Lesson 15

ఎవరు... లేదా ఏమిటి ... ఈ క్రీస్తువిరోధి? దుష్ట కూటమి-లేదా చెడ్డ వ్యక్తా? అతని ప్రత్యక్షత భవిష్యత్తులో ఇంకను జరుగవలసి యున్నదని కొందరు అంటున్నారు. పురాతన రోమా దినములలో అతడు చాలా కాలము క్రితము అగుపడెనని మరికొందరు అంటున్నారు. కాని అతడు నేడు జీవించి యున్నాడని బైబిల్ సూచించుచున్నది! భూచరిత్ర యొక్క చివరి సంఘటనలలో ఈ క్రీస్తువిరోధి శక్తి కీలక పాత్ర పోషించునని బైబిల్ ప్రవచనములు బోధించుచున్నవి. అతడెవరో నీకు తెలియునా? నిజముగా తెలియునా? నీవు తెలిసికొనుట అవసరము, ఎందుకనగా నీవు ఈ దుష్ట శక్తిని అర్థము చేసుకునే వరకు అంత్యదిన సంఘటనలను అర్థము చేసుకొనలేవు. ఎంతో ఆశక్తికరమైన ఈ స్టడీ గైడ్ పత్రికను అధ్యయనము చేయుటకు సిద్ధముగా ఉండుము!

ఈ స్టడీ గైడ్ పత్రిక దానియేలు 7వ అధ్యాయముపై ఆధారపడినదై, క్రీస్తువిరోధి ఎవరో స్పష్టముగా మరియు నిర్దిష్టముగా గుర్తించును. కానీ అది ఒక పరిచయము మాత్రమే. తదుపరి స్టడీ గైడ్ పత్రికల్లోని పాఠములు ప్రపంచవ్యాప్తముగా ప్రభావము చూపే అతని కొన్ని కార్యకలాపాలను గూర్చిన వివరములను బయలుపరచును. ఈ రోజు నీవు కనుగొనబోవు విషయములు నీకు అసంతృప్తి కలిగించవచ్చును లేదా బాధపెట్టవచ్చును, కాని దానియేలు 7 లోని ప్రవచనము నిన్ను ప్రేమించుచున్న యేసు వద్ద నుండి వచ్చినదని గుర్తుంచుకొనుము. నీవు ఈ అత్యవసర విషయము గురించి లోతుగా పరిశోధన చేయుచుండగా దేవుని నడిపింపు కొరకు ప్రార్ధించుము.

1. As chapter 7 begins, Daniel sees four beasts coming up out of the sea. In prophecy, what does a beast represent? What does the sea represent?
1. దానియేలు 7వ అధ్యాయము ప్రారంభమగుచుండగా, నాలుగు జంతువులు సముద్రములో నుండి పైకి వచ్చుటను దానియేలుచూచును. ప్రవచనములో, జంతువు లేక మృగము దేనిని సూచించును? సముద్రము లేక జలములు దేనిని సూచించును?

"ఆ నాలుగవ జంతువు లోకములో ... నాలుగవ రాజ్యమును సూచించుచున్నది" (దానియేలు 7:23). "జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడు వారిని సూచించును" (ప్రకటన 17:15).

జవాబు : జంతువు లేక మృగము రాజ్యమును లేదా దేశమును సూచించును. జలములు లేక నీరు (లేక, సముద్రము) ప్రజలను లేదా పెద్ద జనాభాను సూచించును.

2. The four beasts of Daniel 7 represent four kingdoms (verses 17, 18). Babylon, the first kingdom (Daniel 2:38, 39), is represented as a lion in Daniel 7:4. (See also Jeremiah 4:7; 50:17, 43, 44.) W

2. దానియేలు 7 లోని నాలుగు జంతువులు నాలుగు రాజ్యములను సూచించును (17, 18 వచనములు). మొదటి రాజ్యము బబులోను (దానియేలు 2:38, 39), దానియేలు 7:4 లో సింహముగా సూచించబడినది. (యిర్మీయా 4:7; 50:17, 43, 44 కూడ చూడుము.) "పక్షిరాజు రెక్కలు" అనగా అర్ధమేమిటి? 2వ వచనములో "నలుదిక్కుల నుండి విసరిన గాలులు" దేనిని సూచించును?

"యెహోవా .... ఒక జనమును ... గద్ద యెగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించును". (ద్వితీయోపదేశకాండము 28:49, 50). "సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ..... భూదిగంతముల నుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది. ... యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క యీ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు" (యిర్మీయా 25:32, 33).

జవాబు : పక్షిరాజు రెక్కలు వేగమును సూచించును. (యిర్మీయా 4:13; హబక్కూకు 1:6-8 కూడ చూడుము.) గాలులు కలహము, కల్లోలము మరియు వినాశనమును సూచించును. (ప్రకటన 7:1-3 కూడ చూడుము.)

The bear with three ribs in its mouth symbolizes Medo-Persia.

3. ఎలుగుబంటి ఏ రాజ్యమును సూచించును (దానియేలు 7:5)? దాని నోటిలోని మూడు ప్రక్కటెముకలు దేనిని సూచించును?

జవాబు : దానియేలు 8 చదువుము. 8వ అధ్యాయములోని జంతువులు 7వ అధ్యాయములోని జంతువులకు సమాంతరముగా ఉన్నవని గమనించుము. దానియేలు 8:20 ప్రత్యేకముగా మాదీయ-పారసీకను మేకపోతుకు అనగా, 21వ వచనములోని గ్రీకుల రాజ్యమునకు ముందు రాజ్యమని పేర్కొన్నది. మాదీయ-పారసీ రెండవ రాజ్యమై, దానియేలు 7 లోని ఎలుగుబంటి అధికారమునకు సమాంతరముగా ఉన్నది. ఈ సామ్రాజ్యము రెండు సమూహాల ప్రజలతో ఏర్పడినది. మొదట పైకి వచ్చినది (దానియేలు 7:5 లో యొక పార్శ్వము మీద పండుకొనిన ఎలుగుబంటిగా సూచింపబడిన) మాదీయులు, కాని (దానియేలు 8:3 లో "ఎత్తుగా" ఉన్న పొట్టేలు యొక్క రెండవ కొమ్ముగా సూచింపబడిన) పారసీకులు చివరికి బలముగా మారారు. మూడు ప్రక్కటెముకలు మాదీయ-పారసీకులు జయించిన మూడు ప్రధాన అధికార శక్తులను సూచించును: అవి లూదియ, బబులోను, మరియు ఐగుప్తు దేశములు.

The leopard beast of Daniel 7 represents the world kingdom of Greece.

4. మూడవ రాజ్యమైన గ్రీకు, (దానియేలు 8:21), నాలుగు రెక్కలు మరియు నాలుగు తలలుండిన చిరుత పులి చేత సూచింపబడినది (దానియేలు 7:6). రెక్కలు దేనిని సూచించును? నాలుగు తలలు దేనిని సూచించును?

జవాబు : సింహానికి ఉన్నట్లుగా రెండు రెక్కలకు బదులు నాలుగు రెక్కలు అలెగ్జాండర్ ఆ యా ప్రాంతాలను జయించిన అద్భుతమైన వేగాన్ని సూచిస్తాయి (యిర్మీయా 4:11-13). నాలుగు తలలు, అతడు మరణించినప్పుడు విభజించబడిన మహా చక్రవర్తి అలెగ్జాండర్ సామ్రాజ్యం యొక్క నాలుగు రాజ్యాలను సూచిస్తాయి. ఈ ప్రాంతాలకు నాయకత్వం వహించిన నలుగురు ఉన్నతాధికారులెవరనగా కస్సాండర్, లైసిమేకస్, టోలెమి మరియు సెల్యూకస్.

The world empire of Rome is symbolized by the monster beast of Daniel chapter 7.

5. నాలుగవ రాజ్యమైన రోమా సామ్రాజ్యము, ఇనుప దంతములు మరియు పది కొమ్ములుండిన ఘోరమును మరియు భయంకరమైన జంతువు చేత సూచింపబడినది (దానియేలు 7:7). కొమ్ములు దేనిని సూచించును?

జవాబు : 10 కొమ్ములు అన్యమత రోమా సామ్రాజ్యం చివరికి విభజింపబడిన 10 రాజులను లేదా రాజ్యాలను సూచిస్తాయి (దానియేలు 7:24). (ఈ 10 రాజ్యాలు దానియేలు 2:41-44 లో వర్ణింపబడిన ప్రతిమ యొక్క 10 కాలివేళ్లకు సమాంతరంగా ఉన్నాయి.) వలసపోయి తిరుగుతున్న బార్బేరియన్ (అనాగరిక) తెగలు రోమా సామ్రాజ్యంపైకి చొచ్చుకుపోయి, వారి ప్రజల కోసం భూమి సముదాయాలను ఏర్పరచుకున్నారు. ఆ 10 తెగలలో ఏడు ఆధునిక పశ్చిమ ఐరోపా దేశాలలో అభివృద్ధి చెందగా, మూడు తెగలు వారు "పెరికివేయబడి" నాశనం చేయబడ్డారు. తరువాతి భాగం పెరికివేయబడిన రాజ్యాలను చర్చిస్తుంది.

అన్యమత రోమా విడిపోయిన 10 రాజ్యములు
విజిగేత్స్ స్పెయిన్
యాంగ్లో-సాక్సన్స్ ఇంగ్లాండ్
ఫ్రాంక్స్ ఫ్రాన్స్
ఆలెమానీ జర్మనీ
బర్గుండియన్స్ స్విట్జర్ ల్యాండ్
లోంబార్డ్స్ ఇటలీ
సువీ పోర్చుగల్
హెరూలీ పెరికి వేయబడినది
ఆస్ర్టోగోత్స్ పెరికి వేయబడినది
వ్యాండల్స్ పెరికి వేయబడినది

The little horn of Daniel 7:8 represents Antichrist.

6. దానియేలు 7 ప్రవచనములో, తరువాత ఏమి జరుగును?

"నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి; ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను" (దానియేలు 7:8).

జవాబు : "చిన్న కొమ్ము" అధికారము తరువాత కనిపిస్తుంది. బైబిలు గుర్తులు ఈ చిన్న కొమ్మును ప్రవచన మరియు చారిత్రక క్రీస్తువిరోధిగా గుర్తించినందున మనం దానిని జాగ్రత్తగా గుర్తించాలి. దీనిని గుర్తించుటలో తప్పు ఉండకూడదు.

7. క్రీస్తువిరోధిని గుర్తించే స్పష్టమైన గుర్తులను బైబిలు ఇచ్చుచున్నదా?

అవును. దేవుని వాక్యం మనకు దానియేలు 7 లో క్రీస్తువిరోధిని గూర్చిన తొమ్మిది గుర్తులను ఇస్తుంది, కాబట్టి అతనిని మనం ఖచ్చితముగా గుర్తించగలము. కొంతమందికి ఈ సత్యాలు బాధాకరంగా అనిపించినప్పటికీ, ఆయన బయలుపరచిన సంకల్పంగా వాటిని అంగీకరించేంత నిజాయితీగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ తొమ్మిది అంశాలను తెలుసుకుందాం.

జవాబు :

A. చిన్న కొమ్ము పశ్చిమ ఐరోపా రాజ్యాలైన 10 కొమ్ముల "మధ్యను లేచెను" (దానియేలు 7:8). కనుక ఇది పశ్చిమ ఐరోపాలో ఎక్కడో ఒక చిన్న రాజ్యం అవుతుంది.

B. దాని తరఫున మాట్లాడగలిగే వ్యక్తి దానికి అధిపతిగా ఉంటాడు (దానియేలు 7:8).

C. ఇది మూడు రాజ్యాలను పెకిలించును లేదా పెరికి వేయును (దానియేలు 7:8).

D. ఇది ఇతర 10 రాజ్యాలకు "భిన్నముగా" లేక వేరుగా ఉంటుంది (దానియేలు 7:24).

E. ఇది పరిశుద్ధులతో యుద్ధము చేయును మరియు వారిని "నలుగగొట్టును (హింసించును)" (దానియేలు 7:21, 25).

F. ఇది నాలుగవ రాజ్యమైన అన్యమత రోమా సామ్రాజ్యము నుండి ఉద్భవిస్తుంది లేదా వెడలివస్తుంది (దానియేలు 7:7, 8).

G. దేవుని ప్రజలు (పరిశుద్ధులు) "ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు" (దానియేలు 7:25)

H. ఇది దేవునికి “విరోధముగా మాటలాడును" లేదా దూషణకరమైన మాటలు మాటలాడును (దానియేలు 7:25). ప్రకటన 13:5 లో, అదే అధికారము "డంబపు మాటలను దేవదూషణలను" పలుకునని బైబిలు చెప్పుచున్నది.

I. ఇది దేవుని ప్రవచన "కాలములను న్యాయ పద్ధతులను నివారణ (మార్పు) చేయ బూనుకొనును" (దానియేలు 7:25).

మర్చిపోవద్దు - ఈ గుర్తులన్నియు నేరుగా బైబిలు నుండి వచ్చినవి. అవి మానవ అభిప్రాయం లేదా ఊహను బట్టి వచ్చినవి కావు. చరిత్రకారులు పైన వర్ణింపబడిన అధికారమేదో వెంటనే చెప్పగలరు. ఈ గుర్తులన్నియు ఒకే ఒక అధికారమునకు సరిపోవుచున్నవి - అదే రోమన్ పోప్ వ్యవస్థ (పేపసి) కాని, ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, మనం తొమ్మిది గుర్తులను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పరిశీలిద్దాము. సందేహమునకు మనము చోటివ్వకూడదు.

8. Does the papacy fit these points?

8. రోమన్ పోప్ వ్యవస్థ (పేపసీ) ఈ గుర్తులకు సరిపోతుందా?

Answer

జవాబు : అవును - ఇది ప్రతి గుర్తుకు సరిపోతుంది. నిశితంగా పరిశీలిద్దాం :

A.ఇది పశ్చిమ ఐరోపాలోని 10 రాజ్యాల "మధ్యలో నుండి లేచెను." పోప్ అధికార వ్యవస్థ యొక్క భౌగోళిక స్థానం పశ్చిమ ఐరోపా నడిమధ్యలో ఉన్న ఇటలీలోని రోమ్లో ఉన్నది.

B.దాని తరపున మాట్లాడే వ్యక్తి దానికి అధిపతిగా ఉండును.పోప్ వ్యవస్థకు ఈ గుర్తు బహుబాగుగా సరిపోతుంది. ఎందుకనగా ఈ వ్యవస్థ తరపున మాటలాడుటకై దానికొక వ్యక్తి (పోప్) అధిపతిగా ఉన్నాడు.

C.పోప్ వ్యవస్థ (పేపసీ)కి స్థలమిచ్చుటకై మూడు రాజ్యములు పెరికి వేయబడినవి.పశ్చిమ ఐరోపా చక్రవర్తులు ఎక్కువగా క్యాథలిక్ మరియు పేపసీకి మద్దతు ఇచ్చారు. అయితే, మూడు ఏరియన్ రాజ్యాలు-వ్యాండల్స్, హెరూలీ మరియు ఆస్ట్రోగోత్స్ మద్దతు ఇవ్వలేదు. కాబట్టి క్యాథలిక్ చక్రవర్తులు వారిని లొంగదీసుకోవాలని లేదా నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. వేదాంతవేత్త మరియు చరిత్రకారుడు డాక్టర్ మెర్విన్ మ్యాక్స్వెల్ తన పుస్తకం గాడ్ కేర్స్ వాల్యూమ్ 1, పేజి 129 లోని ఫలితాలను ఇలా వివరించాడు : "క్యాథలిక్ చక్రవర్తి జెనో (474-491) 487లో ఆస్ట్రోగోత్లతో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేశాడు, దీని ఫలితంగా 493లో ఏరియన్ హెరూల్స్ రాజ్యం నిర్మూలన జరిగింది. మరియు క్యాథలిక్ చక్రవర్తి జస్టినియన్ (527-565) 534లో ఏరియన్ వ్యాండల్స్ను నిర్మూలించాడు మరియు 538లో ఏరియన్ ఆస్ట్రోగోత్ల అధికార శక్తిని గణనీయంగా విచ్ఛిన్నం చేశాడు. ఇలా దానియేలులోని మూడు కొమ్ములు - హెరూల్స్, వ్యాండల్స్, మరియు ఆస్ట్రోగోత్స్" వేర్లతో సహా పెరికి వేయబడినవి. పోప్ వ్యవస్థ ఈ గుర్తుకు సరిపోతుందని గుర్తించడం కష్టం కాదు.

Woman in chainsD.ఇది ఇతర రాజ్యములకు "భిన్నముగా" లేక వేరుగా ఉండును.ఈ వర్ణనకు పోప్ వ్యవస్థ (పేపసీ) స్పష్టంగా సరిపోతుంది, అది ఒక మతాధికారముగా సన్నివేశంలో వచ్చి ఇతర 10 రాజ్యాల లౌకిక స్వభావానికి భిన్నంగా ఉంది.

E.ఇది మహోన్నతుని భక్తులతో యుద్ధము చేయుచు వారిని హింసించును.ఈ పోప్ వ్యవస్ధ సంఘము దేవుని ప్రజలను హింసించిందనేది అందరికీ తెలిసిన విషయమే, సాక్ష్యాత్తు ఈ వ్యవస్థే దీనిని ఒప్పుకొనుచున్నది. విశ్వాసము విషయమై ఈ సంఘము కనీసం 50 మిలియన్లు (5 కోట్ల) మంది ప్రజల జీవితాలను నాశనం చేసిందని చరిత్రకారులు భావిస్తున్నారు. మనము ఇక్కడ రెండు మూల గ్రంథముల నుండి వివరణలను చూద్దాము :

1. "రోమా సంఘము మానవజాతి మధ్య ఇప్పటివరకు ఉన్న ఏ ఇతర సంస్థలకన్నా ఎక్కువ అమాయక రక్తాన్ని చిందించింది, అయినా చరిత్ర గురించి సమర్థవంతమైన జ్ఞానం ఉన్న ఏ ప్రొటెస్టెంటు దీనిని ప్రశ్నించరు."1

2.స్పెయిన్ దేశపు మత భంగపు విషయాలకు సంబంధించిన ద హిస్టరీ ఆఫ్ ది ఇంక్విజిషన్ ఆఫ్ స్పెయిన్ చరిత్రలో డి. ఇవాన్ ఆంటోనియో లోరెంట్ స్పానిష్ విచారణ నుండి మాత్రమే ఈ గణాంకాలను అందిస్తున్నారు : “31,912 మంది వ్యక్తులు నిందింపబడి మంటల్లో మరణించారు,” మరియు 2,41,450 మందికి “కఠినమైన జరిమానాలు విధించబడ్డాయి”.

శ్రద్ధ మరియు సంరక్షణతో కూడిన మాటలు

చిన్న కొమ్ము అధికారాన్ని గుర్తించడం ద్వారా తోటి క్రైస్తవులపై మేము దాడి చేస్తున్నామని ఎవరైనా అనుకోకుండా, దయచేసి ఈ ప్రవచనము ఒక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని, వ్యక్తులను కాదని గుర్తుంచుకోండి. క్యాథలిక్ విశ్వాసంతో సహా అన్ని సంఘములలో, హృదయపూర్వక, భక్తులైన క్రైస్తవులు ఉన్నారు. అనేక ఇతర సంఘములు కూడా చేసినట్లుగా, అన్యమతవాదంతో రాజీపడిన ఒక పెద్ద మత సంస్థపై దానియేలు 17 కేవలము ఒక తీర్పు మరియు దిద్దుబాటు సందేశమునై యున్నది.

ప్రవచనము అన్ని విశ్వాసముల యొక్క లోపములను వెల్లడించును

ఇతర ప్రవచనాలు ప్రొటెస్టెంట్ మరియు యూదా మత విశ్వాసాల లోపాలను ఎత్తిచూపాయి. దేవునికి అన్ని మతాలలో నిజాయితీ పరులున్నారు. ఆయన నిజమైన ప్రజలు (వారి విశ్వాసమేదైనా ఎలా ఉన్నా) వారు ఎల్లప్పుడు ప్రభువు యొక్క దిద్దుబాటును వినయంగా అంగీకరిస్తారే గాని ఆత్మ రక్షణ విషయమై తమ చెవులను మరియు హృదయములను ఆయనకు వ్యతిరేకముగా మూసుకొనరు. ప్రతి విషయంపై దేవుని వాక్యం నిష్పక్షపాతమైన నిజాయితీతో మాట్లాడినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.

F.ఇది నాల్గవ ఇనుము రాజ్యమైన అన్యమత రోమా సామ్రాజ్యము నుండి వెడలివచ్చును లేదా ఉద్భవించును. ఈ విషయంపై మేము రెండు అధికార సమాచారాలను ఉటంకిస్తున్నాము :

1. “శక్తివంతమైన కథోలిక్ సంఘము బాప్తిస్మము పొందిన రోమా సామ్రాజ్యము కంటే కొంచెం ఎక్కువ. ... ప్రాచీన రోమా సామ్రాజ్యం యొక్క రాజధాని క్రైస్తవ సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. పోంటిఫెక్స్ మాక్సిమస్ కార్యాలయం పోప్ కార్యాలయంలో కొనసాగింది.”2

2. "బార్బేరియన్లు (అనాగరికులు) మరియు ఏరియన్లు వదిలివేసిన రోమన్ వనరులన్నియు ... చక్రవర్తి పాలన ముగిసిన తరువాత ముఖ్య వ్యక్తిగా అధికారములోనికి వచ్చిన బిషప్ సంరక్షణ క్రిందకి (వచ్చేశాయి). రోమా సంఘము ... రహస్యముగా తానే అసలైన అధికార స్థానముగా తన స్థానాన్ని ప్రపంచ రోమా సామ్రాజ్య స్థానంలోకి ప్రవేశించింది, అందులో అది వాస్తవముగా కొనసాగుతున్నది."3

G.దేవుని ప్రజలు (పరిశుద్ధులు) "ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు" (దానియేలు 7:25).అనేక విషయాలకు ఇక్కడ స్పష్టత అవసరం :

1. ఒక కాలము ఒక సంవత్సరము, కాలములు రెండు సంవత్సరములు, అర్ధకాలము అర్ధ సంవత్సరము. యాంప్లిఫైడ్ బైబిలు, దీనిని "మూడున్నర సంవత్సరములు" అని అనువదిస్తున్నది."4

2.ఇదే కాల వ్యవధిని దానియేలు మరియు ప్రకటన గ్రంథాలలో ఏడు సార్లు ప్రస్తావించారు (దానియేలు 7:25; 12:7; ప్రకటన 11:2, 3; 12:6, 14, 13:5): మూడు సార్లు "కాలము, కాలములు, అర్ధకాలమని, రెండు సార్లు 42 నెలలని, మరో రెండు సార్లు 1,260 దినములని చెప్పబడెను. యూదులు  ఉపయోగించే 30 రోజుల క్యాలెండర్ ఆధారంగా, ఈ కాల వ్యవధులు ఒకే సమయం: 3 1/2 సంవత్సరములు = 42 నెలలు = 1,260 దినములు.

ప్రవచనాత్మక కాలము :
కాలము             = 1 సంవత్సరము
కాలములు          = 2 సంవత్సరములు
½ కాలము          = ½ సంవత్సరము

Woman in chains3. ఒక ప్రవచనాత్మక దినము అక్షరాలా ఒక సంవత్సరముతో సమానము (యెహెజ్కేలు 4:6; సంఖ్యాకాండము 14:34).

4. ఈ విధంగా, చిన్న కొమ్ము (క్రీస్తువిరోధి) దేవుని పరిశుద్ధులపై అక్షరాలా 1,260 సంవత్సరములు అధికారము కలిగి ఉండాలి.

5. పోప్ వ్యవస్థ యొక్క పాలన క్రీ.శ. 538లో మూడు ఏరియన్ తిరుగుబాటు రాజ్యాలలో చివరి రాజ్యము పెరికి వేయబడినప్పుడు ప్రారంభమైంది. 1798 వరకు నెపోలియన్కు సైనికాధికారియైన బెరియర్, అప్పటి పోప్ పైయస్ VI ను మరియు పోప్ వ్యవస్థ (పేపసీ) యొక్క రాజకీయ శక్తి రెండింటినీ నాశనం చేయాలనే ఆశతో పోప్ ను బందీగా తీసుకునే వరకు దాని పాలన కొనసాగింది. ఆ కాలము 1,260 సంవత్సరాల ప్రవచనానికి ఖచ్చితమైన నెరవేర్పు. ఆ దెబ్బ పోప్ వ్యవస్థకు (పేపసీకి) ఒక చావు దెబ్బయైనను, ఆ దెబ్బ మానిపోవడం ప్రారంభమై నేటికిని మానిపోయే క్రమములో కొనసాగుతోంది.

6. ఇదే హింసాత్మక కాలము దేవుని ప్రజలు ఇక ఎన్నడూ అనుభవించలేనంత దారుణమైన హింసాకాండగా మత్తయి 24:21 లో పేర్కొనబడినది. ఇది చాలా వినాశకరమైనది, దేవుడు దానిని తక్కువ చేయకపోయిన యెడల ఏ ఒక్కడూ తప్పించుకొనకపోవును. కానీ, దేవుడు ఆ కాలమును తక్కువ చేసెను. ఆ హింసాకాండ 1798 లో పోప్ బందీగా ఉండటానికి చాలా కాలం ముందు ముగిసింది. ఈ గుర్తు కూడా పోప్ వ్యవస్థకు సరిగ్గా సరిపోవుచున్నదని చూడటం చాలా సులభం.

H.ఇది “మహోన్నతుడైన (దేవునికి) విరోధముగా" దేవదూషణతో కూడిన "గొప్ప గర్వపు మాటలు" పలుకును."దేవదూషణకు లేఖనములో రెండు నిర్వచనాలు ఉన్నాయి :

1. పాపాలను క్షమియించే అధికారమున్నదని చెప్పుకొనుట (లూకా 5:21).

2. దేవుడనని ప్రకటించుకొనుట లేదా చెప్పుకొనుట (యోహాను 10:33).

ఈ గుర్తు పోప్ వ్యవస్థకు సరిపోతుందా? అవును! ఈ వ్యవస్థ తనకు ఏ విధంగా పాపాలను క్షమియించే అధికారమున్నదని చెప్పుకొనుచున్నదో అన్న విషయానికి ఋజువులను చూద్దాము : పాదిరి నిజముగా పాపాలను క్షమించునా లేదా అవి క్షమింపబడినవని ప్రకటించునా? క్రీస్తు తనకిచ్చిన ప్రత్యేక శక్తి చేత పాదిరి నిజముగా పాపాలను క్షమించును."5 పోప్ వ్యవస్థ ఇంకా ఒక భూసంబంధమైన పాదిరికి ఒప్పుకోలు వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పేపసీ మన ప్రధాన యాజకుడును, (హెబ్రీయులకు 3:1, 8:1,2) మరియు ఉత్తరవాదియైన (1 తిమోతి 2:5) యేసు ప్రభువును మరింత బలహీనపరుస్తుంది, ఇప్పుడు ఆ వ్యవస్థ దేవుడు అని చెప్పుకునే సాక్ష్యాలను పరిశీలిద్దాము : "పోపులమైన ఈ భూమిపై సర్వశక్తిమంతుడైన దేవుని స్థానాన్ని కలిగి ఉన్నాము. "6 " ఇక్కడ మరింత ఋజువు ఉంది : "పోప్ యేసుక్రీస్తు ప్రతినిధి మాత్రమే కాదు, అతడు శరీరాకారములో ఉన్న యేసుక్రీస్తు. "7

I. ఇది దేవుని ప్రవచన "కాలములను న్యాయ పద్ధతులను (పది ఆజ్ఞలను) నివారణ (మార్పు) చేయ బూనుకొనును" రాబోయే స్టడీ గైడ్ పత్రికల్లో ఈ అంశములోని “కాలములు” అనే విషయము గురించి మరింత వివరముగా తెలుసుకుంటాము. ఇది ఒక ప్రధాన అంశం మరియు ప్రత్యేక పరిశీలన అవసరం. కాని, "న్యాయ పద్ధతులను" (ఆజ్ఞలను) నివారణ (మార్పు) చేయడం గురించి ఏమిటి? ఇది దేవుని ధర్మశాస్త్రములో మార్పులు చేర్పులు చేయుటను గూర్చి మాట్లాడుచున్నది. వాస్తవానికి, ఏ ఒక్కరూ దేవుని ధర్మశాస్త్రాన్ని మార్చలేరు, కాని, పోప్ వ్యవస్థ దేవుని ఆజ్ఞలను నివారణ (మార్పు) చేయడానికి ప్రయత్నించిందా? దీనికి జవాబు, "అవును" అని చెప్పాలి. పోప్ వ్యవస్థ యొక్క క్యాటెకిజమ్ (మత ప్రశ్నోత్తర గ్రంథాలలో), ఆ వ్యవస్థ తనకు విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉన్న దేవుని పది ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞను తొలగించి, ఇంగ్లీషు బైబిల్లో నాల్గవ ఆజ్ఞను 94 పదాల నుండి ఎనిమిదికి కుదించింది మరియు పదవ ఆజ్ఞను రెండు ఆజ్ఞలుగా విభజించింది. (దీనిని మీకు మీరే పరిశోధించి తెలుసుకొనండి. నిర్గమకాండము 20:3-17 లో ఉన్న దేవుని పది ఆజ్ఞల జాబితాను ఏదైనా కథోలిక్ క్యాటెకిజమ్ (మత ప్రశ్నోత్తర గ్రంథము)తో పోల్చి చూడండి.)

దానియేలు 7 లోని చిన్న కొమ్ము (క్రీస్తువిరోధి) మరెవరో కాదు పోప్ వ్యవస్థేనని అనుటలో ఎటువంటి సందేహము లేదు. పోప్ వ్యవస్థ తప్ప మరే ఇతర వ్యవస్థ లేక సంస్థ ఈ తొమ్మిది గుర్తులకు ఇంత బాగా సరిపోదు. ఇదేదో అనుకోని క్రొత్త బోధ కాదు సుమా! ప్రతి ప్రొటెస్టంట్ సంఘ సంస్కర్త, మినహాయింపు లేకుండా క్రీస్తువిరోధి పేపసీ అని పోప్ వ్యవస్థ గురించి మాట్లాడారు.”8

The angel told Daniel that the prophecies of this book would be sealed until 1798, the time of the end.
9. తన గ్రంథమును "అంత్యకాలము వరకు" ముద్రింపుమని దానియేలుకు చెప్పబడలేదా (దానియేలు 12:4)? మన అవగాహనకు దానియేలు గ్రంథ ప్రవదనములు ఎప్పుడు తెరవబడును?

జవాబు : దానియేలు 12:4 లో "అంత్యకాలము" వరకు గ్రంథాన్ని ముద్ర వేయమని ప్రవక్తకు చెప్పబడింది. 6వ వచనములో "ఈ ఆశ్చర్య సంగతులు ఎప్పుడు నెరవేర్చబడును?" అని ఒక దూత స్వరము ఇలా అడిగెను. 7వ వచనము, "ఒక కాలము, కాలములు, అర్ధకాలము" అని చెప్పుచున్నది. పోప్ వ్యవస్థ (పేపసి) యొక్క నియంతృత పాలన యొక్క 1,260 సంవత్సరాల కాలం ముగిసిన తరువాత అనగా, ఈ స్టడీ గైడ్లో మనం ముందు నేర్చుకున్నట్లు 1798లో అంత్యకాల ప్రవచనాలను చర్చించే గ్రంథం యొక్క విభాగం తెరవబడుతుందని దేవదూత దానియేలుకు హామీ ఇచ్చాడు. దీనిని బట్టి అంత్యకాలము 1798లో ప్రారంభమైంది. మనం చూసినట్లుగా, దానియేలు గ్రంథములో నేడు మన కొరకు పరలోకము నుండి కీలకమైన సందేశాలు ఉన్నాయి. దీనిని మనం అర్ధం చేసుకోవాలి.

All religious teachings must be compared with Scripture to determine their accuracy.

10. క్రీస్తువిరోధి గురించి నేడు చాలా మంది క్రైస్తవులకు తప్పుడు సమాచారము ఇయ్యబడినది. క్రీస్తువిరోధి గురించి అవాస్తవాన్ని నమ్మడం ఒక వ్యక్తి మోసగించబడడానికి కారణమవుతుంది. క్రొత్త బైబిలు బోధలు ఎదురైనప్పుడు ఒక వ్యక్తి ఏమి చేయవలెను?

"వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి" (అపొస్తలుల కార్యములు 17:11).

జవాబు : క్రొత్త బైబిల్ బోధ ఎదురైనప్పుడు, దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందో లేదో చూడటానికి దానిని లేఖనముతో జాగ్రత్తగా పోల్చడం మాత్రమే సురక్షితమైన విధానం.

11. Are you willing to follow where Jesus leads, even though it might be painful?11. ఆయాసకరమైనది అయినప్పటికీ, యేసు నడిపించే మార్గమును అనుసరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?

నీ జవాబు :

ముగింపు వ్యాఖ్యలు

A. భూమి యొక్క అంత్యకాల సంఘటనలను బయలుపరచును.

B. యేసు ప్రభువుకు మరియు సాతానుకు మధ్య జరిగే అంతిమ పోరాటపు తుది దశలో పాల్గొనే వారిని గుర్తించును.

C. మనందరిని ఉచ్చులో పడవేసి, నశింపజేయవలెనన్న సాతానుని దుష్ట ప్రణాళికలను స్పష్టముగా బయలుపరచును.

D. దేవుని పరిశుద్ధులు న్యాయముగా నిరూపించబడుదురన్న తీర్పును గూర్చిన భద్రత మరియు ప్రేమను మనకు అందించును.

E. యేసు ప్రభువును తన రక్షణను, ప్రేమను, శక్తిని, కృపను మరియు నీతి న్యాయములను పైకెత్తును.

ప్రధాన పాత్రధారులు పదేపదే కనిపించెదరు

యేసు మరియు సాతానుల మధ్య జరిగే అంతిమ పోరాటములోని ప్రధాన పాత్రధారులు ఈ ప్రవచనాలలో పదేపదే కనిపిస్తారు. వీరిలో : యేసు, సాతానుడు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, పోప్ వ్యవస్థ (పేపసి), ప్రొటెస్టెంట్ సంఘ వాదకులు, మరియు దయ్యాల బోధను, ఆత్మల ఉనికిని విశ్వసించేవారు మరియు తదితరులున్నారు. ప్రేమ మరియు రక్షణ గురించి తన హెచ్చరికలు స్పష్టత మరియు నిశ్చయతతో వస్తాయని నిర్ధారించడానికి యేసు ప్రవక్తల నుండి తన సందేశాలను పునరావృతం చేస్తాడు మరియు విస్తరిస్తాడు.

మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. క్రీస్తువిరోధి సంస్థ కాదు వ్యక్తి అని నేనెప్పుడు అనుకున్నాను. నా ఆలోచన తప్పా?

జవాబు : ఈ స్టడీ గైడ్ క్రీస్తువిరోధి ఒక సంస్థ అని ఆధారాలను సమర్పించింది. దానియేలు 7:8 లోని "మానవుల కన్నుల వంటి కన్నులు" అనే మాటలు నాయకుడిని సూచిస్తాయి. ప్రకటన 13:18 ఒక సంఖ్యగల మనుష్యుని గూర్చి మాట్లాడుచున్నది. దానియేలు 8 లో, గ్రీకు సామ్రాజ్యము బొచ్చుగల ఒక మేకపోతుతోను మరియు దాని నాయకుడు, అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఒక కొమ్ముతోను సూచింపబడెను. ఇదే క్రీస్తువిరోధి విషయంలో కూడా ఇదే పరిస్థితి. సంస్థ పేపసీ. పదవిలో ఉన్న పోప్ దాని ప్రతినిధి. దానియేలు 7 పోపులు దుష్టులనియు మరియు కథోలిక్ సంఘ సభ్యులు క్రైస్తవులు కాదని చెప్పడం లేదు. కథోలిక్ సంఘ సభ్యుల్లో కూడా ఎందరో నిజాయితీ, ప్రేమ గల క్రైస్తవులున్నారు. ఏదేమైనా, ఈ వ్యవస్థ క్రీస్తువిరోధిగా పిలువబడుచున్నది, ఎందుకనగా, ఇది యేసు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది మరియు ఆయన ధర్మశాస్త్రమును మార్చడానికి పూనుకుంది.

2. క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని అమలు చేయడానికి చట్టాలను ఆమోదించడం తెలివైన పని అని మీరు అనుకుంటున్నారా?

జవాబు : లేదు. దేవునిని తృణీకరించి నాస్తికులుగా ఉండుటకు తీర్మానించుకున్నప్పటికి, మనస్సాక్షి విషయాలలో వారు వెళ్లాలనుకునే దిశను ఎన్నుకునే స్వేచ్ఛ అందరికీ ఉండాలని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది (యెహోషువా 24:15). సృష్టికర్త ఆదాము హవ్వలను అది ఆయనను బాధపెట్టినప్పటికీ ఎంచుకోవడానికి అనుమతించాడు. బలవంతపు ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం కాదు. బలవంతపు ఆరాధన అపవాది యొక్క మార్గము, దేవుని మార్గము ప్రేమతో ప్రేరేపింపబడినది. సంఘము తన నమ్మకాలను అమలు చేయడానికి చట్టాలను ఆమోదించిన ప్రతిసారీ, హింస మరియు అనేకమంది ప్రాణనష్టానికి ఫలితంగా మారినట్లు చరిత్ర చెప్పుచున్నది. మధ్య యుగాలలో చిన్న కొమ్ము చరిత్ర నుండి మనం నేర్చుకోగల ఒక పాఠం ఇది.

3. బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, కాని క్రీస్తువిరోధి దేవుణ్ణి బహిరంగముగా వ్యతిరేకించే దుష్టుడని నా భావన ఎప్పుడూ ఉంది. ఈ భావన తప్పు కాదా?

జవాబు : మనము సాధారణంగా “విరోధి” అనగా “వ్యతిరేకి”యని పరిగణిస్తాము. ఇది "ఆ స్థానంలో" లేదా "ఆ స్థానానికి బదులుగా" అని కూడా అర్ధాన్నిస్తుంది. క్రీస్తువిరోధి దేవుని హక్కులను తనకు వహించుకున్నందుకు దోషి. క్రీస్తువిరోధి వ్యవస్థ చెప్పుకునేదేమనగా :

  1. దాని పాదిరిలు దేవుడు మాత్రమే చేయగల పాపములను క్షమించగలరు (లూకా 5:21).
  2. విగ్రహారాధనను సూచించే రెండవ ఆజ్ఞను వదిలివేసి, పదియవ ఆజ్ఞను రెండు భాగాలుగా విభజించడం ద్వారా దేవుని ధర్మశాస్త్రమును మార్చడం. దేవుని ధర్మశాస్త్రము మార్చబడదు (మత్తయి 5:18).
  3. పోప్ భూమిపై దేవుడు అని చెప్పుకొనును.

సాతానుని అసలు ప్రణాళిక

సాతానుడి అసలు ప్రణాళిక దేవుని స్థానం మరియు అధికారాన్ని పొందడం. అతని లక్ష్యం దేవుణ్ణి బహిష్కరించడం మరియు ఆయన స్థానంలో పాలించడం. (స్టడీ గైడ్ 2వ పత్రికను చూడండి.) సాతానుడు పరలోకము నుండి బహిష్కరించబడినప్పుడు, అతని లక్ష్యం మారలేదు, కానీ తీవ్రమైంది. శతాబ్దాలుగా అతడు వివిధ మానవ సంస్థలను ఉపయోగించి, దేవుణ్ణి కించపరచడానికి మరియు ఆయన స్థానాన్ని అక్రమంగా చేపట్టడానికి ప్రయత్నించాడు.

క్రీస్తువిరోధి ఆధ్యాత్మికముగా ఉన్నట్లు కనబడును

ఆధ్యాత్మికముగా మరియు పరిశుద్ధునిగా అగుపడే క్రీస్తువిరోధిని వెంబడించులాగున ప్రజలను మోసము చేసి ఈ అంత్యదినములలో దేవుని స్థానమును భర్తీ చేయాలని సాతాను లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానియేలు మరియు ప్రకటన గంథముల యొక్క ప్రవచనాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం సాతాను యొక్క ఉచ్చులు మరియు వ్యూహాలను బహిర్గతం చేయడం మరియు భద్రతకై ప్రజలను క్షేమమునకై యేసుప్రభువులో మరియు ఆయన వాక్యములో స్థిరముగా ఉండులాగున వారిని నడిపించడం.

క్రీస్తువిరోధి అనేకులను మోసగించును

చాలా మంది ప్రజలు క్రీస్తును వెంబడిస్తున్నామని అనుకుంటూ క్రీస్తువిరోధిని వెంబడిస్తారు (ప్రకటన 13:3). ఏర్పరచబడినవారు మాత్రమే సురక్షితముగా ఉంటారు (మత్తయి 24:23, 24). వారు ప్రతి ఆధ్యాత్మిక బోధను మరియు బోధకుడిని లేఖనము ద్వారా పరీక్షిస్తారు కాబట్టి వారు సురక్షితంగా ఉంటారు (యెషయా 8:20). నేడు మత వంచన ప్రతిచోటా ఉంది. మరీ అజాగ్రత్తగా ఉండటం మనకంత మంచిది కాదు.

4. చాలామంది క్రీస్తువిరోధులు ఉన్నారని బైబిలు 1 యోహాను 2:18-22 లో చెప్పలేదా?

జవాబు : అవును. చరిత్రలో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన క్రీస్తువిరోధులు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా, ప్రవచింపబడిన క్రీస్తువిరోధి గుర్తులు మరియు లక్షణాలన్నిటిని ప్రత్యేకంగా నెరవేర్చగల ఒకే ఒక సంస్థ ఉంది. దానియేలు 7 మరియు 8 అధ్యాయాలలో మరియు ప్రకటన 13వ అధ్యాయములో, క్రీస్తువిరోధిని గుర్తించుటకు కనీసం 10 లక్షణాలను మనము కనుగొనగలము. ఈ 10 గుర్తులన్నీ కేవలము ఒకే ఒక వ్యవస్థలోనే నెరవేర్చబడగలవు, అదే పోప్ వ్యవస్థ (పేపసి).

5. ప్రవచనములో, "జంతువు" అనే చిహ్నానికి "జంతువు" లక్షణాలు ఉన్నాయని అర్థమా?

జవాబు : కానే కాదు. రాజునో, దేశమునో, ప్రభుత్వమునో, లేదా ఒక రాజ్యమునో సూచించడానికి దేవుడు జంతువును ప్రతీకగా ఉపయోగిస్తాడు. ప్రభుత్వాలను ప్రవచనములో వర్ణించే విధానమిది. ఇదే విధానమును మనము కూడా కొంత మేరకు ఉపయోగిస్తున్నాము : మనము రష్యాను ఎలుగుబంటిగా, అమెరికాను పక్షిరాజుగా చిత్రీకరించాము. "జంతువు" అనే చిహ్నం అవమానకరమైన, అగౌరవకరమైన పదం కాదు. గుర్తు అపార్ధమైనదో లేదా అగౌరవమైన పదము కాదు. ఇది "జంతువు" లేదా "జీవి" అను మాటకు పర్యాయపదంగా ఉంది. క్రీస్తు కూడా గొట్టెపిల్లగా బాప్తిస్మమిచ్చు యోహాను (యోహాను 1:29) మరియు అపొస్తలుడైన యోహాను చిత్రీకరించారు (ప్రకటన 5:6, 9, 12, 13). "జంతువు" అనే పదాన్ని దేశములు మరియు నాయకుల మంచి చెడులను గూర్చి మనకొక సందేశం ఇవ్వడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు.

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) ఏ నాలుగు ప్రపంచ రాజ్యములు దానియేలు 7వ అధ్యాయములో జంతువులతో పోల్చి చెప్పబడినవి? (4)

( ) స్వీడెన్.

( ) ఐగుప్తు.

( ) గ్రీకు.

( ) చైనా.

( ) మాదీయ-పారసీక.

( ) జపాన్.

( ) బబులోను.

( ) ఇరాక్.

( ) రోమా.

2) ఈ క్రింది నాలుగు వాక్యాలలో, దిగువ జాబితాలో ఇవ్వబడిన పదాలలో ఒకదాన్ని ఉపయోగించి ప్రతి ప్రవచనాత్మక చిహ్నం యొక్క ప్రత్యక్ష అర్థాన్ని పూరించండి :

వినాశనము    సంవత్సరము    దేశములు    ప్రజలు    వేగము

ఉదాహరణ : జంతువులు రాజ్యములను లేదా దేశములు ను సూచించును.

జలములు            ను సూచించును.

రెక్కలు               ను సూచించును.

గాలులు కలహము, కల్లోలము మరియు                ను సూచించును.

ఒక ప్రవచనాత్మక దినము అక్షరాలా ఒక                    తో సమానము.

3) ఘోరమును మరియు భయంకరమునగు నాలుగవ జంతువుకు ఉన్న 10 కొమ్ములు (1)

( ) 10 సంవత్సరములను సూచించును.

( ) పది ప్రత్యేక నగరములను సూచించును.

( ) దేవదూతలను సూచించును.

( ) ధన ఐశ్వర్యములను సూచించును.

( ) అన్యమత రోమా సామ్రాజ్యము చివరికి విడిపోయిన రాజ్యములు.

4) చిన్న కొమ్ము అధికారము చేత ఎన్ని తెగలు లేదా దేశములు పెరికి వేయబడినవి? (1)

( ) ఎనిమిది.

( ) ఒకటి.

( ) ఆరు.

( ) మూడు.

5) చిన్న కొమ్ము అధికారము, లేదా క్రీస్తువిరోధి, (2)

( ) బబులోను సైన్యాధిపతులలో ఒకనిని సూచించును.

( ) పురాతన అన్యమత రోమా దినములలో ఒక దుష్ట పాలకుడిని సూచించును.

( ) యేసు ప్రభువు రెండవ రాకడ తరువాత పుట్టుకొచ్చే ఒక దుష్ట శక్తిని సూచించును.

( ) నాస్తికత్వమును సూచించును.

( ) రోమన్ పోప్ వ్యవస్థ (పేపసి)ని సూచించును.

6) క్రింది జాబితా నుండి చిన్న కొమ్ము (క్రీస్తువిరోధి) అధికారము గురించి నిజమైన ప్రకటనలను గుర్తించండి : (3)

( ) ఇది ఐగుప్తు నుండి వచ్చెను.

( ) ఇది దేవుని ప్రజలను హింసించును.

( ) ఇది బబులోను పతనమైన వెంటనే లేచెను.

( ) ఇది దేవునికి విరోధముగా లేదా వ్యతిరేకముగా డంబపు మాటలు మాట్లాడును.

( ) ఇది దేవుని ధర్మశాస్త్రమును నివారణ (మార్పు) చేయ బూనుకొనును లేదా ప్రయత్నించును.

7) ప్రచవనములో, “ఒక కాలము, కాలములు, మరియు అర్ధకాలము” (1)

( ) అక్షరాలా మూడున్నర దినములకు గుర్తు.

( ) 42 సంవత్సరములకు గుర్తు.

( ) 1,260 సంవత్సరములకు గుర్తు.

8) “అంత్య కాలము” ఎప్పుడు ప్రారంభమైనది? (1)

( ) క్రీ.శ. 31.

( ) క్రీ.శ. 1991.

( ) క్రీ.శ. 588.

( ) క్రీ.శ. 1798.

9) క్రీస్తువిరోధి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ లేదా సంస్థ. (1)

( ) అవును.

( ) కాదు.

10) క్రీస్తువిరోధి నేడు ఉనికిలో ఉన్నాడు. (1)

( ) అవును.

( ) కాదు.

11) నిజ ఆరాధనను చట్టము ద్వారా బలవంతముగా అమలు చేయుటను దేవుడు ఆమోదించును. (1)

( ) అవును.

( ) కాదు.

12) బెరియర్స్ అనే జనరల్ (సైన్యాధిపతి) పోపును బందీగా పట్టుకొనుట పేపసీని మాత్రమే దెబ్బతీసినది. దాని చావుదెబ్బ మానిపోవుట ప్రారంభమై నేటికిని మానిపోయే క్రమములో కొనసాగుచున్నది? (1)

( ) అవును.

( ) కాదు.

13) ఈ అంత్య-కాల దినములలో దేవుని ప్రజల ఆధ్యాత్మిక భద్రత కొరకు ఈ క్రింది జాబితా నుండి ఏ అంశము అవసరమైయున్నది? (1)

( ) ప్రసంగించడం నేర్చుకోవడం.

( ) బహిరంగంగా విస్తరించి ప్రార్థన చేయడం.

( ) బైబిల్ ద్వారా ప్రతి మత బోధను పరీక్షించడం.

14) ఆయాసకరమైనది అయినప్పటికీ, యేసు నడిపించే మార్గమును అనుసరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?

( ) అవును.

( ) కాదు.