Lesson 23

బైబిలు తన అంత్య-కాలపు ప్రజలు (క్రీస్తు వధువు) ప్రవేశించడానికి యేసు పిలిచే ఒక్కటే శరీరము లేదా సంఘము ఉన్నదని చెప్పుచున్నది. కొంతమందికి, ఇది అనాలోచితమైనది, ఎందుకనగా, నేడు వేలాది సంఘములు తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటాయి. వాస్తవానికి వాటిలో ప్రతి ఒక్కటి దేవుని సంఘము అని చెప్పుకుంటాయి, అయినప్పటికీ అవి ప్రతి ఒక్కటి బైబిలు వ్యాఖ్యానం, విశ్వాసం మరియు ఆచరణలో విస్తృతంగా విభేదిస్తాయి. నిజాయితీగా సత్యాన్వేషణ చేసేవారు ప్రతి ఒక్కరి వాదనలను పరిశోధించడం చాలా అసాధ్యం. ఏదేమైనా, యేసు తన సంఘాన్ని వివరంగా వివరించడం ద్వారా ఈ గందరగోళాన్ని పరిష్కరించినందుకు మీరు కృతజ్ఞతతో ఉండగలరు! స్పష్టమైన మరియు శక్తివంతమైన వివరణ, ప్రకటన 12 మరియు 14 లో కనుగొనబడింది, మరియు ఇది అంత్య కాలములలో మీకు సహాయపడే అద్భుతమైన సత్యాలతో మిమ్మల్ని పులకరింపజేస్తుంది.

గమనిక : ఈ పరివర్తన కలిగించే సత్యాలలో మీ అన్వేషణ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు దయచేసి ప్రకటన 12:1-17 చదవండి.

1. By what prophetic symbol does Jesus represent His true church?

1. యేసు తన సత్యమైన సంఘాన్ని ఏ ప్రవచనాత్మక గుర్తు ద్వారా సూచిస్తాడు?

“సుందరి సుకుమారియునైన సీయోను కుమార్తె”. (యిర్మీయా 6:2). “ఆయనను స్తుతించుడి, గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు" (ప్రకటన 19:7, 8).

జవాబు : యేసు ప్రభువు తన సత్యమైన సంఘాన్ని (సీయోను కుమార్తె)ను, పవిత్రురాలైన స్త్రీగా, తప్పుడు, భ్రష్టత్వ సంఘాలను వేశ్యగా సూచించాడని మనము 22వ స్టడీ గైడ్ పత్రికలో తెలుసుకున్నాము (2 కొరింథీయులకు 11:2; ఎఫెసీయులకు 5:22, 23; మరియు యెషయా 51:16 కూడా చూడండి).

2. In Revelation 12:1, Jesus symbolizes His church as a woman “clothed with the sun,” with “the moon under her feet,” and wearing “a crown [KJV] of twelve stars.” What do these symbols mean?

2. ప్రకటన 12:1 లో, యేసు ప్రభువు తన సంఘమును "సూర్యుని ధరించుకొని" ఆమె "పాదముల క్రింద చంద్రుడును" మరియు "శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటము ధరించుకొనిన" స్త్రీగా సూచించుచున్నాడు. ఈ గుర్తుల అర్థమేమిటి?

జవాబు : సూర్యుడు యేసు ప్రభువును, ఆయన సువార్తను మరియు ఆయన నీతిని సూచిస్తుంది. “దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు” (కీర్తనలు 84:11). (మలాకీ 4:2 కూడా చూడండి.) యేసు ప్రభువు లేకుండ రక్షణ లేదు (అపొస్తలుల కార్యములు 4:12). అన్నింటికంటే మించి, తన సంఘము ఆయన సన్నిధిని మహిమలతో పొంగి పొర్లాలని యేసు కోరుకుంటాడు. "ఆమె స్త్రీ పాదముల క్రింద ఉన్న చంద్రుడు" పాత నిబంధన యొక్క బలి అర్పణా వ్యవస్థను సూచిస్తుంది. చంద్రుడు సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తున్నందున, రాబోయే మెస్సీయా నుండి వెలుగును ప్రతిబింబించినట్లే బలి విధానం ఆధ్యాత్మికంగా సహాయపడింది. (హెబ్రీయులకు 10:1). “పండ్రెండు నక్షత్రముల కిరీటము" 12 మంది శిష్యుల పనిని సూచిస్తుంది, ఇది క్రొత్త నిబంధన సంఘము యొక్క ప్రారంభ సంవత్సరాలకు పట్టాభిషేకం చేసింది.

3. Next, the prophecy states that the woman is in labor, about to deliver a baby who would one day rule all nations with a rod of iron. She then delivered the “male Child,” and later He was taken up

3.తరువాత, స్త్రీ ప్రసవంలో ఉందని, ఒకరోజు అన్ని దేశాలను ఇనుప దండముతో పరిపాలించే శిశువును ప్రసవించబోతోందని ప్రవచనము చెప్పుచున్నది. ఆమె "మగశిశువును" ప్రసవించింది, తరువాత ఆయన పరలోకమందున్న దేవుని సింహాసనమునకు కొనిపోబడెను (ప్రకటన 12:1, 2, 5). ఈ శిశువు ఎవరు?

జవాబు : శిశువు యేసు. ఆయన ఒక రోజు అన్ని దేశాలను ఇనుప దండముతో పరిపాలిస్తాడు (ప్రకటన 19:13-15; కీర్తన 2:7-9). మన పాపాలకు సిలువ వేయబడిన యేసు మృతులలో నుండి లేచి పరలోకమునకు ఆరోహణమాయెను(అపొస్తలులు కార్యములు 1:9-11). మన జీవితములో ఆయన పునరుత్థాన శక్తి తన ప్రజలకు అవసరమైన యేసు యొక్క వరములలో ఒకటి (ఫిలిప్పీయులకు 3:10).

4. Revelation 12:3, 4 introduces “a great, fiery red dragon” who hated the “male Child” and tried to kill him at birth. (You might remember this dragon from Study Guide 20.) Who was the dragon?

4. ప్రకటన 12:3, 4 "మగ శిశువును" పుట్టుకతోనే చంపడానికి ప్రయత్నించిన "మండుతున్న ఎర్రని మహా ఘటసర్పము" ను పరిచయం చేసింది. (20వ స్టడీ గైడ్ పత్రిక నుండి ఈ ఘటనర్వము మీకు గుర్తుండవచ్చు.) ఘటసర్పము ఎవరు?

జవాబు : ఈ మహా ఘటసర్పము, పరలోకములో నుండి పడద్రోయబడి (ప్రకటన 12:7-9) మరియు యేసు జన్మించిన సమయంలో అన్యమత రోమా సామ్రాజ్యం ద్వారా పనిచేస్తున్న సాతానును సూచిస్తుంది. పుట్టుకతోనే యేసును చంపడానికి ప్రయత్నించిన అధిపతి అన్యమత రోమా క్రింద ఉన్న హేరోదు రాజు. అతడు బేత్లహేములోని మగ శిశువులందరినీ చంపాడు, వారిలో ఒకరు యేసు అవుతాడని ఆశించాడు (మత్తయి 2:16).

5. What is the meaning of the “seven heads” and “ten horns” of the dragon, and of “a third of the stars of heaven” being cast to the earth?

5. ఘటసర్పము యొక్క "ఏడు తలలు" "పది కొమ్ములు" మరియు "ఆకాశ నక్షత్రములలో మూడవ వంతు" భూమికి పడదోయబడటం యొక్క అర్థం ఏమిటి?

జవాబు : "ఏడు తలలు" రోమా సామ్రాజ్యము నిర్మించబడిన ఏడు కొండలు లేదా పర్వతాలను సూచిస్తాయి (ప్రకటన 17:9, 10). మన స్టడీగైడ్ పత్రికల్లో ఇప్పటి వరకు ఏడు తలలు మరియు 10 కొమ్ములతో మూడుసార్లు ఒక మృగాన్ని ఎదుర్కొన్నాము (ప్రకటన 12:3: 13:1; 17:3). "పది కొమ్ములు" దేవుని ప్రజలను మరియు సంఘాన్ని అణచివేయడంలో ప్రధాన శక్తులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు లేదా దేశాలను సూచిస్తాయి. అన్యమత రోమా పదవీకాలంలో (ప్రకటన 12:3, 4), వారు రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టడంలో పేపసీకి (పోపు వ్యవస్థకు మద్దతు ఇచ్చిన 10 అనాగరిక తెగలకు ప్రాతినిధ్యం వహించారు (దానియేలు 7:23, 24). ఈ తెగలు తరువాత ఆధునిక ఐరోపాగా మారాయి. అంత్యదినాలలో, అవి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో "మహా బబులోను"కు మద్దతు ఇచ్చే అంత్యకాల సంకీర్ణంలో ఐక్యమయ్యే ప్రపంచంలోని అన్ని దేశాలను సూచిస్తాయి (ప్రకటన 16:14; 17:12, 13, 16). "ఆకాశ నక్షత్రములలో భాగము" పరలోకములో లూసిఫరు తిరుగుబాటుకు మద్దతు ఇచ్చి అతనితో పాటు పరలోకములో నుండి పడద్రోయబడిన దేవదూతలై యున్నారు. (ప్రకటన 12:9; లూకా 10:18; యెషయా 14:12).

సమీక్ష మరియు సారాంశము

ఇప్పటివరకు, ప్రవచనము ఈ క్రింది బైబిల్ వాస్తవాలను వివరించింది :

  1. దేవుని నిజమైన సంఘము పవిత్రురాలైన స్త్రీగా సూచించబడినట్లుగా కనిపిస్తుంది.
  2. యేసు ప్రభువు సంఘములో జన్మించాడు.
  3. అన్యమత రోమా రాజైన హేరోదు ద్వారా పనిచేస్తున్న సాతానుడు యేసును చంపడానికి ప్రయత్నిస్తాడు.
  4. సాతానుడి ప్రణాళిక విజయవంతం కాలేదు.
  5. యేసు ఆరోహణము చిత్రీకరించబడింది.

6. యేసును నాశనం చేయాలనే ప్రణాళికలో సాతానుడు విఫలమైన తరువాత ఏమి చేశాడు?

"ఆ ఘటసర్పము ... ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను" (ప్రకటన 12:13).

జవాబు : అతడు ఇకపై యేసును వ్యక్తిగతంగా దాడి చేయలేకపోయాడు కాబట్టి, అతడు దేవుని సంఘము మరియు ఆయన ప్రజలపై తన ఆగ్రహమును మరియు హింసను లక్ష్యంగా చేసుకున్నాడు.

ఆరు గుర్తించే విషయములు:

ప్రకటన 12 మరియు 14 అధ్యాయాలలో, యేసు తన అంత్యకాల సంఘమును గుర్తించడంలో ఆరు వివరణాత్మక అంశాలను ఇస్తాడు. ఈ స్టడీ గైడ్ పత్రిక యొక్క మిగిలిన భాగాన్ని మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు వాటి కొరకు చూడండి.

7. In Revelation 12:6, 14, what did the woman (church) do to protect herself, and what is the “wilderness”?

7. ప్రకటన 12:6, 14 లో, స్త్రీ (సంఘము) తనను తాను రక్షించుకోవడానికి ఏమి చేసింది, మరియు "అరణ్యము" అంటే ఏమిటి?

జవాబు : పోపుల రోమా ద్వారా పనిచేస్తున్న సాతాను ఆగ్రహము నుండి "స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది" అని 6 మరియు 14వ వచనాలు చెప్పుచున్నవి, "రెండు రెక్కలు" "అరణ్యంలో” సంఘానికి దేవుడు ఇచ్చిన రక్షణ మరియు మద్దతును సూచిస్తాయి. (నిర్గమకాండము 19:4; ద్వితీయోపదేశకాండము 32:11). అరణ్యంలో గడిపిన సమయం 1,260 సంవత్సరాల పోపుల ప్రాముఖ్యత మరియు హింసా కాలం (క్రీ.శ. 538 నుండి 1798 వరకు) ఒక్కటే, ఇది పదేపదే బైబిల్ ప్రవచనంలో ప్రస్తావించబడింది. గుర్తుంచుకోండి, ఒక ప్రవచనాత్మక దినం అక్షరాల ఒక సంవత్సరానికి సమానం (యెహెజ్కేలు 4:6). "అరణ్యము” అనే పదం భూమి యొక్క ఏకాంత ప్రదేశాలను (పర్వతాలు, గుహలు, అడవులు మొదలైనవి) సూచిస్తుంది, ఇక్కడ దేవుని ప్రజలు దాగుకొని మొత్తం వినాశనం నుండి తప్పించుకోవచ్చు (హెబ్రీయులకు 11:37, 38). అరణ్యముల్లో దాగుకొనిన వారిలో వాల్డెన్సెస్, అల్బిజెన్సెస్, హ్యూగెనోట్స్ మరియు తదితరులున్నారు. పేపసి చేత ఈ వినాశకరమైన హింస సమయంలో వారు పారిపోయి అరణ్యంలో దాగుకొనకపోతే దేవుని ప్రజలు (ఆయన సంఘము) నిర్మూలించబడతారు. (ఒక 40 సంవత్సరాల కాలంలో,, "జెజువెట్ల ఆజ్ఞాధికారము ప్రారంభమైన 1540 సంవత్సరము నుండి 1580 వరకు, తొమ్మిది లక్షల మంది ప్రజలు నాశనము చేయబడిరి. 30 సంవత్సరముల మతభంగ విచారణలో లక్షా యాభైవేల మంది మరణించారు." కనీసం 5 కోట్ల మంది పైగా ప్రజలు ఈ 1,260 సంవత్సరాల కాలంలో తమ విశ్వాసము విషయమై మరణించారు. క్రీ.శ. 538 నుండి 1798 వరకు, ఇది సజీవంగా ఉంది, కానీ ఒక సంస్థగా గుర్తించబడలేదు. 1,260 సంవత్సరాల అజ్ఞాతవాసము తరువాత సంఘము బయటకు వచ్చినపుడు, ఇది క్రీ.శ. 538లో "అరణ్యలోనికి" ప్రవేశించిన అపొస్తలుల సంఘము వలె అదే సిద్ధాంతం మరియు లక్షణాలను కలిగి ఉంది.

యేసు అంత్యకాల సంఘమునకు మొదటి రెండు గుర్తులను మనము ఇప్పుడు కనుగొన్నాము :

  1. ఇది అధికారికంగా క్రీ.శ. 538 నుండి 1798 మధ్య ఒక సంస్థగా ఉనికిలో ఉండదు.
  2. ఇది 1798 తరువాత ఉద్భవిస్తుంది మరియు దాని అంత్యకాల పనిని కొనసాగిస్తుంది.

1798కి ముందు అధికారికంగా ఉనికిలో ఉన్న సంఘాలలో చాలా ప్రేమగల, నిజమైన క్రైస్తవులు ఉన్నారు. కాని ఈ సంఘాలలో ఏదీ దేవుని అంత్యకాల సంఘము కాదు, యేసు ప్రభువు అంత్యకాల సంఘము క్రీ.శ. 1798 తరువాత ఉనికిలోనికి వచ్చింది కాబట్టి, యేసు తన ప్రజలందరినీ పిలుస్తున్నాడు. దీని అర్థం జనాదరణ పొందిన ప్రొటెస్టంట్ సంఘాలు చాలావరకు దేవుని అంత్యకాల సంఘాలు కావు ఎందుకనగా అవి 1798కి ముందు అధికారికంగా ఉన్నాయి.

A remnant of cloth is the last remaining portion of a bolt. It matches the first piece from the same bolt.

8. ప్రకటన 12:17 లో, దేవుడు తన అంత్యకాల సంఘమును శేషించిన సంఘంగా పిలుస్తాడు "శేషం" అనే పదానికి అర్థం ఏమిటి?

జవాబు : దీని అర్ధం చివరిగా మిగిలిన భాగం. యేసు సంఘమును సూచిస్తూ, అది అపొస్తలుల సంఘము మాదిరిగానే లేఖనమంతటి మీద ఆధారపడిన ఆయన అంత్య-దిన సంఘము అని అర్థం.

9. ప్రకటన 12:17 లో, యేసు తన అంత్యకాల శేషించిన సంఘము గురించి ఏ రెండు అదనపు అంశముల వివరణ ఇచ్చాడు?

Answer

జవాబు : ఇది నాల్గవ ఆజ్ఞలోని ఏడవ దిన విశ్రాంతిదినముతో సహా పది ఆజ్ఞలన్నింటిని గైకొనును (యోహాను 14:15; ప్రకటన 22:14). దీనికి "యేసును గూర్చిన సాక్ష్యము" కూడా ఉంటుంది, ఇది ప్రవచన ఆత్మ అని బైబిలు చెబుతుంది (ప్రకటన 19:10). (ప్రవచన వరము గురించి పూర్తి వివరణ కొరకు 24వ స్టడీ గైడ్ పత్రిక చూడండి.)

మనకు ఇప్పుడు యేసు యొక్క అంత్యకాల శేషించిన సంఘమును గుర్తించుటకు తదుపరి రెండు అంశాలు ఉన్నాయి :

  1. ఇది దేవుని ఆజ్ఞలను, నాల్గవ ఆజ్ఞలోని ఆయన ఏడవ దిన విశ్రాంతిదినము సహా గైకొనును.
  2. ఇది ప్రవచన వరమును కలిగి యుండును.

విశ్రాంతి దినమును ఆచరించకుండ ప్రవచన వరము కలిగి లేకుండ అనేక మంది నిజాయితీ గల క్రైస్తవులు సంఘములు చర్చిలలో కనిపిస్తున్నారని గుర్తుంచుకోండి, ఈ సంఘములు దేవుని అంత్యకాల సంఘముగా ఉండలేవు, అందులో యేసు అంత్యదిన క్రైస్తవులను పిలుస్తున్నాడు ఎందుకనగా ఇది దేవుని అంత్యకాల సంఘం అవుతుంది, దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తుంది మరియు ప్రవచన వరముగా కలిగి ఉంటుంది.

10. What final two points of identification for God’s remnant church does the book of Revelation provide?

10. దేవుని శేషించిన సంఘమును గుర్తించుటకు చివరి ఏ రెండు అంశములు ప్రకటన గ్రంథము అందించును?

జవాబు: ఆరులో చివరి రెండు అంశాలు :

  1. ఇది ప్రపంచవ్యాప్త సువార్తిక సంఘము అవుతుంది (ప్రకటన 14:6).
  2. ఇది ప్రకటన 14:6-14 లోని మూడు దూతల వర్తమానములను ప్రకటిస్తుంది, ఇవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడ్డాయి.

A. దేవుని తీర్పు జరుగుచున్నది. ఆయనను మాత్రమే ఆరాధించుడి! దేవుని అంత్యకాల సంఘము 1844లో తీర్పు ప్రారంభమైందని బోధించాలి (18 మరియు 19వ స్టడీ గైడ్ పత్రికలు చూడండి). ఇది "ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము (ఆరాధించమని)" ప్రజలను పిలుస్తుంది (ప్రకటన 14:7). సృష్టికర్తగా మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాము? దేవుడు నాలుగవ ఆజ్ఞలో సమాధానం రాశాడు, "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." "ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.” ( నిర్గమకాండము 20:8, 11). కాబట్టి, మొదటి దూత వర్తమానము తన సృష్టికి స్మారకంగా ఇచ్చిన ఏడవ దిన విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుట ద్వారా దేవుడిని సృష్టికర్తగా ఆరాధించమని ఆదేశిస్తుంది.

B. బబులోను యొక్క పడిపోయిన సంఘములను విడిచి బయటకు రండి.

C. మృగాన్ని ఆరాధించవద్దు లేదా అతని ముద్రను వేయించుకొనవద్దు, ఇది నిజమైన సబ్బాతు స్థానంలో ఆదివారమును పరిశుద్ధదినంగా పాటిస్తోంది. అన్ని నకిలీల పట్ల జాగ్రత్త వహించండి.

తన అంత్యకాల శేషించిన సంఘాన్ని గుర్తించడానికి యేసు మనకు ఇచ్చే ఆరు అంశాలను ఇప్పుడు సమీక్షిద్దాం :

  1. ఇది క్రీ.శ. 538 మరియు 1798 మధ్య అధికారిక సంస్థగా ఉండదు.
  2. ఇది 1798 తరువాత ఉనికిలో వచ్చి దాని పనిని కొనసాగించును.
  3. ఇది నాల్గవ ఆజ్ఞలోని ఏడవ దిన విశ్రాంతిదినముతో సహా పది ఆజ్ఞలను గైకొనును.
  4. ఇది ప్రవచన వరము కలిగి యుండును.
  5. ఇది ప్రపంచవ్యాప్త సువార్త (మిషనరీ) సంఘము అవుతుంది.
  6. ఇది ప్రకటన 14:6-14 లోని యేసు యొక్క త్రియాంశ (మూడు అంశముల) వర్తమానమును బోధించుచు ప్రకటించుచు నుండును.

11. ఇప్పుడు మనం యేసు తన అంత్యకాల శేషించిన సంఘాన్ని గుర్తించే ఆరు అంశాలను స్థాపించాము. యేసు మనకు ఏమి చేయమని చెప్తాడు, మరియు ఏ ఫలితాలను మనం పొందుతామని చెప్పుచున్నాడు?

జవాబు : "వెదకుడి మీకు దొరకును" (మత్తయి 7:7) యేసు ఈ ఆరు గుర్తుల వివరాలను మీకు ఇచ్చి, "నా సంఘమును వెతకండి" అని అంటాడు. పరలోకపు విషయాల కొరకు వెతుకుతున్న వారు వాటిని కనుగొంటారని ఆయన వాగ్దానం చేశాడు.

12. ఈ ఆరు నిర్దిష్ట గుర్తులకు ఎన్ని సంఘాలు సరిపోతాయి?

Answer

జవాబు : యేసు ప్రభువు ఎంతటి స్పష్టమైన విలక్షణమైన వివరాలను ఇచ్చెనంటే అవి ఒకే సంఘమునకు సరిపోతాయి. యేసు, "నా సంఘములో చాలా మంది మంచి వ్యక్తులు ఉంటారు" మరియు "కొంతమంది వేషధారులు కూడా ఉంటారు" వంటి అస్పష్టమైన సామాన్యతలను యేసు ఇవ్వలేదు. ఈ రెండు విషయములు ఎన్ని సంఘములకు సరిపోతాయి? అన్ని సంఘములకు. ఈ రెండు విషయములు మూలలోని కిరాణా దుకాణం మరియు పట్టణాల్లోని వినోద మందిరములకు కూడా సరిపోతాయి! అవి అన్నింటికీ సరిపోతాయి, అందువల్ల ఏమీ అర్ధం కాదు. బదులుగా, యేసు అటువంటి సంఘానికి, ఒకే సంఘానికి, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘానికి, సరిపోయే విధంగా, ప్రత్యేకమైన, అత్యంత వివరణాత్మక అంశాలను ఇచ్చాడు అంశాల వివరాలను రెండోసారి పరిశీలిద్దాం.

సెవెంత్ - డే నే అడ్వెంటెస్ట్ సంఘము :

  1. క్రీ.శ.538 మరియు 1798 మధ్య అధికారిక సంస్థగా ఉనికిలో లేదు.
  2. 1798 తరువాత ఉద్భవించింది. ఇది 1840ల ప్రారంభంలో ఏర్పడటం ప్రారంభించింది.
  3. దేవుని పరిశుద్ధ ఏడవ దిన విశ్రాంతిదినముతో సహా పది ఆజ్ఞలను గైకొనును.
  4. ప్రవచన వరము కలిగి యుందును.
  5. ప్రపంచవ్యాప్త సువార్తిక సంఘమైయుండి, నేడు దాదాపు అన్ని దేశాలలో పనిచేస్తోంది.
  6. ప్రకటన 14:6-14 లోని యేసు ప్రభువు యొక్క గొప్ప త్రియాంశ (మూడంశముల) వర్తమానమును బోధించుచు ప్రకటించును.

ఈ ఆరు గుర్తులను తీసుకొని నీకు నీవుగా పరిశీలించుకొనమని యేసు నిన్ను అడుగుతాడు. ఇది సులభం. నీవు తప్పిపోలేవు.

గమనిక : దయచేసి పై ఆరు విషయాలు సరిపోని సంఘాలలో చాలా మంది ప్రేమగల క్రైస్తవులు ఉన్నారని గుర్తుంచుకోండి, కాని అలాంటి సంఘం ఏదీ నేడు ఆయన తన ప్రజలందరినీ పిలుస్తున్న దేవుని అంత్య-కాల శేషించిన సంఘంగా ఉండలేదు.

13. యేసు బిడ్డలలో ఒకురు తన ప్రేమపూర్వక హెచ్చరిక పిలుపును గమనించి, బబులోను నుండి బయటికి వచ్చిన తరువాత (ప్రకటన 18:2, 4), యేసు అతనిని లేదా ఆమెను తరువాత ఏమి చేయమని అడుగుతాడు?

"మీరొక్క శరీరముగా పిలువబడితిరి” (కొలొస్సయులకు 3:15). "సంఘము అను శరీరమునకు ఆయనే (యేసే) శిరస్సు" (కొలొస్సయులకు 1:18).

జవాబు : దేవుని ప్రజలు ఒక శరీరములోనికి, సంఘములోనికి పిలువబడితిరని బైబిలు చెప్పుచున్నది. బబులోనును విడిచి బయటకు వచ్చు వారిని శేషించిన సంఘములో చేరమని యేసు అడుగుతాడు, దానికి ఆయనే శిరస్సు (అధిపతి). యేసు, "ఈ దొడ్డివి కాని వేరే గొజ్జెలను నాకు కలవు" అని అనెను (యోహాను 10:16). పాత నిబంధన (యెషయా 58:1) మరియు క్రొత్త నిబంధన (ప్రకటన 18:4) రెండింటిలోనూ ఆయన వారిని “నా ప్రజలు” అని పిలుస్తాడు. తన దొడ్డివి కాని ఆయన గొట్టెలను గూర్చి ఆయన, "వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొట్టెల కాపరి ఒక్కడును అగును." "నా గొజ్జెలు నా స్వరము వినును... అవి నన్ను వెంబడించును." (యోహాను 10:16, 27).

14. How does one enter that body, or church?

14. ఒకరు ఆ శరీరములోనికి, లేదా సంఘములోనికి ఎలా ప్రవేశిస్తారు?

"ఏలాగనగా, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, ... మనమందరము ఒక్క శరీరములోనికి .... బాప్తిస్మము పొందితిమి (1 కొరింథీయులకు 12:13).

జవాబు : మనము బాప్తిస్మము ద్వారా యేసు ప్రభువు యొక్క అంత్యకాల శేషించిన సంఘములోనికి ప్రవేశిస్తాము, (బాప్తిస్మం పై మరిన్ని వివరాలకై 19వ స్టడీ గైడ్ పత్రిక చూడండి.)

15. Does the Bible provide other evidence that Jesus has only one remnant church into which He is calling all of His people?

15. యేసు తన ప్రజలందరినీ పిలుస్తున్న ఒక్క శేషించిన సంఘము మాత్రమే ఉందని బైబిల్ ఇతర ఆధారాలను ఇస్తుందా?

జవాబు: అవును అందిస్తుంది. దీనిని సమీక్షిద్దాం :

A. ఒకే నిజమైన శరీరం లేదా సంఘమున్నదని బైబిలు చెప్పుచున్నది (ఎఫెసీయులకు 4:4; కొలొస్సయులకు 1:18).

B. నేటి మన దినములు నోవహు దినం వలె ఉన్నవని బైబిలు చెప్పుచున్నది (లూకా 17:26, 27). నోవహు దినములలో ఎన్ని తప్పించుకునే మార్గాలు ఉన్నాయి? ఒకే ఒక్కటి అదే ఓడ. మరోసారి, నేడు, దేవుడు భూమి యొక్క చివరి సంఘటనల ద్వారా తన ప్రజలను సురక్షితంగా తీసుకెళ్లే ఒక ఓద, సంఘమును అందించాడు. ఈ ఓడను కోల్పోకండి!

16. దేవుని శేషించిన సంఘానికి సంబంధించిన శుభవార్త ఏమిటి?

జవాబు :

A. దీని ప్రధాన ఇతివృత్తం “నిత్య సువార్త" అంటే యేసుపై విశ్వాసం ద్వారా నీతి (ప్రకటన 14:6).

B. అది బండ అనబడిన యేసుపై నిర్మించబడింది (1 కొరింథీయులకు 3:11: 10:4), మరియు "పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువ నేరవు" (మత్తయి 16:18).

C. యేసు తన సంఘము కొరకు మరణించాడు (ఎఫెసీయులకు 5:25).

D. యేసు తన శేషించిన సంఘాన్ని చాలా స్పష్టంగా వివరించారు, దానిని గుర్తించడం సులభం. ఆయన పడిపోయిన సంఘాలను కూడా వివరించాడు మరియు తన ప్రజలను వాటిలో నుండి బయటకు పిలుస్తాడు. తన ప్రేమపూర్వక పిలుపుకు కళ్ళు మరియు హృదయాలను మూసివేసే వారిని మాత్రమే సాతాను వలలో వేస్తాడు.

E. దాని సిద్ధాంతాలు అన్నీ నిజం (1 తిమోతి 3:15).

17. దేవుని శేషించిన ప్రజలకు సంబంధించిన శుభవార్త ఏమిటి?

జవాబు : వారు :

A.ఆయన పరలోక రాజ్యములో రక్షింపబడి యుందురు (ప్రకటన 15:2).

B. యేసు ప్రభువు యొక్క "శక్తి" మరియు "రక్తము" ద్వారా అపవాదిని జయించెదరు (ప్రకటన 12:10, 11).

C. ఓర్పు (పట్టువిడువని విశ్వాసము) కలిగి యుందురు. (ప్రకటన 14:12).

D. యేసు ప్రభువు యొక్కయు ఆయనను గూర్చిన విశ్వాసము కలిగి యుందురు (ప్రకటన 14:12).

E. అద్భుతమైన స్వతంత్రమును కనుగొనెదరు. (యోహాను 8:31, 32).

18. Earth’s hour is very late. Jesus’ second coming immediately follows the giving of the three angels’ messages (Revelation 14:6–14). What is Jesus’ urgent plea now to His people?

18. Eభూమి యొక్క అంతము ఎంతో దూరంలో లేదు. యేసు ప్రభువు రెండవ రాకడ మూడు దూతల వర్తమానములు లోకమందంతట ప్రకటింపబడిన వెంటనే వస్తుంది (ప్రకటన 14:6 - 14). యేసు తన ప్రజలకు ఇప్పుడు చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి ఏమిటి?

"నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి” (ఆదికాండమ 7:1).

జవాబు : నోవహు దినములలో, నోవహుతో సహా ఎనిమిది మంది మాత్రమే దేవుని ఆహ్వానాని పట్టించుకున్నారు. యేసు ప్రభువు నీ కొరకు తన అంత్యకాల ఓడ ద్వారము వద్ద, శేషించిన సంఘము యొక్క తలుపు వద్ద వేచి ఉన్నాడు.

గమనిక : ప్రకటన 14:6-14 లోని మూడు దూతల వర్తమానములపై ఈ ఉత్కంఠభరితమైన వరుస స్టడీ గైడ్ పత్రికల్లో ఇది మా ఎనిమిదవ స్టడీ గైడ్ పత్రిక. ఈ వరుస స్టడీ గైడ్ పత్రికల్లో చివరి స్టడీ గైడ్ పత్రిక ప్రవచన వరమును చర్చిస్తుంది.

19. తన అంత్యకాల శేషించిన సంఘం యొక్క భద్రతలోనికి రావాలన్న యేసు పిలుపుకు చెవి యొగ్గుటకు నీవు సిద్ధంగా ఉన్నావా?

నీ జవాబు :

 


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1.ప్రపంచ జనాభాలో నాల్గవ వంతు ఉన్న చైనాలో, సువార్త అంతంత మాత్రమే అందియున్నది. అక్కడి ప్రతి ఒక్కరినీ చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదా?

జవాబు : "ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే" (మార్కు 10:27). "ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకము నందు దానిని నెరవేర్చును" అని బైబిలు చెప్పుచున్నది (రోమీయులకు 9:28). మొత్తం పట్టణాన్ని 40 రోజులలోపు పశ్చాత్తాపమునకు నడిపించుటకు యోనాను బలపరచిన ఆ ప్రభువే (యోనా 3వ అధ్యాయము) ఈ అంత్య దినములలో ఈ తన పనిని చాలా త్వరగా పూర్తి చేస్తాడు. తన పని చాలా ఉత్కంఠభరితమైన వేగంతో కదులుతుందంటే, అది దేవుని సంఘకి ముంచెత్తే ప్రవాహములా వచ్చి చేరే ప్రజలను తగినంతగా నిర్వహించడం దాదాపు అసాధ్యమని ఆయన చెప్పాడు (ఆమోసు 9:13). దేవుడు వాగ్దానం చేశాడు. ఇది జరుగుతుంది మరియు త్వరలో!

2. యేసు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులమని చెప్పుకునే చాలా మంది ప్రజలు తప్పుడు మార్గములో నడిపింపబడి నశించిపోతారనే తీవ్రమైన ప్రమాదం నిజంగా ఉందా?

జవాబు : అవును. యేసు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. క్రైస్తవులను వలలో వేసి నశించిపోయేలా చేసే అనేక విషయాల గురించి ఆయన హెచ్చరించారు : (1) అమితానుభవము, (2) మద్యం మత్తు, (3) ఐహిక విచారములు, మరియు (4) నిద్రమత్తు (లూకా 21:34, మార్కు 13:34-36).

  1. అమితానుభవము (తిండిబోతుతనం) తినడం, పని చేయడం, చదవడం, వినోదం మొదలైన వాటిలో అమితానుభవం లేదా మితిమీరి చేయడం అధికంగా ఉంటుంది. ఇది సమతుల్యతను దెబ్బతీస్తుంది మరియు స్పష్టమైన ఆలోచనను నాశనం చేస్తుంది. ఇది యేసుతో గడపడాన్ని కూడా నిరోధిస్తుంది.
  2. మద్యం మత్తు : తాగుడు అనేది మూర్ఖత్వాన్ని కలిగించే మరియు పరలోకపు విషయాల పట్ల మనకు అసహ్యాన్ని కలిగించే విషయాలను సూచిస్తుంది. అశ్లీలత, అక్రమ లైంగిక సంబంధములు, దుష్ట సాంగత్యము (చెడ్డ స్నేహితులు), బైబిలు అధ్యయనం మరియు ప్రార్ధనను నిర్లక్ష్యం చేయడం మరియు సంఘ సేవలను నివారించడం దీనికి ఉదాహరణలు. ఇలాంటివి ప్రజలు కలల ప్రపంచంలో జీవించడానికి కారణమవుతాయి మరియు తద్వారా తప్పిపోయేలా చేస్తాయి.
  3. ఐహిక విచారములు ఈ జీవితంపై యొక్క శ్రద్ధ యేసు, ప్రార్థన, వాక్య అధ్యయనం, సాక్ష్యమివ్వడం మరియు సంఘ సేవలకు హాజరుకావడం వంటి మంచి పనులను చేయడంలో బిజీగా ఉన్న క్రైస్తవులను నాశనం చేస్తుంది. అలా చేస్తే, మన కళ్ళను నిజమైన లక్ష్యం నుండి తీసివేసి, లోక విషయాలలో మునిగిపోతాము.
  4. నిద్రమత్తు ఆధ్యాత్మికముగా నిద్రమత్తును సూచిస్తుంది. ఇది నేడు అతిపెద్ద సమస్య కావచ్చు. ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు, అతడు నిద్రపోతున్నాడని అతనికి తెలియదు. యేసు ప్రభువుతో మన బంధమును ఆసరాగా తీసుకోవడం, పైకి భక్తిగల వారి వలె నటించుచు దాని శక్తి నాశ్రయించకుండ, మరియు యేసు పనిలో చురుకుగా పాల్గొనడానికి నిరాకరించడం - ఈ విషయాలన్నీ నిద్రలేచినవారిని ఆధ్యాత్మికముగా మేల్కొలిపితే తప్ప, సత్యాన్ని గ్రహించే సమయాన్ని దాటి నిద్రమత్తులో ఉంటారు.

3. నేను దేవుని శేషించిన సంఘములో చేరినది మొదలుకొని నా జీవితములో అంతగా సంతోషము లేదు. కాని నేను అపవాది చేత అంతగా వేధించబడుట లేదు. ఇలా ఎందుకు జరుగుచున్నది?

జవాబు : ఎందుకనగా అపవాది దేవుని శేషించిన ప్రజల మీద ఆగ్రహము గలవాడై వారిని బాధపెట్టడానికి మరియు నిరుత్సాహపరిచేందుకు తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు (ప్రకటన 12:17). తన ప్రజలు శోధనలు, శ్రమలు, అపవాది నుండి వేధింపులు, కఠినమైన సమయాలు మరియు సాతాను నుండి తీవ్రమైన గాయాలకు కూడా గురికారని యేసు వాగ్దానం చేయలేదు. వాస్తవముగా, అలాంటివి తన ప్రజలకు వస్తాయని ఆయన వాగ్దానం చేశాడు (2 తిమోతి 3:12). అయినప్పటికీ, ఆయన (1) తన ప్రజలకు విజయము నిచ్చెదనని (1 కొరింథీయులకు 15:57), (2) వారు ఎదుర్కొనే ప్రతిదానిలో వారితో ఉండెదనని (మత్తయి 28:20), (3) వారికి శాంతి ననుగ్రహించెదని (యోహాను 16:33; కీర్తన 119:165), మరియు (4) వారిని ఎప్పటికీ విడిచిపెట్టనని మహిమాన్వితంగా వాగ్దానం చేసాడు (హెబ్రీయులకు 13:5). చివరగా, యేసు తన ప్రజలను ఎవ్వరూ తన చేతుల్లో నుండి అపహరించలేనంత విధంగా గట్టిగా పట్టుకుంటానని వాగ్దానం చేశాడు (యోహాను 10:28, 29). ఆమేన్!

4. "సంఘం" అనే పదానికి అర్థం ఏమిటి?

జవాబు : “సంఘము” అనే పదాన్ని గ్రీకు పదం "ఎక్లేసియా” నుండి అనువదించారు, దీని అర్థం "పిలువబడినది." ఇది ఎంత యుక్తమైనది! యేసు ప్రజలను లోకములో నుండి మరియు బబులోను నుండి ఆయన విలువైన భద్రతలోకి పిలుస్తారు. యేసు పిలిచినప్పుడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ప్రజలు యేసు ప్రభువు అంత్యకాల శేషించిన సంఘములో భాగమవుతారు. యేసు, "నా గొట్టెలు నా స్వరము వినును ... అవి నన్ను వెంబడించును" అని చెప్పుచున్నాడు (యోహాను 10:27).

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) ప్రవచనంలో యేసు తన నిజమైన సంఘాన్ని ఎలా సూచిస్తాడు? (1)

( ) ఎత్తయిన గుడి గోపురము ద్వారా.

( ) మృగంగా.

( ) ప్రకాశవంతమైన దేవదూత శ్రీ ద్వారా.

( ) పవిత్రమైన స్త్రీగా.

( ) ఒక మర్మమైన మేఘం ద్వారా.

2) సంఘం పారిపోయిన “అరణ్యం” ఏమిటి? (1)

( ) గుహలు, అడవులు మొదలైన ఏకాంత ప్రదేశాలు.

( ) సహారా ఎడారి.

( ) ఇరాక్.

( ) గోబీ ఎడారి.

3) ఈ క్రింది అంశాలు మూడు దూతల వర్తమానాలలో భాగం: (3)

( ) బబులోను కూలిపోయెను. దానిని విడిచి బయటకు రండి!

( ) నరకం యుగయుగాలు కాలుతుంది.

( ) దేవుని తీర్పు జరుగుతుంది. ఆయన గుర్తు, లేదా ముద్రయైన ఆయన పరిశుద్ధ విశ్రాంతిదినమును ఆచరించుట ద్వారా సృష్టికర్తగా ఆయనను విధేయతతో కూడిన భయభక్తులతో స్తుతించి ఆరాధించండి.

( ) తెగుళ్ళు ముగిశాయి..

( ) ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.

( ) మృగాన్ని ఆరాధించవద్దు లేదా అతని ముద్రను వేయించుకొనవద్దు.

4) యేసు తన శేషించిన సంఘానికి మార్గనిర్దేశం చేయడానికి ఆరు గుర్తులను అందిస్తున్నాడు. ఈ సంఘము (6)

( ) చాలా మంచి క్రైస్తవులను కలిగి యుండును.

( ) విశ్రాంతిదినముతో సహా పది ఆజ్ఞలను పాటించును.

( ) కొంతమంది వేషధారులను కలిగి యుండును.

( ) గొప్ప క్రైస్తవ పాటలు పాడుతూ ఆనందించును.

( ) అమితముగా ప్రార్థించును.

( ) 538 మరియు 1798 మధ్య అధికారిక సంస్థగా లేదు.

( ) ప్రవచన వరము కలిగియుండును.

( ) అన్యభాషలతో మాట్లాడును.

( ) ప్రపంచవ్యాప్త అంతర జాతీయ సువార్తిక సంఘముగా ఉండును.

( ) చాలా చక్కని సంఘ భవనాలు కలిగి యుండును.

( ) 1798 తరువాత ఉనికిలోనికి వచ్చి దాని పనిని కొనసాగించును.

( ) ప్రకటన 14:6-14లోని మూడు దూతల వర్తమానములను ప్రకటించుచు బోధించును.

5) సంఘం అరణ్యంలో ఎంతకాలం ఉంది? (1)

( ) ఐదు సంవత్సరాలు.

( ) 1,000 సంవత్సరాలు.

( ) 680 సంవత్సరాలు.

( ) 1,260 సంవత్సరాలు.

( ) 33 సంవత్సరాలు.

6) దయచేసి ప్రతి గుర్తుకు ముందు ఉన్న రోమన్ సంఖ్యలను వాటి ప్రత్యక్ష అర్థానికి ముందున్న గడులలో పూరించండి (క్రింద ఉన్న ఉదాహరణ చూడండి).

గుర్తు ప్రత్యక్ష అర్థము
I. 12 నక్షత్రములు గల కిరీటము ___ చివరిగా మిగిలిన భాగం
II. స్త్రీ పాదముల క్రింద చంద్రుడు ___ యేసు
III. ఎఱ్ఱని మహా ఘటసర్పము ___ 12 మంది శిష్యులు
IV. శేషం ___ సంఘము
V. స్త్రీ ___ పాత నిబంధనలోని బలి అర్పణా వ్యవస్థ
VI. సూర్యుడు ___ అన్యమత రోమా ద్వారా పనిచేస్తున్న సాతానుడు
VII. స్త్రీకి జన్మించిన శిశువు ___ యేసు మరియు ఆయన నీతి

7) యేసు ప్రభువు తన ప్రజలను లోకమును మరియు బబులోనును విడిచి ఆయన శేషించిన సంఘములోనికి రండని పిలుస్తున్నాడా? (1)

( ) అవును.          ( ) కాదు.

8) శేషించిన సంఘములో ఒకరు ఎలా చేరతారు? (1)

( ) సంఘ కాపరితో కరచాలనము చేసుకొనుట ద్వారా.

( ) సంఘ సభ్యత్వ పత్రంపై సంతకం చేయడం ద్వారా.

( ) బాప్తిస్మము ద్వారా.

( ) పెద్ద విరాళం ఇవ్వడం ద్వారా.

9) అన్ని సంఘాలలో చాలా మంది, మరికొందరు ఏ సంఘ సభ్యులు కాకపోయినా మంచి క్రైస్తవులు ఉన్నారు. (1)

( ) అవును.    ( ) కాదు.

10) క్రింద వాటిలో ఏవి క్రైస్తవులు త్రోవ తప్పి నశించిపోయేలా చేస్తాయి? (4)

( ) అమితానుభవము (తిండిబోతుతనం).

( ) ఐహిక విచారములు.

( ) నీ మతము విషయమై చాలా ఉత్సాహంగా ఉండటం.

( ) ఆధ్యాత్మిక మద్యం మత్తు.

( ) ఆధ్యాత్మిక నిద్రమత్తు.

( ) నమ్మకమైన సాక్ష్యమివ్వడం.

( ) వార్తాపత్రిక చదవడం.

11) దేవుడు ప్రతి వ్యక్తికి సువార్తను త్వరగా తీసికొనిపోవుట ద్వారా భూమిపై తన పనిని క్లుప్తపరుస్తాడు. (1)

( ) అవును.    ( ) కాదు.

12) ఈ క్రింది వాటిలో వేటిని దేవుడు తన పిల్లలకు వాగ్దానం చేస్తాడు? (4).

( ) శాంతి (సమాధానము).

( ) వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

( ) విజయము.

( ) వారు ఎప్పటికీ అనారోగ్యానికి గురికారు.

( ) దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు ప్రభువు చేతుల్లో నుండి ఎవరూ వారిని విడదీయలేరు.

( ) ఆయన వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు.

( ) వారు ధనవంతులు అవుతారు.

13) “సంఘముఅనే పదానికి అక్షరాలా అర్థం ఏమిటి? (1)

( ) సరిగ్గా నియమించబడిన ప్రార్థనా స్థలం.

( ) విశ్వాసుల సమాజం.

( ) “పిలువబడినవారు”

( ) బిషప్ నిర్వహించే ఒక పెద్ద ప్రార్థనా స్థలం (కేథడ్రల్).

14) నేను దేవుని అంత్య-కాల శేషించిన సంఘములో భాగం కావాలనుకుంటున్నాను.

( ) అవును.    ( ) కాదు.