Lesson 24

ఎవరో స్వయం-ప్రకటిత ప్రవక్త (తనను తాను ప్రవక్తనని చెప్పుకునే వ్యక్తి) అకస్మాత్తుగా వచ్చి, కదిలించే సందేశాలతో జనాన్ని గుంపులు గుంపులుగా ఆకర్షించడం, రోగులను స్వస్థపరచడం, చనిపోయినవారిని లేపడం, పరలోకము నుండి అగ్నిని కురిపించడం, మీ వ్యక్తిగత రహస్యాలను వెల్లడించడం ప్రారంభిస్తే- మీరు అతన్ని  లేదా ఆమెను నమ్ముతారా? మీరు నమ్మాలా? మీ అంతిమ విధి నిజమైన మరియు అబద్ధ ప్రవక్తల మధ్య తేడాను గుర్తించే మీ సామర్థ్యంతో నేరుగా ముడిపడి ఉండవచ్చు. కాబట్టి ఈ సమయానుకూల విషయం గురించి బైబిల్ నిజంగా ఏమి చెప్పుచున్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం!

1. భూమి యొక్క అంత్య దినములలో నిజమైన ప్రవక్తలు ఉంటారని బైబిల్ బోధిస్తుందా?

"అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు" (అపొస్తలుల కార్యములు 2:17).

జవాబు : అవును. స్త్రీపురుషులిద్దరూ అంత్య దినములలో ప్రవచించెదరు (యోవేలు 2:28-32).

2. యేసు తన ఆరోహణమందు ప్రవక్తల వరమును తన సంఘములో,  మరో నాలుగు వరములతో పాటు ఉంచాడు: అపొస్తలులు, సువార్తికులు, కాపరులు, మరియు ఉపదేశకులు (ఎఫెసీయులకు4:7-13) దేవుడు ఈ వరములను సంఘములో ఎందుకు ఉంచాడు?

"పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును," (ఎఫెసీయులకు 4:13).

జవాబు: యేసు తన పరిశుద్ధులను సన్నద్ధం చేసేందుకు ఐదు వరములు ఇచ్చాడు. ఈ ఐదు వరములు ఏవీ లేనట్లయితే దేవుని అంత్య- కాల సంఘాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాదు.

3. బైబిల్ రోజుల్లో, ప్రవచన వరము పురుషులకే పరిమితం అయిందా?

జవాబు : లేదు! ప్రవచన వరం కలిగి ఉన్న చాలా మంది పురుషులతో పాటు, దేవుడు కనీసం ఎనిమిది మంది స్త్రీలకు కూడా వరం ఇచ్చాడు: అన్న (లూకా 2:36-38), మిర్యాము (నిర్గమకాండము 15:20), దెబోరా (న్యాయాధిపతులు 4:4), హుల్దా (2 రాజులు 22:14), మరియు సువార్తికుడు ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు (అపొస్తలుల కార్యములు 21:8, 9).

4. How long were these gifts to remain in God’s church?

4. ఈ వరములు దేవుని సంఘములో ఎంతకాలం ఉంటాయి?

“మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు" ఉంటాయి (ఎఫెసీయులకు 4:11, 12).

జవాబు : దేవుని ప్రజలందరూ ఏకత్వం పొంది. పరిణతి చెందిన క్రైస్తవులయ్యే వరకు అవి అలాగే ఉంటాయి - ఇది అంత్య కాలంలో ఉంటుంది.

5. From what source do true prophets obtain their information?

5.నిజమైన ప్రవక్తలు తమ సమాచారాన్ని ఏ మూలం నుండి పొందుతారు?

“ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినవారై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు 1:21).

జవాబు : ప్రవక్తలు ఆధ్యాత్మిక విషయాలలో తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయరు. వారి ఆలోచనలు యేసు నుండి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాయి.

6. దేవుడు ప్రవక్తలతో మూడు రకాలుగా మాట్లాడుతాడు. ఈ మార్గాలు ఏమిటి?

"మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును." "నేను ... ముఖాముఖిగా అతనితో మాటలాడుదును" (సంఖ్యాకాండము 12:6, 8).

 జవాబు : దర్శనాలు, కలలు లేదా ముఖాముఖి.

7. What are the physical evidences of a true prophet in vision?

7. దర్శనంలో నిజమైన ప్రవక్త యొక్క భౌతిక ఆధారాలు ఏమిటి?

జవాబు: ఈ ఆరు కీలకమైన అంశాలను గమనించండి:

A. మొదట్లో శారీరక బలాన్ని కోల్పోతారు. (దానియేలు 10:8).

B. తరువాత మానవాతీత బలాన్ని పొందవచ్చు (దానియేలు 10 : 18, 19).

C. శరీరంలో శ్వాస ఉండదు (దానియేలు 10 : 16).

D. మాట్లాడగల సామర్ధ్యం (దానియేలు 10:16).

E. చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో తెలియదు (దానియేలు 10 : 5-8, 2 కొరింథీయులకు 12:24).

F. కళ్ళు తెరిచి ఉంటాయి (సంఖ్యాకాండము 24:4).

ఈ ఆరు బైబిల్ అంశాలు దర్శనంలో ఉన్న నిజమైన ప్రవక్త యొక్క భౌతిక సాక్ష్యాలను అందిస్తాయి,  అవన్నీ ఎప్పుడూ కలిసి కనిపించవు. ఆరు సాక్ష్యాలను ఒకేసారి వ్యక్తపరచకుండా ఒక ప్రవక్త దర్శనం నిజమైనది కావచ్చు.

8. Is the working of great miracles proof that a prophet is of God?

8. గొప్ప సూచక క్రియలు జరిగించుట ప్రవక్త దేవుని నుండి వచ్చినదానికి రుజువు కాదా?

"అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే" (ప్రకటన 16:14).

జవాబు : కాదు! అతని దూతలు కూడా అద్భుతాలు చేసే శక్తిని కలిగి ఉన్నారు. అద్భుతాలు ఒకే ఒక్కదాన్ని రుజువు చేస్తాయి: అతీంద్రియ శక్తి. కానీ అలాంటి శక్తి దేవుడు మరియు సాతానుడు ఇద్దరి నుండి వస్తుంది (ద్వితీయోపదేశకాండము 13:1-5, ప్రకటన 13:13, 14).

9. ఏ ప్రమాదకరమైన అంత్య- కాల ప్రమాదం గురించి యేసు మనలను హెచ్చరించాడు?

"అబద్ధపు క్రీస్తులును అబద్దపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు" (మత్తయి 24:24).

జవాబు : అబద్ధపు క్రీస్తులు మరియు అబద్ధపు ప్రవక్తల గురించి దేవుడు మనకు హెచ్చరించాడు. వారు దేవుని ఏర్పరచబడినవారిని తప్ప అందరినీ మోసం చేసేంతగా చాలా నమ్మకంగా ఉంటారు. కోట్లాది మంది ప్రజలు మోసగించబడి నశిస్తారు.

10. ప్రవక్త నిజమా కాదా అని నేను ఎలా నిర్ధారించగలను?

"ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించని యెదల వారికి అరుణోదయము కలుగదు" (యెషయా 8:20).

 జవాబు : వారి బోధలను మరియు ప్రవర్తనను దేవుని వాక్యమైన బైబిల్ ద్వారా పరీక్షించండి. వారు లేఖనానికి విరుద్ధంగా బోధించి, ప్రవర్తిస్తే, వారు అబద్దపు ప్రవక్తలు మరియు "వారికి అరుణోదయము కలుగదు లేదా వారిలో వెలుగు లేదు. "

11. కొన్ని రకాల అబద్ధపు ప్రవక్తలు బైబిల్లో పేరు పెట్టబడి ఖండించబడ్డారు?

జవాబు : అవును. ద్వితీయోపదేశకాండము 18:10-12 మరియు ప్రకటన 21:8 ఈ క్రింది రకాల అబద్ధపు ప్రవక్తలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.

A. సోదిచెప్పే వాడు - జ్యోతిష్కుడు

B. గారడీ విద్య గలవాడు (శూన్యగాడు) - చనిపోయినవారి ఆత్మలను సంప్రదించగలనని చెప్పుకునేవాడు.

C. కర్ణపిశాచి - చనిపోయినవారి ఆత్మలను రప్పించగలనని చెప్పుకునేవాడు.

D. మంత్రవిద్యను అభ్యసించేవాడు - హస్తసాముద్రికం లేదా మాయ ద్వారా భవిష్యత్తును ఊహించి చెప్పేవాడు.

E. శకునాలను వివరించేవాడు - మంత్రము విసురువాడు లేదా మాయను ఉపయోగించేవాడు.

F. ఆత్మలవాది - దయ్యముల యొద్ద విచారణ చేయువాడు లేదా చనిపోయిన వారితో మాట్లాడతానని చెప్పుకునేవాడు.

G. మంత్రగత్తె లేదా ఇంద్రజాలకుడు - భూతవైద్యం తెలిసిన స్త్రీ లేదా పురుషుడు

ఈ అబద్ధపు ప్రవక్తలు చాలా మంది చనిపోయినవారి ఆత్మలతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పుకొనుచున్నారు. చనిపోయినవారిని సజీవులు సంప్రదించలేరని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. (10వ స్టడీ గైడ్ పత్రికలో మరణం గురించి మరింత సమాచారం ఉంది.) చనిపోయిన వారి ఆత్మలు దుష్ట దూతలు- దెయ్యాలు (ప్రకటన 16:13, 14). స్పటికపు బంతులు, అరచేయి చూచి సోది చెప్పడం, ఆకు అర్థాన్ని చెప్పడం, జ్యోతిష్యము, మరియు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటం దేవునితో సంభాషించే మార్గాలు కాదు. అలాంటివన్నీ అసహ్యకరమైనవి అని లేఖనాలు స్పష్టంగా బోధిస్తాయి (ద్వితీయోపదేశకాండము 18:12). ఇటువంటి వాటిలో పాల్గొని కొనసాగించేవారు దేవుని రాజ్యం నుండి తొలగించబడతారు. (గలతీయులకు 5:19-21; ప్రకటన 21:8; 22:14, 15).

12. నిజమైన ప్రవక్త చేసే పని ప్రధానంగా సంఘానికి సేవ చేయడమా లేక అవిశ్వాసులకు సేవ చేయడమా?

"ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది" (1 కొరింథీయులకు 14:22).

జవాబు: బైబిలు చాలా స్పష్టముగా ఉన్నది. ఒక ప్రవక్త యొక్క సందేశం కొన్నిసార్లు ప్రజలను మెరుగు పరుస్తున్నప్పటికీ, ప్రవచనము యొక్క ప్రధాన ఉద్దేశ్యం సంఘానికి సేవ చేయడమే.

13. దేవుని అంత్య-కాల సంఘానికి ప్రవచన వరము ఉన్నదా?

జవాబు : 23వ స్టడీ గైడ్ పత్రికలో, యేసు తన అంత్యకాల సంఘము గురించి ఆరు అంశాల వివరణ ఇస్తున్నట్లు మనము కనుగొన్నాము. ఈ ఆరు అంశాలను సమీక్షిద్దాం:

A. ఇది క్రీ. శ. 538 మరియు 1798 మధ్య అధికారిక సంస్థగా ఉండదు.

B. ఇది 1798 తరువాత ఉత్పన్నమవుతుంది మరియు దాని పనిని కొనసాగిస్తుంది.

C. ఇది నాల్గవ ఆజ్ఞ యొక్క ఏడవ దిన విశ్రాంతిదినముతో సహా పది ఆజ్ఞలను గైకొనును..

D. ఇది ప్రవచన వరమును కలిగి ఉంటుంది.

E. ఇది ప్రపంచవ్యాప్త సువార్తిక (మిషనరీ) సంఘము అవుతుంది.

F. ఇది ప్రకటన 14:6-14 లో ఇయ్యబడిన యేసు ప్రభువు యొక్క మూడు- అంశముల వర్తమానమును బోధించుచు ప్రకటించుచుండును.

దేవుని అంత్యకాల శేషించిన సంఘము యేసు ప్రభువిచ్చిన ఆరు వివరణాత్మక అంశాలకు సరిపోయేదని గుర్తుంచుకోవాలి. ప్రవచన వరమును తప్పనిసరిగా చేర్చాలని దీని అర్ధం. ఇది ప్రవక్తను కలిగి ఉంటుంది.

14.నీవు అన్ని వరాలు ఉన్న దేవుని అంత్య- కాల సంఘంలో చేరినప్పుడు, అది నిన్ను ఎలా ప్రభావితం చేస్తుంది?

"అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యులు మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక,” (ఎఫెసీయులకు 4:14).

జవాబు : ఇది నిన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. నీవు ఇకపై కానీ నమ్మకాలలో అనిశ్చితంగా అస్థిరంగా ఉండవు.

15. అపొస్తలుడైన పాలు. 1 కొరింథీయులకు 12:1-8 లో, యేసు సంఘానికి ఇచ్చిన వరములను శరీర అవయవములతో పోల్చాడు. శరీరంలోని ఏ అవయవము ప్రవచన వరమును ఉత్తమంగా సూచిస్తుంది?

"ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక" (1 సమూయేలు 9:9).

జవాబు : ఒక ప్రవక్తను కొన్నిసార్లు దీర్ఘదర్శి (భవిష్యత్తును చూడగలిగే వ్యక్తి) అని పిలుస్తారు కాబట్టి, కళ్ళు ప్రవచన వరమును ఉత్తమంగా సూచిస్తాయి.

16. ప్రవచనము సంఘమునకు కళ్ళు కాబట్టి, ప్రవచన వరము లేని సంఘము ఏ స్థితిలో ఉంటుంది?

జవాబు : ఇది అంధకార స్థితిలో ఉంటుంది. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా" (మత్తయి 15:14) అని చెప్పినప్పుడు యేసు తదుపరి ప్రమాదాల గురించి ప్రస్తావించాడు.

17. దేవుని శేషించిన సంఘము క్రీస్తు అనుగ్రహించిన అన్ని వరములు కలిగి ఉండవలెనా?

జవాబు : అవును. దేవుని అంత్యకాల సంఘము “ఏ కృపావరమునందును లోపము లేక” ఉంటుంది అని లేఖనాలు స్పష్టంగా బోధిస్తాయి, అనగా దీనికి ప్రవచన వరముతో సహా అన్ని వరములు ఉండాలి (1 కొరింథీయులకు 1:5-8).

అపోస్తులులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు.

18. దేవుని అంత్యకాల శేషించిన సంఘానికి “యేసును గూర్చిన సాక్ష్యము" ఉంటుందని ప్రకటన 12:17 ఎత్తి చూపింది. ప్రకటన 19:10 "యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని (ప్రవదన ఆత్మయని" చెప్పుచున్నది. సంఘానికి ప్రవక్త ఉంటారని దీని అర్థమా?

జవాబు : అవును. ఒక దేవదూత అపొస్తలుడైన యోహానుతో ప్రకటన 19:10 లో తాను యోహాను యొక్క "సహదాసుడునై" యేసును గూర్చిన సాక్ష్యము కలిగి ఉన్న అతని "సహోదరులతోను" ఒకరినని చెప్పాడు. ఇదే దేవదూత ప్రకటన 22:9 లోని ఒకేలాంటి సమాచారాన్ని పునరావృతం చేస్తూ, "నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, సహదాసుడను" అని చెప్పాడు. ఈసారి యేసును గూర్చి సాక్ష్యంతో తనను తాను ప్రవక్త అని పిలుచుకున్నాడు. కాబట్టి, "యేసును గూర్చిన సాక్ష్యము" కలిగి ఉండటం మరియు ప్రవక్తగా ఉండటం ఒకటే.

19. “యేసును గూర్చిన సాక్ష్యము” అనే మాటలు ఏ ఇతర ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి?

జవాబు: “యేసును గూర్చిన సాక్ష్యము" అనగా ప్రవక్త చెప్పిన మాటలు యేసు నుండి వచ్చినవి. నిజమైన ప్రవక్త చెప్పిన మాటలను మనకు యేసు ఇచ్చిన ప్రత్యేక సందేశంగా పరిగణించాలి (ప్రకటన 1:1, ఆమోసు 3:7). ఏ విధంగానైనా, నిజమైన ప్రవక్తపై నిందను తీసుకురావడం, చాలా ప్రమాదకరమైనది. ఇది వారిని పంపిస్తూ మార్గనిర్దేశం చేస్తున్న యేసుపై నిందలు తెచ్చినట్లే. "నా ప్రవక్తలకు కీడు చేయకూడదు" (కీర్తన 105:15) అని దేవుడు హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు.

20. నిజమైన ప్రవక్తకు బైబిల్ అర్హతలు ఏమిటి?

జవాబు : నిజమైన ప్రవక్తను నిర్ధారించే బైబిల్ పరీక్షా అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

A. దైవిక జీవితాన్ని జీవించడం (మత్తయి 7:15-20).

B. దేవుని చేత సేవాపరిచర్యకు పిలువబడటం (యెషయా 6:1-10; యిర్మీయా 1:5-10; ఆమోసు 7:14, 15).

C. బైబిలుకు అనుగుణంగా మాట్లాడటం మరియు వ్రాయడం (యెషయా 8:19, 20).

D. నిజమయ్యే సంఘటనలను ప్రవచించడం (ద్వితీయోపదేశకాండము 18:20-22).

E. దర్శనముల అనుగ్రహము పొందడం (సంఖ్యాకాండము 12:6).

21. దేవుడు తన అంత్యకాల శేషించిన సంఘానికి ప్రవక్తను పంపించాడా?

Answer

జవాబు : అవును పంపించాడు! సంక్షిప్త వివరాలు ఇక్కడ ఉన్నాయి:

దేవుడు ఒక యవ్వన స్త్రీని పిలుచుట

దేవుని అంత్యకాల సంఘము 1840ల ప్రారంభంలో ఏర్పడటం ప్రారంభించింది మరియు మార్గదర్శకత్వం చాలా అవసరం. కాబట్టి, ఆమోసు 3:7 లోని వాగ్దానానికి అనుగుణంగా, దేవుడు ఎల్లెన్ హార్మోన్ అనే యువతిని తన ప్రవక్త అని పిలిచాడు. ఎల్లెన్ పిలుపును అంగీకరించెను. ఆమె తొమ్మిదేళ్ల వయసులో జరిగిన ప్రమాదంలో గాయపడింది మరియు కేవలం మూడేళ్ల ప్రాథమిక విద్యతో పాఠశాల నుండి తప్పుకోవలసి వచ్చింది. 17 ఏళ్ళ వయసులో దేవుడు పిలిచినప్పుడు, ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆమె బరువు దాదాపు 32 కేజీలు మాత్రమే మరియు చనిపోయే వరకు వెళ్లింది.

ఆమె 70 సంవత్సరముల సేవా పరిచర్య జీవితము

దేవుడు ఆమెను శారీరకముగా బలపరచి దీనురాలుగా ఉంచుతాడనే అవగాహనతో ఎల్లెన్ దేవుని పిలుపును అంగీకరించెను. ఆమె అదనంగా 70 సంవత్సరాలు జీవించింది మరియు 87 ఏళ్ళ వయసులో మరణించింది. సంఘము దాని సభ్యులను తమకు మతముగా బైబిల్ వైపు మరియు యేసు ఇచ్చిన ఉచిత నీతి వైపు మళ్ళించడం గురించి ఆమె నొక్కి చెప్పింది. ఈ స్టడీ గైడ్ లో పేర్కొన్న ప్రవక్త యొక్క ప్రతి పరీక్షను ఎల్లెన్ నెరవేర్చెను.

ఆమె కలము పేరు మరియు రచించిన గ్రంథములు

ఎల్లెన్ జేమ్స్ వైట్ అనే మతాధికారిని వివాహం చేసుకొని, ఎల్లెన్ జి. వైట్ అనే పేరుతో అనేక గ్రంథములు రచించెను. ఆమె ప్రపంచ వ్యాప్తముగా ఉన్న అత్యంత ప్రజాదరణ (మన్నన) పొందిన మహిళా రచయితలలో ఒకరు అయ్యారు. ఆమె పుస్తకాలు, ప్రపంచవ్యాప్తంగా చదువబడుచు, ఆరోగ్యము, విద్య, మితానుభవము, క్రైస్తవ గృహం, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత, సంతాన సాఫల్యం, ప్రచురణ మరియు రచన, అవసరమైనవారికి సహాయపడుట, గృహనిర్వాహకత్వము, సువార్తసేవ, క్రైస్తవ జీవనము, వంటి మరెన్నో వాటిపై దైవప్రేరేపిత సలహాలు ఇస్తాయి. ఆమె రచించిన విద్య అనే పుస్తకము దాని రంగంలో అధికారంగా పరిగణించబడుతుంది. కొలంబియా విశ్వవిద్యాలయంలోని విద్య యొక్క మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్లోరెన్స్ స్ట్రాటమీయర్ ఈ పుస్తకంలో "అధునాతన విద్యా భావనలు" ఉన్నాయని మరియు "దాని కాలము కంటే యాభై ఏళ్ళకు ముందు ఉన్నదని" అన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలోని న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ క్లైవ్ మెక్కే ఆరోగ్యం గురించి ఆమె రాసిన రచనల గురించి ఇలా అన్నారు: "ఆధునిక శాస్త్రీయ పోషణ రాకముందే శ్రీమతి వైట్ రచనలు వ్రాయబడినప్పటికీ, నేటికిని ఆమె రచించిన దానికంటే ఉత్తమమైన పుస్తకము మొత్తానికి అందుబాటులో లేదు." దివంగత న్యూస్కాస్టర్ పాల్ హార్వే మాట్లాడుతూ "పోషకాహారం అనే అంశంపై ఆమె చాలా లోతైన అవగాహనతో రాసింది, ఆమె చెప్పిన అనేక సూత్రాలలో రెండు మినహా మిగతావన్నీ శాస్త్రీయంగా స్థాపించబడ్డాయి." క్రీస్తు జీవితంపై ఆమె పుస్తకం "ది డిజైర్ ఆఫ్ ఏజెస్ (యుగయుగాల ఆకాంక్ష)" లండన్లోని స్టేషనర్స్ హాల్ చేత "ఇంగ్లీష్ మాస్టర్ పీస్" గా ముద్రించబడింది. ఇది హృదయపూర్వకంగా వర్ణనకు మించినది. నిపుణుల అంగీకారానికి చాలా కాలం ముందే ఒక వ్యక్తి యొక్క ఐక్యూ (తెలివితేటలని) పెంచవచ్చని ఆమె తెలివితేటల అంశంపై అన్నారు. ఆమె 1905లో క్యాన్సర్ ఒక సూక్ష్మక్రిమి (లేదా వైరస్) అని, వైద్య శాస్త్రం దీనిని 1950లలో మాత్రమే ఆమోదించడం ప్రారంభించిందని ఆమె అన్నారు. ఎల్లెన్ అన్ని కాలాలలో ఎక్కువగా అనువదించబడిన రచయతలలో నాల్గవ స్థానంలో ఉన్నారని చెప్పబడింది. క్రైస్తవ జీవనంపై ఆమె పుస్తకం, స్టెప్స్ టు క్రైస్ట్ (క్రీస్తు యొద్దకు మెట్లు) 150కి పైగా భాషలు మరియు మాండలికాలలో అనువదించబడింది. (ఈ ఉత్తేజకరమైన పుస్తకం యొక్క ఉచిత కాపీ కొరకు, దయచేసి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కు వ్రాయండి.)

22. ఎల్లెన్ వైట్ గారికి దర్శనాలు ఉన్నాయా?

Answer

జవాబు: అవును, చాలా దర్శనాలు ఉన్నాయి. అవి కొన్ని నిమిషాల నుండి ఆరు గంటల వరకు కొనసాగాయి. అవి ఈ స్టడీ గైడ్ పత్రికలో ఏడవ ప్రశ్నకు జవాబుగా ఇయ్యబడిన దర్శనాలకు బైబిలిచ్చిన ప్రమాణాలకు అనుగుణముగా ఉన్నాయి.

23.ఎల్లెన్ వైట్ గారి మాటలు బైబిలులో భాగంగా ఉన్నాయా లేదా బైబిలుకు అదనంగా ఉన్నాయా?

జవాబు : లేదు. సిద్ధాంతం బైబిల్ నుండి మాత్రమే వస్తుంది. అంత్యకాల ప్రవక్తగా, ఆమె లక్ష్యం యేసు ప్రేమను మరియు ఆయన సమీప రాకడను గూర్చి నొక్కి చెప్పడం. ప్రజలు ఆయనను సేవించాలని మరియు ఆయన నీతిని ఉచిత బహుమానముగా అంగీకరించాలని ఆమె కోరారు. ఆమె చివరిసారిగా ప్రజల దృష్టిని బైబిల్ ప్రవచనాల వైపు మరి ముఖ్యముగా నేటి ప్రపంచమునకు అవసరమైయున్న యేసు ప్రభువు యొక్క మూడు అంశముల వర్తమానములు వైపు సూచించింది (ప్రకటన 14:6-14) ఈ నిరీక్షణ వర్తమానాలను వారు త్వరగా మరియు ప్రపంచవ్యాప్తంగా పంచుకోవాలని ఆమె కోరారు.

24. Did Ellen White speak in harmony with the Scriptures?

24. ఎల్లెన్ వైట్ గారు లేఖనాలకు అనుగుణంగా మాట్లాడారా?

జవాబు : అవును! ఆమె రచనలు లేఖనముతో సంతృప్తమయ్యాయి. ప్రజలను బైబిలు వైపు చూపించడమే ఆమె ప్రకటించిన ఉద్దేశ్యం. ఆమె మాటలు ఎప్పుడూ దేవుని వాక్యానికి విరుద్ధంగా లేవు.

25. ఆమె వ్రాసినది నాకు తెలియదు గనుక ఎల్లెన్ వైట్ గారిని నిజమైన ప్రవక్తగా నేను ఎలా అంగీకరించగలను?

జవాబు : టైమ్ వ్రాసినదాన్ని నీవు చదివే వరకు నీవు అంగీకరించలేను. అయినప్పటికీ, (1) దేవుని నిజమైన అంత్యకాల సంఘానికి ఒక ప్రవక్త ఉండాలి, (2) ఎల్లెన్ వైట్ ఒక ప్రవక్త యొక్క పరీక్షలను నెరవేర్చారు, (3) ఆమె ఒక ప్రవక్త చేసే పని చేసింది. ఆమె పుస్తకాలలో ఒకదాన్ని మీరు చదివి చూడాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. (ది డిజైర్ ఆఫ్ ఏజెస్ (యుగయుగాల ఆకాంక్ష) అనే పుస్తకాన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి కొనుగోలు చేయవచ్చు.) మీరు చదివినప్పుడు, అది మిమ్మల్ని యేసు వైపుకు ఆకర్షిస్తుందా మరియు బైబిల్కు అనుగుణంగా ఉందా అని మీరే ప్రశ్నించుకోండి. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుందని మేము భావిస్తున్నాము. ఇది మీ కొరకు వ్రాయబడింది!

26. ప్రవక్త విషయమై అపొస్తలుడైన పౌలు మనకు ఏ మూడు అంశాల ఆజ్ఞ ఇచ్చాడు?

"ప్రవచించుటను నిర్లక్ష్యము చేయబడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి" (1 థెస్సలొనీకయులకు 5:20, 21).

జవాబు : మనం ఒక ప్రవక్తను తృణీకరించకూడదు లేదా "నిర్లక్ష్యము” చేయకూడదని అని పౌలు చెప్పాడు. బదులుగా, ప్రవక్త చెప్పే మరియు చేసే పనులను మనం బైబిల్ ద్వారా జాగ్రత్తగా పరీక్షించాలి. ఒక ప్రవక్త మాటలు మరియు ప్రవర్తన బైబిలుకు అనుగుణంగా ఉంటే, మనం వాటిని గమనించాలి. నేడు యేసు తన అంత్యకాల ప్రజలను ఇలా చేయమని అడుగుచున్నాడు.

27. నిజమైన ప్రవక్త యొక్క మాటలను మరియు సలహాలను తిరస్కరించడాన్ని యేసు ఎలా పరిగణిస్తాడు?

జవాబు : నిజమైన ప్రవక్తను తిరస్కరించడం దేవుని చిత్తాన్ని తిరస్కరించినట్లని యేసు ఎంచాడు (లూకా 7:28-30). ఇంకా, ఆధ్యాత్మిక శ్రేయస్సు తన ప్రవక్తలను విశ్వసించడాన్ని సూచిస్తుంది. (2 దినవృత్తాంతములు 20:20).

28. నిజమైన అంత్యకాల ప్రవక్తలు క్రొత్త సిద్ధాంతాన్ని పుట్టిస్తారా, లేదా సిద్దాంతం ఖచ్చితంగా బైబిల్ నుండి వసుతుందా?

జవాబు: నిజమైన అంత్యకాల ప్రవక్తలు సిద్ధాంతాన్ని పుట్టించరు (ప్రకటన 22:18, 19) బైబిల్ అన్ని సిద్ధాంతాలకు మూలం. అయితే, నిజమైన ప్రవక్తలు :

A. ప్రవక్త ఎత్తి చూపినంతవరకు స్పష్టంగా తెలియని బైబిల్ సిద్ధాంతాల యొక్క ఉత్తేజకరమైన కొత్త కోణాలను వెల్లడిస్తారు (ఆమోసు 3:7).

B. దేవుని ప్రజలను యేసుతో సన్నిహితంగా నడవడానికి మరియు ఆయన వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి నడిపిస్తారు

C. బైబిల్ యొక్క కఠినమైన, అస్పష్టమైన లేదా గుర్తించబడని భాగాలను అర్థం చేసుకోవడానికి దేవుని ప్రజలకు సహాయపడతారు, తద్వారా అవి అకస్మాత్తుగా జీవం పోసుకుని మనకు అర్థమయ్యి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి.

D. మతోన్మాదం, వంచన మరియు ఆధ్యాత్మిక మూర్ఖత్వం నుండి దేవుని ప్రజలను రక్షించడంలో సహాయపడతారు

E. రోజువారీ వార్తల సంఘటనల ద్వారా ధృవీకరించబడిన, అకస్మాత్తుగా కొత్త అర్థాన్ని తీసుకునే అంత్య-కాల ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి దేవుని ప్రజలకు సహాయపడతారు.

F. యేసు త్వరలో తిరిగి రావడం మరియు ప్రపంచం అంతం కావడం గురించి దేవుని ప్రజలకు సహాయపడతారు.

యేసు పట్ల ప్రగాఢమైన ప్రేమ కొరకు, బైబిల్ గురించి కొత్త ఉత్సాహం మరియు బైబిల్ ప్రవచనాల గురించి సరికొత్త అవగాహన కొరకు - దేవుని అంత్య కాలపు ప్రవక్త మాట వినండి. అద్భుతమైన మలుపులను తీసుకునే జీవితాన్ని మీరు కనుగొంటారు. గుర్తుంచుకోండి, యేసు తన అంత్యకాల సంఘాన్ని సహాయకరమైన ప్రవచనాత్మక సందేశాలతో ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవునికి సోత్రము! ఆయన తన అంత్య కాల ప్రజల కొరకు పరలోకం చేయగలిగే ప్రతిదాన్ని చేస్తున్నాడు. ఆయన తన ప్రజలను రక్షించి తన నిత్య రాజ్యానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఆయనను అనుసరించేవారికి పరలోకానికి తప్పని ప్రవేశం లభిస్తుంది (మత్తయి 19:27 - 29).

గమనిక : ప్రకటన 14:6-14 లోని మూడు దూతల వర్తమానాల అంశంపై ఇది తొమ్మిదవ మరియు చివరి స్టడీ గైడ్ పత్రిక. ఇతర కీలకమైన అంశాలపై మూడు మనోహరమైన స్టడీ గైడ్ పత్రికలు మిగిలి ఉన్నాయి.

29. ఎల్లెన్ వైట్ గారి రచనలను బైబిలు ద్వారా పరీక్షించడానికి మరియు బైబిలుకు అనుగుణంగా ఉంటే ఆమె సూచనను అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?

నీ జవాబు:


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. సంఘానికి ప్రవక్త లేనప్పుడు ఏమి జరుగుతుంది?

జవాబు: “దేవోక్తి (ప్రపంచము లేదా దర్శనము) లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు” (సామెతలు 29:18). సంఘమును ఉపదేశించుటకును, మార్గము చూపించుటకును దారిని తిరిగి యేసు ప్రభువు మరియు బైబిలు వైపు నడిపించుటకు ప్రవక్త లేనప్పుడు, ప్రజలు తడబాటుతో జ్ఞానవిహీనులై (కీర్తన 74:9, 10) చివరికి నశించిపోయెదరు.

2. ఇప్పుడు మరియు యేసు రెండవ రాకడ మధ్య అదనపు నిజమైన ప్రవక్తలు కనిపిస్తారా?

జవాబు: యోవేలు 2:28, 29 ప్రవక్తయైన మోవేలు ప్రవచనము ఆధారముగా, ఇది ఖచ్చితంగా సాధ్యమే అనిపిస్తుంది. అయితే అబద్ద ప్రవక్తలు కుడా ఉంటారు (మత్తయి 7:15; 24:11,24). ప్రవక్తలను బైబిలు ద్వారా పరీక్షించడానికి (యెషయా 8:19, 20, 2 తిమోతి 2:15), వారు నిజమైనవారైతేనే వారి సలహాలను పాటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రజలను మేల్కొలపడానికి, వారిని హెచ్చరించడానికి మరియు యేసు మరియు ఆయన వాక్యం వైపుకు మళ్లించడానికి ప్రవక్తలు ఎప్పుడు అవసరమో దేవునికి తెలుసు. తన ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించడానికి ఆయన ఒక ప్రవక్తను (మోషేను) పంపాడు (హోషేయా 12:13). యేసు మొదటి రాకడకు ప్రజలను సిద్ధం చేయడానికి ఆయన ఒక ప్రవక్తను (బాప్తిస్మమిచ్చు యోహానును) పంపాడు (మార్కు 1:1-8). ఈ ముగింపు సమయాలకు ప్రవచనాత్మక సందేశాలను కూడా ఆయన వాగ్దానం చేశాడు. మన దృష్టిని బైబిలుకు మరియు అంత్యకాల ప్రవచనాలకు సూచించడానికి, మనలను బలపరచి, ప్రోత్సాహించి, మనకు అభయమిచ్చి, యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మనము "నిర్దోషులుగా" ఉండుటకు, మనలను యేసు ప్రభువు వలె మార్చుటకు దేవుడు ప్రవక్తలను పంపుతాడు కాబట్టి ప్రవచనాత్మక సందేశాలను స్వాగతిద్దాం మరియు వాటిని మన వ్యక్తిగత మంచి కొరకు పంపినందుకు దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిద్దాం.

3. నేడు చాలా సంఘాలకు ప్రవచన వరము ఎందుకు లేదు?

జవాబు : విలాపవాక్యములు 2:9 ఇలా చెబుతోంది, "ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు." యెహెజ్కేలు 7:26; యిర్మీయా 26:4-6; యెహెజ్కేలు 20:12-16, మరియు సామెతలు 29:18 కూడా దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను బహిరంగంగా విస్మరించినప్పుడు, ప్రవక్తలు ఆయన నుండి దర్శనం పొందలేరని చూపిస్తుంది. వారు ఆయన ఆజ్ఞలను పాటించటం ప్రారంభించినప్పుడు, ప్రోత్సహించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఆయన ఒక ప్రవక్తను పంపుతాడు. దేవుని అంత్యకాల శేషించిన సంఘం సబ్బాతు ఆజ్ఞతో సహా ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ ఉద్భవించినప్పుడు, ఇది ప్రవక్తకు సమయం. దేవుడు సకాలములో ఒక ప్రవక్తను పంపాడు.

4. ప్రవచన వరం మీకు అర్థవంతం అవ్వడానికి మీరు ఏమి చేయవచ్చు?

జవాబు : మీ కొరకు దీనిని అధ్యయనం చేయండి మరియు దానిని ప్రార్ధనాత్మకంగా అనుసరించండి, తద్వారా యేసు తన రాకడ కొరకు మిమ్మల్ని మార్గనిర్దేశం చేయవచ్చు మరియు సిద్ధం చేయవచ్చు. "మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, ఐశ్వర్యవంతులైతిరి, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును" (1 కొరింథీయులకు 1:4-8),

5. దేవుని శేషించిన సంఘములో ప్రవచన పరము లేదా అన్యభాషలతో మాట్లాడే వరము ఎక్కువ పాత్ర పోషిస్తుందా?

 జవాబు : ప్రవచన వరము ప్రధాన పాత్ర పోషిస్తుంది. 1 కొరింథీయులకు 12:28 లో ఇది అన్ని బహుమతుల ప్రాముఖ్యతలో రెండవదిగా జాబితా చేయబడింది, అయితే అన్యభాషలతో మాట్లాడే వరము చివరిగా జాబితా చేయబడింది. ప్రవచన వరము లేని సంఘము అంధకారమైనది. ఈ అంధకార ప్రమాదమును గూర్చి యేసు ప్రభువు తన అంత్యకాల సంఘమును గంభీరముగా హెచ్చరించుచు వారు చూచునట్లు తమ కన్నులను పరలోక నేత్రాంజనముతో (కాటుకతో) అంటుకొనమని (అభిషేకించుకొనమని)మనవి చేసికొనుచున్నాడు (ప్రకటన 3:17,18 చూడుము). కాటుక పరిశుద్ధాత్మను సూచిస్తుంది

(1 యోహాను 2:20, 27; యోహాను 14:26) ఆయన సంఘానికి అన్ని వరములు ఇస్తాడు. (1 కొరింథీయులకు 12:4, 7-11). దేవుని ప్రవక్త మాటలను వినడం అతని అంత్య కాలపు ప్రజలు బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు అనిశ్చయతను మరియు గందరగోళాన్ని నివారిస్తుంది.

6. “బైబిల్ మరియు బైబిల్ మాత్రమే" అని మనం విశ్వసిస్తే, ఆధునిక కాలపు ప్రవక్తలను మనం తిరస్కరించకూడదా?

జవాబు : క్రైస్తవ సిద్ధాంతానికి ఏకైక మూలం బైబిల్. ఏదేమైనా, అదే బైబిల్ ఎత్తి చూపింది : ప్రవచన వరము దేవుని సంఘంలో అంత్యకాలం వరకు ఉంటుంది (ఎఫెసీయులకు 4:11, 13, ప్రకటన 12:17; 19:10; 22:9). ప్రవక్త యొక్క సలహాను తిరస్కరించడం దేవుని చిత్తాన్ని తిరస్కరించడంతో సమానం (లూకా 7:28-30). ప్రవక్తలను పరీక్షించి వారి మాట, జీవితము బైబిలుకు అనుగుణంగా ఉంటే వారి సలహాలను పాటించాలని మనకు ఆజ్ఞాపించబడింది (1 థెస్సలొనీకయులకు 5:20, 21). అందువల్ల, తమ విశ్వాసం విషయమై “బైబిలుపై మాత్రమే” ఆధారపడే వ్యక్తులు ప్రవక్తలకు సంబంధించిన సలహాలను పాటించాలి. నిజమైన ప్రవక్తలు ఎల్లప్పుడూ బైబిలుకు అనుగుణంగా మాట్లాడతారు. దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవక్తలు అబద్ధికులుగా తిరస్కరించబడాలి. మన ప్రవక్తలు చెప్పిన దానిని విని పరీక్షించడంలో విఫలమైతే, మన విశ్వాసం విషయమై బైబిలుపై ఆధారపడటం లేదు.

సారాంశ పత్రము

ఈ సారాంత పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టంది. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1)దయచేసి ఒకే అర్ధాన్ని కలిగి ఉన్న అంశాలను గుర్తించండి: (4)

( ) యేసును గుర్చిన సాక్షము.

( ) అన్యబాషలతో మాట్లాడు వారము.

( ) ప్రవచనయగు ఆత్మ.

( ) భూతవైద్యుల యుక్క ఊహగానాలు.

( ) ప్రవచన వరం.

( ) చనిపొయినవారి ఆత్మలతో సంభాషించుట.

( ) ప్రవక్తలు సంఘమునకు ఉపదేశించుట.

2. దేవుడు స్త్రిపురుషులకు ప్రవచన వరమును ఇస్తాడా? (1)

( ) అవును.

( ) కాదూ.

3) ఎఫెసీయులకు 4వ అధ్యాయం ప్రకారం, యేసు తన ఆరోహణమందు సంఘమునకు విడిచిపెట్టిన ఐదు వరములు ఏమిటి? (5)

( ) ప్రవక్తలు.

( ) ఉపదేషకులు.

( ) పాటలు పాడే వరం.

( ) అవసరములో ఉన్న నిరుపేదలతో పంచుకొనుట.

( ) కాపరులు.

( ) అపోస్తులులు.

( ) సాక్షమిచుట.

( ) సువార్తికులు.

4) ప్రవక్తలతో సహా ఈ ఐదు వరములు సంఘములో ఎంత కాలము వరకు ఉండాలి? (1)

( ) క్రొత్త నిబంధన ప్రవక్తలు చనిపోయే వరకు మాత్రమే.

( ) తీర్పు ప్రారంభంమయ్యే వరకు.

( ) యుగాంతము వరకు.

5. బైబిలు ప్రకారము, దర్శనంలో ఉన్న ప్రవక్తలు సమంధించి క్రింది జాబితా చేయబడిన సత్యమైన విషయాలు ఏవి? (5)

( ) తెలియని బాషలలో మాట్లాడును.

( ) దర్శనంలో ఎప్పుడూ మాట్లాడరు.

( ) కళ్ళు తెరిచి ఉంటాయి.

( ) తరచుగా హింసాత్మకంగా మారతారు.

( ) శరీరంలో శ్వాస ఉండును.

( ) దర్శనంలో ఉనప్పుడు కొన్నిసార్లు మాట్లడవచ్చు.

( ) భూసంబంధమైన పరిసరాలతో సంబంధముండదు.

( ) ప్రకృతికి అతీతమైన మానవాతీత శక్తిని పొందవచ్చు.

6) సూచక క్రియలు అద్భుతాలు చేయడం అనేది ప్రవక్త దేవుని నుండి వచ్చినదానికి ఎల్లప్పుడూ రుజువు. (1)

( ) అవును.     ( ) కాదు.

7) ఒక ప్రవక్త దేవుని నుండి వచ్చాడని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే అతడు లేదా ఆమె (1)

( ) జాలితో మరియు ప్రవర్తనలో దయతో ఉండాలి.

( ) అద్భుతమైన సూచక క్రియలు చేయాలి.

( ) మిరుమిట్లు గొలిపే తేజస్సు కలిగి ఉండాలి.

( ) బైబిలు గురించి బాగా తెలిసినట్లు కనబడాలి.

( ) యేసు వలె కనబడాలి.

( ) బైబిలుకు అనుగుణంగా మాట్లాడాలి, నడుచుకోవాలి.

8) క్రింది వాటిలో ఏది బైబిల్ ఖండించలేదు? (1)

( ) సోదె చెప్పడం.

( ) భూతవైద్యుల చేసే పని.

( ) జ్యోతిషశాస్త్రం.

( ) వశీకరణ విద్య.

( ) మంత్రాలను పలకడం లేదా మాయలను ఉపయోగించడం.

( ) చనిపొయినవారి ఆత్మలను సంప్రదించడం.

( ) ఒక ప్రవక్త బైబిలుకు అనుగుణంగా మాట్లాడటం మరియు జీవించడం.

9) ప్రవక్త యొక్క ప్రధాన పని ఉపదేశిస్తూ సంఘానికి సేవ చేయడం. (1)

( ) అవును.     ( ) కాదూ.

10) ఒక సంఘానికి నిజమైన ప్రవక్త ఉంటేనే తప్ప దేవుని నిజమైన అంత్య-కాల సంఘము కాలేదు. (1)

( ) సత్యము.   ( ) అసత్యము.

11) శరీరంలోని ఏ అవయవం ప్రవచనాన్ని సూచిస్తుంది? (1)

( ) నోరు.

( ) చెవులు.

( ) చేతులు.

( ) కళ్ళు.

( ) కాళ్ళు.

12) యేసు రెండవ రాకడకు ముందు మరికొందరు నిజమైన అంత్య–కాల ప్రవక్తలు కనిపించవచ్చు. (1)

( ) అవును.   ( ) కాదు.

13) “బైబిల్ మరియు బైబిలును మాత్రమే” అనుసరించడం అంటే ఒకడు నిజమైన ప్రవక్తను అంగీకరించాలి. (1)

( ) అవును.   ( ) కాదూ.

14) ప్రవచనానికి సంబంధించి బైబిలు ఏ మూడు విషయాలను 1థెస్సలోనీకయులకు 5:20, 21లో ఆజ్ఞాపించింది? (3)

( ) ప్రవక్తలను లేదా ప్రవచనాన్ని తృణీకరించవద్దు.

( ) ప్రవక్తలందరిని అనుసరించండి.

( ) బైబిల్ ద్వారా ప్రవక్త మాటలు మరియు క్రియలను నిరూపించండి లేదా పరీక్షించండి.

( ) ప్రవక్తలు నిజమైన వారో లేదా అబదికులో వారినే అడగండి.

( ) మేలైన దానిని నమ్మండి, లేదా చేపట్టుకోండి.

( ) ప్రవక్తలందరిని విస్మరించండి.

15) నిజమైన ప్రవక్త యొక్క ఉపదేశామును మనము తిరస్కరించినప్పుడు, మనము దేవుని ఉపదేశామును తిరస్కరించాము. (1)

( ) అవును.    ( ) కాదూ.

16) నిజమైన అంత్య-కాల ప్రవక్తలు బైబిల్లో లేని కొత్త సిదంతాలను బోధిస్తారు. (1)

( ) అవును.    ( ) కాదు.

17) చాలా సంఘాలలో నిజమైన ప్రవక్త ఎందుకు లేరు? (1)

( ) వారు వస్తే వీరు వారిని నమ్మరు.

( ) వారు దేవుని ఆజ్ఞలనింటినీ పాటించడం లేదు.

( ) వారికి ప్రవక్త లేకుండా అవసరమైన వెలుగు (సత్యము) ఉన్నది.

18) దర్శనము లేనపుడు ప్రజలు నశించిపోతారు. (1)

( ) సత్యము.     ( ) అసత్యము.

19) ప్రవచన వరము లేని సంఘము గ్రుడ్డిది (1)

( ) అవును.   ( ) కాదు.

20) ఎల్లెన్ వైట్ గారి రచనలను లేఖనము ద్వారా పరీక్షించడానికి మరియు అవి బైబిలుకు అనుగుణంగా ఉంటే వాటిని అంగీకరించడానికి నేను సిధంగా ఉన్నాను.

( ) అవును.    ( ) కాదూ.