకము నుండి అగ్నిని కురిపించుటకు ఇష్టపడెను.

( ) ప్రధాన యాజకుడు ఆ పేరును ఎంపిక చేసెను.

( ) ఏలీయా యొక్క ఆత్మ మరియు శక్తితో నిండిన అతని బోధ, యేసు ప్రభువు మొదటి రాకడ కొరకు ప్రజలను సిద్ధము చేసినది.

12) “సువార్తఅను మాటకు శుభవార్త అని అర్థము. (1)

( ) అవును.

( ) కాదు.

13) ఈ అంత్య దినములలో కుటుంబ సభ్యులను ప్రేమతో మరియు ఐక్యతతో ఒకటి చేసెదనని యేసు వాగ్దానము చేసెను. నీ కుటుంబములో ఈ అనుభవము కొరకు నీవు ప్రార్థించుచున్నావా?

( ) అవును

( ) కాదు.

14) అంత్య కాలము గుండా తన ప్రజలకు మార్గనిర్దేశము చేసి నడిపించుటకు యేసు ప్రభువుకు ఒక ప్రత్యేక వర్తమానము ఉన్నందుకు నీవు ఉపశమనము పొందుచున్నావా?

( ) అవును.

( ) కాదు.